
సాక్షి, హైదరాబాద్: సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా అంటే రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. శ్రీమంతుడు సినిమా నాన్ బాహుబలి రికార్డులను సాధిస్తే... తరువాత రిలీజైన రెండు సినిమాలు ఆశించినంతగా విజయం సాధించలేదు. అయితే ఈసారి ఎలాగైనా సరే హిట్ కొట్టాలనే కసితో మళ్లీ కొరటాల శివతో కలిసి భరత్ అనే నేను సినిమాను చేశారు. ఈ సినిమా విడుదలైన తొలిరోజు నుంచే రికార్డుల వేటను కొనసాగించింది.
తొలిరోజే రూ. 40 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టిందని నిర్మాత ప్రకటించారు. మొదటి వారంలో రూ.161 కోట్లు, రెండు వారాలకు రూ. 190 కోట్ల గ్రాస్ వసూళ్లు దక్కించుకున్నట్టు వెల్లడించారు. ఇప్పుడు ఈ చిత్రం మరో మైలురాయిని చేరుకుంది. మూడు వారాల్లో రూ.205 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో దూసుకుపోతోందని చిత్ర యూనిట్ ప్రకటించింది.
మహేశ్ ప్రస్తుతం ఈ సక్సెస్‌ను ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. మహేశ్ తన తదుపరి (25వ) చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయబోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment