Ashneer Grover
-
ఎట్టకేలకు రెండేళ్ల వివాదానికి పరిష్కారం!
ఫిన్‌టెక్ స్టార్టప్ భారత్‌పే సహవ్యవస్థాపకులు అష్నీర్ గ్రోవర్ రెండేళ్లుగా సంస్థతో కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించుకున్నారు. అష్నీర్, సంస్థకు జరిగిన ఒప్పందం ప్రకారం ఇకపై తాను భారత్‌పేతో ఏ హోదాలో కొనసాగరు. కంపెనీలోని తన షేర్లను కుటుంబ ట్రస్ట్‌కు బదిలీ చేస్తారు. ఇరువైపులా ఉన్న చట్టపరమైన కేసులను ఉపసంహరించుకోనున్నారు.అసలేం జరిగిందంటే..భారత్‌పేలో విధులు నిర్వహించే సమయంలో అష్నీర్ గ్రోవర్ దంపతులు విలాసాలకు అలవాటుపడి రూ.81 కోట్లు సంస్థ నిధుల్ని కాజేశారు. ట్యాక్స్ క్రెడిట్, జీఎస్టీ అధికారులకు పెనాల్టీ చెల్లింపుల్లో అవకతవకలు, ట్రావెల్ ఏజెన్సీలకు అక్రమ చెల్లింపులు, నకిలీ ఇన్వాయిస్లను సృష్టించడం, సాక్ష్యాలను నాశనం చేయడం వంటి కార్యకలాపాలకు పాల్పడ్డారు. ఆ కుంభకోణం వెలుగులోకి రావడంతో భారత్‌పే వారిద్దరిని సంస్థ నుంచి తొలగించింది. ఇదే అంశంపై అష్నీర్ దంపతుల్ని విచారించాలని కోరుతూ భారత్‌పే ఢిల్లీ హైకోర్ట్‌ను ఆశ్రయించింది. ఆ కేసులో వాళ్లిద్దరూ విదేశాలకు పారిపోకుండా గతేడాది నవంబర్‌లో ఢిల్లీ పోలీసు ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) లుకౌట్ నోటీసులు జారీ చేసింది. వీరిపై ఐపీసీ సెక్షన్లు 406, 408, 409, 420, 467, 120బీ, 201 కింద కేసులు నమోదు చేశారు. అష్నీర్ గ్రోవర్, మాధురీ గ్రోవర్, శ్వేతాంక్ జైన్ (మాధురి సోదరుడు), సురేష్ జైన్ (అష్నీర్ మామ), దీపక్ గుప్తా (అష్నీర్ బావమరిది)పై భారత్‌పే గతంలోనే ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవల సంస్థ నిధుల దుర్వినియోగంలో అష్నీర్ బావమరిది దీపక్‌గుప్తాకు సంబంధం ఉందనే ఆరోపణలతో తనను అదుపులోకి తీసుకున్నట్లు ఈవోడబ్ల్యూ తెలిపింది.ఈ నేపథ్యంలో అష్నీర్ సంస్థతో రెండేళ్లుగా సాగుతున్న వివాదాన్ని పరిష్కరించుకునేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలిపారు. సంస్థ కూడా ఈమేరకు ప్రకటన విడుదల చేసింది. ఒప్పందంలో భాగంగా ఇకపై గ్రోవర్‌కు భారత్‌పేతో సంబంధం ఉండదు. తాను కంపెనీలో ఏ హోదాలోనూ కొనసాగరు. గ్రోవర్ షేర్లు ఫ్యామిలీ ట్రస్ట్‌కి బదిలీ చేయబడతాయి. అందులో కొంతభాగం కంపెనీ అభివృద్ధికి తోడ్పడే ‘రెసిలెంట్ గ్రోత్ ట్రస్ట్’కు బదిలీ చేయనున్నారు.ఇదీ చదవండి: యాపిల్‌కు రూ.1.29 లక్షల జరిమానా‘భారత్‌పేతో ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించుకున్నాను. సంస్థ వృద్ధికి సరైన దిశలో పాటుపడుతున్న మేనేజ్మెంట్, బోర్డు సభ్యులపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఇకపై సంస్థ కార్యకలాపాల నుంచి వైదొలుగుతున్నాను. నాకు చెందిన కొన్ని షేర్లను నా ఫ్యామిలీ ట్రస్ట్ నిర్వహిస్తుంది. సంస్థతో ఉన్న చట్టపరమైన కేసులను రద్దు చేసుకున్నాం’ అని ఎక్స్‌లో ప్రకటించారు.I have reached a decisive settlement with BharatPe. I repose my faith in the management and board, who are doing great work in taking BharatPe forward in the right direction. I continue to remain aligned with the company's growth andsuccess. I will no longer be associated with… pic.twitter.com/gB3Pla5qQZ— Ashneer Grover (@Ashneer_Grover) September 30, 2024 -
EY సంస్థకో దణ్ణం..రూ.కోటి జీతంతో చేరిన రెండో రోజే గుండెలో నొప్పిగా ఉందంటూ
ఛార్టర్డ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ పెరియాలి మరణంతో యర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా (ఈవై)సంస్థలో పని వాతావరణంపై చర్చ కొనసాగుతుంది. ఆ సంస్థ మాజీ ఉద్యోగులు సైతం వర్క్ కల్చర్‌పై తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో భారత్‌పే మాజీ సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ కోటి రూపాయల వేతనంతో చేరిన రెండో రోజే ఆ సంస్థ నుంచి బయటకు వచ్చారు. అయినా ఆ వర్క్ కల్చర్‌పై ప్రశంసలు కురిపిస్తూ అష్నీర్ గ్రోవర్ గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోని సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయోంకా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.అన్నా సెబాస్టియన్ పెరియాలి మరణం సంస్థల్లో పని భారం వల్లేనన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై హర్ష్ గోయోంకా స్పందిస్తూ.. అష్నీర్ గ్రోవర్ మాట్లాడిన వీడియోని ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఆ వీడియోలో అష్నీర్ గ్రోవర్ మాట్లాడుతూ.. తాను రూ. కోటి వేతనంతో యర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా కంపెనీలో ఉద్యోగిగా చేరిన తొలిరోజే బయటకు వచ్చిన నిర్ణయాన్ని వెల్లడించారు.It’s baffling to see anyone advocate for a toxic environment. #AnnaPerayil Your views? pic.twitter.com/QhPnCeKhxq— Harsh Goenka (@hvgoenka) September 19, 2024చేరిన మొదటి రోజు ఆఫీసు మొత్తం కలియతిరిగాను. చుట్టూ చూశాను. అక్కడి వాతావారణం నాకు నచ్చలేదు. వెంటనే ఎదో ఒక్కటి చెప్పాలని.. నాకు గుండె నొప్పి వస్తుందని చెప్పి నటించాను.’ అని అన్నారు. కార్యాలయ వాతావరణం ఎలా ఉంటుందో వివరిస్తూ ఇలాంటి పని వాతావరణంతో ఉద్యోగులు ప్రాణాలు పోవడమేనని అర్ధం వచ్చేలా వ్యాఖ్యానించారు. అంతే కాదు.. ఒక కంపెనీలో వర్క్ గురించి చెడుగా చెబుతున్నారంటే అది మంచిదని అర్థం అని అష్నీర్ గ్రోవర్ అన్నారు. విషపూరితమైన పని వాతావరణాన్ని ప్రోత్సహించేలా వ్యాఖ్యలు చేసిన అష్నీర్పై గోయెంకా ఆగ్రహం వ్యక్తం చేశారు. విషపూరిత వాతావరణం గురించి ఇలా పాజిటీవ్‌గా మాట్లాడడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని కామెంట్ చేశారు. ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదీ చదవండి : ఉద్యోగి అంత్యక్రియలకు వెళ్లని కంపెనీపై విమర్శలు -
భారత్‌పే కుంభకోణం.. మరొకరి అరెస్టు
ఫిన్‌టెక్ సంస్థ భారత్‌పే మాజీ ఎండీ, సహ వ్యవస్థాపకులు అష్నీర్ గ్రోవర్ కుటుంబ సభ్యుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. సంస్థ నిధుల దుర్వినియోగంలో అష్నీర్ బావమరిది దీపక్‌గుప్తాకు సంబంధం ఉందనే ఆరోపణలతో తనను అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసు ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) తెలిపింది.పోలీసుల కథనం ప్రకారం..‘భారత్‌పే సహవ్యవస్థాపకులు అష్నీర్ గ్రోవర్ బావమరిది దీపక్ గుప్తా సంస్థ నిధుల దుర్వినియోగంలో పలువురికి సహకరించినట్లు ఆరోపణలున్నాయి. సంస్థకు చెందిన అనేక మంది విక్రేతలతో ఆయనకు సంబంధం ఉందని ప్రాథమిక సమాచారం. నిధులు దుర్వినియోగం కేసులో ఇప్పటికే అరెస్టయిన అమిత్ కుమార్ బన్సల్‌కు దీపక్‌గుప్తా సూచనలిచ్చారని ఆరోపణలొచ్చాయి’ అని తెలిపారు.ఇదీ చదవండి: యాపిల్ బ్యాటరీ బుల్లెట్‌ప్రూఫ్!అసలేం జరిగిందంటే..భారత్‌పేలో విధులు నిర్వహించే సమయంలో అష్నీర్ గ్రోవర్ దంపతులు విలాసాలకు అలవాటుపడి రూ.81 కోట్లు సంస్థ నిధుల్ని కాజేశారు. ట్యాక్స్ క్రెడిట్, జీఎస్టీ అధికారులకు పెనాల్టీ చెల్లింపుల్లో అవకతవకలు, ట్రావెల్ ఏజెన్సీలకు అక్రమ చెల్లింపులు, నకిలీ ఇన్వాయిస్లను సృష్టించడం, సాక్ష్యాలను నాశనం చేయడం వంటి కార్యకలాపాలకు పాల్పడ్డారు. ఆ కుంభకోణం వెలుగులోకి రావడంతో భారత్‌పే వారిద్దరిని సంస్థ నుంచి తొలగించింది. ఇదే అంశంపై అష్నీర్ దంపతుల్ని విచారించాలని కోరుతూ భారత్‌పే ఢిల్లీ హైకోర్ట్‌ను ఆశ్రయించింది. ఆ కేసులో వాళ్లిద్దరూ విదేశాలకు పారిపోకుండా గతేడాది నవంబర్‌లో ఈఓడబ్ల్యూ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. వీరిపై ఐపీసీ సెక్షన్లు 406, 408, 409, 420, 467, 120బీ, 201 కింద కేసులు నమోదు చేశారు. అష్నీర్ గ్రోవర్, మాధురీ గ్రోవర్, శ్వేతాంక్ జైన్ (మాధురి సోదరుడు), సురేష్ జైన్ (అష్నీర్ మామ), దీపక్ గుప్తా (అష్నీర్ బావమరిది)పై భారత్‌పే గతంలోనే ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
నెలకు రూ. 35 లక్షలేంటి బ్రో! దిగ్గజాల షాకింగ్ రియాక్షన్
బిట్స్ పిలానీ డ్రాప్‌అవుట్, 20యేళ్ల యూట్యూబర్ ఇషాన్ శర్మ సంపాదన బిజినెస్ దిగ్గజాలను సైతం దిగ్భ్రాంతికి గురిచేసింది 2024లో బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి ‘లీక్డ్’ పేరుతో నిర్వహించిన పోడ్కాస్ట్లో ఇషాన్ కొన్ని ఆసక్తికర విషయాలను పంచకున్నారు. దీనికి సంబంధించిన చిన్న క్లిప్ ఎక్స్‌లో వైరల్‌గా మారింది.విషయం ఏమిటంటే 2024లో వ్యాపారం ఎలా ప్రారంభించాలి అనే అంశంపై భారత్‌పే ఫౌండర్ అష్నీర్ గ్రోవర్, ఆఫ్‌బిజినెస్ సహ వ్యవస్థాపకుడు సీఈవో, ఆక్సిజో ఫైనాన్షియల్ సర్వీసెస్ కో ఫౌండర్ ఆసిష్ మోహపాత్ర, సార్థక్ అహుజా, ఇంకా నౌకరీ డాట్‌కాంకు చెందిన ఇన్ఫో ఎడ్జ్ వ్యవస్థాపకుడు సంజీవ్ బిఖ్చందానీలతో షార్క్ ట్యాంక్ సీజన్1 పోడ్కాస్ట్లో భాగంగా ముచ్చటించాడు. ఈసందర్భంగా తాను గత నెలలో రూ. 35 లక్షలు సంపాదించానని, తాను వ్యాపారంలోకి ఇదే పెద్ద సమస్యగా మారిందంటూ వెల్లడించాడు. దీంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోను కావడం అష్నీర్ గ్రోవర్ వంతైంది. ఈ వయస్సులో అద్భుతం ప్రశంసనీయం అటూ ఇషాన్శర్మపై పొగడ్తలు కురిపించాడు. "నెలకు రూ. 35 లక్షలు సంపాదిస్తావా? అంటూ ఆశ్చర్యపోయాడు. అందేకాదు ‘బాబూ నువ్వు ఇక్కడ కూచోవాలి, అక్కడ కాదు (ఇంటర్వ్యూ చేసే ప్లేస్)’’ అంటూ చమత్కరించాడు. అటు నెటిజన్లుపై అతనిపై ప్రశంసలు కురిపించారు.Shocking Reaction of Ashneer Grover and Sanjeev Bikchandani After Knowing Ishaan Makes Over ₹35 Lakhs a MonthThis is Excellent, Commendable at His Age pic.twitter.com/BCmO60Vgl9— Ravisutanjani (@Ravisutanjani) July 17, 2024 ‘‘ఇది చూసిన కుర్రాళ్లకు తామేమీ సాధించలేదనే ఆందోళన (ఫోమో) పట్టుకుంటుంది. నాకు 23 ఏళ్లు, నయాపైసా సంపాదన లేదు, నాన్న మీదే అధారపడుతున్నా... కానీ ఏదో ఒకరోజు ఇతనికి పోటీగా సంపాదిస్తా అని ఒకరు, ఇది చూసే దాకా నా రోజు చాలా బాగుంది. నెలకు 35 లక్షల రూపాయలు సింపుల్ మనీ అంటాడేంటి భయ్యా అని మరొక నెటిజన్ వ్యాఖ్యానించాడు. -
విదేశాలకు పారిపోతారేమో.. అష్నీర్ దంపతులకు ఢిల్లీ హై కోర్టు కీలక ఆదేశాలు
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ భారత్‌పే కో-ఫౌండర్ అష్నీర్ గ్రోవర్, అతని భార్య మాధురి జైన్ గ్రోవర్‌లకు ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అష్నీర్ దంపతులు త్వరలో అమెరికాకు వెళ్లనున్నారు. అయితే వాళ్లిద్దరూ అమెరికాకు వెళ్లే ముందే సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.80 కోట్లు చెల్లించాలని ఆదేశించింది.దీంతో పాటు అష్నీర్, మాధురీలకు యూఏఈ గోల్డెన్ వీసా ఉంది. ఈ వీసా ఉన్న వారికి యూఏఈ ప్రభుత్వం తమ దేశ పౌరులుగా గుర్తిస్తూ వారికి ఎమిరేట్స్ కార్డ్ అనే ఐడెంటిటీ కార్డ్ ఇస్తుంది. ముందస్తు జాగ్రత్తగా ఎమిరేట్స్ కార్డ్‌ను కోర్టుకు సబ్మిట్ చేయాలని సూచించింది. అర్హులైన ఈ కార్డ్ దారులు 10ఏళ్ల పాటు యూఏఈ దేశ పౌరులుగా గుర్తింపు లభిస్తుంది.కేసేంటిభారత్పేలో విధులు నిర్వహించే సమయంలో అష్నీర్ గ్రోవర్ దంపతులు విలాసాల రుచి మరిగి రూ.81 కోట్ల సంస్థ నిధుల్ని కాజేశారు. ఆ కుంభకోణం వెలుగులోకి రావడంతో భారత్‌పే వారిద్దరిని సంస్థ నుంచి తొలగించింది. ఇదే అంశంపై అష్నీర్ దంపతుల్ని విచారించాలని కోరుతూ భారత్‌పే ఢిల్లీ హైకోర్ట్‌ను ఆశ్రయించింది. ఆ కేసులో వాళ్లిద్దరూ విదేశాలకు పారిపోకుండా గతేడాది నవంబర్‌లో ఎకనమిక్స్ అఫెన్స్ వింగ్ (ఈఓడబ్ల్యూ) లుకౌట్ నోటీసులు జారీ చేసింది.విదేశాలకు వెళ్లేందుకు ఈ తరుణంలో అమెరికాలో ఉన్న కుటుంబసభ్యులను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. జూన్ 17 నుండి జూన్ 25 వరకు బర్కిలీలోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో సమ్మర్ కోర్సు, నేషనల్ స్టూడెంట్ లీడర్షిప్ కాన్ఫరెన్స్ కోసం తమ కుమారుడికి ఆహ్వానం అందిందని పిటిషన్లో పేర్కొన్నారు. విదేశాలకు పారిపోతేఈఓడబ్ల్యూ తరఫు న్యాయవాది ఈ పిటిషన్లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అష్నీర్‌కు, అతని భార్య మాధురి జైన్ గ్రోవర్‌లకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతిస్తే, వారు దేశానికి తిరిగి రాకపోయే అవకాశం ఉందనే అనుమానం వ్యక్తం చేశారు. అందుకు అష్నీర్ దంపతుల న్యాయవాది దంపతులు దేశం విడిచి పారిపోరని, కలిసి ప్రయాణించే బదులు విడివిడిగా వెళ్లేందుకు అనుమతించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు విదేశాలకు వెళ్లేందుకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.షరతులు వర్తిస్తాయ్అయితే వారి ప్రయాణానికి సంబంధించి కొన్ని షరతులు విధించింది. అష్నీర్ గ్రోవర్, మాధురి జైన్ గ్రోవర్లు విదేశాలకు ఎప్పుడు వెళ్లాలన్న వారి ప్రయాణ ప్రణాళికలు, వారి ప్రయాణం, వసతి, ఖర్చులతో ఇలా మొత్తం సమాచారాన్ని కోర్టు, దర్యాప్తు అధికారులకు అందించాలని తీర్పులో వెలువరించింది. విదేశాలకు విడివిడిగానే కోర్టు ఆదేశాలతో అష్నీర్ గ్రోవర్ మే 26న అమెరికాకు వెళ్లి జూన్ 14న తిరిగి రావాల్సి ఉండగా, మాధురీ జైన్ జూన్ 15న ప్రయాణించి జూలై 1న తిరిగి రానున్నట్లు తెలుస్తోంది. -
Viral Photo: ఢిల్లీలో టెస్లా క్రాస్‌బ్రీడ్.. మస్క్ చూస్తే ఏడుస్తాడు!
ఢిల్లీలోని కరోల్ బాగ్ ఏరియాలో ఓ టెస్లా కారు కనిపించి ఆశ్చర్యపరిచింది. అయితే ఇది అసలైన టెస్లా కారు కాదు. వేరే కంపెనీ కారుకు టెస్లా లేబుల్ తగిలించి తిప్పుతున్నారు. ఇది భారత్ పే మాజీ ఎండీ ఆష్నీర్ గ్రోవర్ కంట్లో పడింది. దీనికి సంబంధించిన ఫొటోను ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. భారత్ పే మాజీ ఎండీ అష్నీర్ గ్రోవర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అవకాశం దొరికినప్పుడల్లా ఇంటర్నెట్లో వినోదభరితమైన, అబ్బురపరిచే విషయాలను పంచుకొంటుంటారు. ఇదే క్రమంలో టెస్లా లోగోతో ఉన్న బీవైడీ అట్టో3 కారు ఫొటోను షేర్ చేశారు. ‘బహుశా ప్రపంచంలోనే తొలి క్రాస్ బ్రీడ్ టెస్లా కారు ఇదేనేమో’ అంటూ కాప్షన్‌ను జోడించారు. దీంతో ఈ ఫొటో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. దేశంలో క్రియేటివిటీకి కొదవ లేదని ఓ యూజర్ కామెంట్లు పెట్టారు. ఇక మరో నెటిజన్ స్పందిస్తూ.. ఈ ఫొటో చూస్తే టెస్లా ఓనర్ ఎలాన్ మస్క్ ఓ మూలన కూర్చుని ఏడుస్తాడని కామెంట్ చేశాడు. World’s first ‘cross - breed’ Tesla ! Some Delhi boy literally ‘built his dream’ in Karol Bagh @Tesla pic.twitter.com/zxuilgyvAV — Ashneer Grover (@Ashneer_Grover) February 3, 2024 -
లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన అశ్నీర్ గ్రోవర్.. కారణం అదేనా..
ప్రముఖ మొబైల్ యాప్ భారత్‌పే కో-ఫౌండర్, సంస్థ మాజీ ఎండీ అశ్నీర్ గ్రోవర్ కంపెనీ యాజమాన్యంపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ను ఆశ్రయించారు. ప్రస్తుత భారత్‌పే బోర్డు అధికార దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. భారత్‌పే ఎండీగా తనను తిరిగి సంస్థలో నియమించాలని కోరుతూ ఆయన ఎన్‌సీఎల్‌టీను ఆశ్రయించారు. కంపెనీ రిసీలియెంట్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బోర్డు నిబంధనలను తారుమారు చేసి, యాజమాన్యంలో చట్టవిరుద్ధ మార్పులు చేసిందని చెప్పారు. ఆయన రాజీనామా అనంతరం 2022 మార్చి ఒకటో తేదీ నుంచి జారీ చేసిన షేర్లు / ఈఎస్ఓపీఎస్‌కు సంబంధించిన కంపెనీ నిర్ణయాలను తిరగదోడాలని డిమాండ్ చేశారు. దీనిపై కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో అడిటింగ్‌కు ఆదేశించాలని ఎన్సీఎల్టీని కోరారు. భారత్‌పే సంస్థ నుంచి తన భార్య మాధురి జైన్ తొలగింపు చట్ట విరుద్ధమని, ఆమెను తిరిగి ఉద్యోగంలో నియమించాలన్నారు. తన రాజీనామా తర్వాత బోర్డులో కొత్తగా నియమించిన సభ్యులను తొలగించాలని అభ్యర్థించారు. కంపెనీల చట్టం-2013లోని 241, 242 సెక్షన్ల ప్రకారం పిటిషన్ దాఖలు చేసిన అశ్నీర్ గ్రోవర్..అణచివేతకు పాల్పడుతూ అధికార దుర్వనియోగంతో తనను తొలగించినందుకు కంపెనీ ప్రస్తుత యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదీ చదవండి: ఫ్యుయల్ ఆదా అవ్వాలంటే ఇది యాక్టివేట్ చేయాల్సిందే..! ఇటీవల గ్రోవర్ పిటిషన్ ఎన్సీఎల్టీ బెంచ్ ముందు విచారణకు వచ్చింది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెల 11కు వాయిదావేసింది. తన పిటిషన్‌కు సంబంధించి ప్రాథమిక సాక్ష్యాధారాలు సమర్పించినట్లు తెలిసింది. అశ్నీర్ గ్రోవర్ తన పిటిషన్లో కంపెనీ కో ఫౌండర్ శస్వత్ నక్రానీతోపాటు చైర్మన్ రజనీష్ కుమార్, మాజీ సీఈఓ కం డైరెక్టర్ సుశీల్ సమీర్ తదితర 12 మందిని ప్రతివాదులుగా చేర్చారు. -
‘దేవుడు నోరిచ్చాడు కదా అని’.. అశ్నీర్ గ్రోవర్‌పై కోర్టు ఆగ్రహం!
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ భారత్‌పే మాజీ కో-ఫౌండర్ అశ్నీర్ గ్రోవర్‌పై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటికి ఏది వస్తే అది సోషల్ మీడియాలో మాట్లాడొద్దని సూచించింది. క్షమాపణలు చెప్పడంతో పాటు రూ.2లక్షల జరిమానా కట్టాలని ఆదేశాలు జారీ చేసింది. అశ్నీర్ గ్రోవర్ భారత్‌పే గురించి ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆపోస్టులపై భారత్‌పే ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్‌ను దాఖలు చేసింది. అందులో అశ్నీర్ తమ సంస్థను కించ పరుస్తూ పోస్టులు పెడుతున్నారని, భవిష్యత్‌లో అలాంటి పోస్టులు పెట్టకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. తాజాగా ఢిల్లీ హైకోర్టులో ఆ పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా భారత్‌పే పిటిషన్‌ను కోర్టు కొట్టిపారేసింది. అయితే, భవిష్యత్‌లో అశ్నీర్ పెట్టే సోషల్ మీడియా పోస్ట్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచింది. క్షమాపణలు చెప్పడంతో పాటు, రూ.2లక్షల ఫైన్ కట్టాలని తీర్పు వెలువరించింది. గత వారం అశ్నీర్ గ్రోవర్ భారత్‌పే ఈక్విటీ, సిరీస్ ఈ ఫండింగ్ గురించిన సమాచారాన్ని ఎక్స్‌లో పోస్ట్‌లో చేశారు. ఆ పోస్ట్‌లో టైగర్ గ్లోబుల్, డ్రాగోనీర్ ఇన్వెస్టర్ గ్రూప్‌తో పాటు ఇతర సంస్థలు భారత్‌పేలో 370 మిలియన్ల పెట్టుబడుల్ని పెంచాయని, ఫలితంగా ఆ సంస్థ విలువ 2.86 బిలియన్ డాలర్లకు చేరినట్లు ఆ పోస్ట్‌లో ప్రస్తావించారు. కొద్ది సేపటికే ఆ పోస్ట్‌ను అశ్నీర్ డిలీట్ చేశారు. దీనిపై భారత్‌పే ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో అశ్నీర్ పోస్ట్‌లు పెట్టకుండా నిషేధించాలని కోరింది. దీనిని ఢిల్లీ కోర్టు వ్యతిరేకించింది. కాకపోతే, అశ్నీర్ గ్రోవర్ ప్రవర్తన దృష్ట్యా ఢిల్లీ హైకోర్టు అతనికి హెచ్చరికలతో సరిపెట్టింది. సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. కోర్టు నిబంధనల్ని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని సూచించింది. -
‘భారత్‌పే’లో నిధులు బొక్కేశారు!,మరో వివాదంలో అశ్నీర్ గ్రోవర్ దంపతులు
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ భారత్‌పే కో-ఫౌండర్ అశ్నీర్ గ్రోవర్, అతని భార్య మాధురి జైన్ గ్రోవర్లు మరో వివాదంలో చిక్కుకున్నారు. ది ఎకనామిక్స్ ఆఫెన్స్ వింగ్స్ (ఈవోడ్ల్యూ) విచారణలో ఫిన్‌టెక్ కంపెనీ భారత్‌పేలో ఉండగా ఉద్యోగాల పేరిట మోసపూరిత లావాదేవీలు చేసినట్లు తేలింది. ఈ లావాదేవీలను భారత్‌పేలో కోచింగ్, డెవలప్మెంట్, రిక్రూట్మెంట్, రిసోర్స్ ప్లానింగ్ విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించిన అశ్నీర్ భార్య మాధూరి జైన్ గ్రోవర్‌ను అడ్డుపెట్టుకుని చేసినట్లు తెలుస్తోంది. ఈ స్కాంలో మాధూరి జైన్ కుటుంబ సభ్యుల హస్తం ఉందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై ఈఓడబ్ల్యూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. రిక్రూట్మెంట్ వర్క్‌కు సంబంధించిన కమిషన్లు చెల్లించేందుకు నిధులు కావాలంటూ తప్పుడు తేదీలు, ఇన్వాయిస్లు తయారు చేసినట్లు ఆరోపిస్తుంది. అంతేకాదు భారత్‌పేలో ఉద్యోగుల్ని నియామకాల కోసం నియమించుకున్న హెచ్ఆర్ కన్సల్టెన్సీలకు రూ.7.6 కోట్లు, జీఎస్టీ సకాలంలో చెల్లించలేదని, అదనపు ఛార్జీల కింద రూ.1.6 కోట్లు, ఇతర ఫేక్ ట్రాన్సాక్షన్స్ రూ.71.76 కోట్లు ఉన్నట్లు తేలింది. ఇలా మూడు సార్లుగా చేసిన మోసపూరిత లావాదేవీలు విలువ రూ.81 కోట్లుగా ఉందని ఈఓడబ్ల్యూ విచారణలో గుర్తించింది. ఆ విచారణ ఇంకా కొనసాగుతుంది. -
‘ఇలా వేధించడం తగదు’.. కేంద్రంపై అశ్నీర్ ఆగ్రహం
ప్రముఖ ఫాంటసీ గేమింగ్ యాప్ ‘క్రిక్‌పే’ ఫౌండర్ అశ్నీర్ గ్రోవర్ ట్యాక్స్ ఉన్నతాధికారులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బకాయల పేరుతో వ్యాపారస్తుల్ని వేధిస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల డైరెక్టరేట్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) విభాగం ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్ (ఆర్ఎంజీ) కంపెనీలకు జీఎస్టీ డైరెక్టర్ జనరల్ గట్టి షాకిచ్చింది. రూ. 55,000 కోట్ల పన్ను బకాయిలు చెల్లించాలంటూ దాదాపు 12 ఆర్ఎంజీ కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారిచేసింది. ఆ నోటీసులపై అశ్నీర్ గ్రోవర్ స్పందించారు. డీజీజీఐ విభాగాన్ని నిర్వహిస్తున్న వారి లక్ష్యం కేవలం వ్యాపారస్తులను వేధించడమే’ అని అన్నారు. షోకాజ్ నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబడుతూ ప్రజలు భారీ పన్నులు చెల్లించరని, ప్రభుత్వం సైతం చెల్లించదు..కేవలం వాటిని సేకరించగలదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అలా.. బీజేపీ ఇలా దీనిని 'రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్' (గత లావాదేవీలకు వర్తించే విధంగా) అని పిలుస్తున్నారు. కాంగ్రెస్ వోడాఫోన్ రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ విధించగా, బీజేపీ గేమింగ్ జీఎస్టీ రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్‌ను తీసుకొచ్చింది. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలనే లక్ష్యంతో ఉన్న ప్రభుత్వ దృక్పథానికి సహాయం చేయదని, ఈ సమస్యను పరిష్కరించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖను అభ్యర్థించారు. జీఎస్టీ నిర్ణయంపై అసంతృప్తి ఆన్లైన్ గేమింగ్ కంపెనీల టర్నోవర్‌పై 28 శాతం వస్తు సేవల పన్ను విధిస్తూ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జిఎస్టి) కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని గ్రోవర్ తప్పుబట్టారు. ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమపై 28 శాతం జీఎస్టీ విధించడం వల్ల కొత్త గేమ్‌లలో పెట్టుబడి పెట్టే వారి సామర్థ్యాన్ని పరిమితం చేస్తుందని, ట్రాన్సాక్షన్లు, అలాగే వ్యాపార విస్తరణపై ప్రభావం చూపుతుందన్నారు. . అశ్నీర్ గ్రోవర్ ఏం చేస్తున్నారు? భారత్ పే కో-ఫౌండర్‌గా ఆ సంస్థలో విధులు నిర్వహించే సమయంలో అశ్నీర్ గ్రోవర్, ఆయన భార్య మాధురి జైన్ గ్రోవర్లు అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. దీంతో అశ్నీర్ను, ఆయన భార్యను భారత్ పే బోర్డ్ యాజమాన్యం ఆ సంస్థ నుంచి తొలగించింది. ఆ తర్వాత ఈ ఏడాది క్రిక్‌పే పేరుతో సొంత ఫాంటసీ గేమింగ్ సంస్థను ప్రారంభించారు. -
కేంద్రంపై విమర్శలు.. రాజకీయాల్లోకి అష్నీర్ గ్రోవర్?
ఫిన్‌టెక్ దిగ్గజం భారత్ పే మాజీ ఫౌండర్ అష్నీర్ గ్రోవర్ రాజకీయాల్లోకి రానున్నారా? లేదంటే రావాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారా? అంటే అవుననే అనిపిస్తున్నాయి ఇటీవల కాలంలో ఆయన చేసిన వ్యాఖ్యలు. కేంద్రం ఆన్లైన్ గేమ్స్‌పై 28 శాతం జీఎస్టీని విధించింది. ఈ నిర్ణయాన్ని అష్నీర్ గ్రోవర్ వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ తీరుతో దేశంలో గేమింగ్ ఇండస్ట్రీ కుప్పకూలే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అదే సమయంలో తమ వాణిని వినిపించేందుకు టెక్నాలజీ స్టార్టప్ ఫౌండర్లు రాజకీయాల్లో రావాల్సిన అవసరం ఉందని ట్వీట్లో పేర్కొన్నారు. RIP - Real money gaming industry in India. If the govt is thinking people will put in ₹100 to play on ₹72 pot entry (28% Gross GST); and if they win ₹54 (after platform fees)- they will pay 30% TDS on that - for which they will get free swimming pool in their living room come… — Ashneer Grover (@Ashneer_Grover) July 11, 2023 గ్రోవర్ మాత్రమే కాదు ఇండియా గేమింగ్ ఫెడరేషన్తో పాటు ఈ-గేమింగ్ ఫెడరేషన్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫాంటసీ స్పోర్ట్స్ (FIFS), ఆన్లైన్ స్కిల్ గేమ్‌లపై జీఎస్టీని 18 శాతం నుండి 28 శాతానికి పెంచడంపై కౌన్సిల్ నిర్ణయం పట్ల అసంతృప్తిగా ఉన్నాయి. నేనే రాజకీయ నాయకుడిని అయితే అష్నీర్ రాజకీయ రంగ ప్రవేశంపై గతంలోనూ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో అంతర్జాతీయ క్రెడిట్ కార్డుల ద్వారా చేసే చెల్లింపులపై కేంద్రం వసూలు చేసే టీసీఎస్ (ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్) విధానాన్ని వ్యతిరేకించారు. అందులో లోపాల్ని సవరించాలని అన్నారు. అదే సమయంలో తాను రాజకీయ నాయకుడిని అయితే, దేశంలో ఆదాయపు పన్ను రేటును తగ్గించేందుకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ప్రతి ఒక్కరూ 10 నుంచి 15 శాతం ట్యాక్స్ కట్టేలా నిర్ధేశిస్తా. తద్వారా ఇప్పుడు ఎక్కువ పన్నులు కట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే పన్ను తక్కువగా ఎగవేతకు ప్రయత్నించరు. ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని అన్నారు. తాజాగా, మరోమారు పాలిటిక్స్‌పై హాట్ కామెంట్స్ చేయడంపై అష్నీర్ గ్రోవర్ పాలిటిక్స్‌లోకి అడుగు పెడతారేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి👉 ‘విలాసాల రుచి మరిగి’..అశ్నీర్ గ్రోవర్, అతని భార్య మాధురి జైన్ గ్రోవర్‌కు మరో ఎదురు దెబ్బ! -
Ashneer Grover : ఎన్నాళ్లు ఇలా ప్రభుత్వాలకు ఊడిగం చేయాలి? :
విదేశాల్లో అంతర్జాతీయ క్రెడిట్ కార్డుల ద్వారా చేసే చెల్లింపులపై కేంద్రం టీసీఎస్ (ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్) ను వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ కొత్త పన్ను విధానాన్ని, అందులోని లోపాల్ని భారత్ పే మాజీ సహ వ్యవస్థాపకులు అశ్నీర్ గ్రోవర్ విమర్శిస్తూ వస్తున్నారు. తాజాగా, మరో సారి ట్యాక్స్ పేయర్లు ప్రభుత్వాలకు ఊడిగం చేస్తున్నారంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పైగా పన్నులు చెల్లించడం ఓ శిక్షే’నని అన్నారు. ఈ మేరకు పన్ను చెల్లింపులపై పలు మార్లు గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఎన్నాళ్లు ఇలా ఊడిగం చేయాలి కేంద్రం పన్నుల చెల్లింపు దారుల నుంచి 30 నుంచి 40 శాతం వరకు ట్యాక్స్ వసూలు చేస్తుందని, ప్రతిగా ఎలాంటి ప్రతిఫలం పొందలేకపోతున్నారని అశ్నీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ట్యాక్స్ పేయర్లు తమ సంపాదనలో కొంత బాగాన్ని దేశానికి ఇస్తున్నారు. కానీ వాళ్లు ఎలాంటి లబ్ధి పొందడం లేదు. రూ.10 మనం (ట్యాక్స్ పేయర్లను ఉద్దేశిస్తూ) సంపాదిస్తే అందులో రూ.4 ప్రభుత్వానికే ఇస్తున్నాం. దీంతో 12 నెలల సమయంలో 5 నెలలు ప్రభుత్వానికే పనిచేస్తున్నారు. అయినా ఇలా ట్యాక్స్ పేయర్లు వారీ జీవితంలో ప్రభుత్వాలకు ఎన్నాళ్లు ఇలా ఊడిగం చేయాలని ప్రశ్నించారు. కానీ పరిస్థితుల్ని బట్టి నడుచుకోవాల్సిందే తప్పదు’’ అని వ్యాఖ్యానించారు. ఉద్యోగులు ట్యాక్స్ ఎగవేతకు పాల్పడలేరు అంతేకాదు, వ్యాపారస్థులకు ట్యాక్స్ కట్టకుండా ఎలా తప్పించుకోవాలో తెలుసు. కానీ ఉద్యోగుల పరిస్థితి అలా కాదు. వేరే ప్రత్యామ్నాయం లేదు. శాలరీ నుంచే ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. పైగా 18 శాతం జీఎస్టీ చెల్లిస్తున్నారు. అందుకే ట్యాక్స్ అనేది శిక్షతో సమానమేనన్న అభిప్రాయం వ్యక్తం చేశారు అశ్నీర్ గ్రోవర్. నేనే రాజకీయ నాయకుడిని అయితే దేశంలో ఆదాయపు పన్ను రేటును తగ్గించేందుకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ప్రతి ఒక్కరూ 10 నుంచి 15 శాతం ట్యాక్స్ కట్టేలా నిర్ధేశిస్తా. తద్వారా ఇప్పుడు ఎక్కువ పన్నులు కట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే పన్ను తక్కువగా ఎగవేతకు ప్రయత్నించరు. ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని అన్నారు. పార్టీలకు ఇచ్చే డొనేషన్లపై జీరో ట్యాక్సా గత నెలలో విదేశాల్లో క్రెడిట్ కార్డ్ వినియోగంపై 20 శాతం టీసీఎస్ వసూలు చేయడాన్నీ గ్రోవర్ తప్పుబట్టారు. విదేశాల్లో క్రెడిట్‌కార్డు వాడకంపై 20 శాతం పన్ను పార్టీలకు ఇచ్చే డొనేషన్లకు మాత్రం జీరో ట్యాక్స్ అంటూ ఎద్దేవా చేశారు. చదవండి👉 ‘విలాసాల రుచి మరిగి’..అశ్నీర్ గ్రోవర్, అతని భార్య మాధురి జైన్ గ్రోవర్‌కు మరో ఎదురు దెబ్బ! -
‘విలాసాల రుచి మరిగి’.. అశ్నీర్ గ్రోవర్ దంపతులకు మరో ఎదురు దెబ్బ!
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ భారత్‌పే కో-ఫౌండర్ అశ్నీర్ గ్రోవర్, అతని భార్య మాధురి జైన్ గ్రోవర్‌లకు ఎదురు దెబ్బ తగిలింది. భారత్‌పే చేసిన ఫిర్యాదుపై జరుగుతున్న విచారణను నిలిపివేయాలని అశ్నీర్ దంపతులు వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్ట్ కొట్టిపారేసింది. భారత్‌పేలో విధులు నిర్వహించే సమయంలో అశ్నీర్ గ్రోవర్ దంపతులు విలాసాల రుచి మరిగి రూ.81 కోట్ల సంస్థ నిధుల్ని కాజేశారు. ఆ కుంభకోణం వెలుగులోకి రావడంతో భారత్‌పే వారిద్దరిని సంస్థ నుంచి తొలగించింది. చదవండి👉 రండి! నా స్టార్టప్‌లో పనిచేయండి.. బెంజ్ కార్లు బహుమతిగా ఇస్తా! చదవండి👉 అప్పుడు బడాయి మాటలు..కక్కుర్తి పనులు, మరి ఇప్పుడు! ఇదే అంశంపై అశ్నీర్ దంపతుల్ని విచారించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్ట్‌ను ఆశ్రయించింది. ప్రస్తుతం ఆ విచారణ వేగంగా కొనసాగిస్తుంది. ఈ తరుణంలో తమపై సంస్థ తప్పుడు అభియోగాలు మోపిందని, వెంటనే కేసు విచారణ నిలిపివేయాలని కోరుతూ అశ్నీర్ కోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేశారు. మీ వైఖరి ఏంటో తెలిజేయండి అయితే, ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టీస్ అనూప్ జైరామ్ భంభానీ ధర్మాసనం తీర్పును వెలువరించింది. తమని విచారణ చేపట్టాలని అధికారులు ముందస్తు నోటీసులు ఇవ్వాలన్న అశ్నీర్ అభ్యర్ధనను జస్టీస్ భంభానీ సున్నితంగా తిరస్కరించారు. బదులుగా ముందస్తు బెయిల్‌కు దాఖలు చేసుకోవచ్చని తీర్పిచ్చారు. అంతేకాదు, ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ అశ్నీర్ గ్రోవర్, అతని భార్య మాధురి జైన్ వేసిన పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈవోడబ్ల్యూతో పాటు భారత్‌పే సైతం విచారణపై స్టే విధించాలన్న అశ్నీర్ దంపతుల పిటిషన్‌పై తమ వైఖరి ఏంటో స్పష్టంగా తెలియజేయాలని కోరారు. చదవండి👉 చేసింది ఇక చాలు!! మా'స్టారు' మీ టైమ్ అయిపోయింది! అహర్నిశలు పనిచేస్తే.. అందుకు ప్రతిఫలం ఇదేనా ఈ సందర్భంగా పిటిషనర్ల తరుపు సీనియర్ న్యాయవాదులు వికాస్ పహ్వా, దయన్ కృష్ణన్లు తమ క్లయింట్ అశ్నీర్ గ్రోవర్, అతని భార్య మాధురి జైన్లు పిటిషన్‌పై నోటీసు జారీ చేయడాన్ని వ్యతిరేకించారు. భారత్‌పేని స్టార్టప్ నుంచి యూనికార్న్ కంపెనీగా తీర్చిదిద్దడంలో తమ క్లయింట్ అశ్నీర్ గ్రోవర్, అతని భార్య మాధురి జైన్లు అహర్నిశలు శ్రమించారని గుర్తు చేశారు. చట్టబద్ధమైన ఆడిటర్ల ద్వారా సంస్థలో కార్యకలాపాలు నిర్వహించారని, ఎలాంటి అవకతవకలు జరగలేదని వాదించారు. రూ.81.3 కోట్లు స్వాహా మరోవైపు, అష్నీర్ గ్రోవర్, అతని కుటుంబం బోగస్ హ్యూమన్ రిసోర్స్ కన్సల్టెంట్లకు చట్టవిరుద్ధమైన చెల్లింపులు చేశారని భారత్‌పే ఆధారాల్ని కోర్టుకు అందించింది. అనవసరమైన చెల్లింపులు,ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్లో మోసపూరిత లావాదేవీలు, చెల్లింపుల ద్వారా సంస్థకు సుమారు రూ.81.3 కోట్ల నష్టం కలిగించారని ఫిర్యాదులో పేర్కొంది. భారత్‌పేలో కీలక పదవి భారత్‌పేలో మాధురీ జైన్ కంట్రోల్స్ హెడ్‌గా ఉన్నారు. ఫోరెన్సిక్ ఆడిట్లో అనేక అవకతవకలు జరిగినట్లు వెల్లడి కావడంతో 2022లో తొలగించారు. తదనంతరం, అష్నీర్ గ్రోవర్ మార్చి 2022లో సీఈవో పదవికి రాజీనామా చేశారు. కాగా, ఢిల్లీ హైకోర్ట్ ఈ కేసు తదుపరి విచారణ సెప్టెంబర్ 25న చేపట్టనుంది. చదవండి👉 ఆ వార్తల్లో నిజం లేదు.. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు స్వస్తి పలకనున్నారా? -
BharatPe controversy: అష్నీర్ గ్రోవర్, ఫ్యామిలీకి భారీ షాక్
సాక్షి,ముంబై: పేమెంట్స్ యాప్ భారత్ పే ఫౌండర్, మాజీ ఎండీ అష్నీర్ గ్రోవర్ వివాదంలో అష్నీర్‌కు మరోసారి చుక్కెదురైంది. భారత్‌పే టాప్ లీడర్షిప్ నుంచి వివాదాస్పదంగా నిష్క్రమించిన తర్వాత, తాజాగా మోసం, ఫోర్జరీ, నేరపూరిత కుట్ర వంటి 8 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసులో గ్రోవర్‌తోపాటు ఐదుగురు కుటుంబ సభ్యులపై ఎఫ్ఐఆర్ దాఖలైంది. గ్రోవర్ కుటుంబ సభ్యులు ఫిన్‌టెక్ యునికార్న్‌ను దాదాపు రూ.81 కోట్ల మేర మోసగించారని ఎఫ్ఐఆర్లో పేర్కొంది. గత ఏడాది ఫిన్‌టెక్ యునికార్న్ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా అష్నీర్ గ్రోవర్ , కుటుంబ సభ్యులపై ఆర్థిక నేరాల విభాగం (EOW) ఫిర్యాదు దాఖలు చేసింది. ఇందులో గ్రోవర్ భార్య మాధురీ జైన్ గ్రోవర్, ఆమె సోదరులు శ్వేతాంక్ జైన్, దీపక్ గుప్తా, సురేష్ జైన్ ఉన్నారు. కుటుంబ సభ్యులు పొందే సేవలకు అనుసంధానించబడిన ట్రావెల్ ఏజెన్సీలకు గ్రోవర్ అక్రమ చెల్లింపులు చేశారని ఆర్థిక నేరాల విభాగం ఆరోపించింది. ఆర్థిక నేరాల విభాగం ఆరోపణలు 86 నకిలీ, తప్పుడు ఇన్వాయిస్లను ఉపయోగించి గ్రోవర్, ఇతర నిందితులు రూ.7.6 కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించింది. అంతేకాదు కుటుంబ సభ్యులు పొందే సేవలకు అనుసంధానంగాఉన్న ట్రావెల్ ఏజెన్సీలకు గ్రోవర్ అక్రమ చెల్లింపులు చేశారని ఆరోపించింది. అంతేకాదు సాక్ష్యాలను మాధురీ జైన్ నాశనం చేశారని ఆరోపించింది. త్వరలోనే నిందితులందరినీ అరెస్టు చేసే అవకాశం ఉందని అంచనా. మరోవైపు నేరం రుజువైతై గ్రోవర్ కుటుంబ సభ్యులకు గరిష్ఠంగా పదేళ్ల దాకా జైలు శిక్ష ఖరారు కానుందని తెలుస్తోంది. కాగా 2022, జనవరిలో ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఆరోపణలు రావడంతో గ్రోవర్‌ను మార్చిలో తొలగించింది. డిసెంబరులో కంపెనీలో జరిగిన మోసాలపై కంపెనీ ఢిల్లీ పోలీసు ఆర్థిక నేరాల విభాగంలో క్రిమినల్ ఫిర్యాదు చేయడంతోపాటు, గ్రోవర్, అతని కుటుంబ సభ్యులపై ఢిల్లీ హైకోర్టులో సివిల్ దావా కూడా వేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా, వివిధ సెక్షన్ల ద్వారా నిందితులందరి నుండి రూ. 88 కోట్ల నష్టపరిహారాన్ని రికవరీ చేయాలని కంపెనీ కోరింది. భారత్‌పే ఫౌండర్ ట్యాగ్‌ని ఉపయోగించకుండా నిరోధించాలంటూ సింగపూర్‌లో కూడా దావా వేసింది. అయితే తాజా పరిణామంపై అష్నీర్ గ్రోవర్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. -
క్రిక్‌పే లాంచ్ ఆలస్యమైంది.. క్షమించండి
క్రిక్‌పే లాంచ్ ఆలస్యం అయినందుకు ఆ యాప్ అధినేత, భారత్‌పే సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ క్షమాపణలు కోరారు. తన తండ్రి ఆకస్మిక మరణం కారణంగా క్రిక్‌పే లాంచ్ ఆలస్యమతోందన్నారు. ఈ మేరకు మార్చి 31న ట్వీట్ చేశారు. (CrickPe: ఫాంటసీ క్రికెట్ యాప్ ‘క్రిక్‌పే’ లాంచ్... అదీ ఐపీఎల్‌కు ముందు) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కొత్త సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని అందించలేకపోయామని అభిమానులకు క్షమాపణలు చెప్పారు. ఐపీఎల్ ప్రారంభ వారంలో క్రిక్‌పే యాప్ అందుబాటులోకి రాకపోయినప్పటికీ ఏప్రిల్ 3 నుంచి ఎటువంటి అవాంతరాలు లేకుండా క్రిక్‌పే యాప్ పూర్తిస్థాయిలో నడుస్తుందని హామీ ఇచ్చారు. (ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో 1,000 మంది నియామకం..) అష్నీర్ గ్రోవర్ తండ్రి అశోక్ గ్రోవర్ మార్చి 29న 69 సంవత్సరాల వయసులో మృతి చెందారు. ఐపీఎల్ ప్రారంభానికి ముందే అష్నీర్ గ్రోవర్ సరికొత్త క్రికెట్ ఫాంటసీ స్పోర్ట్స్ యాప్ క్రిక్‌పేని లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మార్చి 23న ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ డౌన్లోడ్ లింక్‌లను కూడా తన ట్విటర్లో షేర్ చేశారు. (Jio offer: జియో అన్లిమిటెడ్ డేటా ఆఫర్.. కొత్త కస్టమర్లకు ఉచిత ట్రయల్!) Sorry. In this week leading to CrickPe app launch I lost my dad. Tough decision was to abort launch or go ahead with IPL nevertheless. I promise the app will be without glitches by Monday. I failed - not making any excuses.@crickpe_app — Ashneer Grover (@Ashneer_Grover) March 31, 2023 -
స్వర్గంలో ఉన్ననానాజీ, నానీ..నాన్న జాగ్రత్త: అష్నీర్ గ్రోవర్ భావోద్వేగం
సాక్షి, ముంబై: భారత్‌పే వ్యవస్థాపకుడు, షార్క్ ట్యాంక్ ఇండియా మాజీ ఇన్వెస్టర్అష్నీర్ గ్రోవర్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి అశోక్ గ్రోవర్ (69)బుధవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని అష్నీర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మంగళవారం రాత్రి కన్నుమూసిన తండ్రికి వీడ్కోలు పలుకుతూ ‘‘బై పాపా.. లవ్ యూ...నాన్నను జాగ్రత్తగా చూసుకోండి’’ అంటూ స్వర్గంలో ఉన్న కుటుంబ సభ్యులు (తాతయ్య నానమ్మ, పెద్దమ్మ) ను కోరుతూ ఇన్‌స్టాలో ఒక ఫోటో షేర్ చేశారు. (ఇదీ చదవండి: ‘పాపం..చేప! నా బాధ వారికే తెలుస్తుంది’ ఎయిరిండియాపై పెట్ లవర్ ఫిర్యాదు వైరల్) అశోక్ గ్రోవర్ కన్నుమూతపైకమెడియన్ సునీల్ గ్రోవర్ సహా పలువురు సంతాపాన్ని వెలిబుచ్చారు. ఢిల్లీలో చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేసిన అశోక్‌కు కుమారుడు అష్నీర్‌తోపాటు కూతురు ఆషిమా ఉన్నారు. (సోషల్ మీడియా స్టార్, అన్‌స్టాపబుల్ టైకూన్ దిపాలీ: రతన్‌టాటా కంటే ఖరీదైన ఇల్లు) View this post on Instagram A post shared by Ashneer Grover (@ashneer.grover) -
CrickPe: ఫాంటసీ క్రికెట్ యాప్ ‘క్రిక్‌పే’ లాంచ్... అదీ ఐపీఎల్‌కు ముందు
సాక్షి,ముంబై: భారత్‌పే సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ సరికొత్త క్రికెట్ ఫాంటసీ స్పోర్ట్స్ యాప్ ‘క్రిక్‌పే’ని లాంచ్ చేశాడు. వచ్చే వారం ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నమెంట్‌కు ముందు ప్రపంచంలోని ఏకైక ఫాంటసీ క్రికెట్ యాప్ క్రిక్‌పేని ప్రారంభించడం ఆసక్తికరంగా మారింది. క్రికెట్-ఫోకస్డ్ ఫాంటసీ స్పోర్ట్స్ యాప్‌ను ‘క్రిక్‌పే’ లాంచింగ్‌ను అష్నీర్ గ్రోవర్ ట్విటర్లో వెల్లడించారు. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ , యాపిల్ స్టోర్ డౌన్లోడ్ లింక్‌లను కూడా (తన అధికారిక ట్విట్టర్ మార్చి 23న) హ్యాండిల్లో షేర్ చేశారు. ఐపీఎల్ క్రికెట్లో అతిపెద్ద విప్లవం. కేవలం ఫాంటసీ గేమ్ ఆటతీరుతో క్రికెటర్లకు డబ్బు చెల్లిస్తుంది! మీరు గెలిస్తే.. క్రికెటర్ గెలుస్తాడు -క్రికెట్ గెలుస్తుంది !!" అని ట్వీట్‌చేశారు. క్రిక్‌పే అనేది ఒక స్పెషల్ ఫాంటసీ క్రికెట్ గేమింగ్ యాప్. ఇక్కడ ప్రతిరోజూ 'క్రికెట్ గెలుస్తుంది'! ఇందులో ప్రతి మ్యాచ్‌లో, ఆడే క్రికెటర్లు, క్రికెట్ బాడీలు, నిజమైన జట్టు యజమానులు ఫాంటసీ గేమ్-విజేతలతో పాటు నగదు రివార్డులను గెలుచుకుంటారు అని గూగుల్ ప్లే స్టోర్ వివరణ ద్వారా తెలుస్తోంది. అలాగే మనకిష్టమైన జట్లు, ఇష్టమైన క్రికెటర్లందరిపై కూడా ప్రేమను (రివార్డులు) కురిపించవచ్చట. కాగా అష్నీర్ గ్రోవర్ తన వెంచర్ థర్డ్ యునికార్న్ ప్రైవేట్ లిమిటెడ్ కోసం సుమారు 4 మిలియన డాలర్ల సీడ్ ఫండింగ్‌ను సేకరించారు ఈ ఫండింగ్ రౌండ్లో అన్మోల్ సింగ్ జగ్గీ, అనిరుధ్ కేడియా, విశాల్ కేడియా, ఇతరులతో సహా రెండు డజన్ల ఏంజెల్ ఇన్వెస్టర్లు పాల్గొన్న సంగతి తెలిసిందే. CRICKPE ! Biggest revolution in Cricket since IPL - only fantasy game paying cricketers for performance ! Where you win - cricketer wins - cricket wins !!https://t.co/virVGj27DThttps://t.co/Jl0mu4lFXO@crickpe_app pic.twitter.com/uQuxXEnk4c — Ashneer Grover (@Ashneer_Grover) March 23, 2023 -
భార్య గురించి అలా ట్వీట్ చేసిన అష్నీర్ గ్రోవర్
వృత్తిపరంగా ఎప్పుడూ బిజీగా ఉండే ప్రముఖ వ్యాపారవేత్త 'అష్నీర్ గ్రోవర్' ఇటీవల తన భార్య 'మాధురీ జైన్ గ్రోవర్' గురించి ఒక ఆసక్తికరమైన విషయం ట్వీట్ చేశారు. ఇందులో ఆమె స్టార్టప్ పెట్టుబడులను గురించి, దేశంలో ఎక్కువ టాక్స్ చెల్లిస్తున్న మహిళ అంటూ ప్రశంసించాడు. అష్నీర్ గ్రోవర్ ప్రకారం, మాధురి ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 2.84 కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించినట్లు తెలిసింది. అదే సమయంలో ఆయన 2022 - 2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 7.1 కోట్లు టాక్స్ చెల్లించినట్లు తెలుస్తోంది. హర్యానాలోని పానిపట్‌కు చెందిన మాధురీ జైన్ పానిపట్‌లోని బాల్ వికాస్ స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత, NIFT ఢిల్లీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది. ప్రస్తుతం భారతదేశంలో ప్రముఖ వ్యాపారవేత్తగా, స్టార్టప్ పెట్టుబడిదారుగా కొనసాగుతోంది. తన భర్త స్థాపించిన వ్యాపారంలో చేరడానికి ముందు ఇతర కంపెనీలలో కెరీర్ ప్రారంభించింది. ఇప్పుడు భారత్ పే ఆపరేషన్స్ అండ్ ఫంక్షన్స్ విభాగం నిర్వహణ బాధ్యతలను చేపట్టింది. అంతే కాకుండా గ్రోవర్తో పాటు గత ఫిబ్రవరిలో థర్డ్ యునికార్న్ బిజినెస్ ప్రారంభించారు. క్రికెట్ సాఫ్ట్వేర్ CrickPeని ఉపయోగించి కొత్త బిజినెస్ ఫాంటసీ కింద క్రీడలపై దృష్టి పెట్టారు. గత సంవత్సరం మాధురీ జైన్ గ్రోవర్ భారత్ పే ఆపరేషన్స్ హెడ్ హోదాలో 63 లక్షలు సంపాదించినట్లు సమాచారం. అదే ఏడాది అష్నీర్ గ్రోవర్ రూ. 1.69 కోట్లు సంపాదించారు. Madhuri Jain Grover @madsj30 is one of the highest female tax payers in the country. She’s paid ₹2.84 crores of advance tax this financial year. She is killing it with her start up investments - in a year where the space in general is falling apart. Kudos to all honest tax payer pic.twitter.com/cRkeRRfgqx — Ashneer Grover (@Ashneer_Grover) March 15, 2023 -
భారత్‌పేపై అష్నీర్ గ్రోవర్ సంచలన వ్యాఖ్యలు..15 కోట్ల మంది డేటా చోరీ!
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ భారత్‌పేపై ఆ కంపెనీ సహవ్యవస్ధాపకుడు, మాజీ సీఈఓ అష్నీర్ గ్రోవర్ సంచలన ఆరోపణలు చేశారు. భారత్‌పే ప్రస్తుత సీఈఓ భవిక్ కొలదియ 15 కోట్ల మంది భారత్‌పే యూజర్ల డేటా చౌర్యానికి పాల్పడ్డారని అన్నారు. ఇదే అంశంపై ఎన్‌పీసీఐకి లేఖ రాశారు. భారత్‌లో పే యూజర్ల డేటా ఉల్లంఘనతో యూజర్ల డేటా గోప్యత భగ్నమైందని ఆరోపిస్తూ గ్రోవర్ ఎన్‌పీసీఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు గతంలో క్రెడిట్ కార్డు మోసంలో భవిక్ గతంలో దోషిగా తేలాడని, 18 నెలల పాటు గృహ నిర్బంధంలో ఉంచిన అనంతరం అతడిని భారత్‌కు తరలించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఫేక్ టికెట్ ఉపయోగించి గుజరాత్‌కు వెళ్లేందుకు ప్రయత్నించడంతో అతడిపై ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో ఎఫ్ఐఆర్ నమోదైందని గ్రోవర్ చెప్పారు. అందకు సంబంధించిన ఆధారాలు తనవద్ద ఉన్నాయని చెప్పారు. ఇక గ్రోవర్ చేస్తున్న ఆరోపణలపై భారత్‌పే కంపెనీ స్పందించింది. కంపెనీ నుంచి తొలగించినందుకు గ్రోవర్ కక్షతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని భారత్‌పే సీఈఓ భవిక్ కొలదియ పేర్కొన్నారు. -
కియారా వల్ల నా భార్యతో విడాకులు తీసుకునేదాకా వెళ్లా: వ్యాపారవేత్త
బాలీవుడ్ లవ్ బర్డ్స్ సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ మరికాసేపట్లో ఏడడుగులు వేయనున్నారు. జైసల్మీర్‌లో ఎంతో ఘనంగా జరగనున్న వీరి వివాహానికి సెలబ్రిటీలందరూ విచ్చేశారు. ఈ వేడుకలు అంబరాన్నంటుతున్న సమయంలో వ్యాపారవేత్త, భారత్‌పే సహవ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ తన ఆటోబయోగ్రఫీ డోగ్లాపన్లో రాసుకొచ్చిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ పుస్తకంలో అష్నీర్.. కియారా వల్ల నేను విడాకులు తీసుకునే పరిస్థితి ఏర్పడింది అంటూ ఓ సంఘటనను పంచుకున్నాడు. అందులో ఏం రాసి ఉందంటే.. 'నేను వీకెండ్ రాగానే షార్క్ ట్యాంక్ ప్రోగ్రామ్ కోసం షూటింగ్‌కు వెళ్తున్నాను. మిగిలిన రోజులు నా పనిలో మునిగి తేలుతున్నాను. అలా పనిలో పడి బిజీ అయిపోవడంతో కనీసం అమ్మతో మాట్లాడేంత సమయం కూడా దొరకలేదు. దీంతో ఓ రోజు అమ్మ వచ్చి చాలా పెద్దవాడివైపోయావురా, మాటలు కాదు కదా కళ్లకు కూడా కనిపించట్లేదు అంది. అదే రోజు ఉదయం ఓ స్నేహితుడు కలవడంతో నా భార్య మాధురి, నేను పెళ్లెప్పుడు అని ఆరా తీశాం. ఓ సినీతారతో పెళ్లి సంబంధం కుదిరే ప్రయత్నాలు జరుగుతున్నాయని అతడు చెప్పాడు. ఇలా సెలబ్రిటీలతో సంబంధాలు కుదిర్చేందుకు ఓ మధ్యవర్తి పని చేస్తుందన్నాడు. తనొక స్టార్టప్ బిజినెస్ వ్యవస్థాపకుడు.. కానీ అమ్మాయి మాత్రం సినిమా ఇండస్ట్రీకి చెందినవారు కావాలని కోరుకుంటున్నాడు. ఇది గుర్తొచ్చి మా అమ్మతో నీకు బయట ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఇప్పటికిప్పుడు నేను పెళ్లికి రెడీ అయితే కియారా అద్వానీని వివాహం చేసుకోవచ్చు తెలుసా? అని జోక్ చేశాను. అది విని మాధురి ముఖం మాడిపోయింది. తర్వాత మేమిద్దరం ముంబైకి వెళ్లేందుకు విమానం ఎక్కాం. తను ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంది. ఇంతలో ఫుడ్ రావడంతో తినమని ఆమెను పలకరించాను. అంతే.. ఒక్కసారిగా నా మీద అరిచేసి తిట్టినంత పని చేసింది. నువ్వు కియారాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? అయితే నేనెందుకు మరి అంటూ తన నగలన్నీ తీసేసింది. ఆమె చర్యతో నేను ఒక్కసారిగా షాకయ్యాను. దయచేసి అలా ప్రవర్తించొద్దంటూ ఆమెను నగలు తీసేయకుండా పట్టుకున్నాను. అప్పటిదాకా ఫోన్లో సినిమా చూస్తున్న ఓ పెద్దాయన వెంటనే దాన్ని ఆపేసి లైవ్‌లో మా ఫైట్ మూవీని చూస్తున్నాడు. అక్కడున్న అందరికీ ఈ గొడవంతా మంచి ఎంటర్టైన్మెంట్లా అనిపించింది' అని రాసుకొచ్చాడు అష్నీర్. Kiara Advani, Ashneer Grover and his divorce. pic.twitter.com/MQQraqSQIF — Keshav Bedi (@keshavbedi) December 28, 2022 చదవండి: స్టేజీపై పాట పాడిన ధనుష్.. వీడియో వైరల్ -
ఉద్యోగాల ఊచకోత: ఫౌండర్స్ ఆ పనిచేయొచ్చుగా? అష్నీర్ గ్రోవర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: భారత్‌పే సహ వ్యవస్థాపకుడు, మాజీ ఎండీ అష్నీర్ గ్రోవర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాల్లో కోత ఎందుకు? సుదీర్ఘ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని స్వయంగా ఫౌండర్స్ జీతాలు తగ్గించుకోవచ్చుగా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదాయాలు క్షీణత, ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఉద్యోగులకు ఉద్వాసన పలికే బదులు ఫౌండర్లు తమ వేతనాల్లో కోత విధించుకోవచ్చు కదా ఆయన సూచించడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఉద్యోగులను తొలగించాల్సిన అవసరం లేకుండా, వ్యవస్థాపకుడిగా దీర్ఘకాలికంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఐటీ, సహా పలు రంగాలల్లో ఉద్యోగాల కోతపై స్పందించిన గ్రోవర్ ఈ కీలక వ్యఖ్యలు చేశారు. ప్రతీరోజు ఉద్యోగాలు కోల్పోతున్న వార్తలు వినడం విచారకరం. అదృష్టవశాత్తూ తాను అలాంటి చర్యలు తీసుకోకపోవడంపై సంతోషంగా ఉంది. నియామకాల విషయాల్లో జాగ్రత్తగా, శ్రద్ధగా ఉంటాం. అలాగే జాబ్స్ కట్లో ఫౌండర్స్‌గా దీర్ఘకాలికంగా ఆలోచించాల్సి ఉందంటూ తాజా లింక్డ్ఇన్ పోస్ట్‌లో గ్రోవర్ పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగాల తీసివేతకు ప్రత్యామ్నాయంగా తాను కొంతకాలం క్రితం 25-40 శాతం జీతం తగ్గించుకున్నా అని గుర్తు చేశారు. మిగిలిన, వ్యవస్థాపకులు ఈ మార్గంలో ఎందుకు ఆలోచించడం లేదో తనకు అర్థం కావడం లేదు. శక్తి, మూలధనం, సాంకేతికత, ప్రతిదానికీ ఉన్న ప్రాధాన్యత ఉద్యోగులకు ఎందుకు ఉండదు అంటూ ఆయన ప్రశ్నించారు. -
రండి! నా స్టార్టప్‌లో పనిచేయండి.. బెంజ్ కార్లు బహుమతిగా ఇస్తా!
భారత్ పే మాజీ ఫౌండర్ అశ్నీర్ గ్రోవర్ 3వ స్టార్టప్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా స్టార్టప్ భవిష్యత్ ప్రణాళికలు ఏంటనేవి లింక్డిన్ పోస్ట్‌లో షేర్ చేశారు అశ్నీర్. తాను ప్రారంభించిన కొత్త వెంచర్లో ఉద్యోగులు, పెట్టుబడి దారులకు స్వాగతం అంటూ ఆహ్వానించారు. పైగా కొత్త స్టార్టప్‌లో విధులు నిర్వహించే ఉద్యోగులకు మెర్సిడెజ్ బెంజ్ కార్లను బహుమతిగా ఇస్తామంటూ సంచలన ప్రకటన చేశారు. 2023లో కొంత పని పూర్తి చేద్దాం! అంటూ థర్డ్ స్టార్టప్ పనులు చాలా నిశబ్ధంగా, శాంతియుతంగా కొనసాగుతున్నాయి.మార్కెట్‌ను షేక్ చేసేలా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నాం. మేం విభిన్నంగా బిజినెస్ కార్యకలాపాలు చేస్తున్నాం. కాబట్టి మీరు తదుపరి టూడో - ఫోడో అంశంలో భాగం కావాలనుకుంటే బిజినెస్‌ను ఎలా చేస్తున్నామో మీరు తెలుసుకోవాలంటూ కొన్ని ఇమెజెస్‌ను చూపించగా.. అందులో థర్డ్ యునికార్న్‌కు వెంచర్ క్యాపిటలిస్ట్‌లు నిధులు సమకూర్చరని ఒక ఇమేజ్‌లో ఉంది. దేశీ/స్వయంగా సంపాదించిన మూలధనాన్ని మాత్రమే ఉపయోగిస్తాం. జట్టులో 50 మంది సభ్యులు ఉంటారని అందులో జోడించింది. అంతే కాదు, ఉద్యోగులు కంపెనీలో ఐదేళ్లు పూర్తి చేస్తే, వారికి మెర్సిడెస్ ఇస్తామని అశ్నీర్ గ్రోవర్ ఆఫర్ చేశారు. -
భారత్‌పే సీఈఓ పదవికి సుహైల్ సమీర్ రాజీనామా
ఫిన్ టెక్ దిగ్గజం భారత్‌పేలోని పరిణామాలు మరోసారి చర్చకు దారి తీశాయి. గత సంవత్సరం సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్‌ను తొలగించినప్పటి నుండి కంపెనీ కార్యకలాపాలను పట్టించుకోలేదనే కారణంగా సీఈవో సుహైల్ సమీర్‌ను తొలగించేందుకు ఆ సంస్థ యాజమాన్యం సిద్ధమైంది. సీఈవో పదవి నుంచి తప్పించి సమీర్‌కు చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ ఈ పదవిని కట్టబెట్టనుంది. జనవరి 7నుండి సీఎఫ్ఓ బాధ్యతలు చేపట్టనున్నట్లు భారత్‌పే ప్రకటించింది. ఇక ప్రస్తుత సీఎఫ్ఓ నలిన్ నేగీ తాత్కాలిక సీఈగా విధులు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా భారత్‌పే బోర్డు ఛైర్మన్ రజనీష్ కుమార్ మాట్లాడుతూ, సమీర్ తన అద్భుతమైన సహకారం అందించినందుకు,వివిధ సవాళ్లను అధిగమించడంలో కంపెనీకి సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్బీఐ కార్డ్‌లో సీఎఫ్ఓగా నేగి గతేడాది ఆగస్ట్‌లో భారత్‌పేలో చేరారు. గతంలో అయనకు సుమారు 10 సంవత్సరాల పాటు ఎస్బీఐ కార్డ్‌లలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. వరుస రాజీనామాలు భారత్‌పే సంస్థలో గత కొద్దికాలంగా జరుగుతున్న వరుస ఘటనలతో నెలల వ్యవధిలో అనేక మంది సీనియర్ స్థాయి ఉద్యోగులు రాజీనామాలు చేశారు. వారిలో ఇటీవల, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ విజయ్ అగర్వాల్, పోస్ట్‌పే హెడ్ నెహుల్ మల్హోత్రా, లెండింగ్- కన్స్యూమర్ ప్రొడక్ట్స్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ రజత్ జైన్ సహా ముగ్గురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు కంపెనీకి రాజీనామా చేశారు. -
వివాదాస్పద పారిశ్రామికవేత్తను కోహ్లీ ఎందుకు కలిశాడు..?
-
కోహ్లిని కలిసిన వివాదాస్పద పారిశ్రామికవేత్త
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని ప్రముఖ పారిశ్రామికవేత్త.. ఢిల్లీకి చెందిన అశ్నీర్ గ్రోవర్ బుధవారం రాత్రి కలుసుకున్నాడు. ఇద్దరు చాలాసేపు పిచ్చాపాటిగా మాట్లాడుకున్నారు. తమ మధ్య ఉన్న పాత అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ''ఢిల్లీకి చెందిన ఇద్దరు కుర్రాళ్లు మాట్లాడుకుంటున్నారంటే ఎవరికైనా ఆసక్తి ఉంటుంది.. నాగ్‌పూర్ టి20కి ఆల్ ది బెస్ట్ విరాట్ కోహ్లి'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. వీరిద్దరి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక అశ్నీర్ గ్రోవర్ పరిచయం అక్కర్లేని పేరు. భారత్‌పే ఫౌండర్‌గా, అతని భార్య మాధురి జైన్ కంట్రోల్స్ ఆఫ్ హెడ్ హోదాలో అవినీతికి పాల్పడారంటూ ఆరోపణలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే సంస్థ సొమ్ముతో వ్యక్తిగత అవసరాల కోసం వినియోగించుకున్నారు. భోగ భాగ్యాలు అనుభవించారు. కోటి రూపాయలు డైనింగ్ టేబుల్, మూడున్నర కోట్ల కారు ఉందంటూ గొప్పలకు పోయి తిప్పలు తెచ్చుకున్నారు. చివరికి చేసిన పాపం ఊరికే పోదన్నట్లు మహీంద్రా కోటక్ బ్యాంక్‌కి చెందిన మహిళా అధికారిని దుషించారు. సంబంధిత ఆడియో సంభాషణలు వెలుగులోకి రావడంతో అశ్నీర్ కథ అడ్డం తిరిగింది. చివరికి అవమానకర రీతిలో సంస్థ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఇక కోహ్లి.. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టి20 సిరీస్‌లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే జరిగిన తొలి టి20లో టీమిండియా పరాజయం పాలైంది. ఫేలవమైన ఫీల్డింగ్, బౌలింగ్‌తో మూల్యం చెల్లించుకుంది. శుక్రవారం నాగ్‌పూర్ వేదికగా జరగనున్న రెండో టి20 ఆడేందుకు ఇరుజట్ల ఆటగాళ్లు అక్కడికి చేరుకున్నారు. ఇక ఆసియా కప్‌లో అఫ్గానిస్తాన్‌పై సెంచరీతో మెరిసిన కోహ్లి ఫామ్‌లోకి వచ్చాడనేలోపే.. ఆసీస్‌తో జరిగిన తొలి టి20లో రెండు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. రెండో టి20లో ఎలాగైనా రాణించాలని కోహ్లి పట్టుదలతో ఉన్నాడు. What could the Delhi boys with a common passion for ‘Ben Stokes’ be discussing ? All the best @imVkohli for the match in Nagpur !! pic.twitter.com/6ZZ5OUrbdq — Ashneer Grover (@Ashneer_Grover) September 21, 2022 చదవండి: కోహ్లి, ధావన్‌ల తర్వాత స్మృతి మందానకే సాధ్యమైంది.. -
ఐరన్ లెగ్ మహిమ : జొమాటోకు కోట్లలో నష్టం..ఈయనే కారణమా!
దేశీయ స్టాక్ మార్కెట్లో ప్రముఖ ఫుడ్ ఆగ్రిగ్రేటర్ జొమాటో షేర్లు భారీగా కుదేలవుతున్నాయి. సోమవారం ఎన్ఎస్ఈలో జొమాటో 14శాతం షేర్లు పడిపోయి రూ.46 వద్ద జీవిత కాల కనిష్ఠాన్ని తాకాయి. చివరకు 11.28 శాతం నష్టంతో రూ.47.60 వద్ద ముగియగా..దీంతో నిన్నఒక్కరోజే జొమాటో రూ.1000కోట్లు (అంచనా) నష్టపోయింది.మంగళవారం సైతం ఆ సంస్థకు నష్టాల పరంపర కొనసాగుతుంది. ఇవ్వాళ మార్కెట్ కొనసాగే 2.50గంటల సమయానికి ఎన్ఎస్ఈలో జొమాటో షేర్లు భారీగా నష్టపోయి రూ.42.15 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఈ తరుణంలో భారత్ పే మాజీ ఫౌండర్ అశ్నీర్ గ్రోవర్ స్పందించారు. జొమాటో- స్విగ్గీలు మెర్జ్ అయితే జొమాటో షేర్ రాకెట్ వేగంతో రూ.450కి చేరుతుందని ట్విట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్‌కాగా.. జొమాటో షేర్లు నష్టపోవడానికి అశ్నీరే అంటూ మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. On the stock market - @letsblinkit served piping hot misery to @zomato in 10 minutes ! Yeh hi agar @Swiggy ko merge kar liya hota to ₹450 ka stock hota !! — Ashneer Grover (@Ashneer_Grover) July 26, 2022 ఐరన్ లెగ్ అశ్నీర్ జొమాటో షేర్ల పతనానికి అశ్నీర్ గ్రోవరే కారణమని నివేదికలు చెబుతున్నాయి. ఎందుకంటే? ఫినెట్‌క్ కంపెనీ భారత్ పే'ను స్థాపించిన అశ్నీర్ గ్రోవర్, ఆయన భార్య మాధురీ జైన్‌లపై సంస్థ నిధుల్ని కాజేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. విచారణ చేపట్టిన అల్వరెజ్ అండ్ మార్షల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సైతం... అశ్నీర్, మాధురీ జైన్ కంపెనీ డబ్బుతో బ్యూటీ ప్రొడక్టులు కొనుక్కోవడంతో పాటు జల్సాలు చేసిందన్న ఆరోపణలను నిజమని తేల్చింది. అశ్నీర్ రాజీనామా దీంతో భారత్‌పే మాధురీ జైన్‌ను విధుల నుంచి తొలగించింది. ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో అశ్నీర్ సైతం భారత్‌పేలో తన పదవికి రాజీనామా చేశారు. తనపై కుట్ర చేశారని, ఎలాంటి తప్పు చేయలేదంటూ వాదనకు దిగారు. చివరకు చేసేది లేక భారత్ పే నుంచి బయటకు వచ్చిన అశ్నీర్ తన కుటంబ సభ్యులకు చెందిన అమెరికన్ కంపెనీతో కలిసి మరో స్టార్టప్‌ను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు సమాచారం. అప్పుడు భారత్‌పే.. ఇప్పుడు జొమాటో ఇక భారత్ పేతో తలెత్తిన విభేదాల కారణంగా ఆర్ధిక సమస్యల నుంచి బయట పడేందుకు అశ్నీర్ తన కిరాణ డెలివరీ యాప్ సంస్థ బ్లింకిట్‌ను జొమాటోకు అమ్మేశారు. జొమాటో రూ. 4,447 కోట్ల డీల్‌తో షేర్ల మార్పిడి ద్వారా కంపెనీని సొంతం చేసుకుంది. దీంతో బ్లింకిట్ అశ్నీర్‌ది కావడం, ఇప్పటికే భారత్‌పే నిధుల్ని కాజేయడం వంటి ఇతర కారణాల వల్ల జొమాటో మదుపర్లు అప్రమత్తమయ్యారు. జొమాటో షేర్లను అమ్మేసిస్తున్నారు. దీంతో ఎన్ఎస్ఈలో జొమాటో షేర్లు భారీగా నష్టపోతున్నాయి. చదవండి: అప్పుడు బడాయి మాటలు..కక్కుర్తి పనులు, మరి ఇప్పుడు! -
అప్పుడు బడాయి మాటలు..కక్కుర్తి పనులు, మరి ఇప్పుడు!
ఫిన్‌టెక్ స్టార్టప్ భారత్‌పే మాజీ సీఈవో అశ్నీర్ గ్రోవర్ స్టార్టప్ వరల్డ్‌లో మరోసారి హాట్ టాపిగ్గా మారారు. బడాయి మాటలు..కక్కుర్తి పనులతో కొని తెచ్చుకున్న కష్టాల నుంచి తేరుకొని ఇప్పుడు మరో సంస్థను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. మిలియన్ డాలర్లు పెట్టుబడుల కోసం అన్వేషిస్తున్నారు. అశ్నీర్ గ్రోవర్ పరిచయం అక్కర్లేని పేరు. భారత్‌పే ఫౌండర్‌గా, అతని భార్య మాధురి జైన్ కంట్రోల్స్ ఆఫ్ హెడ్ హోదాలో అవినీతికి పాల్పడారంటూ ఆరోపణలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే సంస్థ సొమ్ముతో వ్యక్తిగత అవసరాల కోసం వినియోగించుకున్నారు. భోగ భాగ్యాలు అనుభవించారు. కోటి రూపాయలు డైనింగ్ టేబుల్, మూడున్నర కోట్ల కారు ఉందంటూ గొప్పలకు పోయి తిప్పలు తెచ్చుకున్నారు. చివరికి చేసిన పాపం ఊరికే పోదన్నట్లు మహీంద్రా కోటక్ బ్యాంక్‌కి చెందిన మహిళా అధికారిని దుషించారు. సంబంధిత ఆడియో సంభాషణలు వెలుగులోకి రావడంతో అశ్నీర్ కథ అడ్డం తిరిగింది. చివరికి సంస్థ నుంచి బలవంతంగా బయటకు నెట్టేయించుకునే పరిస్థితికి దిగజారారు. Today I turn 40. Some will say I’ve lived a full life and experienced more things than most. Created value for generations. For me it’s still unfinished business. Time to disrupt another sector. It’s time for the Third Unicorn !! pic.twitter.com/wb7ZQe41FY — Ashneer Grover (@Ashneer_Grover) June 14, 2022 అయినా సరే ఇప్పుడు మరో స్టార్టప్‌ను ప్రారంభించే ప్రయత్నాల్లో ఉన్నారు. అశ్నీర్ తన 40వ బర్త్ డే సందర్భంగా స్టార్టప్‌ను యూనికార్న్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఇందుకోసం అమెరికాలో తన కుటుంబానికి చెందిన ఓ సంస్థతో పాటు ప్రైవేట్ ఈక్విటీ సంస్థలతో సంప్రదించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అశ్నీర్ మాత్రం భారత్‌పేలో అమ్మిన తన వాటాతో బిజినెస్‌ను ప్రారంభించనున్నట్లు మరికొన్ని నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. మరోవైపు అశ్నీర్ ఫిన్‌టెక్ సంస్థను నెలకొల్పుతారా? లేదంటే ఇతర రంగానికి చెందిన స్టార్టప్‌ను ప్రారంభిస్తారా? అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. చదవండి👉చేసింది ఇక చాలు!! మా'స్టారు' మీ టైమ్ అయిపోయింది! -
భారత్‌పేతో జాగ్రత్త! అలాంటి పనులు చేస్తే జైలుకే?
న్యూఢిల్లీ: అవకతవకలు, దుష్ప్రవర్తన ఆరోపణలపై పలువురు ఉద్యోగులు, వెండార్లను తొలగించినట్లు, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు పేమెంట్స్ సేవల స్టార్టప్ సంస్థ భారత్‌పే వెల్లడించింది. అలాగే మాజీ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ పేరు ప్రస్తావించకుండా, ఆయనకు కేటాయించిన షేర్లను కూడా వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపింది. గ్రోవర్ ఎండీగా వ్యవహరించినప్పుడు చోటు చేసుకున్న అవకతవకలు, కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలపై కంపెనీ బోర్డు సవివరంగా చర్చించిన మీదట ఈ చర్యలు తీసుకున్నట్లు భారత్‌పే పేర్కొంది. కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలు పునరావృతం కాకుండా సీనియర్ మేనేజ్మెంట్, ఉద్యోగులకు కొత్త ప్రవర్తనా నియమావళిని, వెండార్లకు సంబంధించి సమగ్రమైన కొనుగోళ్ల విధానాన్ని అమలు చేస్తున్నట్లు వివరించింది. ‘తప్పుడు లేదా అడ్డగోలు రేట్లతో ఇన్వాయిస్లు ఇచ్చిన చాలా మంది వెండార్లు ఇకపై కంపెనీతో వ్యాపార లావాదేవీలు జరపకుండా బ్లాక్ చేశాం. జీఎస్టీ విచారణలో కూడా వీరి పేర్లు ఉన్నాయి. ఇప్పటికే చెల్లించిన మొత్తాలను రికవర్ చేసుకునేందుకు వారికి లీగల్ నోటీసులు కూడా జారీ చేశాం. రాబోయే రోజుల్లో వారిపై సివిల్ / క్రిమినల్ కేసులు కూడా వేయబోతున్నాం‘ అని భారత్‌పే తెలిపింది. కొత్త సీఎఫ్‌వోను ఎంపిక చేసే ప్రక్రియలో ఉన్నామని, తరచుగా అంతర్గత ఆడిట్ కూడా నిర్వహిస్తామని పేర్కొంది. చదవండి: తప్పు చేస్తే సహించేదేలే..! అష్నీర్‌కు భారత్‌పే ఇన్వెస్టర్ల వార్నింగ్! -
‘నా సత్తా ఏంటో అప్పుడు చూపిస్తా’
అవమానకర రీతిలో భారత్‌పే నుంచి బయటకు పంపబడ్డ ఆశ్నీర్ గ్రోవర్ తన సత్తా ఏంటో చూపిస్తానంటూ సవాల్ విసిరారు. చండీగడ్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన గ్రోవర్.. త్వరలోనే తన సొంత డబ్బులతో ఓ స్టార్టప్ పెడతానని, ఏ ఇన్వెస్టరు దగ్గర నుంచి నిధులు సమీకరించకుండానే ఆ స్టార్టప్‌ను లాభాల్లోకి తెచ్చి చూపెడతానంటూ ప్రకటించారు. యూనికార్న్ హోదా పొందిన స్టార్టప్‌లలో ఒకటైన భారత్‌పే శాత్వత్‌తో కలిసి ఆశ్నీర్‌గ్రోవర్ ప్రారంభించారు. ఆ తర్వాత ఇన్వెస్టర్లు ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టడంతో క్రమంగా యూనికార్న్‌గా ఎదిగింది. అయితే కంపెనీ నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై కో ఫౌండర్ అశ్నీర్ గ్రోవర్, అతని భార్య మాధురి జైన్లను భారత్ పే నుంచి బయటకు సాగనంపారు. గడిచిన ఆరు నెలలుగా భారత్‌పే విషయంలో ఇటు అశ్నీర్ గ్రోవర్, అటు బోర్డు మెంబర్లతో నిత్యం మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. ఇన్వెస్టర్లుగా స్టార్లప్‌లోకి ప్రవేశించిన వారు చివరకు తననే బయటకు పంపారంటూ అనేక సందర్భాల్లో అశ్నీర్ వెల్లడించారు. ఈ క్రమంలో అసలు ఇన్వెస్టర్లు లేకుండా పూర్తగా సొంత సొమ్ముతో స్టార్టప్ ప్రారంభించి సక్సెస్ బాట పట్టిస్తానంటూ శపథం చేశారు. చదవండి: ఏం చిల్లరగాళ్లు ఉన్నర్రా మీరు ! బాధ్యత లేదా ? -
తప్పు చేస్తే సహించేదేలే..! అష్నీర్‌కు భారత్‌పే ఇన్వెస్టర్ల వార్నింగ్!
న్యూఢిల్లీ: ఇటీవల ఫిన్‌టెక్ సంస్థ భారత్‌పేలో జరుగుతున్న వివాదాలపై తాజాగా సీక్వోయా క్యాపిటల్ తీవ్రంగా స్పందించింది. అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేదిలేదని స్పష్టం చేసింది. ఉద్ధేశపూర్వకంగా అవకతవకలకు తెరతీస్తే తగిన విధంగా స్పందించనున్నట్లు తెలియజేసింది. వాటాదారులు, ఉద్యోగులకు నష్టం కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలియజేసింది. వాటాదారులు, ఉద్యోగుల హక్కుల పరిరక్షణలో వెనకడుగు వేయబోమని, అవసరమైతే ఆర్థికంగా సైతం ఎదుర్కోనున్నట్లు వివరించింది. భారత్‌పేలో సీక్వోయా క్యాపిటల్‌కు 19.6 శాతం వాటా ఉంది. కంపెనీ సక్రమంగా వ్యవహరించే విషయంలో కఠినంగా వ్యవహరించనున్నట్లు తెలియజేసింది. అక్రమాలకు పాల్పడిన అభియోగాలపై ఇటీవల కంపెనీ మాజీ చీఫ్ అష్నీర్ గ్రోవర్‌పై భారత్‌పే బోర్డు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. కంపెనీకి చెందిన అన్ని టైటిల్స్, పొజిషన్ల నుంచి గ్రోవర్‌ను తప్పించింది. చదవండి: ఆ విషయాన్ని బోర్డు చూసుకుంటుంది,'అష్నీర్' నిధుల దుర్వినియోగంపై సమీర్! -
ఆ విషయాన్ని బోర్డు చూసుకుంటుంది,'అష్నీర్' నిధుల దుర్వినియోగంపై సమీర్!
న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ కంపెనీ భారత్‌పే మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2021–22)లో పటిష్ట పనితీరు చూపినట్లు కంపెనీ సీఈవో సుహయిల్ సమీర్ తాజాగా పేర్కొన్నారు. లాభనష్టాలులేని(బ్రేక్ఈవెన్) స్థితికి చేరే బాటలో వృద్ధి పథాన సాగుతున్నట్లు తెలియజేశారు. 18–24 నెలల్లో పబ్లిక్ ఇష్యూని సైతం చేపట్టే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. కంపెనీ మాజీ చీఫ్ అష్నీర్ గ్రోవర్ నిధుల దుర్వినియోగ ఆరోపణ అంశాన్ని బోర్డు చూసుకుంటుందని పేర్కొన్నారు. ఉద్యోగులకే తమ తొలి ప్రాధాన్యత అని, టీముల స్థిరత్వంపై దృష్టి పెట్టనున్నట్లు తెలియజేశారు. ఇక బిజినెస్ వృద్ధి ద్వితీయ ప్రాధాన్యతగా పేర్కొంటూ ఇందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇది కంపెనీ ఫలితాలలో ప్రతిఫలిస్తున్నట్లు తెలియజేశారు. చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లో కంపెనీ ప్రతీ అంశంలోనూ 20 శాతం పురోగతి సాధించినట్లు వెల్లడించారు. కోవిడ్–19 జనవరిలో దెబ్బతీసినప్పటికీ లావాదేవీలు, టీపీవీ, రుణాల ఏర్పాటు, ఆదాయం తదితర పలు అంశాలలో ప్రస్తావించదగ్గ వృద్ధి సాధించినట్లు వివరించారు. టీపీవీ జోరు క్యూఆర్ కోడ్ల ద్వారా షాపు యజమానులు డిజిటల్ చెల్లింపులను చేపట్టేందుకు వీలు కల్పించే భారత్‌పే 225 పట్టణాలకు విస్తరించినట్లు సుహయిల్ తెలియజేశారు. 80 లక్షలకుపైగా మర్చంట్స్ నమోదైనట్లు, లావాదేవీ విలువ(టీపీవీ) 2.5 రెట్లు ఎగసి 16 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 1.2 లక్షల కోట్లు)ను తాకినట్లు వెల్లడించారు. 65 కోట్ల డాలర్ల(రూ. 4,875 కోట్లు) విలువైన రుణాలకు సౌకర్యాలు కల్పించినట్లు పేర్కొన్నారు. బయ్ నౌ పే లేటర్ విభాగంలో ఐదు నెలల క్రితం ఆవిష్కరించిన పోస్ట్‌పే నెలకు 10 లక్షల లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. 5 కోట్ల డాలర్ల(రూ. 375 కోట్లు) విలువైన టీపీవీ సాధించినట్లు వెల్లడించారు. -
భారత్‌పే బోర్డు సభ్యులపై ఆశ్నీర్ గ్రోవర్ ఊరమాస్ పంచ్‌లు!
భారత్‌పే బోర్డులో మొదలైన ముసలం ఇంకా చల్లారడం లేదు. అవినీతి ఆరోపణలపై బోర్డు నుంచి బయటకు నెట్టబడిన ఆ కంపెనీ మాజీ ఫౌండర్ ఆశ్నీర్ గ్రోవర్ ప్రస్తుతం బోర్డులో ఉన్న సభ్యులపై వరుసగా పంచ్‌లు విసురుతున్నారు. ఈ క్రమంలో మరోసారి ఊరమాస్ పంచ్ డైలాగులతో విరుచుకుపడ్డారు. ఈ ఏడాదికి సంబంధించిన తొలి త్రైమాసిక ఫలితాలను ఇటీవల భారత్‌పే ప్రకటించింది. ఈ ఫలితాల్లో క్షీణత కనిపించింది. దీన్ని అవకాశంగా మలుచుకున్న ఆశ్నీర్ గ్రోవర్ ట్విట్టర్లో రెచ్చిపోయారు. భారత్‌పే ఫస్ట్ క్వార్టర్ ఫలితాలను ప్రకటించింది. రజనీష్‌కుమార్, సుహైల్ సమీర్ వంటి అసమర్థుల నాయకత్వంలో భారత్‌పే ఫలితాలో క్షీణత కనిపిస్తోంది. కంపెనీ నిధులు ఆవిరైపోతున్నాయి. తాళాలు దొంగలించడం. కార్నర్లో బడ్డీ కొట్టు నిర్వహించడం రెండు ఒకటి కాదు. మీ నాన్నమ్మ గుర్తుకు వస్తుందా? మార్కెట్ మీకు అసలైన పరీక్ష పెడుతుంది. నిజాన్ని పట్టి చూపుతుంది అంటూ పంచ్ విసిరారు. భారత్‌పే స్టార్టప్‌ను 2018లో ఆశ్నీర్ గ్రోవర్, శాశ్వత్ నక్రానీలు స్థాపించారు. ఆ తర్వాత 2020లో భారీగా ఇన్వెస్ట్ చేసిన సుహైల్ సమీర్ భారత్‌పే గ్రూపు చైర్మన్ అయ్యారు. ఆ తర్వాత క్రమంగా భారత్‌పే బోర్డులో లుకలుకలు మొదలయ్యాయి. చివరకు 2022 జనవరిలో భారత్‌పే నుంచి అశ్నీర్‌గ్రోవర్‌ను బలవంతంగా బయటకు పంపారు. దీంతో అవకాశం చిక్కినప్పుడల్లా అశ్నీర్ గ్రోవర్ పంచ్‌లు వేస్తున్నారు. తాజాగా భారత్‌పే సీఈవో సుహైల్ సమీర్, చైర్పర్సన్ హోదాలో ఉన్న రజనీష్ కుమార్ లక్ష్యంగా మాటల తూటాలు పేల్చారు. So I just heard @bharatpeindia closed it’s first quarter of ‘degrowth’ and ‘maximum cash burn’ under able (sic) leadership of Rajnish Kumar and Suhail Sameer. ‘Chaabi chheenna and hatti chalana do alag alag skills hai !’ Ab Nani yaad aayegi - markets are the ultimate test & truth — Ashneer Grover (@Ashneer_Grover) April 7, 2022 చదవండి: ఏం చిల్లరగాళ్లు ఉన్నర్రా మీరు ! బాధ్యత లేదా ? -
Bharat Pe: ఇదెక్కడి లొల్లిరా నాయనా ? ఇంతలా దిగజారి పోయారు !
ఫిన్‌టెక్ స్టార్టప్ కంపెనీగా మొదలై యూనికార్న్‌గా ఎదిగి ఎంతోమంది ఔత్సాహిక ఎంట్రప్యూనర్లకు స్ఫూర్తిని ఇచ్చింది భారత్‌పే. కానీ ఇప్పుడు బోర్డు సభ్యలు మధ్య చెలరేగిన గొడవలతో ఆ కంపెనీ ప్రతిష్ట మసకబారుతోంది. దిగజారుడు విమర్శలతో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. కంపెనీని సొమ్ముతు ఇష్టారీతగా ఖర్చు చేయడంతో పాటు అసంబద్ధమైన నిర్ణయాలు తీసుకున్నాడనే ఆరోపణలతో భారత్‌పే ఫౌండర్లలో ఒక్కడైన అశ్నీర్ గ్రోవర్‌ను ఇటీవల కంపెనీ నుంచి బయటకు పంపారు. అప్పటి నుంచి అశ్నీర్‌గ్రోవర్‌పై ఏదో ఆరోపణ వస్తూనే ఉంది. దానికి అతను కౌంటర్ ఇస్తూనే ఉన్నాడు. నిన్నటికి నిన్న కంపెనీ డబ్బులను ఇష్టారీతిగా ఖర్చు పెడుతూ పది కోట్ల రూపాయల విలువైన డైనింగ్ టేబుల్ కొనుగోలు చేశాడనే ప్రచారం జరిగింది. ఇప్పుడు దానికి మంచి మరో చిల్లర ఆరోపణలు అతనిపై వచ్చాయి. క్రికెట్ టోర్నీని వదల్లేదు 2021 అక్టోబరు, నవంబరులో టీ 20 వరల్డ్ కప్ టోర్నమెంట్ జరిగింది. ఈ టోర్నీకి భారత్‌పే గ్లోబల్ పార్టనర్‌గా వ్యవహరించింది. ఈ క్రమంలో టోర్నీ నిర్వాహకులు తమ పార్టనర్లకు ప్రతీ మ్యాచ్‌కి 700ల వరకు ఉచిత్ పాస్‌లు అందించారు. అయితే గ్లోబప్ పార్టనర్‌గా భారత్‌పేకు దక్కిన పాసులను అశ్నీర్‌గ్రోవర్ అమ్ముకుని కోట్లు సంపాదించాడనే మరో ఆరోపణ తెరపైకి వచ్చింది. ఫ్రీ పాసుల అమ్మకం? ప్రతీ పాసుని కనీసం 750 దిర్హాం (ఇండియన్ కరెన్సీలో రూ.15,000)లకు అమ్ముకున్నాడని, వీఐపీ పాస్‌ల ధర అయితే చెప్పలేమని కొందరు మాజీ ఉద్యోగులు చెప్పినట్టుగా జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితం అయ్యాయి. పేరుకే భారత్ పే ఉద్యోగులకు కొన్ని జనరల్ స్టాండ్లకు సంబంధించిన పాస్‌లు అందాయని మిగిలనవి అశ్నీర్ అమ్ముకున్నాడనే తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. What BharatPe Board thinks I am doing at ICC World Cup “10 ka 2, 10 ka 2, 10 ka 2 - aye sahab mangta hai kya ticket black mein ?!” What I am actually doing is ensuring Suhail Sameer and @sumeetsingh29 don’t drink silly the hospitality section dry. Kuchh nahi mila to kuchh bhi !!! pic.twitter.com/jI7vmWDECx — Ashneer Grover (@Ashneer_Grover) March 16, 2022 కపట నాటకాలు ఆపండి క్రికెట్ టోర్నమెంట్ పాసులు అమ్ముకున్నట్టు తనపై వస్తున ఆరోపణలపై అశ్నీర్ గ్రోవర్ స్పందించారు. భారత్‌పే చేస్తున్న ప్రచారాన్ని బట్టి నేను స్టేడియం దగ్గరర పది ఇవరై పది ఇవరై అంటూ పాసులు అమ్ముకున్నానా? ఎందుకీ చిల్లర ఆరోపణలు ? కపటత్వాన్ని ఇకనైనా ఆపండి అంటూ భారత్‌పే బోర్డుకు సూచించాడు. ఈ మేరకు మ్యాచ్ జరుగుతున్నప్పుడు వీఐపీ స్టాండ్‌లో తాను ఉన్నప్పటి ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేశాడు అశ్నీర్ గ్రోవర్. Just tell us whether or not we keep invested on BharatPe? Many small investors invested because of you. — Raj (@Raj_Chen) March 17, 2022 మీకు బాధ్యత లేదా బోర్డులో తలెత్తిన లుకలుకలతో గత మూడు నెలలుగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. దీనిపై భారత్‌పేలో ఇన్వెస్ట్ చేసిన ముదుపరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిమ్మల్ని నమ్మి మీ కంపెనీలో మా డబ్బులు ఇన్వెస్ట్ చేశాం. అది మరిచి మీరు వ్యక్తిగత దూషణలతో కంపెనీ ప్రతిష్ట దిగజార్చుతున్నారు. బాధ్యతగా వ్యవహరించండి అంటూ సూచిస్తున్నారు. చదవండి: భారత్‌పే వ్యవహారాలపై జీఎస్టీ దర్యాప్తు -
ఇది ఏమైనా స్పేస్ రాకెట్టా, టైం మిషనా..!జస్ట్ 10 కోట్ల డైనింగ్ టేబుల్..!
కంపెనీలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలను ఎదుర్కొవడంతో ఆశ్నీర్ గ్రోవర్‌ను అన్ని పొజిషన్ల నుంచి భారత్‌పే తొలిగించినా విషయం తెలిసిందే. కాగా భారత్ పే సహవ్యవస్థాపకుడు, షార్క్ టాంక్ ఇండియా హోస్ట్ ఆశ్నీర్ గ్రోవర్ వ్యవహారం ఇప్పట్లో సర్దుమనిగేలా లేదు.ఆశ్నీర్‌పై అనేక ఆరోపణలు మెల్లమెల్లగా బయటకు వస్తున్నాయి.తాజాగా ఒక డైనింగ్ టేబుల్ కొనేందుకు ఏకంగా రూ. 10 కోట్ల రూపాయలను గ్రోవర్ ఖర్చు చేశాడనే వార్తలు తెరపైకి వచ్చాయి. కాగా ఈ వ్యవహారంపై ఆశ్నీర్ గ్రోవర్ తనదైన శైలిలో ట్విటర్లో స్పందించాడు. మోసపోవద్దు..! డైనింగ్ టేబుల్‌పై రూ. 10 కోట్లను ఖర్చు చేశాడనే వ్యాఖ్యలను ఆశ్నీర్ గ్రోవర్ తిప్పి కొట్టారు. ఆశ్నీర్ తన ట్విట్లో..ఇది స్పేస్ రాకెట్టా..లేక టైం మెషినా..? జస్ట్ రూ. 10 కోట్ల విలువైన డైనింగ్ టేబుల్! అత్యంత ఖరీదైన డైనింగ్ టేబుల్‌ను కల్గిన గిన్నిస్ వరల్డ్ రికార్డు నాపై లేదు.నాకు అలాంటి ఉద్దేశం కూడా లేదు..భారత్‌పే బోర్డు సభ్యులు తనపై చేస్తోన్న ఆరోపణలపై మోసం పోవద్దు.ఒక వేళ మీరు ఆ వార్తలను నమ్మితే కంపెనీలాగా మీరు కూడా విశ్వసనీయతను కోల్పోతారంటూ మీడియాకు ఆశ్నీర్ గ్రోవర్ విన్నవించారు. అంతేకాకుండా తన వాటాలో అది కూడా 0.5 శాతం విలువ కూడా చేయదంటూ తెలిపాడు. ఆ టేబుల్‌కు వెచ్చించే పది కోట్ల రూపాయలతో 1000 మందికి ఉపాధి కలిగేలా చేస్తానని పేర్కొన్నారు. It’s not even worth 0.5% of that. I’d rather put ₹10cr in business and create employment for 1,000 of folks so that they can earn & put dignified meal on their tables for their families. Score; Self Goal (Loss of Credibility) by BharatPe Board / Investors - 1 : Lavishness - 0. — Ashneer Grover (@Ashneer_Grover) March 13, 2022 ఇదిలా ఉండగా కొద్ది రోజలు క్రితం ఆశ్నీర్ గ్రోవర్ కంపెనీ డబ్బులతో లగ్జరీకారును, 10 కోట్ల విలువైన డైనింగ్ టేబుల్‌ను కొన్నాడంటూ బ్లూమ్‌బర్గ్‌తో సహా పలు మీడియా సంస్థలు రాసుకొచ్చాయి. చదవండి: ఒక కప్పు కాఫీ ఎక్కువ తాగితే ఫైన్ కట్టాల్సిందే.. కొంపముంచిన కక్కుర్తి -
మూడు కోట్ల కార్లు.. కోటి రూపాయల డైనింగ్ టేబుల్.. చివరికి
ఇటీవల వార్తల్లో ఎక్కువగా నిలిచిన యూనికార్న్ స్టార్టప్‌గా భారత్‌పే నిలిచింది. నాలుగు బిలియన్ డాలర్ల కంపెనీగా ఎదిగిన ఈ స్టార్టప్ ఫౌండర్లలో ఒకరైన ఆశ్నీర్ గ్రోవర్ని అవమానకర రీతిలో కంపెనీ నుంచి తప్పించారు. ఒక ఫౌండర్‌గా ఆయన చేయకూడని తప్పులు చేసినందునే ఇలా జరిగిందంటూ అక్కడి ఎంప్లాయిస్ చెబుతున్నారు. ఉద్యోగులంటే చులకన అశ్నీర్ గ్రోవర్, అతని భార్య మాధురి జైన్ గ్రోవర్లు వ్యవహరించిన తీరు వల్లే ఈ పరిస్థితి ఎదుర్కొన్నట్టు ఉద్యోగులు చెప్పినట్టు బ్లూంబర్గ్ కథనం ప్రచురించింది. ముఖ్యంగా ఎండీ హోదాలో ఉన్న అశ్నీర్ గ్రోవర్ ఎప్పుడూ ఉద్యోగస్తులతో చులకనగా ప్రవర్తించేవాడని చెబుతున్నారు. కరోనా టైంలో అన్ని చోట్ల వర్క్‌ఫ్రం హోం అమల్లో ఉంటే భారత్‌పే దాన్ని నిరాకరించింది. ఆఖరికి ఆఫీసులో మాస్కు పెట్టుకోమని అడిగినందుకు ఓ మహిళా ఉద్యోగిని పనిలో నుంచి తీసేశారని అక్కడి ఉద్యోగులు చెబుతున్నారు. ఛీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ పోస్టు కోసం ఎంత మందిని ఇంటర్వ్యూ చేసినా ఏ ఒక్కరిని సెలక్ట్ చేయకుండా కాలయాపన చేశాడట గ్రోవర్. రూ. కోటి డైనింగ్ టేబుల్ ఉద్యోగుల పట్ల అగౌరవంగా ఉంటూనే మరోవైపు ఎప్పుడు తన గొప్పలే ఆశ్నీర్ గ్రోవర్ సాటి ఉద్యోగులకు చెబుతుండేవాడట. ఇప్పుడే కోటి రూపాయలు పెట్టి డైనింగ్ టేబుల్ కొన్నాను.. నా కారు విలువ మూడున్నర కోట్లు... మా ఇంట్లో కార్పోట్ చాలా ప్రత్యేకమైనది ఇలా నిత్యం గొప్పలు చెబుతుంటే వాడట. ఈ వ్యవహారం శృతి మించి మహీంద్రా కోటక్ బ్యాంక్‌కి చెందిన మహిళా అధికారిని దుషించే స్థితికి చేరుకున్నాడు గ్రోవర్. దీంతో అతని వ్యవహారశైలిపై భారత్‌పే మేనేజ్మెంట్ దృష్టి సారించింది. కక్కుర్తి ఇక హెడ్ ఆఫ్ కంట్రోల్స్ పోస్టులో ఉన్న మాధురి జైన్ ఉద్యోగులను మరో రకంగా వేధించేవారట. ఆఫీస్‌లో అందించే టీ, కాఫీలను ఎవరైనా ఎక్కువగా తాగితే ఫైన్లు విధించేవారట, ఆఫీసులో ఉన్న ప్రింటర్‌ను వ్యక్తిగత పనులకు ఎవరైనా వాడితే జీతంలో కోతలు పెట్టేవారట. అదే సమయంలో కంపెనికి చెందిన కోట్లాది రూపాయల డబ్బును బ్యూటీ ప్రొడక్ట్స్, షాపింగ్‌కి ఆమె ఖర్చుపెట్టేవారట. ఇలా ఒక్కో విషయం కలిసి చివరికి మాధురిని కంపెనీ నుంచి తొలగించే వరకు పరిస్థితి వచ్చింది. వాళ్లకేం తెలుసు కోటక్ మహీంద్రా అధికారితో గొడవ తర్వాత మూడు నెలల లాంగ్ లీవ్‌పై వెళ్లిన అశ్నీర్ గ్రోవర్ చివరకు 2022 మార్చి ఒకటిన భారత్‌పేలో తనకు ఉన్న అన్ని స్థానాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. తనపై వస్తున్న ఆరోపణలపై ఆశ్నీర్ స్పందిస్తూ.. ‘లగ్జరీగా జీవితం గడపాలని నేను కలలు కన్నాను. అందు కోసమే కష్టించి పని చేశాను. ఈ రోజు ఖరీదైన నా పరుపు గురించి కామెంట్ చేసే వాళ్లకి ఒకప్పుడు భారత్‌పేకు పెట్టుబడులు తెచ్చేందుకు నేను ఫుట్‌పాత్‌ల వెంట తిరిగిన రోజులు తెలియవు. అందుకే వారేమైనా అంటారు’ అంటూ నిప్పులు చెరిగాడు. స్టార్టప్ ఫౌండర్లను ఇన్వెస్టర్లు బానిసల్లా చూస్తున్నారంటూ ఆశ్నీర్ గ్రోవర్, అతని భార్య మాధురి జైన్లు మండిపడుతున్నారు. భారత్‌పే ఢిల్లీ వేదికగా అశ్నీర్ గ్రోవర్, శాశ్వత్ నక్రానీలు ఫిన్‌టెక్ స్టార్టప్‌గా భారత్‌పేను 2018లో స్థాపించారు. అనతి కాలంలోనే భారీ పెట్టుబడులు సాధించి యూనికార్న్ కంపెనీగా మారింది. ఆశ్నీర్‌గ్రోవర్ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలు ఉండగా అతని భార్య మాధురి జైన్ కంట్రోల్స్ ఆఫ్ హెడ్ హోదాలో భారత్‌పేలో కొనసాగింది. ఇటీవల కాలంలో భార్యభర్తలిద్దరు కంపెనీ నుంచి విస్మయం కలిగే విధంగా బయటకు పంపబడ్డారు. చదవండి: తప్పు చేస్తే సహించేదేలే ! భారత్‌పే సంచలన నిర్ణయం -
తప్పు చేశాడు.. ఫలితం అనుభవిస్తున్నాడు..
న్యూఢిల్లీ: అక్రమాలకు పాల్పడిన కంపెనీ సహవ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్‌ను పదవి నుంచి తొలగించే విషయంలో బోర్డు వేగంగా, నిర్ణయాత్మకంగా వ్యవహరించినట్లు భారత్‌పే సహవ్యవస్థాపకుడు శాశ్వత్ నక్రానీ పేర్కొన్నారు. పీడబ్ల్యూసీ నివేదికను అందుకున్నాక బోర్డు తగిన విధంగా స్పందించినట్లు ఉద్యోగులకు రాసిన లేఖలో తెలియజేశారు. కంపెనీలో కార్యకలాపాలలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో గత వారం గ్రోవర్‌ను అన్ని పొజిషన్ల నుంచీ తప్పించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా చట్టపరమైన చర్యలకు సైతం ఉపక్రమించనున్నట్లు భారత్‌పే బోర్డు వెల్లడించింది. అష్నీర్ గ్రోవర్ కంపెనీ ఉద్యోగిగా ఇకపై భారత్‌పేతో ఎలాంటి సంబంధాలూ కలిగి ఉండరని శాశ్వత్ లేఖలో పేర్కొన్నారు. కంపెనీ సహవ్యవస్థాపకుడు లేదా డైరెక్టర్‌గా ఉండబోరని తెలియజేశారు. ఈ నెల 1 అర్ధరాత్రి గ్రోవర్ బోర్డుకి రాజీనామా చేసినట్లు ప్రస్తావించారు. గ్రోవర్ కుటుంబం, ఇతర బంధువులు కంపెనీ నిధులను దుర్వినియోగం చేయడంతోపాటు పలు అక్రమాలకు పాల్పడినట్లు లేఖలో వివరించారు. కంపెనీపట్ల తప్పుడు వివరణ ఇచ్చేందుకు గ్రోవర్ ప్రయత్రించినట్లు తెలియజేశారు. చదవండి: Bharatpe: చేసింది ఇక చాలు!! మా'స్టారు' మీ టైమ్ అయిపోయింది -
లీకైన ఆడియో టేపులు, వాటాల కోసం కొట్టుకుంటున్నారు?!
ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ భారత్ పే' ను వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే అక్రమాలకు పాల్పడిన ఆరోపణలతో కంపెనీలో సహ వ్యవస్థాపకుడిగా ఉన్న అష్నీర్ గ్రోవర్‌కు భారత్‌పే అన్నీ పదవుల నుంచి తొలగించింది. అంతర్గత విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో భారత్ పే ఒర్జినల్ ఫౌండర్ భావిక్ కొలాడియాకు, సంస్థ మేనేజ్మెంట్కు మధ్య కొత్త వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. దీనంతటికి కారణం ఎవరి వాటా ఎంతో క్లారిటీ లేకనే సంస్థలో గొడవలు జరుగుతున్నాయనే వాదనలు తెరపైకి వచ్చాయి. వాస్తవానికి భావిక్ కొలాడియా భారత్ పే ప్రారంభంలో కన్సల్టెంట్‌గా ఉన్నారు. అదే సమయంలో అమెరికాలో ఓ క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ కేసులో కొలాడియా దోషిగా తేలడంతో భారత్‌పే అతన్ని పక్కన పెట్టింది. కంపెనీ బాధ్యతల్ని, వాటాల్ని అష్నీర్ గ్రోవర్ - శశ్వాత్ నక్రాణిలే పంచుకున్నారు. కొలాడియాను వదిలేశారు. దీంతో కొలాడియాకు, అశ్‌నీర్‌కు మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో కంపెనీ వాటాల విషయంలో అష్నీర్ ఆడియో టేపులు వెలుగులోకి రావడంతో కొలాడియా అప్రమత్తమయ్యారు. భారత్‌పే లో తన వాటా ఎంత? మార్చి 1 నుంచి ఉద్వాసనకు గురైన అష్నీర్ వాటా ఎంతో తేల్చుకునేందుకు లాయర్లను సంప్రదించారు. ఇప్పుడీ అంశం ఫిన్ టెక్ వర్గాల్లో హాట్ టాపిగ్గా మారింది. కాగా, అష్నీర్ గ్రోవర్ , శశ్వాత్ నక్రాణి, భావిక్ కొలాడియాలు కంపెనీలు వాటాల కోసం రోడ్డెక్కి చివరికి సంస్థను ఏం చేస్తారోననే మార్కెట్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: చేసింది ఇక చాలు!! మా'స్టారు' మీ టైమ్ అయిపోయింది! -
తప్పు చేస్తే సహించేదేలే ! భారత్‌పే సంచలన నిర్ణయం
న్యూఢిల్లీ: అక్రమాలకు పాల్పడిన ఆరోపణలతో కంపెనీలో సహవ్యవస్థాపకుడిగా ఉన్న అష్నీర్ గ్రోవర్‌కు భారత్‌పే తాజాగా షాకిచ్చింది. అన్ని పొజిషన్ల నుంచీ గ్రోవర్ పేరును తొలగించినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. అంతేకాకుండా చట్టపరమైన చర్యలు సైతం తీసుకునే వీలున్నట్లు తెలుస్తోంది. కంపెనీలో గ్రోవర్‌కున్న వాటాలపైనే ఆంక్షలు విధించనుంది. రానున్న బోర్డు సమావేశంలో చేపట్టనున్న అంశాల వివరాలు అందుకున్న గ్రోవర్ రాజీనామా చేసినట్లు భారత్‌పే వెల్లడించింది. కంపెనీలో గ్రోవర్ కార్యకలాపాలపై స్వతంత్ర ఆడిట్ నివేదికను బోర్డు సమావేశంలో ప్రవేశపెట్టనున్న అంశాన్ని సైతం గ్రోవర్‌కు తెలియజేసినట్లు పేర్కొంది. ముందురోజు సాయంత్రం నిర్వహించిన సమావేశం అర్ధరాత్రి వరకూ కొనసాగినట్లు వెల్లడించింది. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునే హక్కులను కంపెనీ రిజర్వ్ చేసుకున్నట్లు తెలియజేసింది. క్యూఆర్ కోడ్స్ ద్వారా వివిధ షాప్ యజమానులు డిజిటల్ చెల్లింపులను చేపట్టేందుకు భారత్‌పే వీలు కల్పించే సంగతి తెలిసిందే. ఆహ్వానం ఇలా బుధవారం(2న) రాత్రి 7.30కు చేపట్టనున్న బోర్డు మీటింగుకు హాజరుకావల్సిందిగా గ్రోవర్‌కు మంగళవారం ఈమెయిల్ అందడంతో 12.05కు రాజీనామా చేసినట్లు భారత్‌పే పేర్కొంది. గ్రోవర్ కుటుంబం, అతని కుటుంబ సభ్యులు కంపెనీ నిధులను దుర్వినియోగం చేయడంతోపాటు.. నకిలీ వెండార్స్ సృష్టి ద్వారా కంపెనీ ఖాతాల నుంచి సొమ్మును దారిమళ్లించినట్లు ఆరోపించింది. తద్వారా ధనాన్ని ఆర్జించడమేకాకుండా, విలాసవంత జీవనవిధానాలకు సొమ్మును వినియోగించినట్లు ఆరోపణల్లో తెలియజేసింది. కంపెనీ ఎండీ, బోర్డు డైరెక్టర్ పదవులకు రాజీనామా చేయడంతో గ్రోవర్ ఉద్యోగ బాధ్యతలను రద్దు చేసేందుకు భారత్‌పే నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. -
చేసింది ఇక చాలు!! మా'స్టారు' మీ టైమ్ అయిపోయింది!
Ashneer Grover used firm money to fund lavish lifestyle, Bharatpe Says: ఫిన్‌టెక్ కంపెనీ భారత్‌పేలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆ సంస్థ మాజీ ఎండీ అష్నీర్ గ్రోవర్‌ను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పదవితో పాటు మిగిలిన అన్నీ పదవుల నుంచి తొలగించింది. కంపెనీ అంతర్ఘత విచారణలో అష్నీర్, అతని కుటుంబం కంపెనీ నిధుల్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించింది. నేను అమాయకుడినని. ఒకప్పుడు కంపెనీలో కీరోల్ ప్లే చేసిన తనపై కుట్ర చేశారు. ఆ కుట్రలో నేను బలయ్యాను. నన్ను, నా కుటుంబ పరువును బజారు కీడ్చారంటూ అష్నీర్ గ్రోవర్ లేఖ రాసి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అలా లేఖ రాశారో లేదో మరుసటి రోజు భారత్‌పే కంపెనీ స్పందించింది. మీరు కంపెనీకి చేసిన సేవలు ఇంకచాలు. మిమ్మల్ని కంపెనీలో అన్నీ పదవుల నుంచి తొలగిస్తున్నాం' అంటూ అధికారికంగా ప్రకటించింది. ఇంటర్నల్ దర్యాప్తు జరుపుతున్నారనే సమాచారంతో అష్నీర్ తన రాజీనామా సమర్పించినట్లు కంపెనీ వెల్లడించింది. "గ్రోవర్ కుటుంబం, వారి బంధువులు కంపెనీ నిధులను విస్తృతంగా ఉపయోగించారు. వాటికే పరిమితం కాకుండా నకిలీ విక్రేతలను సృష్టించారు. తద్వారా కంపెనీ ఖర్చుల ఖాతా నుండి డబ్బును స్వాహా చేశారు. విలాసవంతంగా, దర్జాగా బతికేందుకు కంపెనీ నిధుల్ని దుర్వినియోగం చేశారు. అతని దుశ్చర్యల ఫలితంగా గ్రోవర్ ఇప్పుడు కంపెనీకి ఉద్యోగి, వ్యవస్థాపకుడు లేదా డైరెక్టర్ కాదు అని భారత్‌పే తెలిపింది. చదవండి: అనూహ్య పరిణామం.. భారత్‌పే ఎండీ రాజీనామా! కుట్రే గెలిచిందంటూ భావోద్వేగం -
అనూహ్య పరిణామం.. భారత్‌పే ఎండీ రాజీనామా!
ఫిన్‌టెక్ కంపెనీ భారత్‌పేలో పరిణామాలు అనూహ్య మలుపు తిరిగాయి. భారత్‌పే సహ వ్యవస్థాపకుడు, ఎండీ అష్నీర్ గ్రోవర్ కంపెనీకి, బోర్డుకు రాజీనామా చేసినట్లు సమాచారం. అన్నీ తనకు వ్యతిరేకంగా జరుగుతుండడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్ పే ఎండీ అష్నీర్ గ్రోవర్, ఆయన భార్య మాధురీ జైన్‌లపై గత కొంతకాలంగా వృత్తిపరమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై అంతర్గత దర్యాప్తునకు కాకుండా.. ప్రైవేట్ ఏజెన్సీలతో దర్యాప్తు చేయిస్తోంది భారత్‌పే. ఈ క్రమంలో.. ఈమధ్యే అష్నీర్ భార్య, కంపెనీ మాధురీ జైన్‌ను కంపెనీ తప్పించిన విషయం తెలిసిందే. కంపెనీ డబ్బుతో బ్యూటీ ప్రొడక్టులు కొనుక్కోవడంతో పాటు జల్సాలు చేసిందన్న ఆరోపణలను నిజమని తేల్చింది అల్వరెజ్ అండ్ మార్షల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. దీంతో ఆమెను కీలక బాధ్యతల నుంచి తప్పిస్తూ, ఆమె వాటాను సైతం రద్దు చేసేసింది BharatPe. ఇది జరిగిన వారంకే అష్నీర్ తన పదవికి రాజీనామా చేస్తూ కంపెనీని వీడడం విశేషం. తనపై వస్తున్న ఆరోపణలను మొదటి నుంచి ఖండిస్తూ వస్తున్న అష్నీర్ గ్రోవర్.. భార్యను తొలగించిన తర్వాత కూడా ఆ ఆరోపణలను తీవ్రస్థాయిలోనే ఖండించాడు. మరోవైపు అష్నీర్ ఆరోపణలను దర్యాప్తు చేయడానికి బయటి ఏజెన్సీలను నియమించడంపై కూడా ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేశాడు. అయితే.. ఒకదాని వెంట ఒకటి ఆయనకు వ్యతిరేక నిర్ణయాలు వస్తుండడంతో.. చివరిగా మధ్యవర్తిత్వం కోసం ఆయన ప్రయత్నించారు. కానీ, కంపెనీ అందుకు సైతం అంగీకరించలేదు. ఈ పరిణామాలతో కలత చెంది కంపెనీ వీడుతున్నట్లు సమాచారం. ‘‘భారత్‌పే కంపెనీని మొదలుపెట్టిన వాళ్లలో ఒకరైన నేను.. ఈరోజు బలవంతంగా కంపెనీని వీడాల్సి వస్తోంది. అందుకే బరువెక్కిన గుండెతో ఈ సందేశం రాస్తున్నా. ఫిన్‌టెక్ కంపెనీ ప్రపంచంలో భారత్‌పే అగ్రగామిగా నిలిచిందని తల ఎత్తుకుని గర్వంగా చెప్పగలను. దురదృష్టం కొద్దీ 2022 ప్రారంభం నుంచి.. నా ప్రతిష్టకు భంగం కలిగించే ఆరోపణలు వస్తున్నాయి. కంపెనీని విచ్ఛిన్నం చేయాలని భావిస్తున్న కొందరే నాపై, నా కుటుంబంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ల ఆరోపణల్లోనే నేను చిక్కుకున్నాను. చివరకు కుట్రే గెలిచింది. ఒకప్పుడు కంపెనీ ముఖచిత్రంగా నిలిచిన వ్యక్తి.. ఇప్పుడు కుట్రలో పావుగా బలవుతున్నాడు. దురదృష్టవశాత్తూ కంపెనీ తన ఉనికిని కోల్పోయింది’’ అంటూ సుదీర్ఘమైన లేఖ రాశాడు అష్నీర్ గ్రోవర్. వరుస పరిణామాలు.. నైకా ఐపీవో సంబంధిత షేర్ల కేటాయింపులో కొటక్ మహీంద్రా బ్యాంక్ విఫలమైందని అష్నీర్ గ్రోవర్ ఆరోపించాడు. ఆపై 500 కోట్ల రూపాయలకు కొటక్ మహీంద్రా మీద దావా వేశారు. ఆపై కొటక్ మహీంద్రా బ్యాంక్ ఉద్యోగిని ఫోన్‌కాల్‌లో దుర్భాషలాడుతూ.. అష్నీర్ గ్రోవర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక క్లిప్ వైరల్ అయ్యింది. ఈ వ్యవహారంలో న్యాయపరమైన చర్యలకు దిగిన కొటాక్ మహీంద్రా, భారత్‌పే ఎండీకి నోటీసులు సైతం పంపింది. దీంతో కంపెనీ అష్నీర్‌ను, ఆయన భార్య మాధురీని హడావిడిగా సెలవుల మీద బయటికి పంపించి.. సీఈవో సుహాయిల్ సమీర్‌కు తాత్కాలిక ఎండీ బాధ్యతలు అప్పజెప్పింది. అదే టైంలో వీళ్లు అవినీతికి, అవకతవకలకు పాల్పడ్డారంటూ ప్రైవేట్ ఏజెన్సీలకు దర్యాప్తు అప్పజెప్పింది. తనను కావాలనే టార్గెట్ చేశారంటూ ఆరోపించిన అష్నీర్.. ఒకానొక టైంలో తన వాటా తనకు ఇస్తే వెళ్లిపోతానంటూ స్పష్టం చేశాడు కూడా. ఇదిలా ఉండగా.. సుమారు 3 బిలియన్ డాలర్ల విలువ ఉన్న భారత్‌పే కంపెనీ.. మరో 18 నెలల్లో ఐపీవోకు వెళ్లే యోచనలో ఉంది. ఈ లోపు ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది.