ఉపేంద్ర
వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు వెంకటేశ్, సిద్ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో బాక్సర్‌గా నటిస్తున్నారు వరుణ్‌తేజ్. ఇందుకోసం విదేశాల్లో వరుణ్ ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర విలన్ పాత్ర చేయబోతున్నారన్నది ఫిల్మ్‌నగర్ లేటెస్ట్ టాక్. అయితే ‘సన్నాఫ్ సత్యమూర్తి’ (2015) సినిమా తర్వాత మరో స్ట్రయిట్ తెలుగు చిత్రంలో ఉపేంద్ర క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయలేదు. మరి.. బాక్సర్‌కు విలన్‌గా మారతారా? వెయిట్ అండ్ సీ. మరోవైపు మహేశ్‌బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో ఉపేంద్ర ఓ కీలక పాత్ర చేయబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment