boxer role
-
ఆయన్ను చూసి బాక్సర్ అవ్వాలనుకున్నాను.. 'గని'తో ఆశ తీరింది
మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'గని'. వరుణ్ తేజ్‌కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ నటించింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీకి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో సిద్దు, అల్లు బాబీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలకు అభిమానులు, సినీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా ఏప్రిల్ 8న విడుదల కానుంది. ఈ చిత్రంలో కీలక పాత్ర చేసిన నవీన్ చంద్ర చెప్పిన విశేషాలు. చదవండి: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కోసం ఐకాన్ స్టార్.. మా మామయ్యగారు టి. శివకుమార్ బాక్సర్. ఆయన్ను చూసి, నేను బాక్సర్ అవ్వాలనుకున్నాను. కానీ యాక్టర్ అయ్యాను. ‘గని’లో ఆది అనే బాక్సర్ పాత్ర పోషించడంతో నేను బాక్సర్ కావాలన్న ఆశ తీరినట్లయింది. ఆది క్యారెక్టర్ నెగటివ్ షేడ్స్‌తో ఉంటుంది. లాక్డౌన్స్ వల్ల ‘గని’ షూటింగ్‌కు కాస్త ఇబ్బందులు కలిగాయి. దీంతో బాక్సర్‌గా చాలా రోజులు ఫిట్‌గానే ఉండటం చాలెంజింగ్‌గా అనిపించింది. అలాగే నిజమైన బాక్సర్స్‌లా కనిపించాలని జాతీయ స్థాయి బాక్సర్స్‌తో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. ప్రతి రోజూ పరీక్షలే! .. వరుణ్ అమేజింగ్ యాక్టర్. సెట్స్‌లో దెబ్బలు తగలకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. అలానే కరోనా నిబంధనలు పాటిస్తూ, షూటింగ్ చేసినప్పుడు సిద్ధు, అల్లు బాబీగార్లు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతిరోజూ యూనిట్లో అందరికీ కరోనా పరీక్షలు చేయించేవారు. అరవింద..తో నటుడిగా మెరుగయ్యాను.. ‘అరవింద సమేత వీర రాఘవ’ యాక్టర్‌గా నన్ను మెరుగుపరిచింది. ‘గని’ చిత్రంలోని ఆది క్యారెక్టర్ మరో ఎక్స్పీరియన్స్. డేట్స్ కుదరకపోవడం వల్ల తమిళ హిట్ మూవీ ‘సారపట్ట పరంపర’లో అవకాశాన్ని కోల్పోయాను. రామ్‌చరణ్‌గారు హీరోగా శంకర్‌గారి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్నాను. ఏప్రిల్ 7న మొదలైయ్యే అమృత్సర్ షెడ్యూల్లో నేను పాల్గొంటాను. ఇక నేను హీరోగా చేసిన నాలుగు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరో నాలుగు ప్రాజెక్ట్స్ సెట్స్‌పై ఉన్నాయి. చదవండి: పన్నెండేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను, కానీ ఫోకస్ కాలేదు -
బాక్సర్ అవతారంలో కిక్ ఇవ్వనున్న హీరోలు
తెరపై విలన్ ముఖం మీద హీరో ఒక్క కిక్ ఇస్తే.. చూసే ఆడియన్స్‌కి ఓ కిక్. హీరో వరుసగా కిక్‌ల మీద కిక్‌లు కొడుతుంటే.. ప్రేక్షకులకు దక్కే కిక్కే వేరు. కొందరు హీరోలు ఆ కిక్ ఇవ్వనున్నారు. బాక్సర్ అవతారంలో కిక్ ఇవ్వనున్న ఆ హీరోల గురించి తెలుసుకుందాం. యూత్ స్టార్ విజయ్ దేవరకొండ తన తొలి ప్యాన్ ఇండియన్ మూవీ ‘లైగర్’ కోసం బాక్సర్ అవతారం ఎత్తారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కోసం బాక్సింగ్‌లో శిక్షణ తీసుకున్నారు విజయ్. దీంతో ‘లైగర్’ సినిమాలో బాక్సింగ్ ఎపిసోడ్స్‌తో పాటు యాక్షన్ సీక్వెన్స్ కూడా అదిరిపోతాయని ఊహించవచ్చు. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 9న రిలీజ్ చేయనున్నట్లు గతంలో చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ‘లైగర్’ షూటింగ్‌కు కాస్త అంతరాయం కలిగింది. త్వరలో మళ్లీ చిత్రీకరణ ఆరంభించనున్నారు. ఇక తొలి స్పోర్ట్స్ ఫిల్మ్ ‘గని’ చేస్తున్నారు వరుణ్ తేజ్. ఇందులో బాక్సర్ గని పాత్రలో కనిపిస్తారు వరుణ్. లాక్డౌన్ సమయాల్లో తన సమయం అంతా బాక్సింగ్ ప్రాక్టీస్‌తోనే గడిచిపోయిందని వరుణ్ పలు సందర్భాల్లో సోషల్ మీడియా ద్వారా తెలిపారు. దీన్నిబట్టి ‘గని’లో వరుణ్ నుంచి సాలిడ్ బాక్సింగ్ సీన్స్‌ను ఆశించవచ్చు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. ఈ చిత్రాన్ని ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. 2013లో హీరో ఫర్హాన్ అక్తర్, దర్శకుడు ఓం ప్రకాష్ మెహ్రా కాంబినేషన్లో వచ్చిన ‘భాగ్ మిల్కా భాగ్’ చిత్రం ఎంత గొప్ప విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ చిత్రంలో అథ్లెట్‌గా కనిపించారు ఫర్హాన్. ఇప్పుడు ‘తుఫాన్’ కోసం వీరి కాంబినేషన్ రిపీటైంది. అయితే ‘తుఫాన్’లో ఫర్హాన్ బాక్సర్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రం జూలై 16 నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. అటు తమిళ హీరో ఆర్యను బాక్సింగ్ రింగులో దింపారు ‘కబాలి’ ఫేమ్ పా. రంజిత్. వీరి కాంబినేషన్లో వస్తున్న ‘సారపటై్ట పరంపర’లో ఆర్య బాక్సర్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆర్య శిక్షణ కూడా తీసుకున్నారు. 1980 కాలంలోని బాక్సింగ్ కల్చర్‌ను ఈ సినిమాలో చూపించనున్నారు రంజిత్. ‘బ్రూస్లీ, సాహో’ వంటి చిత్రాల్లో నటించిన అరుణ్ విజయ్ హీరోగా తమిళంలో ‘బాక్సర్’ తెరకెక్కింది. ఇందులో రితికా సింగ్ ఓ హీరోయిన్. ‘గురు’లో బాక్సర్‌గా కనిపించిన రితికా ఈ సినిమాలోనూ ఆ పాత్ర చేశారు. ఆమె నిజంగా కూడా బాక్సర్ అనే విషయం తెలిసిందే. ఇటు సౌత్ అటు నార్త్‌లో ఈ బాక్సర్లు కొట్టే కిక్‌లకు వసూళ్ల కిక్ ఖాయం అనే అంచనాలున్నాయి. -
Ghani: హాలీవుడ్ స్టైల్ యాక్షన్ షురూ
వరుణ్ తేజ్ బాక్సర్‌గా నటిస్తున్న చిత్రం ‘గని’. బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తున్నారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు చక్కబడగానే తిరిగి చిత్రీకరణ మొదలు పెట్టనున్నారు. సిద్ధు ముద్ద మాట్లాడుతూ – ‘‘మా సినిమా ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఈ లాక్‌డౌన్‌లోనూ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు వరుణ్. లాక్డౌన్ తర్వాత మొదలయ్యే షెడ్యూల్లో వరుణ్, ఇతర ప్రధాన తారాగణంపై యాక్షన్, కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తాం. ఇందుకోసం భారీ స్టేడియమ్ సెట్ వేయించాం. హాలీవుడ్లో ‘టైటాన్స్’, బాలీవుడ్లో ‘సుల్తాన్’ వంటి చిత్రాలకు యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేసిన హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ లార్నెల్ స్టోవల్, వ్లాడ్ రింబర్గ్ ఆధ్వర్యంలో యాక్షన్ పార్ట్ చిత్రీకరిస్తాం’’ అన్నారు. సో...యాక్షన్ హాలీవుడ్ స్టైల్లో ఉంటుందని ఊహించవచ్చు. -
వరుణ్‌తేజ్‌ను మాయ ఎందుకు ప్రేమిస్తుంది?
గని మనసును మాయ చేసింది మాయ. తన ప్రేమ రింగులో బాక్సర్ గనిని బంధించింది. ఈ మాయ, గనిల ప్రేమకథను వెండితెరపై చూడటానికి కాస్త సమయం ఉంది. వరుణ్ తేజ్ బాక్సర్‌గా నటిస్తున్న తాజా చిత్రం ‘గని’. హీరోయిన్గా సయీ మంజ్రేకర్ నటిస్తున్నారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాక్సర్ గని పాత్రలో వరుణ్ తేజ్, కాలేజ్ స్టూడెంట్ మాయ పాత్రలో సయీ మంజ్రేకర్ కనిపిస్తారు. ‘‘సల్మాన్‌ఖాన్ ‘దబాంగ్ 3’లో సయీ మంజ్రేకర్ నటన చూసి ‘గని’ సినిమాకి తీసుకున్నాం. సయీకి కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారు. మాయ జీవితంలోకి గని ఎందుకు రావాల్సి వచ్చింది? గనిని మాయ ఏ కారణంతో ప్రేమిస్తుంది? అనే అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి. తెలుగు డైలాగ్స్‌ని సయీ బాగా పలుకుతోంది. షూటింగ్‌కు ఒక రోజు ముందే ఆమెకు డైలాగ్స్ ఇస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రాన్ని జూలై 30న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
బాక్సర్ ఇన్ యాక్షన్
వరుణ్ తేజ్ యాక్షన్ మోడ్‌లో ఉన్నారు. ఇంకొన్ని రోజులు ఇదే మూడ్‌లో ఉంటారట. ఇదంతా సినిమా కోసమే. వరుణ్ తేజ్ హీరోగా నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో బాక్సర్‌గా కనిపిస్తారు వరుణ్. ఈ చిత్రానికి ‘బాక్సర్’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారట. అల్లు వెంకటేశ్, సిద్ధు ముద్ద నిర్మిస్తు్తన్నారు. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారని టాక్. మరో పదిరోజల పాటు ఈ షెడ్యూల్ సాగనుందట. ఆ తర్వాత తన సోదరి నిహారిక పెళ్లి కోసం వరుణ్ తేజ్ చిన్న బ్రేక్ తీసుకుంటారు. -
నైట్ షూట్లో బాక్సర్
వరుణ్ తేజ్ హీరోగా నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి డైరెక్షన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. అల్లు వెంకటేశ్, సిద్ధు ముద్ద నిర్మిస్తున్నారు. ఇందులో వరుణ్ బాక్సర్‌గా కనిపిస్తారు. ఈ సినిమా కోసం బాక్సర్‌గా మారడానికి పలువురు బాక్సింగ్ ఫ్రొఫెషనల్స్ దగ్గర శిక్షణ కూడా తీసుకున్నారు వరుణ్. బాలీవుడ్ నటి సాయి మంజ్రేకర్ ఇందులో కథానాయిక. ఉపేంద్ర, సునీల్ శెట్టి, నదియా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రస్తుతం నైట్ షెడ్యూల్లో పలు సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. మరికొన్ని రోజుల పాటు ఈ షెడ్యూల్ సాగనుంది. హైదరాబాద్ షెడ్యూల్ తర్వాత ఢిల్లీలోనూ చిత్రీకరణ ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. -
నవంబర్‌లో షురూ
కొత్త సినిమా కోసం బాక్సర్‌గా మారారు వరుణ్ తేజ్. ఒక్క షెడ్యూల్ తర్వాత ఈ సినిమా చిత్రీకరణ కరోనా వల్ల ఆగిపోయింది. నవంబర్‌లో మళ్లీ బాక్సింగ్ రింగ్‌లోకి అడుగుపెట్టనున్నారు వరుణ్. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రకథ ఉంటుంది. సిద్ధు ముద్దా, అల్లు వెంకటేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా బ్రేక్ తర్వాత నవంబర్‌లో ఈ సినిమా షూటింగ్‌ను మళ్లీ ప్రారంభించనున్నారు. నవంబర్ 2 నుంచి ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుందని తెలిసింది. నవంబర్ నుంచి మార్చి వరకూ ఏకధాటిగా చిత్రీకరణ జరపాలన్నది ప్లాన్ అట. ఈ సినిమా కోసం ప్రపంచప్రఖ్యాత బాక్సర్ నీరజ్ గోయత్ వద్ద నెలరోజుల పాటు బాక్సింగ్ మెళకువలు నేర్చుకోవడంతోపాటు బాడీలాంగ్వేజ్ మీద దృష్టిపెట్టారు వరుణ్. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. కన్నడ నటుడు ఉపేంద్ర కీలక పాత్రలో కనిపిస్తారు. -
ఇంట్లోనే బాక్సింగే!
ఈ లాక్డౌన్ సమయంలో తనలోని బాక్సర్‌ను మరింత పర్ఫెక్ట్ చేసే పనిలో పడ్డారు వరుణ్ తేజ్. కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రంలో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు వెంకటేశ్, సిద్ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో వరుణ్ బాక్సర్‌గా కనిపించనున్నారు. ఈ క్యారెక్టర్ కోసం అమెరికాలో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. ఈ చిత్రం తొలి షెడ్యూల్ వైజాగ్‌లో జరిగింది. ఆ తర్వాత లాక్డౌన్ వల్ల ఈ షూటింగ్‌కు వీలు పడలేదు. ప్రస్తుతం వరుణ్ తేజ్ తన ఇంటిలోనే బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను వరుణ్ షేర్ చేశారు. ‘‘కొన్నిసార్లు నాకు నేను బలహీనంగా అనిపిస్తాను. అప్పుడు ఇంకొంచెం ఎక్కువగా బాక్సింగ్ సాధన చేస్తా ’’ అని పేర్కొన్నారు వరుణ్ తేజ్. -
బాక్సర్‌కు విలన్?
వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు వెంకటేశ్, సిద్ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో బాక్సర్‌గా నటిస్తున్నారు వరుణ్‌తేజ్. ఇందుకోసం విదేశాల్లో వరుణ్ ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర విలన్ పాత్ర చేయబోతున్నారన్నది ఫిల్మ్‌నగర్ లేటెస్ట్ టాక్. అయితే ‘సన్నాఫ్ సత్యమూర్తి’ (2015) సినిమా తర్వాత మరో స్ట్రయిట్ తెలుగు చిత్రంలో ఉపేంద్ర క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయలేదు. మరి.. బాక్సర్‌కు విలన్‌గా మారతారా? వెయిట్ అండ్ సీ. మరోవైపు మహేశ్‌బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో ఉపేంద్ర ఓ కీలక పాత్ర చేయబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. -
బ్యాక్ టు హైదరాబాద్
బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో వరుణ్ తేజ్ ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో బాక్సర్ పాత్రలో కనిపిస్తారాయన. 20 రోజుల పాటు వైజాగ్‌లో షూటింగ్ చేశారు. మంగళవారంతో వైజాగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసి హైదరాబాద్ తిరిగొచ్చారు వరుణ్. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సిద్ధు ముద్దా, అల్లు వెంకటేశ్ నిర్మిస్తున్నారు. సాయి మంజ్రేకర్ కథానాయిక. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం కానుందని సమాచారం. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 30న విడుదల చేయనున్నారు. -
బాక్సింగ్‌కి సిద్ధం
బాక్సింగ్ గ్లౌజ్స్‌తో ముంబై ప్రయాణమయ్యారు వరుణ్‌తేజ్. కొన్నిరోజుల పాటు బాక్సింగ్ శిక్షణలో బిజీగా ఉండబోతున్నారు. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి డైరెక్షన్లో వరుణ్‌తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఇందులో వరుణ్ బాక్సర్ పాత్రలో నటించనున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు వెంకటేశ్, సిద్ధు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. బాక్సర్ పాత్రలో నటించడానికి అమెరికాలో బాక్సింగ్ గోల్డ్ మెడలిస్ట్ టోనీ జెఫ్రీస్ దగ్గర శిక్షణ తీసుకున్నారు వరుణ్. ఇప్పుడు ఇండియన్ బాక్సర్ నీరజ్ గోయాత్ దగ్గర కూడా బాక్సింగ్‌కి సంబంధించిన మెళకువలు నేర్చుకోనున్నారు. ప్రపంచ బాక్సింగ్ ర్యాంకింగ్స్‌లో ప్రవేశించిన తొలి భారతీయ బాక్సర్ నీరజ్. ఆయన దగ్గర బాక్సింగ్ ట్రిక్స్ నేర్చుకున్న తర్వాత ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటారు వరుణ్. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా ప్రకటించలేదు. కియారా అద్వానీ పేరును పరిశీలిస్తున్నారని సమాచారం. -
బాక్సింగ్‌కు రెడీ అవుతున్న హీరో
బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘తుఫాన్’. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం మొదటి పోస్టర్‌ను ఫర్హాన్ అక్తర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. జెర్సీ ధరించి బాక్సింగ్ రింగులో నిలుచుని ప్రత్యర్థిని మట్టి కరిపించేందుకు కసిగా చూస్తున్నట్టున్న ఈ పోస్టర్‌కు.. ‘ది రాక్ ఆన్’ అనే క్యాప్షన్‌ను జత చేసి అభిమానులతో పంచుకున్నాడు. అదే విధంగా.. ‘ఎప్పుడైతే జీవితం కష్టంగా మారుతుందో.. అప్పుడే మరింత బలవంతులం అవుతాం. దానికి ఉదాహరణ ‘తుఫాన్’. ఇది 2020 అక్టోబర్2 న మీ ముందుకు రాబోతుంది. మీరు ఈ ‘తుఫాన్’ను తప్పక ఇష్టపడతారని నా నమ్మకం’ అంటూ ఈ పోస్టులో రాసుకొచ్చాడు. కాగా తుఫాన్లో బాక్సర్‌గా తన అభిమానులను మెప్పించడానికి ఫర్హాన్ బాగానే శ్రమించాడని... ఇందుకోసం బాక్సింగ్‌లో శిక్షణ కూడా తీసుకున్నట్లు చిత్ర బృందం తెలిపింది. కాగా ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న తుఫాన్ చిత్రానికి ఓం ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహిస్తున్నారు. ఇది వరకే వీరిద్దరి కలయికలో స్పోర్ట్స్ డ్రామా ‘భాగ్ మిల్కా భాగ్’ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. 2013లో విడుదలైన ఈ సినిమాలో ఫర్హాన్ రన్నర్‌గా కనిపించాడు. ఇక ఫర్హాన్ అక్తర్, ప్రియాంక చోప్రా నటించిన ‘స్కై ఈజ్ పింక్’ సినిమా గత ఏడాది అక్టోబర్ 11 విడుదలై టొరంటో అంతర్జాతీయ చలన చిత్ర ఉత్సవాలలో ప్రదర్శించబడింది. View this post on Instagram When life gets harder, you just get stronger. Iss saal #Toofan uthega. Releasing 02/10/2020. Happy to share this exclusive image with you as we dive into the new year. Hope you like it. ❤️ @rakeyshommehra @ritesh_sid @mrunalofficial2016 @vjymaurya @shankarehsaanloy @ozajay @excelmovies @romppictures @zeemusiccompany #PareshRawal #JavedAkhtar #AnjumRajabali #AAFilms A post shared by Farhan Akhtar (@faroutakhtar) on Jan 1, 2020 at 7:30pm PST -
బాక్సర్‌కు జోడీ
గ్లౌజ్ ధరించి బాక్సింగ్ రింగ్‌లో ప్రత్యర్థి మీద పంచులు విసరడానికి వరుణ్ తేజ్ సిద్ధమవుతున్నారు. మరి లైఫ్‌లో ప్రేమను చూపించడానికి హీరోయిన్ కూడా కావాలి కదా. ఆ హీరోయిన్ దొరికేసిందని తెలిసింది. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రకథ ఉంటుంది. వరుణ్ తేజ్ బాక్సర్‌గా కనిపిస్తారు. బాక్సర్‌కు జోడీగా కియారా అద్వానీ కనిపిస్తారని సమాచారం. ఈ సినిమాలో వరుణ్‌కి జోడీగా కియారా అద్వానీ పేరుని పరిశీలిస్తున్నారట చిత్రబృందం. ఈ సినిమాను అల్లు వెంకటేశ్, సిద్ధు నిర్మిస్తున్నారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. -
మళ్లీ ఆట మొదలు
దాదాపు ఆరేళ్ల క్రితం వచ్చిన ‘భాగ్ మిల్కా భాగ్’ చిత్రంలో రన్నర్‌గా బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేశారు ఫర్హాన్ అక్తర్. ఈ చిత్రానికి ఓం ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించారు. వీరిద్దరి కాంబినేషన్లో మరో స్పోర్ట్స్ మూవీ ‘తుఫాన్’ తెరకెక్కుతోంది. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో బాక్సర్ పాత్రలో ఫర్హాన్ కనిపిస్తారు. అసలు సిసలైన బాక్సర్‌గా ఫిజిక్‌ని మార్చుకోవడానికి ఫర్హాన్ కసరత్తులు చేశారు. ఈ పాత్రకు అనుగుణంగా లుక్ మార్చుకున్నాక, ఆగస్టులో షూటింగ్‌ని మొదలుపెట్టారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ముంబైలోని డోంగ్రీ ప్రాంతంలో మొదలైంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది అక్టోబరు 2న విడుదల చేయాలనుకుంటున్నారు. -
సూపర్ శిక్షణ
బాక్సింగ్‌లో ట్రైనింగ్ తీసుకోవడానికి రెండు నెలలుగా వరుణ్ తేజ్ ఫారిన్లో ఉన్న సంగతి తెలిసిందే. వరుణ్ శిక్షణ ఓ కొలిక్కి వస్తున్నట్లు తెలిసింది. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలోనే వరుణ్ బాక్సర్‌గా నటించనున్నారు. ఇందుకోసం శిక్షణ తీసుకోవడానికే ఆయన ఫారిన్ వెళ్లారు. ఇంగ్లాండ్‌కు చెందిన ప్రొఫెషనల్ బాక్సర్ టోనీ డేవిడ్ జెఫ్రీస్ వరుణ్‌తేజ్‌కు బాక్సింగ్‌లో శిక్షణ ఇస్తున్నారు. ‘‘టోనీ జెఫ్రీస్ నీతో రెండు నెలలుగా శిక్షణ బాగా జరిగింది. ఇప్పుడు మిస్ అవుతున్నాను. త్వరలో ట్రైనింగ్ మళ్లీ స్టార్ట్ చేద్దాం’’ అని పేర్కొన్నారు వరుణ్ తేజ్. ఇక్కడ లేటెస్ట్ వరుణ్‌తేజ్ లుక్‌ని గమనిస్తే... వరుణ్ బాగా బరువు తగ్గినట్లు తెలుస్తోంది. పాత్ర కోసమే ఇదంతా అని ఊహించుకోవచ్చు. -
కాలిఫోర్నియాలో క్యాజువల్‌గా...
బ్రదర్స్ రామ్‌చరణ్, వరుణ్ తేజ్ ఇద్దరూ అనుకోకుండా కాలిఫోర్నియాలో కలుసుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి సంబంధించిన పని మీద కాలిఫోర్నియా వెళ్లినట్టున్నారు చరణ్. లేటెస్ట్ సినిమాలో బాక్సర్ పాత్ర కోసం కొంతకాలంగా అమెరికాలో శిక్షణ తీసుకుంటున్నారు వరుణ్ తేజ్. అక్కడ అనుకోకుండా కలసిన ఈ బ్రదర్స్ సరదాగా ఓ సెల్ఫీ తీసుకున్నారు. ‘బ్రదర్స్ లవ్’ అంటూ ఈ ఫోటోకు క్యాప్షన్ చేశారు వరుణ్. వింటేజ్ కార్లు వాడుతున్నారట ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. కొమరమ్ భీమ్, సీతారామరాజు నిజజీవిత పాత్రల ఆధారంగా రూపొందుతున్న ఊహాజనిత కథ ఇది. పీరియాడికల్ మూవీ కావడంతో వింటేజ్ కార్ల అవసరం ఏర్పడింది. అందుకోసం బెంగళూర్ నుంచి పలు కార్లను అద్దెకు తీసుకున్నారట చిత్రబృందం. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ నార్త్ ఇండియాలో జరుగుతోంది. అక్కడికి ఈ కార్లను తీసుకెళ్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూలై 30న రిలీజ్ కానుంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ -
పంచ్ పడుద్ది!
‘ఎఫ్ 2’లో ప్రేక్షకుల మీద కామెడీ పంచ్‌లు విసిరిన వరుణ్ తేజ్, లేటెస్ట్గా సీరియస్‌గా బాక్సింగ్ పంచ్‌లు ఇవ్వడానికి రెడీ అయ్యారు. తదుపరి చిత్రంలో బాక్సర్‌గా కనిపిస్తారని తెలిసిందే. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని అల్లు వెంకటేశ్, సిద్దు నిర్మిస్తారు. ఆల్రెడీ అమెరికాలో బాక్సింగ్ క్లాసులతో ఫుల్ బిజీగా ఉన్నారు వరుణ్. హాలీవుడ్ చిత్రాలు ‘క్రీడ్, కార్ల్ వెదర్స్’ వంటి చిత్రాలకు యాక్షన్ సీక్వెన్స్‌ను కొరియోగ్రాఫ్ చేసిన టెక్నీషియన్స్ ఈ సినిమాకు పని చేయనున్నారు. అలాగే ఒలింపిక్స్‌లో పాల్గొన్నటువంటి బాక్సర్ టోనీ జఫ్రీస్ వద్ద శిక్షణ తీసుకుంటున్నారు వరుణ్. ఇందులో ‘యాక్షన్ కింగ్’ అర్జున్, కన్నడ స్టార్ ఉపేంద్ర, రమ్యకృష్ణ, సత్యరాజ్, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి లను కీలకపాత్రల కోసం చిత్రవర్గాలు సంప్రదించినట్టు సమాచారం. తొలిసినిమా అయినప్పటికీ క్యాస్టింగ్‌తోనే ప్రాజెక్ట్‌ను ఎగై్జటింగ్‌గా తయారు చేశారు. ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. మరోవైపు హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘వాల్మీకి’ అనే చిత్రంలోనూ నటించనున్నారు వరుణ్ తేజ్. -
సాధనే ఆయుధం
రింగులో బాక్సర్ శారీరకంగానే కాదు.. మానసికంగా కూడా బలంగా ఉండాలి. లేకపోతే ప్రత్యర్థిదే విజయం. బరిలో గెలవాలంటే సరైన సాధనే ఆయుధం. అందుకే ఇటు మానసికంగా అటు సాధనపరంగా రాజీ పడటం లేదు వరుణ్ తేజ్. బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. వరుణ్‌తేజ్ పడుతున్న ఈ శ్రమ అంతా ఆయన బాక్సర్‌గా నటించబోతున్న చిత్రం కోసమే. కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడు తెరకెక్కించనున్న సినిమాలో వరుణ్‌తేజ్ బాక్సర్‌గా నటించనున్నారు. ఇందుకోసం కాలిఫోర్నియాలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు వరుణ్. ‘‘పది రౌండ్ల బాక్సింగ్ సాధన చేసిన తర్వాత నేను’’ అనే క్యాప్షన్‌తో ఇన్సెట్లో ఉన్న ఫొటోను షేర్ చేశారు వరుణ్. అక్కడినుంచి వరుణ్ తిరిగొచ్చిన వెంటనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అల్లు బాబీ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ‘వాల్మీకి’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. -
బాక్సర్ వరుణ్!
బాక్సర్‌గా హీరో వరుణ్ తేజ్ హైట్ అండ్ వెయిట్ పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. ఫుట్‌బాల్, క్రికెట్.. ఇలా విభిన్న రకాల స్పోర్ట్స్ ఉండగా ఒక్క బాక్సింగ్‌నే ఎందుకు పాయింట్ అవుట్ చేస్తున్నామనేగా మీ డౌట్. అక్కడికే వస్తున్నాం. వరుణ్ తేజ్ హీరోగా స్పోర్ట్స్ నేపథ్యంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా కిరణ్ కొర్రపాటి దర్శకునిగా పరిచయం కానున్నారు. ఇంతకుముందు శ్రీనుౖ వెట్ల దర్శకత్వంలో వచ్చిన ‘మిస్టర్’, వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ‘తొలిప్రేమ’ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశారట కిరణ్. ‘మిస్టర్, తొలిప్రేమ’ ఈ రెండు చిత్రాల్లో వరుణ్ తేజ్‌నే హీరో అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. గీతా ఆర్ట్స్ పతాకంపై నిర్మాత అల్లు అరవింద్ తనయుడు అల్లు వెంకటేశ్ (అల్లు బాబీ) ఈ సినిమాకు ఒక నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్‌గా కనిపిస్తారని సమాచారం. రీసెంట్గా ‘అంతరిక్షం 9000 కేఎమ్‌పీహెచ్’ సినిమాలో అంతరిక్షంలోకి వెళ్లిన వరుణ్ ఇప్పుడు బాక్సింగ్ రింగులోకి దిగనున్నారన్నమాట. ఇక వెంకటేశ్‌తో కలిసి వరుణ్ నటించిన మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్ 2’ ఈ సంక్రాంతికి విడుదల కానుంది. -
బాక్సర్ వెంకీ!
వెంకటేశ్ కామెడీ చేసినా బాగుంటుంది.. సీరియస్‌గా కనిపించినా సూట్ అవుతుంది. రొమాన్స్, సెంటిమెంట్.. ఇలా అన్నీ చేయగలరు. అందుకే అన్ని వర్గాల ప్రేక్షకులకీ దగ్గరయ్యారు వెంకీ. ప్రస్తుతం చేస్తున్న ‘బాబు బంగారం’లో ఎంటర్టైన్మెంట్ పాళ్లు ఎక్కువగా ఉంటుంది. కానీ, ఈ చిత్రం తర్వాత చేయనున్న దాంట్లో మాత్రం వెంకీ సీరియస్‌గా కనిపించనున్నారు. ఇందులో బాక్సర్ పాత్ర చేయనున్నారు. ‘ఇరుది సుట్రు’, ‘సాలా ఖడూస్’ పేరుతో తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిన సినిమా తెలుగు రీమేక్‌లో వెంకటేశ్ నటించనున్నారు. ఒరిజినల్ మూవీలో మాధవన్ చేసిన బాక్సర్ క్యారెక్టర్‌ను ఆయన పోషించనున్నారు. తమిళ చిత్రాన్ని నిర్మించిన వైనాట్ స్టూడియోస్ తెలుగులోనూ నిర్మించనుంది. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేశ్ బాబు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తారు. కథానాయకుడు ఎంతో టాలెంట్ ఉన్నా.. బాక్సింగ్ అసోసియేషన్‌లో ఉన్న రాజకీయాలతో ఛాంపియన్ కాలేకపోతాడు. బాక్సింగ్ కోచ్ గా మారి మట్టిలో మాణిక్యాల్లాంటి బాక్సర్లను వెలికితీయాలని ప్రయత్నాలు చేస్తాడు. రోడ్డు పక్కన చిన్న షాపు నడుపుకునే మది అనే అమ్మాయికి కోచింగ్ ఇచ్చి చాంపియన్‌ను చేస్తాడు. ఇలా సాగే ‘సాలా ఖడూస్’ కథకు తెలుగు నేటివిటీ జోడించి, మన ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది దర్శకురాలు సుధా కొంగర ఆలోచన. బాక్సర్ క్యారెక్టర్ కోసం వెంకీ బాడీ ఫిట్నెస్ ఇంకాస్త పెంచుతున్నారట. వెంకీ సిక్స్ ప్యాక్‌లో కనిపిస్తారని ప్రచారం జరిగింది. ఈ విషయం గురించి సురేశ్‌బాబు స్పందిస్తూ - ‘‘ఈ పాత్రకు సిక్స్‌ప్యాక్‌లో కనిపించాల్సిన అవసరం లేదు. బాక్సర్‌గా ఫిట్‌గా కనిపిస్తే చాలు’’ అన్నారు. ఈ సినిమా చిత్రీకరణ మొత్తం విశాఖలో చేస్తార ని సమాచారం. సెప్టెంబర్‌లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మాతృకలో నటించిన రితికా సింగ్... తెలుగు రీమేక్‌లోనూ కనిపించనుంది.