లండన్: యూరోపియన్ కమిషన్ విధించిన 2.4 బిలియన్ యూరో(రూ.22 వేలకోట్లు)ల జరిమానాను సవాల్ చేస్తూ గూగుల్ దాఖలు చేసిన కేసు వీగిపోయింది. గూగుల్ సెర్చ్‌లో గూగుల్ సొంతంగా షాపింగ్ సిఫారసులు చేయడం ద్వారా చట్టవిరుద్ధమైన ప్రయోజనం పొందిందంటూ.. 2.4 బిలియన్ యూరోల జరిమానా చెల్లిచాలంటూ 2017లో యూరోపియన్ కమిషన్ ఆదేశించింది. విజిటర్లను అనుచితంగా తన సొంత షాపింగ్ సేవల వైపు మళ్లించడం పోటీదారులకు నష్టం కలిగించడమేనని పేర్కొంది. ఈ ఆదేశాలను యూరోపియన్ యూనియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ తాజాగా సమర్థించింది.
గూగుల్ ఈ అప్పీల్‌ను తిరస్కరించింది. కోర్టు నిర్ణయం తమను నిరాశపరిచినట్టు, ఈ తీర్పు కేవలం కొన్ని వాస్తవాల ఆధారంగానే ఉన్నట్టు గూగుల్ ప్రకటన విడుదల చేసింది. పోటీదారులను సమానంగా చూడాలన్న యూరోపియన్ కమిషన్ నిర్ణయానికి అనుగుణంగా తాము 2017లో ఎన్నో మార్పులను అమల్లోకి తీసుకొచ్చినట్టు తెలిపింది. షాపింగ్ సెర్చ్ లిస్టింగ్‌లకు సంబంధించి వేలం నిర్వహించినట్టు వివరించింది. ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్, యాడ్‌సెన్స్ అడ్వర్టైజింగ్ ప్లాట్‌ఫామ్‌లకు సంబంధించి మరో రెండు ఈయూ యాంటీట్రస్ట్ కేసుల్లోనూ గూగుల్‌కు వ్యతిరేకంగా ఆదేశాలు రాగా, వీటిపై అప్పీల్‌కు గూగుల్‌కు ఇప్పటికీ అవకాశం మిగిలే ఉంది.
ఇదీ చదవండి: పీపీఎఫ్ ఖాతాలు క్లోజ్ చేయాల్సిందేనా..?
ఇదిలాఉండగా, గూగుల్‌లో యాడ్ ఇవ్వాలనుకునే ప్రకటన ఏజెన్సీలు కీవర్డ్‌లకు సంబంధించిన బిడ్‌ను వేలంలో గెలుపొందాల్సి ఉంటుంది. వినియోగదారులు సెర్చింజన్‌లో ఏదైనా సమాచారాన్ని తెలుసుకుంటున్నప్పుడు సెర్చ్ కీవర్డ్‌లకు అనుగుణంగా యాడ్స్ వచ్చేలా ఏర్పాటు చేస్తారు. అలా సెర్చ్ చేసేవారి అభిరుచులకు తగిన యాడ్స్ డిస్‌ప్లే అవుతుంటాయి. గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో సెర్చ్ యాడ్స్, డిస్‌ప్లే యాడ్స్, వీడియో యాడ్స్, షాపింగ్ యాడ్స్.. వంటి వివిధ రూపాల్లో ప్రకటనలు ఇస్తూంటారు.
Comments
Please login to add a commentAdd a comment