ఇంట్లోనే బాక్సింగే! | Varun Tej Practicing Boxing from Home | Sakshi
Sakshi News home page

ఇంట్లోనే బాక్సింగే!

Published Thu, May 14 2020 6:03 AM | Last Updated on Thu, May 14 2020 6:03 AM

Varun Tej Practicing Boxing from Home - Sakshi

ఈ లాక్‌డౌన్‌ సమయంలో తనలోని బాక్సర్‌ను మరింత పర్ఫెక్ట్‌ చేసే పనిలో పడ్డారు వరుణ్‌ తేజ్‌. కిరణ్‌ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రంలో వరుణ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. అల్లు అరవింద్‌ సమర్పణలో అల్లు వెంకటేశ్, సిద్ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో వరుణ్‌ బాక్సర్‌గా కనిపించనున్నారు. ఈ క్యారెక్టర్‌ కోసం అమెరికాలో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ వైజాగ్‌లో జరిగింది. ఆ తర్వాత లాక్‌డౌన్‌ వల్ల ఈ షూటింగ్‌కు వీలు పడలేదు. ప్రస్తుతం వరుణ్‌ తేజ్‌ తన ఇంటిలోనే బాక్సింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను వరుణ్‌ షేర్‌ చేశారు. ‘‘కొన్నిసార్లు నాకు నేను బలహీనంగా అనిపిస్తాను. అప్పుడు ఇంకొంచెం ఎక్కువగా బాక్సింగ్‌ సాధన చేస్తా ’’ అని పేర్కొన్నారు వరుణ్‌ తేజ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement