న్యూఢిల్లీ: రూపే డెబిట్ కార్డులకు అంతర్జాతీయంగా ఆమోదయోగ్యతను మరింతగా పెంచడంపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్‌పీసీఐ) దృష్టి పెడుతోంది. వీసా, మాస్టర్ కార్డ్‌లను ఉపయోగించే వారితో సమానంగా రూపే కార్డుదారులకు కూడా ప్రయోజనాలు ఉండేలా చూసేందుకు ఎన్‌పీసీఐ ప్రయత్నిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా మరిన్ని అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడంపై కసరత్తు చేస్తున్నట్లు వివరించాయి. (స్వీట్ కపుల్ సక్సెస్ స్టోరీ: తొలి ఏడాదిలోనే రూ.38 కోట్లు)
ప్రస్తుతం అమెరికాకు చెందిన డిస్కవర్, డైనర్స్ క్లబ్.. జపాన్‌కు చెందిన జేసీబీ, పల్స్.. చైనాకు చెందిన యూనియన్ పే సంస్థలకు సంబంధించిన పాయింట్స్ ఆఫ్ సేల్ (పీవోఎస్) మెషిన్ల ద్వారా రూపే కార్డులతో లావాదేవీలు నిర్వహించ డానికి వీలుంటోంది. రూపే జేసీబీ గ్లోబల్ కార్డును జేసీబీ కార్డు చెల్లుబాటయ్యే ఇతర దేశాల్లోని పీవోఎస్‌లు, ఏటీఎంలలోనూ ఉపయోగించవచ్చు. రూపే డెబిట్ కార్డులు, చిన్న మొత్తాల్లో లావాదేవీలకు ఉపయోగపడే ఏకీకృత చెల్లింపుల విధానం.. భీమ్-యూపీఐని ప్రోత్సహించేందుకు కేంద్రం రూ. 2,600 కోట్లతో ప్రత్యేక స్కీమును ఈ మధ్యే ఆమోదించింది. (కేంద్రం గుడ్ న్యూస్: మొబైల్ పోతే..మే 17 నుంచి కొత్త విధానం)
Comments
Please login to add a commentAdd a comment