ఢిల్లీలోని కరోల్ బాగ్ ఏరియాలో ఓ టెస్లా కారు కనిపించి ఆశ్చర్యపరిచింది. అయితే ఇది అసలైన టెస్లా కారు కాదు. వేరే కంపెనీ కారుకు టెస్లా లేబుల్ తగిలించి తిప్పుతున్నారు. ఇది భారత్ పే మాజీ ఎండీ ఆష్నీర్ గ్రోవర్ కంట్లో పడింది. దీనికి సంబంధించిన ఫొటోను ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
భారత్ పే మాజీ ఎండీ అష్నీర్ గ్రోవర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అవకాశం దొరికినప్పుడల్లా ఇంటర్నెట్‌లో వినోదభరితమైన, అబ్బురపరిచే విషయాలను పంచుకొంటుంటారు. ఇదే క్రమంలో టెస్లా లోగోతో ఉన్న బీవైడీ అట్టో3 కారు ఫొటోను షేర్ చేశారు. ‘బహుశా ప్రపంచంలోనే తొలి క్రాస్ బ్రీడ్ టెస్లా కారు ఇదేనేమో’ అంటూ కాప్షన్‌ను జోడించారు.
దీంతో ఈ ఫొటో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. దేశంలో క్రియేటివిటీకి కొదవ లేదని ఓ యూజర్ కామెంట్లు పెట్టారు. ఇక మరో నెటిజన్ స్పందిస్తూ.. ఈ ఫొటో చూస్తే టెస్లా ఓనర్ ఎలాన్ మస్క్ ఓ మూలన కూర్చుని ఏడుస్తాడని కామెంట్ చేశాడు.
World’s first ‘cross - breed’ Tesla ! Some Delhi boy literally ‘built his dream’ in Karol Bagh @Tesla pic.twitter.com/zxuilgyvAV
— Ashneer Grover (@Ashneer_Grover) February 3, 2024
Comments
Please login to add a commentAdd a comment