మహేశ్‌తో అక్షయ్‌కుమార్ ఢీ? | Akshay Kumar and Mahesh Babu teaming up for an upcoming movie? | Sakshi
Sakshi News home page

మహేశ్‌తో అక్షయ్‌కుమార్ ఢీ?

Published Sun, Jun 5 2016 2:31 AM | Last Updated on Mon, Sep 4 2017 1:40 AM

మహేశ్‌తో అక్షయ్‌కుమార్ ఢీ?

మహేశ్‌తో అక్షయ్‌కుమార్ ఢీ?

రజనీకి విలన్‌గా ‘2.0’లో ఓ భయంకరమైన విలన్ పాత్రలో అక్షయ్‌కుమార్ లుక్ చాలా కాలం క్రితం వరకూ నెట్టింట్లో హల్‌చల్ చేసింది. సౌత్‌లోకి ‘రోబో’ సీక్వెల్‌లాంటి ఓ భారీ ప్రాజెక్ట్‌తో ఎంట్రీ ఇస్తున్న అక్షయ్‌కుమార్ మరో క్రేజీ మూవీలో నటించనున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. మహేశ్‌బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో అక్షయ్‌కుమార్ విలన్‌గా నటిస్తారని సమాచారం.

ఆ మధ్య ఈ చిత్రంలో విలన్‌గా తమిళ దర్శకుడు ఎస్.జె.సూర్యను అనుకున్నారట. కానీ, అనుకోని కారణాలతో ఆయన తప్పుకున్నారని బోగట్టా. మురుగదాస్‌కు అక్షయ్‌కుమార్‌తో మంచి అనుబంధమే ఉంది. అక్షయ్‌కుమార్ హీరోగా తమిళ చిత్రం ‘తుపాకీ’ని మురుగదాస్ హిందీలో రీమేక్ కూడా చేశారు. ఇప్పుడు మహేశ్‌కు విలన్‌గా అక్షయ్‌కుమార్ అయితే బాగుంటుందని ఆయన భావిస్తున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement