Villain Role
-
విలన్ గా మారుతున్న కింగ్ నాగార్జున
-
ఆలియాకు విలన్‌గా...?
ఆలియా భట్, షార్వరి లీడ్ రోల్స్‌లో ఓ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా తెరకెక్కనుందనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. యశ్ రాజు ఫిలింస్ స్పై యూనివర్స్‌లో భాగంగా రానున్న ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్‌గా నటించనున్నారని బాలీవుడ్ సమాచారం. ఈ ఏడాది చివర్లోనే ఈ సినిమా చిత్రీకరణప్రారంభం కానుందట. శివ్ రావైల్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, ఆదిత్యా చోప్రా ఈ సినిమాను నిర్మించనున్నారు. గతంలో ‘రాజీ’ సినిమాలో స్పై పాత్రలో నటించిన ఆలియా భట్ మళ్లీ ఈ సినిమాలో ఆ తరహా పాత్రను ఓకే చేయడం విశేషం. ఇక ‘యానిమల్’లో విలన్ రోల్లో బాబీ డియోల్ విజృంభించిన విషయం తెలిసిందే. మరి.. యశ్ రాజ్ ఫిలింస్ తాజా చిత్రంలో విలన్‌గా సై అంటే... మరోసారి బాబీ నెగటివ్ పెర్ఫార్మెన్స్ని చూసే వీలు దక్కుతుంది. -
నటిని పెళ్లాడిన టైగర్ నాగేశ్వరరావు విలన్.. వీడియో వైరల్!
ప్రస్తుతం ఎక్కడా చూసినా పెళ్లిళ్ల సందడే కనిపిస్తోంది. సమ్మర్ సీజన్ మొదలు కానున్న నేపథ్యంలో వచ్చే మూడు నెలలు పెళ్లిళ్లు జరగనున్నాయి. సినీ ఇండస్ట్రీలోనూ పెళ్లి కళ మొదలైంది. తాజాగా మరో నటుడు ఓ ఇంటివాడయ్యారు. ప్రముఖ మలయాళ నటుడు సుదేవ్ నాయర్ వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియురాలు, నటి అమర్దీప్ కౌర్‌ను పెళ్లాడారు. గత కొంత కాలంగా డేటింగ్లో ఉన్న వీరిద్దరు.. తాజాగా కేరళ సంప్రదాయం ప్రకారం ఈ జంట ఏడడుగులు వేశారు. వీరి పెళ్లికి బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లి అనంతరం స్థానిక గురువాయూర్ ఆలయంలో ఈ జంట పూజలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు నూతన దంపతులకు అభినందనలు చెబుతున్నారు. కాగా..సుదేవ్ నాయర్ 2014లో గులాబ్ గ్యాంగ్ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాతా దక్షిణాదిలో దాదాపు 30కి పైగా సినిమాల్లో నటించారు. తెలుగులో రవితేజ టైగర్ నాగేశ్వరరావు, నితన్ ఎక్స్‌ట్రార్డీనరీ మ్యాన్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. View this post on Instagram A post shared by Neelakkuyil Entertainments (@neelakkuyil_entertainments) -
RRR నటుడు రే స్టీవెన్సన్ హఠాన్మరణం
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ట్రిపుల్ ఆర్ చిత్రంలో నటించిన విదేశీ నటుడు రే స్టీవెన్సన్(58) హఠాన్మరణం చెందారు. RRRలో ఆయన బ్రిటిష్ గవర్నర్ స్కాట్ బక్స్టన్ రోల్లో మెయిన్ విలన్ క్యారెక్టర్లో అలరించారు. కరడుగట్టిన ‘స్కాట్ దొర’ పాత్రగా అది ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. ఇటలీలో తన కొత్త చిత్రం ‘క్యాసినో’ షూటింగ్లో పాల్గొంటున్న ఆయన.. ఆదివారమే మరణించినట్లు తెలుస్తోంది. అయితే ఆయన మృతికి గల కారణాలు తెలియరాలేదు. బ్రిటిష్ నటుడైన రే స్టీవెన్సన్ పూర్తి పేరు జార్జ్ రేమండ్ స్టీవెన్సన్. పలు చిత్రాలతో పాటు టెలివిజన్ సిరీస్‌ల్లోనూ ఆయన నటించారు. 1964 మే 25వ తేదీన నార్త్ ఐర్లాండ్‌లోని లిస్బర్న్లో స్టీవెన్సన్ జన్మించారు. ఆయన తండ్రి రాయల్ ఎయిర్‌ఫోర్స్ పైలట్. తన 29వ ఏట బ్రిస్టల్ ఓల్డ్ విక్ థియేటర్ స్కూల్లో యాక్టింగ్ కోర్స్ పూర్తి చేశాడు రే స్టీవెన్సన్. స్టేజ్ ఆర్టిస్ట్‌గా మొదలైన స్టీవెన్సన్ యాక్టింగ్ కెరీర్.. క్రమంగా సినిమాల వైపు మళ్లింది. ది థియరీ ఫ్లైట్(1998) చిత్రంతో ఆయన సిల్వర్ స్క్రీన్ యాక్టింక్ కెరీర్ ప్రారంభమైంది. కింగ్ ఆర్థర్(2004)లో డాగోనెట్ రోల్లో ఆయన నటనకు మంచి గుర్తింపు, ప్రశంసలు దక్కాయి. హెచ్‌బీవో రోమ్ టీవీ సిరీస్‌లో టైటస్ పులోగా ఆయన అలరించారు. థోర్, స్టార్‌వార్స్ లాంటి హిట్ చిత్రాల్లోనూ ఆయన నటించారు. సరిగ్గా ఇరవై ఏళ్ల పాటు స్టేజ్ నాటకాలతో, చిత్రాలతో, వెబ్ సిరీస్‌లతో అలరించారాయన. స్టీవెన్సన్ బ్రిటిష్ నటి రుత్ గెమ్మెల్‌ను వివాహం చేసుకున్నారు. బాండ్ ఆఫ్ గోల్డ్ చిత్రంలో వీళ్ల పరిచయం కాస్త ప్రేమగా మారింది. 1997లో వీళ్ల వివాహం జరిగింది. అదే ఏడాది పీక్ ప్రాక్టీస్ అనే చిత్రంలోనూ వీళ్లు కలిసి నటించారు. అయితే ఎనిమిదేళ్ల తర్వాత వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకుంది ఈ జంట. వీళ్లకు ముగ్గురు సంతానం. స్టీవెన్సన్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్రిపుల్ ఆర్ చిత్రయూనిట్ సంతాపం వ్యక్తం చేసింది. ‘సర్ స్కాట్.. మీరెప్పుడూ మా గుండెల్లో నిలిచి ఉంటార’ని ట్వీట్లో పేర్కొంది. What shocking news for all of us on the team! 💔 Rest in peace, Ray Stevenson. You will stay in our hearts forever, SIR SCOTT. pic.twitter.com/YRlB6iYLFi — RRR Movie (@RRRMovie) May 22, 2023 Ray Stevenson, who portrayed Volstagg in the #Thor trilogy, has passed away at the age of 58 years old: https://t.co/JcV4RIWIUj pic.twitter.com/vEpJu45LpK — MCU - The Direct (@MCU_Direct) May 22, 2023 -
అక్కడ హీరోని, తెలుగులో విలన్‌గా చేస్తున్నా
‘‘హీరో, విలన్, కామెడీ.. ఎలాంటి పాత్రైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. విభిన్న పాత్రలు పోషిస్తూ మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలన్నదే నా ఆశ’’ అన్నారు గోవింద్ పద్మసూర్య. మలయాళ చిత్రం ‘అడియాలంగళ్’లో హీరోగా నటించిన గోవింద్ తెలుగులో అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురములో..’, ఇటీవల నాగార్జున ‘బంగార్రాజు’లో విలన్ పాత్రలు చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం విలేకర్ల సమావేశంలో గోవింద్ మాట్లాడుతూ – ‘‘మాది కేరళ. హీరోగా నా తొలి సినిమా ‘అడియాలంగళ్’కే బెస్ట్ యాక్టర్‌తో పాటు ఐదు స్టేట్ అవార్డ్స్ వచ్చాయి. ఆ తర్వాత మమ్ముట్టి, సురేష్ గోపీగార్లతో కూడా కలిసి నటించాను. తమిళంలో ‘కీ’ సినిమాలో నేను చేసిన విలన్ పాత్ర చూసి ‘అల.. వైకుంఠపురములో..’కి నన్ను త్రివిక్రమ్‌గారు తీసుకున్నారు. ‘బంగార్రాజు’లో ఆది పాత్ర పోషించాను. నాగార్జునగారి వంటి గొప్ప నటుడితో నటించడం అంటే ఓ పాఠం వంటిది. నాగచైతన్య నాకు మంచి మిత్రుడైపోయాడు. ఈ చిత్రదర్శకుడు కల్యాణ్ కృష్ణగారి వల్లే ఆది పాత్రను బాగా చేయగలిగాను. ప్రస్తుతం హీరో నాని సోదరి దీప్తి దర్శకత్వం వహిస్తున్న వెబ్ ఆంథాలజీ ‘మీట్‌క్యూట్’లో ఓ కీలక పాత్ర, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంలో పోలీసాఫీసర్‌గా చేస్తున్నాను’’ అన్నారు. -
‘ఏదో సామెత చెప్పినట్టు.. డిక్కీలో పడుకోబెట్టేస్తాను’
‘వేటగాడు’లో దివాన్జీ అయిన రావు గోపాలరావుకు విలువైన హారం కావాలి. దానిని మెడలో వేసుకొని మారువేషంలో ఎన్.టి.ఆర్ వస్తాడు. ‘మా గురువు కల్లు కొండయ్య గారు’ అని నగేష్ ఎన్.టి.ఆర్ గురించి బిల్డప్ ఇస్తాడు. ఎన్.టి.ఆర్ ఊరికే ఉంటాడా? ‘ఏరా కుయ్యా’ అని రావు గోపాలరావును తిడతాడు. తిడితే పర్వాలేదు. ‘ఏవన్నాను’ అని ఆయన్నే రిపీట్ చేయమంటాడు. అప్పుడు రావుగోపాలరావు ‘ఏదో కుయ్యా అని చిన్న సౌండ్ ఇచ్చారండీ’ అంటాడు. ప్రేక్షకులు ఎంత నవ్వుతారో. ఆ సినిమాలోనే రావు గోపాలరావు ప్రాసతో ప్రాణాలు తీస్తుంటాడు. కొడుకైన సత్యనారాయణ విసిగిపోయి గుక్క తిప్పుకోకుండా ఎంత ప్రాస మాట్లాడతావో మాట్లాడు చూస్తాను అంటాడు. దానికి రావు గోపాలరావు చెప్పే డైలాగ్– ‘ఈస్టు స్టువర్టుపురం స్టేషనుమాస్టరు గారి ఫస్టు సన్ వెస్ట్‌కెళ్లి తనకిష్టమైన అతి కష్టమైన బారిష్టరు టెస్టులో ఫస్టు క్లాసులో బెస్టుగా పాసయ్యాడని తన నెక్స్ట్ ఇంటాయాన్ని ఫీస్టుకని గెస్టుగా పిలిస్తే ఆయన టేస్టీగా ఉన్న చికెను రోస్టుతో బెస్టు బెస్టు అంటూ తినేసి హోస్టుకు కూడా మిగల్చకుండా ఒక్కముక్క కూడా వేస్టు చేయకుండా సుష్ఠుగా భోంచేసి పేస్టు పెట్టి పళ్లు తోముకుని మరీ రెస్టు తీసుకున్నాడట ఏ రొస్టు లేకుండా. చాలా, ఇంకా వదలమంటావా భాషా బరాటాలు మాటల తూటాలు యతిప్రాసల పరోటాలు..... ’ ఇంకెక్కడి సత్యనారాయణ. పాయే. రావు గోపాలరావు విలన్‌గా తెలుసు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుసు. కాని కామెడీని పండించే నటుడుగా వచ్చిన అవకాశాలను వదలుకోలేదటాయన. ‘ముత్యాల ముగ్గు’లో అంత సీరియస్ విలనే అయినా ‘డిక్కీలో పడుకోబెట్టేస్తానని’ ప్రేక్షకులు భయంభయంగానే అయినా నవ్వేలా చేశాడు. చిరంజీవి ‘మగ మహారాజు’లో రావు గోపాలరావు ఎప్పుడూ ఒక మరుగుజ్జు పిల్లాడిని చంకనేసుకొని దింపినప్పుడల్లా వాడు ఏడుస్తుంటే హైరానాపడుతూ తెగ నవ్విస్తాడు. ‘మా ఊళ్లో మహాశివుడు’ రావు గోపాలరావు ప్రతిభకు మచ్చుతునక. అందులో ఆయన శివుడుగా భూమ్మీదకు వచ్చి పూజారి అయిన సత్యనారాయణతో పాలిటిక్స్, కరప్షన్, ప్రత్యేకరాష్ట్ర ఉద్యమాల గురించి మాట్లాడుతూ నవ్విస్తాడు. శోభన్‌బాబు ‘దేవత’ సినిమాలో రావు గోపాలరావు జయప్రదకు వరుసకు బాబాయ్. కాని జయప్రదకు చెల్లెలు శ్రీదేవి పెళ్లి కానిదే తాను చేసుకోకూడదని ఉంటుంది. ఆ సంగతి తెలిసినా రావు గోపాలరావు శ్రీదేవితో జయప్రద పెళ్లి గురించి మాట్లాడుతుంటే సడన్‌గా జయప్రద వస్తుంది. ఆ సమయంలో కప్పిపుచ్చుకోవడానికి రావు గోపాలరావు చేసే కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. రావు గోపాలరావుతో జంధ్యాల ‘రావు గోపాలరావు’ సినిమా తీశాడు. అందులో ఆయనకు మతిమరుపు ప్రొఫెసర్ వేషం ఇచ్చాడు. కోడి రామకృష్ణ ‘తోడు దొంగలు’ సినిమాలో పూర్తి స్థాయి కామెడీ వేషం చేయించాడు. అందులో లాంచి గైడుగా రావు గోపాలరావు చాలా సందడి చేస్తాడు. ఇక రాజేంద్ర ప్రసాద్‌తో నటించిన ‘ఆఒక్కటీ అడక్కు’లో రొయ్యల నాయుడుగా కామెడీ పండిస్తాడాయన. చివరి రోజులలో ఆయన నాగార్జున ‘అల్లరి అల్లుడు’లో వాణిశ్రీ భర్తగా నటించారు. ‘ఏదో సామెత చెప్పినట్టు’ అనేది ఆయన ఊతపదం. ఆయన చెప్పే సామెతలు అసలు సామెతలేనా అని సందేహం వస్తుంటుంది. ‘ఇదెలా ఉందంటే చీర కట్టుకోవే చిలకమ్మా గుడికెళదాం అని గుండూరావంటే తొక్కతో సహా ఎప్పుడో తినేశాను అనందంట అనసూయమ్మ. అలా ఉంది వ్యవహారం’... ఇది ఆయన చెప్పే సామెత. 57 ఏళ్ల చిన్న వయసులోనే రావు గోపాల రావు మరణించారు. కాని ఆయన ఇదిగో ఇలాంటి పాత్రలతో ప్రేక్షకుల ముఖాలపై మందస్మితమై వెలుగుతుంటారు. -
కేజీఎఫ్ ‘గరుడ’ ఎవరో తెలుసా..?!
కేజీఎఫ్ చిత్రం కన్నడ పరిశ్రమతో పాటు.. భారతీయ సినీ చరిత్రలో పలు రికార్డులు నెలకొల్పింది. ఈ సినిమాతో రాకీ భాయ్ యశ్ దేశవ్యాప్తంగా గుర్తింపుతో పాటు, అభిమానులను సంపాదించుకున్నారు. యశ్‌తో పాటు ఈ చిత్రంలో నటించిన అందరికి మంచి గుర్తింపు లభించింది. ఇక సినిమాలో విలన్ ఎంత బలవంతుడైతే హీరోకి అంత ఎక్కువ గుర్తింపు దక్కుతుందనే విషయం ఈ సినిమాతో మరో సారి రుజువయ్యింది. రాకీ పాత్రకు ధీటుగా మెయిన్ విలన్ ‘గరుడ’ పాత్ర కూడా అంతే బాగా ఫేమస్ అయ్యింది. ఇక చిత్రంలో ‘గరుడ’ పాత్ర పోషించిన వ్యక్తికి సంబంధించి ఆసిక్తకర విషయం ఒకటి ప్రస్తుతం ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతుంది. కేజీఎఫ్ 1లో ‘గరుడ’ పాత్ర పోషించిన వ్యక్తి పేరు రామ్. వాస్తవానికి అతడు నటుడు కాదు. యశ్‌కు బాడీగార్డ్.. ఎంతో కాలం నుంచి సన్నిహితుడు. ఇక వీరిద్దరూ ఏదైనా చిత్రంలో కలిసి నటించాలని భావించారట. కేజీఎఫ్‌తో ఇద్దరి కల ఒకేసారి నెరవేరింది. (చదవండి: ప్రకాశ్ రాజ్ ఆ పాత్ర చేయడం లేదు!) ఇక ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ కథ గురించి యశ్‌తో చర్చిండానికి వెళ్లినప్పుడు అక్కడ రామ్‌ని చూశారు. ‘గరుడ’ పాత్రకు సరిపోతాడని భావించి.. ఆడిషన్స్‌కి రావాల్సిందిగా కోరారు. సెలక్ట్ కావడంతో గరుడ పాత్రకు తగ్గట్టు మారడం కోసం ఇక రామ్ జిమ్‌లో కసరత్తులు ప్రారంభించాడట. అతడి డెడికేషన్‌కి ముచ్చటపడిన ప్రశాంత్ ‘గరుడ’ పాత్రకి రామ్‌నే ఫైనల్ చేశారు. ఇక ఓ ఇంటర్వ్యూలో రామ్ మాట్లాడుతూ.. ‘కేజీఎఫ్ 1లో నేను కూడా నటించానని గుర్తుకు వస్తే ఎంతో థ్రిల్లవుతాను. ఈ సినిమాకి నేను సెలక్ట్ అవుతానని కానీ.. ఇంత మంచి పాత్ర చేస్తానని కానీ కల్లో కూడా ఊహించలేదు. సినిమా విడుదలయ్యాకే నా పాత్ర ఎంత కీలకమైందో తెలిసింది’ అన్నారు. ఇక కేజీఎఫ్ సక్సెస్‌తో రామ్ ప్రస్తుతం బిజీ ఆర్టిస్ట్ అయ్యారు. ప్రస్తుతం దక్షిణాదిలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఆయన కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీటిలో కార్తి సుల్తాన్ సినిమా ప్రధానమైంది. అలానే ఓ తెలుగు సినిమాలో కూడా నటిస్తున్నట్లు సమాచారం. (థాంక్యూ డియర్ హజ్బెండ్: రాధిక) ఇక 2018లో విడుదలైన కేజీఎఫ్ కన్నడ చిత్ర పరిశ్రమలో రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించింది. ఏకంగా 250 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక హిందీలో డబ్ అయిన కన్నడ చిత్రాల్లో అత్యధిక వసూల్లు సాధించిన చిత్రంగానే కాక పాకిస్తాన్లో విడుదలైన తొలి కన్నడ చిత్రంగా కూడా రికార్డు క్రియేట్ చేసింది. ఇక ప్రస్తుతం కేజీఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ జరుగుతుంది. ఇక రెండవ భాగంలో సంజయ్ దత్, ప్రకాశ్ రాజ్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో నటిస్తుండటంతో కేజీఎఫ్ చాప్టర్ 2పై భారీ అంచనాలే ఉన్నాయి. జనవరి 8న కేజీఎఫ్2 టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే వెల్లడించింది. -
విలన్‌గా మారిన దర్శక నిర్మాత
సినీరంగంలో ఒక శాఖలో పేరు తెచ్చుకున్న వ్యక్తి మరో శాఖలో ప్రవేశించడం సులభమే. అయితే అన్ని శాఖల్లోనూ రాణించడం అంత సులభం కాదు. అలాంటిది పదమ్ కుమార్ మాత్రం ఇందుకు అతీతం అనే చెప్పాలి. ఈయన ప్రముఖ ఛాయాగ్రాహకుడు. అంతేకాకుండా భారతీయ సినీ దర్శకుడు, నిర్మాత కూడా. అంతకుమించి పదమ్ కుమార్ తండ్రి హెచ్ఎస్.వేణు దివంగత ప్రఖ్యాత దర్శకుడు విఠలాచార్య దర్శకత్వం వహించిన తెలుగు చిత్రాలకు ఛాయాగ్రహణ అందించారు. కాగా పదమ్ కుమార్ కూడా హిందీ, తెలుగు, కన్నడ చిత్రాలకు చాయాగ్రాహకుడిగా పనిచేశారు. బాలీవుడ్ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ యష్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన దక్షిణాది చిత్రాలకు ఈయన నిర్మాణ నిర్వహణ బాధ్యతలను నిర్వహించారు. అలా 2014లో నాని, వాణీకపూర్ జంటగా నటించిన తెలుగు చిత్రం ఆహా కళ్యాణం పదం కుమార్ నిర్మాణ సారథ్యంలోనే రూపొందింది. అదేవిధంగా తమిళ్లో శింబు, వరలక్ష్మి జంటగా నటించిన పోడాపోడీ చిత్రాన్ని నిర్మించి నయనతార ప్రియుడు విఘ్నేష్ శివన్‌ను దర్శకుడిగా పరిచయం చేసింది ఈయనే. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్‌ని మొదటిసారిగా సినిమాకు పరిచయం చేసిన నిర్మాత కూడా పదమ్ కుమార్‌నే. ఈయన కథా రచయిత కూడా. అన్ని శాఖల్లో ప్రావీణ్యం కలిగిన పదమ్ కుమార్ తాజాగా నటుడి అవతారమెత్తారు. ఇటీవల ఓటీటీలో వడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందుతున్న పావ కథైగళ్ సిరీస్‌లో నిలవ్ పన్న ఉట్రనుమ్ సెగ్మెంట్లో విలన్ పాత్రల్లో నటించి అందరి ప్రశంసలను అందుకున్నారు. విశేషమేంటంటే తాను దర్శకుడిగా పరిచయం చేసిన విఘ్నేష్ శివన్నే పదమ్ కుమార్‌ను ఈ సిరీస్ ద్వారా నటుడిగా పరిచయం చేశారు. -
రావణుడు
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న చిత్రం ‘ఆది పురుష్’. ‘తానాజీ’ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ నిర్మించనున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నారు. మరి రాముడికి ప్రతినాయకుడు అంటే రావణుడే కదా. ఆ పాత్రను సైఫ్ అలీఖాన్ చేయనున్నారు. ఓం రౌత్ మాట్లాడుతూ– ‘‘7000 ఏళ్ల కిందట ఉన్న ఓ తెలివైన రాక్షసుని స్వభావాన్ని ప్రేరణగా తీసుకుని సైఫ్ క్యారెక్టర్ తీర్చిదిద్దుతున్నాను. ఈ చిత్రంలో ప్రభాస్, సైఫ్ మధ్య కత్తి యుద్ధాలు, పోరాటలు అత్యద్భుతంగా ఉంటాయి’’ అన్నారు. ‘‘ప్రభాస్‌కి దీటైన విలన్ దొరకడం చాలా ఆనందంగా ఉంది. ఈ పాత్రకు సైఫ్ పర్ఫెక్ట్గా సరిపోతారని నా నమ్మకం. ఈ ఎపిక్ డ్రామాను భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నాం’’ అన్నారు భూషణ్ కుమార్. -
లూసిఫర్‌కి విలన్?
హీరో నుంచి విలన్ ట్రాక్‌లోకి వచ్చిన తర్వాత జగపతిబాబు కాల్షీట్ డైరీ ఫుల్‌గా ఉంటోంది. ‘లెజెండ్’, ‘రంగస్థలం’ వంటి చిత్రాల్లో విలన్‌గా జగపతిబాబు నటన అదుర్స్. తాజాగా ఆయన మరో సినిమాలో విలన్‌గా నటించబోతున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. చిరంజీవి హీరోగా సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందనే ప్రచారం జరగుతున్న సంగతి తెలిసిందే. మలయాళ హిట్ ‘లూసిఫర్’కు ఇది రీమేక్. ఇందులోని ఓ కీలక పాత్రకు జగపతిబాబును సంప్రదించారట చిత్రబృందం. అది విలన్ రోల్ అని తెలిసింది. ఇదే చిత్రంలో నటి ఖుష్బూ కూడా ఓ కీలక పాత్ర పోషించనున్నారని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. -
బాక్సర్‌కు విలన్?
వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు వెంకటేశ్, సిద్ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో బాక్సర్‌గా నటిస్తున్నారు వరుణ్‌తేజ్. ఇందుకోసం విదేశాల్లో వరుణ్ ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర విలన్ పాత్ర చేయబోతున్నారన్నది ఫిల్మ్‌నగర్ లేటెస్ట్ టాక్. అయితే ‘సన్నాఫ్ సత్యమూర్తి’ (2015) సినిమా తర్వాత మరో స్ట్రయిట్ తెలుగు చిత్రంలో ఉపేంద్ర క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయలేదు. మరి.. బాక్సర్‌కు విలన్‌గా మారతారా? వెయిట్ అండ్ సీ. మరోవైపు మహేశ్‌బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో ఉపేంద్ర ఓ కీలక పాత్ర చేయబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. -
మహేశ్‌తో అక్షయ్‌కుమార్ ఢీ?
రజనీకి విలన్‌గా ‘2.0’లో ఓ భయంకరమైన విలన్ పాత్రలో అక్షయ్‌కుమార్ లుక్ చాలా కాలం క్రితం వరకూ నెట్టింట్లో హల్చల్ చేసింది. సౌత్‌లోకి ‘రోబో’ సీక్వెల్లాంటి ఓ భారీ ప్రాజెక్ట్‌తో ఎంట్రీ ఇస్తున్న అక్షయ్‌కుమార్ మరో క్రేజీ మూవీలో నటించనున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. మహేశ్‌బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో అక్షయ్‌కుమార్ విలన్‌గా నటిస్తారని సమాచారం. ఆ మధ్య ఈ చిత్రంలో విలన్‌గా తమిళ దర్శకుడు ఎస్.జె.సూర్యను అనుకున్నారట. కానీ, అనుకోని కారణాలతో ఆయన తప్పుకున్నారని బోగట్టా. మురుగదాస్‌కు అక్షయ్‌కుమార్‌తో మంచి అనుబంధమే ఉంది. అక్షయ్‌కుమార్ హీరోగా తమిళ చిత్రం ‘తుపాకీ’ని మురుగదాస్ హిందీలో రీమేక్ కూడా చేశారు. ఇప్పుడు మహేశ్‌కు విలన్‌గా అక్షయ్‌కుమార్ అయితే బాగుంటుందని ఆయన భావిస్తున్నారట.