ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ భారత్‌పేపై ఆ కంపెనీ సహవ్యవస్ధాపకుడు, మాజీ సీఈఓ అష్నీర్ గ్రోవర్ సంచలన ఆరోపణలు చేశారు. భారత్‌పే ప్రస్తుత సీఈఓ భవిక్ కొలదియ 15 కోట్ల మంది భారత్‌పే యూజర్ల డేటా చౌర్యానికి పాల్పడ్డారని అన్నారు. ఇదే అంశంపై ఎన్‌పీసీఐకి లేఖ రాశారు.
భారత్‌లో పే యూజర్ల డేటా ఉల్లంఘనతో యూజర్ల డేటా గోప్యత భగ్నమైందని ఆరోపిస్తూ గ్రోవర్ ఎన్‌పీసీఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు గతంలో క్రెడిట్ కార్డు మోసంలో భవిక్ గతంలో దోషిగా తేలాడని, 18 నెలల పాటు గృహ నిర్బంధంలో ఉంచిన అనంతరం అతడిని భారత్‌కు తరలించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఫేక్ టికెట్ ఉపయోగించి గుజరాత్‌కు వెళ్లేందుకు ప్రయత్నించడంతో అతడిపై ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైందని గ్రోవర్ చెప్పారు. అందకు సంబంధించిన ఆధారాలు తనవద్ద ఉన్నాయని చెప్పారు. ఇక గ్రోవర్ చేస్తున్న ఆరోపణలపై భారత్‌పే కంపెనీ స్పందించింది. కంపెనీ నుంచి తొలగించినందుకు గ్రోవర్ కక్షతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని భారత్‌పే సీఈఓ భవిక్ కొలదియ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment