game app
-
కస్టమర్లకు రూ.5800 కోట్లు చెల్లించనున్న గూగుల్.. ఎందుకంటే..
గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ తన కస్టమర్లకు 700 మిలియన్ డాలర్ల(సుమారు రూ.5800 కోట్లు) పరిహారాన్ని చెల్లించనుంది. అమెరికా రాష్ట్రాలకు చెందిన కస్టమర్లు, అటార్నీ జనరల్ దాఖలు చేసిన యాంటీ ట్రస్ట్ ఫిర్యాదు నేపథ్యంలో ఈ మొత్తాన్ని చెల్లించేందుకు గూగుల్ ఒప్పుకుంది. దాంతోపాటు ప్లే స్టోర్‌లో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించింది. ఆండ్రాయిడ్ యాప్ స్టోర్ మార్కెట్‌పై గూగుల్ కొన్ని మార్గాల్లో అక్రమ గుత్తాధిపత్యాన్ని కలిగి ఉందని యూఎస్ కస్టమర్లు ఫిర్యాదులో ఆరోపించారు. కొన్ని అప్లికేషన్ల లావాదేవీలపై 30 శాతం కమిషన్ తీసుకుంటూ నిబంధనలకు విరుద్ధంగా ఆండ్రాయిడ్ యాప్ ధరలను పెంచినట్లు యూఎస్ అటార్నీ జనరల్ ఆరోపించారు. యాప్‌లో లావాదేవీలకు అనవసరమైన రుసుములను విధిస్తుందని చెప్పారు. ఈ ఫిర్యాదును విచారించిన అనంతరం అమెరికా కోర్టు తుది తీర్పును వెలువరించింది. కస్టమర్ల నుంచి చట్ట విరుద్ధంగా కంపెనీకి సమకూరిన నగదును వారికి సెటిల్ చేయాలని ఆదేశించింది. దాంతో గూగుల్ 700 మిలియన్ డాలర్లు(రూ.5800 కోట్లు) చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. ఇదీ చదవండి: చనిపోయినవారి ఖాతాలో డబ్బులు ఏమౌతాయి..? యాప్‌ల కొనుగోళ్లకు అధికమొత్తంలో చెల్లించిన వినియోగదారులకు 630 మిలియన్ డాలర్లు(రూ.5200 కోట్లు) అందనున్నాయి. 70 మిలియన్ డాలర్ల(రూ.600 కోట్లు) రాష్ట్రాలకు చెల్లిస్తారు. ఈ నేపథ్యంలో కంపెనీ తన ప్లేస్టోర్‌లోని కొన్ని యాప్స్‌కు సంబంధించి మార్పులు తీసుకురానున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. -
ఆన్లైన్ గేమ్స్‌తో జాగ్రత్త! లేదంటే ఇలా జరుగుతుందేమో!?
మహబూబాబాద్: నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు. ఈ ఫోన్ల కారణంగా పిల్లలు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతుంటే.. యువకులు, ఆపై పడిన వారు పెడదారి పడుతున్నారు. ఆన్లైన్ బెట్టింగ్‌లకు పాల్పడుతూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఆన్లైన్లో అనేక క్రీడలకు సంబంధించి బెట్టింగ్‌లకు పాల్ప డడం, రుణాలు తీసుకోవడం, ఆఫర్ల పేరుతో మోసపోతూ దిక్కుతోచని స్థితికి చేరుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా ఆన్లైన్ బెట్టింగ్, రమ్మీ, లూడో, క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌తో పాటు అనేక రకాల ఆన్లైన్ గేమ్స్ ఆడి అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారు. కొంత మంది తేరుకొని వీటికి దూరమవుతుంటే చాలా మంది తమ ఆస్తులను విక్రయించుకునే దుర్భర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తల్లిదండ్రులకు తెలియకుండా వాహనాలు, ఆభరణాలు కూడా తనఖాలు పెట్టి జూదం ఆడుతున్నారు. నర్సంపేట పట్టణంలోని ఓ బ్యాంకు అధికారి కొద్ది రోజుల క్రితం బ్యాంకుకు సంబంధించిన డబ్బులతో ఆన్లైన్ గేమ్స్ ఆడి కోట్లాది రూపాయలు పోగొట్టుకున్నాడు. దీంతో చివరకు జైలు పాలయ్యాడు. ఇలా పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ఎంతో మంది యువకులు మోసపోతున్నారు. అవగాహన లేక అవస్థలు.. పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువత నిత్యం స్మార్ట్ ఫోన్లతో గడిపేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆన్లైన్ గేమ్స్ బారిన పడుతున్నారు. ఫలితంగా ఆయా కుటుంబాలు రోడ్డున పడుతున్న పరిస్థితి ఏర్పడుతోంది. కాగా, యువతకు అవగాహన లేకపోవడంతోనే ఆన్లైన్ గేమ్స్ ఆడి ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఆన్లైన్ గేమ్స్‌పై యువతకు అవగాహన కల్పించి ఆయా కుటుంబాలను శోకసంద్రం నుంచి రక్షించాలని పలువురు పేర్కొంటున్నారు. ఆన్లైన్ గేమ్స్‌తో ఎంతో మంది జీవితాలు నాశనమవుతున్నాయి. సామాన్య, మధ్య తరగతి, ధనిక వర్గాలకు చెందిన యువతతో పాటు మధ్య వయసు కలిగిన వారు కూడా ఆన్లైన్ ఉచ్చులో పడుతున్నారు. కష్ట పడకుండా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో ఆన్లైన్ క్రీడల్లో పాల్గొంటున్నారు. తక్కువ డబ్బులు పెట్టి ఎక్కువ పొందాలనే ఆశతో ఆన్లైన్ జూదం వైపు మరలుతూ చివరకు అప్పులపాలై క్షణికావేశంలో బలవన్మరణలకు పాల్పడుతున్నారు. దీంతో ఆయా కుటుంబాలు కన్నీటిసంద్రంలో మునుగుతున్నాయి. ఘటనలు..! నెక్కొండ మండలం అప్పల్‌రావుపేటకు చెందిన బాషబోయిన ఉదయ్(20) ఈ ఏడాది జూన్ 24న అర్ధరాత్రి ఆన్లైన్ గేమ్ ఆడాడు. కాగా, ఉదయ్ మొబైల్ ఫోన్‌కు తల్లి స్వప్న పేరిట బ్యాంకు ఖాతా అనుసంధానమై ఉంది. ధాన్యం అమ్మిన డబ్బులు రూ.50 వేలు ఆమె బ్యాంకు ఖాతాలో అదే రోజు ఉదయం జమ అయ్యాయి. రాత్రి ఒంటరిగా ఉన్న ఉదయ్(రమ్మీ) ఆన్లైన్ గేమ్స్ ఆడుతుండగా రూ.46 వేలు పోగొట్టుకున్నాడు. దీంతో తల్లిదండ్రులు మందలిస్తారని భయపడిన ఉదయ్.. ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నర్సంపేట పట్టణంలోని మాధన్నపేట రోడ్డులో ఉంటున్న మిట్టపల్లి సాయిబాబా, మమత దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరి కుమారుడు ప్రశాంత్ నర్సంపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. సుజాత అనారోగ్యంతో పదేళ్ల క్రితం మృతి చెందింది. సాయిబాబా దర్జీ(టైలర్) పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రశాంత్ ఆన్లైన్ గేమ్‌తో మోసపోవడంతో తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన ప్రశాంత్ నవంబర్ 22న ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవి కూడా చదవండి: మృతదేహాల కలకలం! అసలేం జరుగుతుంది? -
క్రిక్‌పే లాంచ్ ఆలస్యమైంది.. క్షమించండి
క్రిక్‌పే లాంచ్ ఆలస్యం అయినందుకు ఆ యాప్ అధినేత, భారత్‌పే సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ క్షమాపణలు కోరారు. తన తండ్రి ఆకస్మిక మరణం కారణంగా క్రిక్‌పే లాంచ్ ఆలస్యమతోందన్నారు. ఈ మేరకు మార్చి 31న ట్వీట్ చేశారు. (CrickPe: ఫాంటసీ క్రికెట్ యాప్ ‘క్రిక్‌పే’ లాంచ్... అదీ ఐపీఎల్‌కు ముందు) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కొత్త సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని అందించలేకపోయామని అభిమానులకు క్షమాపణలు చెప్పారు. ఐపీఎల్ ప్రారంభ వారంలో క్రిక్‌పే యాప్ అందుబాటులోకి రాకపోయినప్పటికీ ఏప్రిల్ 3 నుంచి ఎటువంటి అవాంతరాలు లేకుండా క్రిక్‌పే యాప్ పూర్తిస్థాయిలో నడుస్తుందని హామీ ఇచ్చారు. (ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో 1,000 మంది నియామకం..) అష్నీర్ గ్రోవర్ తండ్రి అశోక్ గ్రోవర్ మార్చి 29న 69 సంవత్సరాల వయసులో మృతి చెందారు. ఐపీఎల్ ప్రారంభానికి ముందే అష్నీర్ గ్రోవర్ సరికొత్త క్రికెట్ ఫాంటసీ స్పోర్ట్స్ యాప్ క్రిక్‌పేని లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మార్చి 23న ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ డౌన్లోడ్ లింక్‌లను కూడా తన ట్విటర్లో షేర్ చేశారు. (Jio offer: జియో అన్లిమిటెడ్ డేటా ఆఫర్.. కొత్త కస్టమర్లకు ఉచిత ట్రయల్!) Sorry. In this week leading to CrickPe app launch I lost my dad. Tough decision was to abort launch or go ahead with IPL nevertheless. I promise the app will be without glitches by Monday. I failed - not making any excuses.@crickpe_app — Ashneer Grover (@Ashneer_Grover) March 31, 2023 -
భారతీయులు ఈ గేమ్‌ను తెగ ఆడేస్తున్నారు
భారత డెవలపర్లు రూపొందిస్తున్న యాప్స్, గేమ్స్‌ను వినియోగించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గూగుల్ ప్లే యాప్ స్టోర్‌లో 2019తో పోలిస్తే 2021లో ఏకంగా 200 శాతం పెరిగింది. దీనితో వాటిపై ఇన్వెస్టర్లు కూడా అసాధారణ స్థాయిలో ఆసక్తి కనపరుస్తున్నారని గూగుల్ ప్లే పార్ట్నర్షిప్స్ వైస్–ప్రెసిడెంట్ పూర్ణిమా కొచికర్ తెలిపారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ (మెయిటీ)స్టార్టప్ హబ్‌తో కలిసి గూగుల్ .. యాప్‌స్కేల్ అకాడమీ క్లాస్ 2022ని ఆవిష్కరించిన సందర్భంగా ఆమె ఈ విషయాలు వివరించారు. లూడో కింగ్ జాతీయ, అంతర్జాతీయంగా అత్యధికంగా ఆడుతున్న గేమ్స్‌లో ఒకటిగా మారిందని పూర్ణిమ చెప్పారు. భారత కంపెనీలు రూపొందించిన యాప్స్, గేమ్స్‌ను ఇతర దేశాల్లో ఉపయోగిస్తున్న వారి సంఖ్య 2021లో 150 శాతం పెరిగిందని ఆమె పేర్కొన్నారు. కొత్త ఆవిష్కరణలు కేవలం పెద్ద నగరాలకు మాత్రమే పరిమితం కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి కూడా వస్తున్నాయని పూర్ణిమ తెలిపారు. యాప్‌స్కేల్ అకాడమీ ప్రోగ్రాం కోసం 400 దరఖాస్తులు రాగా .. విద్య, వైద్యం తదితర రంగాలకు చెందిన 100 స్టార్టప్‌లు ఎంపికయ్యాయి. వీటికి యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైన్, వ్యాపార మోడల్, ఆదాయ వ్యూహాలు మొదలైన వాటిలో ఆరు నెలల పాటు శిక్షణ లభిస్తుంది. కొన్ని ఎంపిక చేసిన అంకుర సంస్థలకు .. ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్టులను కలిసే అవకాశం దక్కుతుంది. చదవండి: ఐఫోన్ ధర మరి ఇంత తక్కువా!! ఇంకెందుకు ఆలస్యం..ఇప్పుడే సొంతం చేసుకోండి!! -
పబ్జి ప్రియులకు ఇది చేదు వార్తే..
భారత్ లో పబ్జి గేమ్ ఇప్పట్లో లాంచ్ అయ్యే సూచనలు కనిపించడం లేదు. దేశ సరిహద్దుల్లో చైనాతో నెలకొన్నవివాదం నేపథ్యంలో దేశ భద్రతా దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం సెప్టెంబరులో 118 చైనా యాప్‌లను నిషేదించింది. ఈ నిషేధిత జాబితాలో ప్రపంచవ్యాప్తంగా బాగా గుర్తింపు పొందిన పబ్జి గేమ్ కూడా ఉంది. అయితే, ఈ గేమ్ నిర్వాహకులు టెన్సెంట్ గేమ్స్‌తో ఒప్పందాన్ని రద్దు చేసుకొని పబ్జి కార్పొరేషన్ సొంత సంస్థగా భారత్‌లో రిజిస్టర్ చేసుకుంది. దీనిలో భాగంగా "పబ్జి మొబైల్ ఇండియా" పేరుతొ తిరిగి మార్కెట్లోకి రావాలని భావిస్తుంది. గేమ్‌ను మళ్లీ భారత్‌లో లాంచ్ చేసేందుకు ఇంకా పబ్జి కార్పొరేషన్ కి కేంద్రం నుండి అనుమతులు లభించడంలేదు. పబ్జి ప్రీయులకు ఇది చేదువార్తే. (చదవండి: ఫేస్బుక్ లో మరో లోపం) అయితే, ఇదే విషయంపై ఇటీవల ఒకరు పబ్జి గేమ్ విడుదలపై ఆర్టీఐ ద్వారా సంబంధిత శాఖను సమాచారం కోరారు. ఈ ప్రశ్నకు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రతిస్పందిస్తూ.. ''పబ్జి ప్రారంభించడానికి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఎటువంటి అనుమతి ఇవ్వలేదు" అని ప్రకటించింది. ఈ ఆర్టీఐ ప్రశ్నను నవంబర్ 30న దాఖలు చేసినట్లు సమాచారం. ఆర్టీఐని సమాచారం కోరిన లేఖలో ఈ విదంగా ఉంది.. "ప్రియమైన సార్/ మేడమ్ 2020 సెప్టెంబర్ నెలలో మీ డిపార్ట్మెంట్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఉత్తర్వుల్లో భాగంగా భారత ప్రభుత్వం వివిధ చైనీస్ యాప్ లను నిషేధించింది. వాటిలో ఒకటి పబ్జి మొబైల్ గేమ్. ఇప్పుడు, దీని గురుంచి బయట చాల వార్తలు వస్తున్నాయి. భారతీయుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన ఈ గేమ్ "పబ్జి మొబైల్ ఇండియా" పేరుతొ త్వరలో రానున్నట్లు చాలా పుకార్లు వస్తున్నాయి. మీరు భారత్ లో ప్రారంభించడానికి ఈ గేమ్ కి అనుమతి ఇచ్చారా లేదా అనే విషయం తెలుసుకోవాలని అనుకుంటున్నాను" అని ఆర్టీఐ దాఖలు చేసిన పిర్యాదులో ఉంది. పబ్జి గేమ్ డెవలపర్లు తెలిపిన ప్రకారం.. 'పబ్జి మొబైల్ ఇండియా గేమ్'లో స్థానిక సంస్కృతీ ప్రతిబింబించేలా ఆటలో మార్పుచేసినట్లు తెలిపారు. చిన్న పిల్లలు ఎక్కువ సేపు గేమ్ ఆడకుండా ఉండటానికి కొత్త సెట్టింగ్స్ తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. పబ్జి కార్పొరేషన్ పాత్రల దుస్తులు, గ్రీన్ హిట్ ఎఫెక్ట్స్, ఆట సమయంపై పరిమితులు విధించినట్లు తెలిపారు. అలాగే కొత్తగా వర్చువల్ సిమ్యులేషన్ ట్రైనింగ్ గ్రౌండ్ సెట్టింగ్ తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే, ఇప్పటికే కొన్ని పబ్జి గేమ్ ఏపీకే లింకులు బయట కనిపిస్తున్నాయి. అయితే, హ్యాకర్స్ ఈ ఏపీకే లింకులు ద్వారా మీ మొబైల్ ని హ్యాక్ చేసే అవకాశం ఉన్నట్లు నిపుణులు తెలుపుతున్నారు. -
పబ్జి లవర్స్ జర జాగ్రత్త
మీరు పబ్జి ప్రియులా..? మీరు త్వరలో రాబోయే పబ్జి కోసం వేచిచూస్తున్నారా? అయితే జర జాగ్రత్త. గతంలో పబ్జి కార్పొరేషన్ పబ్జి మొబైల్ ఇండియా పేరుతో యాప్ ని తీసుకొస్తున్నట్లు ప్రకటించినప్పటి నుండి పబ్జి మొబైల్ ఇండియా పేరుతో అనేక ఏపీకే లింకులు ఆన్లైన్లో కనిపిస్తున్నాయి. అయితే టెక్ నిపుణులు మాత్రం వీటి జోలికి వెళ్ళద్దు అని తెలుపుతున్నారు. ఈ ఏపీకే లింకుల ద్వారా సైబర్ నేరగాళ్లు మీ సమాచారాన్ని హ్యాక్ చేసే అవకాశం ఉందని తెలుపుతున్నారు. (చదవండి: 5వేలకే గెలాక్సీ ఎస్ 20 మొబైల్స్) పబ్జి కార్పొరేషన్ మాత్రం అధికారికంగా ఎప్పుడు విడుదల అవుతుందో ఇప్పటి వరకు ప్రకటించలేదు. అధికారికంగా ఆట విడుదలయ్యే వరకు వేచి ఉండాలని కోరుతున్నట్లు తెలిపారు. ఆన్లైన్లో మాత్రం కొన్ని నివేదికలు పబ్జి మొబైల్ ఇండియాను డిసెంబర్ 25న విడుదల చేయవచ్చని సూచిస్తున్నాయి. అయినప్పటికీ, పబ్జి కార్పొరేషన్ ఇంకా దీనిని ధృవీకరించలేదు. పబ్జి లవర్స్ ని లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు నకిలీ ఏపీకే లింకులతో వల విసురుతున్నారు. ఒకవేల ఎవరైనా పొరపాటున ఈ లింకుల ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే వారు మీ డివైస్ ని హ్యాక్ చేసే ప్రమాదం ఉంది. ఫేక్ ఫైల్స్ ద్వారా మీ డివైజ్‌లోకి మాల్వేర్ను పంపించి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే ప్రమాద ముందని టెక్ నిపుణలు హెచ్చరిస్తున్నారు. అధికారికంగా విడుదల అయ్యే వరకు ఈ ఏపీకే లింకుల జోలికి మాత్రం వెళ్లకూడదని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
రికార్డు సృష్టించిన ఫౌజీ గేమ్
ఏంతో కాలంగా ఎదురుచూస్తున్నా 'ఫౌజీ' గేమ్ గూగుల్ ప్లే స్టోర్‌లో ప్రీ-రిజిస్ట్రేషన్ కోసం అందుబాటులో ఉందని నవంబర్ 30న ఎన్కోర్ గేమ్స్ ప్రకటించింది. ఈ గేమ్ మొదటి 24 గంటల్లో భారతదేశంలోని ప్లే స్టోర్‌లో అత్యధిక సంఖ్యలో ప్రీ-రిజిస్ట్రేషన్లను నమోదు చేసింది. ఫస్ట్ పర్సన్ షూటర్(ఎఫ్పిఎస్) గేమ్ కోసం 1.06 మిలియన్ల ప్రీ-రిజిస్ట్రేషన్లను చేసుకున్నారని, రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని డెవలపర్లు ట్వీట్లో తెలిపారు. 'ఫౌజీ' గేమ్ నవంబర్‌లో ప్రారంభించాల్సి ఉంది, కానీ ఇతర కారణాల రీత్యా ఆలస్యం అయింది. (చదవండి: 11వేలలో 5జీ ఫోన్) దసరా పండుగ సందర్బంగా ఈ గేమ్ యొక్క ట్రైలర్ ని విడుదల చేసింది. ‘ఈ రోజు మనం చెడుపై మంచి గెలుపుున సెలబ్రేట్ చేసుకుంటున్నాం. భయంలేని, ఐక్యతా గార్డులు 'ఫౌజీ' గురించి సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంతకు మించి మంచి రోజు ఏముంటుంది. దసరా పర్వదినం రోజు 'ఫౌజీ' టీజర్‌ను ప్రజెంట్ చేస్తున్నాం.’ అంటూ అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ దీనికి మద్దతుగా నిలుస్తున్నారు. ఇందులో గాల్వన్ వ్యాలీకి సంబందించిన సన్నివేశాలు ఉన్నాయి. సరిహద్దు భద్రతకు బాధ్యత వహిస్తున్న భారత సైనికులకు ఈ ఆట నివాళి అని ఎన్కోర్ గేమ్స్ తెలిపింది. పబ్జి గేమ్ ని భారత్ లో నిషేదించిన తర్వాత 'ఫౌజీ' గేమ్ ని తీసుకొచ్చారు. 'ఫౌజీ' గేమ్, పబ్జికి పోటీ కాదని ఎన్కోర్ గేమ్స్ సహ వ్యవస్థాపకుడు విశాల్ గొండాల్ స్పష్టం చేశారు. -
పబ్జీ పోటీగా దేశీయ ఫౌ-జీ గేమ్
న్యూఢిల్లీ: ఫేమస్ మొబైల్ గేమ్ యాప్ పబ్జీ బ్యాన్ తర్వాత ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా వస్తున్న ఫౌ-జీ అనే దేశీయ మొబైల్ గేమ్ వస్తున్న సంగతి మనకు తెలిసిందే. భారతీయ సైనిక బలగాల వీర్యపరాక్రమాలను తెలియజేసే విదంగా ఈ మొబైల్ యాప్ రూపొందిస్తున్నారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ దీనికి మద్దతుగా నిలుస్తున్నారు. దీనికి సంబందించిన ఫౌ-జీ ఫస్ట్ లుక్ కూడా సినిమా రేంజ్లో టీజర్ రిలీజ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు తాజాగా పబ్జీ కార్పొరేషన్ "పబ్జీ మొబైల్ ఇండియా" పేరుతో త్వరలో భారత్ లో లాంచ్ కానున్నట్లు కంపెనీ ప్రకటించింది. అయితే పబ్జీకి గట్టిపోటీ ఇవ్వడానికి మన భారత ఫౌ-జీ గేమ్ యాప్ కూడా విడుదలకు సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. (చదవండి: ఈ వాట్సాప్ మెస్సేజ్ తో జర జాగ్రత్త!) ఫౌ-జీ గేమ్ నవంబర్ తరువాత విడుదల చేయబడుతుందని కంపెనీ గతంలో ధృవీకరించినప్పటికీ, అధికారికంగా ఎప్పుడు విడుదల చేస్తున్నారో స్పష్టం చేయలేదు. గూగుల్ ప్లే స్టోర్ మరియు ఆపిల్ యాప్ స్టోర్లలో డౌన్లోడ్ చేసుకోవడానికి ఫౌ-జీ గేమ్ అందుబాటులో ఉంటుందని ఎన్కోర్ గేమ్స్ పేర్కొంది. భారత గేమింగ్ కంపెనీ అయిన ఎన్కోర్ గేమ్స్ పబ్జీ పోటీగా గేమ్ ని అభివృద్ధి చేయడానికి అత్యంత నిపుణులైన టాప్ - 25 ప్రోగ్రామర్లు, డిజైనర్స్ , టెస్టర్స్, ఆర్టిస్ట్ బృందాన్ని ఎంపిక చేసినట్లు ఎన్కోర్ గతంలో తెలిపింది. 'ఫౌ-జీ: ఫియర్లెస్ మరియు యునైటెడ్ గార్డ్స్' అనే మల్టీ-ప్లేయర్ గేమ్ పబ్జీ మొబైల్‌కు భారతీయ ప్రత్యామ్నాయంగా అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రెండు కంపెనీలు కూడా అధికారికంగా గేమ్ ని మార్కెట్లోకి ఎప్పుడు తీసుకొస్తారో తెలియజేయలేదు. -
డౌన్లోడ్ లో అగ్రస్థానంలో భారత్
కోవిడ్ - 19 కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. దింతో అందరూ ఇంట్లోనే ఉండేసరికి స్మార్ట్ ఫోన్, పీసీ, పియస్4, ఏక్షబాక్స్ వన్, నింటెండో స్విచ్, గూగుల్ స్టేడియా వంటి గేమింగ్ ప్లాట్‌ఫారమ్ వినియోగం చాలా వరకు పెరిగింది. తాజాగా వచ్చిన ఒక నివేదిక ప్రకారం, ప్రపంచ జనాభాలో మూడు బిలియన్లకు పైగా మంది ఏదో ఒక గేమ్ అడుతున్నారని పేర్కొంది. పోకీమాన్ గో, పబ్జి మొబైల్ వంటి ప్రసిద్ధ గేమ్ సంస్థలు లాక్డౌన్ సమయంలో స్టే-ఎట్-హోమ్ వంటి ఫీచర్లను కూడా ప్రవేశపెట్టాయి. 2020 మొదటి తొమ్మిది నెలల్లో గ్లోబల్ మొబైల్ గేమ్ డౌన్లోడ్లలో భారత్ మొదటి స్థానంలో నిలిచింది. మన దేశ పౌరులు 2020 మొదటి 9 నెలల్లో 7.3 బిలియన్ గేమ్ లను డౌన్లోడ్ చేసుకున్నారు. ప్రపంచవ్యాప్త మొత్తం డౌన్లోడ్లలో ఇది దాదాపు 17% అని యాప్ ఇంటెలిజెన్స్ సంస్థ సెన్సార్ టవర్ పేర్కొంది. ఈ ఏడాది తోలి త్రైమాసికంలో భారతీయులు దాదాపు1.8 బిలియన్ గేమ్ లను ఇన్స్టాల్ చేసుకున్నారు. తరువాతి త్రైమాసికంలో మన దేశంలో లాక్ డౌన్ విధించడం వల్ల గేమ్ డౌన్లోడ్ 50% పెరిగాయి. దింతో గేమింగ్ ప్రియుల సంఖ్య భారిగా పెరుగుతున్న నేపథ్యంలో సెప్టెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో గేమ్ డౌన్లోడ్లలో వృద్ధి 7% పెరిగి 2.9 బిలియన్ డౌన్లోడ్లకు చేరుకున్నాయి. ప్రపంచ వ్యాప్త గేమ్ డౌన్లోడ్ లలో 10శాతం ఇన్స్టాల్ లతో యుఎస్ రెండవ స్థానంలో నిలిచింది, 3వ స్థానంలో బ్రెజిల్ (8 శాతం) ఉంది. (చదవండి: కొత్త రికార్డు సృష్టించిన షియోమి) 2020 మొదటి 9 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా డౌన్లోడ్ చేసిన గేమ్ లలో గారెనా ఫ్రీ ఫైర్ మొదటి స్థానంలో నిలిచింది. తరువాత స్థానాలలో పబ్జి, సబ్వే సర్ఫర్ గేమ్ లు నిలిచాయి. ఇండియాలో అక్టోబరులో పబ్జి నిషేధం తర్వాత తిరిగి "పబ్జి మొబైల్ ఇండియా" పేరుతో రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్‌లో అత్యధికంగా డౌన్లోడ్ చేసిన గేమ్ లలో ఇన్నర్స్లోత్స్ అమాంగ్ గేమ్ మొదటి స్థానంలో ఉంది. గత సంవత్సరంతో పోల్చితే గూగుల్ ప్లే డౌన్లోడ్లు మొదటి తొమ్మిది నెలల్లో 40% కంటే ఎక్కువ పెరిగాయి, అలాగే ఆపిల్ యొక్క యాప్ స్టోర్ ఇన్‌స్టాల్‌లు గత సంవత్సరంతో పోలిస్తే 16% పెరిగాయి. -
డ్రాగన్ గేమింగ్ యాప్స్‌పై యాపిల్ వేటు
బీజింగ్ : టెక్ దిగ్గజం యాపిల్ తన చైనీస్ యాప్ స్టోర్స్ నుంచి శనివారం 29,800 యాప్స్‌ను తొలగించింది. వీటిలో 26,000కు పైగా గేమ్ యాప్స్ ఉన్నాయని పరిశోధన సంస్థ క్విమై వెల్లడించింది. ప్రభుత్వం జారీ చేసిన లైసెన్స్ నెంబర్‌ను ఈ ఏడాది జూన్‌లోగా సమర్పించాలని అంతకుముందు గేమ్ పబ్లిషర్లకు యాపిల్ డెడ్‌లైన్ విధించింది. చైనా యాండ్రాయిడ్ యాప్ స్టోర్స్ ఎప్పటినుంచో ఈ మార్గదర్శకాలు అమలవుతున్నాయి. అయితే ఈ ఏడాది నుంచి వాటిని కఠినంగా అమలు చేయాలని యాపిల్ ఎందుకు నిర్ణయించిందో స్పష్టం కాలేదు. జులై మొదటివారంలో తన యాప్ స్టోర్ నుంచి యాపిల్ 2500కు పైగా టైటిల్స్‌ను తొలగించింది. యాప్స్ తొలగింపుతో జింగా, సూపర్సెల్ వంటి యాప్‌లు ప్రభావితమయ్యాయని పరిశోధన సంస్థ సెన్సార్ టవర్ అప్పట్లో పేర్కొంది. సెన్సిటివ్ కంటెంట్‌ను నియంత్రించేందుకు గేమింగ్ పరిశ్రమకు చైనా ప్రభుత్వం కఠిన నిబంధనలు ఉండాలని దీర్ఘకాలంగా కోరుతోంది. గేమింగ్ యాప్స్‌పై కఠిన నిబంధనలు విధించడం చిన్న మధ్యతరహా డెవలపర్ల రాబడిపై ప్రభావం చూపుతుందని, బిజినెస్ లైసెన్స్ పొందడంలో ఎదురయ్యే అవరోధాలు మొత్తం చైనా ఐఓఎస్ గేమ్ పరిశ్రమకే విఘాతమని యాప్ఇన్ చైనా మార్కెటింగ్ మేనేజర్ టాడ్ కున్ ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి : అమెజాన్, యాపిల్, ఫేస్బుక్- భల్లేభల్లే -
పబ్జీ గేమ్ చైనాదేనా?
న్యూఢిల్లీ: "చైనా ఉత్పత్తులను బహిష్కరించాలి" అన్న నినాదం దేశవ్యాప్తంగా రాజుకుంది. భారత్-చైనా సరిహద్దులో చోటు చేసుకున్న ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరవీరులవడంతో దేశమంతా చైనా వ్యతిరేక ఉద్యమం మరింత ఊపందుకుంది. ఈ క్రమంలో చైనా వస్తువులను నిషేధించడంతోపాటు చైనా యాప్‌లను వాడొద్దన్న వాదన తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో యువత ఎక్కువగా ఇష్టపడే పబ్జీ గేమ్ చైనాదా? అన్న ప్రశ్న ఎంతోమందికి వచ్చింది. ఇప్పుడు దాన్ని డిలీట్ చేయాల్సిందేనా అని ఎంతోమంది గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. అసలే లాక్డౌన్లో ఫోన్లకు మరింత అతుక్కుపోయి పబ్జీని విచ్చలవిడిగా వాడుతున్నారు. ఈ సమయంలో దాన్ని డిలీట్ చేయాలంటే మనసొప్పకపోవడంలో తప్పేమీ లేదు. (‘రిమూవ్ చైనా యాప్స్’కు) దీంతో అసలు పబ్జీ ఎక్కడి నుంచి వచ్చిందంటూ అందరూ గూగుల్‌ను ఆశ్రయిస్తున్నారు. దీనికి సమాధామేంటంటే... సాంకేతికంగా అయితే పబ్జీ అసలు చైనాదే కాదు. దీన్ని ఐర్లాండ్‌కు చెందిన బ్రెదర్ గ్రీన్ అనే వ్యక్తి డెవలప్ చేశాడు. ఈ గేమ్‌ను దక్షిణ కొరియాలోని బ్లూహోల్ డెస్క్‌టాప్స్‌పై అందుబాటులోకి తీసుకొచ్చింది. మొబైల్ వర్షన్‌లోకి తీసుకొచ్చేందుకు చైనాకు చెందిన టెన్సెంట్ గేమ్స్ అనే కంపెనీ సాయం చేస్తూనే బ్లూ హోల్లో 10 శాతం వాటాను తీసుకుంది. అంతకుమించి పబ్జీకి చైనాతో ఎలాంటి సంబంధం లేదు. అంతదాకా ఎందుకు? ఈ గేమ్‌లో తీవ్ర హింస ఉందని చైనాలో పబ్జీని రిలీజ్ చేయకముందే బ్యాన్ చేశారు కూడా. కాబట్టి ఈ గేమ్‌కు చైనాకు సంబంధమే లేదు. (పబ్జీకి బానిసై మతిస్థిమితం కోల్పోయిన యువకుడు) -
స్టాక్ మార్కెట్ పాఠాలకు గేమింగ్ యాప్
కొచ్చి : మొబైల్ వినియోగం పెరుగుతున్నా కొద్దీ యాప్ ల ఆవిష్కరణలు దూసుకెళ్తున్నాయి. ప్రతి చిన్న పనికోసం, సమాచారం తెలుసుకోవడం కోసం యూజర్లకు యాప్ లు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఇప్పుడు మరో కొత్త యాప్ యూజర్ల ముందుకు వచ్చింది. స్టాక్ మార్కెట్ల ప్రయాణంలో మార్గదర్శి కావలనుకునే యూజర్లకు పాఠాలు నేర్పడానికి టోరో ఈ ఓర్సో(బుల్ అండ్ బేర్) అనే మొబైల్ గేమ్ యాప్ ను ప్రముఖ ఫైనాన్సియల్ కంపెనీ హెడ్జ్ ఈక్విటీస్ ఆవిష్కరించింది. చాలామంది యువత మార్కెట్లో పెట్టుబడులు పెడదామనకుని, అవి ఎలా వర్క్ చేస్తున్నాయో తెలియక సతమతమవుతుంటారని ప్రముఖ ఫైనాన్సియల్ సర్వీసు కంపెనీ హెడ్జ్ ఈక్విటీస్ మేనేజింగ్ డైరెక్టర్ అలెక్స్ కె. బాబు తెలిపారు. స్టాక్ ట్రేడింగ్ ల గురించి సులభంగా తెలుసుకునేలా ఈ యాప్ ను రూపొందించినట్టు పేర్కొన్నారు. షేర్ ట్రేడింగ్ లో బేసిక్స్ గురించి యువతకు తెలపడానికి యాప్ లు, గేమ్ లే ఉత్తమ మార్గమని అలెక్స్ అన్నారు. గేమ్స్ ద్వారా మార్కెట్ల గురించి యువత చాలా త్వరగా అర్థం చేసుకోగలుగుతారని పేర్కొన్నారు. ఆండ్రాయిడ్ ఆధారిత ఈ గేమ్, బిగినెర్, అమాట్యూర్, ప్రొఫెసినల్ అనే మూడు లెవల్స్ ను కలిగి ఉంటుంది. బిగినెర్ లెవల్ లో 10 రౌండ్లు, అమాట్యూర్ లెవల్ లో 20, ప్రొఫెసినల్ లెవల్ లో 40 రౌండ్లు ఉంటాయి. ఈ గేమ్ లో యూజర్లు వర్చువల్ గా రూ.5వేల మొత్తాన్ని పొందుతారు. ఆ మొత్తాన్ని ఆయిల్, గ్యాస్, టెలికాం, ఎఫ్ఎమ్సీజీ, ఆటోమొబైల్, రియాల్టీ, ఫార్మా, పవర్, ఐటీ, మెటల్, బ్యాంకింగ్ వంటి దేనిలోనైనా పెట్టుబడి పెట్టొచ్చు. రాట్నంలో ఉన్న ఓ సెక్టార్ ను మార్క్ చేయాల్సి ఉంటుంది. ఈ రాట్నంలో ఉన్న చాన్స్ కార్డ్స్ లు, సెక్టార్లలో పాజిటివ్ గాని , నెగిటివ్ గా గాని ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఉదా..ఒకవేళ ఎఫ్ఎమ్ సీజీ సెక్టార్ లో ప్లేయర్ పెట్టుబడి పెట్టి, లోటు రుతుపవనాల్లో చాన్స్ కార్డ్ ను కలిగిఉంటే, ప్లేయర్ 100 పాయింట్లు నష్టపోవాల్సి ఉంటుంది. ప్రతి చాన్స్ కార్డ్ అనంతరం స్కోర్లు డిస్ ప్లే చేస్తుంది. ప్రతి లెవల్ తర్వాత మాక్రో కార్డ్ ను వస్తుంటుంది. ఇలా అన్ని రౌండ్లు ముగించుకున్నాక లాభాలకు, నష్టాలకు మధ్య తేడాను స్కోర్ బోర్డు చూపిస్తుంది. ఇలా గేమింగ్ విధానం ద్వారా స్టాక్ మార్కెట్లు ఎలా పెట్టుబడులు పెట్టాలో నేర్పుతామని అలెక్స్ పేర్కొన్నారు.