Madhuri Jain Grover One of the Highest Female Taxpayers in India- Sakshi
Sakshi News home page

భార్య గురించి అలా ట్వీట్ చేసిన అష్నీర్ గ్రోవర్

Published Fri, Mar 17 2023 2:23 PM | Last Updated on Fri, Mar 17 2023 2:48 PM

madhuri jain grover one of the highest female taxpayers in india - Sakshi

వృత్తిపరంగా ఎప్పుడూ బిజీగా ఉండే ప్రముఖ వ్యాపారవేత్త 'అష్నీర్ గ్రోవర్' ఇటీవల తన భార్య 'మాధురీ జైన్ గ్రోవర్' గురించి ఒక ఆసక్తికరమైన విషయం ట్వీట్ చేశారు. ఇందులో ఆమె స్టార్టప్ పెట్టుబడులను గురించి, దేశంలో ఎక్కువ టాక్స్ చెల్లిస్తున్న మహిళ అంటూ ప్రశంసించాడు.

అష్నీర్ గ్రోవర్ ప్రకారం, మాధురి ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 2.84 కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించినట్లు తెలిసింది. అదే సమయంలో ఆయన 2022 - 2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 7.1 కోట్లు టాక్స్ చెల్లించినట్లు తెలుస్తోంది.

హర్యానాలోని పానిపట్‌కు చెందిన మాధురీ జైన్ పానిపట్‌లోని బాల్ వికాస్ స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత, NIFT ఢిల్లీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది. ప్రస్తుతం భారతదేశంలో ప్రముఖ వ్యాపారవేత్తగా, స్టార్టప్ పెట్టుబడిదారుగా కొనసాగుతోంది. తన భర్త స్థాపించిన వ్యాపారంలో చేరడానికి ముందు ఇతర కంపెనీలలో కెరీర్ ప్రారంభించింది.

ఇప్పుడు భారత్ పే ఆపరేషన్స్ అండ్ ఫంక్షన్స్ విభాగం నిర్వహణ బాధ్యతలను చేపట్టింది. అంతే కాకుండా గ్రోవర్‌తో పాటు గత ఫిబ్రవరిలో థర్డ్ యునికార్న్‌ బిజినెస్ ప్రారంభించారు. క్రికెట్ సాఫ్ట్‌వేర్ CrickPeని ఉపయోగించి కొత్త బిజినెస్ ఫాంటసీ కింద క్రీడలపై దృష్టి పెట్టారు. గత సంవత్సరం మాధురీ జైన్ గ్రోవర్ భారత్ పే ఆపరేషన్స్ హెడ్ హోదాలో 63 లక్షలు సంపాదించినట్లు సమాచారం. అదే ఏడాది అష్నీర్ గ్రోవర్ రూ. 1.69 కోట్లు సంపాదించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement