
కొన్నింటి గురించి మనం కలలో కూడా ఊహించం. అలాంటివి రియాలిటీలో జరిగినప్పుడు ఇదెక్కడి దరిద్రం బాబోయే అని మనలో మనమే తిట్టుకుంటాం. ఇప్పుడేం జరిగిందని అనుకుంటున్నారా! ప్రముఖ దర్శకుడు రాజమౌళి జీవితంపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ తీసింది. 'మోడ్రన్ మాస్టర్స్' పేరిట ఆగస్టు 2 న దీన్ని రిలీజ్ చేయనుంది. తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: రెమ్యునరేషన్ తగ్గించుకున్న ప్రభాస్.. ఎందుకో తెలుసా?)
ఇక్కడివరకు బాగానే ఉంది. సోమవారం ఉదయం రిలీజ్ చేసిన ట్రైలర్‌కి పర్లేదనిపించే రెస్పాన్స్ వచ్చింది. రాజమౌళి జీవితంలోని ఎవరికీ తెలియని విషయాల్ని ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, జేమ్స్ కామెరూన్ లాంటి సెలబ్రిటీలు షేర్ చేసుకోవడం బాగానే ఉంది. అయితే మెయిన్ ట్రైలర్ రిలీజ్ చేసిన కాసేపటి తర్వాత ప్రాంతీయ భాషల ట్రైలర్స్ కూడా రిలీజ్ చేశారు.
తెలుగు ట్రైలర్ విషయానికొచ్చేసరికి ప్రధాన పాత్రధారి రాజమౌళి సహా డాక్యుమెంటరీలో కనిపించిన ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు వేరే వాళ్లు ఎవరో డబ్బింగ్ చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. దీనిపై విమర్శలు వస్తున్నాయి. ఇన్నికోట్లు ఖర్చు పెట్టి తీశారు. ఇంకాస్త ఎఫర్ట్ పెట్టి, తెలుగు వరకైనా సరే హీరోలతో డబ్బింగ్ చెప్పించి ఉంటే సరిపోయేది! పైపెచ్చు ఈ ట్రైలర్ చూస్తుంటే డిస్కవరీ ఛానెల్‌లోని డబ్బింగ్‌లా అనిపించింది.
(ఇదీ చదవండి: 'ఆర్ఆర్ఆర్' రికార్డ్ కూడా బ్రేక్ చేసిన 'కల్కి')
Comments
Please login to add a commentAdd a comment