రిస్కీ యాక్షన్‌ మూడ్‌లో రఫ్ఫాడిస్తున్న స్టార్స్‌ | Mahesh Babu NTR Ram Charan latest movie news | Sakshi
Sakshi News home page

రిస్కీ యాక్షన్‌ మూడ్‌లో రఫ్ఫాడిస్తున్న స్టార్స్‌

Published Wed, Jul 12 2023 12:52 AM | Last Updated on Wed, Jul 12 2023 7:37 AM

Mahesh Babu NTR Ram Charan latest movie news  - Sakshi

మహేశ్‌బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల తాజా చిత్రాల సెట్స్‌లో ‘డిష్యుం.. .. డిష్యుం’ సౌండ్స్‌ ఎక్కువగా వినిపిస్తున్నాయి.  స్టార్స్‌ విలన్లను రఫ్ఫాడిస్తున్నారు... రిస్కీ ఫైట్‌ చేస్తున్నారు.  ఆ డిష్యుం.. డిష్యుం... విశేషాలు తెలుసుకుందాం.  

గుంటూరు కారం.. నాటు ఫైటు 
‘గుంటూరు కారం’ ఎంత ఘాటుగా ఉంటుందో ఆ రేంజ్‌లో నాటు ఫైటు చేస్తున్నారు మహేశ్‌బాబు. ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ‘గుంటూరు కారం’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తాజా షెడ్యూల్‌ ఇటీవల హైదరాబాద్‌లో ఆరంభమైంది. తొలుత మహేశ్‌బాబు పాల్గొనగా కాలేజీ సన్నివేశాల చిత్రీకరణ జరిగింది.

ప్రస్తుతం యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. నాటు ఫైట్స్‌తో విలన్ల తుక్కు రేగ్గొడుతున్నారు మహేశ్‌. మరి.. ఈ ఫైట్‌ను విజువల్‌గా ఎంజాయ్‌ చేయాలంటే సంక్రాంతి వరకూ ఎదురు చూడక తప్పదు. ఎందుకంటే ‘గుంటూరు కారం’ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల కానుంది. ఎస్‌. చినబాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీ లీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

యాక్షన్‌ దేవర 
‘దేవర’ షూటింగ్‌ ఎప్పట్నుంచి మొదలైందో అప్పట్నుంచే ఎన్టీఆర్‌ ఫుల్‌ యాక్షన్‌ మోడ్‌లోకి వెళ్లిపోయారు. ఇప్పటివరకు జరిగిన ఈ సినిమా ప్రతి షెడ్యూల్‌లోనూ ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరించడమే ఇందుకు ఓ నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ నెల మొదటివారంలో ‘దేవర’ తాజా షెడ్యూల్‌ ప్రారంభమైంది. ప్రస్తుతం ఎన్టీఆర్, మలయాళ నటుడు షైన్‌ టామ్‌ చాకోలపై ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారని టాలీవుడ్‌ టాక్‌.

ఫైట్‌ మాస్టర్‌ పీటర్‌ హెయిన్స్‌ ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ను డిజైన్‌ చేశారట. అంతేకాదు.. ఈ ఫైట్‌ పూర్తి కాగానే మరో ఫైట్‌ మాస్టర్‌ సాల్మోన్‌ డిజైన్‌ చేసిన యాక్షన్‌ సీక్వెన్స్‌లో ఎన్టీఆర్‌ పాల్గొంటారు. ఈ చిత్రంలో విలన్‌ రోల్‌ చేస్తున్న సైఫ్‌ అలీఖాన్‌ ఈ షెడ్యూల్‌లో జాయిన్‌ అయ్యే చాన్సెస్‌ ఉన్నాయి.

ఆల్రెడీ ఎన్టీఆర్‌ – సైఫ్‌ల మధ్య హాలీవుడ్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ కెన్నీ బేట్స్‌ ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ఇక ‘జనతా గ్యారేజ్‌’ (2016) చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో రూమహేశ్‌బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ దుతున్న ఈ ‘దేవర’లో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కల్యాణ్‌ రామ్, కె. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న విడుదల కానుంది.

గేమ్‌ ఛేంజర్‌ యాక్షన్‌ 
‘గేమ్‌ ఛేంజర్‌’గా ఫైట్‌ చేస్తున్నారు రామ్‌చరణ్‌. శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా రూమహేశ్‌బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ దుతున్న సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌’. ఈ చిత్రదర్శకుడు శంకర్‌ ‘ఇండియన్‌ 2’తో బిజీగా ఉండటం, హీరో రామ్‌చరణ్‌  హాలిడేస్‌ వంటి కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్‌కు కాస్త గ్యాప్‌ వచ్చింది.

తాజాగా ఈ వారంలో షూటింగ్‌ను తిరిగి ఆరంభించడానికి సన్నాహాలు చేస్తోంది యూనిట్‌. ఈ కొత్త షెడ్యూల్‌లో ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరించనున్నారని తెలిసింది. స్టంట్‌ మాస్టర్స్‌ అన్బు–అరివు ఈ ఫైట్‌ని డిజైన్‌ చేయనున్నారట. ఆల్రెడీ సినిమా క్లయిమాక్స్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ పూర్తయింది.

తాజా యాక్షన్‌ షెడ్యూల్‌ చిత్రీకరణతో ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమాకు సంబంధించిన యాక్షన్‌ పోర్షన్స్‌ పూర్తవుతాయనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ‘దిల్‌’ రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్న ఈ సినిమా 2024లో రిలీజ్‌  కానుంది. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement