Madhuri Jain Grover
-
‘విలాసాల రుచి మరిగి’.. అశ్నీర్ గ్రోవర్ దంపతులకు మరో ఎదురు దెబ్బ!
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ భారత్‌పే కో-ఫౌండర్ అశ్నీర్ గ్రోవర్, అతని భార్య మాధురి జైన్ గ్రోవర్‌లకు ఎదురు దెబ్బ తగిలింది. భారత్‌పే చేసిన ఫిర్యాదుపై జరుగుతున్న విచారణను నిలిపివేయాలని అశ్నీర్ దంపతులు వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్ట్ కొట్టిపారేసింది. భారత్‌పేలో విధులు నిర్వహించే సమయంలో అశ్నీర్ గ్రోవర్ దంపతులు విలాసాల రుచి మరిగి రూ.81 కోట్ల సంస్థ నిధుల్ని కాజేశారు. ఆ కుంభకోణం వెలుగులోకి రావడంతో భారత్‌పే వారిద్దరిని సంస్థ నుంచి తొలగించింది. చదవండి👉 రండి! నా స్టార్టప్‌లో పనిచేయండి.. బెంజ్ కార్లు బహుమతిగా ఇస్తా! చదవండి👉 అప్పుడు బడాయి మాటలు..కక్కుర్తి పనులు, మరి ఇప్పుడు! ఇదే అంశంపై అశ్నీర్ దంపతుల్ని విచారించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్ట్‌ను ఆశ్రయించింది. ప్రస్తుతం ఆ విచారణ వేగంగా కొనసాగిస్తుంది. ఈ తరుణంలో తమపై సంస్థ తప్పుడు అభియోగాలు మోపిందని, వెంటనే కేసు విచారణ నిలిపివేయాలని కోరుతూ అశ్నీర్ కోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేశారు. మీ వైఖరి ఏంటో తెలిజేయండి అయితే, ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టీస్ అనూప్ జైరామ్ భంభానీ ధర్మాసనం తీర్పును వెలువరించింది. తమని విచారణ చేపట్టాలని అధికారులు ముందస్తు నోటీసులు ఇవ్వాలన్న అశ్నీర్ అభ్యర్ధనను జస్టీస్ భంభానీ సున్నితంగా తిరస్కరించారు. బదులుగా ముందస్తు బెయిల్‌కు దాఖలు చేసుకోవచ్చని తీర్పిచ్చారు. అంతేకాదు, ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ అశ్నీర్ గ్రోవర్, అతని భార్య మాధురి జైన్ వేసిన పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈవోడబ్ల్యూతో పాటు భారత్‌పే సైతం విచారణపై స్టే విధించాలన్న అశ్నీర్ దంపతుల పిటిషన్‌పై తమ వైఖరి ఏంటో స్పష్టంగా తెలియజేయాలని కోరారు. చదవండి👉 చేసింది ఇక చాలు!! మా'స్టారు' మీ టైమ్ అయిపోయింది! అహర్నిశలు పనిచేస్తే.. అందుకు ప్రతిఫలం ఇదేనా ఈ సందర్భంగా పిటిషనర్ల తరుపు సీనియర్ న్యాయవాదులు వికాస్ పహ్వా, దయన్ కృష్ణన్లు తమ క్లయింట్ అశ్నీర్ గ్రోవర్, అతని భార్య మాధురి జైన్లు పిటిషన్‌పై నోటీసు జారీ చేయడాన్ని వ్యతిరేకించారు. భారత్‌పేని స్టార్టప్ నుంచి యూనికార్న్ కంపెనీగా తీర్చిదిద్దడంలో తమ క్లయింట్ అశ్నీర్ గ్రోవర్, అతని భార్య మాధురి జైన్లు అహర్నిశలు శ్రమించారని గుర్తు చేశారు. చట్టబద్ధమైన ఆడిటర్ల ద్వారా సంస్థలో కార్యకలాపాలు నిర్వహించారని, ఎలాంటి అవకతవకలు జరగలేదని వాదించారు. రూ.81.3 కోట్లు స్వాహా మరోవైపు, అష్నీర్ గ్రోవర్, అతని కుటుంబం బోగస్ హ్యూమన్ రిసోర్స్ కన్సల్టెంట్లకు చట్టవిరుద్ధమైన చెల్లింపులు చేశారని భారత్‌పే ఆధారాల్ని కోర్టుకు అందించింది. అనవసరమైన చెల్లింపులు,ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్లో మోసపూరిత లావాదేవీలు, చెల్లింపుల ద్వారా సంస్థకు సుమారు రూ.81.3 కోట్ల నష్టం కలిగించారని ఫిర్యాదులో పేర్కొంది. భారత్‌పేలో కీలక పదవి భారత్‌పేలో మాధురీ జైన్ కంట్రోల్స్ హెడ్‌గా ఉన్నారు. ఫోరెన్సిక్ ఆడిట్లో అనేక అవకతవకలు జరిగినట్లు వెల్లడి కావడంతో 2022లో తొలగించారు. తదనంతరం, అష్నీర్ గ్రోవర్ మార్చి 2022లో సీఈవో పదవికి రాజీనామా చేశారు. కాగా, ఢిల్లీ హైకోర్ట్ ఈ కేసు తదుపరి విచారణ సెప్టెంబర్ 25న చేపట్టనుంది. చదవండి👉 ఆ వార్తల్లో నిజం లేదు.. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు స్వస్తి పలకనున్నారా? -
భార్య గురించి అలా ట్వీట్ చేసిన అష్నీర్ గ్రోవర్
వృత్తిపరంగా ఎప్పుడూ బిజీగా ఉండే ప్రముఖ వ్యాపారవేత్త 'అష్నీర్ గ్రోవర్' ఇటీవల తన భార్య 'మాధురీ జైన్ గ్రోవర్' గురించి ఒక ఆసక్తికరమైన విషయం ట్వీట్ చేశారు. ఇందులో ఆమె స్టార్టప్ పెట్టుబడులను గురించి, దేశంలో ఎక్కువ టాక్స్ చెల్లిస్తున్న మహిళ అంటూ ప్రశంసించాడు. అష్నీర్ గ్రోవర్ ప్రకారం, మాధురి ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 2.84 కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించినట్లు తెలిసింది. అదే సమయంలో ఆయన 2022 - 2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 7.1 కోట్లు టాక్స్ చెల్లించినట్లు తెలుస్తోంది. హర్యానాలోని పానిపట్‌కు చెందిన మాధురీ జైన్ పానిపట్‌లోని బాల్ వికాస్ స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత, NIFT ఢిల్లీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది. ప్రస్తుతం భారతదేశంలో ప్రముఖ వ్యాపారవేత్తగా, స్టార్టప్ పెట్టుబడిదారుగా కొనసాగుతోంది. తన భర్త స్థాపించిన వ్యాపారంలో చేరడానికి ముందు ఇతర కంపెనీలలో కెరీర్ ప్రారంభించింది. ఇప్పుడు భారత్ పే ఆపరేషన్స్ అండ్ ఫంక్షన్స్ విభాగం నిర్వహణ బాధ్యతలను చేపట్టింది. అంతే కాకుండా గ్రోవర్తో పాటు గత ఫిబ్రవరిలో థర్డ్ యునికార్న్ బిజినెస్ ప్రారంభించారు. క్రికెట్ సాఫ్ట్వేర్ CrickPeని ఉపయోగించి కొత్త బిజినెస్ ఫాంటసీ కింద క్రీడలపై దృష్టి పెట్టారు. గత సంవత్సరం మాధురీ జైన్ గ్రోవర్ భారత్ పే ఆపరేషన్స్ హెడ్ హోదాలో 63 లక్షలు సంపాదించినట్లు సమాచారం. అదే ఏడాది అష్నీర్ గ్రోవర్ రూ. 1.69 కోట్లు సంపాదించారు. Madhuri Jain Grover @madsj30 is one of the highest female tax payers in the country. She’s paid ₹2.84 crores of advance tax this financial year. She is killing it with her start up investments - in a year where the space in general is falling apart. Kudos to all honest tax payer pic.twitter.com/cRkeRRfgqx — Ashneer Grover (@Ashneer_Grover) March 15, 2023 -
ఐరన్ లెగ్ మహిమ : జొమాటోకు కోట్లలో నష్టం..ఈయనే కారణమా!
దేశీయ స్టాక్ మార్కెట్లో ప్రముఖ ఫుడ్ ఆగ్రిగ్రేటర్ జొమాటో షేర్లు భారీగా కుదేలవుతున్నాయి. సోమవారం ఎన్ఎస్ఈలో జొమాటో 14శాతం షేర్లు పడిపోయి రూ.46 వద్ద జీవిత కాల కనిష్ఠాన్ని తాకాయి. చివరకు 11.28 శాతం నష్టంతో రూ.47.60 వద్ద ముగియగా..దీంతో నిన్నఒక్కరోజే జొమాటో రూ.1000కోట్లు (అంచనా) నష్టపోయింది.మంగళవారం సైతం ఆ సంస్థకు నష్టాల పరంపర కొనసాగుతుంది. ఇవ్వాళ మార్కెట్ కొనసాగే 2.50గంటల సమయానికి ఎన్ఎస్ఈలో జొమాటో షేర్లు భారీగా నష్టపోయి రూ.42.15 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఈ తరుణంలో భారత్ పే మాజీ ఫౌండర్ అశ్నీర్ గ్రోవర్ స్పందించారు. జొమాటో- స్విగ్గీలు మెర్జ్ అయితే జొమాటో షేర్ రాకెట్ వేగంతో రూ.450కి చేరుతుందని ట్విట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్‌కాగా.. జొమాటో షేర్లు నష్టపోవడానికి అశ్నీరే అంటూ మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. On the stock market - @letsblinkit served piping hot misery to @zomato in 10 minutes ! Yeh hi agar @Swiggy ko merge kar liya hota to ₹450 ka stock hota !! — Ashneer Grover (@Ashneer_Grover) July 26, 2022 ఐరన్ లెగ్ అశ్నీర్ జొమాటో షేర్ల పతనానికి అశ్నీర్ గ్రోవరే కారణమని నివేదికలు చెబుతున్నాయి. ఎందుకంటే? ఫినెట్‌క్ కంపెనీ భారత్ పే'ను స్థాపించిన అశ్నీర్ గ్రోవర్, ఆయన భార్య మాధురీ జైన్‌లపై సంస్థ నిధుల్ని కాజేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. విచారణ చేపట్టిన అల్వరెజ్ అండ్ మార్షల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సైతం... అశ్నీర్, మాధురీ జైన్ కంపెనీ డబ్బుతో బ్యూటీ ప్రొడక్టులు కొనుక్కోవడంతో పాటు జల్సాలు చేసిందన్న ఆరోపణలను నిజమని తేల్చింది. అశ్నీర్ రాజీనామా దీంతో భారత్‌పే మాధురీ జైన్‌ను విధుల నుంచి తొలగించింది. ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో అశ్నీర్ సైతం భారత్‌పేలో తన పదవికి రాజీనామా చేశారు. తనపై కుట్ర చేశారని, ఎలాంటి తప్పు చేయలేదంటూ వాదనకు దిగారు. చివరకు చేసేది లేక భారత్ పే నుంచి బయటకు వచ్చిన అశ్నీర్ తన కుటంబ సభ్యులకు చెందిన అమెరికన్ కంపెనీతో కలిసి మరో స్టార్టప్‌ను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు సమాచారం. అప్పుడు భారత్‌పే.. ఇప్పుడు జొమాటో ఇక భారత్ పేతో తలెత్తిన విభేదాల కారణంగా ఆర్ధిక సమస్యల నుంచి బయట పడేందుకు అశ్నీర్ తన కిరాణ డెలివరీ యాప్ సంస్థ బ్లింకిట్‌ను జొమాటోకు అమ్మేశారు. జొమాటో రూ. 4,447 కోట్ల డీల్‌తో షేర్ల మార్పిడి ద్వారా కంపెనీని సొంతం చేసుకుంది. దీంతో బ్లింకిట్ అశ్నీర్‌ది కావడం, ఇప్పటికే భారత్‌పే నిధుల్ని కాజేయడం వంటి ఇతర కారణాల వల్ల జొమాటో మదుపర్లు అప్రమత్తమయ్యారు. జొమాటో షేర్లను అమ్మేసిస్తున్నారు. దీంతో ఎన్ఎస్ఈలో జొమాటో షేర్లు భారీగా నష్టపోతున్నాయి. చదవండి: అప్పుడు బడాయి మాటలు..కక్కుర్తి పనులు, మరి ఇప్పుడు! -
మూడు కోట్ల కార్లు.. కోటి రూపాయల డైనింగ్ టేబుల్.. చివరికి
ఇటీవల వార్తల్లో ఎక్కువగా నిలిచిన యూనికార్న్ స్టార్టప్‌గా భారత్‌పే నిలిచింది. నాలుగు బిలియన్ డాలర్ల కంపెనీగా ఎదిగిన ఈ స్టార్టప్ ఫౌండర్లలో ఒకరైన ఆశ్నీర్ గ్రోవర్ని అవమానకర రీతిలో కంపెనీ నుంచి తప్పించారు. ఒక ఫౌండర్‌గా ఆయన చేయకూడని తప్పులు చేసినందునే ఇలా జరిగిందంటూ అక్కడి ఎంప్లాయిస్ చెబుతున్నారు. ఉద్యోగులంటే చులకన అశ్నీర్ గ్రోవర్, అతని భార్య మాధురి జైన్ గ్రోవర్లు వ్యవహరించిన తీరు వల్లే ఈ పరిస్థితి ఎదుర్కొన్నట్టు ఉద్యోగులు చెప్పినట్టు బ్లూంబర్గ్ కథనం ప్రచురించింది. ముఖ్యంగా ఎండీ హోదాలో ఉన్న అశ్నీర్ గ్రోవర్ ఎప్పుడూ ఉద్యోగస్తులతో చులకనగా ప్రవర్తించేవాడని చెబుతున్నారు. కరోనా టైంలో అన్ని చోట్ల వర్క్‌ఫ్రం హోం అమల్లో ఉంటే భారత్‌పే దాన్ని నిరాకరించింది. ఆఖరికి ఆఫీసులో మాస్కు పెట్టుకోమని అడిగినందుకు ఓ మహిళా ఉద్యోగిని పనిలో నుంచి తీసేశారని అక్కడి ఉద్యోగులు చెబుతున్నారు. ఛీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ పోస్టు కోసం ఎంత మందిని ఇంటర్వ్యూ చేసినా ఏ ఒక్కరిని సెలక్ట్ చేయకుండా కాలయాపన చేశాడట గ్రోవర్. రూ. కోటి డైనింగ్ టేబుల్ ఉద్యోగుల పట్ల అగౌరవంగా ఉంటూనే మరోవైపు ఎప్పుడు తన గొప్పలే ఆశ్నీర్ గ్రోవర్ సాటి ఉద్యోగులకు చెబుతుండేవాడట. ఇప్పుడే కోటి రూపాయలు పెట్టి డైనింగ్ టేబుల్ కొన్నాను.. నా కారు విలువ మూడున్నర కోట్లు... మా ఇంట్లో కార్పోట్ చాలా ప్రత్యేకమైనది ఇలా నిత్యం గొప్పలు చెబుతుంటే వాడట. ఈ వ్యవహారం శృతి మించి మహీంద్రా కోటక్ బ్యాంక్‌కి చెందిన మహిళా అధికారిని దుషించే స్థితికి చేరుకున్నాడు గ్రోవర్. దీంతో అతని వ్యవహారశైలిపై భారత్‌పే మేనేజ్మెంట్ దృష్టి సారించింది. కక్కుర్తి ఇక హెడ్ ఆఫ్ కంట్రోల్స్ పోస్టులో ఉన్న మాధురి జైన్ ఉద్యోగులను మరో రకంగా వేధించేవారట. ఆఫీస్‌లో అందించే టీ, కాఫీలను ఎవరైనా ఎక్కువగా తాగితే ఫైన్లు విధించేవారట, ఆఫీసులో ఉన్న ప్రింటర్‌ను వ్యక్తిగత పనులకు ఎవరైనా వాడితే జీతంలో కోతలు పెట్టేవారట. అదే సమయంలో కంపెనికి చెందిన కోట్లాది రూపాయల డబ్బును బ్యూటీ ప్రొడక్ట్స్, షాపింగ్‌కి ఆమె ఖర్చుపెట్టేవారట. ఇలా ఒక్కో విషయం కలిసి చివరికి మాధురిని కంపెనీ నుంచి తొలగించే వరకు పరిస్థితి వచ్చింది. వాళ్లకేం తెలుసు కోటక్ మహీంద్రా అధికారితో గొడవ తర్వాత మూడు నెలల లాంగ్ లీవ్‌పై వెళ్లిన అశ్నీర్ గ్రోవర్ చివరకు 2022 మార్చి ఒకటిన భారత్‌పేలో తనకు ఉన్న అన్ని స్థానాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. తనపై వస్తున్న ఆరోపణలపై ఆశ్నీర్ స్పందిస్తూ.. ‘లగ్జరీగా జీవితం గడపాలని నేను కలలు కన్నాను. అందు కోసమే కష్టించి పని చేశాను. ఈ రోజు ఖరీదైన నా పరుపు గురించి కామెంట్ చేసే వాళ్లకి ఒకప్పుడు భారత్‌పేకు పెట్టుబడులు తెచ్చేందుకు నేను ఫుట్‌పాత్‌ల వెంట తిరిగిన రోజులు తెలియవు. అందుకే వారేమైనా అంటారు’ అంటూ నిప్పులు చెరిగాడు. స్టార్టప్ ఫౌండర్లను ఇన్వెస్టర్లు బానిసల్లా చూస్తున్నారంటూ ఆశ్నీర్ గ్రోవర్, అతని భార్య మాధురి జైన్లు మండిపడుతున్నారు. భారత్‌పే ఢిల్లీ వేదికగా అశ్నీర్ గ్రోవర్, శాశ్వత్ నక్రానీలు ఫిన్‌టెక్ స్టార్టప్‌గా భారత్‌పేను 2018లో స్థాపించారు. అనతి కాలంలోనే భారీ పెట్టుబడులు సాధించి యూనికార్న్ కంపెనీగా మారింది. ఆశ్నీర్‌గ్రోవర్ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలు ఉండగా అతని భార్య మాధురి జైన్ కంట్రోల్స్ ఆఫ్ హెడ్ హోదాలో భారత్‌పేలో కొనసాగింది. ఇటీవల కాలంలో భార్యభర్తలిద్దరు కంపెనీ నుంచి విస్మయం కలిగే విధంగా బయటకు పంపబడ్డారు. చదవండి: తప్పు చేస్తే సహించేదేలే ! భారత్‌పే సంచలన నిర్ణయం -
అనూహ్య పరిణామం.. భారత్‌పే ఎండీ రాజీనామా!
ఫిన్‌టెక్ కంపెనీ భారత్‌పేలో పరిణామాలు అనూహ్య మలుపు తిరిగాయి. భారత్‌పే సహ వ్యవస్థాపకుడు, ఎండీ అష్నీర్ గ్రోవర్ కంపెనీకి, బోర్డుకు రాజీనామా చేసినట్లు సమాచారం. అన్నీ తనకు వ్యతిరేకంగా జరుగుతుండడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్ పే ఎండీ అష్నీర్ గ్రోవర్, ఆయన భార్య మాధురీ జైన్‌లపై గత కొంతకాలంగా వృత్తిపరమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై అంతర్గత దర్యాప్తునకు కాకుండా.. ప్రైవేట్ ఏజెన్సీలతో దర్యాప్తు చేయిస్తోంది భారత్‌పే. ఈ క్రమంలో.. ఈమధ్యే అష్నీర్ భార్య, కంపెనీ మాధురీ జైన్‌ను కంపెనీ తప్పించిన విషయం తెలిసిందే. కంపెనీ డబ్బుతో బ్యూటీ ప్రొడక్టులు కొనుక్కోవడంతో పాటు జల్సాలు చేసిందన్న ఆరోపణలను నిజమని తేల్చింది అల్వరెజ్ అండ్ మార్షల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. దీంతో ఆమెను కీలక బాధ్యతల నుంచి తప్పిస్తూ, ఆమె వాటాను సైతం రద్దు చేసేసింది BharatPe. ఇది జరిగిన వారంకే అష్నీర్ తన పదవికి రాజీనామా చేస్తూ కంపెనీని వీడడం విశేషం. తనపై వస్తున్న ఆరోపణలను మొదటి నుంచి ఖండిస్తూ వస్తున్న అష్నీర్ గ్రోవర్.. భార్యను తొలగించిన తర్వాత కూడా ఆ ఆరోపణలను తీవ్రస్థాయిలోనే ఖండించాడు. మరోవైపు అష్నీర్ ఆరోపణలను దర్యాప్తు చేయడానికి బయటి ఏజెన్సీలను నియమించడంపై కూడా ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేశాడు. అయితే.. ఒకదాని వెంట ఒకటి ఆయనకు వ్యతిరేక నిర్ణయాలు వస్తుండడంతో.. చివరిగా మధ్యవర్తిత్వం కోసం ఆయన ప్రయత్నించారు. కానీ, కంపెనీ అందుకు సైతం అంగీకరించలేదు. ఈ పరిణామాలతో కలత చెంది కంపెనీ వీడుతున్నట్లు సమాచారం. ‘‘భారత్‌పే కంపెనీని మొదలుపెట్టిన వాళ్లలో ఒకరైన నేను.. ఈరోజు బలవంతంగా కంపెనీని వీడాల్సి వస్తోంది. అందుకే బరువెక్కిన గుండెతో ఈ సందేశం రాస్తున్నా. ఫిన్‌టెక్ కంపెనీ ప్రపంచంలో భారత్‌పే అగ్రగామిగా నిలిచిందని తల ఎత్తుకుని గర్వంగా చెప్పగలను. దురదృష్టం కొద్దీ 2022 ప్రారంభం నుంచి.. నా ప్రతిష్టకు భంగం కలిగించే ఆరోపణలు వస్తున్నాయి. కంపెనీని విచ్ఛిన్నం చేయాలని భావిస్తున్న కొందరే నాపై, నా కుటుంబంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ల ఆరోపణల్లోనే నేను చిక్కుకున్నాను. చివరకు కుట్రే గెలిచింది. ఒకప్పుడు కంపెనీ ముఖచిత్రంగా నిలిచిన వ్యక్తి.. ఇప్పుడు కుట్రలో పావుగా బలవుతున్నాడు. దురదృష్టవశాత్తూ కంపెనీ తన ఉనికిని కోల్పోయింది’’ అంటూ సుదీర్ఘమైన లేఖ రాశాడు అష్నీర్ గ్రోవర్. వరుస పరిణామాలు.. నైకా ఐపీవో సంబంధిత షేర్ల కేటాయింపులో కొటక్ మహీంద్రా బ్యాంక్ విఫలమైందని అష్నీర్ గ్రోవర్ ఆరోపించాడు. ఆపై 500 కోట్ల రూపాయలకు కొటక్ మహీంద్రా మీద దావా వేశారు. ఆపై కొటక్ మహీంద్రా బ్యాంక్ ఉద్యోగిని ఫోన్‌కాల్‌లో దుర్భాషలాడుతూ.. అష్నీర్ గ్రోవర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక క్లిప్ వైరల్ అయ్యింది. ఈ వ్యవహారంలో న్యాయపరమైన చర్యలకు దిగిన కొటాక్ మహీంద్రా, భారత్‌పే ఎండీకి నోటీసులు సైతం పంపింది. దీంతో కంపెనీ అష్నీర్‌ను, ఆయన భార్య మాధురీని హడావిడిగా సెలవుల మీద బయటికి పంపించి.. సీఈవో సుహాయిల్ సమీర్‌కు తాత్కాలిక ఎండీ బాధ్యతలు అప్పజెప్పింది. అదే టైంలో వీళ్లు అవినీతికి, అవకతవకలకు పాల్పడ్డారంటూ ప్రైవేట్ ఏజెన్సీలకు దర్యాప్తు అప్పజెప్పింది. తనను కావాలనే టార్గెట్ చేశారంటూ ఆరోపించిన అష్నీర్.. ఒకానొక టైంలో తన వాటా తనకు ఇస్తే వెళ్లిపోతానంటూ స్పష్టం చేశాడు కూడా. ఇదిలా ఉండగా.. సుమారు 3 బిలియన్ డాలర్ల విలువ ఉన్న భారత్‌పే కంపెనీ.. మరో 18 నెలల్లో ఐపీవోకు వెళ్లే యోచనలో ఉంది. ఈ లోపు ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది.