క్రిక్‌పే లాంచ్ ఆలస్యం అయినందుకు ఆ యాప్ అధినేత, భారత్‌పే సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ క్షమాపణలు కోరారు. తన తండ్రి ఆకస్మిక మరణం కారణంగా క్రిక్‌పే లాంచ్ ఆలస్యమతోందన్నారు. ఈ మేరకు మార్చి 31న ట్వీట్ చేశారు.
(CrickPe: ఫాంటసీ క్రికెట్ యాప్ ‘క్రిక్‌పే’ లాంచ్... అదీ ఐపీఎల్‌కు ముందు)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కొత్త సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని అందించలేకపోయామని అభిమానులకు క్షమాపణలు చెప్పారు. ఐపీఎల్ ప్రారంభ వారంలో క్రిక్‌పే యాప్ అందుబాటులోకి రాకపోయినప్పటికీ ఏప్రిల్ 3 నుంచి ఎటువంటి అవాంతరాలు లేకుండా క్రిక్‌పే యాప్ పూర్తిస్థాయిలో నడుస్తుందని హామీ ఇచ్చారు.
(ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీలో 1,000 మంది నియామకం..)
అష్నీర్ గ్రోవర్ తండ్రి అశోక్ గ్రోవర్ మార్చి 29న 69 సంవత్సరాల వయసులో మృతి చెందారు. ఐపీఎల్ ప్రారంభానికి ముందే అష్నీర్ గ్రోవర్ సరికొత్త క్రికెట్ ఫాంటసీ స్పోర్ట్స్ యాప్ క్రిక్‌పేని లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మార్చి 23న ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ డౌన్‌లోడ్ లింక్‌లను కూడా తన ట్విటర్లో షేర్ చేశారు.
(Jio offer: జియో అన్‌లిమిటెడ్ డేటా ఆఫర్.. కొత్త కస్టమర్లకు ఉచిత ట్రయల్!)
Sorry. In this week leading to CrickPe app launch I lost my dad. Tough decision was to abort launch or go ahead with IPL nevertheless. I promise the app will be without glitches by Monday. I failed - not making any excuses.@crickpe_app
— Ashneer Grover (@Ashneer_Grover) March 31, 2023
Comments
Please login to add a commentAdd a comment