Google Two Step Verification: సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. యూజర్ భద్రత విషయంలో ఇక మీదట యూజర్ అనుమతితో సంబంధం లేకుండా వ్యవహరించబోతోంది!. ఇందులో భాగంగా ఇప్పటికే ఉన్న వెరిఫికేషన్‌ను.. మరింత కట్టుదిట్టం చేయనుంది. తద్వారా హ్యాకర్లు గూగుల్ అకౌంట్లను అంత తేలికగా హ్యాక్ చేయలేరికా!.
సాధారణంగా గూగుల్ అకౌంట్‌ను రెగ్యులర్ డివైజ్‌లలో లాగిన్ కానప్పుడు కన్ఫర్మ్ మెసేజ్ ఒకటి వస్తుంది. దానిని క్లిక్ చేస్తేనే అకౌంట్ లాగిన్ అవుతుంది. అయితే ఇక మీదట ఇది రెండు దశల్లో (2 సెటప్ వెరిఫికేషన్) జరగనుంది. హ్యాకర్లు అకౌంట్‌ను ట్రేస్ చేయడానికి వీల్లేని రేంజ్‌లో ఈ విధానం ఉండబోతోందని మంగళవారం గూగుల్ ఒక ప్రకటనలో వెల్లడించింది. అంతేకాదు రకరకాల సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించి హ్యాకర్లు పాస్‌వర్డ్‌ను ఊహించడం లేదంటే దొంగతనంగా అకౌంట్‌ను లాగిన్ కావడం లాంటి చర్యలు సంక్లిష్టం కానున్నాయి.
స్వయంగా గూగులే..
Two-Factor Authentication పేరుతో ఈ సెక్యూరిటీని చాలాకాలం క్రితమే తీసుకొచ్చింది గూగుల్. ఇందుకోసం గూగుల్ క్రోమ్, జీమెయిల్, ఇతరత్ర గూగుల్ అకౌంట్లను అప్‌డేట్ కావాల్సి ఉంటుంది. అయితే ఈ ఫీచర్‌ను యూజర్ యాక్టివేట్(సెట్టింగ్స్ ద్వారా) చేయాల్సిన అవసరమేం లేదు. యూజర్ పర్మిషన్ లేకుండా గూగులే ఈ పని చేయనుంది. 2021 డిసెంబర్ కల్లా 150 మిలియన్ గూగుల్ అకౌంట్లను టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ పరిధిలోకి తీసుకురానున్నట్లు గూగుల్ పేర్కొంది. అలాగే 20 లక్షల యూట్యూబ్ క్రియేటర్లను Two-Factor Authentication ఫీచర్‌ను ఆన్ చేయాల్సిందిగా సూచించింది.
ఒకవేళ యూజర్ ఈ వ్యవస్థ వద్దనుకుంటే సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆఫ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం డివైజ్‌లలో లాగిన్ అయ్యేవాళ్లకు 2 సెటప్ వెరిఫికేషన్ తప్పకుండా కనిపిస్తుంది. రెగ్యులర్ డివైజ్‌లలో అప్పుడప్పుడు నొటిఫికేషన్ రావొచ్చని గూగుల్ స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment