Google Fined $32 Million For Unfair Practices In South Korea's App Market - Sakshi
Sakshi News home page

గూగుల్‌ చీకటి ‘గేమ్‌’! రూ.260 కోట్ల భారీ జరిమానా..

Published Wed, Apr 12 2023 5:34 PM | Last Updated on Wed, Apr 12 2023 5:49 PM

google slapped with 32 million dollars fine for unfair practices in korean app market - Sakshi

టెక్‌ దిగ్గజం గూగుల్‌కు దక్షిణ కొరియాకు చెందిన యాంటీట్రస్ట్ రెగ్యులేటర్ రూ.260 కోట్ల భారీ జరిమానా విధించింది. కొరియన్ మొబైల్ గేమింగ్ యాప్ మార్కెట్‌లో ఆధిపత్యం కోసం గూగుల్‌, దాని ప్రాంతీయ అనుబంధ సంస్థలు అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించిన నియంత్రణ సంస్థ 42.1 బిలియన్ల వాన్‌లు అంటే భారతీయ కరెన్సీలో రూ.260 కోట్లకు పైగా జరిమానా విధించింది.

(ఆండ్రాయిడ్‌ యూజర్లకు కొత్త ఫీచర్‌.. స్టోరేజ్‌ సమస్యకు పరిష్కారం)

ఫెయిర్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్‌టీసీ) ప్రకారం.. గూగుల్‌ 2016 జూన్, 2018 ఏప్రిల్ మధ్య కాలంలో దక్షిణ కొరియా మొబైల్ గేమ్ కంపెనీలతో చీకటి ఒప్పందాలను కుదుర్చుకుంది. ఆ మేరకు వన్‌ స్టోర్‌లో వారి కంటెంట్‌ను విడుదల చేయకుండా అడ్డకుంది.

వన్ స్టోర్ అనేది నేవర్ కార్ప్‌తో పాటు దక్షిణ కొరియాకు చెందిన మరో రెండు మొబైల్ క్యారియర్లు  2016 జనవరిలో ప్రారంభించిన ఆ దేశ ప్రధాన స్వదేశీ యాప్ మార్కెట్. ఈ వన్‌ స్టోర్‌ ఏర్పాటు దక్షిణ కొరియాలో తమ మార్కెట్‌పై ప్రభావం చూపుతుందని భావించిన గూగుల్‌ యూఎస్‌ బెహెమోత్ గేమ్ కంపెనీలను తమ గూగుల్‌ ప్లే (Google Play)లో ప్రత్యేకంగా విడుదల చేసేలా ఒప్పందం చేసుకుంది. దీనికి బదులుగా వారి కంటెంట్ మార్కెట్‌లో ‘ఫీచర్డ్’గా కనిపించేలా చేయడంతో పాటు ఆ కంపెనీలకు ఇతర మార్కెటింగ్ ప్రయోజనాలనూ గూగుల్‌ అందించినట్లు ఎఫ్‌టీసీ పేర్కొంది. 
 
న్యాయమైన చిక్కుల నుంచి తప్పించుకునేందుకు గూగుల్‌ ఆ ఒ‍ప్పందానికి సంబంధించిన ఈమెయిల్‌లను ఉద్యోగుల చేత తొలగింపజేసింది. ఆ విషయాలను ఆఫ్‌లైన్‌లోనే చర్చించాలని కూడా కోరిందని ఎఫ్‌టీసీ తెలిపింది. ఎఫ్‌టీసీ గణాంకాల ప్రకారం.. 2016లో ఖర్చు చేసిన మొత్తంలో స్థానిక యాప్ మార్కెట్‌లో దాదాపు 80 నుంచి 85 శాతం వాటాను కలిగి ఉన్న గూగుల్‌ 2018లో 90 నుంచి 95 శాతానికి విస్తరించగలిగింది. మరోవైపు  ఈ కాలంలో వన్ స్టోర్ 15 - 20 శాతం నుంచి 5 - 10 శాతానికి మాత్రమే పడిపోయిందని ఎఫ్‌టీసీ పేర్కొంది. 

కాగా కొరియన్ ఎఫ్‌టీసీ నిర్ణయంతో తాము ఏకీభవించడం లేదని గూగుల్ తెలిపింది. తాము స్థానిక పోటీ చట్టాలను ఉల్లంఘించలేదని పేర్కొంది. రాతపూర్వక నిర్ణయాన్ని సమీక్షించిన తర్వాత తమ భవిష్యత్ కార్యాచరణను వెల్లడిస్తామని వివరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement