goverment
-
చార్ధామ్ యాత్ర.. ముగింపు తేదీలివే
డెహ్రాడూన్: దేవభూమి ఉత్తరాఖండ్‌లో చార్ధామ్ యాత్ర కొనసాగుతోంది. తాజాగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం నాలుగు ధామ్‌ల మూసివేత తేదీలను ప్రకటించింది. ఉత్తరాఖండ్ టూరిజం మంత్రి సత్పాల్ మహరాజ్ తెలిపిన వివరాల ప్రకారం నవంబర్‌లో చార్ధామ్ తలుపులు మూసివేయనున్నారు.సత్పాల్ మహరాజ్ మీడియాతో మాట్లాడుతూ నవంబర్ ఒకటిన గంగోత్రి ధామ్ తలుపులు మూసేస్తామని, యమునోత్రి ధామ్, కేదార్నాథ్ ధామ్ తలుపులు నవంబర్ మూడున మూసివేయనున్నామన్నారు. అలాగే తుంగనాథ్ ధామ్ తలుపులు నవంబర్ నాలుగున మూసివేయనున్నామని, నవంబర్ 17న బద్రీనాథ్ ధామ్ తలుపులు మూసివేయనున్నామన్నారు. ఈ నాలుగు ధామాలను సందర్శించాలనుకునే భక్తులు ఈ తేదీలలోపునే రావాలని సత్పాల్ మహరాజ్ కోరారు.ఈ ఏడాది మే 10 నుంచి చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది. అయితే ఇటీవల కేదార్నాథ్, బద్రీనాథ్‌లకు వెళ్లే మార్గాల్లో వర్షం విధ్వంసం సృష్టించింది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. చార్ధామ్ యాత్ర ప్రతి సంవత్సరం ఏప్రిల్-మేలో ప్రారంభమవుతుంది. ఇది అక్టోబర్-నవంబర్ వరకు కొనసాగుతుంది. చార్ధామ్ యాత్రకు వెళ్లాలంటే బయోమెట్రిక్ నమోదు తప్పనిసరి.ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు చార్ధామ్ దర్శనానికి 37 లక్షల 91 వేల 205 మంది యాత్రికులు రాగా, గత ఏడాది 56.13 లక్షల మంది యాత్రికులు దర్శనానికి వచ్చారు. ఈ సంఖ్య 2022లో 46.29 లక్షలు కాగా 2019లో 34.77 లక్షలు. 2020, 2021లలో కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా చార్ధామ్ యాత్ర అంతంత మాత్రంగానే సాగింది. ఇది కూడా చదవండి: పుష్కర కాలానికి పూచే నీలకురంజి పుష్పం..! -
ప్రభుత్వ లిక్కర్ కిక్కెక్కట్లేదు : మంత్రి కామెంట్స్
చెన్నై: ప్రభుత్వ మద్యం దుకాణాల్లో(టాస్మాక్షాపులు) దొరికే లిక్కర్‌తో కిక్కు సరిపోక ప్రజలు సారా(అరకు) తాగుతున్నారని తమిళనాడు మంత్రి దురైమురుగన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తమిళనాడు అసెంబ్లీలో ఎక్సైజ్, ప్రొహిబిషన్ చట్టాన్ని బలోపేతం చేస్తూ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా దురైమురుగన్ మాట్లాడారు. టాస్మాక్ మద్యం దుకాణాల్లో దొరకే మందు కొందరికి సాఫ్ట్ డ్రింక్‌లా అనిపిస్తోందన్నారు. తమిళనాడులో పూర్తిగా మద్యాన్ని నిషేధించడం కుదరదని స్పష్టం చేశారు. పొరుగు స్టేట్స్లో మద్యం దొరుకుతున్నపుడు తమిళనాడులో పూర్తి మద్య నిషేధం అమలు చేయడం సాధ్యం కాదన్నారు.రోజంతా కష్టపడి పనిచేసుకునేవాళ్లు అలసట మరిచిపోయి నిద్రపోవాలంటే మద్యం అవసరమన్నారు. కాగా, దురైమురుగన్ వ్యాఖ్యలపై అన్నాడీఎంకే ఆగ్రహం వ్యక్తం చేసింది. డీఎంకే ప్రభుత్వ అసమర్థత వల్లే ఇటీవల కల్లకురిచిలో కల్తీసారా తాగి చాలా మంది మరణించారని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి కోవై సత్యన్ మండిపడ్డారు. -
బాబు కాదన్నారు.. జగనన్న జాలి చూపారు
సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ: వేలి ముద్రలు పడటం లేదనే సాకుతో గత ప్రభుత్వ హయాంలో నిలిపి వేసిన పింఛను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక ఇంటికే వచ్చి అందిస్తున్నారని దివ్యాంగుడి తండ్రి ఆనందం వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా పెనమలూరు మండలం పెదపులిపాక పంచాయతీ గణపతి నగర్‌కు చెందిన వీరిశెట్టి ఫణిబాబు, లక్ష్మీప్రసన్నలకు 15 ఏళ్ల కుమారుడు లక్ష్మణ్ ఉన్నాడు. దివ్యాంగుడైన లక్ష్మణ్‌కు వేలి ముద్రలు పడటం లేదనే సాకుతో మంజూరైన పింఛను కూడా గత ప్రభుత్వ హయాంలో రద్దు చేశారు. తిరిగి కరోనా సమయం 2020 సంవత్సరంలో పింఛను కోసం దరఖాస్తు చేయగా జగనన్న ప్రభుత్వం మంజూరు చేసిందని అప్పటి నుంచి క్రమం తప్పకుండా నెలనెలా ఇంటికే వచ్చి తమ బిడ్డకు వికలాంగుల పింఛను అందిస్తున్నారని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక సచివాలయం పరిధిలోని వలంటీర్ ప్రతాప్ లబ్ధిదారు లక్ష్మణ్‌కు పింఛను నగదు అందిస్తున్న సందర్భం ఇది. -
China Pak cpec Corridor: నాడు దోస్తీ కోసం.. నేడు ఉద్రిక్తతలకు నిలయం
చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సీపెక్) 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2013లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు మాత్రమే కాకుండా, చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ)కి కూడా ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ఈ ప్రాజెక్ట్ కింద చైనా.. పాకిస్తాన్లో పది బిలియన్ల డాలర్లను పెట్టుబడి పెట్టింది. దీనిలో భాగంగా భారీ రవాణా, ఇంధనం, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను అమలు చేసింది. మిశ్రమ ఫలితాలు రాజకీయ తిరుగుబాట్లు, ఉగ్రవాద దాడుల భయం సీపెక్‌కు ఎల్లప్పుడూ సవాలుగా నిలిచింది. ఈ దశాబ్దంలో సీపెక్ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చైనా ప్రాథమిక లక్ష్యం అరేబియా సముద్రానికి ప్రత్యక్ష అనుసంధానం. ఇది ఇప్పటికీ పూర్తి స్థాయిలో నెరవేరలేదు. అయితే కారిడార్ కారణంగా పాకిస్తాన్ తన స్వల్పకాలిక లక్ష్యాలను చేరుకోవడంలో గణనీయమైన పురోగతిని సాధించింది. పాక్‌కు చైనా ఉపశమనం ఇటీవలి కాలంలో పాకిస్తాన్‌కు అత్యంత విశ్వసనీయ విదేశీ భాగస్వాములలో చైనా ఒకటిగా నిలిచింది. ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న పాకిస్తాన్‌కు చైనా ఎంతగానో సహాయం చేసింది. తాజాగా పాకిస్తాన్‌కు చైనా $ 2.4 బిలియన్ల రుణాన్ని అందించింది. ఇది దివాలా అంచున ఉన్న పాకిస్తాన్‌కు పెద్ద ఉపశమనంలా మారింది. గత ఏడాది ఐఎంఎఫ్ అందించిన నివేదిక ప్రకారం పాకిస్తాన్‌కు ఉన్న మొత్తం అప్పులో 30 శాతం చైనా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల నుండి వచ్చింది. పాక్-చైనాల బంధం ఇలా.. భారత పొరుగుదేశాలైన పాక్- చైనాలు 596 కిలో మీటర్ల పొడవైన సరిహద్దును పంచుకుంటాయి. ఇది సియాచిన్ నుండి కారాకోరం వరకు విస్తరించి ఉంది. పాకిస్తాన్ రాజకీయ నేతలు చైనాతో తమ సంబంధాలను ప్రస్తావించినప్పుడు అవి హిమాలయాల కంటే ఎత్తుగా, సముద్రం కంటే లోతుగా, తేనె కంటే తియ్యగా' ఉండాలని అభివర్ణిస్తారు. అయితే సీపెక్ కొన్నేళ్లుగా ఉద్రిక్తతలకు నిలయంగా ఉంది. సీపెక్ మార్గంలో చైనా నేరుగా హిందూ మహాసముద్రం వరకూ చేరుకుంటుంది. పాక్ ప్రజల నిరసన అయితే సీపెక్‌లో పనిచేస్తున్న పౌరుల భద్రత ఇరు దేశాలకు పెద్ద సమస్యగా మారింది. ప్రాజెక్ట్ చుట్టూ తీవ్రవాద దాడులు జరిగాయి. వీటిలో పెద్ద సంఖ్యలో చైనా పౌరులు కూడా మరణించారు. తాజాగా సీపెక్ పరిధిలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 44 మంది ప్రాణాలు కోల్పోయారు. సీపెక్ కారిడార్ చైనాకు పశ్చిమ ప్రాంతంలోని జిన్జియాంగ్ను పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లోగల గ్వాదర్ ఓడరేవుకు కలుపుతుంది. కాగా ఈ ప్రాజెక్టుల వల్ల తమకు ప్రయోజనం కలగడం లేదని వాయువ్య పాకిస్తాన్‌లోని ప్రజలు నిరసరన వ్యక్తం చేస్తున్నారు. చైనా ప్రయోజనాలను కాపాడేందుకు తమపై వేలాది మంది పాక్ సైనికులను మోహరించినట్లు బలూచ్ వేర్పాటువాదులు ఆరోపిస్తున్నారు. పాక్ వాదనకు చైనా ఖండన 2021లో క్వెట్టాలోని ఒక విలాసవంతమైన హోటల్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఐదుగురు మరణించారు. అలాగే దాసు డ్యామ్ వైపు వెళ్తున్న చైనా ఉద్యోగులతో నిండిన బస్సులో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది చైనీయులతో సహా మొత్తం 12 మంది మరణించారు. గ్యాస్ లీకేజీ వల్లే ఈ పేలుడు సంభవించిందని పాకిస్తాన్ చెబుతున్నప్పటికీ చైనా మాత్రం దీనిని ఉగ్రవాద దాడిగా పరిగణిస్తోంది. ఇది కూడా చదవండి: నాటి షబ్నం.. నేటి మీరా.. కృష్ణ ప్రేమలో మునిగితేలుతున్న లేడీ బౌన్సర్ -
వీసా,మాస్టర్‌కార్డ్‌తో సమానంగా రూపే కార్డు: మోదీ సర్కార్ సరికొత్త ప్లాన్
న్యూఢిల్లీ: రూపే డెబిట్ కార్డులకు అంతర్జాతీయంగా ఆమోదయోగ్యతను మరింతగా పెంచడంపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) దృష్టి పెడుతోంది. వీసా, మాస్టర్ కార్డ్‌లను ఉపయోగించే వారితో సమానంగా రూపే కార్డుదారులకు కూడా ప్రయోజనాలు ఉండేలా చూసేందుకు ఎన్పీసీఐ ప్రయత్నిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా మరిన్ని అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడంపై కసరత్తు చేస్తున్నట్లు వివరించాయి. (స్వీట్ కపుల్ సక్సెస్ స్టోరీ: తొలి ఏడాదిలోనే రూ.38 కోట్లు) ప్రస్తుతం అమెరికాకు చెందిన డిస్కవర్, డైనర్స్ క్లబ్.. జపాన్‌కు చెందిన జేసీబీ, పల్స్.. చైనాకు చెందిన యూనియన్ పే సంస్థలకు సంబంధించిన పాయింట్స్ ఆఫ్ సేల్ (పీవోఎస్) మెషిన్ల ద్వారా రూపే కార్డులతో లావాదేవీలు నిర్వహించ డానికి వీలుంటోంది. రూపే జేసీబీ గ్లోబల్ కార్డును జేసీబీ కార్డు చెల్లుబాటయ్యే ఇతర దేశాల్లోని పీవోఎస్‌లు, ఏటీఎంలలోనూ ఉపయోగించవచ్చు. రూపే డెబిట్ కార్డులు, చిన్న మొత్తాల్లో లావాదేవీలకు ఉపయోగపడే ఏకీకృత చెల్లింపుల విధానం.. భీమ్-యూపీఐని ప్రోత్సహించేందుకు కేంద్రం రూ. 2,600 కోట్లతో ప్రత్యేక స్కీమును ఈ మధ్యే ఆమోదించింది. (కేంద్రం గుడ్ న్యూస్: మొబైల్ పోతే..మే 17 నుంచి కొత్త విధానం) -
Fact Check: కన్యా సుమంగళ యోజన, అమ్మాయిలకు నెలకు రూ.4500?
సాక్షి,ముంబై: కేంద్ర ప్రభుత్వ పథకాలు, లబ్దిదారులకు ప్రయోజనాలు అంటూ పలు పోస్ట్‌లు సోషల్ మీడియాలో వైరల్ కావడం కామన్‌గా మారి పోయింది. నిజా నిజాలతో సంబంధం లేకుండా యూజర్లు వీటిని షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా అలాంటి పోస్ట్ ఒకటి హల్చల్ చేస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కొత్త పథకం ‘కన్యా సుమంగళ యోజన’ కింద ఆడబిడ్డలున్న కుటుంబాలకు నెలకు రూ.4,500 అందజేస్తుందనే న్యూస్ ఒకటి వైరల్‌గా మారింది. (లగ్జరీ డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్ కొనుగోలు చేసిన సమంత! ధర ఎంతంటే?) కన్యా సుమంగళ యోజన కింద కుటుంబంలో కుమార్తె ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం నెలకు రూ.4,500 స్టైఫండ్‌ను అందజేస్తోందని సర్కారీ వ్లాగ్ అనే యూట్యూబ్ ఛానెల్ వీడియో అప్లోడ్ చేసింది. దీనిపై స్పందించిన పీఐబీ ఫాక్ట్ చెక్ టీమ్ అసలు విషయాన్ని ప్రకటించింది. ఇది నకిలీ వార్త అని కొట్టిపారేసింది. కేంద్ర ప్రభుత్వం అలాంటి పథకం దేన్ని అమలు చేయడం లేదని స్పష్టం చేసింది. ఇలాంటి వదంతులను నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ టీం తన అధికారిక ఖాతాలో ట్వీట్ చేసింది. కాగా ప్రధానమంత్రి కన్యా సుమంగళ యోజన అనేది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం. రాష్ట్రంలోని బాలికల విద్య, ఆరోగ్య సంరక్షణ కోసం కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ పథకం 25 అక్టోబర్ 2019న లక్నోలో ప్రారంభించింది. 'Sarkari Vlog' नामक यूट्यूब चैनल के एक वीडियो में दावा किया गया है कि जिनके परिवार में बेटियां हैं उन्हें 'कन्या सुमंगला योजना' के तहत केंद्र सरकार हर महीने ₹4,500 दे रही है #PIBFactCheck ➡️ यह दावा फर्जी है ➡️ केंद्र सरकार द्वारा ऐसी कोई योजना नहीं चलाई जा रही है | pic.twitter.com/D724QS7byI — PIB Fact Check (@PIBFactCheck) May 2, 2023 -
ఎల్ఐసీ నూతన చైర్మన్‌గా సిద్ధార్థ మొహంతి
సాక్షి, ముంబై: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి) చైర్మన్‌గా సిద్ధార్థ మొహంతిని ప్రభుత్వం నియమించింది. రాయిటర్స్ రిపోర్ట్ ప్రకారం 2024 జూన్ వరకు మొహంతి ఈ పదవిలో కొనసాగుతారు. ఆ తర్వాత జూన్ 7, 2025 వరకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్,మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతారు. ఇప్పటివరకు ఆయన తాత్కాలిక ఛైర్మన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. (ఐటీ కంపెనీ భారీ గిఫ్ట్స్: సంబరాల్లో ఉద్యోగులు) సిద్ధార్థ మొహంతి ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌కి సీఎండీగా ఉన్నారు. అయితే 2021 ఫిబ్రవరిలో ఎల్ఐసీ ఎండీగా నియమితులయ్యారు. ఇక్కడ చేరడానికి ముందు, ఎల్ఐసీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్-లీగల్‌గా ఉన్నారు. 1985లో ఎల్ఐసీ డైరెక్ట్ రిక్రూట్ ఆఫీసర్‌గా తన కెరీర్‌ని ప్రారంభించిన మొహంతి ఆ తరువాత ఉన్నత స్థాయికి ఎదిగారు. మూడు దశాబ్దాల పాటు సాగిన కెరీర్లో, మార్కెటింగ్, హెచ్ఆర్, ఇన్వెస్ట్మెంట్స్, లీగల్ రంగాలలో మొహంతి తనదైన ముద్ర వేశారు. (ఇదీ చదవండి: Amazon layoffs: నంబర్ గేమ్ అంతే..రేపటితో తొమ్మిదేళ్లు..ఇంతలోనే!) మొహంతి రాజనీతి శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్. అలాగే న్యాయశాస్త్రంలో పట్టాతోపాటు, బిజినెస్ మేనేజ్మెంట్లో పీజీ చేశారు. ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి లైసెన్షియేట్ కూడా. మార్చి 11న కేంద్రం మొహంతిని మూడు నెలల పాటు తాత్కాలిక చైర్‌పర్సన్‌గా నియమించింది. మినీ ఐపే ,బి సి పట్నాయక్ సహా ఎల్ఐసీ ముగ్గురు డైరెక్టర్లలో ఒకరైన మొహంతీని చైర్మన్ పదవికి షార్ట్‌లిస్ట్ చేసింది. కంపెనీకి చెందిన నలుగురు మేనేజింగ్ డైరెక్టర్ల నుండి ఛైర్మన్‌ను ఎంపిక చేస్తారు.ఇందులో తుది నిర్ణయం కేంద్రం తీసుకుంటుంది. సాధారణంగా ఎల్ఐసీలో ఒక చైర్పర్సన్ , నలుగురు ఎండీలు ముఖ్య నిర్వాహక సిబ్బందిగా ఉంటారు. (Vanisha Mittal Amit Bhatia Love Story: వనీషా...అమిత్ లవ్ స్టోరీ తెలుసా? ఈ లవ్ బర్డ్స్ పెళ్లి ఒక రికార్డ్ ) -
Factcheck ఈ స్పెషల్ స్కీం కింద ప్రతీ ఆడబిడ్డకూ 1.80 లక్షలు? నిజమా?
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద్ యోజన కింద ప్రభుత్వం ప్రతి ఆడపిల్లకు రూ.1.80 లక్షలు ఇస్తోందంటే ఇటీవల ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో పాటు కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ కూడా ఈ వార్తను హైలైట్ చేశాయి. అయితే ఇందులో నిజం లేదని పీఐబీ తేల్చి చెప్పింది. (ఇంటింటికి వెళ్లి కత్తులమ్మి..ఇపుడు కోట్లు సంపాదిస్తున్న అందాల భామ) వివరాలను పరిశీలిస్తే.. సోషల్ మీడియాలో పుకార్లు,నకిలీ వార్తలకు కొదవే ఉండదు. ఇదిగో తోక ..అంటే అదిగో పులి అంటూ నకిలీ గాళ్లు చెలరేగిపోతారు. తాజాగా అమ్మాయిలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఆడబిడ్డకూ లక్షా, 80వేల రూపాయలు అందిస్తోందని, ఈ మొత్తాన్ని బాలిక తల్లిదండ్రుల ఖాతాలో జమ కానుందంటూ ఒక మెసేజ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీంతో స్పందించిన ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఈ మెసేజ్‌పై నిజనిర్ధారణచేసి ట్విటర్ ద్వారా వివరణ ఇచ్చింది. (మహీంద్రా థార్ లవర్స్‌కు గుడ్‌న్యూస్: కొత్త ఆప్షన్స్‌తో పండగే!) పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఈ వార్త, వీడియో నకిలీవని, దీనికి ఎలాంటి ప్రామాణికత లేదని పీఐబీ అధికారిక ట్విటర్ ఖాతా తేల్చి చెప్పింది. అసలు ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద యోజన అనే పథకాన్ని ప్రభుత్వం అమలు చేయడం లేదని కాబట్టి, ఈ పథకం ద్వారా ఆడపిల్లలకు ఎలాంటి సహకారం అందించే ప్రశ్నే లేదని పేర్కొంది. ఇలాంటి ఫేక్ మెసేజ్‌ల వలలో పడి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించింది. (ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ వచ్చేసింది! భారీ డిస్కౌంట్ కూడా) 'Government Gyan' नामक #YouTube चैनल की एक वीडियो में दावा किया गया है कि केंद्र सरकार 'प्रधानमंत्री कन्या आशीर्वाद योजना' के तहत सभी बेटियों को ₹1,80,000 की नगद राशि दे रही है#PIBFactCheck ✅ यह वीडियो #फ़र्ज़ी है। ✅ केंद्र सरकार द्वारा ऐसी कोई योजना नहीं चलाई जा रही है। pic.twitter.com/y8KRVfxVrF — PIB Fact Check (@PIBFactCheck) March 11, 2023 కాగా ప్రభుత్వ జ్ఞాన్ అనే యూట్యూబ్ చానెల్ ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద్ యోజన కింద ప్రతీ అమ్మాయికి తల్లిదండ్రులకు కేంద్రం రూ.180,000అందజేస్తుందని ఒక వీడియోలో పేర్కొనడం, అది వైరల్ కావడం తెలిసిందే. -
శ్రీలంకలో అఖిపక్ష ప్రభుత్వం ఏర్పాటు....ప్రతిపక్షాలతో మంతనాలు
కొలంబో: శ్రీలంక కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్న తరుణంలో ఆందోళనకారులు ఆయనకు వ్యతిరేకంగా మళ్లీ నిరసనలు చేపట్టిన సంగతి తెలిసందే. ఈ నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం ఎమర్జెన్సీని పొడిగించింది కూడా. ప్రస్తుతం నిరసనలతో అట్టుడుకుపోతున్న శ్రీలంకను సరైన గాడీలో పెట్టేందుకు అధ్యక్షుడు రణీల్ విక్రమసింఘే నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతిపక్షాలతో మంతనాలు జరుపుతుంది. అంతేకాదు ప్రతిపక్షాలతో చర్చలు జరిపి అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు యత్నిస్తోంది. అందులో భాగంగా మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు చెందిన శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ(ఎస్‌ఎల్‌ఎఫ్‌పీ)తో విక్రమసింఘే చర్చలు జరిపారు. కానీ ప్రధాన ప్రతిపక్షం సామగి జన బలవేగయ(ఎస్‌జేబీ) పార్టీ ప్రభుత్వం మద్దతు ఇవ్వనని తేల్చి చెప్పింది. కానీ ఆ పార్టీకి చెందిన కొందరు ఎంపీలు అధికార పక్షంలోకి చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా...ఎంపీ విమల్ వీరవన్స నేతృత్వంలోని నేషనల్ ఫ్రీడమ్ ఫ్రంట్(ఎస్ఎఫ్ఎఫ్) విక్రమసింఘేకు మద్దతు ప్రకటించింది. ఈ మేరకు వీరవన్స మాట్లాడుతూ...మన ముందు రెండే రెండు ఆప్షన్లు ఉన్నాయ్నారు. దేశాన్ని ఆరాచక పరిస్థితి నుంచి బయటపడేసి సరైన దారిలో నడిపించడం లేదా ఏకాభిప్రాయంతో ప్రస్తుతం నెలకొని ఉన్న ఉద్రీక్త పరిస్థితి నుంచి దేశాన్ని రక్షించడం అని అన్నారు. ప్రస్తుత అగాధం నుంచి దేశాన్ని పునరుత్థానం చేయడానికి అధ్యక్షుడు విక్రమసింఘే సరైన చర్యలు తీసుకుంటున్నారని, అందువల్ల గత రాజకీయ విభేదాలు లేదా శత్రుత్వాలకు అతీతంగా వారి నిర్ణయాలకు మద్దతిస్తూ..మార్గనిర్దేశం చేసేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని అన్నారు. (చదవండి: దురాక్రమణే లక్ష్యంగా...కిరాయి సైనికులను దింపిన రష్యా) -
పాక్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం
ఇస్లామాబాద్: దేశంలో పెరుగుతున్న ధరలను నియంత్రించలేకపోయిందంటూ పాకిస్తాన్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మంగళవారం అసమ్మతి తీర్మానం ప్రవేశపెట్టాయి. పీఎంఎల్– నవాజ్, పీపీపీ పార్టీలకు చెందిన 100మంది సభ్యులు అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేశారు. ఈ తీర్మానాన్ని జాతీయ అసెంబ్లీ సెక్రటేరియట్‌కు సమర్పించినట్లు పీఎంఎల్ఎన్ ప్రతినిధి ఔరంగజేబు తెలిపారు. పాక్ ప్రజల కోసమే ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నామని పార్టీ అధినేత షెబాజ్ షరీఫ్ చెప్పారు. ప్రభుత్వం పడిపోయిన తర్వాత తమలో ఎవరు పదవిని అధిరోహించాలనే విషయంపై చర్చలు జరుపుతామన్నారు. నిబంధనల ప్రకారం అవిశ్వాస తీర్మానానికి కనీసం 68 మంది మద్దతుండాలి. సరిపడ సభ్యుల మద్దతులో లేఖ అందితే 3– 7 రోజుల్లో స్పీకర్ సభను సమావేశపరిచి తీర్మానంపై ఓటింగ్ నిర్వహిస్తారు. ప్రస్తుతం సభలో సభ్యుల సంఖ్య 342 కాగా, తీర్మానం నెగ్గేందుకు 172మంది సభ్యుల మద్దతు అవసరం. ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇమ్రాన్ సొంత పార్టీ టీఐఐకి 155మంది సభ్యులుండగా మరో ఆరు చిన్నపార్టీలు, ఒక స్వతంత్రుడు మద్దతిస్తున్నారు. ప్రతిపక్షాలన్నింటికీ కలిపి 163 మంది సభ్యులున్నారు. అధికార కూటమి నుంచి 28మందికి పైగా సభ్యులు తమకు మద్దతిస్తారని ప్రతిపక్ష నేతలు తెలిపారు. ఇమ్రాన్‌కు పాక్ ఆర్మీ మద్దతున్న నేపథ్యంలో తీర్మానం నెగ్గడం అంత సులభం కాదని నిపుణుల అంచనా. పాక్‌లో ఆర్మీ ప్రభావం ప్రభుత్వాలపై అధికం. తన ప్రభుత్వం పడిపోదని తాజాగా ఇమ్రాన్ ధీమా వ్యక్తం చేశారు. (చదవండి: మా దేశం ఇక నాటో సభ్యత్వం గురించి ఆశించదు) -
కృష్ణా, గోదావరి బోర్డుల దూకుడు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి బోర్డులు గెజిట్ నోటిఫికేషన్ అమలు విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. గత నెల 29న సమన్వయ కమిటీని ఏర్పాటు చేసిన గోదావరి బోర్డు కమిటీ భేటీని మంగళవారం నిర్వహించనున్నట్లు 30న రెండు తెలుగు రాష్ట్రాలకు లేఖ రాసింది. అయితే దీనిపై సోమవారం తెలంగాణ ప్రభుత్వం స్పందిస్తూ ప్రాజెక్టులను గోదావరి బోర్డు పరిధిలోకి తీసుకెళ్తే రాష్ట్రాలకు తీవ్ర దుష్పరిణామాలు ఉంటాయని, అందుకే వీటిని పూర్తిస్థాయి బోర్డు భేటీలో చర్చించాల్సి ఉందని పేర్కొంది. బోర్డు భేటీలో అభిప్రాయాలు, మార్గదర్శకాలు తెలుసుకోకుండా నేరుగా సమన్వయ కమిటీ భేటీలో గెజిట్‌పై చర్చించడం సాధ్యం కాదని తెలిపింది. అయితే దీనిపై గోదావరి బోర్డు వెంటనే స్పందించి గత నెల 28న కేంద్ర జల శక్తి శాఖ జాయింట్ సెక్రటరీ సంజయ్ అవస్థీ రాసిన లేఖను ప్రస్తావిస్తూ తెలంగాణకు లేఖ రాసింది. ‘గెజిట్ నోటిఫికేషన్ అమలుకు ఒక నిర్ధిష్ట సమయాన్ని పేర్కొన్నాం. దీనికి అనుగుణంగా అవసరమైన సమగ్ర కార్యాచరణ ప్రణాళిక, తగిన సమాచారం ఆగస్టు 2లోగా మాకు ఇవ్వాలి’ అని కేంద్రం రాసిన లేఖను బోర్డు తన లేఖలో ప్రస్తావించింది. ఈ నేపథ్యంలోనే సమన్వయ కమిటీ భేటీని అత్యవసరంగా నిర్వహిస్తున్నామని వెల్లడించింది. కృష్ణా బోర్డు సైతం... గోదావరి బోర్డు మాదిరిగానే కృష్ణా బోర్డు సైతం 12 మంది సభ్యులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తూ సోమవారమే లేఖ రాసింది. ఆ వెంటనే గోదావరి బోర్డు కమిటీతోపాటే ఉమ్మడి కృష్ణా బోర్డు ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ భేటీ ఉంటుందని సాయంత్రానికి మరో లేఖ రాసింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం పదకొండున్నర గంటలకు హైదరాబాద్ జలసౌధలో ఉమ్మడి భేటీ జరగనుంది. అనుమతుల్లేని ప్రాజెక్టులు, బోర్డులకు ఇవ్వాల్సిన నిధులు, సీఐఎస్ఎఫ్ భద్రత, విద్యుదుత్పత్తి విషయమై గెజిట్‌లో పేర్కొన్నట్లుగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. అయితే భేటీకి తెలంగాణ ఇంజనీర్లు హాజరవుతారా? అన్నది మంగళవారం ఉదయానికే స్పష్టత రానుంది. ఏపీ ఇంజనీర్లు మాత్రం హాజరవుతారని చెబుతున్నారు. -
వీఐలో వాటా అప్పగించేందుకు రెడీ
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ మొబైల్ టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా(వీఐ) లిమిటెడ్‌లో తమకున్న వాటాను ప్రభుత్వం లేదా ఏ ఇతర సంస్థకైనా అప్పగించేందుకు సంసిద్ధమంటూ కేఎం బిర్లా తాజాగా స్పష్టం చేశారు. కంపెనీ కొనసాగింపునకు వీలుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మేలు చేయగలదని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఈ అంశాలను ప్రస్తావిస్తూ జూన్ 7న కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గాబాకు బిర్లా లేఖ రాశారు. వీఐఎల్‌లో బిర్లాకు 27 శాతం వాటా ఉంది. అధికారిక సమాచారం ప్రకారం వీఐఎల్‌కున్న సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం(ఏజీఆర్) బకాయిలు(లయబిలిటీ) రూ. 58,254 కోట్లుకాగా.. వీటిలో రూ. 7,854 కోట్లకుపైగా చెల్లించింది. సుప్రీం నో: ఏజీఆర్ మదింపులో దిద్దుబాట్లకోసం భారతీ ఎయిర్‌టెల్‌సహా వీఐఎల్ సుప్రీం కోర్టును ఆశ్రయించినప్పటికీ చుక్కెదురైంది. కాగా.. ఏజీఆర్ బకాయిలపై స్పష్టత లోపించిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు కంపెనీలో పెట్టుబడులకు ముందుకురావడంలేదని లేఖలో బిర్లా పేర్కొన్నారు. స్పెక్ట్రమ్ చెల్లింపులపై అవసరమైనంత మారటోరియం విధింపు, ప్రధానంగా సర్వీసు వ్యయాలకు మించిన ఫ్లోర్ ధరల విధానాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. భారీ రుణ భారం: రూ. 25,000 కోట్లు సమీకరించేందుకు 2020 సెప్టెంబర్‌లో బోర్డు వీఐఎల్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే కంపెనీ నిధుల సమీకరణ చేపట్టలేకపోవడం గమనార్హం! లీజ్ లయబిలిటీలను మినహాయిస్తే కంపెనీకి స్థూలంగా రూ. 1,80,310 కోట్ల మేర రుణభారముంది. వీటిలో వాయిదాపడిన స్పెక్ట్రమ్ చెల్లింపులు రూ. 96,270 కోట్లుకాగా.. బ్యాంకులు, ఆర్థిక సంస్థల రుణాలు రూ. 23,080 కోట్లుగా నమోదయ్యాయి. -
సినిమా టికెట్ల ధరలపై నిర్ణయం తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: సినిమా టికెట్ల ధరలకు సంబంధించి ప్రత్యేక కమిటీ చేసిన మార్గదర్శకాల మేరకు నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు తీసుకున్న చర్యలను వివరిస్తూ సమగ్ర నివేదిక సమర్పించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం ఈ మేరకు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. సినిమా టికెట్ల ధరల నిర్ణయానికి సంబంధించి ప్రత్యేక కమిటీవేసి మార్గదర్శకాలు రూపొందించాలంటూ 2016లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయలేదంటూ సినీ ప్రేక్షక వినియోగదారుల సంఘం అధ్యక్షుడు, న్యాయవాది జీఎల్ నరసింహారావు రాసిన లేఖను ధర్మాసనం సుమోటో ప్రజాహిత వ్యాజ్యం (పిల్)గా విచారణకు స్వీకరించింది. ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసి మార్గదర్శకాలు కూడా రూపొందించి ప్రభుత్వానికి పంపామని హోంశాఖ తరఫున న్యాయవాది శ్రీకాంత్‌రెడ్డి నివేదించారు. దీంతో స్పందించిన ధర్మాసనం.. నిర్ణయం తీసుకోవడంలో జాప్యం ఎందుకు చేస్తున్నారని, నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకొని తమకు తెలియజేయాలని ఆదేశించింది. కాగా, సినిమా టికెట్ల ధరలకు సంబంధించి ప్రభుత్వ ఆమోదం తర్వాతే థియేటర్ యజమానులు పెంచుకోవాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌చేస్తూ థియేటర్ యజమానులు దాఖలుచేసిన అప్పీళ్లను తర్వాత విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేస్తూ తదుపరి విచారణను అక్టోబరు 26కు వాయిదా వేసింది. -
ఉల్లిపై కేంద్రం కీలక నిర్ణయం!
-
ఉద్యోగాల సందడి
సాక్షి, విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ కొలువుల కోసం ఏళ్లతరబడి ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువత కల సాకరమయ్యే రోజు వచ్చింది. సచివాలయ ఉద్యోగ ఫలితాలు గురువారం విడుదల కావడంతో అధిక మార్కులు సాధించిన అభ్యర్థులు ఆనందపడుతున్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి తీసుకున్న ఉద్యోగాల విప్లవం నిర్ణయంతో చిరకాల స్వప్నం నెరవేరనుందంటూ సంబరపడుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు, ఉద్యోగాల భర్తీల కోసం ఏళ్లతరబడి నిరీక్షణే మిగిలిందని చెబుతున్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాల జాతరను తీసుకొచ్చిందని, ప్రకటిం చిన తేదీ ప్రకారం ఉద్యోగాల భర్తీకి కృషిచేస్తోందన్నారు. పరీక్ష జరిగిన 10 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం దేశంలోనే చరిత్రాత్మకమని పేర్కొంటున్నారు. శుక్రవారం నాటికి మార్కులు పూర్తిస్థాయిలో తెలుస్తాయని అధి కారులు చెబుతున్నారు. ఇందులో ప్రతిభ ప్రకారం ఎవరికి పోస్టులు వస్తాయన్న విషయం స్పష్టత రానుంది. 1:1 నిష్పత్తిలో ఎంపిక.. జిల్లాలో 5,915 పోస్టులకు 14 రకాలు పరీక్షలు నిర్వహించారు. ఇందులో నాలుగు పరీక్షలు ఇంగ్లిష్‌లో, మిగిలిన పది పరీక్షలు ఇంగ్లిష్, తెలుగులో ప్రశ్నపత్రాలతో నిర్వహించారు. పరీక్షలకు మొత్తం 91.55 శాతం మంది హాజరయ్యారు. విడుదల చేసిన ఫలితాల్లో మెరిట్లో ఉన్న వారికి ఉద్యోగాలు వస్తాయి. పోస్టులు ప్రాప్తికి అభ్యర్థులను 1:1 నిష్పత్తిలో ధువపత్రాలు పరిశీలనకు పిలుస్తామని జెడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనపరిచిన అభ్యర్థులు.. జిల్లా స్థాయిలో సచివాలయ పరీక్షల్లో పలువురు తమ ప్రతిభ చాటారు. ప్రభుత్వం విడుదల చేసిన జాబితా ప్రకారం కొందరు పేర్లు విడుదల చేశారు. ఇందులో కేటగిరి–2(గ్రూప్–బీ) విభాగంలో పురుషులు విభాగంలో టి. సందీప్‌చంద్ర 118.5మార్కులు సాధించి జిల్లా,(రాష్ట్ర)స్థాయిలో ప్రథమస్థానంలో నిలిచాడు. 115 మార్కులతో మహిం తి సూరిబాబు రెండోస్థానంలో నిలిచాడు. పప్పల వెంకట ఉదయ కుమార్ 113 మార్కులు, కసిరెడ్డి వాసుదేవ 112.5 మార్కులతో తర్వాత స్థానాల్లో నిలిచారు. గ్రూప్–ఎ విభాగానికి సంబంధించి మెంటాడ సాయిరాం 113.5 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచాడు. మహిళలు విభాగంలో కేటగిరి–2 (గ్రూప్–ఎ) 108 మార్కులతో గేదెల మానస ప్రథమ స్థానం సాధించారు. విలేజ్ అగ్రి కల్చర్ అసిస్టెంట్(గ్రేడ్–2) విభాగంలో 104 మార్కులతో బొడ్డు గాయత్రి ప్రథమ స్థానం, 103 మార్కులతో చొక్కాపు సాయిబిందు రెండోస్థానం, ఏఎన్ఎం(గ్రేడ్–3) విభాగంలో శంబంగి పోలినాయిని సుకన్య 102.75 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు. ప్రభుత్వం విడుదల చేసే మెరిట్ జాబితా ప్రకారం సచివాలయం ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు ధ్రువపత్రాలు పరిశీలించనున్నారు. -
జస్టిస్ ఈశ్వరయ్యకు కీలక పదవి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య రెగ్యులటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చైర్మన్‌గా ఉమ్మడి ఏపీ హైకోర్టు మాజీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వంగాల ఈశ్వరయ్య నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఉన్నత విద్యా సంస్థల్లో ప్రమాణాలు పెంచడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన, ఫీజుల నియంత్రణ తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిషన్‌లో ఇద్దరు ప్రొఫెసర్లు, ఓ ఐఏఎస్ అధికారి, ఉన్నత విద్యాసంస్థ ప్రతినిధి... సభ్యులుగా ఉంటారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌ను సంప్రదించిన మీదట, రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ ఈశ్వరయ్యను కమిషన్ చైర్మన్‌గా నియమించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఇవాళ జారీ అయ్యాయి. కాగా స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చైర్మన్‌గా రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఆర్.కాంతారావును ప్రభుత్వం నియామకం చేసింది. ఐటీ (టిక్నికల్) సలహాదారులుగా అలాగే ఆంధ్రప్రదేశ్ ఐటీ (టిక్నికల్) సలహాదారులుగా శ్రీనాథ్ దేవిరెడ్డి, జె. విద్యాసాగర్‌రెడ్డిను నియమిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. అదేవిధంగా ఏపీ ఐటీ (పాలసీ అండ్ ఇన్వెస్ట్మెంట్) సలహాదారునిగా కె. రాజశేఖర్‌రెడ్డిని నియమించింది. -
సదావర్తి భూముల వేలంపై విజిలెన్స్ విచారణ
సాక్షి,అమరావతి: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సదావర్తి సత్రం భూముల వేలంలో జరిగిన అక్రమాలపై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వేలం వ్యవహారాన్ని విజిలెన్స్ విచారణకు రాష్ట్ర్ర ప్రభుత్వం ఆదేశించింది. భూముల వేలంలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు రాష్ట్ర్ర ప్రభుత్వం గుర్తించింది. గత టీడీపీ ప్రభుత్వం తమిళనాడులోని సదావర్తి సత్రానికి చెందిన 83.11 ఎకరాలకు బహిరంగ వేలం నిర్వహించింది. సత్రం భూముల వ్యవహారంపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై విజిలెన్స్,ఎన్ఫోర్సుమెంట్ విచారణకు ఆదేశిస్తూ రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. -
నాణ్యమైన బియ్యం రెడీ
సాక్షి, శ్రీకాకుళం పాతబస్టాండ్: తెల్ల రేషన్ కార్డులపై నాణ్యమైన బియ్యం పంపిణీకి సీఎం వైఎస్ జగన్ శ్రీకాకుళం జిల్లాలో శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో అందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం సన్న బియ్యం ప్యాకెట్లు తొలి విడత చేరుకున్నాయి. మరో రెండు రోజుల్లో జిల్లాకు కావాల్సిన సరుకంతా వచ్చే అవకాశముంది. జిల్లాకు 13.243 మెట్రిక్ టన్నులు అవసరం ఉండగా, బఫర్ స్టాక్‌తో కలిసి 15,000 మెట్రిక్ టన్నులు తీసుకువస్తున్నారు. ఈ బియ్యం ప్యాకెట్లను ఈనెల 28 నాటికి అన్ని ఎఫ్‌పి షాపులకు చేరవేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 8,32,636 కార్డుదారులకు ప్రయోజనం.. జిల్లాలో 8,32,636 బీపీఎల్ కార్డులు ఉన్నాయి. మొత్తం 26.48 లక్షలమంది లబ్ధిదారులున్నారు. ఈ కార్డుదారులకు నెలకు 13.243 మెట్రిక్ టన్నులు బియ్యం అవసరం ఉంటుంది. ప్రతి వ్యక్తికి (యూనిట్‌కి) అయిదు కేజీలు వంతున అందజేస్తున్నారు. ఈ లెక్కన లబ్ధిదారులకు అయిదు, పది, కేజీలు, 20 కేజీల బ్యాగులను సిద్ధం చేశారు. కుటుంబ సభ్యుల ఆధారంగా ప్యాకెట్లు పంపిణీ వివరాలు... -ఒక సభ్యుడు గల కార్డులు 124049. వీరికి 5 కిలోల ప్యాక్ -ఇద్దరు సభ్యులు ఉండే కార్డులు 176505. వీరికి 10 కిలోల ప్యాక్ -ముగ్గురు సభ్యులున్న కార్డులు 166530. వీరికి 15 కిలోల ప్యాక్ -నలుగురు సభ్యులున్న కార్డులు 248234. వీరికి 20 కిలోల బ్యాగ్ -అయిదు సభ్యులున్న కార్డులు 56105. వీరికి 10 కిలోలు, 15 కిలోల ప్యాక్‌లు -ఆరుగురు సభ్యులున్న కార్డులు 8405. వీరికి 10 కిలోలు, 20 కిలోల ప్యాక్‌లు -ఏడుగురున్న కార్డులు 1284. వీరికి 15 కిలోలు, 20 కిలోలు బ్యాగులు -ఎనిమిది మంది సభ్యులున్న కార్డులు 223. వీరికి 20 కిలోలు గల బ్యాగులు రెండు -9 మంది సభ్యులు గల కార్డులు 44. వీరికి10 కిలోలు, 15 కిలోలు, 20 కిలోల బ్యాగులు -10 మంది ఉన్న కార్డులు 20. వీరికి పది కేజీల ప్యాక్, 20 కేజీల బ్యాగులు రెండు -11 మంది ఉన్న కార్డులు 3. వీరికి 15 కిలోల ప్యాక్‌వై 3, 20 కిలోల బ్యాగ్ -ఏఏవై కార్డులు 49,798. వీరికి 15 కిలోలు, 20 కిలోల బ్యాగులు -ఏపీ కార్డులు 956. వీరికి 10 కిలోల బ్యాగులు ఒకటి నుంచి పంపిణీ: జేసీ శ్రీనివాసులు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఇంటివద్దకే నాణ్యమైన బియ్యం పంపిణీ కార్యక్రమం సెప్టెంబర్ ఒకటిన జిల్లాలో ప్రారంభం కానుందని జేసీ శ్రీనివాసులు తెలిపారు. నాణ్యమైన బియ్యం తొలి లారీ తూర్పుగోదా వరి నుంచి శ్రీకాకుళం ఎంఎల్ఎస్ పాయింట్‌కి శుక్రవారం చేరిందని జేసీ తెలిపారు. ఈ లారీలో 25 మెట్రిక్ టన్నుల బియ్యం, వివిధ పరిమాణాల్లో ఉన్నాయి. ఈ లారీతో వచ్చిన బియ్యాన్ని జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు పరిశీలించారు. కొన్ని ప్యాకెట్లను మచ్చుకి పరిశీలించారు. ముందుగా చెప్పిన విధంగా ఈ ప్యాకెట్లలో నాణ్యమైన బియ్యం రావడంతో ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. వచ్చిన లారీలో చాలా వరకు బియ్యాన్ని శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం ఎఫ్‌పి షాపుల డిపోకు పంపించేందుకు జెండా ఊపి పంపించారు. గ్రామ వాలంటీర్ల ద్వారా ఈ బియ్యాన్ని అందజేస్తామని అన్నారు. జిల్లాలో ఉన్న 8.32 లక్షల తెలుపు రంగు రేషన్ కార్డుదారులు ఉన్నారని, వారికి 13,312 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని 5, 10, 15, 20 కేజీల ప్యాకట్ల రూపంలో సిద్ధం చేశామని ఆయన తెలిపారు. 18 మండల స్థాయి స్టాక్ పాయింట్లకు సరఫరా చేస్తామని తెలిపారు. అక్కడ నుంచి ఎఫ్‌పి షాపులకు వెళతాయని తెలిపారు. శనివారం నాటికి మరో పది లారీల వరకు సుమారుగా 250 మెట్రిక్ టన్నుల బియ్యం రానున్నట్టు ఆయన తెలిపారు. సీతంపేట, ఐటిడిఎ గ్రామాలకు సరఫరా చేయనున్నామని తెలిపారు. జిల్లాలో ఈకేవైసీతో సంబంధం లేకుండా సెప్టెంబర్ నెల రేషన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. వచ్చిన బియ్యాన్ని సకాలంలో అన్ని ఎఫ్‌పి షాపులకు అందజేస్తామని జేసీ తెలిపారు. జేసీతోపాటుగా సివిల్ సప్లయిస జిల్లా మేనేజర్ ఎ.కృష్ణారావు, జిల్లా సరఫరాల అధికారి జి నాగేశ్వరరావు, గోదాం ఇన్చార్జీ బి గోపాల్ తదితరులు ఉన్నారు. -
మద్యం దుకాణాలు తగ్గాయ్ !
విజయనగరం రూరల్: రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాల్లో దశలవారీ మద్యనిషేధం అమలుకు పక్కా వ్యూహం రూపొందించారు. తొలిదశలో బెల్టుషాపులు నిరోధించడమే గాకుండా... ఇకపై ప్రభుత్వ మే నేరుగా మద్యం దుకాణాలు నిర్వహించే ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో ప్రజాసంకల్ప పాదయాత్ర నిర్వహించిన సందర్భంలో అక్కచెల్లెమ్మల వినతి మేరకు అధికారంలోకి వచ్చిన ప్రారంభంలోనే దశలవారీ మద్య నిషేధానికి అడుగులు వేశారు. ఇందులో భాగంగా 20 శాతం మద్యం దుకాణాలు తగ్గించనున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న 210 మద్యం దుకాణాల్లో 20 శాతం పోగా 168 దుకాణాలు ఏర్పాటు యనున్నారు. ఈ దుకాణాలు అక్టోబర్ ఒకటో తేదీనుంచి నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. విచ్చలవిడి మద్యం అమ్మకాలకు చెక్.. ప్రస్తుతం ప్రైవేటు వ్యాపారులు మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నారు. లాభాలే పరమావధిగా వ్యాపారులు నిబంధనలకు నీళ్లొదిలి మద్యం విక్రయాలు సాగించడంతో మద్యం ఏరులై పారేది. కల్తీ మద్యం, ఎమ్మార్పీ ఉల్లంఘనలు, బెల్టు దుకాణాల్లో మద్యం అమ్మకాలతో యథేచ్ఛగా నిబంధనలకు పాతరేసేశారు. నూతన మద్యం విధానంలో ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు నడవనున్న నేపథ్యంలో వీటికి చెక్‌పడనుంది. మద్యం దుకా ణాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీఎస్‌బీసీఎల్) ఏర్పాటు చేసి రిటైల్‌గా విక్రయాలు సాగించనుంది. ఇందుకోసం సిబ్బందిని నియమించి అమ్మకాలు సా గించనుంది. ఇప్పటివరకు మద్యం అమ్మకాలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటలవరకు జరిగేవి. నూతన మద్యం విధానంలో ఒక గంట ముందే అంటే రాత్రి 9 గంటలకే మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. 588 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం.. మద్యం దుకాణాల్లో పని చేసేందుకు ఏడాదిపాటు కాంట్రాక్టు ప్రాతిపదికన సిబ్బందిని నియమించనున్నారు. పట్టణ ప్రాంతాల్లో మద్యం దుకాణాల్లో పనిచేసేందుకు ఒక సూపర్వైజర్, ముగ్గురు సేల్స్మన్లను నియమించగా, గ్రామీణ ప్రాంత దుకాణాల్లో ఒక సూపర్వైజర్, ఇద్దరు సేల్స్మన్లను నియమించనున్నారు. వీరితోపాటు ప్రతీ దుకాణం వద్ద ఒక వాచ్‌మన్‌ను కూడా నియమించనున్నారు. డిగ్రీ విద్యార్హతతో సూపర్వైజర్లను నియమించనుండగా సేల్స్మన్లుగా ఇంటర్మీడియట్ విద్యార్హతలున్న వారిని నియమిస్తున్నారు. అలాగే 21 ఏళ్లు పైబడి 40 ఏళ్ల లోపు ఉన్న వారికే అవకాశం కల్పిస్తున్నారు. వీరి నియామకానికి సంబందించి ఎక్సైజ్‌శాఖ అధికారులు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 18 నుంచి 25 వరకు అవకాశం కల్పించారు. మద్యం దుకాణాల ఏర్పాటుకు స్థలాల గుర్తింపు.. ఎక్సైజ్ అధికారులు ఎక్సైజ్ చట్టం–1968 నిబంధనల ప్రకారం మద్యం దుకాణాల ఏ ర్పాటుకు సంబంధించి స్థలాల గుర్తింపు పనిలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉన్న స్థలంలో మద్యం దుకాణాలను ఏర్పాటు చేసి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ జారీ చేశాం.. ప్రభుత్వం నూతన మద్యం విధానం ప్రకటించిన నేపథ్యంలో దానిని సక్రమంగా అమలు చేసేందుకు కృషి చేస్తాం. ముఖ్యంగా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు నిర్వహించనున్నందున నిబంధనల ఉల్లంఘనలకు ఆస్కారం ఉండదు. దుకాణాల నిర్వహణకు ప్రదేశాల గుర్తింపు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సామగ్రి ఏర్పాటుకు టెండర్ ప్రక్రియ చేపట్టనున్నాం. అలాగే ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేశాం. అక్టోబర్ 1నుంచి మద్యం దుకాణాలు ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నడుస్తాయి. – వై.బి.భాస్కరరావు, డిప్యూటీ కమిషనర్, అబ్కారీశాఖ, విజయనగరం -
పడకేసిన ఫైబర్ నెట్
సాక్షి, విజయవాడ: ఏపీ ఫైబర్ నెట్ పడకేసింది. ఎన్నికల సమయంలో ప్రభుత్వ బాజాతో విసిగిపోయిన ప్రజలు దీన్ని దూరం పెట్టడంతో ప్రభుత్వానికి కోపమొచ్చింది. తమ ప్రచారానికి అంతగా ఉపయోగపడలేదన్న దుగ్దతో ప్రభుత్వం దానిపై శీతకన్నేసింది. ఎన్నికలకు ముందు అధికారుల్ని ఊదరగొట్టి ప్రజలకు ఏపీ ఫైబర్ నెట్ కనెక్షన్లను ప్రభుత్వం అంటగట్టింది. ఇపుడు దానికి కావాల్సిన మెటీరియల్ సరఫరాను నిలిపివేసింది. దీంతో కొత్త కనెక్షన్లు ఇవ్వడం సాధ్యం కావడంలేదని ఆపరేటర్లు చెబుతున్నారు. మూడు నెలలుగా ఓఎల్టీ, పాన్ బాక్స్‌లు నిల్ ఫైబర్ నెట్ కనెక్షన్ ఇవ్వాలంటే ఆప్టికల్ లైన్ టెర్మినల్ (ఓఎల్టీ) బాక్స్‌లు, పాన్ బాక్స్‌లు అవసరం. ఒక ఓఎల్టీకి ఎనిమిది పాన్లు ఉంటాయి. ఒక్కొక్క పాన్ నుంచి 125 కనెక్షన్లు ఇవ్వవచ్చు. అంటే ఒక ఓఎల్టీ ఉంటే సుమారు వెయ్యి కనెక్షన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. రూ.2.5 లక్షలు చెల్లిస్తే ప్రభుత్వమే ఓఎల్టీ, పాన్ బాక్స్‌లు సరఫరా చేస్తుంది. వీటి కోసం ఆపరేటర్లు డబ్బులు చెల్లించినా అధికారులు బాక్స్‌లు ఇవ్వడం లేదు. గత మూడు నెలలుగా ఓఎల్టీ బాక్స్‌ల సరఫరాను ప్రభుత్వం ఆపివేసింది. ఫైబర్ నెట్ నిధుల్ని పసుపు–కుంకుమ కోసం వినియోగించడంతో నిధులు లేక వాటిని కొనుగోలు చేయడం లేదని సమాచారం. లంచాలు ఇస్తేనే బాక్స్‌లు గ్రామీణ ప్రాంతాల్లో రూ.125, నగరాల్లో రూ.235 చెల్లిస్తే ఫైబర్ నెట్ ద్వారా కనెక్షన్ ఇస్తున్నారు. వీటి ద్వారా వినియోగదారుడు టీవీ, ఇంటర్ నెట్ సదుపాయం పొందొచ్చు. ఇవి కల్పించాలంటే ఓఎల్టీ, పాన్ బాక్స్‌లు కావాలి. ముడుపులు ఇవ్వందే అధికారులు వాటిని ఇవ్వడం లేదు. ఒక్కో ఓఎల్టీ, పాన్ బాక్స్‌లకు రూ.50 వేల వరకు లంచాలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఆపరేటర్లు అవసరమైన బాక్సులను సమకూర్చలేకపోతున్నారు. ప్రభుత్వ ప్రచారం రోతతో కనెక్షన్లు రద్దు చేసుకున్న ప్రజలు... ఎన్నికల ముందు ఏపీ ఫైబర్ నెట్ కనెక్షన్లు తీసుకోవాలంటే ప్రజలు భయపడ్డారు. అందులో ఎక్కువగా ప్రభుత్వం గురించి ప్రచారం జరుగుతూ ఉండటంతో రోతపుట్టి ఎక్కువ మంది ప్రజలు ఫైబర్ నెట్ కనెక్షన్లు రద్దుచేసుకున్నారు. ఎన్నికలు పూర్తయిన తరువాత వారిలో ఎక్కువమంది కావాలంటున్నారని ఒక కేబుల్ ఆపరేటర్ ‘సాక్షి’ కి తెలిపారు. ఫైబర్ నెట్ ఎన్నికల సమయంలో తమకు పూర్తిగా ఉపయోగపడలేదని భావించిన ప్రభుత్వం ఇప్పుడు ఆ మెటీరియల్ సరఫరాను నిలిపివేసిందని అంటున్నారు. -
ఈ నెల 17న కొత్త అసెంబ్లీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొత్త శాసనసభ కొలువుదీరేందుకు ముహూర్తం ఖరారైంది. జనవరి 17న కొత్త ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. మజ్లిస్ ఎమ్మెల్యే (చార్మినార్) ముంతాజ్ ఖాన్ ప్రొటెం స్పీకర్ హోదాలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారు. దీనికి ముందే.. ఈ నెల 16న సాయంత్రం ఐదు గంటలకు ముంతాజ్ ఖాన్ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేస్తారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ రాజ్‌భవన్‌లో ముంతాజ్ ఖాన్‌తో ప్రమాణం చేయిస్తారు. మరుసటి రోజు శాసనసభ తొలి సమావేశం జరగనుంది. జనవరి 17న ఉదయం 11.30 గంటలకు సభాకార్యక్రమాలు ప్రారంభమవుతాయి. దాదాపు రెండుగంటలపాటు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం కొనసాగనుంది. అదే రోజున స్పీకర్ ఎన్నిక నిర్వహణ షెడ్యూల్‌ను ప్రకటన.. నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. జనవరి 18న స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. అనంతరం.. స్పీకర్ ఎన్నికపై ప్రొటెం స్పీకర్ ప్రకటన చేస్తారు. కొత్తగా ఎన్నికైన స్పీకర్‌ను.. శాసనసభా నాయకుడు సీఎం కేసీఆర్, ప్రతిపక్ష నేత, ఇతర రాజకీయ పక్షాల నాయకులు గౌరవసూచకంగా స్పీకర్ స్థానం వరకు తీసుకెళ్తారు. ఆ తర్వాత కొత్త స్పీకర్ అధ్యక్షతన శాసనసభ సమావేశాలు సాగుతాయి. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే బీఏసీ (బిజినెస్ అడ్వయిజరీ కమిటీ) సమావేశాన్ని స్పీకర్ నిర్వహిస్తారు. తర్వాతి రోజు జరిగే గవర్నర్ ప్రసంగంపై బీఏసీ నిర్ణయం తీసుకుంటుంది. జనవరి 19న ఉభయసభల (శాసనసభ, శాసనమండలి)ను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు. జనవరి 20న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెడతారు. గవర్నర్ ప్రసంగానికి శాసనసభ ధన్యవాదాలు తెలుపుతుంది. దీంతో శాసనసభ సమావేశాలు ముగుస్తాయి. మజ్లిస్‌కు రెండోచాన్స్ మజ్లిస్ పార్టీకి శాసనసభలో అరుదైన అవకాశం దక్కింది. తెలంగాణ శాసనసభలో ప్రొటెం స్పీకర్‌గా ఆ పార్టీ ఎమ్మెల్యే ముంతాజ్‌ఖాన్ వ్యవహరించనున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యే ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించడం ఇది రెండోసారి. మజ్లిస్ వ్యవస్థాపక అధ్యక్షుడు సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 1984లో ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించారు. అప్పటి వరకు స్పీకర్‌గా వ్యవహరించిన టి. సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న అయిండ్ల భీంరెడ్డిలు నాదెండ్ల భాస్కర్‌రావు మంత్రివర్గంలో చేరారు. దీంతో అప్పటి శాసనసభ వ్యవహారాల కోసం సల్లావుద్దీన్ ఓవైసీ, బాగారెడ్డి, ...... లు ప్రొటెం స్పీకర్లుగా నియమితులయ్యారు. తాజాగా ముంతాజ్ ఖాన్ కొత్త సభకు నిర్వహణకు ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించనున్నారు. సిద్ధమైన అసెంబ్లీ శాసనసభ సమావేశాలకు అనుగుణంగా అసెంబ్లీ కొత్త హంగులను సంతరించుకుంది. శాసనసభ, శాసనమండలితోపాటు అసెంబ్లీ ఆవరణ మొత్తాన్ని సరికొత్తగా తీర్చిదిద్దారు. అసెంబ్లీ ఆవరణలో కొత్త మొక్కలతో పచ్చదనం పెరిగింది. సమాచార, సాంకేతిక, విద్యుదీకరణతో ఆధునిక హంగులు సంతరించుకుంది. అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు అన్ని మార్పులతో సభాప్రాంగణాన్ని సిద్ధం చేశారు. శాసనసభ వ్యవహారాల నిర్వహణ తీరును వివరించే పుస్తకాలను ఎమ్మెల్యేలకు పంపిణీ చేసేందుకు ఏర్పాటుచేశారు. అసెంబ్లీ లోపల సైతం ఎమ్మెల్యేలు కూర్చునే సీట్లను, మైక్ సెట్లను ఆధునీకరించారు. ఉత్తరాయణ ఏకాదశి నాడు.. కొత్త శాసనసభ సమావేశాలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ప్రజలు గొప్ప మెజారిటీతో తమను గెలిపించారని ఆ స్పూర్తితో ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏకాదశి తిథినాడు శాసనసభ కార్యకలాపాలు ఆరంభించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. సాధారణంగానే ముహూర్తాలకు ప్రాధాన్యత ఇచ్చే సీఎం కేసీఆర్ ఉత్తరాయణం ఆరంభంలో కొత్త సభ, స్పీకర్ ఎన్నిక వంటి కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు. -
కన్నడ రాజ్యం ఎవరిది?
బీజేపీ ప్రతినిధులు కూడా గవర్నర్‌ను కలసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఇందుకు రెండురోజులు గడువు కోరారు. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి తగినంత ఆధిక్యం లేదు కాబట్టి ఇప్పుడు రాజకీయ బేరసారాలు జరగడానికి అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్ అభ్యర్థులుగా గెలిచిన పలువురు లింగాయత్ వర్గ శాసనసభ్యులు ఒక వక్కలిగ ముఖ్యమంత్రి కింద పని చేయడానికి సముఖంగా లేరన్నది మరొక అంశం. కాబట్టి బల నిరూపణ సమయంలో శాసనసభ రణరంగంగా మారడానికి అవకాశాలు బలంగానే కనిపిస్తున్నాయి. అయితే ఈ ఫలితాలలో అసలు లబ్ధిదారు దేవెగౌడ. ఆయనే ఈ మంగళవారాన్ని అసలు మరచిపోలేరు. దేశ రాజకీయాలను పరిశీ లించేవారికి ఈ మంగళవారాన్ని (15వ తేదీ) మరచిపోవడం సులభం కాదు. కారణం– కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు. ఉదయం పదకొండు గంటల వేళ మొత్తం 120 నియోజకవర్గాలలో బీజేపీ ముందంజలో ఉండడంతో ఇక కాంగ్రెస్, జేడీ(ఎస్)ల ఆట కట్టేనని అనిపించింది. కానీ తరువాత జరిగిన పరిణామాలే ఇల్లు అలకగానే పండుగ కాదు అన్నట్టు మారిపోయాయి. నెమ్మదిగా బీజేపీ వెనకపడింది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 112 స్థానాల సంగతి దేవుడెరుగు, 104 స్థానాల దగ్గర ఆ పార్టీ విజయయాత్ర ఆగిపోయింది. సరిగ్గా ఇలాంటి అవకాశం కోసమే కాంగ్రెస్, జేడీ(ఎస్)లు ఎదురు చూస్తున్నాయి. ఆ రెండు పార్టీలకు కలిపి 116 స్థానాలు దక్కాయి. సాయంత్రానికి జేడీ (ఎస్) నాయకుడు హెచ్డి కుమారస్వామి గవర్నర్‌ను కలసి కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం ఇచ్చివచ్చారు. కానీ ఎగ్జిట్‌పోల్స్ వచ్చినప్పటి కథ వేరు. కాంగ్రెస్ గెలుపు మీద సర్వేలు రెండుగా చీలిపోయాయి. క్షేత్రస్థాయిలో పరిశీలించినవారికి కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకుంటుందన్న అభిప్రాయం కలిగింది. తరువాత బీజేపీ ముందంజలోకి రావడానికి కారణం ఏమిటి? ఏప్రిల్ 30 వరకు కూడా బీఎస్ యడ్యూరప్ప, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాలు సాగించిన ప్రచారం పేలవంగానే సాగింది. తరువాత ప్రధాని నరేంద్ర మోదీ వచ్చి 21 బహిరంగ సభలలో ప్రసంగించడంతో పార్టీలో ఉత్సాహం వెల్లువెత్తింది. కాంగ్రెస్ పార్టీ చతికిలపడిందని ఆ పదిరోజులలో ఆ పార్టీల నేతలు కొందరు నా దగ్గర అంగీకరించారు కూడా. కానీ ఆ స్థితి నుంచి గట్టెక్కడానికి కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదు. ఇటు మోదీ తన ‘కాంగ్రెస్ రహిత భారతం’ నినాదంతో పార్టీ కార్యకర్తలను, ఓటర్లను కూడా విశేషంగా ప్రభావితం చేశారు. ఈ ఎన్నికలలో ఆరెస్సెస్ నిర్వహించిన పాత్ర కూడా గణనీయమైనది. అన్ని నియోజక వర్గాలలోను ఆ సంస్థ కార్యకర్తలు ప్రచారం నిర్వహించారు. కోస్తా, మధ్య, ముంబై కర్ణాటక ప్రాంతాలలో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. హిందూ పార్టీకే ఓటు వేయమని కోరారు. హిందువులు కోసం హిందువులు అన్న కార్డు బాగానే పని చేసిందని ఫలితాలు రుజువు చేశాయి కూడా. బీజేపీకి రాష్ట్రంలో 20,000 వాట్సప్ గ్రూపులు ఉన్నాయి. తమ రాజకీయ సందేశాన్ని ఓటర్లకు చేరవేసేందుకు వాటిని పార్టీ విశేషంగా ఉపయోగించుకుంది. ఇలా ఉండగా కాంగ్రెస్ పార్టీ యడ్డీ ప్లస్ 2 రెడ్డీస్ నినాదాన్ని నమ్ముకుంది. బీజేపీ అవినీతి గురించి అలా ప్రచారం చేయదలిచింది. కానీ హైదరాబాద్–కర్ణాటక ప్రాంత ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే అవినీతి అనేది అసలు విషయమేకాదని తేలుతుంది. ఇక్కడి నియోజక వర్గాల వ్యవహారం గాలి జనార్దనరెడ్డి, బి. శ్రీరాములు స్వీకరించారు. కాంగ్రెస్ టికెట్ల కేటాయింపు సంతృప్తికరంగా లేదు. దాదాపు అందరు సిటింగ్ సభ్యులకు టికెట్లు ఇచ్చారు. సిద్ధరామయ్య అనుసరించిన వ్యూహం కూడా విమర్శల పాలైంది. చాముండేశ్వరి నియోజకవర్గం ఆయనకు కలసి రాలేదు. గతంలో తన ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన జీటీ దేవెగౌడ చేతిలోనే సిద్ధరామయ్య ఓడిపోయారు. ఇదంతా చూస్తే ఆయన వ్యూహాల మీదే అనుమానాలు కలుగుతాయి. ఎందుకంటే ఆయన సురక్షితమైన వరుణ నియోజక వర్గాన్ని తన కుమారుడు యతీంద్ర కోసం త్యాగం చేశారు. అదృష్టవశాత్తు బాదామి నియోజకవర్గంలో కూడా పోటీ చేయడంతో సిద్ధరామయ్య గట్టెక్కారు. ఒక దశలో ఆయన బి.శ్రీరాములుపై వెనుపడిపోయారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి ప్రకారం ఇలాంటి పరిస్థితులలో నెపమంతా ఎలాగూ సిద్ధరామయ్య మీదే పడుతుంది. కానీ ఈసారి అలాంటి నెపం వేయడానికి సందేహించనక్కరలేదు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరికీ లేనంత అధికారాన్ని సిద్ధరామయ్య దక్కించుకున్నారు. అభ్యర్థుల ఎంపిక, ప్రచారం అంతా తానే అయి చేశారు. ఎన్నికల కోసం సిద్ధరామయ్య చేసిన ట్వీట్లు పరిహా సానికి గురయ్యాయి. వాటిలో ఆయన ప్రయోగించిన వ్యంగ్యం ఓట్ల రూపం దాల్చలేదు. ప్రధాని మోదీని ‘ఉత్తర భారత బయటి మనిషి’ అని సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. తరువాత మోదీ మీద పరువునష్టం దావా దాఖలు చేస్తానని బీరాలు పలికి, తాను సరైన పంథాలో నడవడంలేదని నిరూపించారు. ప్రాంతీయ అస్తిత్వం, లింగాయత్‌లకు వేరే మతం హోదా వంటి చర్యలతో కొద్దిరోజుల క్రితం వరకు ఆయన బీజేపీకి అడ్డుకట్ట వేయగలిగిన నేతగా కనిపించారు. కానీ ఆయన విభజన రాజకీయాలను ఓటర్లు ఆమోదించలేదు. మళ్లీ తమ పార్టీ మీద ప్రజలలో విశ్వాసం కల్పించడానికి అమిత్‌షా శ్రమించారు. ఎన్నో మఠాలకు తిరిగారు. లింగాయత్, దళిత సాధువులను కలుసుకుని పార్టీకి బలం చేకూర్చే యత్నాలు చేశారు. సిద్ధరామయ్య హిందూమతంలో చీలికలు తేవడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి అని బీజేపీ ప్రచారం చేయగలిగింది. దక్షిణ భారత రాష్ట్రాల విముక్తి కారుకునిగా అవతరించాలన్న కోరి కతో సిద్ధరామయ్య అతిగానే ప్రవర్తించారు. ఉత్తర, దక్షిణ భారత విభజన గురించి మాట్లాడారు. అలాగే బీజేపీయేతర రాష్ట్రాల మీద ఢిల్లీ ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీ మీద కూడా వివక్ష ఆరోపణ గుప్పించారు. తన ఐదేళ్ల పాలనలో ఆయన దళిత వ్యతిరేక, వక్కలిగ వర్గ వ్యతిరేక నాయకునిగా అపఖ్యాతి మూటగట్టుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పదవిలో దళిత నాయకుడు జి. పరమేశ్వరను నియమించడానికి విముఖత చూపడం, మరో దళిత నాయకుడు శ్రీనివాస ప్రసాద్ నిష్క్రమణ సిద్ధరామయ్య మీద దళిత వ్యతిరేకి ముద్రను బలోపేతం చేశాయి. నిజానికి 2015లో సిద్ధరామయ్య స్థానంలో దళిత ముఖ్యమంత్రిని నియమించాలన్న వాదన వినిపించింది. ఆ సమయంలో ఆయన తాను కూడా దళితుడనేనని, తాను సైతం సమాజంలో అణగారిన కుటుంబాల నుంచి వచ్చిన వాడినేనని వాదించారు. రాహుల్ మెప్పు కోసం కర్ణాటక ప్రముఖుడు దేవెగౌడను అవమానించడానికి కూడా సిద్ధరామయ్య వెనుకాడలేదు. జనతాదళ్ (ఎస్)ను జనతాదళ్ (సంఘ్ పరివార్) అని కొత్తగా నామకరణం చేశారు. జేడీ(ఎస్), బీజేపీ రహస్య ఒప్పందం చేసుకున్నాయని, దేవెగౌడ పార్టీ బీజేపీకి ‘బీటీమ్’ మాత్రమేనని సిద్ధరామయ్య వ్యాఖ్యానించడం మాజీ ప్రధానిని కలవర పెట్టింది. ఈ వ్యాఖ్యల వెనుక సిద్ధరామయ్యకు ఒక ఉద్దేశం ఉంది. కాంగ్రెస్, జేడీ(ఎస్)లు శత్రువులుగానే కొనసాగడం, భవిష్యత్తులో కాంగ్రెస్ నుంచి ఎవరూ జేడీ(ఎస్) మద్దతుతో సీఎం అయ్యే అవకాశం రాకుండా చూడడం సిద్ధరామయ్య ఉద్దేశం. సిద్ధరామయ్య 2006లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి ఆయన పార్టీలో బయటి మనిషిగానే మిగిలిపోయారు. 2013లో ముఖ్యమంత్రి పదవిని అధిష్టించడానికి సిద్ధరామయ్య ఈ విషయం మీదే పెద్ద పోరాటమే చేయవలసి వచ్చింది. కానీ మంగళవారం నాటి ఫలితాల తరువాత కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా దేవెగౌడను ఆశ్రయించింది. ఆయన కుమారుడు కుమారస్వామికి ముఖ్యమంత్రి పీఠం ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఇదంతా చూస్తుంటే, సిద్ధరామయ్య మాట్లాడినదానిని పట్టించుకోవద్దని దేవెగౌడకు, ఆయన కుమారులకు చెప్పినట్టే ఉంది. అలాగే సిద్ధరామయ్య కాంగ్రెస్ వైఖరికి ఇకపై ప్రాతినిధ్యం వహించబోరని వారికి స్పష్టం చేసినట్టు కూడా ఉంది. నిజం చెప్పాలంటే కాంగ్రెస్ నుంచి సిద్ధరామయ్యను బయటకు నెట్టివేసే ప్రక్రియ దాదాపు పూర్తయినట్టే. ఫలితాలు వచ్చిన తరువాత బీజేపీ ప్రతినిధులు కూడా గవర్నర్‌ను కలసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఇందుకు రెండురోజులు గడువు కోరారు. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి తగినంత ఆధిక్యం లేదు కాబట్టి ఇప్పుడు రాజ కీయ బేరసారాలు జరగడానికి అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్ అభ్యర్థులుగా గెలిచిన పలువురు లింగాయత్ వర్గ శాసనసభ్యులు ఒక వక్కలిగ ముఖ్యమంత్రి కింద పని చేయడానికి సముఖంగా లేరన్నది మరొక అంశం. కాబట్టి బల నిరూపణ సమయంలో శాసనసభ రణరంగంగా మారడానికి అవకాశాలు బలంగానే కనిపిస్తున్నాయి. అయితే ఈ ఫలితాలలో అసలు లబ్ధిదారు దేవెగౌడ. ఆయనే ఈ మంగళవారాన్ని అసలు మరచిపోలేరు. ఆయన ఒకప్పటి అంతేవాసి, ఇప్పటి శత్రువు సిద్ధరామయ్య రాజకీయ భవిష్యత్తుకు మంగళం పాడారు. తన కుమారుడికి మరొకసారి ముఖ్యమంత్రి అవకాశం కల్పించారు. అయితే ఒకటి. కర్ణాటక నాటకం ఇప్పుడే మొదలయింది. కాంగ్రెస్, జేడీ(ఎస్) సంకీర్ణం మనుగడ సాగించగలదా? కాగా, ప్రభుత్వ ఏర్పాటుకు మొదటిగా బీజేపీకే గవర్నర్ అవకాశం ఇవ్వక తప్పదు. ఒకవేళ గవర్నర్ కనుక జేడీ (ఎస్), కాంగ్రెస్ సంకీర్ణానికి అవకాశం ఇస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి జేడీ (ఎస్)ను చీల్చడానికి బీజేపీ పావులు కదుపుతుంది. టీఎస్ సుధీర్, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు ఈ–మెయిల్ :tssmedia10@gmail.com -
ప్రభుత్వ అండతోనే ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీ
హైదరాబాద్: ప్రభుత్వ అండతోనే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఫీజుల దోపిడీని కొనసాగిస్తున్నాయని ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వరరావు విమర్శించారు. ‘ఫీజుల పెంపుదలతో తల్లిదండ్రులపై జరుగుతున్న దోపిడీ, విద్యాప్రమాణాల పతనం’అనే అంశంపై పేరెంట్స్ అసోసియేషన్ కో–ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన విశ్వేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వేసిన తిరుపతిరావు కమిషన్ సిఫార్సులను పక్కనపెట్టి ప్రైవేట్ యాజమాన్యాలు ఏటా ఫీజులు పెంచుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిటీలను ఫీజుల నియంత్రణ కోసం కాకుండా ఫీజుల రద్దు కోసం ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ విద్యను రద్దు చేసి ప్రభుత్వమే ఉచిత నిర్భంద విద్యను అమలు చేయాలని సూచించారు. ఆర్థోపిడీషియన్ డాక్టర్ ఆసిఫ్ అనీఫ్ మాట్లాడుతూ.. విద్యా సంస్థల విధానాల వల్ల పుస్తకాల బరువుతో చిన్నారుల్లో స్సైనల్, భుజం నొప్పి వస్తున్నాయని, ఇది గూని సమస్యకు దారితీసే అవకాశం ఉందన్నారు. డాక్టర్ సత్తార్‌ఖాన్ మాట్లాడుతూ.. ఒక దేశం భవిష్యత్తు నిర్ణయించేది విద్యారంగమేనని కానీ దురదృష్టవశాత్తూ నేటి ప్రభుత్వాలు అవలంభిస్తున్న విద్యా వ్యాపారీకరణ కారణంగా ప్రైవేటు రంగంలోకి నెట్టబడుతుం దన్నారు. పీఏసీసీ సభ్యులు తేజ మాట్లాడుతూ, రాజ్యాంగాలు కల్పించిన ఉచిత నిర్బంధ విద్యను అన్ని ప్రభుత్వాలు ఉల్లంఘించాయన్నారు. కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
నేతన్నలకు గవర్నర్ నరసింహన్ భరోసా
సాక్షి, యాదాద్రి : చేనేత కార్మికులకు అన్ని ప్రభుత్వ పథకాల్లో సబ్సిడీ అమలయ్యేలా చూస్తానని నేతన్నలకు గవర్నర్ నరసింహన్ హామీ ఇచ్చారు. యాదాద్రి జిల్లా పోచంపల్లిలోని చేనేత మ్యూజియంలో గవర్నర్ బుధవారం చేనేత సంఘాలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చేనేత ఉత్నత్తులకు మార్కెటింగ్ ఇంకా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. నేతన్నలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేకదృష్టి సారించేలా చర్యలు చేపడతానన్నారు. చెనేత కార్మికులకు జియో టాగ్ నంబర్ కల్పిస్తామన్నారు. నిఫ్ట్ విద్యార్థులకు వివిధ చేనేత డిజైన్లపై పోచంపల్లిలో శిక్షణ ఇప్పించాల్సిందిగా అధికారులకు సూచించారు. గురుకుల పాఠశాలను సందర్శించిన గవర్నర్ చౌటుప్పల్ మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను,దండు మల్కాపురం గ్రామంలో మోడల్ అంగన్వాడీ కేంద్రాన్ని ఎమ్మేల్యే ప్రభాకర్ రెడ్డితో కలిసి గవర్నర్ సందర్శించారు. -
కొందరికే పునరావాసం
ఉట్నూర్(ఖానాపూర్): గుడుంబా పునరావాస పథకం ప్రహసనంగా మారింది. ఆర్భాటంగా గుడుంబా తయారీదారులను ఎంపిక చేసిన అధికార యంత్రాంగం పునరావాసం కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఫలితంగా వందలాది మంది తయారీదారుల్లో జిల్లావ్యాప్తంగా కేవలం పది మందికి స్వయం ఉపాధి కల్పించారు. గుడుంబా విక్రయాలు అరికట్టి.. స్వయం ఉపాధి కల్పించడం ద్వారా తయారీదారులు, విక్రేతల ఆర్థికాభివద్ధికి బాటలు వేసేందుకు ప్రభుత్వం ప్రారంభించిన పథకం ద్వారా ఉట్నూర్ ఎక్సైజ్ కార్యాలయం పరిధిలో ముగ్గురికే భరోసా లభించింది. ఎక్సైజ్ అధికారులు 215 మంది గుడుంబా విక్రయదారుల వివరాలను ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 115 మంది జాబితా కార్యాలయానికి చేరింది. చివరికి 30 మందితో కూడిన జాబితా రాగా.. మొదటి విడతలో తొమ్మిది మందిని ఎంపిక చేశారు. కానీ ఇప్పటివరకు ముగ్గురికి మాత్రమే ఉపాధికి రుణాలు అందజేశారు. మిగతా వారికి ఇప్పటికీ రుణాలు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఉట్నూర్ ఎక్సైజ్ కార్యాలయం పరిధిలో ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ మండలాలు ఉన్నాయి. ఏజెన్సీ గిరిజన ప్రాంతాలు కావడంతో ఈ ప్రాంతాల్లో నివసించే వారి ఆర్థిక స్థితిగతులు అంతంతగా ఉన్నాయి. దీంతో చాలామంది గుడుంబా తయారీ జీవనోపాధిగా ఎంచుకున్నారు. గుడుంబా తాగిన కొందరు ప్రాణాలు కోల్పోవడం, వారి కుటుంబాలు వీధిన పడడంతో గుడుంబా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా గుడుంబా విక్రయాలు అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. ఎంపిక చేసిన వారికి రూ.2లక్షల చొప్పున ఆర్థికసాయం అందించి స్వయం ఉపాధి కల్పించింది. తమకూ రుణాలు మంజూరు చేయాలని మిగతా వారు కోరుతున్నారు. మరోవైపు గతంలో ఉన్న కేసుల కారణంగా తయారీ, విక్రేతలు ఇబ్బందులు పడుతున్నారు. పునరావాసం ఇలా.. ఆదిలాబాద్: గుడుంబా తయారీని కుటీర పరిశ్రమగా చేసుకుని జీవనం సాగించిన కొందరు ఇప్పుడు ఆ దందా నుంచి బయటపడ్డారు. గుడుంబా తయారీని అరికట్టేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న గుడుంబా పునరావాస పథకంతో స్వయం ఉపాధి పొందుతున్నారు. గుడుంబా తయారీని నమ్ముకుని బతుకుబండిని నడిపిస్తున్న నిరుపేద కుటుంబాలు, విక్రయిస్తూ కేసుల్లో ఇరుక్కుంటున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గతేడాది జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుడుంబా పునరావాస పథకాన్ని తీసుకొచ్చింది. గుడుంబా తయారీదారులకు ప్రత్యామ్నాయ ఉపా«ధి అవకాశాలు కల్పించింది. కేసులు, బైండోవర్ చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో దాడులు నిర్వహించడంతో చాలావరకు గుడుంబా తగ్గుముఖం పట్టింది. జిల్లాలోని లబ్ధిదారులు పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. జిల్లాలో గతంలో పరిస్థితి.. ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, ఇచ్చోడ, ఉట్నూర్ ఎక్సైజ్ స్టేషన్లు ఉన్నాయి. 2016లో ఉమ్మడి జిల్లాను గుడుంబా రహిత జిల్లాగా ప్రకటించిన విషయం తెలిసిందే. జిల్లాల విభజన తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో గుడుంబా చాలామట్టుకు తగ్గిపోయింది. ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు మారుమూల గ్రామాల్లో పెద్ద ఎత్తున గుడుంబా, సారా విక్రయాలు జరుగుతుండేవి. మంచిర్యాల, లక్సెట్టిపేట, నిర్మల్, బెల్లంపల్లి ప్రాంతాల్లో గుడుంబా పెద్ద ఎత్తున తయారు చేసేవారు. ఈ ప్రాంతాల్లో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించినప్పుడల్లా ఎంతో మందిపై కేసులు నమోదయ్యేవి. అయినప్పటికీ గుడుంబా తయారీ కుటుంబాలకు ప్రధాన ఆధారం కావడంతో విక్రయిస్తూనే ఉన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం గుడుంబా పునరావాస పథకం కింద ఆర్థిక సాయం అందజేసేందుకు శ్రీకారం చుట్టింది. లబ్ధిదారులకు రూ.2 లక్షలు.. జిల్లాలో నాటుసారా, గుడుంబా అమ్మకాలే జీవనాధారంగా గుడుంబా తయారీ కుటుంబాలు ఉన్నాయి. బాధిత కుటుంబాలకు పునరావాసం కల్పించి వారిలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించింది. గుడుంబా తయారీ మానేసి జనజీవన స్రవంతిలో కలిసిన ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు లబ్ధిదారులను ఎంపిక చేసింది. 2015 జనవరి నుంచి 2016 సెప్టెంబర్ వరకు గుడుంబా విక్రయిస్తూ బైండోవర్ అయిన ప్రతి ఒక్కరూ ఈ స్కీంకు అర్హులుగా నిర్ణయించారు. జిల్లాలో ఎక్సైజ్ శాఖ అధికారులు అర్హులైన వారి వివరాలు సేకరించి ప్రభుత్వానికి పంపించారు. ఈ జాబితాలో 10 మందిని ఎంపిక చేసిన ప్రభుత్వం పథకం కింద ఆర్థిక సాయం అందజేసింది. ఆర్థిక సాయం పొందిన వారిలో కిరాణ షాపు, ఆటో, ఇతర చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. కేసు ఎత్తేస్తే బాగుంటది భర్త ఉన్నప్పుడు గుడుంబా అమ్మేవాడు. ఆయన పోయాక ఉపాధి కోసం నేను కొన్ని రోజులు అమ్మిన. ఆబ్కారీ పోలీసులు కేసులు పెట్టారు. తర్వాత దొరికిన కూలీ చేసుకుని బతికిన. ప్రభుత్వం నాకు రూ.2 లక్షలు లోను మంజూరు చేసింది. ఆటో కొనుక్కొని కిరాయికి ఇస్తున్న. రోజుకు రూ.200 కిరాయి వస్తుంది. సర్కారు సహాయంతోనే రోజు గడుస్తోంది. ఇంత చేసిండ్రు కేసు కూడా ఎత్తేస్తే బాగుంటది. పేషీలకు తిరిగి తిరిగి పరేషాన్ అవుతుంది. – జాదవ్ విమలాబాయి, గుడిహత్నూర్ -
చార్జిషీట్లు సరికాదు!
విచారణకు అనుమతుల్లేని కేసులపై ఉమ్మడి హైకోర్టు స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: అవినీతి కేసుల్లో ఓ అధికారి విచారణకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించనప్పుడు ఆ అధికారిపై అవినీతి నిరోధక శాఖ చార్జిషీట్ దాఖలు చేయడా నికి వీల్లేదని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. ఆ అధికారి పదవీ విమరణ తరువాత అలా దాఖలు చేసిన చార్జిషీట్ ఆధారంగా సంబం ధిత కోర్టు కేసు విచారణ చేపట్టడానికి కూడా వీల్లేదని చెప్పింది. ప్రభుత్వం నుంచి అనుమ తి లభించని కేసుల్లో పదవీ విరమణ పొందిన తరువాత చార్జిషీట్ దాఖలు చేయడం న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో ఇటీవల తీర్పు వెలువరించారు. విశాఖపట్నం జిల్లా ఎస్పీగా పనిచేసే సమయంలో జె.జి.మురళీ ఆదాయా నికి మించి ఆస్తులు సంపాదిం చారంటూ ఏసీబీ అధికారులు 2007లో కేసు నమోదు చేశారు. 2012లో మురళీ పదవీ విరమణ పొందారు. పదవీ విరమణ తరువా త ఏసీబీ అధికారులు ఆయనపై చార్జిషీట్లు దాఖలు చేశారు. దీనిపై మురళీ హైకోర్టును ఆశ్రయించారు. తన విచారణకు ప్రభుత్వం అనుమతిని నిరాకరించిందని, అయినా కూడా ఏసీబీ అధికారులు చార్జిషీట్లు దాఖలు చేశారని, అది కూడా తన పదవీ విరమణ తరువాత చేశారని ఆయన కోర్టుకు నివేదించారు. విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో తీర్పు వెలువరించారు. పదవీ విరమణ పొందితే విచారణకు ప్రభుత్వ అను మతి అవసరం లేదన్న కారణం తో పిటిషనర్ పదవీ విరమణ పొందేంత వరకు వేచి ఉండి ఏసీబీ అధికారులు చార్జిషీట్లు దాఖలు చేయ డంపై న్యాయమూర్తి తన తీర్పులో ఆక్షేపిం చారు. ఇలా చేయడం ఎంత మాత్రం సరికాద న్నారు. దీంతో మురళీపై ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసులను కొట్టేశారు. -
హోదా కోరితే అరెస్టులా?
- ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంది - సీపీఎం నాయకుల ధ్వజం - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మ దహనం అనంతపురం అర్బన్ : ప్రత్యేక హోదా కోరుతూ శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గపు చర్య అని సీపీఎం నాయకులు ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అరెస్టులను నిరసిస్తూ పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక టవర్ క్లాక్ వద్ద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నగర కార్యదర్శి నాగేంద్రకుమార్ మాట్లాడారు. రాష్ట్రానికి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని రాష్ట్ర విభజన సందర్భంగా పార్లమెంట్లో అప్పటి పీఎం మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారన్నారు. ఐదేళ్లు కాదు పదేళ్లు కావాలని వెంకయ్యనాయుడు డిమాండ్ చేస్తే, చంద్రబాబు ఒక అడుగు ముందుకు వేసి పదిహేనేళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారన్నారు. ఆ మేరకు ఎన్నికల్లో హామీ కూడా ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హోదా హామీని కేంద్రం విస్మరిస్తే, చంద్రబాబు దాసోహం అయ్యారన్నారు. విభజన సందర్భంగా ఇచ్చిన హామీని అమలు చేయాలని శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న నాయకులను ఎక్కడికక్కడ పోలీసులు నిర్బంధించి ఇబ్బందులకు గురి చేశారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అఖిలపక్షం నాయకులను గృహ నిర్బంధం చేయడం దారుణన్నారు. ఉద్యమాలను అధికారంతో అణచాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. హామీలను అమలు చేయని ప్రభుత్వాలకు అధికారంలో ఉండే అర్హత లేదన్నారు. ప్రత్యేక హోదా సాధించే వరకు అన్ని పార్టీలు ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు గోపాల్, ప్రకాశ్, నాగప్ప, చండ్రాయుడు, వలి, రామిరెడ్డి, బాబా, డీవైఎఫ్ఐ నాయకులు బాలకృష్ణ, రాజు, íసీఐటీయూ నాయకులు వెంకటనారాయణ, లక్ష్మీనారాయణ, రఘు, ఎస్ఎఫ్ఐ నాయకులు రమేశ్, సూర్యచంద్ర, జయచంద్ర, తదితరులు పాల్గొన్నారు. -
హరితహారంపై నిర్లక్ష్యం వద్దు
వారంలోగా టార్గెట్లు పూర్తి చేయాలి కలెక్టర్ వాకాటి కరుణ హన్మకొండ అర్బన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి న హరితహారంపై నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని కలెక్టర్ వాకాటి కరుణ అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్ నుంచి తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ప్రత్యేక అధికారులతో హరితహారంపై ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వారంలోగా వివిధ స్థాయిల్లో అప్పగించిన టార్గెట్లను పూర్తి చేయాలన్నారు. మొక్కల సంరక్షణకు కావాల్సిన ఫెన్సింగ్ నాటి, నీటి సరఫరా కోసం అవసరమైన నిధులకు సూక్ష్మ స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసి ప్రతిపాదన లు పంపించాలన్నారు. మొక్కలు కావాల్సిన వారు ఇం డెంట్ ఇవ్వాలని, ప్రతి మొక్కను జియో ట్యాగింగ్ చే యాలన్నారు. కాగా, హరితహారంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అధికారులకు సహకరించనందుకు రేగొండ పంచాయతీరాజ్ ఏఈని సస్పెండ్ చేయాలని ఎస్ఈని ఆదేశించారు. వీడియో కాన్ఫరె¯Œæ్సలో జేసీ ప్రశాంత్ జీవన్‌పాటిల్, ఏజేసీ తిరుపతిరావు, జెడ్పీ సీఈఓ విజయ్ గోపాల్, డీఎఫ్ఓలు శ్రీనివాస్, పురుషోత్తం, డ్వామా పీడీ శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.‡ -
'ప్రాజెక్టు పూర్తికి 5వేల ఏళ్లు పడుతుంది'
ఉత్తరాంధ్ర ప్రజలు ఎదుర్కొంటున్న సాగు, తాగునీటి కష్టాలు తీరాలంటే 'ఉత్తరాంధ్ర సుజల స్రవంతి' ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ అన్నారు. దివంగత నేత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి నిర్మాణ అనుమతులు కూడా ఇచ్చారని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమై ఏడేళ్లు గడిచినా ఇప్పటివరకు ప్రాజెక్టు పురోగతిలో ఎలాంటి ముందడుగు పడలేదని అన్నారు. 2014, 2015, 2016ల్లో ప్రాజెక్టుకు ఏడాదికి మూడు కోట్ల చొప్పున ఇచ్చిన నిధులను నిర్మాణానికి ఉపయోగించలేదని వివరించారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తికావడానికి రూ.7,214 కోట్ల అంచనా వ్యయం కాగా.. సంవత్సరానికి మూడు కోట్లు విడుదల చేస్తే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి ఐదు వేల ఏళ్లు పడుతుందన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో సాగునీరుకు నోచుకుని 15 లక్షల ఎకరాలకు నీరు అందుతుందని తెలిపారు. 16 చిన్న, మధ్య తరహా నదుల ఉన్న ఈ ప్రాంతంలో ఏటా 207 టీఎంసీ నీరు లభ్యమవుతుండగా.. కేవలం 100 టీఎంసీలను మాత్రమే వినియోగించుకుంటున్నామని ప్రాజెక్టు పూర్తయితే మిగతా 107 టీఎంసీలను వినియోగించుకోవచ్చని వివరించారు. ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరిచి వెంటనే టెండర్లు పిలిచి సంవత్సరానికి కనీసం రూ.5,000 కోట్లయినా ప్రాజెక్టు నిర్మాణానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రలోని అన్నీ రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాలు రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాజెక్టు సాధన కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. -
సమస్యను దాటేయొద్దు
ఏదైనా కొత్త సమస్య తలెత్తినప్పుడూ... ఏ సమస్య అయినా కొత్తగా ఎజెండాలోకొచ్చి పరిష్కారం కోరుతున్నప్పుడూ తీవ్రమైన చర్చ జరగడం, వాదోపవాదాలు చోటు చేసుకోవడం తప్పదు. వాటితో ఏమేరకు సక్రమంగా వ్యవహరించి మెజారిటీ మెచ్చేలా పరిష్కారాన్ని అన్వేషించగలరన్నదే పాలకుల సమర్థతకు గీటురాయి అవుతుంది. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ హిందూ కోడ్ బిల్లుల్ని ప్రతిపాదించినప్పుడు దేశంలో పెను వివాదం చెలరేగింది. హిందూ సమాజాన్ని ఆధునీకరించడానికీ, మహిళల హక్కుల్ని కాపాడటానికీ ఈ బిల్లుల అవసరం ఎంతో ఉన్నదని ఆనాడు నెహ్రూ వాదించారు. విడాకులకు అవకాశం కల్పించడాన్నీ, ఆడపిల్లలకు మగవాళ్లతో సమానంగా ఆస్తిహక్కు కల్పించడాన్నీ సంప్రదాయవాదులు గట్టిగా వ్యతిరేకించారు. ఈ రెండూ హిందూ సమాజ ఉనికికి భంగం కలిగిస్తాయనీ, ఉమ్మడి కుటుంబాల భావనను దెబ్బతీస్తాయనీ వాదించారు. పార్లమెంటు వెలుపలా, బయటా... కాంగ్రెస్‌తోసహా అన్ని పార్టీల్లోనూ ఎంతో చర్చ జరిగాక బిల్లులపై ఉన్న వ్యతిరేకత తగ్గింది. పర్యవసానంగా హిందూ వివాహ చట్టం, హిందూ వారసత్వ చట్టం, హిందూ దత్తత, మనోవర్తి చట్టం వంటివి అమల్లోకి వచ్చాయి. వైవాహిక జీవితంలో మహిళలపై జరిగే అత్యాచారాలను (మారిటల్ రేప్) అరికట్టడానికి బిల్లు తెచ్చే ప్రతిపాదన ఏదీ లేదని డీఎంకే సభ్యురాలు కనిమొళి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హరిభాయ్ చౌదరి బుధవారం ఇచ్చిన జవాబు అనేకానేక ప్రశ్నలకు తావిచ్చింది. అత్యాచారం నిర్వచనాన్ని, అందుకు విధించే శిక్షను ప్రస్తావిస్తున్న భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 375... భార్య వయసు 15 ఏళ్ల లోపు కానిపక్షంలో ఆమె అంగీకారం లేకుండా భర్త సంభోగంలో పాల్గొనడం అత్యాచారంగా పరిగణించరాదని చెబుతున్నది. మరో మాటలో చెప్పాలంటే భార్య వయసు 15 ఏళ్లు దాటినట్టయితే ఆమె అనుమతి లేకుండా లైంగిక క్రియలో పాల్గొనడం నేరం కాదని చట్టం పరోక్షంగా అంటున్నది. దీన్ని సవరించే ఆలోచన ఏమైనా చేస్తున్నారా అన్నదే కనిమొళి ప్రశ్న. పెళ్లాడిన భర్త అయినా, మరొకరైనా మహిళ సమ్మతి లేకుండా సంభోగంలో పాల్గొంటే దాన్ని అత్యాచారంగా పరిగణించాలని ఐక్యరాజ్యసమితి కోరింది. ఆ మేరకు చట్టాలను సవరించాలని అన్ని దేశాలకూ సూచించింది. నిర్భయ ఉదంతం జరిగాక ఏర్పాటైన జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ సైతం ఈ అంశంపై దృష్టి కేంద్రీకరించింది. సెక్షన్ 375లో ఉన్న మినహాయింపును తొలగించాలని సిఫార్సు చేసింది. భర్త తనపై లైంగిక అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఒక మహిళ పెట్టిన కేసుపై విచారణ సందర్భంగా గత ఏడాది ఢిల్లీ కోర్టు కొన్ని ముఖ్యమైన అంశాలను స్పృశించింది. మన దేశంలో వైవాహిక వ్యవస్థలో విస్తృతంగా నెలకొనివున్న లైంగిక అత్యాచారాలను మహిళలు మౌనంగా భరిస్తున్నారని అనడమే కాదు... లైంగిక దాడి చేసిన వ్యక్తి ఆమె భర్త అయినంత మాత్రాన బాధితురాలి విషయంలో వివక్ష ప్రదర్శించరాదని ఢిల్లీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అత్యాచారానికి వివాహం మినహాయింపుకాదన్నది. న్యాయస్థానాలు చట్టానికి భాష్యం మాత్రమే చెబుతాయి... చట్టాలను చేయలేవు. ఆ పని చేయాల్సింది చట్టసభలు. అయితే దుదృష్టవశాత్తూ చట్టసభలు ఇలాంటి అంశాల్లో చొరవ ప్రదర్శించలేక పోతున్నాయి. ఇప్పుడు కనిమొళి ప్రశ్నకు జవాబిచ్చిన కేంద్రమంత్రి కూడా మన వైవాహిక వ్యవస్థలో అత్యాచారాలు చోటుచేసుకోవడం లేదని వాదించలేదు. అలాంటి అత్యాచారాలను నేరంగా పరిగణించాలనే డిమాండ్‌ను అమలు చేయడం అంత సులభం కాదని మాత్రమే అంటున్నారు. అందుకు సమాజంలో అక్షరాస్యత శాతం తక్కువగా ఉండటం, పేదరికం, భిన్న సంస్కృతులు, ఆచారవ్యవహారాలు, విలువలు, మతపరమైన విశ్వాసాల వంటివి కారణంగా చెబుతున్నారు. స్వాతంత్య్రం వచ్చిన 67 సంవత్సరాల తర్వాత కూడా ఒక చట్టం చేయ(లే)కపోవడానికి ఇలాంటివి కారణాలుగా చెప్పడమంటే మన వైఫల్యాన్ని అంగీకరించడమే. వీటిని అధిగమించి ఒక తప్పును సరిచేయడం ఎలా అన్నదే ప్రభుత్వ కర్తవ్యం కావాలి తప్ప అసలు సరిదిద్దడమే అసాధ్యమనడం ధర్మం అనిపించుకోదు. పెళ్లిని ఇక్కడ పవిత్రంగా పరిగణించే సంప్రదాయం ఉండటం కూడా చట్టం చేయలేకపోవడానికి కారణమని మంత్రి చెబుతున్నారు. ఈ సందర్భంలో మన పొరుగునున్న నేపాల్‌లో ఏం జరిగిందో ఆయన తెలుసుకోవాలి. 2008లో సెక్యులర్ రిపబ్లిక్‌గా ప్రకటించుకునేంతవరకూ అది హిందూ రాజ్యంగానే ఉంది. అక్కడి సుప్రీంకోర్టులో 2001లో మారిటల్ రేప్‌పై దాఖలైన పిటిషన్ విషయంలోనూ ఆ ప్రభుత్వం ఇలాంటి కారణాలే చెప్పింది. హిందూ సంప్రదాయం వైవాహిక వ్యవస్థను పవిత్రంగా పరిగణిస్తుందని, అందువల్ల భర్త బలత్కారాన్ని అత్యాచారంగా పరిగణించడం సాధ్యం కాదని వాదించింది. నేపాల్ సుప్రీంకోర్టు ఈ అభిప్రాయాన్ని తోసిపుచ్చింది. పెళ్లికి ముందైనా, తర్వాతైనా మహిళకు ఒక మనిషిగా హక్కులుంటాయని... వివాహమైనంత మాత్రాన ఆమె వాటిని కోల్పోదని స్పష్టంచేసింది. మారిటల్ రేప్‌ను నేరంగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. మన దేశంలో నిరుడు నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్) గణాంకాలు చూస్తే సమస్య ఎంత జటిలమైనదో అర్థమవుతుంది. లైంగిక హింసకు సంబంధించి మహిళల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో అత్యధిక భాగం వైవాహిక జీవితానికి సంబంధించినవే. బయటివారు అత్యాచారం చేశారని చెప్పిన మహిళలు కేవలం 2.3 శాతంమంది మాత్రమే. మిగిలినవారంతా భర్తలనే దోషులుగా చూపారు. సమస్య ఉన్నదని గుర్తించినప్పుడు దానికి పరిష్కారం వెతకాల్సిన బాధ్యత... అందుకవసరమైన మార్గాన్వేషణ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. సంప్రదాయం పేరుచెప్పి సమాజంలో సగభాగంగా ఉన్నవారి హక్కులను గుర్తించ బోమనడం, వారిని బాధితులుగానే మిగల్చడం అనాగరికం అనిపించుకుంటుంది. -
ఫార్మాసిటీై పె అపోహలొద్దు
- పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు - ఫార్మాసిటీ, హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్ సిటీ భూముల పరిశీలన కందుకూరు: ఫార్మాసిటీ ఏర్పాటు పై అపోహలు వద్దని, కాలుష్యరహిత కంపెనీలనే స్థాపించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. సోమవారం మండలంలోని ముచ్చర్ల రెవెన్యూ పరిధిలో గల సర్వే నంబర్ 288లోని ప్రభుత్వం ఫార్మాసిటీకి కేటాయించిన భూములను టీఎస్ఐఐసీ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. భూములకు సంబంధించిన మ్యాప్‌లను, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫార్మాసిటీకి 11 వేల ఎకరాలను సేకరిస్తున్నామని, మొదటి విడతలో మూడు వేల ఎకరాల్లో పనులు ప్రారంభించనున్నామని వెల్లడించారు. అందుకుగాను రహదారుల నిర్మాణం, నీరు, విద్యుత్ వంటి వసతులు కల్పించనున్నట్టు చెప్పారు. ఎవరికి ఇబ్బంది లేకుండా వంద అడుగుల మేర రోడ్డు నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టాలని సూచించారు. కాలుష్యంలేని కంపెనీలను స్థాపించడానికి సీఎం కేసీఆర్ దీక్షతో పనిచేస్తున్నారని కొనియాడారు. సాగు నీరుతోపాటు పరిశ్రమల ఏర్పాటుతో రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను తొలగించాలన్న సంకల్పంతో పని చేస్తున్నామన్నారు. ఫార్మాసిటీ ఏర్పాటుతో ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి సాధిస్తుందని, గిట్టనివారు చేసే తప్పుడు ప్రచారాలను పట్టించుకోవద్దన్నారు. మున్నుందు ఉజ్వల భవిష్యత్ ఉందని, జాతీయిస్థాయిలో ఈ ప్రాంతానికి మంచి గుర్తింపు వస్తుందన్నారు. నైపుణ్యంలేని వారికి సైతం ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించనున్నామన్నారు. అంతకుముందు మహేశ్వరం మండలంలోని హార్డ్‌వేర్ పార్కు, ఎలక్ట్రానిక్ సిటీ ప్రాంతాలను ఆయన సందర్శించారు. ఎన్ని కంపెనీలు ఏర్పాటు జరిగింది.. ఎంత మందికి ఉద్యోగాలు కల్పించారు.. ఎన్ని ఖాళీలు ఉన్నాయి.. రవాణా సదుపాయాలు, కంపెనీల విస్తరణకు ఆటంకంగా మారిన కోర్టు కేసుల విషయమై టీఎస్ఐఐసీ అధికాారులతో చర్చించారు. ఆయన వెంట టీఎస్ఐఐసీ ఈడీ ఈవీ.నర్సింహారెడ్డి, జోనల్ మేనేజర్ కె.శ్యాంసుందర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ పి. శ్రావణ్‌కుమార్, జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ దేవరాజ్, ఉప తహసీల్దార్ వెంకటేష్, స్థానిక సర్పంచ్ గోవర్ధన్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఇక పోరుబాటే
- నిజాం షుగర్స్ భవిత కోసం అఖిల పక్షం ఉద్యమం - ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నాయకుల నిర్ణయం - భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు - ఫ్యాక్టరీని ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ బోధన్ : నిజాం షుగర్స్ పరిరక్షణకు అఖిలపక్షం గళమెత్తింది. తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యమ కార్యాచరణకు సమాలోచనలు చేస్తోంది. తాము అధికారంలోకి రాగానే ఫ్యాక్టరీని స్వాధీనం చే సుకుని పూర్వవైభవం తెస్తామని ఎన్నికల ముందు కేసీఆర్ హామీ ఇచ్చిన విషయాన్ని అఖిల పక్ష నాయకులు తెరపైకి తెస్తున్నారు. ఈ ప్రాంత కార్మిక, కర్షకు ల ఆకాంక్ష మేరకు ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల బోధన్‌లో తెలంగాణ ప్రజాఫ్రంట్, పది వామపక్ష పార్టీ లు, ఇతర పార్టీల ప్రతినిధులు, కార్మిక , రైతు సం ఘాల ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. టీపీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రాఘవులు కన్వీనర్‌గా నిజాం షుగర్స్ రక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. నిజాం షుగర్స్‌కు ఘన చరిత్ర.. 1937లో నిజాం పాలకుల హయాంలో బోధన్‌లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని నిర్మించారు. అప్పట్లో ఆసియా ఖండంలోనే అతి పెద్ద వ్యవసాయాధార పరిశ్రమగా ప్రఖ్యాతి పొందింది. ఈ ఫ్యాక్టరీకి లాబాలు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా చక్కెర పరిశ్రమల విస్తరణ సాగింది. దశాబ్దాల పాటు ఈ ఫ్యాక్టరీ ఓ వెలుగు వెలిగింది. జిల్లా అబివృద్ధికి ఎంతగానో దోహదపడింది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో దేశానికి విమానాల కోసం ఇథనాయిల్ అందించిన ఘన చరిత్ర ఈ ఫ్యాక్టరీకి ఉంది. దశాబ్దాలుగా ప్రభుత్వ రంగ సంస్థ పరిధిలో కొనసాగగా, రైతులు పండించిన చెరకుకు గిట్టుబాటు ధరతో పాటు వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించింది. అయితే క్రమంగా పాలకుల నిర్లక్ష్యం, రాజకీయ స్వార్థంతో వైభవం కోల్పోతోంది. చంద్రబాబు హయాంలో ప్రైవేటీకరణ.. 2002లో ముఖ్యమంత్రి చంద్రబాబు లాభాల్లో కొనసాగుతున్న ఈ ఫ్యాక్టరీ పరిధిలోని బోధన్ యూనిట్, కరీంనగర్ జిల్లా ముత్యంపేట్, మెదక్ జిల్లా ముంబోజిపల్లి యూనిట్లను ప్రైవేట్ జాయింట్ వెంచర్ పేరుతో డెల్లా పేపర్ కంపెనీకి కారు చౌకగా ధారాదత్తం చేశారు. 51శాతం ప్రైవేట్ సంస్థ, 49 శాతం ప్రభుత్వ వాటాతో ఫ్యాక్టరీ నిన్వహణ అధికారాలను ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టారు. అప్పట్లో ఈ ప్రాంత రైతులు, కార్మికులు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసి ఆందోళన చేపట్టినా చంద్రబాబు పట్టించుకోలేదు. ప్రైవేటీకరణ వైపే మొగ్గు చూపారు. మూడు ఫ్యాక్టరీల విలువ రూ. 365 కోట్లకు పైగా ఉండగా, కేవలం రూ.67 కోట్లకే ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. అప్పటి నుంచి నిజాం షుగర్స్ పరిరక్షణ కమిటీ, కార్మిక సంఘాలు, రైతు ప్రతినిధుల ప్రైవేటీకరణ రద్దుకు పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. వైఎస్ఆర్ హయాంలో సభా సంఘం ఏర్పాటు.. నిజాం షుగర్స్ ప్రైవేటీకరణలో భారీ అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు, ఈ ప్రాంత రైతులు, కార్మికుల ఆకాంక్ష మేరకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో కరీంనగర్ జిల్లాకు చెందిన అప్పటి దేవాదాయ శాఖ మంత్రి రత్నాకర్‌రావు చైర్మన్‌గా తొమ్మిది మంది శాసన సభ్యులతో సభా సంఘం నియమించారు. 2006 ఆగస్టులో సభా సంఘం నివేదిక ఇచ్చింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తిరిగి ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలని ఏకగ్రీవంగా సిఫారసు చేసింది. అయితే వైఎస్ఆర్ మరణానంతరం సభా సంఘం నివేదిక అమలు మూలన పడింది. ఆ తర్వాత అప్పటి సీఎం రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో పలుమార్లు నిజాం షుగర్స్ ప్రైవేటీకరణ రద్దు అంశం తెరపైకి వచ్చింది. సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో నాటకీయ పరిణామాలు, మలుపులు తిరిగింది. 2013 డిసెంబర్లో కిరణ్‌కుమార్‌రెడ్డి అప్పటి రాష్ట్ర మంత్రివర్గంలో అనూహ్యంగా నిజాం షుగర్స్ అంశాన్ని ప్రస్తావించి తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఏడుగురు మంత్రులతో సబ్ కమిటీని నియమించారు. తెలంగాణ ఉద్యమం పతాక స్థాయికి చేరిన సందర్భంలో నిజాంసుగర్స్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ ఎం. అప్పిరెడ్డి హైకోర్టును ఆశ్రయించగా, మంత్రి వర్గ ఉపసంఘం నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను నిలుపుదల చేసింది. దీంతో నిజాం షుగర్స్ ప్రైవేటీ కరణ అంశం మూలపడింది. ఎన్నికల్లో టీఆర్ఎస్ హామీ.... మలి దశ తెలంగాణ ఉద్యమ సభలు, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికల సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజాం షుగర్స్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటామని పలు సభల్లో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం నిజాం షుగర్స్ ప్రైవేటీకరణ రద్దు వైపు అడుగులు వేసింది. 2015 జనవరి 5న సచివాలయంలో బోధన్, మెట్పల్లి, మెదక్ ఫ్యాక్టరీలకు చెందిన చెరుకు రైతులతో సమావేశం నిర్వహించిన కేసీఆర్ ప్రైవేటీకరణ రద్దుపై స్పష్టత ఇచ్చారు. ఫ్యాక్టరీలను రైతుల చేతికి అప్పగిస్తామని సీఎం స్పష్టంగా చెప్పారని రైతు ప్రతినిధులు అంటున్నారు. ఆ తర్వాత మూడు ఫ్యాక్టరీల పరిధిలోని రైతులు, కార్మికులతో సమావేశాలు నిర్వహించి అబిప్రాయాలు సేకరించారు. ప్రభుత్వం సహకార రంగంలో ఫ్యాక్టరీలను నడపాలని యోచిస్తోందని రైతు ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. ఈ కోణంలోనే జిల్లా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో మహారాష్ట్ర ప్రాంతంలో సహకార రంగంలో లాబాల బాటలో నడుస్తున్న చక్కెర ఫ్యాక్టరీల పనితీరు అధ్యయనానికి రైతుల బృందాన్ని తీసుకెళ్లారు. అయితే ముందు ప్రైవేట్ జాయింట్ వెంచర్ రద్దు ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ప్రభుత్వమే నడుపాలంటున్న అఖిల పక్షం .. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఫ్యాక్టరీలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే నడపాలని అఖిల పక్షం డిమాండ్ చేస్తోంది. జిల్లాలో సహకార రంగంలో ప్రారంభించిన సారంగాపూర్ సహకార చక్కెర ఫ్యాక్టరీ కొన్నేళ్ల నుంచి మూతపడిన చేదు అనుభవాలు కళ్ల ముందు కనిపిస్తున్నాయని అఖిల పక్ష నేతలంటున్నారు. -
ఆదరించిన వారిపైనే తొలివేటు
సాక్షి, విజయవాడ బ్యూరో : ఆదరించిన వారిపైనే తొలి వేటు పడింది. అధికార పార్టీకి అండగా నిలిచినందుకు ఆ గ్రామాలను వదిలిపోవాల్సిన పరిస్థితి దాపురించనుంది. సీడ్ కేపిటల్ (తొలి దశ) కీలక నిర్మాణాలకు తమ గ్రామాలను ఎంపిక చేశారని తెలుసుకున్న వారంతా కలవరపడాల్సి వచ్చింది. ఉన్నపళంగా ఊరు, ఇళ్లు, గొడ్డూగోదా వదిలి పొమ్మంటే ఎలా అనే ఆందోళన వారి మదిని తొలిచేస్తోంది. ఇది రాజధాని ప్రాంతంలోని నేలపాడు, ఐనవోలు, శాఖమూరు, వెలగపూడి గ్రామస్తుల దయనీయ స్థితి. వ్యూహాత్మకంగా ప్రభుత్వం అడుగులు.. అబద్దాల పునాదులపై రాజధాని వ్యవహారాన్ని నెట్టుకొస్తున్న టీడీపీ సర్కారు వ్యూహాత్మకంగానే ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను నేలపాడు నుంచి మొదలెట్టింది. సొంత సామాజికవర్గం, టీడీపీకి అనుకూలవర్గం అధికంగా ఉన్న ఈ గ్రామాల నుంచే ల్యాండ్ పూలింగ్ ప్రారంభిస్తే ప్రజా వ్యతిరేకత లేకుండా తమ పని సజావుగా సాగుతుందన్నది ప్రభుత్వ ఎత్తుగడ. అనుకున్నట్టే ఆ నాలుగు గ్రామాల్లో భూ సమీకరణ పూర్తి చేసిన ప్రభుత్వం సీడ్ కేపిటల్‌కు వాటినే ఎంపిక చేయడం ఆయా గ్రామాల ప్రజలకు మింగుడు పడటంలేదు. ఆ నాలుగు గ్రామాలనే ముందుగా ఖాళీ చేయించి అక్కడి ప్రజలను వేరే ప్రాంతాలకు తరలిస్తామంటూ సీఆర్డీఏ వైస్ చైర్మన్, పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ ప్రకటించడంతో కలకలం రేగుతోంది. తొలి దశలో పరిపాలన పరమైన కీలక నిర్మాణాలను చేపట్టి సీడ్ కేపిటల్‌గా అభివృద్ధి చేసేందుకు గ్రామాలను ఖాళీ చేయిస్తే అక్కడి ప్రజలు తిరుగుబాటు బావుటా ఎగరేస్తారనడంలో సందేహం లేదు. ఈ నాలుగు గ్రామాల్లోను ఉన్న సుమారు 6,714 మంది ఇల్లు వదిలిపోవాలంటే ఎలా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను ఇబ్బంది పెట్టకుండా సీడ్ కేపిటల్ నిర్మించుకుంటే సరే.. లేకుంటే ప్రతిఘటనే అంటూ ప్రభుత్వానికి అక్కడి వారు అల్టిమేటం ఇస్తున్నారు. ఆ నాలుగు గ్రామాల్లో భూములు ఇలా... నాలుగు గ్రామాల్లోను రైతుల సొంత భూములు 5,601ఎకరాలు ఉండగా దాదాపు 5,450ఎకరాలను భూ సమీకరణ చేశారు. మిగిలిన గ్రామం కంఠం, అసైన్డ్భూములు, దేవాదాయ శాఖ భూములు ఎలాగు ప్రభుత్వం పరిధిలోకే వస్తాయి. ఈ నాలుగు గ్రామాల్లోను ఒక్క వెలగపూడిలోనే కొంత మేర భూమి సమీకరణ పూర్తి కాలేదు. మిగిలిన మూడు గ్రామాల్లోను పూర్తిస్థాయిలో భూ సమీకరణ చేయడం గమనార్హం. గ్రామాల వారీగా భూముల విస్తీర్ణం.. నేలపాడులో రైతు సొంత భూములు 1,222 ఎకరాలు, దేవాదాయశాఖ భూములు 30, చెరువులు 42, అసైన్డ్ భూములు 40, గ్రామ కంఠం 9.5 ఎకరాలు ఉంది. ఐనవోలులో రైతు సొంత భూములు 1,046 ఎకరాలు, దేవాదాయశాఖ భూములు 9.32, వక్ఫ్ భూములు 21.25, చెరువులు 41.85, అసైన్డ్ భూములు 10.78, గ్రామ కంఠం 23.29, రోడ్లు, డొంకలు, పిల్ల కాలువలు 45.21ఎకరాలు ఉన్నాయి. శాఖమూరులో రైతుల సొంత భూములు 1,510 ఎకరాలు, దేవాదాయశాఖ భూములు 7, చెరువులు 27, అసైన్డ్ భూములు 36, గ్రామ కంఠం 14, రోడ్లు, డొంకలు, చిన్నపాటి కాలువలు 32 ఎకరాలు ఉన్నాయి. వెలగపూడిలో రైతుల సొంత భూమి 1,823 ఎకరాలు, దేవాదాయ శాఖ భూములు 33, అసైన్డ్ భూములు 37 గ్రామ కంఠం భూములు 19, కాలువలు, డొంకలు, రోడ్లు 85 ఎకరాలు ఉన్నాయి. -
సం‘పన్నులు’ కట్టని ఘనులు
పెద్దల కంటే పేదలే నయం బడా బాబుల కంటే సామాన్యులు చెల్లించిందేఅధికం జీహెచ్ంఎసీ ఆస్తిపన్ను వసూళ్లలో వెలుగు చూసిన నిజం సాక్షి, సిటీబ్యూరో : జీహెచ్ఎంసీ అధికారుల మంత్రాలు బడాబాబుల ముందు అంతగా పని చేయలేదు. వారి ప్రయోగాలన్నీ సామాన్యులు, పేదలకే పరిమితమయ్యాయి. ఫలితంగా మొండి బకాయిదారులు అలాగే ఉండిపోయారు. సామాన్యులు ఎప్పటిలా పన్ను చెల్లింపులో ముందు వరుసలో నిలిచారు. సంపన్నుల కాలనీలు.. రాజకీయ ప్రముఖులు, వీవీఐపీలు ఉన్న ప్రాంతాల కంటే సామాన్యులు, పేదలు ఎక్కువగా ఉన్న సర్కిళ్లలోనే అధిక శాతం ఆస్తిపన్ను వసూలైంది. మొండి బకాయిలన్నీ బడాబాబులవేనని గుర్తించినందునే జీహెచ్ఎంసీ అధికారులు ఆస్తిపన్ను వసూళ్లకు రకరకాల మార్గాలు ఎన్నుకున్నారు. అయినా ఫలితం అంతంతే. మార్చి నెలాఖరుతో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ భవనాలకు సంబంధించిన ఆస్తిపన్ను మినహాయించి ప్రైవేటు వ్యక్తులు, సంస్థల నుంచి వసూలైన మొత్తం రూ.1079 కోట్లు. ఇందులో ఎక్కువ శాతం చెల్లించింది సామాన్యులే. ధనికులు, రాజకీయ ప్రముఖులు, వీవీఐపీలు ఉండే సర్కిల్-10 (ఖైరతాబాద్)లో లక్ష్యంలో 66 శాతం ఆస్తిపన్ను వసూలు కాగా, సామాన్యులు అధికంగా ఉండే మల్కాజిగిరి సర్కిల్లో 80 శాతం వసూలైంది. చిన్న సర్కిల్ అయిన రామచంద్రాపురంలో 88 శాతం వసూలైంది. వ్యాపార , వాణిజ్య సంస్థలు ఎక్కువగా ఉన్న సర్కిల్-9 (అబిడ్స్)లో అన్ని సర్కిళ్ల కంటే తక్కువగా వసూలైంది. అక్కడ అధికారులు ఎంత చెమటోడ్చినా.. కనాకష్టంగా లక్ష్యంలో 55 శాతం మాత్రమే వసూలైంది. దీని తరువాతి స్థానంలో సర్కిల్-5(చార్మినార్) ఉంది. అక్కడి వసూళ్ల లక్ష్యంలో 58 శాతం ఆస్తిపన్ను వసూలైంది. కుత్బుల్లాపూర్ సర్కిల్లో 86 శాతం వసూలైంది. జోన్ల వారీగా పరిశీలిస్తే.. సాఫ్ట్వేర్ సంస్థలు ఉన్న వెస్ట్‌జోన్‌లో 76 శాతం వసూలు కాగా, వీఐపీలు గల సెంట్రల్‌జోన్‌లో 64 శాతం మాత్రమే పన్నులు వసూలయ్యాయి. పాతబస్తీ ఉండే సౌత్జోన్లో పన్నులు సరిగా చెల్లించరనే అపప్రధఉంది. ఈసారి ఆ జోన్లో 68 శాతం వసూలు కావడం విశేషం. జోన్ల వారీగా వివరాలిలా ఉన్నాయి. -
ఇవి ప్రజా కంటక ప్రభుత్వాలు
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ పాతగుంటూరు: ప్రజలు బీజేపీ, టీడీపీలను నమ్మి కేంద్రం, రాష్ట్రంలో పూర్తి మెజార్టీని ఇస్తే అధికారంలోకి వచ్చాక ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నాయని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు విమర్శించారు. బ్రాడీపేటలోని సీపీఎం కార్యాలయంలో శనివారం వామపక్ష పార్టీల సభ జరిగింది. ఈ సభకు ఎంసీపీఐ(యూ) పార్టీ జిల్లా కార్యదర్శి టి.శివయ్య అధ్యక్షత వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ ఎన్నికల ముందు నల్లధనాన్ని వెలికితీస్తామని చెప్పిన మోడీ అధికారంలోకి వచ్చాక మాట మార్చారని అన్నారు. రాజధాని నిర్మాణంలో ప్రభుత్వం ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తే భవిష్యత్తులో నెలకొనే సమస్యలపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్పే రోజులు వస్తాయన్నారు. అర్హులైన వారికి వెంటనే పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సభలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణమూర్తి, సీపీఎం నగర కార్యదర్శి ఎన్.భవన్నారాయణ, సీపీఐ నగర కార్యదర్శి కోటా మాల్యాద్రి, రాజేష్, అయ్యన్నస్వామి, పూర్ణ తదితరులున్నారు. -
జిల్లా లో సమైక్య బంద్ సంపూర్ణం
కెకలూరులో సమైక్య బంద్ సంపూర్ణం కలూరు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కైకలూరులో గురువారం నిర్వహించిన సమైక్య బంద్ సంపూర్ణమైంది. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ పార్టీ కార్యాలయం ఎదురుగా జాతీయ రహదారిపై ధర్నా చేశారు. ఈ సందర్భంగా డీఎన్నార్ మట్లాడుతూ తెలంగాణ ప్రాంత ఎంపీలు సీమాంధ్ర ప్రజాప్రతినిధులపై దాడి చేయడం అమానుషమన్నారు. సీమాంధ్ర ఎంపీలను సస్పెండ్ చేయడం ప్రజాసామ్యం గొంతునొక్కడమేనని తెలిపారు. పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు బొబ్బిలి రత్తయ్యనాయుడు, అబ్దుల్ హమీద్, శొంఠి వీరముసలయ్య, పార్టీ పట్టణ కన్వీనర్ భాస్కర వెంకటేశ్వరరావు, పార్టీ నేతలు రాంబాబు, వేణు, ఆదినారాయణ, కొండయ్య, శ్యామల, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. 191వ రోజూ వైఎస్సార్ సీపీ రిలే దీక్షలు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ నియోజకవర్గ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే దీక్షలు గురువారం 191వ రోజుకు చేరాయి. పట్టణానికి చెందిన 25 మంది మహిళలు దీక్షలో కూర్చున్నారు. శిబిరానికి డీఎన్నార్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా డీఎన్నార్ మాట్లాడుతూ ఏకపక్షంగా కేంద్రప్రభుత్వం టీ బిల్లు ప్రవేశపెట్టడం దారుణమన్నారు. టీ బిల్లుకు వ్యతిరేకంగా పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పోరాటం చేస్తున్నారని తెలిపారు. సీమాంధ్ర ఎంపీలపై దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. పార్టీ నేతలు పళ్లెం చిన్నా, సోమల శ్యాంసుందర్, మద్దాల ఆండ్రూస్, మంజులూరి కృష్ణ, వల్లూరి ఆదినారాయణ పాల్గొన్నారు. అధికార దాహంతోనే రాష్ట్ర విభజన కలిదిండి : సోనియాగాంధీ రాహుల్‌కు ప్రధాన మంత్రి పదవి కట్టబెట్టాలని ఉద్దేశంతోనే రాష్ట్ర విభజనకు పూనుకుందని వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు పోసిన పాపారావు విమర్శించారు. పార్టీ మండల కన్వీనర్ అయినాల బ్రహ్మాజి ఆధ్వర్యంలో రాష్ట్ర విభజనకు నిరసనగా కలిదిండి సెంటరులో రాస్తారోకో గురువారం నిర్వహించారు. కలిదిండి సెంటరులోని వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిరసన ర్యాలీ జరిపారు. పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు నంబూరి బాబి, కలిదిండి సొసైటీ అధ్యక్షుడు యార్లగడ్డ రవికుమార్, పార్టీ మహిళా మండల కన్వీనర్ మేడిశెట్టి ఉమా, పార్టీ యూత్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు దాసరి అబ్రహం లింకన్, మైనార్టీ నేత ఎస్.కె.చాన్, మాలమహానాడు మండల అధ్యక్షుడు కూరేళ్ల ఏడుకొండలు, నేతలు దాదా, రామకృష్ణ, మూసా, శ్రీనులు పాల్గొన్నారు. మండవల్లిలో బంద్ ప్రశాంతం మండవల్లి : టీ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ గుమ్మడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మండవల్లిలో గురువారం బంద్ నిర్వహించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలు, జెడ్పీ ఉన్నత పాఠ శాల, ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయి. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పార్లమెంట్లో కాంగ్రెస్, టీడీపీ ఆడుతున్న డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. నేతలు కైలే అనీల్, నక్కా కిషోర్, ఫణి, వెంకటేశ్వరరావు, దాసి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
రాజీనామా అమల్లోకి వస్తే ఉపసంహరణ కుదరదు
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల రాజీనామా ఆమోదం పొందిన తర్వాత.. దాని ఉపసంహరణకు ఇకపై అవకాశం ఉండదు. ఈ మేరకు సబార్డినేట్ సర్వీసుల నిబంధనలను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ‘రాజీనామా అమల్లోకి వచ్చిన తర్వాత ఉపసంహరణకు అనుమతి ఉండదు. అయితే రాజీనామా ఆమోదం పొందినా, అది అమల్లోకి రాకముందే రాజీనామాను ఉపసంహరించుకుంటే, సదరు ఉద్యోగి సర్వీసులో ఉన్నట్లుగానే భావించాలి’ అని పేర్కొంటూ నిబంధనల్లో చేర్చారు -
గూబ‘గుయ్’మంది
ఉద్యోగులు, అధికారుల్లో సెల్ బిల్లుల పరేషాన్ పరిమితి మించిన గ్రూప్ సెల్‌ఫోన్ బిల్లులు చెల్లించకుంటే చర్యలు తప్పవన్న కలెక్టర్ సాక్షి,సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లా రెవెన్యూ విభాగంలో పనిచేస్తోన్న ఉద్యోగులకు, అధికారులకు ఒక్కసారిగా గుండె గుభేల్మంది. ఎందుకంటారా! .. ఏమీ లేదండీ.. జిల్లా కలెక్టర్ నుంచి తాజాగా వారికి అందిన తాఖీదులను చూసి వారంతా షాక్ గురయ్యారు. మీరు వాడుతున్న కామన్ యూజర్ గ్రూప్(సీయూజీ) సెల్‌ఫోన్ బిల్లు పరిమితికి మించినందున ఆ సొమ్మును వెంటనే చెల్లించాలని ఆ తాఖీదు సారాంశం. జిల్లా పరిపాలనను మరింత ప్రభావ వంతం చేసేందుకని అధికారులకు, ఉద్యోగులకు కామన్ యూజర్ గ్రూప్ సెల్ఫోన్లను ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఆయా ఉద్యోగుల, అధికారుల స్థాయిని బట్టి పరిమితిని విధించింది. గెజిటెడ్ అధికారులకు రూ.625కాగా, డిప్యూటి సెక్రటరీ హోదా వారికి రూ.1375, సెక్రటరీ కేడర్ అధికారులకు రూ.రెండు వేలు పరిమితిగా నిర్ణయించారు. ప్రభుత్వం ఇచ్చిన సెల్‌ఫోనే కదాని కొందరు సొంతానికి వాడుకున్నారో లేక ప్రజోపయోగ కార్యక్రమాలకే వినియోగించారో తెలియదు కానీ దాదాపు అన్ని సీయూజీ ఫోన్లకు ఇబ్బడిముబ్బడిగా బిల్లులు వచ్చాయి. పరిమితి మించి పరేషాన్! చెల్లింపు నిమిత్తం బిల్లులను పేఅండ్ అకౌంట్స్ విభాగానికి కలెక్టరేట్ అధికారులు పంపగా, పరిమితికి మించినందున తాము అంగీకరించే ది లేదని పీఏవో అధికారులు వాటిని తిప్పిపంపారు. దాంతో లిమిట్ దాటి సెల్‌ఫోన్ వాడుకున్న 70మంది ఉద్యోగులు, అధికారులు సదరు సొమ్మును వెంటనే చెల్లించాలని, వారంలోగా ‘కలెక్టర్, హైదరాబాద్ డిస్ట్రిక్ట్’పేరిట డిమాండ్ డ్రాఫ్టులు పంపకుంటే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తాఖీదులు జారీ చేశారు. రూ.1000 లోపు అధికంగా సెల్ బిల్లు వచ్చిన వారు 49మంది ఉండగా, 21మందికి మాత్రం రూ.1000 నుంచి రూ.5000లకు పైగా బిల్లు వచ్చింది. కీలకమైన విభాగాలకు చెందిన పనుల నిమిత్తం రెవెన్యూ అధికారులతో పాటు ఇతర విభాగాల అధికారులతోనూ, ప్రైవేటు వ్యక్తులతోనూ మాట్లాడాల్సి ఉంటుందని కొందరు ఉద్యోగులు చెబుతున్నారు. ప్రభుత్వ పనికే సెల్‌ఫోన్ వాడినప్పటికీ అదనపు బిల్లుల పేరిట తమ జేబులకు చిల్లులు పెట్టడం ఎంతవరకు సబబని కొందరు ప్రశ్నిస్తున్నారు. -
ప్రభుత్వం దిగి వచ్చే వరకు రైస్ మిల్లులు బంద్ చేస్తాం
= 2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇచ్చేందుకు సిద్ధం = జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు బసవరాజప్ప సాక్షి, బళ్లారి : ప్రభుత్వం అనాలోచిత నిర్ణయంతో రైస్ మిల్లర్ల నుంచి అధిక లెవీ రూపంలో బియ్యాన్ని తీసుకోవాలని నిర్ణయించడం సరైన చర్య కాదని ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉప సంహరించుకునేంత వరకు రైస్ మిల్లులను బంద్ చేస్తామని రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు బసవరాజప్ప స్పష్టం చేశారు. ఆయన సోమవారం జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఏపీఎంసీ ఆవరణం నుంచి నగరంలోని ప్రముఖ వీధుల గుండా ర్యాలీగా వచ్చి జిల్లాధికారి కార్యాలయంలో హెచ్‌క్యూకి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బసవరాజప్ప మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ప్రతి ఏటా లెవీ రూపంలో 1.25 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించేదని, అయితే ఉన్న ఫళంగా ఈసారి 13.5 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకోవాలని కేబినేట్లో నిర్ణయించడం ఎంతవరకు సబబన్నారు. ఈ మార్చిలోపు కనీసం 5 లక్షల మెట్రిక్ టన్నులు ఇవ్వాలని డిమాండ్ చేసిందని, అయితే గతంలో ఇచ్చే 2 లక్షల మెట్రిక్ టన్నుల కంటే ఒక క్వింటాల్ కూడా అదనంగా ఇచ్చేందుకు వీలుకాదన్నారు. పంట పండించడానికి అధిక పెట్టుబడి వస్తోందని, వరి రేటు మార్కెట్లో క్వింటాల్ రూ.2650 ఉండగా తాము రూ. 2400 ఎలా ఇవ్వాలని ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉప సంహరించుకోకపోతే తమ బంద్‌ను నిరవధికంగా కొనసాగిస్తామని హెచ్చరించారు. నగర రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్‌గౌడ మాట్లాడుతూ బళ్లారి నగరం, జిల్లాలో దాదాపు 250 రైస్ మిల్లులు ఉన్నాయని, జిల్లాలో విస్తారంగా వరి సాగు చేస్తున్నందున రైస్‌మిల్లులు బంద్ చేయడం వల్ల తమతోపాటు రైతులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రస్తుతం రైతుల నుంచి క్వింటాల్‌కు రూ.1600తో వరి కొనుగోలు చేసి ప్రభుత్వానికి క్వింటాల్‌కు రూ. 2400కు లెవీ రూపంలో ఇవ్వాలనడం సరైన నిర్ణయం కాదన్నారు. ప్రస్తుతం అన్నభాగ్య పథకం కోసం తక్కువ ధరకే బియ్యం సేకరించాలని అనుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉప సంహరించుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ నాయకులు నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
గర్భంలోనే సమాధి
సాక్షి, కరీంనగర్ : జిల్లావ్యాప్తంగా 228 స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి. కరీంనగర్‌తోపాటు అన్ని పట్టణాల్లోనూ ఈ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఎక్కడ కూడా లింగనిర్ధారణ పరీక్షలకు సంబంధించి నియంత్రణలు ఉన్నట్టు కనిపించడంలేదు. లింగనిర్ధారణ నిషేధ చట్టం అమలులోకి వచ్చి దాదాపు రెండు దశాబ్ధాలు అవుతున్నా ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు. స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు, పరీక్షలు చేయించుకున్నవారి మధ్య పరస్పర అంగీకారం వల్ల ఈ అక్రమం వెలుగుచూడడంలేదు. కఠిన శిక్షలున్నా ... ఆడపిల్లల పట్ల వివక్ష పెరగడం, అడ్డగోలుగా భ్రూణహత్యలు జరగడంతో ప్రభుత్వం గర్భధారణపూర్వ, గర్భస్థ పిండ నిర్ధారణ నిషేధ (పీసీ, పీఎన్డీటీ) చట్టాన్ని 1994లో తీసుకొచ్చింది. ఇందులో లోపాలను తొలగిస్తూ, నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ 2003లో చట్టాన్ని సవరించింది. ఈ చట్టాన్ని ఉల్లంఘించి లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే మొదటిసారి మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఇదే నేరాన్ని రెండవసారి చేస్తే ఐదేళ్ల జైలు, రూ.50 వేల జరిమానా విధిస్తారు. భ్రూణహత్యలకు కూడా శిక్షలు కఠినంగానే ఉన్నాయి. ఇలాంటి ఘటనల్లో అబార్షన్ చేయించిన వారి కుటుంబసభ్యులపైనా చర్యలు తీసుకునే వీలుంది. భ్రూణహత్యలకు పాల్పడిన వారికి మొదటి నేరమయితే మూడేళ్ల జైలు, రూ.50 వేల జరిమానా, అదే నేరం తిరిగి చేస్తే ఐదేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా విధిస్తారు. వైద్యుల లెసైన్సులను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తాత్కాలికంగా గానీ, శాశ్వతంగా గానీ రద్దు చేయవచ్చు. శిక్షలు ఎంత కఠినంగా ఉన్నా పర్యవేక్షణ కరువు కావడం ఆడపిల్లల పాలిట శాపంగా మారుతోంది. సమావేశాల ఊసేదీ... లింగనిర్ధారణ నిషేధ చట్టాన్ని సమర్థంగా అమలు చేసేందుకు జిల్లా, డివిజన్ స్థాయిల్లో ఉన్నతస్థాయి అధికార కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన పనిచేసే కమిటీలో జిల్లా జడ్జీ, ఎస్పీ, ఒక స్వచ్చంద సంస్థ ప్రతినిధి సభ్యులుగా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యదర్శిగా ఉంటారు. డివిజన్ స్థాయిలో ఆర్డీవో అధ్యక్షతన పోలీసు అధికారి, న్యాయవాది, ఎన్జీవో ప్రతి నిధి, ఆరోగ్యశాఖ అధికారి సభ్యులుగా ఉంటారు. ఈ క మిటీ కనీసం నెలకోసారయినా సమావేశం కావాలి. వివక్షపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలను నిర్వహించాలి. జిల్లాస్థాయి కమిటీ సమావేశం మూడు నెలల క్రితం జరిగింది. ఆ తర్వాత దాని ఊసే లేదు. అమ్మాయిలంటే చిన్నచూపు... ఆడపిల్లల పట్ల జిల్లాలో వివక్ష పెరుగుతోంది. ఆడ, మగ పిల్లల సంఖ్యలో పెరుగుతున్న తేడా దీనికి అద్దంపడుతోంది. ఆరేళ్లలోపు పిల్లల్లో బాలురు 51.90 శాతం అయితే, బాలికలది 48.10 శాతమే. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో ఆరేళ్లలోపు పిల్లలు 3,36,054 మంది కాగా, ఇందులో 1,62,406 మంది బాలికలు. 1,74,647 మంది బాలురు. జిల్లాలో ప్రతి వెయ్యిమంది బాలురకు 914 మంది బాలికలు మాత్రమే ఉన్నారు. వంశోద్ధారకుల కోసం ఆరాటపడుతున్నవారి చర్యలతో ఈ పరిస్థితి తలెత్తుతోందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ఆకాశంలో సగం... అన్నింట్లో సగం అని వల్లించడం తప్ప ఆచరణలో ఆడవారిని సమానంగా చూడలేకపోతున్నారు. మగ సంతానం కోసం తాపత్రయపడుతూ ఆడపిల్లలను తల్లిగర్భంలోనే హతమారుస్తున్నారు. మహిళల రక్షణ కోసం, వివక్షను అంతం చేసేందు కోసం తెచ్చిన చట్టాల అమలు విషయంలో అధికారులు ప్రదర్శించే నిర్లక్ష్యం వెనుక ఉన్నది కూడా వివక్షేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పరీక్షలు చేస్తే కఠిన చర్యలు - డిఎంహెచ్వో కొమురం బాలు లింగనిర్ధారణ పరీక్షలు జరుగుతున్నట్టు ఇంతవరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. జిల్లావ్యాప్తంగా స్కానింగ్ సెంటర్ల నిర్వహణపై మా అధికారుల పర్యవేక్షణ ఉంది. లింగ నిర్థారణ పరీక్షల నియంత్రణకు సంబంధించి చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. బాలబాలికల నిష్పత్తిలో తేడాకు లింగనిర్ధారణ మాత్రమే కారణమని భావించలేము. జిల్లాస్థాయి కమిటీ సమావేశం ఈ నెలలోనే జరుగుతుంది. -
ఆధునికీకరణ వైపు అడుగులు
సిరిసిల్ల, న్యూస్‌లైన్ : సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఆధునికీకరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మార్కెట్లో పోటీ తట్టుకుని నాణ్యమైన గుడ్డ ఉత్పత్తి చేస్తూ మెరుగైన ఉపాధి సాధించే దిశగా నేతన్నలను ప్రోత్సహించేందుకు సిద్ధమైంది. కాలం చెల్లిన మగ్గాలతో వస్త్ర పరిశ్రమ తరచూ ఆటుపోట్లను ఎదుర్కొంటూ సంక్షోభంలో కూరుకుపోతున్న నేపథ్యంలో పరిశ్రమను ఆధునికీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా బుధవారం సిరిసిల్ల శివనగర్ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ఆసాములు, యజమానులతో కేంద్ర జౌళి శాఖ అధికారులు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆధునిక మగ్గాలకు సబ్సిడీ సిరిసిల్లలో పురాతన మగ్గాలు వస్త్రోత్పత్తి సాగిస్తుండగా, వాటిని ఆధునికీకరించేందుకు కేంద్ర జౌళి శాఖ ఆర్థికసాయం అందిస్తోంది. ఒక్కో మగ్గాన్ని ఆధునికీకరించేందుకు రూ.15 వేలు సబ్సిడీగా ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించారు. ఒక్కో ఆసామి ఎనిమిది మగ్గాల వరకు స్థాపించుకునే అవకాశముంది. అంటే ఒక్కో ఆసామి రూ.1.20 లక్షల మేర సబ్సిడీ పొందవచ్చు. ఒక్కసారిగా మగ్గాలన్నింటినీ మార్పిడి చేయకుండా ఉన్న మగ్గాలపైనే డాబీలు మార్చి, జకాట్లను అమర్చి వస్త్రోత్పత్తి నాణ్యత పెంచే దిశగా జౌళిశాఖ చర్యలు తీసుకోనుంది. ఉన్న మగ్గాలపైనే మార్కెట్లో డిమాండ్ ఉన్న వస్త్రాన్ని ఉత్పత్తి చేసేందుకు అవకాశముంటుంది. ఒక్కో మగ్గం ఆధునికీకరణ కోసం రూ.15 వేల సబ్సిడీ ఇవ్వడం ఒక రకంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు శుభవార్తే. సిరిసిల్లలో 34 వేల మరమగ్గాలు ఉండగా, ఇందులో 27 వేల మరమగ్గాలపై పాలిస్టర్ వస్త్రం ఉత్పత్తవుతుండగా, ఏడు వేల మగ్గాలపై కాటన్ వస్త్రం తయారవుతోంది. ముతక రకం కాటన్, పాలిస్టర్ వస్త్రాలను ఉత్పత్తి చేయడంతో మార్కెట్లో డిమాండ్ లేక తరచూ సంక్షోభం ఎదురవుతోంది. మగ్గాలను ఆధునికీకరించడంతో పిక్కుల్లో హెచ్చుతగ్గులు తగ్గి పడుగుపేకల పోగులు తెగినా మగ్గం ఆగకుండా నడిచేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేయనున్నారు. ఉన్న మగ్గాలకే కొన్ని పరికరాలను అమర్చడానికి రూ.30 వేల వరకు ఖర్చవుతుండగా, ఇందులో యాభైశాతం మేర సబ్సిడీ చెల్లించేందుకు కేంద్ర జౌళి శాఖ ముందుకొచ్చింది. కేవలం రూ.15 వేలు వస్త్రోత్పత్తిదారుడు భరిస్తే మగ్గాలను ఆధునికీకరించుకోవచ్చు. నేడు వస్త్రోత్పత్తిదారులతో సమావేశం సిరిసిల్ల శివనగర్ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో బుధవారం ఉదయం 10.30 గంటలకు కేంద్ర జౌళి శాఖ టెక్నికల్ అధికారి రాజా ఆధ్వర్యంలో వస్త్రోత్పత్తిదారులతో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. మగ్గాలను ఆధునికీకరిస్తే కలిగే ప్రయోజనాలను ఆసాములు, యజమానులకు హైదరాబాద్ మరమగ్గాల సేవా కేంద్రం టెక్నికల్ అధికారులు వివరించనున్నారు. మగ్గాలతోపాటే సైజింగ్లను ఆధునికీకరిస్తే సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమకు మంచిరోజులు వచ్చినట్లే. సిరిసిల్ల నేతన్నలు పరిశ్రమ ఆధునికీకరణ దిశగా అడుగులు వేస్తే నాణ్యమైన వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తూ నమ్మకమైన ఉపాధి సాధించుకోవచ్చు. -
జగన్ భద్రత బాధ్యత ప్రభుత్వానిదే
చేవెళ్ల, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన అంశంలో అన్ని ప్రాంతాల వారికీ సమన్యాయం జరగాలంటూ జైలులో దీక్ష చేస్తున్న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఏదైనా జరిగితే తెలంగాణతో పాటు సీమాంధ్ర కూడా అగ్నిగుండంగా మారుతుందని ఆ పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు కె.ప్రతాప్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం చేవెళ్ల మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు కలిసి ఉంటేనే మరింత అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. మహానేత రాజశేఖర రెడ్డి బతికి ఉంటే ఈ పరిస్థితి దాపురించేది కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ అసమర్థ విధానాల వల్లనే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా తయారైందని ఆవేదన వ్యక్తంచేశారు. పదేళ్లుగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నడుస్తుంటే అప్పుడే అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపి ఉంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు బాగుండాలనే సంకల్పంతోనే జగన్ జైలులో కూడా అన్నపానీయాలు మాని దీక్ష చేస్తుంటే రాజకీయ లబ్ధికోసమేనని అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం ఆరోపించడం సిగ్గుచేటన్నారు. విభజన వల్ల అన్ని ప్రాంతాల వారూ నష్టపోతారని వైఎస్సార్ సీపీ భావిస్తున్నదన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే రంగారెడ్డి జిల్లా అన్ని విధాలా వెనుకబడిపోతుందని ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించాయన్నారు. ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఘన విజయం సాధిస్తుందని, జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన చెప్పారు. పార్టీని వీడుతున్నవారంతా రాజకీయ స్వార్థంతోనేనని ఆరోపించారు. జగన్‌కు జైలులో పటిష్టమైన భద్రత కల్పించాలని ఆయన డిమాండ్‌చేశారు. -
తిరగరాసి.. మాయ చేసి..!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అన్నదాతను ఆదుకునేందుకు సర్కారు తలపెట్టిన పంట రుణాల పంపిణీ ప్రక్రియ అపహాస్యమవుతోంది. ప్రభుత్వం నిర్దేశించిన వార్షిక లక్ష్యాలను బ్యాంకులు కేవలం కాగితాల్లోనే సాధిస్తున్నాయి. రైతులకు కొత్తగా రుణాలు ఇచ్చే విషయం పక్కనపెట్టి పాత రుణాలనే కొత్తగా మారుస్తూ లక్ష్యాల్ని సాధించినట్లు రికార్డులు చూపిస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో బ్యాంకుల ద్వారా రైతులకు రూ.438.15 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యాన్ని నిర్దేశించగా.. ఇందులో 64.46 శాతం పురోగతి సాధించినట్లు అధికారుల నివేదికలు చెబుతున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం రైతులకు పైసా చేతికందకపోవడం గమనార్హం. వర్షాభావ పరిస్థితుల వల్ల జిల్లాలో గత రెండేళ్లుగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం వర్షాలు ఆశాజనకంగా ఉండడంతో ఈ సీజన్‌పై గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే తీవ్ర నష్టాల పాలైన రైతుకు పెట్టుబడి పెట్టే పరిస్థితిలేని ఈ తరుణంలో రుణమిచ్చి అండగా నిలవాల్సిన సర్కారు.. పాత రుణాలనే తిరగరాస్తుండడంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. బ్యాంకు రికార్డుల్లో కొత్తగా రుణం తీసుకున్నట్లు గణాంకాలు కనిపిస్తున్నప్పటికీ.. చేతికి మాత్రం చిల్లిగవ్వ రాకపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. ఇలా ‘సాధించారు’.. 2013 ఖరీఫ్ సీజన్లో జిల్లా రైతాంగానికి రూ.438.15కోట్ల పంటరుణాలు ఇవ్వాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి రుణ మంజూరుకు ఉపక్రమించారు. అయితే ఇప్పటివరకు 61,283 మంది రైతులకు రూ. 282.42 కోట్లు పంట రుణాల కింద పంపిణీ చేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. నిర్దేశిత లక్ష్యంలో 64.46 శాతం పురోగతి సాధించినట్లు ఈ గణాంకాలను చూస్తే అర్థమవుతోంది. అయితే ఇవన్నీ కొత్తగా పంపిణీ చేసిన రుణాలు కాదు. గతంలో పెండింగ్‌లో ఉన్న రుణాలను ఈ ఏడాది భారీగా రెన్యువల్ చేశారు. ఇప్పటివరకు సాధించిన పురోగతిలో 72 శాతం రెన్యువల్ చేసినవేనని అధికారుల అంచనాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు మంజూరు చేసిన రూ.282.42 కోట్ల రుణాల్లో రూ.203.34 కోట్లు రెన్యువల్ పద్ధతిలో పునరుద్ధరించినవే. కౌలు రైతు రుణ వ్యథ..! 113 మందిని గుర్తించి, ఏడుగురికి రుణాలు జిల్లాలో కౌలు రైతు పరిస్థితి దారుణంగా మారింది. కౌలు రైతులకూ పంట రుణాలిస్తామంటూ ప్రగల్భాలు పలికిన సర్కారు.. అసలు ఈ రైతులను గుర్తించడమే కష్టంగా మారినట్లుంది. జిల్లాలో కేవలం 113 మంది కౌలు రైతులు మాత్రమే ఉన్నట్లు వ్యవసాయశాఖ తాజా గణాంకాలు చెబుతున్నాయి. గతంలో వేల సంఖ్యలో ఉన్న కౌలు రైతులు ఒక్కసారిగా ఇంత గా తగ్గిపోయారంటే.. వాళ్లంతా వలస పోయారా... లేక వ్యవసాయశాఖ కళ్లకు గంతలు కట్టుకుందా అనే సందేహం వ్యక్తమవుతుంది. జిల్లా వ్యాప్తంగా 113 మంది కౌలురైతులను గుర్తించిన వ్యవసాయ శాఖ వారికి రుణ అర్హత కార్డులను జారీ చేసింది. వీరిలో ఏడంటే ఏడుగురికే రుణాలు మంజురు చేసింది. ఈ ఏడుగురికి కేవలం రూ. మూడు లక్షలు పంపిణీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇదంతా చూస్తుంటే కౌలు రైతులపై సర్కారు ఎంతటి ప్రేమానురాగాలు ఒలకబోస్తుందో తెలుస్తోంది.