ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ భారత్‌పే కో-ఫౌండర్ అశ్నీర్ గ్రోవర్, అతని భార్య మాధురి జైన్ గ్రోవర్‌లకు ఎదురు దెబ్బ తగిలింది. భారత్‌పే చేసిన ఫిర్యాదుపై జరుగుతున్న విచారణను నిలిపివేయాలని అశ్నీర్ దంపతులు వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్ట్ కొట్టిపారేసింది.
భారత్‌పేలో విధులు నిర్వహించే సమయంలో అశ్నీర్ గ్రోవర్ దంపతులు విలాసాల రుచి మరిగి రూ.81 కోట్ల సంస్థ నిధుల్ని కాజేశారు. ఆ కుంభకోణం వెలుగులోకి రావడంతో భారత్‌పే వారిద్దరిని సంస్థ నుంచి తొలగించింది.
చదవండి👉 రండి! నా స్టార్టప్‌లో పనిచేయండి.. బెంజ్ కార్లు బహుమతిగా ఇస్తా!
చదవండి👉 అప్పుడు బడాయి మాటలు..కక్కుర్తి పనులు, మరి ఇప్పుడు!
ఇదే అంశంపై అశ్నీర్ దంపతుల్ని విచారించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్ట్‌ను ఆశ్రయించింది. ప్రస్తుతం ఆ విచారణ వేగంగా కొనసాగిస్తుంది. ఈ తరుణంలో తమపై సంస్థ తప్పుడు అభియోగాలు మోపిందని, వెంటనే కేసు విచారణ నిలిపివేయాలని కోరుతూ అశ్నీర్ కోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేశారు.
మీ వైఖరి ఏంటో తెలిజేయండి
అయితే, ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టీస్ అనూప్ జైరామ్ భంభానీ ధర్మాసనం తీర్పును వెలువరించింది. తమని విచారణ చేపట్టాలని అధికారులు ముందస్తు నోటీసులు ఇవ్వాలన్న అశ్నీర్ అభ్యర్ధనను జస్టీస్ భంభానీ సున్నితంగా తిరస్కరించారు. బదులుగా ముందస్తు బెయిల్‌కు దాఖలు చేసుకోవచ్చని తీర్పిచ్చారు.
అంతేకాదు, ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ అశ్నీర్ గ్రోవర్, అతని భార్య మాధురి జైన్ వేసిన పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈవోడబ్ల్యూతో పాటు భారత్‌పే సైతం విచారణపై స్టే విధించాలన్న అశ్నీర్ దంపతుల పిటిషన్‌పై తమ వైఖరి ఏంటో స్పష్టంగా తెలియజేయాలని కోరారు.
చదవండి👉 చేసింది ఇక చాలు!! మా'స్టారు' మీ టైమ్ అయిపోయింది!
అహర్నిశలు పనిచేస్తే.. అందుకు ప్రతిఫలం ఇదేనా
ఈ సందర్భంగా పిటిషనర్ల తరుపు సీనియర్ న్యాయవాదులు వికాస్ పహ్వా, దయన్ కృష్ణన్‌లు తమ క్లయింట్ అశ్నీర్ గ్రోవర్, అతని భార్య మాధురి జైన్‌లు పిటిషన్‌పై నోటీసు జారీ చేయడాన్ని వ్యతిరేకించారు. భారత్‌పేని స్టార్టప్ నుంచి యూనికార్న్ కంపెనీగా తీర్చిదిద్దడంలో తమ క్లయింట్ అశ్నీర్ గ్రోవర్, అతని భార్య మాధురి జైన్‌లు అహర్నిశలు శ్రమించారని గుర్తు చేశారు. చట్టబద్ధమైన ఆడిటర్ల ద్వారా సంస్థలో కార్యకలాపాలు నిర్వహించారని, ఎలాంటి అవకతవకలు జరగలేదని వాదించారు.
రూ.81.3 కోట్లు స్వాహా
మరోవైపు, అష్నీర్ గ్రోవర్, అతని కుటుంబం బోగస్ హ్యూమన్ రిసోర్స్ కన్సల్టెంట్‌లకు చట్టవిరుద్ధమైన చెల్లింపులు చేశారని భారత్‌పే ఆధారాల్ని కోర్టుకు అందించింది. అనవసరమైన చెల్లింపులు,ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌లో మోసపూరిత లావాదేవీలు, చెల్లింపుల ద్వారా సంస్థకు సుమారు రూ.81.3 కోట్ల నష్టం కలిగించారని ఫిర్యాదులో పేర్కొంది.
భారత్‌పేలో కీలక పదవి
భారత్‌పేలో మాధురీ జైన్ కంట్రోల్స్ హెడ్‌గా ఉన్నారు. ఫోరెన్సిక్ ఆడిట్‌లో అనేక అవకతవకలు జరిగినట్లు వెల్లడి కావడంతో 2022లో తొలగించారు. తదనంతరం, అష్నీర్ గ్రోవర్ మార్చి 2022లో సీఈవో పదవికి రాజీనామా చేశారు. కాగా, ఢిల్లీ హైకోర్ట్ ఈ కేసు తదుపరి విచారణ సెప్టెంబర్ 25న చేపట్టనుంది.
చదవండి👉 ఆ వార్తల్లో నిజం లేదు.. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు స్వస్తి పలకనున్నారా?
Comments
Please login to add a commentAdd a comment