NPCI
-
గూగుల్ పే, ఫోన్‌పేకి ఎన్పీసీఐ ఊరట
ఫోన్‌పే, గూగుల్ పేలాంటి యూపీఐ యాప్‌లకు ఊరటనిచ్చే దిశగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నిర్ణయం తీసుకుంది. థర్డ్ పార్టీ ఏకీకృత చెల్లింపుల విధానం (UPI) యాప్‌ల ద్వారా జరిగే లావాదేవీల పరిమాణంలో నిర్దిష్ట యాప్‌ల వాటా 30 శాతానికి మించరాదన్న ప్రతిపాదనను మరో రెండేళ్లు పెంచింది. 2026 డిసెంబర్ 31 వరకు పొడిగించినట్లు వెల్లడించింది.ప్రస్తుతం యూపీఐ లావాదేవీల్లో గూగుల్ పే, ఫోన్‌పేలాంటి థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్ల (TPAP) వాటా 80 శాతం స్థాయిలో ఉంటోంది. ఈ పరిమితిని క్రితం మూడు నెలల్లో నమోదైన మొత్తం యూపీఐ లావాదేవీల ప్రాతిపదికన లెక్కిస్తారు. మరోవైపు, వాట్సాప్ పే యాప్ మరింత మంది యూజర్లను చేర్చుకునేందుకు వీలు కల్పిస్తూ ఎన్పీసీఐ పరిమితిని తొలగించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. దీంతో వాట్సాప్ పే ఇకపై దేశవ్యాప్తంగా తమకున్న యూజర్లందరికీ యూపీఐ సర్వీసులను అందించేందుకు వీలవుతుంది. గతంలో వాట్సాప్ పే దశలవారీగా యూపీఐ యూజర్లను పెంచుకునే విధంగా పరిమితి విధించింది. ఇది 10 కోట్ల యూజర్లుగా ఉండేది.ఆన్లైన్ చెల్లింపుల్లో కొన్ని థర్డ్‌పార్టీ యాప్‌లే ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నాయి. దాంతో కొన్ని లాభాలతోపాటు నష్టాలు కూడా ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.సానుకూల పరిణామాలుసులువుగా లావాదేవీలు..రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పూర్తి కేవైసీతో ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్(PPI)ను థర్డ్ పార్టీ యుపీఐ యాప్స్‌కు అనుసంధానించడానికి అనుమతించింది. ఇది లావాదేవీలను మరింత అంతరాయం లేకుండా సౌకర్యవంతంగా చేస్తుంది.మరింత చేరువగా..ఎక్కువ మంది డిజిటల్ చెల్లింపు వ్యవస్థలను యాక్సెస్ చేయవచ్చు. ఇది బ్యాంకింగ్ లేని లేదా బ్యాంకింగ్ వ్యవస్థ ఎక్కువగా అందుబాటులోలేని వారికి ఎంతో ఉపయోగపడుతుంది.సౌలభ్యంగా..వినియోగదారులు తమ డిజిటల్ వాలెట్లను (పేటీఎం, ఫోన్ పే..) ఉపయోగించిన సౌకర్యవంతంగా చెల్లింపులు చేయవచ్చు.ఇదీ చదవండి: 2024లో కార్ల అమ్మకాలు ఎలా ఉన్నాయంటే..ప్రతికూల పరిణామాలుమార్కెట్ ఆధిపత్యంకొన్ని థర్డ్ పార్టీ యాప్‌ల(ఫోన్ పే, గూగుల్ పే.. వంటివి) ఆధిపత్యం ద్వంద్వ ధోరణికి దారితీస్తుంది. ఇది డిజిటల్ పేమెంట్ మార్కెట్లో పోటీని, సృజనాత్మకతను తగ్గిస్తుంది.సాంకేతిక సవాళ్లుకొన్ని థర్డ్‌పార్టీ యాప్‌లనే అధికంగా వినియోగించడం వల్ల భవిష్యత్తులో ఏదైనా సాంకేతిక అవాంతరాలు జరిగితే తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది.విదేశీ యాజమాన్యంఈ యాప్‌లు చాలా వరకు విదేశీ యాజమాన్యంలో ఉన్నాయి. వాల్‌మార్ట్ ఆధ్వర్యంలో ఫోన్‌పే, గూగుల్ - గూగుల్ పే.. వంటివాటిని నిర్వహిస్తున్నాయి. స్థానికంగా జరిగే డిజిటల్ చెల్లింపుల మౌలిక సదుపాయాలపై విదేశీ నియంత్రణకు సంబంధించి ఆందోళనలకు దారితీస్తుంది. -
ఎన్పీసీఐ ప్రకటన.. పేటీఎం షేర్లు ఢమాల్!
యూపీఐ ప్రొవైడర్లకు సంబంధించిన 30 శాతం మార్కెట్ షేర్ పరిమితిని పాటించేందుకు గడువును నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) మరో రెండేళ్లు పొడిగించింది. ఈ ప్రకటన తర్వాత బుధవారం (జనవరి 1) ట్రేడింగ్ సెషన్లో పేటీఎం (Paytm) షేర్లు బీఎస్ఈ (BSE)లో దాదాపు 4 శాతం పడిపోయి రూ. 976.5కి చేరుకున్నాయి.యూపీఐ ప్రొవైడర్ల డిజిటల్ లావాదేవీల పరిమాణం వాటి మార్కెట్ షేర్లో 30 శాతానికి మించకూడదని ఎన్పీసీఐ నిబంధన విధించింది. దీనికి ఇదివరకు 2024 డిసెంబర్ 31 వరకు గడువు ఉండగా దీన్ని 2026 డిసెంబర్ 31 వరకు మరో రెండేళ్లు పొడిగించింది. "వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని థర్డ్-పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ల (TPAPs) సమ్మతి గడువును మరో రెండేళ్లు పొడిగిస్తున్నాము" అని ఎన్పీసీఐ తన ప్రకటనలో తెలిపింది.పేటీఎం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.62,626 కోట్లుగా ఉంది. కంపెనీ స్టాక్ 52 వారాల కనిష్ట విలువ రూ.310 కాగా, 52 వారాల గరిష్టం రూ.1,063. జనవరి 1న బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్‌లో అత్యధికంగా నష్టపోయిన వాటిలో ఇది ఒకటి.కాగా ఎన్పీసీఐ నిర్ణయం వల్ల వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫోన్‌పే (PhonePe), గూగుల్ పే (Google Pay)కి స్వల్పకాలిక ఉపశమనం లభించనుంది. రెండూ కలిసి యూపీఐ (UPI) చెల్లింపుల మార్కెట్లో 85 శాతానికి పైగా ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. కొత్త పరిమితిని పాటించడానికి వాటికి అదనపు సమయం లభించింది.రెగ్యులేటరీ డేటా ప్రకారం.. 2024 నవంబర్‌లో యూపీఐ చెల్లింపుల్లో ఫోన్‌పే 47.8% వాటాను కలిగి ఉండగా గూగుల్ పే 37 శాతం వాటాను కలిగి ఉంది. రెండు కంపెనీలు కలిసి ఆ నెలలో 13.1 బిలియన్ల లావాదేవీలను ప్రాసెస్ చేశాయి. -
ఆర్టీజీఎస్, నెఫ్ట్ లావాదేవీల పొరపాట్లకు చెక్
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆన్లైన్ లావాదేవీలు అధికమవుతున్నాయి. చాలామంది యూపీఐ, ఇమ్మిడియెట్ పేమెంట్ సర్వీస్(IMPS), ఆర్టీజీఎస్, నెఫ్ట్ వంటి సదుపాయాలు వినియోగిస్తుంటారు. అందులో యూపీఐ, ఐఎంపీఎస్ ద్వారా చేసిన లావాదేవీల్లో దాదాపు ఎలాంటి అవాంతరాలు జరగడానికి ఆస్కారం ఉండదు. ఎందుకంటే పేమెంట్ చేసే చివరి దశలో ఒకసారి లుక్ అప్ ఫెసిలిటీ(ఖాతా దారుడి పేరుతో వివరాలు సరి చేసుకునే సదుపాయం) ఉంటుంది. కానీ రియల్‌టైం గ్రాస్ సెటిల్మెంట్(RTGS), నేషనల్ ఎలక్ట్రానిక్స్ ఫండ్స్ ట్రాన్స్ఫర్(NEFT) ద్వారా చేసే లావాదేవీల్లో ఈ సదుపాయం ఉండదు. దాంతో కొన్నిసార్లు పొరపాటు జరిగే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI)ను ఆర్బీఐ కోరింది.ఆన్లైన్లో నిర్వహించే నగదు లావాదేవీల్లో ఏదైనా పొరపాటు జరిగి వేరే అకౌంట్లోకి డబ్బు జమైతే తిరిగి వాటిని రాబట్టడం పెద్దపని. కాబట్టి పేమెంట్ చేసేముందే అన్ని వివరాలు సరిచూసుకుంటే సమస్య ఉండదు. ఈ నేపథ్యంలో ఆర్టీజీఎస్, నెఫ్ట్ లావాదేవీల్లో జరిగే మోసాలు అరికట్టడానికి, పొరబాట్లు జరగకుండా నగదు బదిలీ చేసేందుకు ఏ ఖాతాకైతే నగదు వెళుతుందో ఆ ఖాతాదారుడి పేరును తనిఖీ చేయడానికి వినియోగదార్లకు వీలు కల్పించేలా ఒక సదుపాయాన్ని (లుక్ అప్ ఫెసిలిటీ) అందుబాటులోకి తీసుకురావాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ)ను ఆర్బీఐ కోరింది. ఏప్రిల్ 1, 2025 వరకు ఆర్టీజీఎస్, నెఫ్ట్ సర్వీసు అందిస్తున్న అన్ని బ్యాంకులకు ఈ సదుపాయాన్ని అందించాలని ఆర్బీఐ(RBI) సూచించింది.ఇదీ చదవండి: రూ.15,100 కోట్ల క్లెయిమ్‌లను అనుమతించలేదు!యూపీఐ, ఐఎంపీఎస్లకు ఇలా..ఫోన్‌పే, జీపే.. వంటి థర్డ్‌పార్టీ యూపీఐ పేమెంట్ యాప్‌లు, ఐఎంపీఎస్ ద్వారా లావాదేవీలు జరుపుతున్న సమయంలో ఎవరికైతే డబ్బు పంపించాలో ఆ ఖాతాదారుడి పేరు వివరాలు ధ్రువీకరించే వెసులుబాటు ఉంటుంది. కానీ ఆర్టీజీఎస్, నెఫ్ట్ ద్వారా చేసే లావాదేవీలకు ఆ సదుపాయం లేదు. -
ఎన్‌పీసీఐకి ప్రవీణా రాయ్ రాజీనామా: ఎంసీఎక్స్‌లో కొత్త బాధ్యతలు
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ 'ప్రవీణా రాయ్' తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం 'మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్' (ఎంసీఎక్స్) మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా బాధ్యతలు స్వీకరించారు.ఆర్థిక సేవల రంగంలో మూడు దశాబ్దాల అనుభవం కలిగిన ప్రవీణా రాయ్ ఎంసీఎక్స్‌లో నియామకానికి 'సెబీ' ఆమోదం తెలిపింది. రాయ్ ఎన్పీసీఐలో చేరటానికి ముందు కోటక్ మహీంద్రా బ్యాంక్, సిటీ బ్యాంక్, హెచ్ఎస్బీసీలలో కూడా పనిచేశారు.ఇదీ చదవండి: బీపీఎల్ ఫౌండర్ టీపీజీ నంబియార్ కన్నుమూతఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన ప్రవీణా రాయ్.. ఐఐఎం అహ్మదాబాద్‌లో పేజీ చేశారు. కోటక్ మహీంద్రా బ్యాంకులో చేరినప్పుడు ఈమె క్యాష్ మేనేజ్మెంట్ పోర్ట్ ఫోలియో నిర్వహించారు. ఆ తరువాత హెచ్ఎస్బీసీలో ఆసియా - పసిఫిక్ రీజియన్ హెడ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఎన్పీసీఐలో రాయ్ మార్కెటింగ్, ప్రొడక్ట్, టెక్నాలజీ, బిజినెస్ స్ట్రాటజీ, ఆపరేషన్ డెలివరీ వంటి బాధ్యలు నిర్వహించారు. ఇప్పుడు ఎంసీఎక్స్ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా బాధ్యతలు చేపట్టారు.PRESS RELEASE - Ms. Praveena Rai takes charge as MD & CEO of MCXClick here to read more: https://t.co/114IrR0cYL#pressrelease pic.twitter.com/yZW5GGEmbT— MCX (@MCXIndialtd) October 31, 2024 -
పేటీఎంకి ‘కొత్త’ ఊపిరి!
కష్టాల్లో కూరుకుపోయిన ఫిక్ టెక్ కంపెనీ పేటీఎంకి భారీ ఊరట లభించింది. కొత్తగా యూపీఐ యూజర్లను చేర్చుకోవడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) అనుమతినిచ్చింది. ఆగస్ట్‌లో కంపెనీ చేసిన అభ్యర్థన మేరకు ఎన్పీసీఐ అనుమతిని మంజూరు చేసిందని పేటీఎం తెలిపింది.నిబంధనలు పాటించడంలో లోపాల కారణంగా ఎన్పీసీఐ ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్తగా యూపీఐ యూజర్లను చేర్చుకోకుండా పేటీఎంపై నిషేధించింది. తాజాగా పేటీఎం అభ్యర్థన మేరకు రెగ్యులేటరీ నిబంధనలు, ప్రోటోకాల్స్లను సమీక్షించి కొత్తగా యూజర్లను చేర్చుకునేందుకు అనుమతినిచ్చింది. అయితే షరతులతో కూడిన అనుమతి మాత్రమే.ఇదీ చదవండి: అదిరిపోయే ఆఫర్.. విమానం ఎక్కేయండి చవగ్గా!ఆర్బీఐ చర్యల తర్వాత ఇప్పటివరకూ పేటీఎం షేర్లు దాదాపు 10 శాతం నష్టపోయాయి. సెప్టెంబరు త్రైమాసికంలో కంపెనీ ఆదాయంలో 34 శాతం క్షీణత, నెలవారీ లావాదేవీల వినియోగదారులలో 25 శాతం తగ్గుదలని నివేదించింది. దీని తర్వాత కంపెనీ షేర్లు ఐదు శాతానికి పైగా పడిపోయాయి. -
ఆరు నెలల్లో 7897 కోట్ల లావాదేవీలు
తక్షణ చెల్లింపుల వ్యవస్థ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీల సంఖ్య 2024 జనవరి–జూన్ మధ్య దేశవ్యాప్తంగా 78.97 బిలియన్ల(7897 కోట్లు)కు చేరుకున్నాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే లావాదేవీలు 52 శాతం పెరిగాయని పేమెంట్ టెక్నాలజీ సర్వీసులు అందిస్తున్న వరల్డ్‌లైన్ నివేదిక వెల్లడించింది.‘గతేడాదితో పోలిస్తే జనవరి–జూన్ మధ్య లావాదేవీల విలువ రూ.83.16 లక్షల కోట్లు నుంచి రూ.116.63 లక్షల కోట్లకు చేరింది. 2023 జనవరిలో యూపీఐ లావాదేవీల సంఖ్య 803 కోట్లుగా ఉంది. 2024 జూన్‌కు ఇది 1300 కోట్లకు చేరింది. లావాదేవీల విలువ రూ.12.98 లక్షల కోట్ల నుంచి రూ.20.07 లక్షల కోట్లకు చేరింది. విలువ, పరిమాణం పరంగా ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వరుసగా మూడు స్థానాలను ఆక్రమించాయి. సగటు లావాదేవీ విలువ 2023 జనవరి–జూన్ మధ్య రూ.1,603 నమోదైంది. 2024 జూన్‌తో ముగిసిన ఆరు నెలల్లో ఇది రూ.1,478కి చేరింది. ఆన్లైన్ పరిశ్రమలో ఈ–కామర్స్, గేమింగ్, యుటిలిటీస్, ప్రభుత్వ సేవలు, ఆర్థిక సేవలు మొత్తం లావాదేవీల పరిమాణంలో 81 శాతం, విలువలో 74 శాతం కైవసం చేసుకున్నాయి’ అని నివేదిక వివరించింది.ఇదీ చదవండి: ఒకే నెలలో రూ.24,509 కోట్లు రాక! -
రోజూ 50 కోట్ల లావాదేవీలు..!
దేశీయంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) చెల్లింపులు పెరుగుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో యూపీఐ ద్వారా రూ.20.64 లక్షల కోట్ల చెల్లింపులు నమోదైనట్లు నివేదికలు తెలుపుతున్నాయి. లావాదేవీల పరిమాణం సెప్టెంబర్‌లో గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 42% పెరిగి 1500 కోట్లకు చేరింది. సగటున రోజువారీ లావాదేవీలు 50 కోట్ల మార్కును చేరాయి.భారత్‌లోనే కాకుండా దుబాయ్, ఖతార్, కువైట్, మారిషస్.. వంటి ఇతర దేశాల్లోనూ ఎన్పీసీఐ యూపీఐ సేవలను అమలు చేస్తోంది. దాంతో అంతర్జాతీయంగా యూపీఐ లావాదేవీలు పెరిగేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఫిజికల్‌గా డబ్బు ఉంచుకోవడం కంటే డిజిటల్ లావాదేవీలు చేయడం మేలని యూపీఐ వినియోగదారులు నమ్ముతున్నారు. ప్రభుత్వానికి కూడా ఈ లావాదేవీలను ట్రాక్ చేయడం సులభమవుతోంది. కానీ కొన్ని థర్డ్‌పార్టీ యూపీఐ యాప్‌లనే యూజర్లు ఎక్కువగా వినియోగిస్తుండడంపట్ల ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేస్తోంది. భవిష్యత్తులో ఏదైనా భద్రతా వైఫల్యాలు తలెత్తితే తీవ్ర నష్టం కలుగుతుందని అభిప్రాయపడుతోంది. ఈ థర్డ్‌పార్టీ యూపీఐ కంపెనీలు వినియోగదారులకు అధిక వడ్డీలోన్లను ఆశచూపి భారీగానే లాభపడుతున్నాయని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: నెలలో 11 శాతం పెరిగిన విక్రయాలుదేశంలో డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరుగుతున్నట్లు గతంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో (ఏప్రిల్-ఆగస్టు) డిజిటల్ చెల్లింపుల విలువ రూ.1,669 లక్షల కోట్లకు పెరిగినట్లు ఆర్థికశాఖ చెప్పింది. ఇదే కాలంలో డిజిటల్ చెల్లింపుల లావాదేవీల పరిమాణం 8,659 కోట్లకు చేరుకుందని పేర్కొంది. తాజాగా సెప్టెంబర్ నెలలో జరిగిన యూపీఐ లావాదేవీలు కలుపుకుంటే ఈ పరిమాణం మరింత పెరుగుతుంది. -
ఒకేసారి రూ.5 లక్షలు: ఎన్సీపీఐ కీలక నిర్ణయం
గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత డిజిటల్ పేమెంట్స్ ఎక్కువయ్యాయి. ఇప్పటి వరకు యూపీఐ పేమెంట్స్ రోజుకు/ఒకసారికి ఒక లక్ష మాత్రమే పంపించుకోవడానికి అవకాశం ఉండేది. తాజాగా ఈ పరిమితిని పెంచుతూ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NCPI) కీలక ప్రకటన వెల్లడించింది.ఎన్సీపీఐ ప్రకారం రేపటి (సెప్టెంబర్ 16) నుంచి రోజుకు లేదా ఒకసారికి గరిష్టంగా ఐదు లక్షల రూపాయల వరకు పంపించుకోవచ్చు. దీంతో యూజర్లు ఆసుపత్రి బిల్లులు, విద్యాసంస్థల ఫీజులకు సంబంధించిన పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు ఐపీఓకు అప్లై చేసుకునేటప్పుడు రూ. 5 లక్షలు పేమెంట్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు అన్నివిధాలా చాలా అనుకూలంగా ఉంటుంది.ఇదీ చదవండి: సైబర్ మోసాలకు ఇన్సూరెన్స్: రోజుకు మూడు రూపాయలే.. -
యూపీఐ పేమెంట్స్‌లో కీలక మార్పులు..!
డిజిటల్ చెల్లింపుల యుగంలో యూపీఐ (UPI - యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) వినియోగం వేగంగా పెరుగుతోంది. చాలా మంది ఇప్పుడు నగదు లావాదేవీల కంటే యూపీఐ పేమెంట్స్‌నే ఎక్కువగా చేస్తున్నారు. అయితే ఇదే క్రమంలో యూపీఐ మోసాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి.యూపీఐ పేమెంట్స్ భద్రతకు సంబంధించి ప్రస్తుతం పిన్ (PIN) ఆధారిత ధ్రువీకరణ విధానం ఉంది. పేమెంట్స్ ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రతిసారి పిన్ నంబర్ ఎంటర్ చేసి ధ్రువీకరించాల్సి ఉంటుంది. అయినప్పటికీ కొన్నిసార్లు మోసాలు జరగుతున్నాయి. దీనిపై దృష్టిసారించిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) మరో కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతోంది.బయోమెట్రిక్ ధ్రువీకరణ!సీక్రెట్ పిన్ నంబర్‌ను తెలుసుకుని మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఎన్పీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. మింట్ నివేదిక ప్రకారం.. పిన్ ఆధారిత ధ్రువీకరణ ప్రక్రియకు బదులుగా బయోమెట్రిక్ ధ్రువీకరణను తీసుకురానుంది. ఈ కొత్త విధానంలో యూపీఐ లావాదేవీలను వేలిముద్ర స్కానింగ్ లేదా ఫేస్ ఆథెంటికేషన్ ద్వారా ధ్రువీకరించాల్సి ఉంటుంది. స్మార్ట్ఫోన్లలో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్లను ఉపయోగించి యూపీఐ చెల్లింపులను మరింత సురక్షితంగా, సులభంగా చేసే విధానంపై ఎన్పీసీఐ కసరత్తు చేస్తోంది. -
ఫోన్ పే, గూగుల్ పేకు గట్టి పోటీ.. సిద్దమవుతున్న భీమ్
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తన భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ (BHIM) యాప్‌ను ఒక స్వతంత్ర అనుబంధ సంస్థగా మార్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే బీహెచ్ఐఎమ్ (భీమ్) తన ఉనికిని విస్తరించడానికి సన్నద్ధమవుతోంది. దీనికోసం లలితా నటరాజ్‌ను బీహెచ్ఐఎమ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించింది.లలితా నటరాజ్ గతంలో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లో పనిచేశారు. కాబట్టి నటరాజన్ 'బీహెచ్ఐఎమ్'ను వేగంగా అభివృద్ధి చేస్తారని భావిస్తున్నారు. ఈ అభివృద్ధికి ఓ వైపు ప్రభుత్వం, మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా సహరిస్తున్నట్లు సమాచారం. భారతదేశంలో ప్రస్తుతం గూగుల్ పే, ఫోన్ పే వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో ఈ యాప్‌ల మీద ప్రజలు ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం బీహెచ్ఐఎమ్ అభివృద్ధిని మరింత వేగవంతం చేయడానికి ఆలోచిస్తోంది. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా 85 శాతం లావాదేవీలు జరుగుతున్నాయి. దీంతో ఈ రెండు కంపెనీల ఆధిపత్యం భవిష్యత్తులో ఆందోళన కలిగిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.బీహెచ్ఐఎమ్ అనేది 2016లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ యాప్‌ని నేరుగా బ్యాంక్ చెల్లింపులు చేయడానికి లేదా యూపీఐ చెల్లింపులు చేయడానికి ఉపయోగించుకుపోవచ్చు. అయితే గూగుల్ పే, ఫోన్ పే వాడకంలోకి వచ్చిన తరువాత బీహెచ్ఐఎమ్ వినియోగం తగ్గిపోయింది. కాబట్టి దీనికి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రయత్నిస్తోంది. -
క్రెడిట్ కార్డుల వినియోగం ఎంతంటే..
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ)ల ద్వారా జరిగే క్రెడిట్ కార్డ్ లావాదేవీలు రూ.10,000 కోట్లకు చేరాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఎండీ, సీఈఓ దిలీప్ అస్బే తెలిపారు. అందులో యూపీఐ సేవలందించే బ్యాంకులు తమ వినియోగదారులకు సుమారు రూ.100 కోట్లు నుంచి రూ.200 కోట్ల వరకు లోన్లు అందిస్తున్నట్లు చెప్పారు.ఈ సందర్భంగా దిలీప్ మాట్లాడుతూ..‘యూపీఐ ద్వారా చేసే క్రెడిట్ కార్డుల వినియోగం రూ.10వేల కోట్లకు చేరింది. కార్డు లావాదేవీలను అసరాగా చేసుకుని బ్యాంకులు దాదాపు రూ.200 కోట్ల వరకు ప్రి అప్రూవ్డ్ లోన్లు ఇస్తున్నాయి. అందులో ఐసీఐసీఐ బ్యాంక్ ముందంజలో ఉంది. దాంతోపాటు స్వల్ప కాల వ్యవధి కలిగిన రుణాలను కూడా బ్యాంకులు విడుదల చేస్తున్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్లపై చిన్నమొత్తంలో రుణాలను అందించడం ద్వారా కొత్త కస్టమర్లను సంపాదించాలని భావిస్తున్నాయి’ అన్నారు.ఇదీ చదవండి: బీమా కంపెనీలపై 12 శాతం పెనాల్టీ!క్రెడిట్‌కార్డు లావాదేవీలపై యూపీఐ ద్వారా లోన్లు ఇవ్వడం బ్యాంకులకు కొంత లాభాలు చేకూర్చే అంశమేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సర్వీసులను వినియోగదారులకు చేరవేసేందుకు బ్యాంకులు ఎన్బీఎఫ్సీలు, ఇతర ఫిన్‌టెక్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి యూపీఐ ద్వారా బ్యాంకులు మాత్రమే లోన్లు ఇవ్వగలవు. ఎన్బీఎఫ్సీలు, ఫిన్‌టెక్‌లు కూడా బ్యాంకుల మాదిరి లోన్లు ఇచ్చేలా వెసులుబాటు పొందాలని భావిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అందుకు ఆర్బీఐ అనుమతులు కావాల్సి ఉంటుంది. -
ర్యాన్సమ్వేర్ దాడి.. బ్యాంకింగ్ సేవల పునరుద్ధరణ
హానికర సాఫ్ట్వేర్ (ర్యాన్సమ్వేర్) దాడికి గురైన సీ-ఎడ్జ్ టెక్నాలజీస్ సర్వీసులను తిరిగి పునరుద్ధరించినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తెలిపింది. దీనివల్ల దేశవ్యాప్తంగా సుమారు 300 సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల కస్టమర్లకు ఉపశమనం లభించింది.ఎన్పీసీఐ తెలిపిన వివరాల ప్రకారం..దేశీయ బ్యాంకింగ్ సేవలందించే టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్ సీ-ఎడ్జ్ టెక్నాలజీస్‌పై ఇటీవల ర్యాన్సమ్వేర్ దాడి జరిగింది. దాంతో వెంటనే స్పందించి దాడి జరిగిన సర్వర్‌ను డిస్కనెక్ట్ చేశారు. తిరిగి సర్వీస్ ప్రొవైడర్ సేవలను తాజాగా పునరుద్ధరించారు. వినియోగదార్లు ఏటీఎంల నుంచి నగదు స్వీకరణ, యూపీఐ లావాదేవీలు జరుపుకోవచ్చు.ఇదీ చదవండి: బ్యాంకు సర్వీస్ ప్రొవైడర్‌పై ర్యాన్సమ్వేర్ దాడి!కస్టమర్లకు నిధుల బదలాయింపు, ఏటీఎంల వద్ద నగదు స్వీకరణ, యూపీఐ చెల్లింపు సేవల కోసం బ్యాంకులు సీ-ఎడ్జ్‌పై ఆధారపడ్డాయి. సీ-ఎడ్జ్ హానికర సాఫ్ట్వేర్ దాడికి గురికావడంతో లావాదేవీల విషయంలో కొన్ని సహకార, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల వినియోగదార్లు సోమవారం నుంచి అంతరాయం ఎదుర్కొన్నారు. సీ-ఎడ్జ్‌లో ర్యాన్సమ్వేర్ విస్తరణకు అవకాశం ఉండడంతో పేమెంట్ సిస్టమ్‌లను వేరు చేసినట్టు ప్రకటించారు. అయితే ఈ దాడి కేవలం టెక్నాలజీ సిస్టమ్‌లకే పరిమితమైందని, సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల సొంత మౌలిక సదుపాయాలపై ఎలాంటి ప్రభావం చూపలేదని ఎన్పీసీఐ స్పష్టం చేసింది. -
బ్యాంకు సర్వీస్ ప్రొవైడర్‌పై ర్యాన్సమ్వేర్ దాడి!
దేశీయ బ్యాంకింగ్ సేవలందించే టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్‌పై ర్యాన్సమ్వేర్ దాడి జరిగినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తెలిపింది. ఈమేరకు దాడి జరిగిన సర్వర్‌ను డిస్కనెక్ట్ చేసినట్లు పేర్కొంది. అయితే ఈ వ్యవహారంపై బ్యాంకులు, ఆర్బీఐ మాత్రం ఇంకా స్పందించలేదు.ఎన్పీసీఐ విడుదల చేసిన పబ్లిక్ అడ్వైజరీ ప్రకారం..సీ-ఎడ్జ్ టెక్నాలజీస్ అనే ముంబయికి చెందిన సంస్థ ప్రాంతీయ, కోఆపరేటివ్, గ్రామీణ బ్యాంకులకు టెక్నాలజీ సేవలందిస్తోంది. ఈ కంపెనీ టీసీఎస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాయింట్ వెంచర్‌గా ఉంది. రెండు రోజుల కిందట ఈ సంస్థ సర్వీసులపై ర్యాన్సమ్వేర్ దాడి జరిగింది. తదుపరి చెల్లింపులపై ఎలాంటి ప్రభావం పడకుండా వెంటనే గుర్తించి రిటైల్ పేమెంట్ సిస్టమ్‌తో డిస్కనెక్ట్ చేశారు. దాంతో కొంతమంది వినియోగదారులు చెల్లింపులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. సీ-ఎడ్జ్ టెక్నాలజీ అందిస్తున్న సర్వర్‌తో అనుసంధానం చేసిన యూపీఐ, ఐఎంపీఎస్, ఎన్పీసీఐ చెల్లింపులు సేవలను కొంత సమయంపాటు యాక్సెస్ చేయలేరు. ఇప్పటికే బ్యాంకింగ్ సేవల పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. త్వరలో సమస్య పరిష్కారమవుతుంది.ఇదీ చదవండి: కాల్ హోల్డ్‌లో పెట్టారా..? రూ.4.6 లక్షల కోట్లు నష్టం!Regarding interruption in retail payments pic.twitter.com/Ve32ac7WpQ— NPCI (@NPCI_NPCI) July 31, 2024 -
ఖతార్‌లో యూపీఐ సేవలు..!
దేశంలో డిజిటల్ చెల్లింపులకు కీలకంగా ఉన్న యూపీఐ సేవలను ఖతార్‌కు విస్తరిస్తున్నట్లు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ పేమెంట్స్(ఎన్ఐపీఎల్) తెలిపింది. ఈమేరకు ఖతార్ నేషనల్ బ్యాంక్(క్యూఎన్బీ)తో ఒప్పందం జరిగినట్లు పేర్కొంది. ఆ దేశంలో నివసిస్తున్న భారతీయులు, ప్రయాణికులకు ఈ సేవలు ఎంతో ఉపయోగపడుతాయని ఎన్ఐపీఎల్ చెప్పింది.ఈ సందర్భంగా ఎన్పీసీఐ పార్ట్నర్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ డిప్యూటీ చీఫ్ అనుభవ్ శర్మ మాట్లాడుతూ..‘ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఖతార్‌లోని భారత వినియోగదారులకు మరిన్ని సేవలందించేందుకు ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ ఖతార్ నేషనల్ బ్యాంక్(క్యూఎన్బీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఖతార్‌లోని భారతీయులు, ప్రయాణికులు, టూరిస్టులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చు’ అని తెలిపారు.ఇదీ చదవండి: రూ.61 కోట్లు రికవరీ చేసిన ఈపీఎఫ్ఓ2024లో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) దేశాలకు వెళ్లే భారతీయ పర్యాటకుల సంఖ్య 98 లక్షలుగా ఉంటుందని అంచనా. అందులో యూఏఈ ద్వారానే 52.9 లక్షల మంది రాకపోకలు జరిపే అవకాశం ఉంది. ఇటీవల యూఏఈలో యూపీఐ సేవలు ప్రారంభిస్తున్నట్లు ఎన్పీసీఐ ప్రకటించింది. -
యూఏఈలోనూ యూపీఐ చెల్లింపులు!
దేశంలో డిజిటల్ చెల్లింపులకు కీలకంగా ఉన్న యూపీఐ సేవలను యూఏఈకి విస్తరిస్తున్నట్లు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) తెలిపింది. యూఏఈలో నివసిస్తున్న భారతీయులు, ప్రయాణికులకు ఈ సేవలు ఎంతో ఉపయోగపడుతాయని ఎన్పీసీఐ పేర్కొంది.ఈ సందర్భంగా ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ సీఈఓ రితేష్ శుక్లా మాట్లాడుతూ..‘ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ మిడిల్ ఈస్ట్(మధ్యప్రాచ్య దేశాలు), ఆఫ్రికాలోని డిజిటల్ కామర్స్‌లో సేవలందిస్తున్న ‘నెట్వర్క్ ఇంటర్నేషనల్’తో భాగస్వామ్యం కలిగి ఉంది. కాబట్టి యూఏఈలో యూపీఐ సేవలందించే ప్రక్రియ సులువైంది. యూఏఈలోని భారతీయులు, ప్రయాణికులు, టూరిస్టులు పాయింట్-ఆఫ్-సేల్ (పీఓఎస్) టెర్మినల్స్‌లో క్యూఆర్ కోడ్ ద్వారా యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చు. 2024లో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) దేశాలకు వెళ్లే భారతీయ పర్యాటకుల సంఖ్య 98 లక్షలుగా ఉంటుందని అంచనా. అందులో యూఏఈ ద్వారానే 52.9 లక్షల మంది రాకపోకలు జరిపే అవకాశం ఉంది. కాబట్టి వినియోగదారులకు ఈ సేవలు ప్రారంభించాం’ అని తెలిపారు.ఇదీ చదవండి: యాపిల్‌కు ఓపెన్ఏఐ బోర్డులో స్థానం..!ఎన్పీసీఐ ఇప్పటికే నేపాల్, శ్రీలంక, మారిషస్, సింగపూర్, ఫ్రాన్స్, భూటాన్లలో ఈ యూపీఐ సేవలను ఆమోదించింది. -
పెరూలో యూపీఐ చెల్లింపులు..
న్యూఢిల్లీ: ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ తాజాగా సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ పెరూ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఇందులో భా గంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) వంటి రియల్ టైమ్ చెల్లింపుల వ్యవస్థను పెరూలో అందుబాటులోకి తేనున్నాయి.ఈ సాంకేతికత అందుబాటులోకి వస్తే దక్షిణ అమెరికాలో దీన్ని ప్రవేశపెట్టిన తొలి దేశంగా పెరూ స్థానం సంపాదించనుంది. రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్‌ను ఆ దేశంలో స్థాపించడంతోపాటు వ్యక్తు లు, వ్యాపార సంస్థల మధ్య తక్షణ చెల్లింపులను అందించేందుకు సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ పెరూకు ఈ భాగస్వామ్యం దోహదం చేస్తుంది.ఇవి చదవండి: బ్యాంకు ఖాతాలో డబ్బు లేకపోయినా యూపీఐ చెల్లింపులు..! -
యూపీఐ సరికొత్త రికార్డ్.. రోజుకు రూ .65,966 కోట్లు
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నిర్వహించే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) నెట్వర్క్ సరికొత్త రికార్డులు సృష్టించింది. గడిచిన మే నెలలో లావాదేవీల పరిమాణం, విలువ రెండూ పెరిగాయని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.ఎన్పీసీఐ మే నెలలో 1400 కోట్ల లావాదేవీలను ప్రాసెస్ చేయడం ద్వారా కొత్త మైలురాయిని సాధించింది. ఏప్రిల్ లో నమోదైన 1330 కోట్ల లావాదేవీలతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల. ఇక ఏప్రిల్‌లో రూ.19.64 లక్షల కోట్లుగా ఉన్న లావాదేవీ విలువ మేలో రూ.20.45 లక్షల కోట్లకు పెరిగిందని ఎన్పీసీఐ తెలిపింది.ఈ ఏడాది మే నెలలో నమోదైన యూపీఐ లావాదేవీలు గతేడాదితో పోలిస్తే 49 శాతం పెరిగాయి. ఈ మే నెలలో జరిగిన యూపీఐ సగటు రోజువారీ లావాదేవీ మొత్తం రూ .65,966 కోట్లు. రోజువారీగా సగటున 45.3 కోట్ల లావాదేవీలు జరిగనట్లుగా ఎన్పీసీఐ గణాంకాలు పేర్కొన్నాయి. -
ఇకపై బ్యాంక్ ఎస్ఎమ్ఎస్ అలర్ట్లుండవు.. ఎవరికంటే..
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన కస్టమర్లకు పంపించే ఎస్‌ఎమ్‌ఎస్‌లపై పరిమితులు విధిస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంక్ వినియోగదారులు చేసే యూపీఐ డెబిట్, క్రెడిట్ లావాదేవీలకు కొత్త నిబంధన వర్తిస్తుందని చెప్పింది.బ్యాంక్ యూపీఐ డెబిట్, క్రెడిట్లు ఉపయోగించి రూ.100లోపు లావాదేవీలు చేస్తే ఇకపై ఎస్ఎమ్ఎస్లు పంపబోమని తెలిపింది. 2024 జూన్ 25 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని హెచ్డీఎఫ్సీ చెప్పింది. అయితే అన్ని యూపీఐ లావాదేవీలకు ఈమెయిల్ సందేశాలు మాత్రం కొనసాగుతాయని స్పష్టం చేసింది. తాజా పరిమితి ప్రకారం.. రూ.100కు పైన ఎవరికైనా నగదు పంపినా/క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లిస్తే ఎస్ఎమ్ఎస్ అలర్ట్‌లు అందుతాయి. దాంతోపాటు రూ.500కు మించి నగదు అందుకున్నప్పుడు మాత్రమే ఎస్ఎమ్ఎస్ సదుపాయం ఉంటుంది.ఇదీ చదవండి: క్యాష్‌లెస్ చికిత్సపై గంటలోనే నిర్ణయం..ఐఆర్డీఏఐ ఆదేశాలుఅధిక మొత్తంలో యూపీఐ లావాదేవీలు జరుగుతున్నందున బల్క్ ఎస్ఎమ్ఎస్లు పంపేందుకు అయ్యే ఖర్చులు పెరుగుతున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ప్రకారం..2023లో యూపీఐ లావాదేవీలు 100 బిలియన్ల మార్కును అధిగమించాయి. ఏడాది చివరినాటికి దాదాపు 118 బిలియన్లకు చేరుకున్నాయి. -
పేటీఎం కొత్త వ్యూహం
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం ఇటీవల తన పేమెంట్స్ బ్యాంక్‌ను రద్దు చేయడంతో తమకు తిరుగులేదని ప్రత్యర్థి కంపెనీలు సంబరపడిపోయాయి. కానీ వాటికి దీటైన సమాధానం ఇస్తూ తిరిగి మార్కెట్లో తన స్థానాన్ని పదిలపరుచుకునేందుకు పేటీఎం సరికొత్త ప్లాన్ చేసింది. థర్డ్ పార్టీ పేమెంట్ సేవల కోసం ప్రముఖ బ్యాంకులతో జతకట్టింది. యాప్‌లో యూపీఐ లావాదేవీలు చేస్తే ఏకంగా రూ.100 వరకు క్యాష్‌బ్యాక్ ఇస్తున్నట్లు ప్రకటించింది.పెద్దనోట్ల రద్దు సమయంలో దాదాపు దేశం అంతటా ఆన్లైన్ పేమెంట్ సేవలందించిన పేటీఎం..క్రమంగా తన సబ్స్రైబర్లను పెంచుకుంది. వారికి మరింత చేరువయ్యేలా ప్రత్యేకంగా పేమెంట్స్ బ్యాంక్‌ను ప్రారంభించింది. యుటిలిటీ బిల్లు చెల్లింపుల నుంచి షాపింగ్ వరకు డబ్బుతో ముడిపడిన చాలా కార్యకలాపాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. నేరుగా క్రెడిట్‌కార్డులు ఇచ్చే స్థాయికి చేరింది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్(ఎన్పీసీఐ) ఆధ్వర్యంలోని యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యూపీఐ) లావాదేవీల్లో ముందువరుసలో నిలిచింది. టోల్గేట్ల వద్ద ఎన్హెచ్ఏఐ నిబంధనల ప్రకారం తన వినియోగదారులకు ఫ్యాస్టాగ్ సర్వీస్‌ను అందించింది.ఇటీవల కొంతమంది పేటీఎం యూజర్ల ఖాతాల్లో పరిమితులకు మించి లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని ఆర్బీఐ అధికారులు తెలిపారు. దాంతో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. అప్పటివరకు తన వినియోగదారులు పేమెంట్స్ బ్యాంక్ ద్వారానే యూపీఐ సేవలు వినియోగించుకునేవారు. ఒక్కసారిగా దాన్ని రద్దు చేయడంతో ప్రత్యర్థి కంపెనీలు ఒకింత సంబరపడిపోయాయి. వాటికి ధీటైన సమాధానం చెబుతూ ఎన్పీసీఐ ద్వారా థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ (టీపీఏపీ) లైసెన్స్‌ను సంపాదించింది. దీని ప్రకారం మల్టీ బ్యాంక్ మోడల్ కింద పేటీఎం బ్రాండ్‌పైనా యూపీఐ సేవలందిస్తోంది.బ్యాంకింగ్ సేవలిందిస్తున్న యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యస్ బ్యాంక్‌లు పేటీఎంకు పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లుగా వ్యవహరిస్తున్నాయి. గతంలో ఉన్న మర్చంట్స్‌కు, కొత్త మర్చంట్స్‌కు యస్ బ్యాంక్ సేవలందిస్తోంది. @paytm యూపీఐ హ్యాండిల్ కలిగిన మర్చంట్ పేమెంట్స్ యస్ బ్యాంక్‌కు రీడైరెక్ట్ అయ్యాయి.ఇదీ చదవండి: ఆదాయాలు రెట్టింపైనా ఉద్యోగాల్లో కోత!మార్కెట్లో తిరిగి తన స్థానాన్ని పదిలపరుచుకునేలా యూజర్లు క్యాష్‌బ్యాంక్ ప్రకటించింది. యూపీఐ లావాదేవీలు చేస్తూ రూ.100 వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందేలా వీలుకల్పిస్తుంది. అమెజాన్ పే, గూగుల్ పే, ఫోన్‌పేలతో సహా ఇప్పటికే దేశంలో 22 థర్డ్ పార్టీ పేమెంట్ యాప్‌లు యూపీఐ సర్వీసులు అందిస్తున్నాయి.#Paytm is India’s favourite payment app! 🚀 Now, better with power of 4 banks Get assured Rs 100 cashback on UPI payments using Paytm app. Download now: https://t.co/750WzmXs4E #PaytmKaro @YESBANK @AxisBank @HDFC_Bank @TheOfficialSBI pic.twitter.com/5MpOIj8owT— Paytm (@Paytm) May 3, 2024 -
తగ్గిన యూపీఐ చెల్లింపులు.. ఎంతంటే..
యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ లావాదేవీలు 2024 మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో తగ్గాయి. మొత్తం యూపీఐ లావాదేవీల సంఖ్యలో నెలవారీగా 1 శాతం, మొత్తం విలువలో 0.7 శాతం తగ్గినట్లు ఎన్పీసీఐ వెల్లడించింది.మార్చిలో రూ.19.78 ట్రిలియన్లుగా నమోదైన యూపీఐ ట్రాన్సాక్షన్ల విలువ ఏప్రిల్‌లో రూ.19.64 ట్రిలియన్లకు చేరింది. మార్చిలో మొత్తం 13.44 బిలియన్ల సంఖ్యలో జరిగిన లావాదేవీలు ఏప్రిల్‌లో 13.3 బిలియన్లకు తగ్గింది. తక్షణ చెల్లింపు సేవ (ఐఎంపీఎస్) లావాదేవీలు మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో 7 శాతం(రూ.6.35 ట్రిలియన్ల నుంచి రూ.5.92 ట్రిలియన్లు), విలువలో 5 శాతం(581 మిలియన్ల నుంచి 550 మిలియన్లు) తగ్గాయి. ఏప్రిల్‌లో ఫాస్ట్‌ట్యాగ్ లావాదేవీలు విలువలో 3 శాతం (మార్చిలో రూ.5,939 కోట్ల నుంచి ఏప్రిల్‌లో రూ.5,592 కోట్లు) తగ్గాయి. వాల్యూమ్‌లో 6 శాతం.. మార్చిలో 339 మిలియన్లతో పోలిస్తే ఏప్రిల్‌లో 328 మిలియన్లకు తగ్గాయి.ఇదీ చదవండి: దిగ్గజ కంపెనీల మధ్య రూ.1.66లక్షల కోట్ల ఒప్పందం.. ఎందుకంటే..యూపీఐ చెల్లింపుల వాల్యూమ్‌లు, విలువలు నెలవారీగా తగ్గినా ఏడాది ప్రాతిపదికన మాత్రం ఘననీయంగా పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. వాల్యూమ్ పరంగా 50 శాతం, విలువలో 40 శాతం పెరిగాయి. -
ఎన్పీసీఐ సమావేశం..గూగుల్‌పే, ఫోన్‌పేకు లేని ఆహ్వానం!
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఆధ్వర్యంలోని యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ఇటీవల నిర్వహించిన ఓ సమావేశానికి యూపీఐ థర్డ్‌పార్టీ చెల్లింపు యాప్‌లైన గూగుల్‌పే, ఫేన్‌పేను ఆహ్వానించలేదు. క్రెడ్, స్లైస్, ఫ్యామ్‌పే, జొమాటో, గ్రో, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థల యాజమాన్యాలకు ఆహ్వానం అందింది. ఈమేరకు వివరాలు ఉటంకిస్తూ టైక్స్‌ఆఫ్‌ఇండియాలో కథనం వెలువడింది. ఎన్పీసీఐ ఏర్పాటు చేసిన సమావేశంలో భాగంగా యూపీఐ చెల్లింపుల వ్యవస్థలో కొత్త సంస్థలకు ప్రోత్సాహం అందించేలా చర్చలు జరిగినట్లు తెలిసింది. పైన తెలిపిన కంపెనీలు తమ వినియోగదారులను పెంచుకుని ఇంటర్నల్ యూపీఐ సర్వీస్‌లను అందించేలా చూడాలని ఎన్పీసీఐ చెప్పింది. అయితే సమావేశానికి గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం వంటి ప్రధాన యూపీఐ చెల్లింపు యాప్ యాజమాన్యాలకు ఆహ్వానం అందలేదు. ఈ మూడు కంపెనీల యూపీఐ లావాదేవీల పరిమాణం ఇప్పటికే 90 శాతానికి చేరినట్లు తెలిసింది. దాంతో వీటిని సమావేశానికి ఆహ్వానించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కార్యక్రమం ప్రధానంగా కొత్తగా యూపీఐ చెల్లింపుల రంగంలోకి అడుగుపెడుతున్న కంపెనీలు, స్టార్టప్‌లకు ప్రోత్సాహం అందించడానికి ఏర్పాటు చేయబడినట్లు తెలిసింది. ఆయా కంపెనీల అవసరాలు ఏమిటో తెలుసుకుని వాటిని పరిష్కరించేలా చర్చలు జరిగినట్లు సమాచారం. సమావేశంలో భాగంగా కొత్త సంస్థలు రూపేకార్డుల కోసం ప్రభుత్వం అందిస్తున్న జీరో మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్) వంటి సౌకర్యాన్ని తమకు కల్పించాలని ఎన్పీసీఐను కోరినట్లు తెలిసింది. ఇతర కార్డ్‌లతో పోల్చితే రూపేకార్డు చెల్లింపులను అంగీకరించే వ్యాపారులకు ప్రయోజనాలు అధికంగా ఉంటున్నాయి. చిన్న సంస్థలు యూపీఐ చెల్లింపుల రంగంలోకి రావాలంటే ప్రత్యేకంగా కొన్ని ప్రోత్సాహకాలు కల్పించాలని కోరినట్లు తెలిసింది. రెండు సంస్థలదే గుత్తాధిపత్యం.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు సంబంధించి అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇటీవల ఫోన్‌పే, గూగుల్పేలకు ఆదరణ పెరిగింది. యూపీఐ చెల్లింపుల్లో 2 సంస్థలదే ఆధిపత్యం కావడంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ విభాగంలో గుత్తాధిపత్యం లభించకుండా చూసేందుకు ఫోన్‌పే, గూగుల్‌పే సంస్థలకు ప్రత్యామ్నాయంగా దేశీయ ఫిన్‌టెక్ సంస్థల వృద్ధికి సహకరించాలని ప్రభుత్వానికి పార్లమెంటరీ కమిటీ సూచించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: ఏడాదిలోపు ప్రముఖ యాప్‌లో 100 కోట్ల యూజర్లు యూపీఐ విభాగంలో కంపెనీలకు 30% మార్కెట్ వాటా పరిమితి నిబంధన గడువును 2024 డిసెంబరు వరకు పొడిగించాలని ఎన్పీసీఐ అంటోంది. సాంకేతిక పరిమితుల రీత్యా ఇది సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది. -
క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? కొత్త ఫీచర్లు మీ కోసమే..
రూపే క్రెడిట్ కార్డు వినియోగదారులకు కొన్ని కొత్త ఫీచర్లు రాబోతున్నాయి. ఈమేరకు యూపీఐ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించి వీటిని త్వరలో అమలు చేయబోతున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ప్రకటించింది. రూపే క్రిడిట్ కార్డును వినియోగించి యూపీఐ లావాదేవీలు జురుపుతుంటారు. అయితే సంబంధిత యూపీఐ యాప్‌లోనే ఆ మొత్తాన్ని ఈఎంఐగా మార్చుకునే సదుపాయం కల్పిస్తున్నారు. క్రెడిట్ అకౌంట్ బిల్ పేమెంట్, ఇన్స్టాల్మెంట్ పేమెంట్ ఆప్షన్, లిమిట్ మేనేజ్మెంట్ వంటి ఫీచర్లను సైతం అందుబాటులోకి తీసుకురానున్నారు. రూపే కార్డు అందిస్తున్న బ్యాంకులు లేదా ఇతర సంస్థలు మే 31 కల్లా ఈ ఫీచర్లను అమలులోకి తీసుకురావాలని ఎన్పీసీఐ తెలిపింది. ఇప్పటికే రూపే క్రెడిట్ కార్డులను యూపీఐ లావాదేవీల కోసం అనుసంధానం చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ఫోన్‌పే, గూగుల్ పే వంటి యూపీఐ యాప్స్‌తో కార్డులను లింక్ చేసుకోవచ్చు. ఎన్పీసీఐ తాజా నిర్ణయం వల్ల ఇకపై రూపే క్రెడిట్ కార్డుల వినియోగం మరింత సులభతరం కానుంది. లింక్ చేసిన యూపీఐ యాప్‌లోనే లావాదేవీలను ఈఎంఐగా మార్చుకోవచ్చు. చెల్లింపులు చేసే సమయంలోనే ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులోకి రానుంది. ఈఎంఐ రేట్లకు సంబంధించిన జాబితా కూడా అక్కడే కనిపిస్తుంది. ఇదీ చదవండి: త్వరలో ఆర్బీఐ కొత్త మొబైల్ యాప్.. ఎందుకంటే.. క్రెడిట్ అకౌంట్ బిల్‌పేమెంట్, ఇన్స్టాల్మెంట్ పేమెంట్ ఫీచర్ ద్వారా యూపీఐ యాప్‌లోనే కార్డు బిల్లు చెల్లించొచ్చు. కావాలనుకుంటే ఆటో పే ఆప్షన్ కూడా వినియోగించుకోవచ్చు. ఎప్పుడైనా అవసరం అయితే క్రెడిట్ లిమిట్ పెంచమని బ్యాంక్‌ను నేరుగా యూపీఐ యాప్ ద్వారానే కోరే వెసులుబాటు ఉండనుంది. క్రెడిట్ కార్డు ఔట్ స్టాండింగ్ బిల్, మినమిమ్ బిల్, టోటల్ అమౌంట్, బిల్ డేట్ వంటివి యూపీఐ యాప్‌లోనే తెలుసుకోవచ్చు. -
పేటీఎంకు భారీ ఊరట.. ఇకపై యథావిధిగా ప్రముఖ సేవలు.. కానీ..
పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్‌కు భారీ ఊరట లభించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ (టీపీఏపీ) లైసెన్స్‌ను ఇటీవల మంజూరు చేసింది. దీని ప్రకారం మల్టీ బ్యాంక్ మోడల్ కింద ఇకపై పేటీఎం బ్రాండ్‌పైనా యూపీఐ సేవలందిస్తుంది. లైనెన్స్‌లో వివరాల ప్రకారం..బ్యాంకింగ్ సేవలిందిస్తున్న యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యస్ బ్యాంక్‌లు ఇకపై పేటీఎంకు పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్ బ్యాంక్స్‌గా వ్యవహరిస్తాయి. ప్రస్తుతం ఉన్న మర్చంట్స్‌కు, కొత్త మర్చంట్స్‌కు యస్ బ్యాంక్ ఇకపై సేవలందిస్తుంది. అంటే @paytm యూపీఐ హ్యాండిల్ కలిగిన మర్చంట్ పేమెంట్స్ ఇకపై యస్ బ్యాంక్‌కు రీడైరెక్ట్ అవుతాయి. ఇదీ చదవండి: పెళ్లి ఖర్చు తగ్గడానికి బెస్ట్ ప్లాన్..! చాలా డబ్బు ఆదా.. ప్రస్తుతం ఉన్న యూజర్లు, మర్చంట్లు తమ యూపీఐ లావాదేవీలు, ఆటో పే మ్యాండెట్లను ఎలాంటి అవాంతరం లేకుండా వినియోగించుకోవడానికి ఈ నిర్ణయం వీలు పడుతుందని ఎన్పీసీఐ తెలిపింది. పేటీఎం కూడా కొత్త పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ బ్యాంకులకు తమ హ్యాండిళ్లను మైగ్రేట్ చేయాలని సూచించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులు, మర్చంట్స్ మార్చి 15లోగా తమ అకౌంట్లను వేరే బ్యాంకులకు మార్చుకోవాలని ఆర్బీఐ సూచించిన నేపథ్యంలో ఎన్పీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. -
నేపాల్‌లోని భారతీయుల కోసం ప్రముఖ సేవలు ప్రారంభం
నేపాల్‌లో భారత్‌కు చెందిన యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సేవలు అందుబాటులోకి వచ్చినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తాజాగా ప్రకటించింది. నేపాల్ వ్యాపారుల వద్ద ఇకపై క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసి యూపీఐ వినియోగదారులు చెల్లింపులు చేయొచ్చని తెలిపింది. గతేడాది సెప్టెంబరులో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ పేమెంట్స్ (ఎన్ఐపీఎల్), నేపాల్ అతిపెద్ద చెల్లింపు నెట్వర్క్ ఫోన్‌పే పేమెంట్ సర్వీస్‌ల మధ్య భాగస్వామ్యం కుదరగా, తాజాగా ఈ సేవలు ప్రారంభమయ్యాయి. మొదటి దశలో యూపీఐ ఆధారిత యాప్‌ల ద్వారా భారత వినియోగదారులు నేపాల్‌లోని వ్యాపార కేంద్రాల వద్ద యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చు. ఫోన్‌పే నెట్‌వర్క్‌పైన ఉన్న వ్యాపారులకు భారత వినియోగదారులు యూపీఐ ద్వారా చెల్లించొచ్చు. ఇదీ చదవండి: ఐటీ పరిశ్రమకు భారీ షాక్.. ‘70 శాతం ఉద్యోగాలు పోనున్నాయ్’ ఇరు దేశాల పౌరుల మధ్య లావాదేవీల్లో ఈ సేవలు విప్లవాత్మక మార్పులు తెస్తాయని ఎన్ఐపీఎల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రితేశ్ శుక్లా పేర్కొన్నారు. తాజా నిర్ణయంతో రెండు దేశాల సంబంధాలు మరింత బలపడతాయని, డిజిటల్ చెల్లింపుల్లో మార్పునకు కట్టుబడి ఉన్నామని అన్నారు. భారత్, నేపాల్ మధ్య ఆర్థిక సంబంధాలు, వాణిజ్య, పర్యాటకం గణనీయంగా మెరుగుపడటానికి యూపీఐ సేవలు ఉపకరిస్తాయని ఫోన్‌పే చీఫ్ ఎగ్జిక్యూటివ్ దివాస్ కుమార్ వెల్లడించారు. -
పేటీఎం, ఫాస్టాగ్‌పై ఆందోళనలు.. ఆర్బీఐ మరో కీలక నిర్ణయం!
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం సంక్షోభం నుంచి వినియోగదారులను సురక్షితంగా ఉంచేందుకు ఆర్బీఐ సిద్ధమైంది. ఇందులో భాగంగా వచ్చే వారం నేషనల్ హైవే అథారిటీ (ఎన్హెచ్ఏఐ), కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ప్రతినిధులతో భేటీ కానుంది. ఈ సమావేశంలో పేటీఎంపై విధించిన ఆంక్షల నేపథ్యంలో ఆ సంస్థ యూజర్ల భద్రతపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ భేటీలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్(యూపీఐ) ద్వారా ఫాస్టాగ్ వ్యవస్థని నిర్వహిస్తున్న నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ)తో పాటు ఇతర వాటాదారులు ఆర్బీఐ అధ్యక్షతన జరిగే సమావేశానికి హాజరుకానున్నారు. పేటీఎంపై ఆర్బీఐ గత వారం ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలపై పేటీఎం యూజర్లు ఫాస్టాగ్ గురించి, ఇతర చెల్లింపులు గురించి ఆర్బీఐని ప్రశ్నించారు. ఆ ప్రశ్నలన్నింటికి ఆర్బీఐ వచ్చే వారం ఎన్హెచ్ఏఐ, ఎన్సీపీఐతో భేటీ అనంతరం వివరణ ఇవ్వనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. టోల్ చెల్లింపుల కోసం ఫాస్టాగ్ మన దేశంలోని టోల్ వసూళ్ల కోసం కేంద్రం ఎలక్ట్రానిక్ పద్దతిలో ఫాస్టాగ్ వ్యవస్థని అందుబాటులోకి తెచ్చింది. దీన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ ఏ ఐ) నిర్వహిస్తోంది. ఫాస్టాగ్లోని రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ద్వారా ఫాస్టాగ్‌కు అనుసంధానం చేసిన ప్రీ ప్రెయిడ్ లేదా సేవింగ్ ఖాతా నుంచి నేరుగా టోల్ చెల్లింపులకు అవకాశం కల్పిస్తుంది. ఈ ఫాస్టాగ్ చెల్లింపులు పేటీఎం ద్వారా జరుగుతున్నాయి. కానీ సెంట్రల్ బ్యాంక్ పేటీఎంపై ఆంక్షలు విధించడంతో ఇప్పుడు ఫాస్టాగ్ యూజర్లు.. టోల్ చెల్లింపులపై ప్రత్యామ్నాయ మార్గాల్ని అందుబాటులోకి తీసుకుని రావాలని కోరుతున్నారు.