Practice
-
మన ‘చాంపియన్స్’ కసరత్తు షురూ
దుబాయ్: పాక్ ఆతిథ్యమివ్వబోయే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌ల్ని దుబాయ్‌లో ఆడేందుకు వచ్చిన టీమిండియా కసరత్తు మొదలుపెట్టింది. ఆదివారమే అయినా, అక్కడికి చేరుకొని గంటల వ్యవధిలోనే భారత క్రికెటర్లు సాధన మొదలుపెట్టారు. ప్రామాణిక నిర్వాహక విధానం (ఎస్ఓపీ)లో భాగంగా కొత్తగా వచ్చిన హర్షిత్ రాణా నుంచి స్టార్ అయిన కెప్టెన్ రోహిత్ శర్మ వరకు అందరూ జట్టు కసరత్తులో పాల్గొనే పద్ధతిని నిక్కచ్చిగా అమలు చేశారు. ప్రాక్టీస్‌లో ప్రత్యామ్నాయ (ఆప్షనల్) సెషన్ అంటూ లేకుండా ఆటగాళ్లందరూ నెట్స్‌లో శ్రమించారు. అయితే అందరికంటే ఎక్కువగా అనుభవజ్ఞుడైన సీమర్ మొహమ్మద్ షమీ కఠోరంగా ప్రాక్టీస్ చేశాడు. గాయం తర్వాత సుదీర్ఘ విరామనంతరం అతను ఇటీవలే ఇంగ్లండ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లతో అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేశాడు. ముందుగా శారీరక కసరత్తు చేసిన షమీ ఆ వెంటనే బౌలింగ్ ప్రాక్టీస్‌కు ఉపక్రమించాడు.బ్యాటర్లు నెట్స్‌లో దిగకముందే అతను లైన్ అండ్ లెంత్‌పై దృష్టిపెట్టి మరీ సాధన చేశాడు. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కచ్చితత్వమైన లెంత్ ప్రాక్టీస్‌కు సహకరించాడు. హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్లిద్దరూ కుల్దీప్ యాదవ్ స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కొనే పనిలో పడ్డారు. ఈ క్రమంలో పాండ్యా బాదిన షాట్ పక్కనే ఉన్న రిషబ్ పంత్ మోచేతికి తగిలింది. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు బ్యాటింగ్ చేయగా, ఫీల్డింగ్ కోచ్ దిలీప్... హర్షిత్, వరుణ్ చక్రవర్తి, పంత్‌లతో ఫీల్డింగ్ డ్రిల్స్ చేయించాడు. -
‘పునరాగమనం చేస్తా’
న్యూఢిల్లీ: దాదాపు ఐదేళ్ల పాటు భారత మహిళల క్రికెట్ జట్టులో కీలక ప్లేయర్‌గా పలు విజయాల్లో భాగంగా ఉన్న షఫాలీ వర్మ(Shafali Verma) మూడు నెలల క్రితం టీమ్‌లో చోటు కోల్పోయింది. ముందుగా ఆస్ట్రేలియాతో, ఆపై స్వదేశంలో వెస్టిండీస్, ఐర్లాండ్‌లతో సిరీస్‌లకు కూడా ఆమెను ఎంపిక చేయలేదు. అయితే ఆ తర్వాత దేశవాళీ క్రికెట్లో చెలరేగిన షఫాలీ పరుగుల వరద పారించింది. సీనియర్ వన్డే చాలెంజర్ టోర్నీలో 5 మ్యాచ్‌లలోనే 82.80 సగటుతో 414 పరుగులు సాధించింది. ఇదే జోరులో తాను భారత జట్టులోకి పునరాగమనం చేస్తాని షఫాలీ విశ్వాసం వ్యక్తం చేసింది. ‘గత కొన్ని నెలలు నా జీవితంలో కఠినంగా గడిచాయి. నాన్నకు అనూహ్యంగా గుండెపోటు వచ్చిన రెండు రోజులకే టీమ్‌లో స్థానం కోల్పోయాను. మానసికంగా ఎంతో ఇబ్బంది పడ్డా. అయితే నా కుటుంబం నాకు అండగా నిలిచి ప్రోత్సహించింది. అందుకే మళ్లీ మైదానంలో పట్టుదలగా ఆడగలిగా. నాకు అవకాశం వచ్చిన ప్రతీసారి భారీగా పరుగులు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నా. పూర్తిగా దానిపైనే దృష్టి పెట్టా. అందు కోసం పట్టుదలగా సిద్ధం కావడమే నేను చేయగలిగింది. ఇలాగే ప్రాక్టీస్ కొనసాగించి పరుగులు సాధిస్తే తిరిగి భారత జట్టులో రాగలను’ అని షఫాలీ వ్యాఖ్యానించింది. డబ్ల్యూపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న షఫాలీ ప్రస్తుతం సన్నాహకాల్లో ఉంది. సీజన్ ఆరంభానికి ముందు క్యాపిటల్స్ నిర్వహిస్తున్న ప్రత్యేక క్యాంప్‌లో ఆమె పాల్గొంటోంది. డబ్ల్యూపీఎల్ మ్యాచ్‌ల ద్వారా ఇన్నింగ్స్ ఎలా నిర్మించాలో తాను నేర్చుకున్నానని ఆమె వెల్లడించింది. ‘డబ్ల్యూపీఎల్‌లో ప్లేయర్లకు ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం లభిస్తుంది. ఆటలో స్వల్ప మార్పులు కూడా చేసుకోవచ్చు. వ్యక్తిగతంగా చూస్తే ఇన్నింగ్స్ ఎలా నిర్మించాలో నేర్చుకోగలిగాను. అనుభవజు్ఞలైన విదేశీ క్రికెటర్లతో కలిసి ఆడే అవకాశం రావడం ఎంతో మేలు చేస్తుంది. మైదానంలో కీలక సమయాల్లో, మైదానం బయట కూడా ప్రశాంతంగా ఎలా ఉండవచ్చో వారిని చూస్తే తెలుస్తుంది. తాజా సీజన్ కోసం మా జట్టు సన్నాహాలు చాలా బాగా సాగుతున్నాయి’ అని షఫాలీ పేర్కొంది. డబ్ల్యూపీఎల్ రెండు సీజన్లలో కూడా ఫైనల్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ టైటిల్ సాధించడంలో మాత్రం విఫలమైంది. -
#BGT2024 : ప్రాక్టీస్ మొదలు పెట్టిన టీమిండియా (ఫోటోలు)
-
IND vs AUS: ప్రాక్టీస్ మొదలైంది
పెర్త్: వరుసగా మూడోసారి ఆ్రస్టేలియా గడ్డపై ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ని సొంతం చేసుకునే లక్ష్యంతో భారత క్రికెటర్లు తమ సన్నాహాలు మొదలు పెట్టారు. బుధవారం మధ్యాహ్నం వెస్టర్న్ ఆ్రస్టేలియా క్రికెట్ అసోసియేషన్ (వాకా) మైదానంలో భారత జట్టు సభ్యులంతా ముమ్మర ప్రాక్టీస్ చేశారు. ఆ్రస్టేలియాలో అనధికారిక టెస్టులు ఆడేందుకు వచ్చిన పలువురు భారత్ ‘ఎ’ జట్టు ఆటగాళ్లు సీనియర్ జట్టు సభ్యులను కలిశారు. ‘కింగ్ కోహ్లి’ బ్యాటింగ్ ప్రాక్టీస్‌లో తలమునకలై చెమటోడ్చాడు. అతనికి, రిషభ్ పంత్‌కు సిరాజ్, ఆకాశ్‌దీప్‌లు బౌలింగ్ చేశారు. మిగతా బ్యాటర్లు సైతం నెట్స్‌లో శ్రమించారు. అయితే భారత కెపె్టన్ రోహిత్ శర్మ టీమిండియాతో ఇంకా కలవలేదు. అతని భార్య ప్రసవ తేది సమీపిస్తుండటంతో శ్రీమతికి తోడుగా ముంబైలో ఉన్నాడు. కాగా భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్... తొలిటెస్టు కల్లా తమ కెపె్టన్ అందుబాటులోకి వస్తాడని చెప్పాడు. ఆసీస్ మీడియా అసత్య ప్రచారం అభిమానులు, ప్రేక్షకులకు దూరంగా స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తామని టీమిండియాగానీ, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)గానీ చెప్పలేదు. క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ)ను కోరలేదు. అయినా సరే ఆసీస్ మీడియా పనిగట్టుకొని అసత్య కథనాలు ప్రచురిస్తోంది. ‘వాకా’ గ్రౌండ్లో గేట్లు మూసి నెట్స్‌లో ప్రాక్టీస్ చేసేందుకే భారత ఆటగాళ్లు మొగ్గుచూపారని, అక్కడి భారతీయులకు దూరంగా, వేరెవరిని అనుమతించకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసుకున్నారని ‘ది ఆస్ట్రేలియన్’ పత్రిక రాసింది. నిజానికి ‘వాకా’లో నవీకరణ పనులు జరుగుతున్నాయి. ఏడీసీఓ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ ఈ పనులు చేస్తోంది. ఇది పక్కనబెట్టి సదరు పత్రిక భారత క్రికెటర్లు ‘నో డ్రోన్ ఫ్లయ్ జోన్’ ఏర్పాటు చేసుకున్నారని, సాధారణ ప్రజానీకం, క్రికెట్ అభిమానులెవర్ని అనుమతించడం లేదని, ఫొటోలు, వీడియోలు తీసేందుకు కఠినమైన ఆంక్షలు విధించారని ఓ కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది.మంగళవారం నుంచి ఆదివారం వరకు భారత జట్టుతో పాటు, అక్కడే ఉన్న భారత్ ‘ఎ’ ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో పాలుపంచుకుంటున్నారు. శుక్రవారం నుంచి సీనియర్ భారత్, ‘ఎ’ జట్ల మధ్య ‘సెంటర్ వికెట్ ట్రెయినింగ్’లో భాగంగా వార్మప్ మ్యాచ్ జరుగనుంది. దీనికి ప్రేక్షకులను అనుమతించాల్సిందిగా భారత జట్టు మేనేజ్మెంట్ కోరింది. -
మళ్లీ విజయాలు అందించడమే లక్ష్యం
న్యూఢిల్లీ: భారత మాజీ ఆటగాడు అనూప్ శ్రీధర్‌ను తాత్కాలిక కోచ్‌గా ఎంచుకున్న సింధు దాదాపు గత మూడు వారాలుగా అతనితో కలిసి హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తోంది. ఆమె ఆటలో చాలా మెరుగుదల కనిపిస్తోందని, తన షెడ్యూల్ ప్రకారం శిక్షణ కొనసాగుతోందని శ్రీధర్ వెల్లడించాడు. ‘సింధు ఆటలో కొన్ని చిన్న చిన్న లోపాలను సరిదిద్దడంతో పాటు కొన్ని కొత్త విషయాలు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నా. ఇప్పటి వరకు మేం ఒక్క షెడ్యూల్ కూడా తప్పకుండా పక్కా ప్రణాళికతో సాధన చేస్తున్నాం. ఈ మూడు వారాల్లో ఆమె ఆటలో చాలా మార్పు వచ్చింది. అయితే ఇంకా చేయాల్సింది చాలా ఉంది. సింధులో మరిన్ని విజయాలు సాధించాలనే తపన ఉంది. గతంలోకంటే ఇంకా ఎక్కువగా కష్టపడుతోంది. ఈ సాధనతో వచ్చే టోరీ్నల్లో ప్రత్యర్థితో సంబంధం లేకుండా ఆరంభ రౌండ్లలో బాగా ఆడితే ఆ తర్వాత టైటిల్స్ సాధించడం లాంఛనమే అవుతుంది. ఆమె ఆటలో నిలకడ తీసుకొచ్చి మరిన్ని విజయాలు వచ్చేలా చేయడమే నా లక్ష్యం’ అని అనూప్ శ్రీధర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం తాను తాత్కాలిక కోచ్‌గానే వచ్చాను కాబట్టి ఒక్కో వారం చొప్పున సమీక్ష చేస్తూ కోచింగ్ కొనసాగిస్తున్నానన్న శ్రీధర్... ఇదే కారణంతో సుదీర్ఘ కాలపు ప్రణాళికలు వేయడం లేదని స్పష్టం చేశాడు. సింధు కన్సల్టింగ్ కోచ్‌గా లీ హ్యూన్పారిస్ ఒలింపిక్స్ తర్వాత మరో టోర్నీ ఆడని భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు మళ్లీ కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. వచ్చేనెలలో జరిగే ఫిన్లాండ్ ఓపెన్, డెన్మార్క్ ఓపెన్లతో పాటు ఆ తర్వాత యూరోప్ సర్క్యూట్లో వివిధ టోరీ్నల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా మాజీ ఆటగాడు లీ హ్యూన్ ఇల్‌ను కన్సల్టింగ్ కోచ్‌గా సింధు ఎంచుకుంది. ఇప్పటికే భారత మాజీ ఆటగాడు అనూప్ శ్రీధర్ సింధు తాత్కాలిక కోచ్‌గా పని చేస్తున్నాడు. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన సింధు ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో మాత్రం పతకం సాధించడంలో విఫలమైంది. ప్రిక్వార్టర్ ఫైనల్లోనే చైనా ప్లేయర్ బింగ్జియావో చేతిలో ఆమె ఓటమి పాలైంది. అంతకు కొంత కాలం ముందునుంచి కూడా సింధు చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించలేదు. 2022లో సింగపూర్ ఓపెన్ గెలిచిన తర్వాత మరే టైటిల్ నెగ్గని సింధు... గత రెండేళ్ల వ్యవధిలో రెండు టోర్నీల్లో రన్నరప్‌గా మాత్రమే నిలవగలిగింది. రియో ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన సమయంలో సింధు కోచ్‌గా ఉన్న పార్క్ సంగ్ కాంట్రాక్ ముగిసి 2023 ఆరంభంలోనే వెళ్లిపోగా... తాత్కాలికంగా ‘సాయ్’ కోచ్ విధి చౌదరితో కలిసి ఆమె పని చేసింది. దిగ్గజ ఆటగాడు హాఫిజ్ హషీమ్‌ను కోచ్‌గా తీసుకున్నా అదీ కొద్ది రోజులకే ముగిసింది. దాంతో బెంగళూరుకు వెళ్లి సింధు... ప్రకాశ్ పడుకోన్ వద్ద పారిస్ ఒలింపిక్స్‌కు సన్నద్ధమైంది. ప్రస్తుత సీజన్ ఇంకా పూర్తి కాకపోగా... కోచ్‌గా పని చేసిన ఆగస్ సాంటోసో కాంట్రాక్ట్ ఒలింపిక్స్‌తోనే ముగిసింది. దాంతో ఈ సీజన్ చివరి వరకు సింధుకు కొత్త కోచ్ అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అటు శ్రీధర్‌తో పాటు ఇటు లీ హ్యూన్తో కలిసి పని చేసేందుకు ఆమె సిద్ధమైంది. వీరిద్దరు డిసెంబర్ 2024 వరకు సింధుకు శిక్షణనిస్తారు. ‘నా కెరీర్ కీలక దశలో అనూప్, లీ హ్యూన్లు కోచ్‌గా రావడం పట్ల సంతోషంగా ఉన్నా. భారత బ్యాడ్మింటన్‌పై అనూప్‌కు ఉన్న అవగాహన, ఆయన వ్యూహాలు నన్ను చాలా ఆకట్టుకున్నాయి. లీ హ్యూన్‌కు అపార అనుభవం ఉండటం నాకు కలిసొచ్చే అంశం. ఆటకు సంబంధించి ప్రతీ విషయంలో ఆయన సూక్ష్మ పరిశీలన నాకు మేలు చేస్తుంది. రాబోయే కొన్ని వారాల పాటు వీరిద్దరితో కలిసి పని చేసేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా’ అని సింధు వ్యాఖ్యానించింది. మాజీ వరల్డ్ నంబర్‌వన్ లీ హ్యూన్ అంతర్జాతీయ ఆటగాడిగా మంచి రికార్డు ఉంది. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన అతను సుదిర్మన్ కప్‌లో స్వర్ణం, 3 కాంస్యాలు గెలిచిన... థామస్ కప్‌లో 2 రజతాలు, 2 కాంస్యాలు గెలిచిన కొరియా జట్లలో సభ్యుడు. ఆసియా క్రీడల్లో లీ హ్యూన్ 2 స్వర్ణాలు, 3 రజతాలు, కాంస్యం గెలవడంతో పాటు ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ కాంస్యం అందుకున్నాడు. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) లో సింధు జట్టులో సభ్యుడిగా కలిసి ఆడాడు. ఐదేళ్ల క్రితం ఆటకు రిటైర్మెంట్ పలికిన అనంతరం అతను కోచింగ్ వైపు మారాడు. -
India vs Bangladesh: చెన్నైలో జోరుగా సాధన
చెన్నై: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో భాగంగా జరుగుతున్న భారత్, బంగ్లాదేశ్ సిరీస్ కోసం ఇరు జట్ల ప్లేయర్లు కసరత్తులు ముమ్మరం చేశారు. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా గురువారం నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుండగా.. మంగళవారం టీమిండియా ప్లేయర్లు ప్రాక్టీస్‌లో మునిగిపోయారు. ఇటీవల శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌లో భారత స్టార్ ఆటగాళ్లు సైతం స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తడబడ్డ నేపథ్యంలో... ఆ దిశగా మరింత సాధన చేస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లితో పాటు వికెట్ కీపర్ రిషబ్ పంత్, శుబ్‌మన్‌గిల్, యశస్వి జైస్వాల్ నెట్స్‌లో చెమటోడ్చగా... హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ ప్రాక్టీస్ సెషన్‌ను పర్యవేక్షించాడు. పలువురు ఆటగాళ్లతో వ్యక్తిగతంగా మాట్లాడిన గౌతమ్ గంభీర్ తగు సూచనలు చేయగా... సహాయక కోచ్‌లు ర్యాన్ టెన్ డస్కటే, అభిõÙక్ నాయర్ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. ముఖ్యంగా పంత్ బ్యాటింగ్‌పై గంభీర్ ప్రత్యేక దృష్టి పెట్టాడు. 2022 డిసెంబర్లో మిర్పూర్లో బంగ్లాదేశ్‌పై మ్యాచ్ తర్వాత పంత్ టెస్టు మ్యాచ్ ఆడనుండటం ఇదే తొలిసారి. చెన్నై పిచ్ తొలుత బ్యాటింగ్‌కు ఆ తర్వాత స్పిన్‌కు అనుకూలించే అవకాశాలున్నాయి. అందుకే నెట్స్‌లో దాదాపు అందరు ఆటగాళ్లు స్పిన్‌ను ఎదుర్కోవడంపై దృష్టి పెట్టడం కనిపించింది. తొలి టెస్టులో టీమిండియా ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్ల కూర్పుతో బరిలోకి దిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. చెన్నైలో గత రెండు వారాలుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్లేయర్లు ఎర్రమట్టి పిచ్‌తో పాటు నల్లమట్టి పిచ్‌పై ప్రాక్టీస్ సాగిస్తున్నారు. -
ముమ్మర సాధనలో...
చెన్నై: టీమిండియా ప్రాక్టీస్‌లో తలమునకలై శ్రమిస్తోంది. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు కోసం తీవ్రంగా సాధన చేస్తోంది. నిజానికి భారత్ స్థాయితో పోల్చుకుంటే బంగ్లాదేశ్ ఏమంత గట్టి ప్రత్యర్థి కానప్పటికీ... ఇటీవల పాకిస్తాన్లో పర్యటించిన బంగ్లాదేశ్ 2–0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ నేపథ్యంలో కొత్త సీజన్లో ఎలాంటి ఆదమరుపునకు తావివ్వకుండా భారత ఆటగాళ్లు చెమటోడ్చుతున్నారు. సోమ వారం పూర్తిస్థాయిలో 16 మంది జట్టు సభ్యులంతా ప్రాక్టీస్ చేశారు. కోహ్లి నెట్స్‌లో ఎక్కువసేపు బ్యాటింగ్ చేశాడు. తర్వాత యువ సంచలనం యశస్వి జైస్వాల్ సాధనకు దిగాడు. ఇద్దరు చాలాసేపు వైవిధ్యమైన బంతుల్ని ఎదుర్కొనేందుకు ఆసక్తి చూపారు. భారత స్పీడ్‌స్టర్ బుమ్రా, స్థానిక వెటరన్ స్పిన్నర్ అశ్విన్ వాళ్లిద్దరికి బంతులు వేశారు. బుమ్రా బౌలింగ్‌లో షాట్లు ఆడే ప్రయత్నంలో జైస్వాల్ పలుమార్లు బౌల్డయ్యాడు. ఆ తర్వాత కెపె్టన్ రోహిత్, ఓపెనర్ శుబ్‌మన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్లు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. అనంతపురంలో దులీప్ ట్రోఫీ మ్యాచ్ అయిపోగానే సర్ఫరాజ్ జట్టుతో కలిశాడు. సారథి రోహిత్ శర్మ ప్రధానంగా స్పిన్నర్లను ఎదుర్కోనేందుకు మొగ్గు చూపాడు. చాలాసేపు స్పిన్ బంతులపైనే ప్రాక్టీస్ చేశాడు. రవీంద్ర జడేజా, రిషభ్ పంత్‌లు కూడా త్రోడౌన్ స్పెషలిస్టుల బంతుల్ని ఆడారు. సోమవారంతో భారత్ జట్టు మూడు ప్రాక్టీస్ సెషన్లను పూర్తి చేసుకుంది. మ్యాచ్‌కు మూడు రోజుల సమయం ఉండటంతో మరో రెండు సెషన్లు ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో గడపనున్నారు. ముగ్గురు స్పిన్నర్లతో... చెపాక్ పిచ్ స్పిన్నర్లకు స్వర్గధామం కావడంతో భారత్ ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పెషలిస్టు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశముంది. అనుభవజు్ఞలైన అశి్వన్, జడేజాలతో కుల్దీప్ యాదవ్‌కు తుది జట్టులో దాదాపు బెర్త్ ఖాయమనిపిస్తోంది. దీంతో బ్యాటింగ్‌లోనూ మెరిపిస్తున్న స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు ఈ మ్యాచ్‌లో చోటు లేనట్లే! పేసర్ల విషయానికొస్తే బుమ్రాతో సిరాజ్ బంతిని పంచుకుంటాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగమైన ఈ రెండు టెస్టుల ద్వైపాక్షిక సిరీస్‌లో తొలి టెస్టు ఎంఎ చిదంబరం మైదానంలో గురువారం నుంచి జరుగుతుంది. బంగ్లాదేశ్ ఆటగాళ్లు కూడా... ఆదివారం చెన్నై చేరుకున్న బంగ్లాదేశ్ జట్టు క్రికెటర్లు కూడా సోమవారం నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. పాక్‌ను వారి సొంతగడ్డపై వైట్‌వాష్ చేసి ఊపు మీదున్న బంగ్లాదేశ్... ప్రపంచ రెండో ర్యాంకర్ భారత్‌ను ఓడించడమే లక్ష్యంగా నెట్స్‌లో చెమటోడ్చుతోంది. బ్యాటర్లు లిటన్ దాస్, ముష్ఫికర్ రహీమ్, మహ్ముదుల్ హసన్, జాకిర్ హసన్, షాద్మన్ ఇస్లామ్‌లు భారీషాట్లపై కసరత్తు చేశారు. త్రోడౌన్ స్పెషలిస్టులపై స్ట్రెయిట్ డ్రైవ్ షాట్లు ఆడారు. స్పిన్నర్లకు కలిసొచ్చే చెన్నై పిచ్‌పై సత్తా చాటేందుకు తైజుల్ ఇస్లామ్, నయీమ్ హసన్‌లు బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. -
Ind vs SL: ప్రాక్టీస్ సెషన్లో గంభీర్ కోహ్లి.. ఫొటోలు వైరల్
-
ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్, ముంబయి ఆటగాళ్ల ప్రాక్టీస్ (ఫొటోలు)
-
US: అమెరికాలో భక్తి ఇంతలా ఉంటుందా?
అందరి దేశం అమెరికా. ఏ ఒక్క జాతికో మతానికో పరిమితమైన దేశం అనే పరిస్థితి మాత్రం అక్కడ లేదు. నానా జాతులు, భిన్న మతస్తులు, ఎన్నో సంస్కృతుల వారంతా కలిసి అమెరికా సంయుక్త రాష్ట్రాల పేర ఒక ఆధునికమైన దేశాన్ని నిర్మించుకున్నారు. ఒక కొత్త సంస్కృతికి బాటలు వేశారు. అమెరికాలోని యాభై రాష్ట్రాల్లోనున్న జనాభా దాదాపు దాదాపు 33 లేదా 34 కోట్లు మాత్రమే, మన దేశంతో ( 140 కోట్ల పైనే ) పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. యూ ఎస్ జనాభాలో తెల్లవారు దాదాపు 75 శాతం ( వైట్స్ 57, లాటినోస్ 18 ) నల్లవారు 12 శాతం, మిగతా వారు అమెరికా భూమి పుత్రులైన రెడ్ ఇండియన్స్, ఆసియా, ఫసిఫిక్ వగైరా దేశస్తులు. మత పరంగా చూసినప్పుడు 2022 అంచనా ప్రకారం క్రిస్టియన్ ప్రొటెస్టెంట్లు (34 శాతం ) ముందు వరసలో వారి తర్వాతి స్థానం ( 23 శాతం ) క్యాతోలిక్స్ది. యూదులు 2 శాతం కాగా, ఇతర చిన్న మతాల వారు 3 శాతం లేదా ఏ మతంతో సంబంధం లేదు అనేవారు 38 శాతం అమెరికాలో ఏ పట్టణానికి వెళ్లినా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రముఖమైన అన్ని మతాల ప్రార్థణా మందిరాలు కనబడతాయి. ముఖ్యంగా మెజారిటీ వర్గానికి సంభందించిన చర్చిలకు కొదవ లేదు. అయితే వీటికి రెగ్యులర్‌గా హాజరు అయ్యేవారి సంఖ్య మాత్రం అంతంతేనని చెప్పవచ్చు. ఇక్కడ భక్తులను ఆకర్షించడానికి నిర్వాహకులు ఎన్నో మార్గాలు వెతుకుతున్నారు. అందులో భాగమే ఉచిత వారాంత లంచ్‌లు, వైద్య శిభిరాలు, ఆస్పత్రులు, అనాథ, వృద్ధ ఆశ్రమాలు, విద్యా సంస్థల నిర్వహణ వంటివి. అవి ఏవైనా, ఏ మతం వారు చేసినా "మానవ సేవే మాధవ సేవ"గా భావించి చేసిన కార్యక్రమాలతో పేద వర్గాలకు అంతో ఇంతో మేలు జరుగుతుంది. అమెరికన్ చర్చిల్లో ఎక్కువగా కనబడేవారు అక్కడ స్థిరపడిన చైనా, దక్షిణ కొరియా ,జపాన్, తైవాన్, థాయిలాండ్, వియత్నాం, మెక్సికో, టర్కి, జర్మనీ తర్వాత మనవారు. అమెరికా వైశాల్యంలో భారత్ కన్నా చాలా పెద్ద దేశం. వాళ్లకు భూమి కొరత లేదు. అందుకే అక్కడి ప్రార్థణా స్థలాలు ఏ మతం వారివైనా విశాలమైన ప్రాంగణాల్లో ఉంటాయి. రోడ్ల పక్క, కూడళ్లలో ఎక్కడ ఉచిత స్థలం దొరికితే అక్కడ ప్రార్థణా స్థలాలు నిర్మించడం, మైకులు పెట్టి శబ్ద కాలుష్యం సృష్టించడం వాళ్లకు నచ్చదు. కాకపోతే కరపత్రాలు వేస్తారు, పత్రికల్లో ప్రకటనలు ఇస్తారు, ప్రచార సాహిత్యాన్ని పంచుతారు, ఎలక్ట్రానిక్ మీడియాను వాడుకుంటారు. అమెరికన్ చర్చిల్లో చాలాచోట్ల ఆటస్థలాలు, ప్లే స్కూల్లు, గ్రంధాలయాలు, సమావేశ మందిరాలు ఉంటాయి. ఇక పార్కింగ్ స్థలాల గురించి చెప్పే పని లేదు. ఆ సౌకర్యం లేకుండా వాళ్ళు అలాంటి నిర్మాణాలను అనుమతించకపోవడం విశేషం. క్రైస్తవేతర మతాలయాల విషయంలో హిందువులు, ముస్లింలు, బౌద్దులు ముందున్నారని చెప్పవచ్చు. అమెరికాలోని ఏ రాష్ట్రానికి వెళ్లినా భారతీయులు కనబడుతారు ముఖ్యంగా మన తెలుగువారికి కొదువ లేదు, అదే విధంగా హిందూ దేవుళ్ళు దర్శన మిస్తారు. ఒక అంచనా ప్రకారం ఆ దేశంలో నున్న హిందువుల సంఖ్య దాదాపు రెండున్నర మిలియన్లు. హిందూ ఆలయాల్లో ప్రసిద్ధమైనవి పిట్స్ భర్గ్ వెంకటేశ్వరాలయం, న్యూ జెర్సీ, అట్లాంటా , హ్యూస్టన్‌లోని స్వామి నారాయణ్ అక్షరధాంలు, వెస్ట్ వెర్జినియాలోని బృందావనం, మేరీలాండ్‌లోని శివ విష్ణు ఆలయం, న్యూయార్క్ గణేష, ఇవేకాక మీనాక్షి , హనుమాన్, సాయిబాబా వంటి మందిరాలు మనకు ఎన్నో చోట్ల దర్శనం ఇస్తాయి. హరే కృష్ణ, రామకృష్ణ మిషన్, చిన్మయ మిషన్, గురు రవిశంకర్ గారి ఈషా యోగా ధ్యాన కేంద్రాలు, గతంలో ఒక వెలుగు వెలిగిన మహేష్ యోగి, ఓషో వంటి వారివి ఇలా అక్కడ తమ కార్యకలాపాలు సాగించిన భారతీయ ఆధ్యాత్మిక కేంద్రాలు ఎన్నో. ఇలాంటివి భారతీయులు కలుసుకోడానికి, సేవా కార్యక్రమాలు చేపట్టడానికి, పరస్పరం సహాయ సహకారాలు అందించుకోడానికి కూడా ఉపయోగ పడుతున్నాయి. ఈ మందిరాల నిర్వాహకులు భారత్ నుంచి తరచుగా గురువులను, ప్రభోదకులను ఆహ్వానించి పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటివాటి వల్ల భారత్ నుంచి అమెరికా వెళ్లిన వాళ్లకు కూడా స్వదేశంలో ఉన్న భావన కలగడం సహజం . నేను 2006 మొదలు 2022 వరకు ఒక దశాబ్దంన్నర కాలంలో పదికి పైగా పర్యాయాలు ఒకసారి జంటగా మరోసారి ఒంటరిగా, అమెరికాలోనున్న మా పిల్లలను చూడడానికి వెళ్ళిన ప్రతిసారి ఏవోకొన్ని పర్యాటక ప్రాంతాలను, అక్కడి హైందవ ఆలయాలను దర్శించు కున్నప్పుడు ఆ దేశస్తుల్లో గమనించిన పరమత సహనం ప్రశంసనీయం ! వేముల ప్రభాకర్ (చదవండి: విమానం కన్నా హాయిగా అమెరికాలో బస్సు జర్నీ!) -
భారత్‌లో యూకే, కెనడా సీఏల ప్రాక్టీస్
న్యూఢిల్లీ: భారత్‌లో విదేశీ సీఏలను ప్రాక్టీస్‌కు అనుమతించే అంశం భారతీయ చార్టర్డ్ అకౌంటెంట్లకు కూడా ప్రయోజనకరంగా ఉండాలని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) తెలిపింది. యూకే, కెనడా దేశాలు తమ దగ్గర భారత సీఏలు ప్రాక్టీస్ చేసుకునేందుకు అనుమతిస్తేనే ఆయా దేశాల సీఏలు కూడా ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించేందుకు (రెసిప్రొకల్) అనుమతించవచ్చని పేర్కొంది. యునైటెడ్ కింగ్డం (యూకే), కెనడాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై (ఎఫ్‌టీఏ) జరుగుతున్న చర్చల్లో ఈ అంశం కూడా పరిశీలనలో ఉంది. ఒకవేళ ఇది సాకారమైతే తొలిసారిగా భారత్‌లో విదేశీ చార్టర్డ్ అకౌంటెంట్లు కూడా ప్రాక్టీసు చేసేందుకు వీలవుతుంది. ఆస్ట్రేలియాతో కూడా ఈ తరహా ఒప్పందంపై చర్చలు జరుగుతున్నట్లు ఐసీఏఐ కొత్త ప్రెసిడెంట్ రంజిత్ కుమార్ అగర్వాల్ తెలిపారు. రెసిప్రోకల్ సిస్టమ్ అమల్లోకి వచ్చాక విదేశీ సీఏలు భారత్‌లో కార్యకలాపాల నిర్వహణ కోసం ఐసీఏఐలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. యూకే, కెనడా, ఆ్రస్టేలియా మొదలైనవి అభివృద్ధి చెందిన దేశాలని, అక్కడి వారిని ఇక్కడ అనుమతిస్తే, ఇక్కడి సీఏలు కూడా అక్కడికి వెళ్లడానికి వీలుంటుందని అగర్వాల్ పేర్కొన్నారు. వర్ధమాన దేశమైన భారత్ సీఏలు అభివృద్ధి చెందిన దేశాలకు వెళ్లే అవకాశం లభించడం వల్ల మనవారికి ప్రయోజనకరంగా ఉండగలదని చెప్పా రు. సామర్థ్యాలు, అనుభవం కారణంగా భారతీయ సీఏలకు విదేశాల్లో గణనీయంగా డిమాండ్ ఉందన్నారు. మరోవైపు, స్థూల దేశీయోత్పత్తిలో పన్ను వాటాల నిష్పత్తిని మెరుగుపర్చేందుకు కేంద్రానికి సిఫార్సులు చేయనున్నట్లు అగర్వాల్ తెలిపారు. అటు కృత్రిమ మేథ (ఏఐ) వినియోగంతో సీఏలకు గణనీయంగా సమయం ఆదా కాగలదని చెప్పారు. ప్రస్తుతం 42,000 మంది పైచిలుకు భారతీయ సీఏలు విదేశాల్లో పని చేస్తున్నారు. ఐసీఏఐ అంచనా ప్రకారం వచ్చే 20–25 ఏళ్లలో 30 లక్షల మంది పైగా చార్టర్డ్ అకౌంటెంట్లు అవసరమవుతారు. ఐసీఏఐలో ప్రస్తుతం 4 లక్షల మంది సభ్యులు, 8.5 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. -
మంచుతో నిప్పు పుట్టించవచ్చా? అదెలా సాధ్యం?
నిప్పు- నీరు ఒకదానికొకటి పూర్తిగా భిన్నమైనవి. నిప్పు ఉన్న చోట నీరు ఉండదు. నీరు ఉన్న చోట నిప్పు ఉండలేదు. అయితే ఐస్‌తో కూడా నిప్పు పెట్టొచ్చని చెబితే నమ్ముతారా? సైన్స్ సహాయంతో ఈ అద్భుతం ఎలా జరుగుతుందో ఈ కథనంలో తెలుసుకుందాం. సైన్స్ చేసే ఈ అద్భుతం 6వ తరగతి పుస్తకంలో దాగి ఉంది. ఈ ప్రయోగం కుంభాకార లెన్స్ చుట్టూ తిరుగుతుంది. లెన్స్ ఉపయోగించి సూర్యకాంతి సహాయంతో నిప్పును మండించడాన్ని మీరు చూసే ఉంటారు. మంచుతో నిప్పును పుట్టించే ప్రయోగం కూడా ఇలానే సాగుతుంది. మంచుతో నిప్పు పుట్టించాలంటే ముందుగా పారదర్శక మంచు అవసరం. ఈ పారదర్శక మంచు ముక్క కుంభాకార లెన్స్ మాదిరిగా పని చేస్తుంది. ఈ మంచు ముక్క నుంచి సూర్యకాంతిని బయటకు ప్రసరింపజేసి, అది కాగితంపై పడేలా చేస్తే, కొంత సమయం తరువాత ఆ కాగితం నుండి పొగ రావడం ప్రారంభమవుతుంది. తరువాత కాగితంపై మంటలు వ్యాపించడాన్ని గమనించవచ్చు. మంచును కుంభాకార లెన్స్‌గా ఉపయోగించి, మంటలను పుట్టించవచ్చని తెలుసుకున్నాం. అయితే మంచును కుంభాకార లెన్స్‌గా ఎలా తయారు చేయాలనే ప్రశ్న ఎదురవుతుంది. ఇందుకోసం ముందుగా పారదర్శక మంచు ముక్కను తీసుకోవాలి. చాకు సాయంతో ఆ మంచుకు లెన్స్ ఆకారాన్ని ఇవ్వాలి. తర్వాత చేతులతో రుద్ది లెన్స్ మాదిరిగా తయారు చేయాలి. లెన్స్ ఎంత పెద్దదిగా ఉంటే నిప్పు అంత ప్రకాశవంతంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. లెన్స్ మందం 2 అంగుళాలు, వ్యాసం 6 అంగుళాలు ఉంటే అప్పుడు నిప్పు వేగంగా వ్యాపిస్తుంది. -
సరైన ఆచరణతోనే సంపద సృష్టి!
సంపద సృష్టికర్తల్లో ఎవరి జీవితాన్ని పరిశీలించి చూసినా.. సమయానికి ఎంతో ప్రాధాన్యత కనిపిస్తుంది. ప్రణాళిక, ఆచరణ, క్రమశిక్షణ కనిపిస్తాయి. సంపద సృష్టించాలంటే కాలం విలువ తెలిసి ఉండాలి. ఇవాళ కాకపోతే రేపు, ఈ ఏడాది కాకపోతే వచ్చే ఏడాది ఇలాంటి ధోరణి అస్సలు పనికిరాదు. దీనివల్ల కేలండర్లో సంవత్సరాలు మారుతుంటాయే కానీ, ఆశించిన ఫలితాలు కానరావు. కొత్త సంవత్సరం తనకు అనుకూలంగా ఉండాలని, అనుకున్నవి సాధించాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ, ఆచరణ లోపంతో దానికి దూరంగా ఉండిపోతుంటారు. అన్నీ ఒకేసారి సాధించేద్దామని అనుకుంటే, ఫలితాలు ఆలస్యం అవుతాయి. అందుకుని ప్రణాళిక మేరకు అడుగులు వేయాలి. నూతన సంవత్సరంలో ఏం సాధించాలనుకుంటారో, అవి వాస్తవికంగా ఉండాలి. అప్పుడే చక్కని ఫలితాలు కనిపిస్తాయి. ఏడాది కాలానికి కార్యాచరణ ప్రణాళిక అంటే, అందుకు తగినంత సమయం కేటాయించాలి. సంపద సృష్టించాలనే ఆకాంక్ష కలిగిన వారు కొత్త సంవత్సరంలో ఆ దిశగా అమల్లో పెట్టాల్సిన ఆచరణ ఎలా ఉండాలో నిపుణులు తెలియజేస్తున్నారు. మనీ ఒక్కటేనా..? అందరికీ ధనం కావాల్సిందే. అందులో సందేహం లేదు. కానీ, మనిషి ఎప్పుడూ డబ్బు చుట్టూ పరుగెత్తడం సరైనది అనిపించుకోదు. తండ్రి లేదా తల్లి కావచ్చు. కుమారుడు లేదా కుమార్తె కావచ్చు. జీవిత భాగస్వామి, స్నేహితులు, సహోద్యోగులు, శ్రేయోభిలాషులు.. ఇలా మన చుట్టూ పెద్ద ప్రపంచమే ఉంది. దాన్ని కూడా పట్టించుకోవాలి. సమాజంలో మంచి వ్యక్తిగా గుర్తింపూ అవసరమే. మనీ లైఫ్‌తోపాటు ఇతరత్రా అన్నీ మేళవించినప్పుడే నిజమైన ఆనందం లభిస్తుంది. అస్తమానం డబ్బు గురించే ఆలోచిస్తూ, వేదన చెందుతుంటే అదొక వైరల్ వ్యాధిగా మారిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే జీవితంలో అన్నింటికీ సమతుల్యత అవసరం. దీర్ఘ ప్రయాణం సంపద సృష్టించడం అన్నది ఇన్స్టంట్ నూడుల్స్ చేసుకున్నంత ఈజీ కాదు. అదొక దీర్ఘకాలిక పరుగు. దశాబ్దాల పాటు స్థిరమైన పెట్టుబడులతో సాగిపోయేది. ప్రణాళిక మేరకు అడుగులు వేసేది. కొత్త సంవత్సరంలో సంపద సృష్టికి బీజం వేసుకోవాలే కానీ, సంపద సృష్టిని ఏడాదిలోనే సాధించేయాలంటే అది ఆచరణసాధ్యం కాదు. క్రమం తప్పకుండా ఆదాయం నుంచి పొదుపు చేస్తూ, ఆ పొదుపును ఏటా పెంచుకుంటూ, మెరుగైన రాబడినిచ్చే సాధనాల్లోకి పెట్టుబడిగా మళ్లిస్తూ సాగిపోవాల్సిన సుదీర్ఘ ప్రయాణం. కనుక షార్ట్ కట్స్, ఇన్స్టంట్స్ అంటూ ఇందులో దారులు వెతుక్కోవడం వల్ల ఫలితం ఉండదు. ఎంత వీలైతే అంత మొత్తంతో మొదట పెట్టుబడిని ఆరంభించాలి. దాన్ని కొనసాగించాలి. సంపద అంటే..? సంపద అంటే డబ్బు, బంగారం, పెట్టుబడులు, ప్రాపరీ్టలే కాదు. మంచి ఆరోగ్యం కూడా గొప్ప సంపదే అవుతుంది. సంపద కోసం ఆరోగ్యం పాడు చేసుకుంటే, ఆ తర్వాత అదే సంపదతో ఆరోగ్యం కొనుక్కుందామంటే సాధ్యపడకపోవచ్చు. ఆరోగ్యంగా ఉంటేనే సంపద సృష్టి కోసం సుదీర్ఘ ప్రయాణాన్ని సాగించగలరు. తద్వారా మరింత సంపదను సమకూర్చుకోగలరు. అనారోగ్యకర అలవాట్లను విడిచి పెట్టాలి. ఆరోగ్యకరమైన, పోషకాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. యోగ, మెడిటేషన్, వ్యాయామాలు వంటి వాటికి రోజూ కొంత సమయం కేటాయించాలి. ఆదాయం.. వ్యయం.. ఆదాయం కంటే వ్యయానికి ఆర్థిక శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. చాలా మంది ఎలాంటి ప్రణాళిక లేకుండా ఖర్చు చేస్తుంటారు. మంచి డిస్కౌంట్ ఆఫర్లు కనిపించిన వెంటనే కొనుగోలు చేస్తుంటారు. క్రెడిట్ కార్డ్‌పై చాలా తక్కువకే వస్తుందని కొనుగోలు చేస్తుంటారు. ఇవన్నీ విక్రయాలు పెంచుకోవడానికి కంపెనీలు చేసే మార్కెటింగ్ వ్యూహాలు. వాటి ఆకర్షణలో పడకుండా చూసుకోవాలి. సంపద సృష్టించాలనే పట్టుదల ఉన్న వారు మొదట వ్యయాలపై అదుపు సాధించాలి. వస్తున్న ఆదాయంలో వ్యయాలను 60–80 శాతానికి మించకుండా అదుపు చేసుకోవాలి. ఎంత సంపాదించామన్నది కాకుండా, ఎంత పొదుపు చేశామనే తత్వంతో ముందుకు సాగాలి. అవసరాలకే కొనుగోళ్లు పరిమితం కావాలి. అంటే ఇంటి అద్దె, పిల్లల స్కూల్ ఫీజు, కిరాణా, పాలు, కూరగాయలు, యుటిలిటీ బిల్లులు ఇవన్నీ అవసరాలు. రెస్టారెంట్లో తినడం, సినిమాలు, టూర్లు ఇవన్నీ కోరికలు. వెసులుబాటు ఉంటేనే కోరికలకు బడ్జెట్లో కేటాయింపులు చేయాలి. అవసరాలు, కోరికలకు కేటాయింపుల తర్వాత కూడా ఆదాయంలో 40 శాతాన్ని పెట్టుబడిగా మళ్లించారంటే సంపద సృష్టి అనుకున్నదానికంటే ముందే సాధ్యపడుతుంది. సరైన సాధనాలు సంపాదనలో పొదుపుతోనే ఆగిపోకూడదు. ఆ పొదుపు మదుపుగా మారినప్పుడే సంపద సాధ్యపడుతుంది. ఈ మార్గంలో ఎంపిక చేసుకునే పెట్టుబడి సాధనాలు కీలక పాత్ర పోషిస్తాయి. జీవిత బీమా ఎండోమెంట్ ప్లాన్లు, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లను పెట్టుబడి సాధనాలుగా చూడకూడదు. ద్రవ్యోల్బణం తరుగు తీసిన తర్వాత ఈ సాధనాల్లో మిగిలేదీ ఏమీ ఉండదు. రాబడితోపాటు, అవసరమైనప్పుడు నగదుగా మార్చుకునే లిక్విడిటీ కూడా మెరుగ్గా ఉండాలి. ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్స్ మేలైనవి. వీటితోపాటు వెసులుబాటును బట్టి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్)లలోనూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈక్విటీలతోపాటు, రియల్ఎస్టేట్, బంగారం దీర్ఘకాలంలో మెరుగైన రాబడిని తెచ్చి పెట్టినట్టు గణాంకాలు చెబుతున్నాయి. పెట్టుబడుల్లో స్థిరత్వం కోసం కొంత డెట్ సాధనాలకూ చోటు ఇవ్వొచ్చు. గ్యారంటీడ్ రాబడి అనే ఉత్పత్తుల ఆకర్షణలో పడొద్దు. పన్ను ఆదా కోరుకునే వారు సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల కోసం ఈఎల్ఎస్ఎస్, ఎన్పీఎస్ వంటి పథకాలను పరిశీలించొచ్చు. పిల్లల స్కూల్ ట్యూషన్ ఫీజులు, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం, రుణంపై ఇల్లు కొనుగోలు చేస్తే, అసలు, వడ్డీపైనా పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందొచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌లో వేలాది పథకాలున్నాయి. నిపుణుల సాయంతో నాలుగైదు పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. ఫండ్స్‌లో ఎన్‌ఎఫ్‌వోల కంటే ట్రాక్ రికార్డు ఉన్న పథకాలను ఆశ్రయించడమే మెరుగైనది అవుతుంది. లిస్టింగ్ రోజున లాభాల కాంక్షతో ఐపీవోను ఎంపిక చేసుకోవద్దు. మంచి కంపెనీ, ఆకర్షణీయమైన వ్యాల్యూషన్లలో వస్తే దీర్ఘకాలానికి ఐపీవో మార్గంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అప్పుడు లిస్టింగ్‌లో లాభం వస్తే విక్రయించుకోవచ్చు. రాకపోతే పెట్టుబడిని కొనసాగించుకోవచ్చు. ఇతరులను అనుసరించడం ట్రేడింగ్‌తో రోజులో రూ.10వేలు, రూ.లక్ష సంపాదించుకోవచ్చనే ప్రకటనలు చూసి మోసపోవద్దు. తాము నేరి్పంచే స్ట్రాటజీతో ట్రేడింగ్‌లో రూ.లక్షలు సంపాదించొచ్చనే సోషల్ మీడియా ప్రకటనలకు ఆకర్షితులు కావొద్దు. స్వీయ అధ్యయనంతో పెట్టుబడి సాధనాలను అర్థం చేసుకోవాలి. లేదంటే ఫైనాన్షియల్ ప్లానర్లు లేదా అడ్వైజర్ల సాయం తీసుకోవాలి. సంపన్న ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోని అనుకరించడం సరికాదు.తోటి ఇన్వెస్టర్ల సలహా, సూచనలను గుడ్డిగా అనుసరించొద్దు. ప్రతి ఇన్వెస్టర్ రిస్క్, ఆకాంక్షలు వేర్వేరుగా ఉంటాయి. ఆర్థిక రక్షణ మెరుగైన కవరేజీతో కుటుంబం అంతటికీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మొదట చేయాల్సిన పని. దీనివల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, పొదుపు, పెట్టుబడులకు విఘాతం కలగకుండా, హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీతో గట్టెక్కొచ్చు. నలుగురు సభ్యుల కుటుంబానికి కనీసం రూ.10 లక్షల కవరేజీ, అపరిమిత రీస్టోరేషన్ సదుపాయంతో తీసుకోవాలి. ఇక అనుకోనిది జరిగితే కుటుంబం ఆర్థిక కష్టాల పాలు కాకుండా ఉండేందుకు, మెరుగైన కవరేజీతో టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కూడా తీసుకోవాలి. కనీసం 20 ఏళ్ల కుటుంబ అవసరాలను తీర్చే స్థాయిలో కవరేజీ ఉండాలి. ప్రమాదం కారణంగా ఏర్పడే నష్టాన్ని భర్తీ చేసే కవరేజీ కూడా ఉండాలి. ఇంటికి, ఇంట్లోని విలువైన వాటికి బీమా ప్లాన్ తీసుకోవాలి. ఇక అన్నింటికంటే ముఖ్యంగా కనీసం ఆరు నెలల అవసరాలను తీర్చే అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. రాబడి ఒక్కటే కాదు.. పెట్టుబడి కోసం ఎంపిక చేసుకునే సాధనం విషయంలో రాబడి ఒక్కటే ప్రామాణికం కాకూడదు. సంబంధిత ఉత్పత్తిలో ఉండే రిస్‌్కను కూడా మదింపు వేయాలి. తమ రిస్క్ సామర్థ్యానికి తగినట్టుగానే ఉందా? అని విశ్లేషించుకోవాలి. ఉదాహరణకు 2020 మార్చి కరోనా విపత్తు సమయంలో ఈక్విటీ మార్కెట్ 40 శాతానికి పైగా పతనమైంది. విడిగా కొన్ని స్టాక్స్ 80–90 శాతం వరకు పడిపోయాయి. అలాంటి సమయాల్లో పెట్టుబడుల విలువ గణనీయంగా పడిపోతుంది. ఆ నష్టాన్ని చూసి భయపడిపోకూడదు. ఈక్విటీలకు ఆటుపోట్లు సహజం. కాలవ్యవధి అనేది సాధనాలను ఎంపిక చేసుకోవడానికి కీలకం. ఆటుపోట్లు ఎదురైనా, ధైర్యంగా కొనసాగించే వారే వీటిని ఎంపిక చేసుకోవాలి. ఈక్విటీల్లో అస్థిరతలు ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో మెరుగైన రాబడి వస్తుంది. రిస్క్ వద్దనుకుంటే, రాబడిలో రాజీపడి డెట్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. తప్పులకు దూరంగా.. పెట్టుబడుల్లో వీలైనంత వరకు తప్పులకు చోటు లేకుండా చూసుకోవాలి. అయినా కానీ తప్పులు జరగవన్న గ్యారంటీ ఏమీ ఉండదు. ఫండ్ మేనేజర్లు సైతం తమ ప్రయాణంలో తప్పులు చేస్తుంటారు. కాకపోతే చేసిన తప్పును వేగంగా గుర్తించి, దాన్ని సరిదిద్దుకోవడం తెలియాలి. ఫండ్స్‌లో మానవ తప్పిదాలకు చోటు లేకుండా ఉండాలంటే ఇండెక్స్ ఫండ్స్ ఉత్తమమైనవి. నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారు ఎంతో ఆచితూచి వ్యవహరించాలి. మెరుగైన స్ట్రాటజీ, చక్కని అవగాహన, స్థూల ఆర్థిక అంశాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రభుత్వ, ఆర్బీఐ పాలసీలు, కరెన్సీ మారకం తదితర ఎన్నో అంశాలను వేగంగా అర్థం చేసుకునే నైపుణ్యాలు అవసరం. అంత సమయం లేకపోతే ఆ భారం ఫండ్ మేనేజర్లపై వేయాలి. లక్ష్యం.. ప్రణాళిక ప్రతి లక్ష్యానికీ విడిగా ప్రణాళిక అవసరం. సొంతిల్లు, కారు, రిటైర్మెంట్, పిల్లల విద్య, వివా హం ఇవన్నీ అందరికీ ఉండే ముఖ్యమైన భవిష్యత్ లక్ష్యాలు. తమ ఆదాయం నుంచి విడిగా ఒక్కో దానికి ఎంత చొప్పున కేటాయిస్తే, వాటిని చేరుకోవచ్చన్న దానికి స్పష్టత ఉండాలి. అవసరమైతే ఈ విషయంలో నిపుణుల సాయం తీసుకోవాలి. రుణాలు–చెల్లింపులు తప్పనిసరి అయితేనే రుణం తీసుకోవాలి. తీసుకుంటే దాన్ని తీర్చివేయడానికే మొదట ప్రాధాన్యం ఇవ్వాలి. రుణ చెల్లింపుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వైఫల్యం లేకుండా చూసుకోవాలి. నామినేషన్ చివరిగా అన్ని ఆర్థిక సాధనాలకూ నామినేషన్ ఇవ్వడం తప్పనిసరి. బ్యాంక్ ఖాతాలు, మ్యూచువల్ ఫండ్స్, బీమా పథకాలు, డీమ్యాట్ ఖాతాలు, ఈపీఎఫ్ ఇలా ప్రతి సాధనానికీ నామినేషన్ లేకపోతే వెంటనే నమోదు చేయాలి. మార్గమిది... లక్ష్యాల్లో వాస్తవికత: జనవరి 1 నుంచే రోజూ 5 కిలోమీటర్ల నడక లేదా పరుగు ఆచరణలో పెట్టాలని కోరుకోవచ్చు. మొదటి రోజే 5 కిలోమీటర్లు సాధ్యం కానప్పుడు ఒక కిలోమీటర్‌తో ఆరంభిస్తే, క్రమంగా కొన్ని రోజుల్లో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు. సామర్థ్యాలకు తగినట్టుగా కార్యాచరణ అవసరం. ఎంత వీలైతే, అంత మొత్తంతో ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించాలి. స్థిరత్వం: పెట్టుబడుల ప్ర పంచంలో ప్రేరణ కంటే స్థిర త్వానికే ప్రాముఖ్యం ఇస్తారు. ప్రేరణ అనేది కొన్ని రోజులు, నెలల పాటే ఉండొచ్చు. కానీ, స్థిరత్వం అన్నది విజయానికి కీలకం . ఇన్స్టంట్ సక్సెస్: స్వల్ప కాలంలో సంపద పోగేయాలన్నట్టుగా కొందరు ఇన్వెస్టర్ల ధోరణి ఉంటుంది. కానీ, జీవితం అందరికీ ఒకే విధంగా నడవదు. ఫలితాలకు తగినంత వ్యవధి ఇచి్చనప్పుడే సాధన సులభమవుతుంది. ఇక్కడ ఓపిక, క్రమశిక్షణ, అంకితభావం కీలకం అవుతాయి. కృషి: ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహా పురుషులు అవుతారు’అని ఓ సినీ కవి చెప్పినట్టు.. చేసుకున్న తీర్మానాలను విజయవంతంగా చేరుకోవడం కంటే కూడా, దాన్ని సాధించడానికి మీరు చేసిన ప్రయత్నాలు, కృషి ఇక్కడ కీలకం అవుతాయి. ప్రతి నెలా ఆదాయంలో 50 శాతాన్ని ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ, అది సాధ్యం కావ డం లేదని దాన్ని పక్కన పెట్టేయడం విజయానికి చేరువ చేయదు. కనీసం 20–30–40 శాతం మేర అయినా ఆదాతో మొదలుపెట్టి, ఆ తర్వాత దాన్ని మరింత పెంచుకోవచ్చు. ఆర్థిక అంశాలపై పట్టు: ఆర్థికంగా విజయం సాధించాలని కోరుకునే వారికి అందుకు సంబంధించి ప్రాథమిక అంశాలు తప్పకుండా తెలిసి ఉండాలి. ఆర్థిక అంశాలను అర్థం చేసుకోవడం, వాటిని అమలు చేయడం, వ్యక్తిగత ఆర్థిక అంశాల నిర్వహణ, బడ్జెట్, పొదుపు, పెట్టుబడులు, రుణాలు వీటన్నింటి గురించి తెలియాలి. ఆర్థిక, పెట్టుబడి సూత్రాలపై అవగాహన ఉండాలి. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, ఈల్డ్స్ తెలిసి ఉండాలి. -
విశాఖలో భారత్ టి20 టీం ప్రాక్టీస్ (ఫొటోలు)
-
భారతీయ వైద్య విద్యార్థులకు గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ: భారతీయ వైద్య విద్యార్థులకు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ గుడ్ న్యూస్ అందించింది. ఇకపై భారత్‌లో మెడికల్ గ్రాడ్యూయేట్ పూర్తి చేసిన విద్యార్థులు విదేశాల్లో కూడా ప్రాక్టిస్ చేయోచ్చని పేర్కొంది. ఈ మేరకు రల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యూకేషనల్ (WFME) నుంచి జాతీయ వైద్య మండలి (NMC) పది సంవత్సరాల వరకు గుర్తింపు పొందింనట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ గుర్తింపుతో భారత్‌లో వైద్య విద్యనభ్యసించిన వారు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్‌లలో పీజీ కోర్సుల్లో చేరడంతో పాటు ప్రాక్టీస్ చేయవచ్చు. 2024 నుంచి భారతీయ వైద్య విద్యార్థులు విదేశాల్లో విద్య, ప్రాక్టీస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వెసులుబాటుతో ఇప్పటికే దేశంలో ఉన్న 706 మెడికల్ కాలేజీలతోపాటు రాబోయే 10 ఏళ్లలో కొత్తగా ఏర్పాటు చేయబోయే కళాశాలలు డబ్ల్యూఎఫ్‌ఎమ్‌ఈ గుర్తింపు పొందనున్నాయి. దీని వల్ల దేశంలో వైద్య విద్య ప్రమాణాలు మెరుపడటమే కాకుండా భారతీయ వైద్య విద్యార్థులకు ప్రపంచ వ్యాప్తంగా అపార అవకాశాలు లభించనున్నాయి ఈ సందర్భంగా ఎన్ఎమ్సీలోని ఎథిక్స్ అండ్ మెడికల్ రిజిస్ట్రేషన్ బోర్డు సభ్యుడు యోగేందర్ మాలిక్ మాట్లాడుతూ.. WFME గుర్తింపుతో భారతీయ వైద్య విద్య అంతార్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుందన్నారు. దీనివల్ల భారతీయ వైద్య కళాశాలలకు, నిపుణులకు అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. భారతీయ విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడైనా తమ కెరీన్‌ను కొనసాగించవచ్చని తెలిపారు. ఎన్ఎమ్సీ అంతర్జాయంగా గుర్తింపు పొందడం ద్వారా విదేశీ విద్యార్థులను భారత వైద్య కళాశాలు ఆకర్షిస్తాయని చెప్పారు. కాగా డబ్ల్యూఎఫ్‌ఎమ్‌ఈ అనేది ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన వైద్య విధ్యను అందించేందుకు ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సంస్థ. డబ్ల్యూఎఫ్‌ఎమ్‌ఈ గుర్తింపు ప్రక్రియ కోసం ప్రతి వైద్య కళాశాల నుంచి 60 వేల డాలర్లు రుసుము వసూలు చేస్తోంది. దీంతో దేశంలోని 706 వైద్య కళాశాలలు డబ్ల్యూఎఫ్‌ఎమ్‌ఈ గుర్తింపు కోసం మొత్తంగా సుమారు 4,23,60,000 డాలర్లు ఖర్చు చేయనుంది. చదవండి: గణతంత్ర వేడుకలకు బైడెన్!.. ఆహ్వానించిన ప్రధాని మోదీ -
నేటి నుంచి వైజాగ్ ఓపెన్ గోల్ఫ్
విశాఖ స్పోర్ట్స్: ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఇండియా(పీజీటీఐ) ఆధ్వర్యంలో సోమవారం నుంచి ‘వైజాగ్ ఓపెన్ గోల్ఫ్ 2023’ ప్రారంభం కానుంది. ప్రొఫెషనల్ గోల్ఫ్‌ను ప్రోత్సహించే ఉద్దేశంతో పీజీటీఐ టోర్నీలు నిర్వహిస్తుండగా, విశాఖ ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ వేదికగా ఈ టోర్నీ జరగనుంది. తొలి రోజు ప్రాక్టీస్ రౌండ్స్ రెండో రోజు ప్రోటోర్నీ జరగనున్నాయి. 20 నుంచి 23వ తేదీ వరకు నాలుగు రౌండ్ల పాటు స్ట్రోక్ ప్లే ప్రధాన టోర్నీ జరగనుంది. ఈ సందర్భంగా ఆదివారం క్లబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్యదర్శి ఎంఎస్ఎన్ రాజు మాట్లాడుతూ ప్రోటోర్నీని వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ ప్రారంభించనుండగా.. విజేతలకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి బహుమతులు అందించనున్నారన్నారు. భారత్‌తో పాటు శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్‌కు చెందిన మేటి గోల్ఫర్స్ 126 మంది ఈ టోర్నీలో పాల్గొననున్నారని తెలిపారు. ఈ టోర్నీలో సత్తాచాటిన వారు ప్రైజ్‌మనీ పొందటంతో పాటు తమ ర్యాంకింగ్‌ను మెరుగుపర్చుకునేందుకు, అంతర్జాతీయ టోర్నీలో అర్హత సాధించేందుకు దోహదపడుతుందని వివరించారు. యూరోస్పోర్ట్స్, సోషల్ మీడియా, దూరదర్శన్ చానల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుందన్నారు. 1984లో నిరి్మంచిన ఈపీజీసీ ఉత్తమ పునఃనిర్మాణ గోల్ఫ్‌కోర్స్‌గానూ గతేడాది అవార్డు అందుకుందని చెప్పారు. -
మీ బ్రెయిన్ షార్ప్‌గా ఉండాలంటే.. ఇలా చేయండి..
సాధారణంగా యంగ్‌గా ఉన్నప్పుడు ఉన్నంత జ్ఞాపకశక్తి కాస్తా.. ఉండగా, ఉండగా..అంటే వృద్ధాప్యంకి చేరవయ్యేటప్పటికీ తగ్గిపోతుంది. అలా ఎందువల్ల జరగుతుందని, శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా పరిశోధనాలు చేస్తూ వచ్చారు. ఆ దిశలో ఎంతవరకు పురోగతి సాధించారో తెలియదు గానీ ..వారి అధ్యయనంలో అలా బ్రెయిన్ చురుకుదనం తగ్గిపోకుండా మునుపటిలా షార్ప్‌గా ఉండేలా ఏం చేయాలో కనుగొన్నారు. దీంతో వృద్ధాప్యంలో ఎదురయ్యే బ్రెయిన్‌కి సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు అంటున్నారు. అందుకు కొన్ని టెక్నిక్స్ ఫాలో అయితే చాలు మంచి జ్ఞాపకశక్తి మీ సొంతం అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ మేరకు వారు 70ల వయసు ఉన్న కొందరూ వృద్ధులపై పరిశోధనలు జరిపారు. వారందరికి ఒకేసారి వారికి ఇష్టమైన రంగాల్లో నైపుణ్యం సంపాదించేలా ట్రైనింగ్ ఇచ్చారు. వారంతా వారానికి 15 గంటలు హోంవర్క్ చేయడం, తరగతి గదుల్లో కూర్చోవడం వంటివి చేశారు. వారు కొత్తభాషలు, ఫోటోగ్రఫీ, వంటి ఇతరత్రా సృజనాత్మక కోర్సులను అభ్యసించడం వంటివి చేశారు. ఆ క్రమంలో వారికి తెలయకుండానే వారి మొదడు 30ల వయసులో ఉండే వారి బ్రెయిన్ మాదిరిగా షార్ప్‌గా ఉండటం గమనించారు. వారి చిన్నప్పటి జ్ఞాపకాలతో సహాఅన్ని చెబుతుండటం. ఠక్కున దేని గురించి అయినా చెప్పేయడం వంటివి జరిగాయి. దీంతో వారు మెదడును ఖాళీగా ఉంచకుండా మంచి వ్యాపకాలతోనే మనకి ఇష్టమైన అభిరుచిలతో బిజీగా ఉండేలా చేయడం చేస్తే.. మన మెదడులో పిచ్చిపిచ్చి ఆలోచనల ప్రవాహం తగ్గి చురుగ్గా ఉండటం ప్రారంభిస్తుందని అన్నారు. అలాగే ఎప్పటికప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడంపై దృష్టి సారించడం అనేది మీ మెదడుకు ఓ వ్యాయామంలా ఉండటమేగాక మీలో దాగున్న స్కిల్స్ బయటకు వస్తాయి. పైగా మీ బ్రెయిన్ కూడా ఆరోగ్యంగా ఉండి యువకుల్లో ఉండే మాదిరిగా చురుగ్గా బ్రెయిన్ ఉంటుందన్నారు. (చదవండి: అంతుతేలని ఇద్దరి యువతుల మిస్టరీ గాథ..చంపేశారా? మరణించారా!..) -
తప్పుడు వీడియో షేర్ చేస్తావా? అంటూ మహిళా అథ్లెట్‌పై కోచ్ భార్య దాడి
కర్ణాటక: కోచ్ భార్య మహిళా అథ్లెట్‌పై దాడి చేసిన ఘటన బెంగళూరులో జరిగింది. బిందురాణి అనే అథ్లెట్ ప్రాక్టీస్ కోసం కంఠీరవ స్టేడియం వెళ్లారు. అక్కడ శ్వేత అనే మహిళ బిందురాణిని నోటికొచ్చినట్లు తిట్టి చేయి చేసుకున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. కోచ్‌ల గ్రూప్‌లో ప్రైవేట్ కార్యక్రమం వీడియోను బిందు షేర్ చేసిందని, తప్పుడు వీడియోను షేర్ చేస్తావా అంటూ కోచ్ యతీశ్ భార్య శ్వేత దాడి చేసినట్లు తెలిసింది. ఆమైపె తాను అథ్లెటెక్ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు బిందురాణి తెలిపింది. -
హీహీహీ... హాహ్హాహ్హా అంతే!
నవ్వు ఆరోగ్యానికి మంచిదని మనందరికి తెలుసు. తీరికలేని లైఫ్‌స్టైల్, బాధ్యతలు, బరువులతో నవ్వడం కూడా మర్చిపోతున్నాం. ఇది చాలదన్నట్లు రెండేళ్లపాటు ప్రపంచాన్ని శాసించిన కరోనా పుణ ్యమా... ముఖానికి మాస్కుల తాళం పడింది. శానిటైజర్లు ఆవిరైపోయినట్లే ముఖాల మీద నవ్వులు మాయ మయ్యాయి. ఇప్పుడు చాలామందికి చక్కగా నవ్వడం ఎలాగో తెలియడం లేదు. ఈ జాబితాలో జపాన్ వాసులు ముందు వరుసలో ఉన్నారు. గత కొద్దికాలంగా నవ్వడం మర్చిపోయిన జపనీయులు ప్రస్తుతం నవ్వులు ్రపాక్టీస్ చేయడం కోసం కోచింగ్ సెంటర్లకు క్యూ కడుతున్నారు. ఇది కాస్త చిత్రంగా, మనకు నవ్వొస్తున్నా సరే... హహ్హా నవ్వుల కోసం వారు తెగ హడావుడి చేస్తున్నారు. నవ్వు ఆరోగ్యమేగాక, నవ్వడం వల్ల ముఖ కండరాలకు మంచి వ్యాయామం జరిగి ముఖం మరింత గ్లోగా కనిపిస్తుంది. ఒత్తిడి దూరమవుతుంది. ఎక్కడైనా పని లేదా ఉద్యోగం చేయాలన్నా ముఖం మీద చిరునవ్వు తప్పనిసరి. దానితోనే నలుగురితోపాటు ముందుకు సాగగలం. ఇదే విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న జపనీయులు శ్రద్ధగా నేర్చుకుని మరీ నవ్వుతున్నారు. అక్కడి స్మైలింగ్ కోచింగ్ సెంటర్లకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. కోవిడ్ ఆంక్షలు, కొన్ని రకాల ఫ్లూల వల్ల దాదాపు మూడేళ్లపాటు మాస్కులు ధరించిన జపనీయులు నవ్వడం మర్చిపోయారు. ప్రస్తుతం అక్కడి ప్రభుత్వం ఆంక్షలు సడలించడంతో ‘స్మైలింగ్ లెసన్స్’ నేర్చుకుంటున్నారు. చక్కగా నవ్వేందుకు ఏకాగ్రతతో పాఠాలు వింటున్నారు. ఒక్కో స్మైలింగ్ ట్రైనర్ దగ్గర మూడు వేలమంది క్లాసులకు హాజరవుతున్నారంటే అక్కడి డిమాండ్ ఏంటో తెలుస్తోంది. హాలీవుడ్ స్మైల్... గతంలో రేడియో హోస్ట్‌గా పనిచేసిన కైకో క్వానో స్మైలింగ్ ఇన్స్టిట్యూట్ను నడుపుతున్నారు. ‘‘హాలీవుడ్ స్టైల్ స్మైలింగ్ టెక్నిక్’’ను నేర్పించడం ఈమె ప్రత్యేకత. కళ్లను నెలవంకలా తిప్పి, బుగ్గలను గుండ్రంగా పెట్టి పై దవడలోని ఎనిమిది దంతాలు కనిపించేలా నవ్వడమే హాలీవుడ్ స్మైల్. ప్రస్తుతం జపనీస్ విద్యార్థులు ఈ నవ్వుని ఎగబడి నేర్చుకుంటున్నారు. ‘‘విద్యార్థులు, నిరుద్యోగులు అధిక సంఖ్యలో మా దగ్గర క్లాసులు చెప్పించుకుంటున్నారు. భవిష్యత్‌లో చేయబోయే ఉద్యోగాలకు నవ్వు ముఖ్యమని వారంతా క్లాసులకు హాజరవుతున్నారు. స్మైల్ ఎడ్యుకేషన్ గతంలోకంటే ఇప్పుడు నాలుగు రెట్లు పెరిగింది. ఒక్కోక్లాసుకు మన రూపాయల్లో సుమారు రూ.4,500 తీసుకుంటున్నాము. నవ్వుతూ ఎవరిని పలకరించినా అ΄్యాయంగా దగ్గరవుతారు’’ అని క్వానో చెబుతోంది. నవ్వితే ముత్యాలేమీ రాలిపోవు, నాలుగు రకాలుగా మంచే జరుగుతుంది కాబట్టి మనం కూడ మనసారా నవ్వుదాం. ‘‘నవ్వు అనేది సహజసిద్ధంగా జరగాల్సిన ఒక ప్రక్రియ. ఇది చాలా ముఖ్యమైనది. ఎవరినైనా కలిసినప్పుడు మొదట మన నవ్వే పలకరిస్తుంది. మంచి మర్యాదలు మన నవ్వులోనే కనిపిస్తాయి. నవ్వడం మానేస్తే ముఖ కండరాలను ఎలా వాడాలో మెదడు మర్చిపోతుంది అని నిపుణులు చెబుతున్నారు. అందుకే నవ్వడం చాలా ముఖ్యం’’ అని స్మైలింగ్ ఇన్స్ట్రక్టర్ మిహోకిటానో చెబుతున్నారు. -
డబ్ల్యూటీసీ ఫైనల్.. ప్రాక్టీస్‌లో టీమిండియా బీజీబీజీ (ఫోటోలు)
-
టీమ్ ఇండియా రబ్బరు బంతులతో ప్రాక్టీస్... ఎందుకంటే?
-
గూగుల్ చీకటి ‘గేమ్’! రూ.260 కోట్ల భారీ జరిమానా..
టెక్ దిగ్గజం గూగుల్‌కు దక్షిణ కొరియాకు చెందిన యాంటీట్రస్ట్ రెగ్యులేటర్ రూ.260 కోట్ల భారీ జరిమానా విధించింది. కొరియన్ మొబైల్ గేమింగ్ యాప్ మార్కెట్లో ఆధిపత్యం కోసం గూగుల్, దాని ప్రాంతీయ అనుబంధ సంస్థలు అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించిన నియంత్రణ సంస్థ 42.1 బిలియన్ల వాన్లు అంటే భారతీయ కరెన్సీలో రూ.260 కోట్లకు పైగా జరిమానా విధించింది. (ఆండ్రాయిడ్ యూజర్లకు కొత్త ఫీచర్.. స్టోరేజ్ సమస్యకు పరిష్కారం) ఫెయిర్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్‌టీసీ) ప్రకారం.. గూగుల్ 2016 జూన్, 2018 ఏప్రిల్ మధ్య కాలంలో దక్షిణ కొరియా మొబైల్ గేమ్ కంపెనీలతో చీకటి ఒప్పందాలను కుదుర్చుకుంది. ఆ మేరకు వన్ స్టోర్‌లో వారి కంటెంట్‌ను విడుదల చేయకుండా అడ్డకుంది. వన్ స్టోర్ అనేది నేవర్ కార్ప్‌తో పాటు దక్షిణ కొరియాకు చెందిన మరో రెండు మొబైల్ క్యారియర్లు 2016 జనవరిలో ప్రారంభించిన ఆ దేశ ప్రధాన స్వదేశీ యాప్ మార్కెట్. ఈ వన్ స్టోర్ ఏర్పాటు దక్షిణ కొరియాలో తమ మార్కెట్‌పై ప్రభావం చూపుతుందని భావించిన గూగుల్ యూఎస్ బెహెమోత్ గేమ్ కంపెనీలను తమ గూగుల్ ప్లే (Google Play)లో ప్రత్యేకంగా విడుదల చేసేలా ఒప్పందం చేసుకుంది. దీనికి బదులుగా వారి కంటెంట్ మార్కెట్లో ‘ఫీచర్డ్’గా కనిపించేలా చేయడంతో పాటు ఆ కంపెనీలకు ఇతర మార్కెటింగ్ ప్రయోజనాలనూ గూగుల్ అందించినట్లు ఎఫ్‌టీసీ పేర్కొంది. న్యాయమైన చిక్కుల నుంచి తప్పించుకునేందుకు గూగుల్ ఆ ఒప్పందానికి సంబంధించిన ఈమెయిల్‌లను ఉద్యోగుల చేత తొలగింపజేసింది. ఆ విషయాలను ఆఫ్‌లైన్‌లోనే చర్చించాలని కూడా కోరిందని ఎఫ్‌టీసీ తెలిపింది. ఎఫ్‌టీసీ గణాంకాల ప్రకారం.. 2016లో ఖర్చు చేసిన మొత్తంలో స్థానిక యాప్ మార్కెట్లో దాదాపు 80 నుంచి 85 శాతం వాటాను కలిగి ఉన్న గూగుల్ 2018లో 90 నుంచి 95 శాతానికి విస్తరించగలిగింది. మరోవైపు ఈ కాలంలో వన్ స్టోర్ 15 - 20 శాతం నుంచి 5 - 10 శాతానికి మాత్రమే పడిపోయిందని ఎఫ్‌టీసీ పేర్కొంది. కాగా కొరియన్ ఎఫ్‌టీసీ నిర్ణయంతో తాము ఏకీభవించడం లేదని గూగుల్ తెలిపింది. తాము స్థానిక పోటీ చట్టాలను ఉల్లంఘించలేదని పేర్కొంది. రాతపూర్వక నిర్ణయాన్ని సమీక్షించిన తర్వాత తమ భవిష్యత్ కార్యాచరణను వెల్లడిస్తామని వివరించింది. -
PV Sindhu: కోచ్ పార్క్‌తో సింధు కటీఫ్!
సాక్షి, హైదరాబాద్: ఒలింపిక్స్‌లో తాను రెండో పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించిన కోచ్‌తో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తెగదెంపులు చేసుకుంది. దక్షిణ కొరియాకు చెందిన పార్క్ టే సంగ్ వద్ద ఇకపై సింధు ప్రాక్టీస్ చేయబోవడం లేదు. ఇటీవల తాను ఆశించిన విజయాలను సింధు అందుకోలేకపోవడమే అందుకు కారణం. తమ భాగస్వామ్యం ముగిసిందనే విషయాన్ని పార్క్ స్వయంగా ధ్రువీకరించాడు. సింధు పరాజయాల్లో తన పాత్ర కూడా ఉందని అతను పేర్కొనడం విశేషం. గాయంతో ఐదు నెలలు ఆటకు దూరమైన సింధు జనవరిలో జరిగిన మలేసియా ఓపెన్‌తో మళ్లీ బరిలోకి దిగింది. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లోనే కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో ఓడిన ఆమె, సొంతగడ్డపై జరిగిన ఇండియా ఓపెన్‌లోనూ అనూహ్యంగా మొదటి రౌండ్లోనే పరాజయం పాలైంది. టీమ్ ఈవెంట్ అయిన ఆసియా మిక్స్డ్ చాంపియన్‌షిప్‌లో ఒక మ్యాచ్ గెలవగలిగినా... ర్యాంకింగ్స్‌లో తనకంటే ఎంతో దిగువన ఉన్న గావో ఫాంగ్ జి చేతిలో పరాజయం ఊహించనిది. 2019 నుంచి సింధుకు పార్క్ వ్యక్తిగత కోచ్‌గా వ్యవహరించాడు. ఈ నాలుగేళ్లలో మూడు బీడబ్ల్యూఎఫ్ టైటిల్స్‌తో పాటు కామన్వెల్త్ క్రీడల్లో కూడా సింధు స్వర్ణం సాధించింది. అన్నింటికి మించి టోక్యో ఒలింపిక్స్‌లో సింధు కాంస్యం సాధించడం పార్క్‌కు పేరు తీసుకొచి్చంది. ఈ విజయం తర్వాత అన్ని వేదికల్లోనూ తన పతక సాధనకు పార్క్‌నే కారణంగా చూపిస్తూ సింధు ప్రశంసలు కురిపించింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధన ల ప్రకారం పార్క్ ఇప్పటికే గచ్చిబౌలిలో భారత జూని యర్ జట్టుతో చేరి వర్ధమాన ఆటగాళ్ల కోచింగ్‌లో నిమగ్నమయ్యాడు. సుచిత్ర అకాడమీలో... భారత చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ నుంచి విడిపోయిన తర్వాత సింధు ‘సుచిత్ర అకాడమీ’లోనే సాధన చేస్తోంది. భారత ప్రభుత్వం వారి టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకం ప్రకారం తన వ్యక్తిగత కోచ్‌ను ఎంచుకునే అవకాశం సింధుకు ఉంది. భారత జట్టు కోచ్‌గా వచ్చిన పార్క్‌ను ఈ సౌలభ్యం కారణంగానే తన వ్యక్తిగత కోచ్‌గా మార్చుకొని ‘సుచిత్ర’లో సింధు ప్రాక్టీస్ కొనసాగించింది. ఇటీవల తమ అకాడమీలోని దాదాపు 35 మంది షట్లర్ల శిక్షణ కోసం ‘సుచిత్ర అకాడమీ’ మలేసియా మాజీ ఆటగాడు హఫీజ్ హషీమ్‌తో మూడేళ్ల కాలానికి ఒప్పందం చేసుకుంది. దాంతో సింధు కూడా హఫీజ్ వద్ద శిక్షణ తీసుకోవడం ఖాయమైంది. ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ టోర్నీ (మార్చి 14–19)కి ముందు కనీసం రెండు వారాలు హఫీజ్ వద్ద సింధు ప్రాక్టీస్ చేయనుంది. అయితే హఫీజ్‌ను పూర్తి స్థాయిలో అధికారికంగా ‘వ్యక్తిగత కోచ్’గా సింధు నియమించుకుంటుందా అనే విషయంపై స్పష్టత లేదు. హఫీజ్ 2003లో ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో విజేతగా నిలిచాడు. సింధుతో నా భాగస్వామ్యం గురించి చాలా మంది అడుగుతున్నారు. ఇటీవల ఆమె ప్రదర్శన బాగాలేదు. ఒక కోచ్‌గా నేను కూడా అందుకు బాధ్యుడనే. అందుకే ఆమె మార్పు కోరుతుంది. కొత్త కోచ్ కావాలని ఆశిస్తోంది. ఆమె నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నా. వచ్చే ఒలింపిక్స్ వరకు సింధుతో లేకపోవడం కొంత బాధగా ఉన్నా మరో రూపంలో సింధుకు సహకరిస్తా. ఆమెతో కోచింగ్‌లో పాల్గొన్న ప్రతీ క్షణాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటా. –పార్క్ టే సంగ్ -
దేశానికే యువరాణి.. కాబోయే భర్త కోసం.. రాజభోగాలు విడిచి..
ఓస్లో: ఆమె ఒక దేశానికి యువరాణి. కనుసైగ చేస్తే చాలు వందిమాగధులు కోరినదేదైనా కాదనకుండా తెస్తారు. అష్టైశ్వర్యాలతో తులతూగే జీవితం. కానీ ఆమె కాబోయే భర్త కోసం అవన్నీ వదులుకుంది. అతను చేసే ఆల్టర్నేటివ్ మెడిసన్ వ్యాపారాలపై దృష్టి పెట్టడానికి యువరాణి బాధ్యతల్ని నుంచి బయటపడింది. ఆమే నార్వే యువరాణి మార్తా లూయిస్. ఆమెకు కాబోయే భర్త డ్యూరెక్ వెరెట్ మెడికల్ ప్రాక్టీస్ చేస్తూంటారు. ఇదేదో సంప్రదాయ వైద్యం కాదు. ప్రత్యామ్నాయ వైద్యంపై పరిశోధనలు చేయాలి. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచడానికి డ్యూరెక్ చేస్తున్న కృషికి అండగా నిలవడానికి మార్తా లూయిస్ రాచరిక విధుల నుంచి బయటకు వచ్చారు ‘‘నా వ్యక్తిగత పనులకి, రాజకుటుంబంలో పోషించే పాత్రకి మధ్య విభజన ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నా. రాజు హరాల్డ్–5 కూడా ఇందుకు అంగీకరించారు. ప్రిన్సెన్స్ టైటిల్ మాత్రం నాతోనే ఉంటుంది. ప్రత్యామ్నాయ వైద్యం ప్రాముఖ్యతను ప్రజలకు చెప్పడంలో ఎంతో ఆనందముంది’’ అని యువరాణి వెల్లడించారు. మరోవైపు తనని తాను దివ్యశక్తులున్న వ్యక్తిగా చెప్పుకునే డ్యూరెక్పై ప్రజల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు ఆయన చేసే వైద్య విధానం మంచిదేనని గొప్పగా చెప్పుకుంటే, మరికొందరు తాంత్రికవాది అంటూ కొట్టి పారేస్తున్నారు. -
వరల్డ్ ఓల్డెస్ట్ ప్రాక్టీసింగ్ డాక్టర్‌గా గిన్నిస్ రికార్డు!
నిండునూరేళ్లు బతకమని ఆశీర్వదిస్తుంటారు.. కానీ నిండునూరేళ్ల వయసులోనూ అలుపెరుగక సేవలందిస్తున్నారు యూఎస్‌కు చెందిన ఓ డాక్టర్. ఓహియోకు చెందిన న్యూరాలజిస్ట్ హోవర్డ్ టక్కర్ 2021 ఫిబ్రవరిలో.. అంటే ఆయనకు 98 ఏళ్ల 231 రోజుల వయసులోనే ఓల్డెస్ట్ ప్రాక్టీసింగ్ డాక్టర్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. ఇప్పుడు నూరేళ్ల వయసులోనూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటలవరకు పనిచేస్తున్నారు. తన 100వ బర్త్‌డే తరువాత జూలైలో కోవిడ్ బారిన పడ్డారు. అప్పుడు కూడా జూమ్‌లో వైద్య సలహాలిచ్చారు. 1922 జూలై 10న జన్మించిన టక్కర్.. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యూఎస్ నేవీలో సేవలందించారు. 1950 కొరియా యుద్ధ సమయంలోనూ అట్లాంటిక్ ఫ్లీట్‌లో న్యూరాలజీ చీఫ్‌గా పనిచేశారు. విశ్రాంతి తీసుకోవడం దీర్ఘాయువుకు శత్రువు లాంటిదనే ఆయన... చేసే పనిని ప్రేమించినప్పుడు పదవీ విరమణ ఆలోచనే రాదంటున్నారు. ప్రాక్టీసింగ్ సైకోఎనలిస్ట్ అయిన టక్కర్ భార్య 89 ఏళ్ల స్యూ సైతం ఇంకా పనిచేస్తోంది. (చదవండి: ఫార్ములా ఈ రేస్‌తో హైదరాబాద్‌లో ట్రాఫిక్ టెన్షన్) -
పాక్‌తో బిగ్ ఫైట్‌కు ముందు కోహ్లి కఠోర సాధన.. స్పెషల్ మాస్క్‌తో..!
IND VS PAK Super 4 Match: ఆసియా కప్-2022 సూపర్-4 మ్యాచ్‌ల్లో భాగంగా రేపు (సెప్టెంబర్ 4) మరో బిగ్ ఫైట్ జరుగనుంది. గ్రూప్ దశలో ఓసారి ఎదురెదురు పడి కత్తులు దూసుకున్న చిరకాల ప్రత్యర్ధులు భారత్-పాక్‌లు మరోసారి అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. సూపర్-4కు అర్హత సాధించే క్రమంలో పాక్.. పసికూన హాంగ్‌కాంగ్‌పై భారీ విజయం సాధించి, టీమిండియాతో తాడోపేడో తేల్చుకునేందుకు రెడీ అన్న సంకేతాలు పంపగా.. గ్రూప్ దశలో పాక్‌ను మట్టికరించిన ఆత్మవిశ్వాసంతో టీమిండియా ఉరకలేస్తుంది. ఈ క్రమంలో ఇరు జట్ల ఆటగాళ్లు వ్యూహరచనలతో కుస్తీ పడటంతో పాటు ప్రాక్టీస్‌లో చమటోడుస్తున్నారు. మ్యాచ్ సన్నాహకాల్లో భాగంగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి వీర లెవెల్లో సాధన చేస్తూ కనిపించాడు. ముఖానికి ప్రత్యేక స్పోర్ట్స్ మాస్క్ (హై అల్టిట్యూడ్ మాస్క్) పెట్టుకొని రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ మాస్క్ పెట్టుకుని రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తే శ్వాస కండరాలను బలోపేతం కావడంతో పాటు ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. యూఏఈలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న నేపథ్యంలో ఇలాంటి మాస్క్‌తో సాధన ఫిట్నెస్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు ఆటగాళ్లు గాయాల బారిన పడకుండా కాపాడుతుందని కోహ్లి భావిస్తున్నాడు. ఇదిలా ఉంటే, చాలాకాలం తర్వాత కోహ్లి ఇటీవలే తిరిగి గాడిలో పడినట్లు కనిపిస్తున్నాడు. ఆసియా కప్‌లో భాగంగా పాక్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 34 బంతుల్లో 35 పరుగులు చేసి పర్వాలేదనిపించిన రన్ మెషీన్.. ఆతర్వాత హాంగ్‌కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో క్లాసీ ఫిఫ్టి కొట్టి పూర్వవైభవం సాధించినట్లు కనిపించాడు. కోహ్లి ఇదే ఫామ్‌ను రేపు పాక్‌తో జరుగబోయే మ్యాచ్‌లోనూ కొనసాగించాలని పట్టుదలగా ఉన్నాడు. ఈ క్రమంలో ప్రాక్టీస్‌లో వినూత్న సాధన చేస్తున్నాడు. కోహ్లి పాక్‌పై భారీ ఇన్నింగ్స్, వీలైతే సెంచరీ సాధించాలని అతని అభిమానులు దేవుళ్లను ప్రార్ధిస్తున్నారు. చదవండి: భార్యతో కలిసి ఎనిమిదెకరాల భూమి కొనుగోలు చేసిన కోహ్లి.. ధర ఎంతంటే! -
మంచి మాట: సాధన.. ఓ తపస్సు
ఏ విద్యలోనైనా పట్టు రావాలంటే సాధన అవసరం. అది నిరంతరం కొనసాగాలి. ‘అభ్యాసం కూసు విద్య..’ అన్నారు కదా పెద్దలు. అభ్యసించటానికి శ్రద్ధాసక్తులే కాక అకుంఠిత దీక్ష కావాలి. దానికి పట్టుదల కలవాలి. ఇష్టపడి నేర్చుకున్న ఒక విద్యను అభ్యసించవలసి వుంటుంది. ఆ విద్యను సరిగా ఒక గురువు వద్ద నేర్చుకోవాలి. సుశిక్షితులైన పిదప నేర్చిన విద్యను అభ్యసించాలి. అపుడే దానికొక దిశ – దశ ఏర్పడతాయి. సక్రమ మార్గం ఏర్పడుతుంది. నేర్చుకున్న విద్య కరతలామలకమవ్వాలంటే అభ్యాసం వల్లే సాధ్యం. సరైన శిక్షణ లేని విద్య సాధన చేయటం సమయం వృథా. ఇక్కడ జాగరూకత చాలా అవసరం. తపస్సుకు మనో నిశ్చలత అత్యంత ప్రధానమైనది. ఒక దైవాన్ని మనస్సు లో ప్రతిష్టించుకోవాలి. ఆ దేవుడి నామాన్నో.. మంత్రాన్నో ఉచ్చరిస్తూ వుండాలి. జగాన్ని మరవాలి. పెదవుల కదలికలు నెమ్మది.. నెమ్మదిగా అదృశ్యమై మీ ఉచ్ఛ్వాస,.. నిశ్వాసాలే ఆ నామ, మంత్రాలవుతాయి. ఇది తపస్సులో గొప్ప దశ. ఆ అద్భుత స్థితికి చేరగలిగామా.. తపస్సులో అత్యున్నత దశకు చేరుకున్నట్టే. సాధనలో కూడ అంతటి త్రికరణ శుద్ధి కావాలి. అపుడే మనం అభ్యసిస్తున్నా దానిలో గొప్ప ప్రావీణ్యం పొందుతాం. ఎలాగూ మన మనస్సుకు నచ్చిన విద్యను ఎంపిక చేసుకుంటాం కనుక ఆమూలాగ్రంగా నేర్చుకోవాలి. ఏకాగ్రతతో సాధన చేయాలి. మన శక్తియుక్తుల్ని ధారపోయాలి. సంకల్పం... పట్టుదల..మనోనిశ్చలత.. ఏకాగ్రత.. ఈ శక్తుల పిల్ల కాలువలన్నీ సాధన అనే మహా నదిగా మారిన వేళ.. మార్చుకున్న వారికి విద్య స్వాధీనమై.. విద్వత్తు వశమవదా..! సా.. ధ.. న అనే మూడు అక్షరాల వెనుక ఇన్ని శక్తుల కలయిక ఉందని.. ఉంటుందని గ్రహించాలి. అలా గ్రహించిన వారే వాటిని తమలో అంతర్గతంగా వుంటే గుర్తిస్తారు. లేకుంటే అలవరచుకుంటారు. అటువంటి వారే ఆ సాధనా తపస్సులో పరిపూర్ణులవుతారు. ఆ తపోఫలితాన్ని పొందుతారు. సాధారణంగా ఎవరైనా.. నేర్చుకున్న విద్యను సాధన చేస్తారు. ఇది లోకరీతి. గురువు చెప్పిన విద్యను దాని లోతుపాతులను క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే బాగా అభ్యసించాలి. జీవితంతో పోల్చి చూసుకోవాలి. స్వీయ అనుభవాలు, ఇతరుల అనుభవాలు పరిశీలించాలి. ఆ సాధనకు విచక్షణ, వివేచనల తోడు చేసి మరింతగా గట్టిపరచుకోవాలి. కొందరికి అద్భుత ప్రతిభా వ్యుత్పత్తులంటాయి. వారి వైఖరే వేరు. అసలు గురువునుండి విద్యను గ్రహించి ఆకళింపు చేసుకునే పద్ధతే విభిన్నం. కౌరవులకు .. పాండవులకు విలువిద్య నేర్పే ఆరంభ దశలోనే.. బాణంతో చేధించవలసిన పక్షికన్ను తప్ప ఇంకేమి కనుపించటంలేదన్న అర్జునుడి మాటలతో అతనే ఆ విద్యకు సరైన అర్హుడని నిర్ణయించుకున్నాడు ద్రోణాచార్యుడు. గొప్ప కలయిక వారిరువురిది. ఏకాగ్రతతో గురువు చెప్పిన విద్యను సాధన చేయసాగాడు. ఓ రాత్రివేళ.. దీపంలేని తరుణాన... భోజనం చేయగలిగిన పార్థుడు ఒక అద్భుతమైన ఆలోచన చేశాడు. చీకటిలో శబ్దాన్ని బట్టి.. ఆ దిశ వైపు బాణం వేసి వేటాడటం నేర్చుకున్నాడు. గొప్పగా సాధన చేసాడు. పట్టు సంపాదించాడు. తన గురువు మెప్పు పొందాడు. గురువు నేర్పిన విద్యను సాధన చేసే క్రమంలో వచ్చే ఆలోచనలకు తన అద్భుత ఊహశక్తిని మేళవించి తాను నేర్చిన.. నేర్చుకుంటున్న విద్యకు ఒక రూపు.. కోణం.. ఓ వైవిధ్యతను.. ఓ విభిన్నతను కలిపి ఆ విద్యను పరివ్యాపితం చేసాడు తన శక్తి యుక్తులతో. తన గురు ప్రశంస పొందాడు. అలా విశేషమైన ప్రతిభ కల శిష్యులుంటారు. ప్రతిభకు వైవిధ్యం తోడైతే అది ఓ అద్భుతమే. అంతే కాదు.. ఓ నవ నవోన్మేషమే అవుతుంది. విశ్వనాథ సత్యనారాయణ, మంగళంపల్లి బాలమురళీకృష్ణ ప్రభృతులు అటువంటి ప్రతిభ సంపన్నులే. నిరంతర సాధన మన సామర్థ్యాన్ని పెంచుతుంది. ఎనలేని ఆత్మ విశ్వాసాన్నిస్తుంది. పొరపాట్లు.. తప్పిదాలను గమనించి వాటిని సరిదిద్దుకునే అవకాశమిస్తుంది. విద్యాప్రతిభను ప్రదర్శించే సందర్భాలు నల్లేరు మీద బండిలా సాగాలంటే అభ్యాసం తప్పదు. భూ గర్భంలోని రత్నం వంటిదే ప్రతిభ. రత్నాన్ని వెలిక్కితీసి సానపెడితే కాని ధగధగద్ధాయమానంగా ప్రకాశించదు. మనలోని పాడగలిగే గొంతుకకైనా.. అద్భుత కవితాశక్తికైనా... చిత్రలేఖనా ప్రతిభకైనా మార్గదర్శకత్వం చేయగల గొప్పగురువు కావాలి. ఆయన నుండి పొందిన మన జ్ఞానానికొక పరిపుష్టి.. పరిపూర్ణత.. అద్భుత స్వాధీనత.. రాణింపు రావాలంటే సాధన కావాలి. ఒక విద్వాంసుడి.. లేదా ఒక కళాకారుడి ప్రతిభ నిజానికి పేరు ప్రఖ్యాతులు ఎంత బాగా వస్తే వారు అంత ఎక్కువగా సాధన చేయాలి. ఒక కళాకారుడు అత్యున్నత స్థాయికి చేరిన తరువాత అతని ప్రదర్శన తిలకించటానికి వచ్చేప్రేక్షకులు అది అత్యున్నతంగా ఉండాలని... ఉంటుందని ఆశించి వస్తారు. అది ఎంతో సహజమైనది. తాను ఎప్పుడూ ఇస్తున్న ప్రదర్శనే కదా.. సాధన ఎందుకు చేయాలన్న ఆలోచన ఏ కళాకారుడికైనా.. పండితుడికైనా వచ్చిన క్షణం అతడి ప్రతిభాభానుడికి మేఘాలు కమ్ముతాయి. కళాకారులు ఎంతటి లోకప్రసిద్ధులైతే అంతటి సాధన కావాలి. చేయాలి. వారి స్థాయికి తగ్గని ప్రదర్శన ఇవ్వాలి. అలా ఇవ్వాలంటే సాధన చేయక తప్పదు. సాధన చేసే క్రమంలో ఏకాగ్రత.. పట్టుదలలు సడలకూడదు. మనస్సు చంచలం కాకూడదు. సాధన ఎంత కాలం చేయాలి, దీనిని ఎక్కడ ఆపాలి..? అసలు ఆపచ్చా... అన్న ప్రశ్నలు.. సందేహాలు వస్తుంటాయి. సాధన నిలుçపు చేయటం అన్న ఆలోచనే పుట్టకూడదు మనలో. వచ్చిన క్షణం మనలో నేర్చుకునే తపన చనిపోతుంది. చాలానే నేర్చుకున్నామన్న తృప్తి.. ఇంకా నేర్చుకోవలసిన అవసరం లేదన్న ఆలోచనే అందుకు కారణం! సాధనకు దూరమయ్యామంటే నేర్చుకున్న విద్య మీద పట్టు తగ్గచ్చు. అందుకే సాధన ఒక జీవనది కావాలి. ఎంత సాధన చేస్తే. అంత పరిపూర్ణత. అంత అలవోకగా చేయగల సామర్థ్యం వస్తుంది. నేర్చుకునే సమయంలో సాధన చాలా మంది చేస్తారు. ఇది సహజం. ఒక దశకు చేరుకున్న తరువాత శ్రద్ధ పెట్టం. కాని సాధన ఊపిరున్నంత వరకు చేయాల్సిందే. అలా చేసినవారే తమ విద్వత్తును, దానిలోని సారాన్ని అనాయాసంగా చదువరులకు లేదా శ్రోతలకు ఇవ్వగలరు. రంజింప చేయగలరు. ‘మాలో మీరనే ఉత్కృష్టత నిరంతరాభ్యాసం వల్ల ఒక అలవాటుగా మారింది’ అన్నారు గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్. -
ధోని క్రేజ్ తగ్గలేదనడానికి మరో సాక్ష్యం
ధోని నేతృత్వంలోని సీఎస్కే ఐపీఎల్ 2022 కోసం సన్నాహాలు ప్రారంభించింది. సోమవారం సూరత్‌లోని లాల్‌బాయి కాంట్రాక్టర్ స్టేడియంలో ప్రాక్టీస్ కోసం సీఎస్కే అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ధోని సేనకు అభిమానుల నుంచి ఘనస్వాగతం లభించింది. సీఎస్కే టీమ్ ప్రాక్టీస్ కోసం గ్రౌండ్‌కు వస్తున్నట్లు తెలుసుకున్న అభిమానులు ముందుగానే అక్కడికి చేరుకున్నారు. కెప్టెన్ ధోని బస్ నుంచి దిగగానే ధోని.. ధోని అని అరుస్తూ పేపర్ల వర్షం కురిపించారు. ఈ విషయాన్ని సీఎస్కే తన ట్విటర్లో రాసుకొచ్చింది. ''మేం ఎక్కడున్నా అదే స్వాగతం. ఆ కళ్లు.. నవ్వు మాకు చెప్పలేని సంతోషాన్ని ఇస్తున్నాయి.'' అంటూ పేర్కొంది. ఐపీఎల్ 2022 సన్నాహాలకు భిన్నమైన స్థాయిని అందించడానికి సీఎస్కే టీం ఐర్లాండ్ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ జోష్ లిటిల్ను జట్టులో చేర్చుకుంది. 22 ఏళ్ల జోష్ లిటిల్ చెన్నై జట్టులో నెట్ బౌలర్ పాత్రను పోషించనున్నాడు. గతేడాది సీజన్లో అంచనాలకు మించి రాణించిన సీఎస్కే నాలుగోసారి ఐపీఎల్ విజేతగా నిలిచింది. మార్చి 26 నుంచి మొదలుకానున్న ఈ సీజన్లో మరోసారి సత్తా చాటేందుకు ధోని తన ప్లాన్స్‌ను సిద్ధం చేస్తున్నాడు. సీఎస్కే, కేకేఆర్‌తో మ్యాచ్‌తో ఐపీఎల్ 15వ సీజన్ ఆరంభం కానుంది. చదవండి: IPL 2022: డు ప్లెసిస్‌కు భారీ షాక్.. ఆర్సీబీ కెప్టెన్‌గా దినేష్ కార్తీక్! Dean Elgar: 'దేశం వైపా... ఐపీఎల్ వైపా?'.. విధేయత చూపించాల్సిన సమయం 𝐴𝑏ℎ𝑎𝑟𝑎 Surat! Those eyes that smile with 💛 give us the joy, everywhere we go! #SingamsInSurat #WhistlePodu 🦁 pic.twitter.com/T8xwHjoqeI — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) March 7, 2022 Namma Special 🦁 Footvolley segment is B⚽CK! 🔁#WhistlePodu pic.twitter.com/pXxIe994sG — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) March 7, 2022 -
గోల్డెన్...ఫైట్
సాక్షి, హైదరాబాద్: ఆమె కరాటే సాధన ప్రారంభించే సమయానికి వయసు 12ఏళ్లు. అంతర్జాతీయ పోటీలో పాల్గొనే సమయానికి 13ఏళ్లు. ‘తొలుత ఈ రంగాన్ని ఎంచుకున్నప్పుడు అమ్మా నాన్న చాలా సంకోచించారు. అయితే నా పట్టుదల చూసి వెన్ను తట్టారు. ఇప్పుడు వారే నన్ను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నారు’ అని చెప్పారు సయ్యదా. సాధన తప్పదు..గాయాలూ తప్పవు ‘టోర్నమెంట్‌కు ముందు రోజుకి కనీసం 4 నుంచి 5 గంటల పాటు శిక్షణ తప్పనిసరి. మిగిలిన రోజుల్లో కూడా రెండు పూటలా ఫిట్నెస్ కాపాడుకునే వ్యాయామాలు చేయాల్సిందే’ నని చెప్పారు సయ్యదా. ‘ఏ విజయం కూడా సునాయాసంగా రాదు. పురుషులకైనా, మహిళలకైనా ఇష్టమైన రంగాన్ని ఎంచుకుంటే కష్టం అనిపించదు’ అంటారు. కామన్వెల్త్ ఛాంపియన్ షిప్కి భారత్ తరపున ప్రాతినిథ్యం వహించాల్సి ఉందనగా సరిగ్గా 2 నెలల ముందు కాలికి తీవ్ర గాయంతో కదలలేకుండా పోయిన సందర్భాన్ని గుర్తు తెచ్చుకుంటూ... ఇవన్నీ ఆటలో భాగం అంటారామె. డైట్...రైట్..రైట్ సాధనకు తగ్గట్టుగా శరీరాన్ని తీర్చిదిద్దుకోవడానికి సరైన డైట్ తీసుకుంటానని చెబుతున్నారామె. రోజువారీగా వ్యాయామం తప్పదు. అందుకే రంజాన్ వంటి అత్యంత ముఖ్యమైన పండుగ సందర్భాల్లో ఆమె మరింత జాగ్రత్తగా తన సాధనను దినచర్యను బ్యాలెన్స్ చేసుకుంటారామె. రాజకీయ శాస్త్రంలో పట్టా సాధించి, ప్రస్తుతం లా కోర్సు చేస్తున్న సయ్యదా... తాజాగా రాజకీయ రంగంలో కూడా ప్రవేశించడం విశేషం. రాజకీయాల్లో క్రీడాభివృద్ధికి మాత్రమే కాక మహిళల స్వయం సాధికారత కోసం కూడా తాను కృషి చేస్తానని అంటున్నారామె. (చదవండి: నన్ను ఎవరూ భయపెట్టలేరు. దేనికీ భయపడను: తెలంగాణ గవర్నర్ తమిళిసై) -
ప్రాక్టీస్‌లో పాకిస్తాన్ జెండా.. క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం
Bangla Fans Troll Pakistan Team Plants National Flag During Practice.. టి20 ప్రపంచకప్ 2021లో సెమీస్‌లో ఓడి ఇంటిబాట పట్టిన పాకిస్తాన్ నేరుగా బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టింది. బంగ్లా పర్యటనలో పాకిస్తాన్ జట్టు మూడు టి20లు.. రెండు టెస్టులు ఆడనుంది. నవంబర్ 19 నుంచి ఈ సిరీస్ మొదలుకానుంది. ఇప్పటికే సిరీస్‌లో ఆడనున్న ఆటగాళ్లు శనివారం ఢాకాకు చేరుకొని ప్రాక్టీస్ ప్రారంభించారు. ఇక షోయబ్ మాలిక్, బాబర్ అజమ్‌లు మాత్రం మంగళవారం ఢాకాకు రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్ ప్రారంభించిన పాక్ ఆటగాళ్లు మైదానంలో వారి జాతీయ జెండాను పెట్టడం వివాదాస్పదంగా మారింది. చదవండి: T20 WC 2021: నా కెప్టెన్ బాబర్ ఆజమ్.. అతడే అత్యుత్తమ బౌలర్.. పాకిస్తాన్ కోచ్ సక్లెయిన్ ముస్తాక్ ఆటగాళ్లకు దేశంపై గౌరవం ఎల్లవేలలా కనపడాలనే ఉద్దేశంతో ఇలా చేసినట్లు తెలిసింది. అయితే దీనిపై బంగ్లా క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ''బంగ్లాదేశ్‌లో క్రికెట్ ఆడడానికి ఎన్నో జట్లు వచ్చాయి. కానీ ఏ జట్టు తమ జాతీయ జెండాను ప్రాక్టీస్ సందర్భంగా మైదానంలోకి తీసుకురాలేదు. కానీ పాకిస్తాన్ మాత్రమే ఎందుకు ఈ పని చేసింది. పాక్ చర్య మాకు నచ్చలేదు.. బంగ్లాదేశ్‌తో సిరీస్ రద్దు చేసుకొని మీ దేశానికి వెళ్లిపోండి..'' అంటూ ఒకరు కామెంట్ చేశారు. '' బంగ్లాదేశ్‌లో పాకిస్తానీ ఫ్లాగ్‌ను బ్యాన్ చేయండి'' అంటూ ట్విటర్లో మరొక అభిమాని ఆగ్రహంతో పేర్కొన్నాడు. ఇక టి20 ప్రపంచకప్ 2021లో సూపర్ 12 దశలో దుమ్మురేపిన పాకిస్తాన్ ఐదు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు సాధించి సెమీస్‌కు చేరింది. అయితే సెమీస్‌లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైంది. చదవండి: Usman Shinwari Retirement: టెస్టులకు గుడ్‌బై చెప్పిన పాక్ క్రికెటర్ Pakistan started preparation ahead of three-match T20I and two-match Test series against Bangladesh. Pakistan team hoists a national flag there-- surely a new scene here. Cannot remember any team doing it here in recent past. Finally some int'l cricket in Mirpur. #BANvPAK pic.twitter.com/922Alf4LeC — Saif Hasnat (@saifhasnat) November 15, 2021 పాకిస్థాన్ టి20 జట్టు: బాబర్ అజమ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ, హరీస్ రవూఫ్, హసన్ అలీ, ఇఫ్తీకర్ అహ్మద్, ఇమాద్ వాసిం, ఖుష్దిల్ షా, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), మహ్మద్ వసీం జూనియర్, సర్ఫరాజ్ అహ్మద్ , షాహీన్ షా ఆఫ్రిది, షానవాజ్ దహానీ, షోయబ్ మాలిక్, ఉస్మాన్ ఖాదిర్ పాకిస్థాన్ టెస్టు జట్టు: బాబర్ అజమ్ (కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, అబిద్ అలీ, అజహర్ అలీ, ఫవాద్ ఆలం, ఇమామ్-ఉల్-హక్, కమ్రాన్ గులామ్, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, బిలాల్ ఆసిఫ్ , హసన్ అలీ, మహ్మద్ అబ్బాస్, నసీమ్ షా, నౌమాన్ అలీ, షాహీన్ షా ఆఫ్రిది, జాహిద్ మహమూద్, సాజిద్ ఖాన్ Bangladesh cricket fans not impressed as Pakistan players carry national flag to training ground pic.twitter.com/BZrOGAqMV3 — greaterjammuvirtual (@gjvirtual) November 16, 2021 Different countries have come to #Bangladesh innumerable times, many matches have been played by practicing.But neither party needed to practice burying their national flag on the ground.But why did #Pakistan do that... What does it indicate?#BANvPAK pic.twitter.com/bxUyTq5K1s — Misbah ur Rahman (@95MRahman) November 15, 2021 -
కెప్టెన్ కోహ్లి వెంటే నేను: రహానే
చెన్నై: రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి రావడంతో జట్టులో తన పని, పాత్ర సులువైందని వైస్ కెప్టెన్ అజింక్య రహానే అన్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండోసారి టెస్టు సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించిన టీమిండియాకు తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన రహానే ఇప్పుడు తన రెగ్యులర్ కెప్టెన్‌కు చేదోడు వాదోడుగా ఉంటానని చెప్పాడు. త్వరలో జరిగే టెస్టు సిరీస్‌పైనే దృష్టి పెట్టామని, ప్రత్యర్థి జట్టును గౌరవిస్తామని అన్నాడు. ‘శ్రీలంకలో నెగ్గొచ్చిన ఇంగ్లండ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ తేలిగ్గా తీసుకోం. జో రూట్ బృందం బలమైన ప్రత్యర్థి. అలాంటి జట్టుపై ఆదమరిచే ప్రసక్తే లేదు’ అని రహానే తెలిపాడు. ‘ఇప్పుడు నేను వైస్కెప్టెన్ని. మా సారథి వెంట నడవాలి. జట్టుకు అవసరమైనపుడు సలహాలిస్తాను. కోహ్లి కోరితే సూచనలిస్తాను. వైస్ కెప్టెన్‌గా నా పరిధి ఏంటో నాకు తెలుసు. ఇక ఆసీస్ విజయం ఇప్పుడైతే అప్రస్తుతం. ఎందుకంటే అది గతం. ఇప్పుడున్న సిరీస్‌పైనే మా ఫోకస్ ఉంటుంది. అక్కడ గెలిచామ న్న ధీమాతో ఇక్కడ ప్రవర్తించం. పైగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ కోసం జరుగుతున్న పోరాటంలో ప్రత్యర్థి ఎవరైనా పట్టుదలతోనే ఆడతాం’ అని వివరించాడు. -
ఆ 13 మందికి రెండోసారి కరోనా పరీక్షలు
దుబాయ్ : సెప్టెంబర్ 19 నుంచి మొదలుకానున్న ఐపీఎల్ 13వ సీజన్ ఆరంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కరోనా కలకలం రేపిన సంగతి తెలిసిందే. జట్టులో 13 మంది కరోనా బారిన పడ్డారు. అయితే మొదటిదఫా నిర్వహించిన కరోనా పరీక్షల్లో అందరికి నెగిటివ్ వచ్చినట్లు మంగళవారం వచ్చిన రిపోర్టులో తేలింది. తాజాగా గురువారం ఈ 13 మందికి రెండోసారి కరోనా పరీక్షలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫలితాలు శుక్రవారం ఉదయం రానున్నాయి. మరోవైపు రేపటినుంచే చెన్నై సూపర్‌కింగ్స్ ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నట్లు జట్టు యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. ఫలితాలు శుక్రవారం ఉదయం వెలువడుతుండడంతో.. ఎలాగూ ఆటగాళ్లందరికి నెగెటివ్ వస్తుంది.. సాయంత్రం కల్లా చెన్నై జట్టు తమ ప్రాక్టీస్ మొదలుపెడుతుందని యాజమాన్యం స్పష్టం చేసింది.(చదవండి : జడ్డూ బాయ్.. వాట్ ఏ స్టన్నింగ్ క్యాచ్) ఇప్పటికే చెన్నై మినహా అన్ని జట్లు తమ ప్రాక్టీస్‌ను మొదలుపెట్టేశాయి. అంతకుముందు.. సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ మాట్లాడుతూ.. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో చెన్నై జట్టు ముంబైతో తలపడేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఇదే విషమమై బీసీసీఐ కూడా స్పందించింది. టోర్నీ ఆరంభ మ్యాచ్ కచ్చితంగా చెన్నె సూపర్‌కింగ్స్, ముంబై ఇండియన్స్‌ల మధ్యే జరుగుతుందని ఆశిస్తున్నట్టు తెలిపింది. ఈ విషయంపై శనివారం ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ పేర్కొంది. అసలే కరోనా బారిన పడ్డామన్న ఆలోచనలో ఉన్న సీఎస్కేకు ఆ జట్టు ఆటగాడు సురేశ్ రైనా బిగ్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. కొన్ని వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ సీజన్ నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నాడు. రైనా అనూహ్య నిష్క్రమణపై సోషల్‌మీడియాలో వివిధ రకాల రూమర్లు వచ్చాయి. సీఎస్కే యాజమాని శ్రీనివాసన్‌తో పొసగకనే రైనా అర్థంతరంగా స్వదేశానికి పయనమయ్యాడనే కామెంట్లు వినిపించాయి. దీంతో రైనా స్వయంగా రంగంలోకి దిగాడు. తన కుటుంబంపై కొంతమంది దాడి చేసిన ఘటనలో మేనమామ చనిపోయిన కారణంగానే స్వదేశానికి ఉన్నపళంగా రావాల్సివచ్చిందని వివరణ ఇచ్చుకున్నాడు.(చదవండి : ఫ్యాన్‌కు సీఎస్కే అదిరిపోయే రిప్లై) తనకు జట్టుతో ఎటువంటి విభేదాలు లేవని కూడా తెలిపాడు. దీనిపై సీఎస్కే యజమాని ఎన్ శ్రీనివాసన్ కూడా సానుకూలంగానే స్పందించారు. తనకు రైనా కొడుకు లాంటి వాడు అంటూ శ్రీని స్పష్టం చేశారు. దాంతో సీఎస్కేతో రైనాకు విభేదాలు అంశానికి తొందరగానే ముగింపు పడింది. రైనా తిరిగి జట్టుతో కలవడమనేది ఇంకా డైలమాలోనే ఉంది. జట్టుతో తనకేమీ పొరపచ్చలు లేవని, అవకాశం ఉంటే జట్టుతో కలుస్తాననే సంకేతాలు పంపాడు. ఈ క్రమంలోనే రైనా జట్టుతో కలిసినా అది టోర్నీ మధ్యలో జరగవచ్చు.ధోని నాయకత్వంలో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు ఐపీఎల్ చరిత్రలో విజయవంతమైన జట్టుగా పేరుపొందింది. ఇప్పటికే మూడుసార్లు టైటిల్‌ను కొల్లగొట్టిన చెన్నై రెండు సార్లు చాంపియన్ లీగ్స్‌ను గెలిచింది. అంతేకాదు.. ఐపీఎల్ సీజన్లలో 8సార్లు ఫైనల్ చేరిన జట్టుగా, ఎక్కువసార్లు ప్లేఆఫ్ మ్యాచ్‌లు ఆడిన జట్టుగా చరిత్ర సృష్టించింది. -
ఉన్నపళంగా ఫామ్ అందుకోలేం
న్యూఢిల్లీ: సుదీర్ఘ విరామం తర్వాత ఉన్నపళంగా ఫామ్‌ను అందుకోవడం చాలా కష్టమని భారత మహిళల క్రికెట్ జట్టు లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ అభిప్రాయపడింది. వచ్చే ఏడాది మహిళల వన్డే ప్రపంచకప్‌నకు ముందు భారత్ ఏకైక అంతర్జాతీయ టోర్నీలో ఇంగ్లండ్‌తో తలపడాల్సి ఉంది. కరోనా కారణంగా అది కాస్తా రద్దు కావడంతో పూనమ్ నిరాశ వ్యక్తం చేసింది. చివరగా ఈ ఏడాది మార్చిలో టి20 ప్రపంచకప్‌లో తలపడిన భారత్ కరోనా కారణంగా నాలుగు నెలలుగా ప్రాక్టీస్‌కు దూరమైంది. తాజాగా ఇంగ్లండ్ టూర్ కూడా ఆగిపోవడంతో నేరుగా వన్డే ప్రపంచకప్‌లో సత్తా చాటాలంటే అంత సులువు కాదని పూనమ్ పేర్కొంది. న్యూజిలాండ్ వేదికగా వచ్చే ఏడాది ఫిబ్రవరి–మార్చిలో జరగాల్సిన ఈ మెగా టోర్నీ భవితవ్యంపై రానున్న రెండు వారాల్లో స్పష్టత వస్తుందని వ్యాఖ్యానించింది. ‘ఇదో కఠిన సవాల్. నాలుగైదు నెలల విరామానంతరం మునుపటి ఫామ్ కొనసాగించలేం. చివరగా మార్చిలో బరిలో దిగాం. ఇప్పటికీ మేం ఆడబోయే తదుపరి సిరీస్‌పై స్పష్టత లేదు. ఒకవేళ అనుకున్న సమయానికి వన్డే ప్రపంచకప్ జరిగితే సన్నద్ధతకు సమయమే ఉండదు’ అని భారత్ తరఫున ఒక టెస్టు, 46 వన్డేలు, 67 టి20లు ఆడిన పూనమ్ పేర్కొంది. -
మైదానంలోకి రోహిత్ శర్మ
ముంబై: భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు బ్యాట్ పట్టుకున్నాడు. కోవిడ్–19 నిబంధనల సడలింపులతో తాను మళ్లీ గ్రౌండ్‌కు వచ్చినట్లు అతను వెల్లడించాడు. ‘మళ్లీ మైదానంలోకి రావడం బాగుంది. కొంత సేపు ఆడగలిగాను. చాలా రోజుల తర్వాత నాకు నేనే కొత్తగా కనిపించాను’ అని తన ఇన్‌స్టగ్రామ్ అకౌంట్లో అతను పోస్ట్ చేశాడు. -
అఫ్గాన్ క్రికెటర్ల ప్రాక్టీస్
కాబూల్: రెండు నెలల విరామం తర్వాత అఫ్గానిస్తాన్ క్రికెటర్లు తిరిగి ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఇక్కడి కాబూల్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం నుంచి ఆరంభమైన ప్రాక్టీస్ సెషన్లో లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్, ఆల్ రౌండర్ మొహమ్మద్ నబీతో పాటు పలువురు ఆటగాళ్లు పాల్గొన్నట్లు అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) తెలిపింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తమ ఆటగాళ్లు మరింత మెరుగవడానికి, మైదానంలో జట్టుగా సమష్టి ప్రదర్శన ఇచ్చేందుకు ఈ సెషన్ ఉపయోగపడుతుందని ఏసీబీ పేర్కొంది. కరోనా నేపథ్యంలో నెలరోజుల పాటు సాగే ఈ సెషన్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మార్గదర్శకాలకు లోబడే నిర్వహించనున్నట్లు ఏసీబీ ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా శనివారం ఏసీబీ ప్రధాన కార్యాలయంలో కరోనాపై అవగాహన కార్యక్రమాన్ని కూడా నిర్వహించి తమ ఆటగాళ్లతో పాటు బోర్డు అధికారులను చైతన్య పరిచింది. ఈ ఏడాది అఫ్గానిస్తాన్ అక్టోబర్‌లో టి20 ప్రపంచకప్, నవంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే ఏకైక టెస్టు మ్యాచ్ ఆడాల్సి ఉంది. -
ఇంట్లోనే బాక్సింగే!
ఈ లాక్డౌన్ సమయంలో తనలోని బాక్సర్‌ను మరింత పర్ఫెక్ట్ చేసే పనిలో పడ్డారు వరుణ్ తేజ్. కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రంలో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు వెంకటేశ్, సిద్ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో వరుణ్ బాక్సర్‌గా కనిపించనున్నారు. ఈ క్యారెక్టర్ కోసం అమెరికాలో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. ఈ చిత్రం తొలి షెడ్యూల్ వైజాగ్‌లో జరిగింది. ఆ తర్వాత లాక్డౌన్ వల్ల ఈ షూటింగ్‌కు వీలు పడలేదు. ప్రస్తుతం వరుణ్ తేజ్ తన ఇంటిలోనే బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను వరుణ్ షేర్ చేశారు. ‘‘కొన్నిసార్లు నాకు నేను బలహీనంగా అనిపిస్తాను. అప్పుడు ఇంకొంచెం ఎక్కువగా బాక్సింగ్ సాధన చేస్తా ’’ అని పేర్కొన్నారు వరుణ్ తేజ్. -
ప్రాక్టీస్.. ప్రాక్టీస్
ప్రముఖ తమిళ రచయిత కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విక్రమ్, కార్తీ, ‘జయం’ రవి, ఐశ్వర్యా రాయ్, త్రిష, అదితీ రావ్ హైదరి, శోభితా ధూళిపాళ్ల ప్రధాన పాత్రధారులు. ఈ సినిమా తొలి షెడ్యూల్ థాయ్‌ల్యాండ్‌లో జరిగింది. ‘జయం’ రవి, కార్తీలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. సెకండ్ షెడ్యూల్‌ను ఆరంభించాలనుకుంటున్న సమయంలో కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. మళ్లీ షూటింగ్ ప్రారంభమయ్యేలోపు కథలోని పాత్రలకు తగ్గట్లుగా మౌల్డ్ అయ్యే పనిలో ఉన్నారు ఈ చిత్రంలోని నటీనటులు. ఇందులో భాగంగానే అదితీ రావ్ హైదరి కలరిపయట్టు ప్రాక్టీస్ చేస్తున్నారు. లాక్డౌన్ వల్ల ఇంటిపట్టునే ఉంటున్న అదితీ ఈ మార్షల్ ఆర్ట్ ప్రాక్టీస్‌కే రోజులో ఎక్కువ టైమ్ కేటాయిస్తున్నారట. తన ప్రాక్టీస్ వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు అదితీ రావ్. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదలవుతుందనే ప్రచారం జరుగుతోంది. -
నెల రోజుల ప్రాక్టీస్ ఉండాల్సిందే!
న్యూఢిల్లీ: అంతర్జాతీయస్థాయి క్రికెట్ టోర్నీల్లో పాల్గొనే ముందు క్రికెటర్లకు కనీసం నెల రోజుల ప్రాక్టీస్ అవసరమని భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానే అభిప్రాయపడ్డాడు. కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాకే ఆటల్ని పునఃప్రారంభించాలని సూచించాడు. బుధవారం ఎల్సా కార్ప్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితుడైన రహానే మాట్లాడుతూ... ఇకనుంచి మైదానంలో ఆటగాళ్లు ముందులా సంబరాలు చేసుకునే అవకాశం ఉండబోదని చెప్పాడు. ‘ఏ స్థాయి క్రికెట్ ఆడాలన్నా క్రికెటర్లకు 3 నుంచి 4 వారాల కఠిన ప్రాక్టీస్ అవసరం. నావరకైతే ఆటను చాలా మిస్ అవుతున్నా. కానీ వ్యాక్సిన్ వచ్చాకే టోర్నీలు ప్రారంభిస్తే మంచిది. కరోనా కట్టడి అయ్యాక కూడా మనం ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించకూడదు. అభిమానులు, ప్రేక్షకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతా సద్దుమణిగాక కూడా మైదానంలో మా సంబరాలు మునుపటిలా ఉండకపోవచ్చు. ప్రయాణాల్లో, వికెట్ తీసినప్పుడు మేం చప్పట్లు, నమస్కారాలతో సరిపెట్టుకుంటామేమో. ఇక బంతిని మెరిపించేందుకు లాలాజలం వాడాలా? వద్దా? అనే అంశంపై ఆట ప్రారంభమయ్యాకే స్పష్టత వస్తుందని’ రహానే చెప్పాడు. -
టీటీలో మరమనిషితో మన మనిషి పోరు...
చెన్నై: అప్పట్లో మనం వెండితెరపై తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్... తనను పోలిన రోబోతో ఇంచుమించు యుద్ధమే చేస్తాడు. ఇదంతా సినిమా‘ట్రిక్’. కానీ నిజజీవితంలో భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) ఆటగాడు సత్యన్ జ్ఞానశేఖరన్... రోబోతో తన ఆట ప్రాక్టీస్ చేస్తున్నాడు. కరోనా వైరస్ వ్యాపిస్తుండటంతో ప్రపంచంతో పాటు భారత్ కూడా లాక్డౌన్లో ఉంది. అడుగు బయట పెట్టలేని పరిస్థితి నెలకొంది. దీంతో సత్యన్ తన భాగస్వామిగా మరో మనిషిని కాకుండా మరమనిషిని ఎంచుకున్నాడు. రోబోతోనే తన ప్రాక్టీస్ చురుగ్గా సాగుతోందని చెప్పాడు. ఈ రోబోను జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నాడు. ఇది నిమిషానికి 120 బంతుల్ని నెట్‌పై ఆడగలదు. అన్నట్లు బంతుల స్పిన్, వేగ నియంత్రణను చేసుకునే సౌకర్యం ఇందులో ఉంది. ఈ మరమనిషితోనే రోజు గంటన్నర సేపు ప్రాక్టీస్ చేస్తున్నట్లు 27 ఏళ్ల సత్యన్ తెలిపాడు. అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) మొత్తం ఈవెంట్లను జూన్ 30 దాకా రద్దు చేసింది. -
పింక్ బాల్‌తో మనోళ్ల ప్రాక్టీస్
ఇండోర్: భారత క్రికెటర్ల ప్రాక్టీస్ ‘రంగు’ మారింది. ఎప్పుడూ ఎరుపు బంతితో నెట్స్‌లో ప్రాక్టీస్ చేసే ఆటగాళ్లు మంగళవారం గులాబీ బంతితో ఆడుకున్నారు. భారత సారథి కోహ్లి తొలిసారిగా పింక్ బాల్‌తో ప్రాక్టీస్ చేశాడని జట్టు వర్గాలు తెలిపాయి. పింక్ బాల్‌తో అతను డిఫెన్స్ ఆడాడు. కోల్‌కతాలో ఈనెల 22 నుంచి జరిగే డేనైట్ టెస్టు కోసం అలవాటు పడేందుకే ఆటగాళ్లు సంప్రదాయ ఎర్ర బంతితో కాకుండా ఈసారి పింక్ బాల్‌తో ప్రాక్టీస్ చేశారు. పేసర్లు, స్పిన్నర్ల కోసం మూడు నెట్స్‌లను ఏర్పాటు చేయగా, టీమిండియా విజ్ఞప్తి మేరకు త్రోడౌన్ ప్రాక్టీస్ కోసం మరో చోట టర్ఫ్, బ్లాక్ సైట్‌స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడే అందరికంటే ముందుగా కోహ్లి ప్రాక్టీస్ చేశాక... తర్వాత పుజారా, శుబ్‌మన్ గిల్ కూడా పింక్ బాల్‌తో ప్రాక్టీస్ చేశారు. డేనైట్ టెస్టుకు రోజుల వ్యవధే ఉండటంతో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ మార్గదర్శనంలో ఇటీవల రహానే, మయాంక్ అగర్వాల్, పుజారా, షమీలకు ప్రత్యేకంగా పింక్‌బాల్ ప్రాక్టీస్‌ను బీసీసీఐ ఏర్పాటు చేసింది. గురువారం నుంచి ఇండోర్‌లో తొలి టెస్టు జరుగుతుంది. పిల్లలతో కోహ్లి గల్లీ క్రికెట్... భారత కెప్టెన్ విరాట్ కోహ్లి పిల్లలతో గల్లీ క్రికెట్ ఆడాడు. ఇక్కడి బిచోలి మర్దానా ప్రాంతంలో సరదాగా పిల్లలతో క్రికెట్ ఆడాడు. ఈ వీడియా, ఫొటో షూట్ నెట్టింట బాగా వైరల్ అయింది. చెక్ షర్ట్, జీన్స్ వేసుకొని కోహ్లి పిల్లలతో చేసిన అల్లరిని నెటిజన్లు తెగ ‘లైక్’ చేశారు. చీకట్లో కాస్త క్లిష్టం కావొచ్చు; పింక్ బాల్‌పై పుజారా వ్యాఖ్య బెంగళూరు: డేనైట్ టెస్టు కోసం ఉపయోగించే గులాబీ బంతితో రాత్రయితే దాన్ని చూడటంలో సమస్య ఎదురవుతుందని భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా అన్నాడు. ‘నేను ఇదివరకే దులీప్ ట్రోఫీలో పింక్‌బాల్‌తో ఆడాను. అది మంచి అనుభవం. దేశవాళీ క్రికెట్లో అలా ఆడిన అనుభవం ఇప్పుడు అక్కరకొస్తుంది. అయితే పగటి సమయంలో పింక్‌బాల్‌తో ఏ సమస్యా ఉండదు. కానీ చీకటి పడినపుడు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో బంతిని చూడటం కష్టమవుతుందేమో! అదే జరిగితే మ్యాచ్‌లో ఆ రాత్రి సెషనే కీలకంగా మారొచ్చు’ అని పుజారా అన్నాడు. టీమిండియాలో కెప్టెన్ కోహ్లి సహా చాలా మందికి పింక్‌బాల్‌తో ఆడటం కొత్త. పుజారా, మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, కుల్దీప్ యాదవ్‌లకు మాత్రం కూకబుర్రా గులాబీ బంతులతో దులీప్ ట్రోఫీ ఆడిన అనుభవం ఉంది. రెడ్‌బాల్ కంటే ఎక్కువ కష్టపడాలి... రెడ్‌బాల్‌తో పోలిస్తే పింక్‌బాల్‌తో ఆడేందుకు కాస్త ఎక్కువ కష్టపడాల్సి ఉంటుందని భారత వైస్ కెప్టెన్ అజింక్య రహానే అన్నాడు. ‘నా వరకైతే గులాబీ బంతి ఆటకు నేను కొత్త. ఇది కాస్త భిన్నంగా అనిపించింది. మా దృష్టంతా బంతి స్వింగ్, సీమ్‌పైనే ఉంటుంది. నా అంచనా ప్రకారం బంతిని శరీరానికి దగ్గరగా ఆడాల్సి ఉంటుంది’ అని అన్నాడు. -
క్రికెట్ క్రేజ్
జిన్నారం(పటాన్చెరు): క్రికెట్‌పై విద్యార్థులు మక్కువ పెంచుకుంటున్నారు. ప్రాక్టీస్ చేసేందుకు నెట్లు, మ్యాట్ ఉండటంతో విద్యార్థులు క్రికెట్ ఆడేందుకు ముందుకు వస్తున్నారు. కేవలం కబడ్డీ, ఖోఖోలాంటి క్రీడలు కాకుండా అంతర్జాతీయ స్థాయి క్రీడైన క్రికెట్‌ను ఆడేందుకు కూడా విద్యార్థులు ఉత్సాహాన్ని చూపుతున్నారు. మండల కేంద్రమైన జిన్నారంలోని గిరిజన గురుకుల పాఠశాలలో రాష్ట్రంలో మొదటి సారిగా క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేశారు. సుమారు రూ. 30లక్షల నిధులతో క్రికెట్ అకాడమీతోపాటు ప్రాక్టీస్ చేసేందుకు తగిన నెట్లను కూడా ఏర్పాటు చేశారు. ఇటీవల రాష్ట్ర గురుకులాల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ ఈ అకాడమీని ప్రారంభించారు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలను కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోనే ఈ క్రికెట్ అకాడమీ మొదటి కావడం విశేషం. క్రికెట్‌ను నేర్చుకునేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. జిన్నారం గ్రామానికి చెందిన యువకులు, ఇతర పాఠశాలల విద్యార్థులు కూడా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇప్పటి వరకు విద్యార్థులు కేవలం కబడ్డీ, ఖోఖోలాంటి ఆటలు మాత్రమే ఆడేవారు. ప్రస్తుతం క్రికెట్ అకాడమీ రావడంతో విద్యార్థులు క్రికెట్‌ను ఆడేందుకు ఉత్సాహాన్ని చూపుతున్నారు. క్రికెట్ అకాడమీని గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా జిన్నారం గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శనను కనబర్చారు. దీంతో విద్యార్థులకు క్రికెట్లో కూడా కోచింగ్ ఇచ్చేలా ఉపాధ్యాయులు చర్యలు చేపడుతున్నారు. విద్యార్థులకు క్రీడల్లో ప్రాధాన్యం విద్యతోపాటు క్రీడల్లో కూడా విద్యార్థులు రాణించేలా చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలోనే మొదటి సారి మా పాఠశాల ఆవరణలో క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. విద్యార్థులు నిత్యం క్రికెట్ అడుతూ ప్రాక్టీస్‌ను కొనసాగిస్తున్నారు. క్రికెట్లో కూడా విద్యార్థులు రాణించేలా మావంతు కృషి చేస్తాం. – గంగాధర్, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ -
రైజింగ్ స్టార్స్
-
కోర్టులో వాదించకుండా అడ్డుకోలేం
న్యూఢిల్లీ: చట్టసభ్యులుగా ఎన్నికైన న్యాయవాదుల్ని కోర్టుల్లో వాదించకుండా అడ్డుకోలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. చట్టసభ్యులయ్యాక న్యాయవాద వృత్తిని కొనసాగించకూడదని న్యాయవాద వృత్తి కోసం ఉద్దేశించిన చట్టంలో ఎక్కడా లేదని పేర్కొంది. ‘చట్టసభ్యులుగా కొనసాగుతున్న వారు అడ్వకేట్స్‌గా ప్రాక్ట్రీస్ చేయకూడదని అడ్వకేట్స్ యాక్ట్, 1961, దాని ఆధారంగా రూపొందించిన నిబంధనలు ఎలాంటి నిషేధమూ విధించలేదు’ అని సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రజాప్రతినిధులు ఏ వ్యక్తి, సంస్థ, ప్రభుత్వం, కార్పొరేషన్ లేదా ఇతర సంస్థల్లో పూర్తి స్థాయి ఉద్యోగి కాదు. అందువల్ల ఈ కేసులో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూపొందించిన 49వ నిబంధన వారికి వర్తించదు అని స్పష్టం చేసింది. చట్టసభ్యులుగా కొనసాగుతున్నంత కాలం న్యాయవాదులు కోర్టులో వాదించకుండా నిషేధం విధించాలని బీజేపీ నేత, న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిల్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. చట్టసభ్యులు పూర్తికాలపు ఉద్యోగులు కారని, వారి మధ్య ఉద్యోగి, యజమాని సంబంధం లేదంది. ‘చట్టసభ్యులు(ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు) పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీలో సభ్యులు. 1954 నాటి చట్టం కింద వారు జీతం అందుకుంటున్నారు. అలాగే వివిధ నిబంధనలకు అనుగుణంగా అలవెన్స్‌లు పొందుతున్నారు. అయితే ఆ చట్టం ప్రకారం ప్రభుత్వం, చట్టసభ్యుల మధ్య ఉద్యోగి, యజమాని సంబంధం ఉండదు’ అని తీర్పులో పేర్కొంది. -
ధావన్ ప్రాక్టీస్ వీడియో
-
ప్రాక్టీస్ జోరుగా...
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాతో ఇప్పటికే టెస్టు సిరీస్ కోల్పోయిన భారత్ మూడో టెస్టులోనైనా మెరుగ్గా ఆడాలని పట్టుదలగా ఉంది. ఈ నెల 24 నుంచి ఇక్కడి వాండరర్స్ మైదానంలో జరిగే ఈ మ్యాచ్ కోసం ఆటగాళ్లంతా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆదివారం వారంతా సుదీర్ఘ సమయం పాటు ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. సెంచూరియన్ పరాజయం తర్వాత మూడు రోజులు విశ్రాంతి తీసుకొని సరదాగా విహరించిన జట్టు సభ్యులంతా నెట్స్‌కు హాజరై చెమటోడ్చారు. ఫుట్‌బాల్ ఆడి వార్మప్ చేసిన తర్వాత ముందుగా జట్టు ఫీల్డింగ్‌పై దృష్టి పెట్టింది. పార్థివ్, రాహుల్, రహానే, రోహిత్, దినేశ్ కార్తీక్‌లతో కోచ్ ఆర్. శ్రీధర్ స్లిప్ ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేయించారు. మంగళవారమే జొహన్నెస్‌బర్గ్ చేరుకున్న ప్రాక్టీస్ బౌలర్లు శార్దుల్ ఠాకూర్, నవదీప్ సైని బంతులు విసరగా రాహుల్, విజయ్, పుజారా ఒకేసారి సాధన చేశారు. విజయ్, రాహుల్‌కు స్పిన్నర్లు అశ్విన్, జడేజా కూడా ఎక్కువ సేపు బౌలింగ్ చేశారు. అనంతరం కోహ్లి, రహానే, పాండ్యా బ్యాటింగ్‌కు దిగారు. తొలి రెండు టెస్టులకు జట్టులో స్థానం లభించని రహానే చాలా సేపు ఆడటం విశేషం. ప్రధాన పేసర్లు భువీ, షమీ వీరికి బౌలింగ్ చేశారు. మరో వైపు పిచ్‌పై ఉన్న పచ్చికను ఆదివారం కొంతవరకు తొలగించారు. ‘వికెట్‌పై తగినంత పచ్చిక ఉంచాం. మ్యాచ్‌కు ముందు దీనిని తగ్గించకపోవచ్చు. సరిపోయేంత నీటిని కూడా ఉపయోగిస్తున్నాం కాబట్టి సెంచూరియన్ తరహాలో పొడిబారిపోయే ప్రమాదం లేదు. దక్షిణాఫ్రికా జట్టు కోరిక మేరకే దీనిని సిద్ధం చేశాం. పేస్, బౌన్స్‌కు పిచ్ అనుకూలంగా ఉంటుంది’ అని వాండరర్స్ క్యురేటర్ బేతుల్ బుతెలెజి చెప్పారు. -
శ్రీలంక ముమ్మర ప్రాక్టీస్..విశ్రాంతిలోభారత్..
విశాఖ స్పోర్ట్స్ : సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా శ్రీలంక జట్టు శుక్రవారం బ్యాటింగ్, బౌలింగ్‌లతో పాటు ఫీల్డింగ్‌ను ప్రాక్టీస్ చేసింది. భారత్ జట్టు విశ్రాంతి తీసుకోగా శ్రీలంక ప్రాక్టీస్‌లో పాల్గొంది. శ్రీలంక జట్టు కోచ్ పోతాస్ ఆటగాళ్లకు నెట్స్‌లోనే మెళకువల్ని నేర్పించారు. చమిరా ఫాస్ట్ బౌలింగ్‌కు మెరుగులు దిద్దుకోగా కెప్టెన్ పెరీరా నెట్ ప్రాక్టీస్‌లో ఉల్లాసంగానే గడిపాడు. బ్యాటింగ్‌కు ప్రాక్టీస్ చేశాడు. ఏంజిలియో తన ఫాస్ట్ బౌలింగ్‌కు మరింత పదును పెట్టేందుకు తోటి ఆటగాళ్లతో ప్రాక్టీస్ చేశాడు. స్పిన్నర్లు సచిత్, డిసిల్వ సయితం ప్రాక్టీస్ చేశారు. వన్డే నిర్వాహక కమిటీ సమావేశం విశాఖలోని వైఎస్ఆర్ స్టేడియం వేదికగా ఆదివారం జరగనున్న వన్డే మ్యాచ్ నిర్వహణకై నిర్వాహక కమిటీ శుక్రవారం సమావేశమైంది. వైఎస్ఆర్ స్టేడియంలో నిర్వాహక కమిటీ చైర్మన్ ఎంటి కృష్ణబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అటగాళ్ల భద్రత ఏర్పాట్లు, టికెట్ల విక్రయాలు, అత్యవసర పరిస్థితిలో ఏర్పాట్లు, పిచ్‌తో పాటు ఔట్‌ఫీల్డ్ నిర్వహాణ తదితర అంశాలపై చర్చించారు. డే అండ్ నైట్ మ్యాచ్ కావడంతో ఫ్లడ్లైట్లను పరిశీలించారు. ఏసీఏ కార్యదర్శి అరుణ్‌కుమార్ , కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, జాయింట్ కలెక్టర్ సృజన, డీసీపీలు ఫకీరప్ప, షిమోషిన్, ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎం సుదేశ్‌కుమార్, ఏసీఏ కార్యదర్శి అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. భారత్ జట్టు నెట్ ప్రాక్టీస్... గురువారమే విశాఖ చేరిన భారత్ జట్టు శుక్రవారం పూర్తిగా విశ్రాంతి తీసుకుంది. వాస్తవానికి సాయంత్రం నాలుగు గంటల నుంచి వైఎస్ఆర్ స్టేడియంలోని నెట్స్‌లో ప్రాక్టీస్ చేయాల్సి ఉంది. శనివారం ఒంటిగంటన్నర నుంచి భారత్ జట్టు ప్రాక్టీస్ సెషన్ జరగనుంది. శ్రీలంక శనివారం సయితం పదిగంటలనుంచి ప్రాక్టీస్ చేసుకోనుంది. అప్పన్న సన్నిధిలో రవిశాస్త్రి శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని శుక్రవారం టీం ఇండియా క్రికెట్ కోచ్ రవిశాస్త్రి , బ్యాటింగ్ కోచ్ సంజయ్బంగర్ దర్శించుకున్నారు. వీరికి ఆలయ ధ్వజస్తంభం వద్ద దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం రవిశాస్త్రి, సంజయ్బంగర్ కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని బేడా ప్రదక్షిణ చేశారు. –సింహాచలం (పెందుర్తి) -
గురుపాద స్మరణే... సాధనకు మార్గం
‘‘నాకు ఉపనయనం చేసేటప్పుడు మా తండ్రిగారు గాయత్రీ మహామంత్రాన్ని ఉపదేశం చేశారు. తదనంతరం వేరొక గురువు మరొక మంత్రాన్ని ఉపదేశించారు. నేను ధ్యానం చేసేటప్పుడు, జపం చేసేటప్పుడు నా మనోనేత్రంతో ఏ దేవతా స్వరూపాన్ని చూస్తున్నానో నాకు ఆమె కనబడడం లేదు. ఆమెకు బదులుగా గురువుగారిచ్చిన వేరొకమంత్రం తాలూకు దేవతా రూపం కనబడుతున్నది. పోనీ ఆ మంత్రం చేద్దామనుకుంటే, తండ్రిగారిచ్చిన గాయత్రీ స్వరూపం కనబడుతోంది. ఒక్కొక్కసారి ఈ రెండూ కూడా కనబడకుండా ఇష్టదేవతా స్వరూపం కనబడుతున్నది. మరి ఆ ధ్యానశ్లోకం చెప్పి ఆ దేవతా స్వరూపాన్ని మనోనేత్రంతో చూడకుండా వేరొక దేవతా స్వరూపం లోపల దర్శనమవుతుంటే–అటువంటి రూపాన్ని ధ్యానం చేస్తూ జపం చేయవచ్చా ?’’ – మహాపురుషులు శృంగేరీ పీఠానికి ఆధిపత్యం వహించిన శ్రీ చంద్రశేఖర భారతీ స్వామి వారిని ఓ జిజ్ఞాసువు అడిగిన ప్రశ్న ఇది. ఉపదేశం పొందిన ఒక్కొక్క మంత్రానికి ఒక ధ్యానశ్లోకం ఉంటుంది. అంతటా నిండిన పరబ్రహ్మాన్ని సాకారరూపంగా ఇలా ఉంటుంది... ఆ రూపం అని చెప్పి ఊహచేస్తాం. తర్వాత మనసు దానితో తాదాత్మ్యత చెందడం మొదలుపెడుతుంది. ఉప్పుతో చేయబడిన ఒక బొమ్మ సముద్రంలో పడినప్పుడు లోతుకు వెళ్ళేకొద్దీ సాగరజలాల్లో అది కరిగిపోయినట్లు– ఏ వస్తువుపట్ల ధ్యానం మొదలుపెట్టాడో ఆ వస్తువులోనే సాధకుడు ఐక్యమయిపోతాడు. ఇప్పుడు ధ్యానం, ధ్యానవస్తువు, ధ్యేయం... మూడు ఒకటయిపోయి ఒక వస్తువుగా నిలబడిపోతుంది. అప్పుడు లోపలినుంచి ఆనందం అంకురించి రోమాంచితమవుతుంది. అలా జపం చేసేటప్పుడు శరీరానికి కదలిక లేకుండా ప్రాణాయామంతో ఊపిరిని బాగా క్రమబద్ధీకరిస్తే మనసు కదలదు. కదలని మనస్సును నిలబెట్టి ధ్యానవస్తువుని చూస్తూ క్రమంగా దేన్ని ధ్యానిస్తున్నాడో దానిలోకి లయమయ్యే ప్రయత్నం చేస్తాడు సాధకుడు. జిజ్ఞాసువు సందేహాన్ని విన్న స్వామివారు –‘‘నీకు నీ గురువుగారి పాదాలు గుర్తున్నాయా?’’ అని అడిగారు. ‘మా గురువుగారి పాదాలు నాకు ఎప్పుడూ జ్ఞాపకమే. అవి ఎప్పుడూ నా స్మరణలోనే ఉంటాయి’ అని ఆయన సమాధానం చెప్పారు. ‘‘గాయత్రి మహామంత్రం చేసినా, గురువుగారిచ్చిన వేరొక మంత్రం చేసినా ధ్యానశ్లోకం చదివి వదిలిపెట్టేయ్. ఆయాదేవతల రూపాన్ని ధ్యానం చేసే ప్రయత్నం చేయకు. నీకు పరమ ప్రీతికరం కనుక, నీకు వెంటనే జ్ఞాపకంలోకి వస్తాయి కాబట్టి నీ గురువుగారి పాదాలు ధ్యానం చెయ్. ఆ దేవతయినా, ఈ దేవతయినా గురువులోనే ఉంటారు. గురువు పరబ్రహ్మ స్వరూపం. అటువంటి పరబ్రహ్మ స్వరూపమైన గురుపాదాలను స్మరించి చేసే జపం సిద్ధిస్తుంది. నీ సాధన ఫలిస్తుంది’’ అని మహాస్వామివారు వివరించారు. కాబట్టి గురువుగారి పాదాలను ధ్యానం చేయడం అంటే.. పరబ్రహ్మను ధ్యానం చేయడమే. అందుకే ఇప్పటికీ మనం ‘‘గురుర్బహ్మ్ర, గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వర:’’ అంటాం. -
టీమిండియా ప్రాక్టీస్
-
అభ్యాసంతోనే ఆత్మజ్ఞానం
ఆత్మీయం ఆత్మజ్ఞానాన్ని పొందటం ఎలాగో యముడు నచికేతునికి చెబుతున్నాడు. మనస్సును ఎలా నడిపించాలో వివరిస్తున్నాడు....నీ శరీరమే రథం. ఆత్మ రథికుడు. బుద్ధి సారథి. మనస్సు ఆ సారథి చేతిలో ఉండే కళ్లెం. ఆ రథానికి గుర్రాలు ఇంద్రియాలు. విషయాలు, కోరికలే దారులు. శరీరం, ఇంద్రియాలు, మనస్సుతో కూడిన ఆత్మనే జ్ఞానులు ‘భోక్త’ అని పిలుస్తున్నారు. అంటే ఆత్మ ఉనికికి ఈ మూడూ కారణమన్నమాట. అదుపులోలేని మనస్సుతో ఆత్మజ్ఞానం లేకుండా తిరిగేవాడి ఇంద్రియాలు సారథి అధీనంలో లేని అశ్వాల్లాగా విచ్చలవిడిగా యథేచ్ఛగా పరుగెత్తుతాయి. ఎవడు విజ్ఞానవంతుడై మనస్సును స్వాధీన పరచుకుంటాడో అతడి ఇంద్రియాలు సారథి అదుపులో ఉన్న గుర్రాల్లాగా సరైన దారిలో ప్రయాణిస్తాయి. మనస్సును అదుపులో పెట్టుకోకుండా, విజ్ఞానం లేకుండా శారీరకంగా మానసికంగా అశుభ్రంగా ఉండేవాడు సంసారాన్ని దాటలేడు. పరమపదాన్ని పొందలేడు. చావుపుట్టుకల మధ్య తిరుగుతూ ఉంటాడు. ఎవడు విజ్ఞానవంతుడై, మనస్సును అధీనంలో ఉంచుకుంటాడో శుచిగా ఉంటాడో వాడు మాత్రమే మళ్లీ జన్మించనవసరం లేని పరమపదాన్ని చేరుకుంటాడు. ఎవడు విజ్ఞానాన్ని సారథిగా, మనస్సును కళ్లెంగా చేసుకుంటాడో ఆ మానవుడు సర్వవ్యాప్తమైన పరమపదానికి చేరుకుంటాడు. ఇంద్రియాల కంటే విషయాలు, విషయాలకంటే మనస్సు, మనస్సు కంటే బుద్ధి, బుద్ధికంటే ఆత్మ బలమైనవి. ఆత్మ కంటె అవతల ఉండేది అవ్యక్తం. అవ్యక్తానికి పైన ఉండేది పరమ పురుష స్థితి. దానికి మించినది ఏదీ లేదు. అదే మానవుడు చేరుకోవలసిన అత్యున్నత స్థితి. అన్ని ప్రాణుల్లోనూ ఆత్మ గూఢంగా కనపడకుండా ఉంటుంది. సూక్ష్మమూ, ఏకాగ్రమూ అయిన బుద్ధితో తపస్సుతో సాధన చేసేవారికి మాత్రమే అది గోచరిస్తుంది. సాధకుడైన మానవుడు జ్ఞానవంతుడై తన వాక్కును మనస్సులో, మనస్సును బుద్ధిలో, బుద్ధిని ఆత్మలో, ఆత్మను పరమశాంతమైన పరమాత్మలో లీనం చేసుకోవడం అభ్యాసం చెయ్యాలి. -
ప్రాక్టీస్‌లో అంతా బాగుంది!
కోచ్, కెప్టెన్ కలిసి సన్నద్ధం బర్మింగ్‌హామ్: కెప్టెన్ కోహ్లి, కోచ్ కుంబ్లే మధ్య విభేదాల గురించి బయట ఎన్ని వార్తలు ప్రచారంలో ఉన్నా... అసలైన ఆట సమయంలో మాత్రం వారిద్దరు ఎలాంటి సమస్య లేకుండా పని చేస్తున్నారు. శుక్రవారం భారత జట్టు నెట్స్‌లో ఇది బాగా కనిపించింది. ప్రాక్టీస్‌లో భాగంగా కోహ్లికి దాదాపు 20 నిమిషాల పాటు కుంబ్లే త్రో డౌన్స్ విసిరారు. ముందుగా డ్రైవ్ చేసిన కోహ్లి, ఆ తర్వాత కొన్ని బంతులను షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. మనసులో ఏమున్నా తమ శారీరక భాషలో మాత్రం దానిని వారు కనపడనీయలేదు. అనారోగ్యంతో రెండు వార్మప్ మ్యాచ్‌లకు దూరమైన యువరాజ్ సింగ్, సుదీర్ఘ సమయం పాటు సాధన చేశాడు. మరోవైపు ముందుగా అనుకున్నట్లుగా మాజీ కెప్టెన్ గంగూలీ భారత ఆటగాళ్లు ఎవరితోనూ సమావేశం కాలేదు. -
హైదరాబాద్ , కోల్‌కతా క్రికెటర్ల సీరియస్ ప్రాక్టీస్
-
ప్రాక్టీస్... ప్రాక్టీస్... ప్రాక్టీస్...
-
ప్రాక్టీస్... ప్రాక్టీస్... ప్రాక్టీస్...
- ఆస్ట్రేలియా ఆటగాళ్ల సుదీర్ఘ సాధన - కోహ్లీ, అశ్విన్‌లను ఉద్దేశించి వార్నర్ ఆసక్తికర కామెంట్స్ ముంబై: భారత గడ్డపై భారీ సమరానికి సన్నద్ధమవుతున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు బుధవారం తొలిసారి మైదానంలోకి అడుగు పెట్టింది. జట్టు సభ్యులంతా సుదీర్ఘ సమయం పాటు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. కీలక ఆటగాళ్లు స్మిత్, వార్నర్, ఖాజా, మ్యాక్స్‌వెల్ నెట్స్‌లోని వేర్వేరు వికెట్లపై తమ ప్రాక్టీస్‌ను కొనసాగించగా, మరి కొందరు స్లిప్ క్యాచింగ్‌లో పాల్గొన్నారు. ముఖ్యంగా స్థానిక స్పిన్ బౌలర్లతో పాటు జట్టు స్పిన్ కన్సల్టెంట్ శ్రీధరన్ శ్రీరామ్ బౌలింగ్‌లో ఆసీస్ క్రికెటర్లంతా స్పిన్‌ను ఆడటంపై ఎక్కువగా దృష్టి పెట్టారు. శుక్రవారం నుంచి ఇక్కడ జరిగే మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ ‘ఎ’తో ఆస్ట్రేలియా తలపడుతుంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టు ఈ నెల 23 నుంచి పుణేలో జరుగుతుంది. అశ్విన్‌తో పోరుకు సిద్ధం...: భారత్‌తో సిరీస్ అంటే ఆసీస్‌కు అశ్విన్ రూపంలోనే అగ్నిపరీక్ష ఎదురవుతోంది. నాలుగేళ్ల క్రితం 0–4తో కంగారూలు చిత్తుగా ఓడిన సిరీస్‌లో అశ్విన్ 29 వికెట్లతో చెలరేగాడు. ఈసారి భారత ఆఫ్ స్పిన్నర్‌ను ఎదుర్కొనేందుకు తాము సన్నద్ధమై వచ్చామని ఆ జట్టు అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్ వార్నర్ అన్నాడు.‘ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ మనసును చదివి బౌలింగ్ చేసే అశ్విన్ లాంటి బౌలర్నునేను గౌరవిస్తా. అతని బౌలింగ్‌లో జాగ్రత్తగా ఆడటం అవసరం. అయితే అశ్విన్ కోసం నా వద్ద ప్రత్యేక ప్రణాళిక సిద్ధంగా ఉంది. మా ఇద్దరి మధ్య ఆసక్తికర పోరు జరగవచ్చు’ అని వార్నర్ చెప్పాడు. కోహ్లితో స్లెడ్జింగ్ అంటే వ్యతిరేక ఫలితం వచ్చే ప్రమాదం కూడా ఉంటుందన్న వార్నర్... మాటల యుద్ధాన్ని ఎలా ఎదుర్కోవాలో గొప్ప ఆటగాళ్లకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదన్నాడు. స్లెడ్జింగ్ విషయంలో వార్నర్‌తో అతని సహచరుడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా ఏకీభవించాడు. అందుకే కోహ్లితో స్లెడ్జింగ్‌కు దిగే సాహసం చేయనని స్పష్టం చేశాడు. ‘కోహ్లిని నేను ఏమీ అనదల్చుకోలేదు. అది మాత్రం ఖాయం. ఎందుకంటే అతడితో పెట్టుకుంటే ఇక అంతే సంగతులు. ప్రస్తుతం అత్యద్భుత ఫామ్‌లో ఉన్న కోహ్లి అవుట్ కావాలంటే ఏ రనౌట్లాంటిదో అదృష్టం మాకు కలిసి రావాల్సిందే’ అని మ్యాక్స్‌వెల్ వ్యాఖ్యానించాడు. మరోవైపు భారత పిచ్‌లపై ఆస్ట్రేలియా పేసర్ మిషెల్ స్టార్క్ కూడా మంచి ప్రభావం చూపించగలడని, అతని పదునైన బౌలింగ్ విరాట్ కోహ్లిని కూడా ఇబ్బంది పెట్టవచ్చని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైక్ హస్సీ అభిప్రాయం వ్యక్తం చేశారు. -
బంగ్లాదేశ్ సాధన షురూ
ప్రాక్టీస్‌లో పాల్గొన్న ఆటగాళ్లు హైదరాబాద్: భారత్‌తో ఏకైక టెస్టు మ్యాచ్ సన్నాహకాల్లో భాగంగా బంగ్లాదేశ్ జట్టు శుక్రవారం తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో సుదీర్ఘ సమయం పాటు ఆటగాళ్లు సాధన చేశారు. కెప్టెన్ ముష్ఫికర్, తమీమ్, షకీబ్ ఎక్కువ సేపు నెట్స్‌లో శ్రమించారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో స్టేడియానికి వచ్చిన క్రికెటర్లు ముందుగా సమీపంలోని మసీదుకు వెళ్లి ప్రార్థనలు చేశారు. అనంతరం దాదాపు మూడు గంటల పాటు ప్రాక్టీస్ కొనసాగింది. టెస్టు మ్యాచ్ నిర్వహణకు అవకాశం ఉన్న రెండు పిచ్‌లను బంగ్లాదేశ్ టీమ్ మేనేజ్మెంట్ పరిశీలించింది. టెస్టుకు ముందు ఆది, సోమవారాల్లో బంగ్లాదేశ్ జట్టు జింఖానా మైదానంలో భారత్ ‘ఎ’తో రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుంది. గత సిరీస్ ప్రభావం ఉండదు... ప్రాక్టీస్ అనంతరం బంగ్లా ఆటగాడు మోమినుల్ హక్ మీడియాతో మాట్లాడాడు. పటిష్టమైన భారత్‌ను ఎదుర్కొనేందుకు తాము సన్నద్ధంగా ఉన్నామని అతను చెప్పాడు. ‘భారత్ బ్యాటింగ్ లైనప్ అద్భుతంగా ఉంది. స్పిన్ గురించి చెప్పనవసరం లేదు. నంబర్‌వన్ టీమ్‌ను సమర్థంగా ఎదుర్కోవాలని మా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. భిన్నంగా ప్రయత్నించే సాహసం చేయకుండా మూలాలకు కట్టుబడి ఆడి ఫలితం సాధిస్తాం. ఇటీవల న్యూజిలాండ్ చేతిలో సిరీస్ ఓడినా ఆ ప్రభావం ఇక్కడ ఉండదు. నాకు వ్యక్తిగత లక్ష్యాలు ఏమీ లేకపోయినా, సుదీర్ఘ సమయం క్రీజ్‌లో నిలబడాలని పట్టుదలగా ఉన్నా’ అని హక్ వ్యాఖ్యానించాడు. విరాట్ కోహ్లితో సంభాషించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు అతను చెప్పాడు. మరోవైపు బంగ్లాదేశ్ యువ ఆఫ్ స్పిన్నర్ మెహదీ హసన్ మిరాజ్ కూడా భారత్‌తో టెస్టు ఆడుతుండటంపై ఉద్వేగానికి లోనవుతున్నాడు. ‘పిచ్ నుంచి సహకారం లభిస్తే మా స్పిన్నర్లు కూడా మంచి ప్రభావం చూపగలరు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయగలమని నమ్ముతున్నా. అశ్విన్‌లాంటి ప్రపంచ స్థాయి స్పిన్నర్ బౌలింగ్‌ను దగ్గరి నుంచి పరిశీలించే అవకాశం నాకు దక్కుతోంది. ఈ అనుభవం నాకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. వీలుంటే అశ్విన్ నుంచి కొన్ని ఆఫ్ స్పిన్ కిటుకులు కూడా నేర్చుకుంటా’ అని హసన్ పేర్కొన్నాడు. -
జార్ఖండ్ జట్టుతో ధోని ప్రాక్టీస్!
నాగ్‌పూర్: న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ తరువాత ఇంటికే పరిమితమైన టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇప్పుడు ప్రాక్టీస్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. రంజీ ట్రోఫీలో భాగంగా జార్ఖండ్ జట్టుతో కలిసి ధోని ప్రాక్టీస్ చేసేందుకు సన్నద్ధమవుతున్నాడు. ప్రస్తుత జార్ఖండ్ జట్టులో అనధికార సభ్యునిగా ఉన్న ధోని.. సెమీ ఫైనల్లో పాల్గొని దాన్ని ప్రాక్టీస్ ఉపయోగించుకోవాలని యోచిస్తున్నాడు. ఈ మేరకు ఆదివారం నుంచి గుజరాత్ తో జరిగే సెమీ ఫైనల్లో జార్ఖండ్ జట్టులో ధోని కలిసే అవకాశం ఉంది. తన టెస్టు కెరీర్ నుంచి వీడ్కోలు తీసుకున్న తరువాత ఎటువంటి లాంగర్ ఫార్మాట్లో ధోని పాల్గొనడం లేదు. అయితే త్వరలో ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ నేపథ్యంలో ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో ప్రాక్టీస్ చేసిన తరువాత బరిలోకి దిగాలని ధోని భావిస్తున్నాడు. ఈ రంజీ సీజన్లో జార్ఖండ్ సెమీస్ కు చేరిన సంగతి తెలిసిందే. గత అక్టోబర్ 29న విశాఖపట్నంలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో తను చివరిసారిగా ఆడాడు. ఇక ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ జనవరి 15 నుంచి ప్రారంభం కానున్న తరుణంలో కనీసం ముందుగా కొంతవరకూ ప్రాక్టీస్ చేసి బరిలోకి దిగాలనేది ధోని యోచన. -
నిరంతర సాధనతో క్రీడల్లో రాణింపు
కప్పట్రాళ్ల(దేవనకొండ): నిరంతర సాధనతోనే క్రీడల్లో రాణించవచ్చునని జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ అన్నారు. ఆదివారం కప్పట్రాళ్ల గ్రామంలో పత్తికొండ జోనల్ స్థాయి క్రీడా పోటీల ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ, ఆయన సతీమణి పార్వతి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ క్రీడాకారులకు పోరాటపటిమ అవసరమన్నారు. కప్పట్రాళ్ల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నానన్నారు. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ రూ.25 లక్షల నిధులతో గ్రామంలో కమ్యూనిటీ హాల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కప్పట్రాళ్లలో ఈనెల 23, 24వ తేదీల్లో తానా ఆధ్వర్యంలో ఉచిత కేన్సర్ క్యాంప్‌ను నిర్వహిస్తున్నామన్నారు. నాలుగు రోజుల పాటు నిర్వహించే పోటీల్లో పాల్గొనేందుకు 40 పాఠశాలల నుంచి క్రీడాకారులు తరలిరావడంతో గ్రామానికి కొత్త కళ వచ్చింది. పత్తికొండ పీఈటీ రాజేష్ పీఈటీలపై రచించిన పాటల సీడీలను ఎస్పీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి, పీఈటీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, డీఎస్పీ బాబాఫకృద్దీన్, ఎంపీపీ రామచంద్రనాయుడు, జోనల్ చైర్మన్ మరియానందం, ఆర్గనైజింగ్ కార్యదర్శి వెంకటేశ్వర్లు, దేవనకొండ మాజీ సర్పంచ్ ఉచ్చీరప్ప, ఎంపీటీసీ సభ్యురాలు హైమావతి, సీఐలు విక్రమ్‌సింహ, శ్రీనివాస్, ప్రసాద్, ఎంఈఓ యోగానందం తదితరులు పాల్గొన్నారు. -
విశాఖలో భారత క్రికెటర్ల ప్రాక్టీస్
-
మైదానంలో చెమటోడుస్తున్న ధోనీ సేన!
-
ఆత్మ విశ్వాసంతో అడుగు ముందుకు..
* అతని మనోధైర్యం ముందు అంగవైకల్యం దిగదిడుపు * ప్రదర్శనలతో రాణిస్తూ జీవనం సాగిస్తున్న నూర్ గుంటూరు (ఆనందపేట): ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం తలవంచింది. నమ్ముకున్న కళలో రాణిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు నూర్ అలీఖాన్. ఆనందపేట, ఐదవ లైనుకు చెందిన మహమ్మద్ నూర్ అలీఖాన్ ఐదు నెలల వయసులో ఉండగా పోలియో సోకి అంగవైకల్యం బారిన పడ్డాడు. కాళ్లు రెండూ చచ్చుబడ్డాయి. అయినా నూర్ ఆలీఖాన్ కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేశాడు. నూర్‌కు చిన్నప్పటి నుంచి సినిమాలు, నటన, డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టం. అందుకే వాటిలో రాణించేదుకు కృషి చేశాడు. టీవీల ముందు కూర్చుని తనకు ఇష్టమైన పాటలను చూస్తూ సాధన చేశాడు. ఆరేళ్లుగా వందల సంఖ్యలో స్టేజీలపై ప్రదర్శనలు ఇస్తూ ప్రతిభ కనబరుస్తున్నాడు. అత్యుత్తమ ప్రదర్శనలతో పలువురి ప్రశంసలు, సన్మానాలు పొందుతూ ముందుకు సాగుతున్నాడు. రెండేళ్ల క్రితం మదర్ ధెరిస్సా వికలాంగుల ఆర్కెస్ట్రా పేరుతో సొంత ఆర్కెస్ట్రా ప్రారంభించి ప్రదర్శనలు ఇస్తున్నాడు. డ్యాన్స్‌లతో పాటు పాటలు పాడడం, మిమిక్రీ కళతో అలరిస్తున్నాడు. ఇప్పటివరకు గుంటూరు, విశాఖపట్నం, ఒంగోలు, నరసరావుపేట, చిలకలూరిపేటలలో ప్రదర్శనలు ఇచ్చి పలువురి మన్ననలు పొందాడు. కుటుంబ నేపథ్యం.... ఆర్ఎంపీ వైద్యుడైన ఇనాయత్, నిలోఫర్ దంపతులకు ముగ్గురు మగ సంతానం. వారిలో నూర్ అలీఖాన్ పెద్దవాడు. పదేళ్లక్రితం షహిన్తో వివాహం జరిగింది. ఇటీవలే వారికి బాబు జన్మించాడు. ప్రదర్శన ద్వారా వచ్చే ఆదాయంతో తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మంచి పేరు తెచ్చుకోవాలి... – మహమ్మద్ నూర్ అలీఖాన్ మంచి పేరు తెచ్చుకోవాలి...నలుగురికీ సహయ పడాలి. ఆదాయం కొంత ఎక్కువగా వచ్చినపుడు రోడ్లపై పడుకునే అనాథలకు ఆహారం పొట్లాలు అందిస్తాను. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టడమే నా లక్ష్యం. -
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
సివిల్స్ మెయిన్స్ ప్రిపరేషన్లో ‘రాయడం ప్రాక్టీస్’ చేయడమనేది కీలకమైన అంశం. ఎందుకంటే ఓ అంశానికి సంబంధించి ఎంతటి పరిజ్ఞానం, అవగాహన ఉన్నప్పటికీ రాతపూర్వకంగా సరిగా వ్యక్తీకరించకుంటే ఫలితం శూన్యం! వీలైనన్ని మాక్‌టెస్ట్‌లు రాయడం ద్వారా లోపాలను అధిగమించి, రాత తీరును మెరుగుపరుచుకోవచ్చు. సమకాలీన అంశాలపై ఎస్సేలు రాసి, నిపుణులతో దిద్దించుకోవాలి. దీనివల్ల బలాలు, బలహీనతలు తెలుస్తాయి. మెరుగుపరచుకోవాల్సిన అంశాలపై స్పష్టత వస్తుంది. రోజూ జనరల్ స్టడీస్, ఆప్షనల్ ప్రిపరేషన్‌కు సమయం కేటాయించాలి. ఉదయం జనరల్ స్టడీస్ చదివితే, సాయంత్రం ఆప్షనల్ సబ్జెక్టు చదవాలి. సమయం ఎక్కువగా అందుబాటులో ఉండదు కాబట్టి ఒకట్రెండు పేపర్లతోపాటు ఒక ప్రామాణిక మ్యాగజైన్‌కు పరిమితమవ్వాలి. ముఖ్యమైన అంశాలను ప్రత్యేకంగా నోట్ చేసుకోవాలి. ఎంత ఎక్కువ చదివామనే దానికంటే చదివిన విషయం ఎంత వరకు గుర్తుంది అనేది ప్రధానం. అందుకే పునశ్చరణకు ప్రాధాన్యం ఇవ్వాలి. సామాజిక, ఆర్థిక సర్వే; బడ్జెట్, ముఖ్యమైన కమిటీల నివేదికలు వంటి వాటిని అధ్యయనం చేయడం ముఖ్యం. రాష్ట్రపతి, ప్రధానిమంత్రి ప్రసంగాలపై దృష్టికేంద్రీకరించాలి. ఎందుకంటే వీటి ద్వారా వివిధ అంశాలకు సంబంధించిన ప్రభుత్వ ఆలోచన ధోరణి తేటతెల్లమవుతుంది. సమాధానం రాసేటప్పుడు ఒక ‘ఆఫీసర్’గా రాయాలి. ఆఫీసర్ అయినట్లు ఊహించుకుని సమాధానం రాస్తే మరింత ప్రాక్టికల్‌గా రాసే అవకాశం లభిస్తుంది. ఏదైనా సమస్య పరిష్కారానికి సూచనలు ఇచ్చేటప్పుడు క్షేత్రస్థాయిలో ప్రాక్టికల్‌గా అమలు చేయడానికి వీలయ్యే వాటిని సూచించాలి. సమాధానాల్లో నెగిటివ్ అభిప్రాయాలను రాయొద్దు. అన్నీ సమస్యలే.. అంతా అవినీతిమయం, ఏమీ చేయలేం.. వంటి నిరాశాజనక అభిప్రాయాలను కాకుండా ‘‘తప్పులున్నాయి.. వాటిని సరిదిద్దుకునేందుకు అవకాశముంది..’’ అనే సానుకూల ధోరణిని ప్రతిబింబించాలి. జనరల్ స్టడీస్ పేపర్-4 ప్రిపరేషన్‌కు ఇగ్నో మెటీరియల్‌ను సేకరించి వాటిలోని కేస్ స్టడీలను అధ్యయనం చేయాలి. -
యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం
చినకాకాని (మంగళగిరి) : యోగాతోనే మానవుడు సంపూర్ణ ఆరోగ్యంతో ప్రశాంతంగా జీవనం సాగిస్తాడని యోగా మాస్టర్ సీవీవీ అన్నారు. మండలంలోని చినకాకాని హాయ్ల్యాండ్ల ఉదయం ప్రభాకర్ ధ్యానమండలి ఆధ్వర్యంలో 17వ జాతీయ యోగా కార్యకమాన్ని ఆయన ప్రారంభించారు. యోగా చేసేవారంతా ఒకేచోట చేరి యోగా చేయాలనే లక్ష్యంతో ఇప్పటికి 16 సార్లు వివిధ ప్రాంతాలలో సర్వసాధక సత్యయోగ వేదికను నిర్వహించామన్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి 1,200 మంది యోగసాధకులు హాజరవగా యోగా గురువులు సీఎస్ జయకుమార్, ఆర్ఎస్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. -
కుర్తీ డిజైన్
లేడీస్ టైలర్ అందంగా కనిపించాలి.. అదే టైమ్‌లో స్టైలిష్ అనే కాంప్లిమెంట్ రావాలి. దాంతో పాటే కంఫర్ట్ ఉండాలి. ఇవన్నీ ఒక్క కుర్తీతో సాధించేయవచ్చు. గతంలో కుర్తా మగవారు ధరించే దుస్తులలో ఒకటి. అదే కుర్తా కొన్ని రూపురేఖలు మార్చుకొని ఆడవారి వార్డ రోబ్‌లో కంపల్సరీ డ్రెస్‌గా కుర్తీ పేరుతో చేరిపోయింది. క్యాజువల్, పార్టీ వేర్... ఏ తరహా అయినా కుర్తీని మనమే డిజైన్ చేసుకుంటే..!! ఎలా కట్ చేయాలి? ఎలా స్టిచ్ చేయాలి? ఈ వారం తెలుసుకుందాం... బ్లౌజ్ కటింగ్ మాదిరిగానే కుర్తీ డిజైనింగ్‌కి కూడా ముందు పేపర్ మీద డిజైన్ గీసుకుని, తర్వాత దాని కొలతలను బట్టి, క్లాత్‌ను కట్ చేసుకుంటే కటింగ్ సరిగ్గా వస్తుంది. అదీ కాకుండా కొత్తగా ప్రాక్టీస్ చేసేవారు పేపర్‌మీద నేర్చుకోవడం సరైన పద్ధతి. పేపర్ చార్ట్, గుర్తు పెట్టడానికి టైలర్స్ చాక్ (మార్కింగ్ చేసుకోవడానికి వీలుగా చాక్‌పీస్) తీసుకోండి చార్ట్‌ను నిలువుగా, మధ్యకు మడవాలి మీ ఛాతి చుట్టుకొలత 34 అయితే (కింద అన్ని ఛాతి, వెయిస్ట్, హిప్.. చుట్టుకొలతల చార్ట్ ఇస్తున్నాం. పరిశీలించండి) నడుము భాగం 28, హిప్స్ (పిరుదులు) భాగం 38 తీసుకోవాలి ఎ-బి భాగం = ఫుల్ లెంగ్త్ ఎ-ఇ = ఆర్మ్‌హోల్ (చంకభాగం 2 వైపులా) ఎ-ఎఫ్ = నడుము భాగం ఎ-జి = పిరుదుల భాగం ఇఇ1= ఛాతి చుట్టుకొలత ఎఫ్.ఎఫ్.1 = నడుము కొలత జి.జి.1 = పిరుదల భాగం పై నుంచి కిందవరకు స్ట్రెయిట్ లైన్ ఎ1 నుంచి ఇఇ1-ఇ2 వరకు, ఇక్కడ నుంచి మళ్లీ ఎ1 దగ్గర అర అంగుళం కింద నుంచి ఎ2 వరకు మార్క్ చేసుకోవాలి * ఆర్మ్‌హోల్ మధ్య భాగాన ఎ2 , ఇ2 , ఎ 4 వరకు మార్క్ చేసుకోవాలి. * ఎ4 నుంచి ఎ 5 వరకు మార్క్ చేసేటప్పుడు లోపలి వైపు అర అంగుళం ఎక్కువ వదిలి మార్క్ చేయాలి అలాగే వెనుక భాగం ఆర్మ్‌హోల్ కర్వ్‌ను గీసుకోవాలి. * ఎఎ1 = భుజ భాగం (2 వైపుల) ఎఎ2 = అర అంగుళం భుజం వాలు * ఎఎ3 - మెడ భాగం (2 వైపుల) ఎ3, ఎ2 భుజం వాలు స్ట్రెయిట్ లైన్ * బి1 మార్క్ చేసేటప్పుడు మూలన అర అంగుళం గీయనక్కర్లేదు. * ఎ.హెచ్ = నెక్ డెప్త్‌గా తీసుకోవాలి. చేతుల భాగం: ఎ-బి = స్లీవ్స్ లెంగ్త్ (చేతుల పొడవు) ఎ-ఎ1 = 3 అంగుళాలు ఎఎ2 = ఆర్మ్‌హోల్ రౌండ్ (చంకభాగం చుట్టుకొలత) ఎఎ3 = 1 అంగుళం ఎ3 నుంచి ఎ2 వరకు స్ట్రెయిట్ లైన్, మధ్య భాగం ఎ4 ఎ4 నుంచి అర అంగుళం ఎక్కువ వదులుతూ ఎ5- ఎ6 వరకు మార్క్ చేయాలి వంపు వచ్చేలా ముందు వెనక చంకభాగం వరకు ఎ,ఎ3,ఎ5,ఎ1,ఎ,ఎ3,ఎ6,ఎ1 దగ్గర మార్క్ చేసుకోవాలి చేతుల చుట్టుకొలత = బి-బి1 ఆర్మ్ చుట్టుకొలత ముందుభాగం గీసేటప్పుడు వంపు వచ్చేలా చూసుకోవాలి. ఇందుకు (బి,బి1,ఎ1, ఎ5,ఎ3 నుంచి ఎ నుంచి ఎ1, ఎ6, ఎ3 నుంచి ఎ) ఇలా అంకెలు పెట్టి వంపు వచ్చేలా డ్రా చేసి, కట్ చేయాలి. ఇలా డ్రా చేసుకుంటే కట్ చేసేటప్పుడు కర్వ్ సరిగ్గా వస్తుంది. క్లాత్ మీద: తీసుకున్న ఫ్యాబ్రిక్‌ని నాలుగు మడతలు వేసుకోవాలి. దీని మీద కొలతల ప్రకారం కట్ చేసిన పేపర్ నమూనాను ఉంచి, క్లాత్‌ను కట్ చేసుకోవాలి. (కట్ చేయడానికి ముందు పేపర్ కన్నా ఒకటిన్నర (1 1/2) అంగుళం సైడ్ మార్జిన్ వదలాలి. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్‌లను మాత్రం విడిగా విడ్త్‌ను బట్టి కట్ చేసుకోవాలి. లైనింగ్ కుర్తీ అయితే: కొలతలను డ్రా చేసుకున్న పేపర్ చార్ట్‌ను ముందుగా లైనింగ్ క్లాత్ మీద పెట్టి, మార్క్ చేసి, కత్తిరించాలి. ఆ తర్వాత లైనింగ్ క్లాత్‌ను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి, కట్ చేసుకోవాలి. లైనింగ్, సిల్క్ ఫ్యాబ్రిక్ ఒకేసారి పెట్టి కట్ చేస్తే కొలతల్లో తేడాలు వచ్చే అవకాశం ఉంది. 1. పేపర్ చార్ట్ మీద డ్రా చేసుకొని, కట్ చేసిన ముందు, వెనుక భాగాలు 2. కట్ చేసిన పేపర్ నమూనాను క్లాత్ మీద పెట్టి అంగుళం మార్జిన్ వదిలి కట్ చేయాలి. 3. స్లీవ్స్ భాగం కట్ చేసే విధానం. దివ్యా మనిహర్ ఫ్యాషన్ డిజైనర్, ఇన్స్టిట్యూటో డిజైన్ ఇన్నోవేషన్ (ఐడిఐ), హిమాయత్‌నగర్, హైదరాబాద్ www.alwaysrupesh@gmail.com -
నమ్మించారు..నగదు, నగలతో పరారయ్యారు
♦ మోసం చేసిన దంపతుల అరెస్టు ♦ గుర్తు తెలియని వ్యక్తులకు ఇళ్లు అద్దెకు ఇవ్వొద్దన్న సీఐ రాజిరెడ్డి వేంసూరు : గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన చల్లా వాసు-లక్ష్మీతిరుపతమ్మ దంపతులు కుర్చీలు, ఫ్యాన్లు, చాపలు తదితర వస్తువులను వారాల పద్ధతిలో ఇస్తూ వ్యాపారం చేసేవారు. ఈ క్రమంలోనే మండల పరిధిలోని కందుకూరుకు చెందిన నరిశెట్టి లలితమ్మ ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ఇంటి యజమానురాలితో వరసలు కలిపి ఆమెను నమ్మించారు. ఈ నెల 6వ తేదీన ఆ దంపతులు సత్తుపల్లిలో పెళ్లికి వెళ్తున్నాం... మా వద్ద పెట్టుకునేందుకు బంగారం లేదు.. మీ బంగారం ఇస్తే పెళ్లికి వెళ్లి వస్తామని చెప్పి నమ్మించారు. అదీగాక అదే రోజు ఆ ఇంటి యజమానురాలు డబుల్‌కాట్ మంచం కింద దాచిన రూ.70వేలు నగదును గమనించారు. లలితమ్మ ఇంట్లో లేని సమయంలో ఆ డబ్బు చోరీ చేసి పరారయ్యూరు. లలితమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఆమె చెప్పిన గుర్తుల ఆధారంగా గురువారం పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా, వీరిపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకొని విచారించారు. అసలు విషయం వెల్లడైంది. వారి వద్ద నుంచి మూడు గ్రాముల బంగారం, రూ.70వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సత్తుపల్లి రూరల్ సీఐ రాజిరెడ్డి మాట్లాడుతూ ఇంటి యజమానులు అద్దెకు వచ్చేవారి వివరాలు తెలుసుకోకుండా అద్దెకు ఇస్తే వారు ఎలాంటి వారో కనిపెట్టడం కష్టమన్నారు. కందుకూరు ఘటనలో ఇదే జరిగిందన్నారు. నిందితులను కోర్టుకు రిమాండ్ చేసినట్టు సీఐ తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సై వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ఆచరణే అసలు నివాళి
కొత్త కోణం చరిత్రాత్మకమైన కుల నిర్మూలన పుస్తకంలో ఒక నిర్దిష్ట కార్యాచరణని ఆయన ప్రకటించారు. మార్పును కోరుకునే వారు ఈ ప్రతిపాదనల గురించి ఆలోచించాలి. ప్రధాని మోదీ ‘ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్’ నినాదం నిజం కావాలని నిజంగా కోరుకుంటే అంబేడ్కర్ ప్రతిపాదించిన అంశాలు ప్రాతిపదికగా నిలవాలి. కానీ తాను ప్రకటించిన విషయాలను అంగీకరించాలని, వీటినే అమలు చేయాలని అంబేడ్కర్ ఫర్మానా జారీ చేయలేదు. మనుషులంతా ఒక్కటే అనే భావనను నమ్మితే వీటి గురించి ఆలోచించక తప్పదు. భారత అత్యున్నత చట్టసభల్లోను, కోటాను కోట్ల దేశ ప్రజల చెవుల్లోనూ ఇప్పుడు మారుమోగుతున్న పదాలు-రాజ్యాంగం, అంబేడ్కర్. గత నాలుగు రోజులుగా దేశాన్ని కుదిపేస్తున్న ఈ రెండు పదాల్లోనూ శతాబ్దాల దళితుల అంతర్మథనం, ఆత్మఘోష నిండి ఉన్నాయి. అంతులేని వివక్షాపూరిత రక్తసిక్త గాథలున్నాయి. అంబేడ్కర్ ఆలోచనల్లో నుంచి రూపుదిద్దుకున్న భారత రాజ్యాంగం స్వతంత్ర భారతంలో సక్రమంగా అమలు జరుగుతుందనీ, శతా బ్దాల అణచివేత, వెట్టిచాకిరీల నుంచి తమకు విముక్తి లభిస్తుందనీ తాడిత, పీడిత జనం ఎదురుచూస్తూనే ఉన్నారు. తమ తాతలు, ముత్తాతలు, ముత్తాత తాతలకు ఈ సమాజంలో జరిగిన ఆర్థిక, సామాజిక వివక్షకు ప్రాయశ్చిత్తంగా రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లు తమ అభివృద్ధికి బాటలు వేస్తా యని ఆశించారు. కానీ అందుకు విరుద్ధమైన పరిస్థితులు, వాతావరణం వ్యాపించి ఉన్న సమయంలో రాజ్యాంగంపై పార్లమెంటులో చర్చ జరగడం గమనించాల్సిన విషయం. అక్షరాలా ఈ సభలోనే రాజ్యాంగ విరుద్ధమైన చర్యలు ఎన్నో గతంలో జరిగాయి. అచ్చోటనే మళ్లీ బాబాసాహెబ్ కలల ప్రపంచం రాజ్యాంగం గురించి చర్చ జరగడం అరుదైన ఘట్టం. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా జరిగిన ఈ చర్చ సరళిని పరిశీలిస్తే మాత్రం ఆశించిన స్థాయిలో లేదనే భావించాలి. ప్రతి పక్షం, విపక్షం తమ నిజాయితీని, నీతిని చాటుకోవడానికీ; తామే అంబేడ్క ర్ను, రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నామని చెప్పుకోవడానికీ ప్రయత్నించాయి. ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లు అంబేడ్కర్ అభిప్రా యాలను పదే పదే ఉటంకించారు. రాజ్యాంగాన్ని ఒక పవిత్ర గ్రంథంగా, అంబేడ్కర్‌ను ఆదర్శవంతమైన నాయకుడిగా మోదీ కొనియాడారు. ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్ తన అభిమతమని ప్రకటించారు. దాదాపు 7 దశాబ్దాల స్వతంత్ర భారతావనిలో అంబేడ్కర్ ఆశించిన సమాజం, అందులో భాగంగా రూపుదిద్దుకున్న రాజ్యాంగం ఏ మేరకు అమలు అయ్యాయన్నది మనందరికీ తెలిసినదే. అంబేడ్కర్‌ని కొనియాడటమో, ఆయన జయంతిని ఆర్భాటంగా జరపడమో కాదు, ఆయన ఆలోచనలను ఏ మేరకు ఆచరించగలమనే దాని మీదే అంబేడ్కర్‌పై పాలకులకున్న గౌరవం ప్రతిబింబిస్తుంది. భారత రాజ్యాంగం-అంబేడ్కర్ విడదీయరాని పదాలు. రచనాసభలో ఆయన చేసిన కృషి అనిర్వచనీయం. ఆ సభలో మాట్లాడుతూ అంబేడ్కర్ ‘షెడ్యూల్డ్ కులాల హక్కుల రక్షణకు రాజ్యాంగ సభలోకి నేను అడుగు పెట్టాను. అయితే నన్ను రాజ్యాంగ రచనా కమిటీలోకి తీసుకోవడం, ఆ కమి టీకి చైర్మన్‌గా నియమించడం నన్ను ఎంతగానో ఆకర్షించాయి’ అని లక్ష్యాన్ని స్పష్టంగా ప్రకటించారు. అంటే ఆయన మిగతా విషయాలమీద దృష్టి పెట్ట లేదని కాదు. ఇక్కడ అంబేడ్కర్‌ను గౌరవించడమంటే- తరతరాలుగా అంట రాని కులాల పేరుతో వెలివేతకు, అణచివేతకు, దోపిడీకి గురైన ప్రజలను ఈ సమాజంలో మనుషులుగా గుర్తించడం. వారి అభ్యున్నతికి ఆయన రాజ్యాం గంలోను, బయట ప్రతిపాదించిన అభిప్రాయాలను ఆచరించడానికీ, అమలు చేయడానికీ పూనుకోవడమే అంబేడ్కర్‌ను అనుసరిస్తున్నామనడానికి గీటు రాయి. తాను ఆశించిన సమాజం నినాదాల ప్రాయం కారాదాని అంబే డ్కర్ భావించారు. సమానత్వం, స్వేచ్ఛ సమాజానికి ఎంత ముఖ్యమో, సౌభ్రాతృత్వం కూడా అంతే ప్రధానమని అభిప్రాయపడ్డారు. ఆదర్శప్రాయ సమాజం మార్పునకు అనుకూలమై ఉండాలి. సంపదను, వనరులను సమా జం ఉమ్మడిగా అనుభవించగలిగే వాతావరణం ఉండాలి. అందరి మధ్య సోదరభావం ఉండాలి. దానినే సౌభ్రాతృత్వం అంటాం. అంటే ప్రజాస్వామ్య మని కూడా అర్థం. దీనికి అనుగుణంగా అంబేడ్కర్ రాజ్యాంగంలో ప్రాథ మిక హక్కులు, ఆదేశిక సూత్రాలను రూపొందించారు. అయితే నేటి పరిస్థితు లకూ పైన పేర్కొన్న ఆదర్శ సమాజానికీ సారూప్యమేమైనా ఉన్నదా? దేవుడి దృష్టిలో మనుషులందరూ సమానమని ప్రచారం చేస్తుంటారు. కానీ ఈనాటికీ అంటరాని కులాలను దేవాలయాల్లోకి అనుమతించరు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. కనీసం తాగునీటిని పొందడానికి కూడా దళితులకు అర్హతలేని స్థితి ఉంది. బావులు, చెరువులు ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో దళితులకు అందుబాటులో లేవు. కేంద్ర మాజీ మంత్రి కుమారి సెల్జా కూడా తనకు గుజరాత్‌లోని బెట్ ద్వారకాలో ఎదురైన చేదు అనుభవం గురించి లోక్‌సభలోనే నిలదీశారు. పార్ల మెంటు సభ్యురాలైనా సెల్జాకే కులం గురించిన ప్రశ్న ఎదురైతే, ఇక సామాన్య దళితుల పరిస్థితి ఎలా ఉంటుంది? ఇది భారతీయ దళితులందరికీ ఏదో రోజు ఎదురైన అనుభవమే. దేవాలయంలో పూజ కోసం వెళితే పూజారి గోత్రం అడుగుతాడు. సమాజానికి ఆవల బతికిన దళితుడికి గోత్రం లేదు. ఒకవేళ ఎవరైనా కల్పించి చెప్పినా దానిని పసిగట్టగలిగే పరిజ్ఞానం పూజారికి జన్మతః వస్తుంది. కొన్ని దేవాలయాల్లో మహిళలకు ప్రవేశం ఉండదు. మరికొన్ని దేవాలయాల్లో పురుషులు కూడా పై వస్త్రం ధరించి వెళ్ళ కూడదు. దానితో జంధ్యం ఉన్నదీ లేనిదీ తెలిసిపోతుంది. అంటే ఏదో విధంగా భక్తుడి కులాన్ని పసిగట్టి దానికనుగుణంగా అతనికి గుడిలో గౌరవం దక్కే దుస్థితి ఎదురవుతుంది. చివరకు శ్మశానంలో కూడా అంటరాని కులాల వారికి స్థానంలేదు. వాగులు, వంకలే వారి అంతిమ సంస్కారానికి గతి అవుతాయి. ఆర్ఎస్ఎస్ సర్సంఘ్చాలక్ మోహన్ భగవత్ 2013 దసరా సమ్మేళనం సందర్భంగా నాగ్‌పూర్‌లో చేసిన ప్రసంగంలో అందరికీ ఒకే దేవాలయం, ఒకే చోట నీరు, ఒకే శ్మశానం ఉండాలని పిలుపునిచ్చారు. అంటే ఈ వివక్ష ఉన్నట్టు వారు గుర్తించినట్టే కదా? అందుకే ఈ వివక్షని తొలగించడానికి ఒక కార్యాచరణ అనివార్యం. మళ్లీ ఇక్కడ అంబేడ్కర్ ప్రతిపాదించిన కార్యక్ర మాన్ని గుర్తుచేసుకోవాలి. చరిత్రాత్మకమైన కుల నిర్మూలన పుస్తకంలో ఒక నిర్దిష్ట కార్యాచరణని ఆయన ప్రకటించారు. మార్పును కోరుకునే వారు ఈ ప్రతిపాదనల గురించి ఆలోచించాలి. ప్రధాని మోదీ ‘ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్’ నినాదం నిజం కావాలని నిజంగా కోరుకుంటే అంబేడ్కర్ ప్రతి పాదించిన అంశాలు ప్రాతిపదికగా నిలవాలి. కానీ తాను ప్రకటించిన విష యాలను అంగీకరించాలని, వీటినే అమలు చేయాలని అంబేడ్కర్ ఫర్మానా జారీ చేయలేదు. మనుషులంతా ఒక్కటే అనే భావనను నమ్మితే వీటి గురించి ఆలోచించాలి. కుల నిర్మూలనకు అంబేడ్కర్ ప్రతిపాదించిన విషయాలు- 1. హిందువులందరికీ ఆమోదయోగ్యమైన, వారందరి చేత గుర్తింపునకు నోచుకున్న ఒకే ఒక ప్రామాణిక మత గ్రంథం రూపొందాలి. ఈ గ్రంథం ఒక్కటే హిందువులందరికీ అధికారిక గ్రంథమై ఉండాలి. ఇతర గ్రంథాల ప్రామాణికతను రద్దు చేయాలి. 2. హిందువులలో అర్చకత్వాన్ని రద్దు చేయాలి. అది సాధ్యం కాకపోతే వంశపారంపర్యంగా, కులం ప్రాతిపదికగా అర్చకత్వాన్ని అమలు చేయరాదు. నూతనంగా రూపొందిన హిందూ గ్రంథం ఆధారంగా నడుచుకునే ఏ వ్యక్తికైనా పూజారి కావడానికి అర్హత ఉండాలి. నిర్ణీత పరీక్ష లో నెగ్గిన వ్యక్తి మాత్రమే పూజారి కావడానికి అర్హుడు. అంబేడ్కర్ ఇంకా చాలా విషయాలు ప్రతిపాదించారు. ముందుగా ఈ రెండు విషయాలపైన చర్చ జరగాలి. వీటికి సరైన పరిష్కారం లభించనట్ల యితే ప్రత్యామ్నాయమైనా చూపాలి. ‘ఏక్ భారత్’ అంటున్నారు కాబట్టే ఈ ప్రతిపాదన. ఒకవేళ తామంతా సనాతన ధర్మానికే కట్టుబడి ఉంటాం, మార్పు అక్కర్లేదని ప్రకటిస్తే ఈ చర్చే లేదు. అంబేడ్కర్‌ను గౌరవిస్తున్నామని ప్రకటి స్తున్న వాళ్లు కనీసం దీనిపైన చర్చ జరిపి, ఆచరణాత్మకమైన కార్యక్రమాన్ని ప్రకటించాలి. ఇక రెండో విషయం, రాజ్యాంగం. పైన పేర్కొన్నట్లే ఎస్సీ, ఎస్టీల రక్షణ కోసం పొందుపరిచిన ఆర్టికల్స్ అమలుపై దృష్టి సారించాలి. వేల ఏళ్ల వివక్ష కారణంగా విద్య, ఆర్థిక రంగంలో వెనుకబడిన ఆ వర్గాల అభ్యు న్నతి కోసం 46వ ఆర్టికల్‌ను రాజ్యాంగంలో చేర్చారు. ‘అన్ని రకాల దోపిడీ, అన్యాయాల నుంచి బలహీనవర్గాలను ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీలను రక్షించ డానికి, విద్య, ఆర్థికరంగాల్లో వారిని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం శ్రద్ధ వహించాలి’. రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి అంబేడ్కర్ ప్రతిపా దించిన కీలకాంశం ఇది. దీనితోనే విద్యారంగంలో స్కాలర్షిప్స్, ప్రత్యేక వసతిగృహాలు ఏర్పాటయ్యాయి. 1974 నుంచి ఎస్సీ, ఎస్టీ ఫైనాన్స్ కోఆపరే టివ్ వ్యవస్థలూ వచ్చాయి. కానీ నిధుల కొరతతో అవి పరిమిత ప్రయోజ నాన్ని మాత్రమే సాధించాయి. ఈ అనుభవంతో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లలో జనాభా ప్రాతిపదికగా వాటా కల్పించాలని ప్రభు త్వాలు నిర్ణయించాయి. 1974 నుంచి ట్రైబల్ సబ్‌ప్లాన్, 1980 నుంచి స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ అమలులోకి వచ్చాయి. ఏ రాష్ట్రం, చివరకు కేంద్రం కూడా ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేయడానికి పూనుకోలేదు. ప్రజా ఉద్యమం ఫలితంగా మూడేళ్ల క్రితం డిసెంబర్ 2వ తేదీ అర్ధరాత్రి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సబ్ ప్లాన్ అమలుకోసం చట్టాన్ని తీసుకొచ్చింది. అసెంబ్లీ చరిత్రలోనే రెండు రోజులు దళితుల ఆర్థిక వాటాపై అసెంబ్లీ చర్చంచి ఈ చట్టానికి ఆమోద ముద్ర వేసింది. ఆ తర్వాత కర్ణాటక ప్రభుత్వం అలాంటి చట్టాన్నే రూపొందిం చుకున్నది. కానీ కేంద్రస్థాయిలో ఇప్పటివరకు ఇటువంటి చట్టం లేదు. యూపీఏ-2 ప్రభుత్వం సబ్‌ప్లాన్ చట్టాన్ని తేవడానికి ముసాయిదాను రూపొందించింది. అది చట్టరూపం దాల్చలేదు. ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లున్నా, ప్రమోషన్లలో ఆ అవకాశం లేదు. అందుకు కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ-2 లోక్‌సభలో ప్రవేశ పెట్టిన ప్రమోషన్లలో రిజర్వేషన్ బిల్లు కాగితాలను సమాజ్‌వాది పార్టీ సభ్యు లు చించి, అడ్డుకున్నారు. ఇంకా అనేక పథకాలు కాగితాల మీదే ఉన్నాయి. రాజ్యాంగంపై జరిగిన చర్చ అనంతరమైనా ఈ విషయాలపై దృష్టిసారిస్తే అంబేడ్కర్‌పై గౌరవం, రాజ్యాంగంపై విశ్వాసం ఉన్నట్టు అనుకోవాలి. లేదం టే మరోసారి భారత ప్రజలు, ప్రత్యేకించి దళితులు, ఆదివాసులు పార్ల మెంటు సాక్షిగా పరాభవం పాలైనట్టు భావించాలి. - మల్లెపల్లి లక్ష్మయ్య (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్: 97055 66213 -
జట్టు నుంచి వెళ్లాక బ్యాట్ ముట్టలేదు
రంజీ సీజన్‌కు ముందే ప్రాక్టీస్‌కు దిగా.. * ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టులో ఓసారి చోటు కోల్పోయాక ఏ క్రికెటర్ అయినా పునరాగమనం కోసం తీవ్రంగా శ్రమిస్తూ కిందా మీదా పడుతుంటారు. అయితే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మాత్రం ఈ విషయంలో బేఫికర్‌గా ఉన్నానంటున్నాడు. గత జూన్‌లో ఈ సౌరాష్ట్ర ఆటగాడు బంగ్లాదేశ్‌తో తన చివరి వన్డే ఆడాడు. అప్పటి నుంచి ప్రాక్టీస్ కాదు కదా కనీసం బ్యాట్‌ను కానీ బంతిని కానీ టచ్ చేయలేదంటున్నాడు. ఈ సమయమంతా పూర్తిగా విశ్రాంతికే పరిమితమయ్యానని చెప్పాడు. తనకిష్టమైన గుర్రపు స్వారీతో పాటు స్నేహితులతో సరదాగా గడిపానని అన్నాడు. కేవలం రంజీ సీజన్‌కు ముందే ప్రాక్టీస్‌పై దృష్టి సారించానని, నిజానికి తన శరీరం విశ్రాంతి కోరుకుందని తెలిపాడు. ఈ సీజన్లో తను సౌరాష్ట్ర తరఫున ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఏకంగా 24 వికెట్లు పడగొట్టడంతో దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యాడు. ‘బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ అనంతరం జట్టులో చోటు కోల్పోయాను. అప్పుడు కొద్ది సమయం క్రికెట్‌కు దూరంగా ఉండాలనిపించింది. అందుకే ఆటకు సంబంధించి ఎలాంటి కార్యకలాపాల్లో పాల్గొనలేదు. కనీసం బ్యాట్, బంతిని కూడా పట్టుకోలేదు. క్రికెట్ బటన్‌ను స్విచాఫ్ చేసి ఇతర వ్యాపకాల్లో మునిగాను. ఫాంహౌస్‌లో గుర్రాలతోనూ, స్నేహితులతోనూ ఎక్కువ సమయం గడిపాను. రంజీ సీజన్‌కు నెల రోజుల ముందు ప్రాక్టీస్ ప్రారంభిస్తూ నా బలంపై దృష్టి పెట్టాలనుకున్నాను. కొన్ని జిల్లా స్థాయి మ్యాచ్‌లు కూడా ఆడాను. ఇలాంటి ప్రాక్టీస్‌తో సీజన్లో రాణించాను’ అని 26 ఏళ్ల జడేజా పేర్కొన్నాడు. -
ఆస్ట్రేలియాక్రికెట్ పతనమే అర్జున్టెండూల్కర్ లక్ష్యం
-
టెన్నిస్ బంతులతో టీమిండియా ప్రాక్టీస్
సిడ్నీ: ప్రపంచకప్ సెమీఫైనల్ కోసం భారత క్రికెట్ జట్టు ప్రాక్టీస్ ప్రారంభించింది. దీంట్లో భాగంగా కోచ్ డంకెన్ ఫ్లెచర్ ఎక్కువగా బ్యాట్స్‌మన్ సురేశ్ రైనాపై దృష్టి పెట్టారు. షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడంలో రైనా బలహీనత తెలిసిందే. అయితే ఇప్పుడు ఆసీస్‌తో జరుగబోయే మ్యాచ్ కాబట్టి 45 నిమిషాల పాటు రైనాతో కోచ్ తడితో కూడిన టెన్నిస్ బంతులతో ప్రాక్టీస్ చేయించారు. నెట్స్‌లో ఓవైపు రాకెట్‌తో కోచ్ వేగంగా సర్వ్ చేస్తుంటే రైనా వాటిని ఆడాడు. పచ్చికతో కూడిన పిచ్‌పై ఈ బంతిని విసిరితే వేగంగా వెళుతుందనే ఉద్దేశంతో కోచ్ ఇలా ప్రాక్టీస్ చేయించారు. రైనా శరీరాన్ని లక్ష్యంగా చేసుకుని కొన్ని బంతులను విసరగా వాటిని హుక్ షాట్ ఆడబోయిన రైనా కొన్నిసార్లు మాత్రమే సక్సెస్ అయ్యాడు. అటు ధోని కూడా కొద్దిసేపు ఈ తరహా బంతులను రైనాకు విసిరాడు. అలాగే మిగతా బ్యాట్స్‌మెన్ పేసర్లు, స్పిన్నర్లను ఎదుర్కొంటూ తమ ప్రాక్టీస్ కొనసాగించారు. ప్రాక్టీస్‌కు షమీ దూరం: భారత పేసర్ షమీ సోమవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్ నుంచి విశ్రాంతి తీసుకున్నాడు. అయితే షమీ మోకాలి గాయంతో బాధపడుతున్నట్లు వినిపిస్తున్న కథనాలను టీమ్ మీడియా మేనేజర్ ఆర్ఎన్ బాబా ఖండించారు. ‘అతడు వంద శాతం ఫిట్‌గా ఉన్నాడు. సెమీస్ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడు. మోహిత్, ఉమేశ్ నెట్స్‌లో పాల్గొన్నా తను మరో రోజు విశ్రాంతి కావాలన్నాడు. టీమ్ దానికి అంగీకరించింది’ అని బాబా చెప్పారు. -
ఉప్పల్ స్టేడియంలో టీమిండియా ప్రాక్టీస్
హైదరాబాద్ : భారత్ క్రికెట్ జట్టు శనివారం ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఉప్పల్ స్టేడియంలో ఆదివారం జరిగే మూడో వన్డేలో భారత్, శ్రీలంక తలపడనున్న విషయం తెలిసిందే. దాంతో టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్‌కు దిగారు. కాగా ఉప్పల్ స్టేడియంలో మరోసారి ప్రేక్షకులకు పరుగుల వినోదం దక్కనుంది. వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లలాగే ఈ మ్యాచ్‌లోనూ భారీ స్కోరు నమోదయ్యే అవకాశం ఉంది. నగరంలో మూడేళ్ల తర్వాత రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరగనున్న వన్డే కోసం బ్యాటింగ్ పిచ్ సిద్ధం చేశారు. కాగా గతంలో ఉప్పల్ స్టేడియంలో నాలుగు వన్డే మ్యాచ్‌లు జరిగాయి. వాటిలో భారత్ 1 గెలిచి, 3 మ్యాచ్‌లు ఓడింది. -
విద్యార్థులు వక్తలుగా రాణించాలి
సామాజిక అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి బాలవక్త వర్క్‌షాప్‌లో ఏజేసీ కృష్ణారెడ్డి విద్యారణ్యపురి : విద్యార్థి దశ నుంచే ప్రాక్టీస్ చేస్తే విద్యార్థులు భవిష్యత్‌లో వక్తలుగా రాణించే అవకాశం ఉంటుందని అదనపు జారుుంట్ కలెక్టర్ (ఏజేసీ) కె.కృష్ణారెడ్డి అన్నారు. జిల్లా విద్యాశాఖ, కాకతీయ సోషల్ స్టడీస్ ఫోరం ఆధ్వర్యంలో ఇటీవల జిల్లాలోని అన్ని డివిజన్లలో బాలవక్త పోటీలను నిర్వహించారు. జిల్లాస్థాయిలో ఎంపిక చేసిన సుమారు 50 మంది విద్యార్థులకు రెండు రోజులుగా హన్మకొండలోని ఎస్ఆర్వీ హైస్కూల్లో వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. శనివారం వర్క్‌షాప్‌ను ఏజేసీ కృష్ణారెడ్డి సందర్శించి మాట్లాడారు. విద్యార్థులు పాఠ్యపుస్తకాల్లోని అంశాలతోపాటు సామాజిక అంశాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. వివిధ అంశాలపై నిర్వహించే ఉపన్యాస పోటీల్లో భాగస్వాములు కావడం వల్ల స్టేజీ ఫికర్ పోతుందన్నారు. విద్యార్థులకు కాకతీయ సోషల్ స్టడీస్ ఫోరం ఇలాంటి వర్క్‌షాప్‌లు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇంటాక్ సంస్థ బాధ్యులు ప్రొఫెసర్ పాండురంగారావు మాట్లాడుతూ చరిత్ర, సంస్కృతి, వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మూడింటిపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ ఎస్.విజయకుమార్ మాట్లాడుతూ ఇక్కడ నేర్చుకున్న అంశాలను తోటి విద్యార్థులతో పంచుకోవాలని సూచించారు. రాజీవ్ విద్యామిషన్ జిల్లా ప్రాజెక్ట్ ఏఎంఓ శ్రీనివాస్ మాట్లాడుతూ జీవితంలో విజయం సాధించాలంటే చిన్నతనం నుంచే నైపుణ్యాలను అలవర్చుకోవాలన్నారు. వర్క్‌షాప్‌లో భాగస్వాములవుతున్న విద్యార్థులకు ఈనెల 14న జిల్లాస్థాయి వక్తృత్వ పోటీలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. టాప్ టె న్లో నిలిచిన పది మందికి ‘బాలవక్త’ బిరుదును ప్రదానం చేయనున్నట్లు వివరించారు. వర్క్‌షాప్‌లో డైట్ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మారెడ్డి, కాకతీయ సోషల్ స్టడీస్ ఫోరం జిల్లా అధ్యక్షుడు ఆడెపు రవీందర్, ప్రధాన కార్యదర్శి జి.కృష్ణ, డిప్యూటీ డీఈఓ డి.వాసంతి మాట్లాడారు. ఉపాధ్యాయుడు ఎన్.రాజ్‌గోపాల్, నటుడు, వ్యాఖ్యాత కె.తిరుమలయ్య, సైకాలిజిస్టు జి.భవాని, పాఠ్యపుస్తక రచయిత డాక్టర్ ఆర్.గణపతి, కేయూ ప్రొఫెసర్ నర్సింహారావు వర్క్‌షాప్‌లో విద్యార్థులకు పలు మెళకువలు నేర్పించారు. రంగశాయిపేట ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు సతీష్ ప్రకాశ్ పాల్గొన్నారు. -
సర్వేలో మహిళల సిగపట్లు
ఈ ఇల్లు నాదంటే.. నాదని ఇద్దరు మహిళల ఘర్షణ ఆ ఇంటిని వదిలేసిన ఎన్యూమరేటర్ పోలీస్‌స్టేషన్‌కు చేరిన పంచాయితీ పరకాల : సర్వేకు వచ్చిన ఎన్యూమరేటర్‌తో ఈ ఇల్లు నాదంటే.. నాదని ఇద్దరు మహిళలు ఘర్షణ పడిన సంఘటన పట్టణంలోని వెలమవాడలో మంగళవారం సాయంత్రం జరిగింది. పట్టణంలోని వెలమవాడకు చెందిన దగ్గు నర్సింగరావు ఎంబీబీఎస్ వైద్యుడు. పరకాలలో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో సునీతతో 1999లో వివాహమైంది. కొంతకాలం అన్యోన్యంగా ఉన్నారు. తర్వాత విభేదాలు వచ్చాయి. అదే సమయంలో నర్సింగరావు శ్రీశైలం సమీపంలోని సుండిపేటకు చెందిన వాణి(నూర్జహాన్)ను 2005లో మరో పెళ్లి చేసుకున్నాడు. అతడు అనారోగ్యంతో 2008లో మృతిచెందాడు. అప్పటి నుంచి ఆయన భార్యలు సునీత, వాణి మధ్య తగాదా వచ్చి కోర్టుకెక్కారు. కోర్టులో కేసు విచారణలో ఉంది. ఇదే సమయంలో సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్నట్లు సమాచారం అందడతో వాణి సోమవారం రాత్రి పట్టణానికి చేరుకుంది. సర్వే కోసం వచ్చే సిబ్బంది కోసం మంగళవారం ఎదురుచూస్తున్నారు. ఆ కాలనీలో 9-49 ఇంటినంబర్లో ఉంటున్న వారివద్దకు ఎన్యూమరేటర్ కేదారి వచ్చారు. ఆయన సమక్షంలోనే సునీత, వాణి.. ఆ ఇంటిపై నా పేరు రాయమంటే.. నా పేరు రాయమని ఘర్షణకు దిగారు. గంటల తరబడి ఇద్దరు పేరు కోసం పట్టుబట్టడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వారిద్దరిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. సునీత, వాణికి సీఐ వెంకటేశ్వర్లు కౌన్సెలింగ్ ఇచ్చి గొడవ పెట్టుకోవడం సరికాదని సూచించారు. కేసు విచారణలో ఉండగా మీరిలా ప్రవర్తించడం పద్ధతి కాదని, మరోసారి గొడవ జరిగితే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. కాగా ఎన్యూమరేటర్ ఆ ఇంటిని మినహాయించి సర్వే కొనసాగించాడు. -
కుక్క కాటుకు దూరంగా...
అవగాహన కుక్క సామాజిక జంతువు. అది మనిషితోపాటుగా జీవించడానికి ఇష్టపడుతుంది. యజమానికి రక్షణ కల్పించే బాధ్యతను తీసుకుంటుంది. అయితే కుక్కలను సరిగ్గా మలుచుకోకపోతే మనిషిని ఏ క్షణాన అయినా కరిచేస్తాయి. పక్కింటి వారిని, వీథిలో వెళ్తూన్న వారిని ఎవరి మీదనైనా సరే దాడి చేసేస్తాయి. అందుకే కుక్క కాటు నుంచి రక్షణ పొందడం మనిషి ప్రధానకర్తవ్యం కూడా. పరుగెత్తే వారి మీద లంఘించి దాడిచేయడం, కరవడం కుక్కల సహజ లక్షణం. కాబట్టి కుక్క దాడి చేస్తుందనిపించినప్పుడు పరుగెత్తకూడదు. అరవకూడదు కూడా. దానిని పట్టించుకోకుండా ఒక చోట కదలకుండా నిలబడిపోతే కుక్క కూడా మనిషిని పట్టించుకోదు. కుక్క మన మీద నుంచి దృష్టి మరల్చిన తర్వాత మెల్లగా ఆక్కడి నుంచి దూరంగా వెళ్లిపోవాలి. అలవాటు పడిన కుక్కలతో ఆటలాడవచ్చు కానీ కొత్త వాటి జోలికి పోకూడదు. పాలు, పేపర్ బాయ్స్, పోస్ట్ మ్యాన్, పేపర్ కలెక్షన్ బాయ్స్, కేబుల్ బిల్ కలెక్షన్ బాయ్స్ మొదలైన వాళ్లు (అనేక ఇళ్లకు వెళ్లాల్సిన వాళ్లు), తాము వెళ్లే ఇళ్లలో కుక్కలు ఉంటే వాటిని అలవాటు చేసుకోక తప్పదు. అలాగే వాటికి వ్యాక్సినేషన్ వేయిస్తున్నారో లేదోనని తెలుసుకోవడం మంచిది. పిల్లలను పెట్డాగ్స్ని పెంచుకునే వారింటికి ఆటలకు పంపించేటప్పుడు జాగ్రత్తలు చెప్పాలి. -
కుక్కను చూసి మొరుగుతాడు..!
అతడి పేరు రూడీ రాక్. మిమిక్రీలో దిట్ట. ప్రత్యేకించి జంతువుల అరుపులను అనుకరించడంలో నేర్పరి. దాదాపు ఐదారు శునకజాతుల అరుపులను ప్రాక్టీస్ చేశాడు. ఆ జాతుల శునకాలను మచ్చిక చేసుకొని.. వాటి దగ్గర అచ్చం అలాగే అరిచాడు. (మొరిగానని అతడు అంటాడు). వాటిల్లో ఒక్కో శునకం ఒక్కో విధంగా రియాక్ట్ అయ్యింది. కొన్నేమో బెదిరి పారిపోయాయి. తమకు అలవాటు అయిన మనిషి మాట్లాడకుండా అచ్చంతమలాగే మొరిగే సరికి అవి షాక్ అయి పారిపోయాయి. మరికొన్ని ఏమో రాక్ పై విరుచుకుపడ్డాయి. అతడు ఉన్నట్టుండి మొరిగే సరికి అవి కూడా అందుకు దీటుగా స్పందిం చాయి. మరికొన్ని జాతి కుక్క పిల్లలు మాత్రం అర్థం కానట్టుగా ప్రవర్తించాయి. రాక్ మొరుగుతున్నట్టుగా అరుస్తున్నా.. ఆ శబ్దాన్ని అవి అర్థం చేసుకోక అతడిని తమ యజమానిగా భావించి ఆడుకోవడానికి ప్రయత్నించాయి. ఇంకొన్ని మాత్రం ఆ వీడియో సెటప్‌ను, రాక్ అరుపులను చూసి ‘ఏం జరుగుతోందిక్కడ..’అన్నట్టుగా చూశాయి. దాదాపు ఐదారు శునకజాతులతో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. రాక్ రూపొందించి యూ ట్యూబ్ లోకి అప్లోడ్ చేసిన ఈ వీడియో అందరినీ అలరిస్తోంది. ఈ వీడియోలో రాక్ శునకాలను అనుకరించడం ఒక ఎత్తు అయితే.. ఇతడి అరుపులను చూసి శునకాలు ఇచ్చే ఎక్స్ప్రెషన్లు మరో ఎత్తు. -
అతడిది అదో టైపు!
హైదరాబాద్‌లో పాతబస్తీలోని తలాబ్‌కట్ట దగ్గర నివసించే మహమ్మద్ ఖుర్షీద్ హుస్సేన్ రెండు గిన్నిస్ రికార్డులు అందుకున్నారు. రెండూ టైప్ చేయడంలోనే. 2012వ సంవత్సరం ఫిబ్రవరి రెండవ తేదీన ఇంగ్లిష్ అక్షరమాలను 3.43 సెకన్లలో టైప్ చేయడంలో మొదటి రికార్డు సాధించారు. అది మాత్రం చేత్తోనే. ఆ తర్వాత మరింత సృజనాత్మకంగా మరేదైనా చేయాలనిపించడంతో ఇలా ముక్కుతో టైప్ చేశాడు. ‘‘అప్పుడు నాకు ఏడేళ్లు. సమ్మర్ కోచింగ్ క్యాంపులో చేర్చింది మా అమ్మ. అక్కడ శిక్షకులు, సీనియర్ స్టూడెంట్స్ నేను టైప్ చేసే వేగం చూసి ఆశ్చర్యపోయేవారు. ప్రాక్టీస్ చేస్తే రికార్డు సాధించవచ్చు అని చెప్పారు. అప్పుడు పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు. మా అమ్మకు పిల్లలు చురుగ్గా ఎప్పుడూ ఏదో ఒక వ్యాపకంలో ఉండడం ఇష్టం. ఆమె రోజూ పేపర్ చదివి, పిల్లలు సాధించిన విజయాల వార్తలను మాకు చూపించేది. అలా నాకు కూడా ఏదో ఒక ప్రత్యేకత సాధించాలనిపించింది. నాకు బాగా వచ్చిన టైప్‌లోనే ప్రయత్నిద్దామనుకున్నాను’’ అని వివరించారీ యువకుడు. టైప్ చేయడంలో వేగం పెంచుకోవడానికి ఖుర్షీద్ కఠోరమైన సాధన చేశాడనే చెప్పాలి. రోజుకు ఎనిమిది గంటల సాధన చేయడంలో స్నేహితులు, కాలేజ్ యాజమాన్యం, తండ్రి అందరూ అతడికి సహకరించారు. బిటెక్ చదువుతున్న సమయంలో ‘కెఎమ్ఐటి’ కాలేజ్ యాజమాన్యం మధ్యాహ్నం నుంచి ఖుర్షీద్ టైప్ ప్రాక్టీస్ చేసుకోవడానికి అనుమతిచ్చింది. టైప్ మొదలు పెట్టగానే టైమ్ రికార్డు చేయడానికి స్నేహితులు సహకరించేవారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ పని తండ్రి అక్బర్ హుస్సేన్ చేసేవారు. ఇంటివద్ద రాత్రి ఏడు నుంచి పదకొండు వరకు సాధన చేసేవారు. ‘‘ఒక్కోసారి రాత్రి ఒంటిగంట అయినా ప్రాక్టీస్ ఇక చాలంటే వినేవాడు కాదు. నేను రికార్డు బ్రేక్ చేస్తాను పాపా... అని మొండిగా సాధన చేస్తుంటే ఖుర్షీద్‌తోపాటు కూర్చుని టైమ్ రికార్డు చేసేవాడిని. మామూలు కీబోర్డు రెండు వందలకు వస్తుంది. టీవీఎస్ కీబోర్డు అయితే సౌకర్యంగా ఉంటుందంటే పదిహేను వందలు పెట్టి కొన్నాను. కొన్నిసార్లు ఆర్థికంగా సర్దుబాట్లు చేసుకుని మరీ డబ్బు సిద్ధం చేశాను. బాబు గిన్నిస్ రికార్డు సాధించాడనే ఆనందం కంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించి విజయుడైనందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు తండ్రి అక్బర్. ఖుర్షీద్ చక్కటి క్రికెట్ క్రీడాకారుడు కూడా. గౌతమ్ మోడల్ స్కూల్లో క్రికెట్ జట్టుకి కెప్టెన్. పదవ తరగతిలో తల్లిదండ్రుల హెచ్చరికతో పుస్తకాలకే పరిమితమయ్యాడు. ‘‘క్రికెట్లో రాణించాలంటే చదువును పక్కన పెట్టి మరీ ప్రాక్టీస్ చేయాలి. పైగా చాలా ఖర్చవుతుంది. అంత ఖర్చుని భరించడం మాకు కష్టమే. దాంతో ఖుర్షీద్‌ని క్రికెటే కెరీర్ కావాలనుకుంటున్నావా, చదువు మీద ఆసక్తి ఉందా లేదా... అని అడిగితే చదువును పక్కన పెట్టడానికి ఇష్టపడలేదు. దాంతో ఖుర్షీద్ క్రికెట్ ప్రాక్టీస్ పాఠశాల స్థాయిలోనే ఆగిపోయింది. బాబు బెంగపెట్టుకోకూడదనే ఉద్దేశంతో... దేశమంతటా నీ పేరు తెలియాలంటే ఇంకా చాలా మార్గాలున్నాయని చెప్పాను. అలా తన దృష్టి రికార్డుల మీదకు మళ్లింది’’ అంటారు ఖుర్షీద్ తల్లి దిల్నాజ్ బేగం. ముక్కుతో టైప్ చేసే క్రమంలో జటిలమైన ఇబ్బందులనే ఎదుర్కొన్నాడు ఖుర్షీద్. టైప్ రైటర్ మీద సాధన చేయడంతో ముక్కు టైప్‌రైటర్ కీస్ మధ్యలో నలిగి, ముక్కు దూలానికి గాయమై రక్తం కారింది. వైద్యం చేసిన డాక్టర్ మందలించారు కూడా. ఆ సందిగ్ధ సమయంలో అమ్మ ఇచ్చిన ప్రోత్సాహమే నన్ను ముందుకు నడిపించింది. ‘‘దేశానికి రికార్డు తీసుకురావడంలో అయిన గాయం ఇది. రికార్డు వస్తే ప్రపంచ రికార్డుల జాబితాలో ఇండియా పేరు మరోసారి నమోదవుతుంది. గాయం నీ ఒక్కడిదే. రికార్డు దేశానిది. ప్రాక్టీస్ అపేసి నీ మనసు కష్టపెట్టుకుని, అసంతృప్తి చెందడం కంటే కొంత విరామం తీసుకుని గాయం తగ్గిన తర్వాత ప్రాక్టీస్ కొనసాగించు...’’ అని చెప్పింది. అంతటితో ఆగిపోలేదు. ‘‘ఖురాన్ చెప్పిన సూక్తులను విశ్వసించు. అవి నీలో ఆత్మవిశ్వాసం సడలకుండా మానసిక ధైర్యాన్నిస్తాయి...’’ అని కూడా చెప్పింది. అలాగే రికార్డు సాధనకు దేహదారుఢ్యం కూడా చక్కగా ఉండాలని శిక్షణ ఇప్పించింది. రోజూ ఉదయం కనీసం మూడు కిలోమీటర్ల దూరం పరుగెత్తడం, ఆ తర్వాత జిమ్‌లో వ్యాయామం తప్పనిసరి చేసింది’’ అని తన విజయంలో అడుగడుగునా ఉన్న తల్లి పాత్రను గుర్తు చేసుకున్నారు ఖుర్షీద్. ఈ ఏడాది బి.టెక్. పూర్తి చేసిన ఖుర్షీద్ పైచదువుల కోసం అమెరికా వెళ్తున్నారు. ఎంఎస్ చేయడానికి చికాగోలోని వాల్పరాసియో యూనివర్శిటీలో సీటు వచ్చింది. రానున్న ఆగస్టు ఐదవ తేదీ అమెరికా వెళ్లే విమానం ఎక్కనున్నారు. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసంతోపాటు ఇండియాకు మరిన్ని రికార్డులు సాధించడమే తన లక్ష్యం అంటారు. తల్లి తనకు పేపర్లలో వచ్చిన ప్రముఖులను ఆదర్శంగా చూపించేది. అలాంటిది తమ్ముళ్లిద్దరికీ తాను రోల్‌మోడల్ కావడం గర్వంగా ఉందంటారు. - వాకా మంజులారెడ్డి ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ హ్యావ్ చాలెంజ్డ్ మి టు టైప్ దిస్ సెంటెన్స్ యూజింగ్ మై నోస్ ఇన్ ద ఫాస్టెస్ట్ టైమ్’ ఈ వాక్యాన్ని ఇంగ్లిష్‌లో అక్షర దోషాలు, విరామ దోషాలు లేకుండా టైప్ చేయాలి. ఈ వాక్యాన్ని ఆరేళ్ల కిందట దుబాయ్‌లో ఓ అమ్మాయి ఒక నిమిషం 33 సెకన్ల సమయంలో టైప్ చేసి రికార్డు సృష్టించింది. 103 వర్ణాలున్న ఇదే వాక్యాన్ని 47.44 సెకన్ల సమయంలో టైప్ చేసి రికార్డును బ్రేక్ చేశాడు ఓ భారతీయుడు. ఆ కుర్రాడే -ఖుర్షీద్ హుస్సేన్. టైప్‌తో పరిచయం ఉన్న ఎవరికైనా... ఈ వాక్యాన్ని టైప్ చేయడానికి అంత సమయం తీసుకున్నారా? దానికి ప్రపంచ రికార్డు దక్కడమా అనే సందేహం వచ్చి తీరుతుంది. ఇది అలవోకగా చేతివేళ్లతో టైప్ చేయడంలో పోటీ కాదు. ముక్కుతో టైప్ చేయడంలో రికార్డు. గాయం నీ ఒక్కడిదే. రికార్డు దేశానిది. ప్రాక్టీస్ అపేసి నీ మనసు కష్టపెట్టుకుని, అసంతృప్తి చెందడం కంటే కొంత విరామం తీసుకుని గాయం తగ్గిన తర్వాత ప్రాక్టీస్ కొనసాగించు... అని అమ్మ దిల్నాజ్ బేగం చెప్పిన మాటలు ఖుర్షీద్‌కు స్ఫూర్తినిచ్చాయి. టైపింగ్‌లో రెండు గిన్నిస్ రికార్డులు సాధించిన తొలి భారతీయుడు ఖుర్షీద్ 2012లో చేతితో 3.43 సెకన్లలో ఇంగ్లిష్ అక్షరమాల టైప్‌చేయడం ఈ ఏడాది ముక్కుతో టైపింగ్‌లో రికార్డ్. -
బుద్ధుని తపోభూమిలో...
గ్రంథం చెక్క బోధిగయలో చాలా ఆలయాలు ఉన్నాయి. వీటిలో కొన్ని విదేశీయులు నిర్మించినవి. ప్రధాన మందిరంలో బుద్ధుడు ధ్యానం చేస్తున్నట్లుగా కనిపించే విగ్రహం ఎంతో ఆకట్టుకుంటుంది. ఈ విగ్రహాన్ని బంగారు, వెండి, మాణిక్యాలు, వైఢూర్యాలతో చెక్కిండ్రు. ఇక్కడ బుద్ధుని అవశేషాలు భద్రపరచిండ్రట. నిశ్చల సమాధిలో ఆసీనుడైన బుద్ధుని విగ్రహం ‘కోరికలే దుఃఖాలన్నిటికి మూలకారణం’ అని చెబుతున్నట్లుగా ఉంటుంది. మందిరం వెనుక భాగంలో బోధి వృక్షముంది. ఈ వృక్షం క్రిందనే బుద్ధునికి జ్ఞానోదయం కలిగిందట. ఆ వృక్ష శాఖలనే అశోకచక్రవర్తి కుమార్తె సంఘమిత్ర శ్రీలంకలోని అనురాధపురంలో నాటిందట. బుద్ధుని తపోభూమి అయిన బోధివృక్ష మూల స్థానాన్ని వజ్రాసనం అంటరు. మహాబోధి మందిరానికి ఉత్తరదిశగా ‘అనిమేషలోచన’ అనే స్తూపముంది. పేరుకు స్తూపమే కాని ఇది ఒక మందిరం. 55 అడుగుల ఎత్తున ఇటుకలతో కట్టిన ఈ మందిరం లోపల బుద్ధుని విగ్రహముంది. బుద్ధగయలో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేది ధ్యానముద్రలో ఉన్న భారీ బుద్ధ విగ్రహం. దీని ఎత్తు 80 అడుగులు. దేశంలోని బుద్ధ విగ్రహాలన్నిట్లోకి ఇది ఎత్తైది. బోధి వృక్షం ఆ కాలం నాటిదే అంటరు గాని యథార్థం కాదనిపిస్తుంది. ఒకవేళ దాని అంటేమో! చైనా, టిబెట్ భక్తులు బోధి వృక్షచ్ఛాయలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. బుద్ధుని ముందు ధ్యానంలో కూర్చున్న విదేశీ యువతిని చూస్తుంటే విగ్రహమేమోననిపించింది. అశోకుడు కట్టించిన రాతి గోడపై పాళీ భాషలో అతని పేరు చెక్కబడివుంది. జాతరలో చిల్లర కొట్లు వెలిసినట్లు బజారు నిండా పూసల దండలు, రుద్రాక్ష మాలలు, చిన్న చిన్న పటాలు అమ్మే దుకాణాలున్నయి. - దేవులపల్లి కృష్ణమూర్తి ‘మా యాత్ర’ నుంచి.