గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ తన కస్టమర్లకు 700 మిలియన్ డాలర్ల(సుమారు రూ.5800 కోట్లు) పరిహారాన్ని చెల్లించనుంది. అమెరికా రాష్ట్రాలకు చెందిన కస్టమర్లు, అటార్నీ జనరల్ దాఖలు చేసిన యాంటీ ట్రస్ట్ ఫిర్యాదు నేపథ్యంలో ఈ మొత్తాన్ని చెల్లించేందుకు గూగుల్ ఒప్పుకుంది. దాంతోపాటు ప్లే స్టోర్‌లో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించింది.
ఆండ్రాయిడ్ యాప్ స్టోర్ మార్కెట్‌పై గూగుల్ కొన్ని మార్గాల్లో అక్రమ గుత్తాధిపత్యాన్ని కలిగి ఉందని యూఎస్ కస్టమర్లు ఫిర్యాదులో ఆరోపించారు. కొన్ని అప్లికేషన్ల లావాదేవీలపై 30 శాతం కమిషన్ తీసుకుంటూ నిబంధనలకు విరుద్ధంగా ఆండ్రాయిడ్ యాప్ ధరలను పెంచినట్లు యూఎస్ అటార్నీ జనరల్ ఆరోపించారు. యాప్‌లో లావాదేవీలకు అనవసరమైన రుసుములను విధిస్తుందని చెప్పారు. ఈ ఫిర్యాదును విచారించిన అనంతరం అమెరికా కోర్టు తుది తీర్పును వెలువరించింది. కస్టమర్ల నుంచి చట్ట విరుద్ధంగా కంపెనీకి సమకూరిన నగదును వారికి సెటిల్ చేయాలని ఆదేశించింది. దాంతో గూగుల్ 700 మిలియన్ డాలర్లు(రూ.5800 కోట్లు) చెల్లించేలా ఒప్పందం చేసుకుంది.
ఇదీ చదవండి: చనిపోయినవారి ఖాతాలో డబ్బులు ఏమౌతాయి..?
యాప్‌ల కొనుగోళ్లకు అధికమొత్తంలో చెల్లించిన వినియోగదారులకు 630 మిలియన్ డాలర్లు(రూ.5200 కోట్లు) అందనున్నాయి. 70 మిలియన్ డాలర్ల(రూ.600 కోట్లు) రాష్ట్రాలకు చెల్లిస్తారు. ఈ నేపథ్యంలో కంపెనీ తన ప్లేస్టోర్‌లోని కొన్ని యాప్స్‌కు సంబంధించి మార్పులు తీసుకురానున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment