Bharatpe Removes Ashneer Grover Him From All Posts - Sakshi
Sakshi News home page

Bharatpe: చేసింది ఇక చాలు!! మా'స్టారు' మీ టైమ్‌ అయిపోయింది!

Published Wed, Mar 2 2022 4:22 PM | Last Updated on Wed, Mar 2 2022 8:21 PM

Bharatpe Removes Ashneer Grover Him From All Posts - Sakshi

Ashneer Grover used firm money to fund lavish lifestyle, Bharatpe Says: ఫిన్‌టెక్‌ కంపెనీ భారత్‌పేలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆ సంస్థ మాజీ ఎండీ అష్నీర్‌ గ్రోవర్‌ను బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌ పదవితో పాటు మిగిలిన అన్నీ పదవుల నుంచి తొలగించింది. కంపెనీ అంతర్ఘత విచారణలో అష్నీర్‌, అతని కుటుంబం కంపెనీ నిధుల్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించింది. 

నేను అమాయకుడినని. ఒకప్పుడు కంపెనీలో కీరోల్‌ ప్లే చేసిన తనపై కుట్ర చేశారు. ఆ కుట్రలో నేను బలయ్యాను. నన్ను, నా కుటుంబ పరువును బజారు కీడ్చారంటూ అష్నీర్‌ గ్రోవర్‌ లేఖ రాసి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అలా లేఖ రాశారో లేదో మరుసటి రోజు భారత్‌పే కంపెనీ స్పందించింది. మీరు కంపెనీకి చేసిన సేవలు ఇంకచాలు. మిమ్మల్ని కంపెనీలో అన్నీ పదవుల నుంచి తొలగిస్తున్నాం' అంటూ అధికారికంగా ప్రకటించింది. 

ఇంటర్నల్‌ దర్యాప్తు జరుపుతున్నారనే సమాచారంతో అష్నీర్‌ తన రాజీనామా సమర్పించినట్లు కంపెనీ వెల్లడించింది. "గ్రోవర్ కుటుంబం, వారి బంధువులు కంపెనీ నిధులను విస్తృతంగా ఉపయోగించారు. వాటికే పరిమితం కాకుండా నకిలీ విక్రేతలను సృష్టించారు. తద్వారా కంపెనీ ఖర్చుల ఖాతా నుండి డబ్బును స్వాహా చేశారు. విలాసవంతంగా, దర్జాగా బతికేందుకు కంపెనీ నిధుల్ని దుర్వినియోగం చేశారు. అతని దుశ్చర్యల ఫలితంగా గ్రోవర్ ఇప్పుడు కంపెనీకి ఉద్యోగి, వ్యవస్థాపకుడు లేదా డైరెక్టర్ కాదు అని భారత్‌పే తెలిపింది.

చదవండి: అనూహ్య పరిణామం.. భారత్‌పే ఎండీ రాజీనామా! కుట్రే గెలిచిందంటూ భావోద్వేగం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement