Google accounts
-
కస్టమర్లకు రూ.5800 కోట్లు చెల్లించనున్న గూగుల్.. ఎందుకంటే..
గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ తన కస్టమర్లకు 700 మిలియన్ డాలర్ల(సుమారు రూ.5800 కోట్లు) పరిహారాన్ని చెల్లించనుంది. అమెరికా రాష్ట్రాలకు చెందిన కస్టమర్లు, అటార్నీ జనరల్ దాఖలు చేసిన యాంటీ ట్రస్ట్ ఫిర్యాదు నేపథ్యంలో ఈ మొత్తాన్ని చెల్లించేందుకు గూగుల్ ఒప్పుకుంది. దాంతోపాటు ప్లే స్టోర్‌లో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించింది. ఆండ్రాయిడ్ యాప్ స్టోర్ మార్కెట్‌పై గూగుల్ కొన్ని మార్గాల్లో అక్రమ గుత్తాధిపత్యాన్ని కలిగి ఉందని యూఎస్ కస్టమర్లు ఫిర్యాదులో ఆరోపించారు. కొన్ని అప్లికేషన్ల లావాదేవీలపై 30 శాతం కమిషన్ తీసుకుంటూ నిబంధనలకు విరుద్ధంగా ఆండ్రాయిడ్ యాప్ ధరలను పెంచినట్లు యూఎస్ అటార్నీ జనరల్ ఆరోపించారు. యాప్‌లో లావాదేవీలకు అనవసరమైన రుసుములను విధిస్తుందని చెప్పారు. ఈ ఫిర్యాదును విచారించిన అనంతరం అమెరికా కోర్టు తుది తీర్పును వెలువరించింది. కస్టమర్ల నుంచి చట్ట విరుద్ధంగా కంపెనీకి సమకూరిన నగదును వారికి సెటిల్ చేయాలని ఆదేశించింది. దాంతో గూగుల్ 700 మిలియన్ డాలర్లు(రూ.5800 కోట్లు) చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. ఇదీ చదవండి: చనిపోయినవారి ఖాతాలో డబ్బులు ఏమౌతాయి..? యాప్‌ల కొనుగోళ్లకు అధికమొత్తంలో చెల్లించిన వినియోగదారులకు 630 మిలియన్ డాలర్లు(రూ.5200 కోట్లు) అందనున్నాయి. 70 మిలియన్ డాలర్ల(రూ.600 కోట్లు) రాష్ట్రాలకు చెల్లిస్తారు. ఈ నేపథ్యంలో కంపెనీ తన ప్లేస్టోర్‌లోని కొన్ని యాప్స్‌కు సంబంధించి మార్పులు తీసుకురానున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. -
రిస్క్‌లో లక్షలాది జీమెయిల్ అకౌంట్లు.. డిలీట్ చేయనున్న గూగుల్!
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది గూగుల్ అకౌంట్లు రిస్క్‌లో ఉన్నాయి. తరచుగా ఉపయోగించని లక్షలాది అకౌంట్లను గూగుల్ వచ్చే డిసెంబర్లో తొలగించనుంది. ఇనాక్టివ్ అకౌంట్లు తొలగించే ప్రక్రియలో భాగంగా గత రెండేళ్లుగా ఉపయోగించని అకౌంట్లను గూగుల్ డిలీట్ చేయనుంది. గూగుల్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ రుత్క్రిచెలీ దీని గురించి గత మే నెలలోనే బ్లాగ్‌పోస్ట్‌లో పేర్కొన్నారు. రిస్క్‌ను తగ్గించడంలో భాగంగా రెండేళ్లకు పైగా వినియోగంలో లేని అకౌంట్లను తొలగించేలా గూగుల్ అకౌంట్ల ఇనాక్టివిటీ పాలసీని అప్డేట్ చేస్తున్నట్లు వివరించారు. దీని ప్రకారం.. రెండేళ్లకు పైగా ఉపయోగించని గూగుల్ అకౌంట్లు డిలీట్ కానున్నాయి. అంటే ఆయా అకౌంట్లకు సంబంధించిన జీమెయిల్, డాక్స్, డ్రైవ్, మీట్, క్యాలెండర్‌తోపాటు గూగుల్ ఫొటోలు కూడా డిలీట్ అయిపోతాయి. అలాంటి అకౌంట్లతో ముప్పు గూగుల్ అకౌంట్ యూజర్ల తరచూ తమ అకౌంట్‌ను ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఇందుకోసం అప్పుడప్పుడు రెండంచల వెరిఫికేషన్ చెక్‌ను గూగుల్ అనుసరిస్తూ ఉంటుంది. ఇలా ధ్రువీకరించని అకౌంట్ల ద్వారా ముప్పు ఉండే అవకాశం ఉంటుందని గూగుల్ వైస్ ప్రెసిడెంట్ ఆ పోస్టులో పేర్కొన్నారు. అయితే తొలగింపు వ్యక్తిగత గూగుల్ అకౌంట్లకు మాత్రమే వర్తించనుంది. స్కూళ్లు, ఇతర వ్యాపార సంస్థలకు అకౌంట్లపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలుస్తోంది. వెంటనే యాక్టివేట్ చేసుకోండి సాధారణంగా చాలామందికి ఒకటి కంటే ఎక్కువ గూగుల్ అకౌంట్లు ఉంటాయి. అవసరానికి అనుగుణంగా ఇలా ఎక్కువ అకౌంట్లను క్రియేట్ చేస్తూ ఉంటారు. అయితే ఆ తర్వాత వాటి గురించి మరచిపోతుంటారు. ఇప్పుడు అలాంటి అకౌంట్లన్నీ డిలీట్ కాబోతున్నాయి. అలా కాకూడదంటే వాటిని వెంటనే యాక్టివేట్ చేసుకోండి. ఆయా అకౌంట్లను ఉపయోగించి ఈమెయిల్ చేయడం, గూగుల్ డ్రైవ్ ఉపయోగించడం, యూబ్యాబ్ వీడియోలు చూడటం, గూగుల్ ప్లే స్టోర్ యాప్‌ను డౌన్లోడ్ చేయడం, గూగుల్ సెర్చ్ చేయడం ద్వారా సంబంధిత అకౌంట్లను యాక్టివేట్ చేసుకోవచ్చు. -
గూగుల్ అకౌంట్... వాడకుంటే డిలీటే!
మీ గూగుల్ అకౌంట్‌ను ఈ మధ్య అసలే వాడటం లేదా? దాని వంక కన్నెత్తి చూసి రెండేళ్లయిందా? అయితే అది ఇక శాశ్వతంగా డిలీట్ అయిపోతుంది. ఈ మేరకు కొత్త పాలసీని 2023 డిసెంబర్ 1 నుంచి గూగుల్ అందుబాటులోకి తెస్తోంది. దీనికి సంబంధించిన వివరాలన్నీ తెలియజేస్తూ గూగుల్ ఈ వారమే తన యూజర్లందరికీ మెయిల్స్ పంపింది. తాను అందించే అన్ని సరీ్వసులు, ప్రొడక్టులకూ ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. ‘మా యూజర్లు అకౌంట్‌ను వాడటం మానేసినా వారి డేటా పూర్తిగా గోప్యంగా, సురక్షితంగా ఉండేలా చూడటమే మా లక్ష్యం. అకౌంట్ డిలీషన్ అందులో భాగమే’’ అని గూగుల్ ప్రకటించింది. వీటికి వర్తిస్తుంది ► గూగుల్ అకౌంట్‌ను రెండేళ్ల పాటు సైన్ ఇన్ చేయకపోతే, వాడకపోతే. ► ఒకసారి డిలీట్ చేసిన అకౌంట్ తాలూకు జీ మెయిల్ అడ్రస్‌ను ఇంకెవరికీ కేటాయించబోరు. ► సేఫ్టీ, సెక్యూరిటీ కారణాల రీత్యా తన పాలసీని ఇలా అప్డేట్ చేస్తున్నట్టు గూగుల్ తెలిపింది. ► అయితే అకౌంట్‌ను డిలీట్ చేసే ముందు గూగుల్ పలుమార్లు రిమైండర్ మెయిల్స్ పంపుతుంది. అవి సదరు అకౌంట్‌తోపాటు యూజర్ తాలూకు రికవరీ అకౌంట్‌కు కూడా వెళ్తాయి. ► ఏదైనా చర్య తీసుకోవడానికి కనీసం 8 నెలల ముందు నుంచే ఈ మెయిల్స్ రావడం మొదలవుతుంది. మీ గూగుల్ అకౌంట్ యాక్టివ్‌గా ఉండాలంటే... ► తరచూ లాగిన్ అవుతూ ఉన్నా... ► కనీసం రెండేళ్లకు ఒకసారైనా లాగిన్ అయినా... ► గూగుల్ డ్రైవ్ వాడినా... ► మెయిల్ పంపినా, చదివినా... ► యూట్యూబ్‌లో వీడియో చూసినా... ► ఏ గూగుల్ యాప్ డౌన్లోడ్ చేసినా... ► థర్డ్ పార్టీ యాప్, సరీ్వస్ లను గూగుల్ ద్వారా సైన్ ఇన్ చేసినా మీ గూగుల్ ఖాతాకు ఎలాంటి ఢోకా ఉండదు. మినహాయింపులున్నాయ్.. గూగుల్ అకౌంట్ డిలీషన్ పాలసీకి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. వాటి ప్రకారం రెండేళ్ల పాటు వాడకంలో లేని అకౌంట్లను డిలీట్ చేసే కొత్త విధానం ఈ కింది వాటికి వర్తించదు ► యూట్యూబ్ చానల్స్, ఖాతాకు, కామెంట్లున్న గూగుల్ అకౌంట్ ► డబ్బులతో కూడిన గిఫ్ట్ కార్డులున్న జీ మెయిల్ అకౌంట్ ► పబ్లిషిడ్ అప్లికేషన్ ఉన్న అకౌంట్ – సాక్షి, నేషనల్ డెస్క్ -
గూగుల్ సంచలన నిర్ణయం
Google Two Step Verification: సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. యూజర్ భద్రత విషయంలో ఇక మీదట యూజర్ అనుమతితో సంబంధం లేకుండా వ్యవహరించబోతోంది!. ఇందులో భాగంగా ఇప్పటికే ఉన్న వెరిఫికేషన్‌ను.. మరింత కట్టుదిట్టం చేయనుంది. తద్వారా హ్యాకర్లు గూగుల్ అకౌంట్లను అంత తేలికగా హ్యాక్ చేయలేరికా!. సాధారణంగా గూగుల్ అకౌంట్‌ను రెగ్యులర్ డివైజ్‌లలో లాగిన్ కానప్పుడు కన్ఫర్మ్ మెసేజ్ ఒకటి వస్తుంది. దానిని క్లిక్ చేస్తేనే అకౌంట్ లాగిన్ అవుతుంది. అయితే ఇక మీదట ఇది రెండు దశల్లో (2 సెటప్ వెరిఫికేషన్) జరగనుంది. హ్యాకర్లు అకౌంట్‌ను ట్రేస్ చేయడానికి వీల్లేని రేంజ్లో ఈ విధానం ఉండబోతోందని మంగళవారం గూగుల్ ఒక ప్రకటనలో వెల్లడించింది. అంతేకాదు రకరకాల సాఫ్ట్వేర్లను ఉపయోగించి హ్యాకర్లు పాస్‌వర్డ్‌ను ఊహించడం లేదంటే దొంగతనంగా అకౌంట్‌ను లాగిన్ కావడం లాంటి చర్యలు సంక్లిష్టం కానున్నాయి. స్వయంగా గూగులే.. Two-Factor Authentication పేరుతో ఈ సెక్యూరిటీని చాలాకాలం క్రితమే తీసుకొచ్చింది గూగుల్. ఇందుకోసం గూగుల్ క్రోమ్, జీమెయిల్, ఇతరత్ర గూగుల్ అకౌంట్లను అప్డేట్ కావాల్సి ఉంటుంది. అయితే ఈ ఫీచర్‌ను యూజర్ యాక్టివేట్(సెట్టింగ్స్ ద్వారా) చేయాల్సిన అవసరమేం లేదు. యూజర్ పర్మిషన్ లేకుండా గూగులే ఈ పని చేయనుంది. 2021 డిసెంబర్ కల్లా 150 మిలియన్ గూగుల్ అకౌంట్లను టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ పరిధిలోకి తీసుకురానున్నట్లు గూగుల్ పేర్కొంది. అలాగే 20 లక్షల యూట్యూబ్ క్రియేటర్లను Two-Factor Authentication ఫీచర్‌ను ఆన్ చేయాల్సిందిగా సూచించింది. ఒకవేళ యూజర్ ఈ వ్యవస్థ వద్దనుకుంటే సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆఫ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం డివైజ్‌లలో లాగిన్ అయ్యేవాళ్లకు 2 సెటప్ వెరిఫికేషన్ తప్పకుండా కనిపిస్తుంది. రెగ్యులర్ డివైజ్‌లలో అప్పుడప్పుడు నొటిఫికేషన్ రావొచ్చని గూగుల్ స్పష్టం చేసింది. చదవండి: ఈ యాప్స్‌ను ఫోన్ నుంచి అర్జెంట్‌గా డిలీట్ చేయండి -
స్మార్ట్ఫోన్లే టార్గెట్‌గా...
వాషింగ్టన్ : ఆండ్రాయిడ్ ఫోన్ల ద్వారా గూగుల్ ఖాతాదారులను టార్గెట్ చేస్తున్న షాకింగ్ న్యూస్ ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. హ్యాకర్లు తమ రూటు మార్చి మొబైల్ ఫోన్ల ను తమ టార్గెట్ గా ఎంచుకున్నట్టు టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యేకంగా రూపొందించబడిన గూలిగ్యాన్ అనే హానికరమైన సాఫ్ట్ వేర్ ద్వారా పదిలక్షల (మిలియన్)కు పైగా గూగుల్ వినియోగదారుల ఖాతాలను హ్యాక్ చేసినట్టు భద్రతా పరిశోధకులు బుధవారం చెప్పారు. చెక్ పాయింట్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ నివేదిక ప్రకారం గూలిగాన్ అనే మాల్వేర్ తో గూగుల్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగించే ఆండ్రాయిడ్ 4.0 , 5.0 స్మార్ట్ ఫోన్ల ద్వారా హ్యాకర్లు దాడికి దిగుతున్నారు. తద్వారా లక్షలమంది వినియోగాదారుల జీమెయిల్స్ ఖాతాలు హ్యాక్ అయ్యాయని బాంబు పేల్చింది. సాధారణంగా యాప్ లు డౌన్ లోడ్ చేసుకుంటున్న సందర్భంలోనూ, లేదా ఫిషింగ్ మేసెజెస్, హానికరమైన లింక్ లు, మెసేజ్ లను క్లిక్ చేయడం ద్వారా ఈ దాడి ప్రారంభమవుతోందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 2016 ఆగస్టులో ప్రవేశపెట్టిన గూలిగ్యాన్ అప్లికేషన్ ద్వారా రోజుకు 37 వేల డివైస్ లు హ్యాక్ అవుతున్నట్టు తెలిపింది. వీటిల్లో 57 శాతం స్మార్ట్ ఫోన్లు ముఖ్యంగా ఆసియా ప్రాంతంలో, సుమారు తొమ్మిది శాతం యూరోప్ లో ఉన్నట్టు తమ పరిశోధకులు గుర్తించారని పేర్కొంది. ఇలా ఈ మెయిల్స్, ఫోటోలు సహా, డాక్యుమెంట్లు, ఇతర సెన్సిటివ్ డ్యాటాను తస్కరించే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతోపాటు గూగుల్ ప్లే ద్వారా కూడా వినియోగదారుల డాటాను తస్కరించే అవకాశంఉందని తెలిపింది. యాప్ లను డౌన్ లోడ్ సందర్భంగా ఖాతాదారుడు రేటింగ్ పై క్లిక్ చేసినపుడు ఎటాక్ చేస్తున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించి మొత్తం సమాచారాన్ని గూగుల్ సంస్థకి రిపోర్ట్ చేశామన్నారు. ఈ మాల్వేర్ పై విచారించి. వినియోగదారుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు. అయితే ఈ తాజా హ్యాకింగ్ అలజడిపై టెక్ దిగ్గజం గూగుల్ అధికారికంగా స్పందించాల్సి ఉంది.