![RRR Director Rajamouli Documentary Trailer And OTT Details](/styles/webp/s3/article_images/2024/07/22/rajamouli-documentary_0.jpg.webp?itok=Qp3J2CXc)
ప్రముఖ దర్శకుడు రాజమౌళి.. జీవిత విశేషాలతో డాక్యుమెంటరీ తీశారు. దీన్ని 'మోడ్రన్ మాస్టర్స్' పేరుతో ఆగస్టు 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయనున్నారు. కొన్నిరోజుల క్రితం ఈ విషయాన్ని ప్రకటించారు. ఇప్పుడు డాక్యుమెంటరీ ఎలా ఉండబోతుందో చెప్పే ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్‌తోపాటు ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పడం విశేషం.
(ఇదీ చదవండి: ఓటీటీలో భారతీయుడు 2.. అంచనాలు తప్పడంతో మార్పులు)
ఇది డాక్యుమెంటరీ కాబట్టి సినిమా స్టైల్లో ఉండదు. రాజమౌళి కెరీర్ ఎలా ఎప్పుడు ప్రారంభమైందనేది విజువల్స్ రూపంలో చూపిస్తారు. అలానే జక్కన్నతో పనిచేసిన అనుభవాన్ని ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్ చెప్పడం ఆసక్తికరంగా అనిపిస్తోంది. అయితే ఇది డాక్యుమెంటరీ కాబట్టి అందరికీ నచ్చకపోవచ్చు. రాజమౌళి లైఫ్ స్టోరీ తెలుసుకోవాలనుకుంటే మాత్రం దీన్ని చూడండి.
(ఇదీ చదవండి: ఉపాసనపై టాలీవుడ్ కమెడియన్ ప్రశంసలు.. ఎందుకంటే?)
Comments
Please login to add a commentAdd a comment