చెన్నై: ప్రభుత్వ మద్యం దుకాణాల్లో(టాస్మాక్‌షాపులు) దొరికే లిక్కర్‌తో కిక్కు సరిపోక ప్రజలు సారా(అరకు) తాగుతున్నారని తమిళనాడు మంత్రి దురైమురుగన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తమిళనాడు అసెంబ్లీలో ఎక్సైజ్, ప్రొహిబిషన్ చట్టాన్ని బలోపేతం చేస్తూ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా దురైమురుగన్ మాట్లాడారు.
టాస్మాక్ మద్యం దుకాణాల్లో దొరకే మందు కొందరికి సాఫ్ట్ డ్రింక్‌లా అనిపిస్తోందన్నారు. తమిళనాడులో పూర్తిగా మద్యాన్ని నిషేధించడం కుదరదని స్పష్టం చేశారు. పొరుగు స్టేట్స్‌లో మద్యం దొరుకుతున్నపుడు తమిళనాడులో పూర్తి మద్య నిషేధం అమలు చేయడం సాధ్యం కాదన్నారు.
రోజంతా కష్టపడి పనిచేసుకునేవాళ్లు అలసట మరిచిపోయి నిద్రపోవాలంటే మద్యం అవసరమన్నారు. కాగా, దురైమురుగన్ వ్యాఖ్యలపై అన్నాడీఎంకే ఆగ్రహం వ్యక్తం చేసింది. డీఎంకే ప్రభుత్వ అసమర్థత వల్లే ఇటీవల కల్లకురిచిలో కల్తీసారా తాగి చాలా మంది మరణించారని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి కోవై సత్యన్ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment