ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఎసెక్స్ జట్టుతో జరిగిన మూడు రోజుల సన్నాహక మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ రెండు ఇన్నింగ్స్‌ల్లో డకౌట్‌గా నిష్క్రమించడంతో అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సన్నాహక మ్యాచ్‌లోనే ఇలా ఆడితే ఇక అసలు టెస్టు సిరీస్‌లో ఎలా ఆడతాడో అనే సందేహాలు వెలిబుచ్చుతున్నారు. అదే సమయంలో ఒక ప్రాక్టీస్ వీడియోను ధావన్ సోషల్ మీడియాలో షేర్ చేయడం నెటిజన్లకు మరింత కోపాన్ని తెప్పించింది.