kick
-
పదేళ్ల తర్వాత సూపర్‌హిట్ మూవీకి సీక్వెల్.. ప్రకటించిన డైరెక్టర్!
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రస్తుతం సికందర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ యాక్షన్ ఓరియటండ్ చిత్రంలో రష్మిక మందన్న, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వచ్చే ఏడాది ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.అయితే అంతలోనే మరో మూవీకి సిద్ధమయ్యారు సల్మాన్ ఖాన్. గతంలో ఆయన నటించిన సూపర్ హిట్ చిత్రం కిక్. 2014లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ఆ సినిమాకు సీక్వెల్‌గా కిక్ 2 తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్ సాజిద్ నదియావాలా తాజాగా ప్రకటించారు. దాదాపు పదేళ్ల తర్వాత సీక్వెల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.(ఇది చదవండి: నేను తప్పు చేయలేదు, బిగ్‌బాస్ నన్ను రోడ్డున పడేశాడు)కాగా.. 2009లో టాలీవుడ్ హీరో రవితేజ హీరోగా నటించిన ‘కిక్. ఈ మూవీ ఆధారంగానే బాలీవుడ్లో కిక్ తెరకెక్కించారు. సల్మాన్‌ఖాన్, జాక్వెలిన్ ఫెర్నాడెంజ్ నటించిన ఈ సినిమాకు సాజిద్ నదియావాలా దర్శకత్వం వహించారు. యాక్షన్ కామెడీ ఫిల్మ్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా అందుకుంది. తాజాగా ఈ మూవీకి సీక్వెల్ అనౌన్స్ చేశారు మేకర్స్. View this post on Instagram A post shared by Nadiadwala Grandson (@nadiadwalagrandson) -
ప్రభుత్వ లిక్కర్ కిక్కెక్కట్లేదు : మంత్రి కామెంట్స్
చెన్నై: ప్రభుత్వ మద్యం దుకాణాల్లో(టాస్మాక్షాపులు) దొరికే లిక్కర్‌తో కిక్కు సరిపోక ప్రజలు సారా(అరకు) తాగుతున్నారని తమిళనాడు మంత్రి దురైమురుగన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తమిళనాడు అసెంబ్లీలో ఎక్సైజ్, ప్రొహిబిషన్ చట్టాన్ని బలోపేతం చేస్తూ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా దురైమురుగన్ మాట్లాడారు. టాస్మాక్ మద్యం దుకాణాల్లో దొరకే మందు కొందరికి సాఫ్ట్ డ్రింక్‌లా అనిపిస్తోందన్నారు. తమిళనాడులో పూర్తిగా మద్యాన్ని నిషేధించడం కుదరదని స్పష్టం చేశారు. పొరుగు స్టేట్స్లో మద్యం దొరుకుతున్నపుడు తమిళనాడులో పూర్తి మద్య నిషేధం అమలు చేయడం సాధ్యం కాదన్నారు.రోజంతా కష్టపడి పనిచేసుకునేవాళ్లు అలసట మరిచిపోయి నిద్రపోవాలంటే మద్యం అవసరమన్నారు. కాగా, దురైమురుగన్ వ్యాఖ్యలపై అన్నాడీఎంకే ఆగ్రహం వ్యక్తం చేసింది. డీఎంకే ప్రభుత్వ అసమర్థత వల్లే ఇటీవల కల్లకురిచిలో కల్తీసారా తాగి చాలా మంది మరణించారని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి కోవై సత్యన్ మండిపడ్డారు. -
15 ఏళ్ల క్రితం సూపర్ హిట్ అయిన రవితేజ సినిమా రీరిలీజ్
మాస్మహారాజా రవితేజ కెరియర్లో కిక్ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. సుమారు 15 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. రవితేజ, బ్రహ్మానందం ట్రాక్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. హల్వారాజ్ పాత్రలో బ్రహ్మానందం పండించిన కామెడీ సూపర్ హిట్ అని చెప్పవచ్చు. ఆ సినిమాలోని కామెడీ సీన్స్ ఇప్పుడు ఎక్కువగా మీమ్స్ రూపంలో కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కిక్ సినిమా రీరిలీజ్ కానుంది. సురేందర్‌రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా మార్చి 1న రీరిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ఇందులో రవితేజకు జోడీగా ఇలియానా నటించింది. కోలీవుడ్ నటుడు శామ్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అదిరిపోతుంది. కిక్ సినిమాతో థమన్, సురేందర్‌రెడ్డి,రవితేజలకు విపరీతమైన స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా కిక్ 2 కూడా వచ్చింది. కానీ అది కాస్త బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇప్పటికే ఈగల్తో థియేటర్లో సందడి చేస్తున్న రవితేజ.. మార్చి 1న కిక్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ రీరిలీజ్ చేయనున్నారు. ఫిబ్రవరిలో రవితేజ అభిమానుల కోసం ఒక ఈవెంట్‌ను కూడా ప్లాన్ చేస్తున్నారు. -
దర్శకనిర్మాత నన్ను వెతుక్కుంటూ పాండిచ్చేరి వచ్చారు: సంతానం
'డీడీ రిటర్న్స్' సినిమా సక్సెస్ జోష్‌లో ఉన్నాడు నటుడు సంతానం. తాజాగా ఇతడు ప్రేక్షకులకు మంచి కిక్ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ఈయన తాజాగా నటించిన చిత్రం కిక్. ఫార్చూన్ ఫిలిమ్స్ పతాకంపై నవీన్ రాజ్ నిర్మించిన ఈ చిత్రం ద్వారా కన్నడ దర్శకుడు ప్రశాంత్ రాజ్ కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు. తాన్యా నైతిక హీరోయిన్గా నటించింది. నటి రాగిణి త్రివేది, కోవై సరళ, తంబి రామయ్య, సెంథిల్, మన్సూర్ అలీ ఖాన్, బ్రహ్మానందం, సాధు కోకిల, ముత్తుకాళై, మనోబాల, కింగ్ కాంగ్, క్రేన్ మనోహర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. అర్జున్ జాన్య సంగీతం, సుధాకర్ రాజ్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెప్టెంబర్ 1న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర విడుదల హక్కులను వైఎంఆర్ క్రియేషన్స్ సంస్థ పొందింది. కాగా ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శనివారం సాయంత్రం చైన్నెలోని ఓ స్టార్ హోటల్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నటుడు సంతానం మాట్లాడుతూ.. ఒకరోజు ఈ చిత్ర నిర్మాత నవీన్ రాజ్, దర్శకుడు ప్రశాంత్ రాజ్ తనను వెతుక్కుంటూ పాండిచ్చేరి వరకూ వచ్చి కథ వినిపించారన్నారు. కథతో పాటు, వారి తమిళ భాషా నచ్చిందన్నారు. దీంతో చిత్ర షూటింగ్‌ను ఓకే షెడ్యూల్లో చైన్నెలో ప్రారంభించి న్యూయార్క్‌లో పూర్తి చేసినట్లు చెప్పారు. తాను ఇంతకుముందు నటించిన చిత్రాలకు పూర్తి భిన్నంగా కిక్ ఉంటుందన్నారు. ఇది అబ్బాయికి, అమ్మాయికి మధ్య ఇగో అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన సినిమా అని చెప్పారు. దీన్ని డీడీ రిటర్న్స్ చిత్రంతో పోల్చరాదని, ఇది మరో తరహాలో ఉంటుందన్నారు. దీన్ని సంతానం చిత్రం అనడం కంటే దర్శకుడు ప్రశాంత్ రాజ్ చిత్రం అనే చెప్పాలన్నారు. చదవండి: శేఖర్ మాస్టర్ విషయంలో చాలా బాధపడ్డాను.. సినిమా ఎంట్రీకి ఆ ఫోటోనే కారణం: శ్రీలీల -
కోహ్లీ పేరు ఫుల్ కిక్ ఇస్తుంది
-
చత్తీస్‌గఢ్‌లో దారుణం..పోలీసులు మహిళల జుట్టు పట్టుకుని, తన్ని..
అక్రమ కట్టడాల కూల్చివేత డ్రైవ్‌లో చోటు చేసుకున్న షాకింగ్ దృశ్యాలు తీవ్ర కలకలం రేపాయి. ఈ ఘటన చత్తీస్‌గఢ్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం చత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్‌లో టిల్సివా గ్రామంలో ఆక్రమణలకు వ్యతిరేకంగా జరుగుతున్న డ్రైవ్‌లో ఈ దారుణం చోటచేసుకుంది. ఓ పోలీసు అధికారి స్థానిక మహిళను జుట్టుపట్టి నేలపై లాగి.. తన్నుతూ పోలీస్ వ్యాన్‌లోకి లాక్కెళ్లారు. ఆక్రమణలకు వ్యతిరేకంగా కొంతమంది మహిళలు, స్థానికులు రెవెన్యూ అధికారులపై దాడి చేయడంతో వారి ఇలా అదుపు చేయాల్సి వచ్చిందిన పోలీసులు పేర్కొన్నారు. పశువులు షెడ్డు కోసం ఉద్దేశించిన భూమిని పద్దెనిమిది మంది ఆక్రమించారని స్థానికులు ఆరోపించారు. తాము ఏళ్ల తరబడి ఇక్కడే నివశిస్తున్నామని, మమ్మల్ని ఎవరూ ఆపలేదని ఓ మహిళ చెప్పుకొచ్చింది. మహిళలపై పోలీసులు బలప్రయోగం చేసి దారుణం ప్రవర్తిచారని చెప్పారు. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఒక గర్భిణిపై కూడా పోలీసులు దాడి చేసినట్లు స్థానికులు పేర్కొన్నారు. అయితే అదనపు పోలీసు సూపరింటెండెంట్ మధులికా శర్మ మాత్రం మహిళలు స్థానిక రెవెన్యూ అధికారులపై దాడి చేశారని అందుకే వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి: (చదవండి: రాహుల్ పాస్‌పోర్టుకు కోర్టు ఓకే) -
ఇన్స్టాంట్ ఖర్మ అంటే ఇదే.. గేదెను తన్ని బైక్‌పై నుంచి జారి..
జంతువుల పట్ల కొందరు అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. అవి ఎలాంటి హానీ చేయకపోయినా సరే శిక్షిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా మనసును కలచివేసేలా ఉంటున్నాయి. అయితే ఇలాగే ఓ మూగజీవాన్ని శిక్షించబోయిన ఆకతాయికి ఊహించని షాక్ తలిగింది. స్నేహితుడితో కలిసి బైక్‌పై వెళ్తున్న అతడు.. రోడ్డుపై ఉన్న ఓ గేదెను తన్నాడు. ఆ వెంటనే బైక్‌పై నుంచి జారి కిందపడ్డాడు. బైక్‌ను రైడ్ చేస్తున్న అతని స్నేహితుడు కూడా అదుపుతప్పి పోల్‌ను ఢీకొట్టాడు. దీంతో ఇద్దరు గాయాలపాలయ్యారు. Instant karma 😂 pic.twitter.com/jNFMfEf9Fm — CCTV IDIOTS (@cctvidiots) April 30, 2023 అయితే గతంలో ఎప్పుడో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆకతాయిపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. గేదె ఏం చేసిందని తన్నావు.. చూడు ఇప్పుడు నీకు ఏం జరిగిందో.. అందుకే మూగజీవాలకు హాని చేయెద్దు అని హితవు పలికారు. మరో నెటిజన్ ఈ వీడియోపై స్పందిస్తూ.. ఇన్స్టాంట్ ఖర్మ అంటే భయ్యా.. తప్పు చేసిన వెంటనే శిక్ష పడుతుంది. క్షణం కూడా ఆలస్యం కాదు.. అంటూ యువకుడ్ని చీవాట్లు పెట్టాడు. చదవండి: బ్యానెట్‌పై మనిషిని ఈడ్చుకెళ్లి..ఎంపీ డ్రైవర్ దారుణం! -
‘వడకుపట్టి రామసామి’గా సంతానం
తమిళ సినిమా: నటుడు సంతానం తాజా చిత్రం కిక్ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో ఆయన నూతన చిత్రానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రం మంగళవారం చెన్నైలో పూజ కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. దీనికి వడకుపట్టి రామసామి అనే టైటిల్ నిర్ణయించారు. కార్తీక్ యోగి దర్శకత్వం వహిస్తున్నారు. సంతానం, దర్శకుడు కార్తీక్ యోగి కాంబినేషన్లో ఇంతకుముందు డిక్కిలూన అనే సక్సెస్ఫుల్ చిత్రం వచ్చింది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థ అధినేతలు ఇంతకుముందు తెలుగులో గూఢాచారి వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించి కోలీవుడ్‌లో రంగ ప్రవేశం చేశారు. ఇక్కడ ఇప్పటికే విట్నెస్, సాలా వంటి వైవిధ్యభరిత కథా చిత్రాలను నిర్మించారు. తాజాగా సంతానం కథానాయకుడిగా వాడకుపట్టి రామసామి చిత్రం చేస్తున్నారు. దీని గురించి క్రియేట్ ప్రొడ్యూసర్ వి. శ్రీ నటరాజ్ మాట్లాడుతూ.. ప్రేక్షకులకు వివిధ జానర్లలో కమర్షియల్ అంశాలతో కూడిన మంచి వినోదభరితమైన కథా చిత్రాలను అందించాలని తమ ప్రధాన ఉద్దేశం అన్నారు. సంతానం నటించిన డిక్కీలూన చిత్రాన్ని చూశామన్నారు. దీంతో దర్శకుడు కార్తీక్ యోగి ఈ చిత్రకథ చెప్పగానే నచ్చిందన్నారు. వైద్య భరిత కథా చిత్రాలకు తమిళనాడులో మంచి ఆదరణ లభిస్తుందన్నారు. దర్శకుడు చెప్పిన కథకు ఈ టైటిల్ యాప్ట్ అవుతుందని భావించామని చెప్పారు. హీరోయిన్ ఎంపిక జరుగుతోందని తెలిపారు. నటుడు తమిళ్ కీలక పాత్ర పోషిస్తున్న ఇందులో జాన్ విజయ్, ఎంఎస్ భాస్కర్, రవి, మారన్, మొట్టె రాజేంద్రన్, నిళల్గళ్ రవి, శేషు, నటి జాక్యూలిన్ తదితరులు ముఖ్యపాత్ర పోషిస్తున్నారని వెల్లడించారు. దీనికి సాన్ రోల్డన్ సంగీతాన్ని, దీపక్ చాయాగ్రహణను అందిస్తున్నారు. -
Kerala: ఎంత క్రూరం! చిన్నారిని కాలితో తన్నాడు.. మరి జనం ఊరుకుంటారా?
-
ఎంత క్రూరం! కాలితో తన్నాడు.. జనం ఊరుకోలేదు!
కారుపై వాలాడని ఓ చిన్నారిని దూషించడంతో పాటు అతన్ని కాలితో గట్టిగా తన్నాడు ఓ వ్యక్తి. దీంతో పాపం ఆ పిలగాడు అమాయకంగా అక్కడి నుంచి కిక్కురుమనకుండా పక్కకు తప్పుకున్నాడు. అయితే దుర్మార్గాన్ని అక్కడే ఉన్న కొందరు మాత్రం ఊరుకోలేదు. కేరళలో తాజాగా ఈ ఘటన జరిగింది. చిన్నారిపై దాడి జరిగిన వెంటనే అక్కడే ఉన్న కొందరు యువకులు, మరికొందరు ఆ కారు చుట్టూ చేరారు. చిన్నారిని తన్నిన వ్యక్తిని నిలదీసి.. వాగ్వాదానికి దిగారు. అయితే అది తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోయాడు ఆ వ్యక్తి. బాధిత చిన్నారి రాజస్థాన్‌కు చెందిన వలసకూలీ కుటుంబానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై పోలీస్ కేసు నమోదు అయ్యింది. పొన్నియపాలెంకు చెందిన షిహ్షద్గా నిందితుడిని గుర్తించారు పోలీసులు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ యువలాయర్.. పోలీసుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లాడు. అయినా పోలీసుల నుంచి సరైన స్పందన రాలేదు. ఈలోపు సోషల్ మీడియా ద్వారా సీసీటీవీ ఫుటేజీ వైరల్ కావడంతో.. చర్యలు తీసుకోని పోలీసులపై పలువురు నెటిజన్లు మండిపడ్డారు. దీంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించాల్సి వచ్చింది. అయితే రాత్రికి రాత్రే అతన్ని మళ్లీ రిలీజ్ చేశారన్న కథనాలతో జనాల్లో ఆగ్రహం పెల్లుబిక్కింది. దీంతో కేరళ అసెంబ్లీ స్పీకర్, ఏఎన్ షంసీర్ ఈ ఘటనపై స్పందించాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి నెట్టాలని, కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన విద్యాశాఖ మంత్రి శివన్‌కుట్టీ.. మానవత్వం దుకాణాల్లో దొరికేది కాదంటూ వ్యాఖ్యానించారు. ఆరేళ్ల బాలుడు కారు మీద వాలిపోయాడని తన్నడం ఏంటి?. న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సిందే. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేశారాయన. -
వీడియో: శ్రీ చైతన్య కాలేజీలో షాకింగ్ ఘటన.. మరీ ఇంత దారుణమా?
లబ్బీపేట (విజయవాడ తూర్పు): తరగతి గదిలో మాట్లాడాడని ఓ విద్యారి్థని అధ్యాపకుడు చెంపలు వాయించడంతో పాటు, కాలితో తన్నిన ఘటన శుక్రవారం కలకలం రేపింది. విజయవాడ బెంజిసర్కిల్ సమీపంలోని శ్రీ చైతన్య కళాశాల భాస్కర్ భవన్ క్యాంపస్‌లో గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించడంతో జిల్లా విద్యాశాఖ అధికారులతో పాటు, చైల్డ్‌లైన్ వారు కూడా రంగంలోకి దిగారు. ఇంటర్ బోర్డు ప్రాంతీయ తనిఖీ అధికారి రవికుమార్, జిల్లా విద్యాశాఖాధికారి రేణుక కళాశాలకు వెళ్లి విచారించారు. విద్యార్థి ఇయర్‌ఫోన్స్‌లో పాటలు వింటుంటే ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో క్షణికావేశంలో అలా చేసినట్లు అధ్యాపకుడు చెబుతుండగా.. తమ అబ్బాయి వద్ద ఫోన్లేదని విద్యార్థి తల్లిదండ్రులు చెబుతున్నారు. అధ్యాపకుడ్ని కళాశాల యాజమాన్యం శుక్రవారం తొలగించినట్లు ఆర్ఐవో తెలిపారు. Sri chaithanya Bhaskar bhavan #Vijayawada.@ysjagan@AndhraPradeshCM@APPOLICE100 pic.twitter.com/yKyAKzvHdJ — 𝐇𝐚𝐫𝐢𝐤𝐫𝐢𝐬𝐡𝐧𝐚 𝐁𝐡𝐞𝐞𝐦𝐚𝐧𝐢 (@hari_bheemani) September 16, 2022 -
అమానుష ఘటన: గర్భిణిని కింద పడేసి, కాళ్లతో తన్ని...
కరాచి: పాకిస్తాన్ ఒక అమానుష ఘటన చోటు చేసుకుంది. గర్భిణి అన్న కనికరం లేకుండా కొట్టి కొందపడేసి బూట్లతో తన్ని దారుణంగా ప్రవర్తించాడు ఒక సెక్యూరిటి గార్డు. పోలీసులు తెలపిన కథనం ప్రకారం....పాకిస్తాన్‌లోని కరాచీలో నోమన్ గ్రాండ్ సిటీ అనే అపార్టమెంట్స్ గులిస్తాన్-ఎ-జౌహర్ బ్లాక్ 17లో ఉంది. సనా అనే ఒక ఐదు నెలల గర్భిణి ఆ ఆపార్టమెంట్స్ లోనే పనిమనిషిగా పనిచేస్తోంది. ఐతే ఆమె తన కొడుకు సోహిల్ తన కోసం ఆహారం తీసుకువచ్చాడని తనని లోపలికి అనుమతించాల్సిందిగా ఆ ఆపార్టమెంట్ సెక్యూరిటీ గార్డుని వేడుకుంది. ఐతే అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అబ్దుల్ నాసిర్, అదిల్ ఖాన్, మహ్మద్ ఖలీల్ లోపలకి రావడాని అంగీకరించలేదు. దీంతో సదరు మహిళ అక్కడ ఉన్న ఒక సెక్యూరిటీ గార్డుతో వాగ్వాదానికి దిగింది. ఐతే ఆ సెక్యూరిటీ గార్డు కోపంతో ఆమెను చెంపదెబ్బ కొట్టాడు. దీంతో ఆమె ఒక్కసారిగా కింద పడిపోయింది. తిరిగి లేచేందుకు ప్రయత్నించే లోపే బూట్లతో ముఖం పై తన్ని అమానుషంగా ప్రవర్తించాడు. దీంతో ఆ మహిళ స్ప్రుహ కోల్పోయింది. ఈ సంఘటన సీసీఫుటేజ్‌లో రికార్డు అవ్వడ్డంతో ఈ ఘటన వెలుగు చూసింది. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అంతేగాదు సింధ్ ముఖ్యమంత్రి మురాద్ అలీ షా ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. పైగా ఆ గార్డు అంత క్రూరంగా ఎలా ప్రవర్తించాడంటూ మండిపడ్డారు. ఆ గార్డు పై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు కూడా. (చదవండి: కలెక్టర్ టీనా దాబికే షాకిచ్చాడు.. మాములు ఐడియా కాదుగా..) -
సరదాగా ‘వెర్రి పని’.. పదేళ్ల జైలు శిక్ష
సాటి మనషుల మీదే కాదు.. మూగ జీవాల పట్లా వేధింపులు, హింసకు పాల్పడితే చట్టం ఊరుకోదు. అలా ఓ చిన్నప్రాణితో, అదీ తన పెంపుడు జంతువుతో వెర్రి వేషాలు వేసిన వ్యక్తికి.. కఠిన కారాగార శిక్ష స్వాగతం చెప్పింది. ఇంటర్నెట్లో(యూట్యూబ్‌లో) ఈ మధ్య ఒక వీడియో వైరల్ అయ్యింది. సముద్రం ఒడ్డున రెండు పిల్లులను ఆహారం ఎరవేసి కొద్దిసేపు ఆడించాడు ఓ వ్యక్తి. అలా ఆడిస్తూ.. అదంతా వీడియో తీశాడు. చివరకు.. ఓ పిల్లిని సముద్రంలోకి లాగి పెట్టి తన్నాడు. వెకిలి చేష్టలకు తోడు నవ్వులు నవ్వాడు. రెండో పిల్లితో అలానే వ్యవహరించబోయాడు. గ్రీస్‌లోని ఎవియా ఐల్యాండ్ దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది. దీంతో ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. అది తన పెంపుడు పిల్లే అని, అక్కడ నీళ్లు లేవని, ఆ పిల్లి సురక్షితంగానే ఉంది కదా! ఆ వ్యక్తి వాదించడం మొదలుపెట్టాడు. తనకు జంతువులంటే విపరీతమైన పనే అని చెప్తున్నాడు. కానీ, అతని నేరం మాత్రం రుజువైంది. దీంతో అక్కడి చట్టాల ప్రకారం.. అతనికి పేదళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇక పౌర హక్కుల పరిరక్షణ మంత్రి టకిస్ థియోడోరికాకోస్ నిందితుడి అరెస్ట్‌ను ధృవీకరించారు. మూగ జీవాల పట్ల ఇలాంటి హింసను సహించే ప్రసక్తే లేదని అంటున్నారాయన. గ్రీస్ చట్టాల ప్రకారం.. ఎవరైనా మూగ జీవాలను హింసించినా, దాడులకు పాల్పడినా పదేళ్లు జైలు శిక్షతో పాటు ఐదు నుంచి పదిహేను వేల డాలర్ల దాకా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈ ప్రమాదం నుంచి ఆ పిల్లి సురక్షితంగా బయటపడిందని, స్థానికంగా ఉన్న యానిమల్ సొసైటీ దాని సంరక్షణ చూసుకోవడంతో పాటు సదరు నిందితుడిపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. -
పోలీసులకు దొరికిపోయిన కిక్ శ్యామ్
-
నటుడు కిక్ శ్యామ్ అరెస్ట్, కారణం?
చెన్నై: తెలుగులో కిక్, రేసుగుర్రం, కత్తి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు శ్యామ్. ఇతనిని కోడంబాక్కం పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. అనుమతి లేకుండా జూదం, బెట్టింగులు నిర్వహిస్తున్నాడంటూ శ్యామ్ తో పాటు 14 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిక్ శ్యామ్ గా ఫేమస్ అయిన ఈ నటుడికి చెన్నైలోని కోడంబాక్కం ప్రాంతంలో ఓ పోకర్ క్లబ్ ఉంది. అనుమతి లేకుండా ఇక్కడ గ్యాంబ్లింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు దాడులు చేశారు. దీంతో పోలీసులు ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. నుంగంబాక్కంలో నివసిస్తున్న శ్యామ్ లాక్ డౌన్ నేపథ్యంలో తన నివాసంలోనే గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నట్టు పోలీసులు విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. చదవండి: ఉత్కంఠ రేపుతున్న వర్మ ‘మర్డర్’ ట్రైలర్ -
కిక్ ఇచ్చింది
‘‘స్టార్స్‌గా వెలుగుతున్న ప్రతి ఒక్కరికి ఒక స్ట్రగులింగ్ పాస్ట్ ఉంటుంది. ఎంత హార్డ్‌వర్క్ చేసి ఆ దశ దాటుతామో అంత మంచి సక్సెస్‌ను చూడగలుగుతాం’’ అని చెబుతున్నారు జాక్వెలిన్ ఫెర్నాండెజ్. యాక్టర్‌గా బిగ్ సక్సెస్‌ను అందుకోక ముందు తన కెరీర్లో చూసిన స్ట్రగులింగ్ పాస్ట్‌ను గుర్తు చేసుకున్నారు జాక్వెలిన్. ‘‘నా లైఫ్‌లో నేను చూసిన చీకటి రోజులంటే యాక్టర్‌గా నా తొలి రోజులు. కొన్ని సంవత్సరాల పాటు నాలో కాన్ఫిడెన్స్ అనేదే లేదు. నన్ను నేనే యాక్సెప్ట్ చేయలేనంత నెగటివిటీకి వెళ్లిపోయాను. మా నాన్నగారు వాటికన్ సిటీ చూడాలని అడిగారు. మా పేరెంట్స్‌ను ట్రీప్‌కు తీసుకువెళ్ళాను. నేను సొంతంగా వాళ్లకు చూపించే ఆఖరి ట్రిప్ ఇదే అవుతుందనుకున్నాను. చాలా బాధ అనిపించింది. ఒకవేళ మా పేరెంట్స్‌కు చూపించే లాస్ట్ ట్రిప్ ఇదే అనుకుంటే.. అదే అయ్యేదేమో. కానీ నేను ఇదే లాస్ట్ ట్రిప్ అవ్వాలనుకోలేదు. వాళ్లకి ఇంకా చూపించాలి, చాలా ఇవ్వాలని బలంగా నిర్ణయించుకున్నాను. నన్ను నిరుత్సాహరిచే వాళ్లందరినీ దూరం పెట్టాను. నా గోల్ మీద ఫుల్ ఫోకస్‌తో ట్రై చేశాను. అదే సమయంలో హీరో సల్మాన్ ఖాన్, దర్శకుడు సాజిద్ నడియాడ్వాలా నాకు ‘కిక్’ సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆ సినిమా నా కెరీర్‌కు ఫుల్ కిక్కిచ్చింది. సో.. ఎప్పుడూ మనం చేసే పని మీద కాన్ఫిడెన్స్ వదులుకోకూడదు. అదే నా ఎక్స్‌పీరియన్స్‌లో నేను నేర్చుకున్న లెసన్’’ అన్నారు జాక్వెలిన్. -
రవితేజకు లేటుగా అయినా కిక్కే కిక్కు!
టాలీవుడ్లో చాలా మంది ట్విట్టర్లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు అప్డేట్లు పోస్ట్ చేస్తుంటారు. కొంతమంది లేటుగా వచ్చినా లేటెస్టుగా ట్వీట్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటారు. మాస్ మహారాజా రవితేజ పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. అందరూ చెబుతుంటే ట్విట్టర్లోకి ఊరికే వచ్చానని, కానీ ఇక్కడ ఇంత కిక్ వస్తుందని తనకు ఇప్పుడే తెలిసిందని అన్నాడు. టచ్ చేశారు.. టచ్‌లో ఉంటా అని కూడా చెప్పాడు. ట్విట్టర్లోకి ప్రవేశించిన రవితేజ, ప్రస్తుతానికి టాలీవుడ్లో ఎవరినీ ఫాలో కాకపోయినా, బాలీవుడ్లో మాత్రం పెద్దాయన అమితాబ్ బచ్చన్‌ను, కండలవీరుడు సల్మాన్ ఖాన్‌ను ఫాలో అవుతున్నాడు. ట్విట్టర్లోకి కొత్తగా ప్రవేశించిన రవితేజను పలువురు నటీనటులు, దర్శకులు, ఇతరులు అభినందనలతో ముంచెత్తారు. అంతేకాదు, రవితేజ సాధారణంగా తన కుటుంబ విషయాలను పెద్దగా ఎవరితోనూ పంచుకోడానికి ఇష్టపడడు. కానీ అతడి ఫ్యామిలీ ఫొటో కూడా ట్విట్టర్లోకి వచ్చేసింది. ఆయన భార్య, కూతురు, కొడుకులతో దిగిన సెల్ఫీని ఒక అభిమాని ట్వీట్ చేయగా, దానికి రవితేజ థాంక్స్ చెప్పాడు. తమన్, హరీష్ శంకర్, రకుల్ ప్రీత్ సింగ్, మధుర శ్రీధర్, ఛార్మి, ప్రకాష్ రాజ్ భార్య పోనీవర్మ, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, వెన్నెల కిషోర్, హన్సిక, దర్శకుడు బాబీ.. ఇలా అనేకమంది రవితేజకు అభినందనలు తెలిపారు. Andharu chepthunte Twitter loki oorikey vacha, kani ikkada intha KICK vastundi ani ippude telsindi. Touch chesaru! Touch lo unta. — Ravi Teja (@RaviTeja_offl) 1 February 2017 -
ఈ ‘హీరో’... మళ్లీ గొంతు సవరించాడు!
‘‘హ్యాంగోవర్... తేరీ యాదోంకా... హ్యాంగోవర్...తేరీ బాతోంకా’’ అంటూ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ తన గానంతో అభిమానులను హ్యాంగోవర్లో పడేశారు . ‘కిక్’ సినిమా కోసం ఈ పాట పాడి అలరించారాయన. ఈ పాట పెద్ద హిట్ అయి కూర్చోవడంతో ‘అరె... మా సల్లూ భాయ్ మళ్లీ ఎప్పుడు పాడతాడు..?’అని అభిమానులు తెగ ఎదురు చూశారు. అందుకేనేమో ఆయన మళ్లీ గొంతు సవరించారు. అయితే ఆ పాట పాడింది తన కోసం కాదు, సూరజ్ పంచోలి ‘హీరో’ సినిమా కోసం. నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. సూరజ్ పంచోలి, అథియా శెట్టి జంటగా నటి ంచిన ఈ సినిమా రషెస్ చూసి సల్మాన్ చాలా ఇంప్రెస్ అయ్యారట. ఇందులో టైటిల్ సాంగ్ ఉంటే బాగుంటుందని భావించారట సల్మాన్. అది మాత్రమే కాదు.. ఆ పాటను తానే పాడాలనుకున్నారు. అమాల్ మాలిక్ సంగీత సారథ్యంలో ‘‘మై హూ తేరా’...’ అంటూ సల్మాన్ ఖాన్ పాడిన ఈ పాట రికార్డింగ్ అయిదు గంటల్లో పూర్తయిపోయింది. -
ఆగస్టులో కిక్-2 విడుదల
-
‘కిక్’ కోసం దొంగతనం!
ఆదిలాబాద్: ‘కిక్’ సినిమాలో హీరో రవితేజలా దొంగతనం చేసి కిక్కు పొందాలనుకున్నారో ఏమో గానీ.. జిల్లా కేంద్రంలోని ఓ బట్టల దుకాణంలో జరిగిన చోరిని చూస్తే అలాగే అనిపిస్తోంది. దొంగతనానికి వచ్చిన దొంగలు తమ పని పూర్తి చేసుకొని ఎప్పుడు వెళ్లిపోదామని చూస్తుం టారు. కానీ ఇక్కడ దొంగతనం చేసిన వారు మాత్రం దర్జాగా ‘కిక్’, కేకే 786 అంటూ సినిమా పేరు రాసి మారి వెళ్ల డం అందరినీ విస్మయానికి గురిచేసింది. పట్టణంలోని ఆరాధన బట్టల దుకాణంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగలు దుకాణం వెనుక గోడ(మూడంతస్తులు)ను తాడు సహాయం తో సినిమా ఫక్కీలో ఎక్కి మరీ దొంగతనం చేశారు. రూ.5 వేల నగదుతోపాటు, విలువైన బట్టలు ఎత్తుకెళ్లారు. సంఘటన స్థలానికి చేరుకున్న వన్‌టౌన్ సీఐ రఘు వివరాలను సేకరించారు. క్లూస్ టీంలతో అణువణువూ తనిఖీ చేరుుంచారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
కిక్కు పెంచేద్దాం
-
కిక్కు పెంచేద్దాం
- రాష్ట్రంలో వైన్‌షాపుల పెంపునకు ఎక్సైజ్ శాఖ ప్రతిపాదన - 3,500 షాపుల ఏర్పాటుతో మరింత ఆదాయం - ప్రతి జిల్లాలో వందకుపైగా కొత్తవి ఏర్పాటు - గుడుంబాను అరికట్టేందుకు చౌక మద్యం విక్రయాలు - ముఖ్యమంత్రి ఆమోదిస్తే జూలై నుంచి అమలు సాక్షి, హైదరాబాద్: జనాభా ప్రాతిపదికన మద్యం దుకాణాలను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ర్ట ప్రభుత్వం పావులు కదుపుతోంది. బెల్టుషాపులను నిరోధించడం, ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయాన్ని సమకూర్చుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. మూడున్నర కోట్ల రాష్ట్ర జనాభాకు 10 వేల మందికి ఒక దుకాణం చొప్పున ఏకంగా 3,500 మద్యం దుకాణాలకు ఈసారి అనుమతివ్వాలని ఆబ్కారీ శాఖ చేసిన ప్రతిపాదనకు ఉన్నతస్థాయిలో ఆమోదం లభించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అంగీకారమే మిగిలింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,216 దుకాణాలకు అనుమతి ఉంది. వీటిలోనూ రంగారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలో లెసైన్స్ ఫీజు అధికంగా ఉన్న కారణంగా వంద దుకాణాలను మద్యం వ్యాపారులెవరూ తీసుకోలేదు. కాగా, జులై 1 నుంచి అమలులోకి తేవాలని భావిస్తున్న కొత్త మద్య విధానంలో భాగంగా దుకాణాల సంఖ్యను 3,500కు పెంచాలని, తద్వారా మద్యం అమ్మకాలను పెంచుకోవడంతో పాటు లెసైన్స్ ఫీజుల రూపంలో అదనపు ఆదాయాన్ని కూడా పొందవచ్చని ఎక్సైజ్ శాఖ ప్రతిపాదించింది. దీంతో ప్రతి జిల్లాలో వందకుపైగా కొత్త షాపులు వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో మంత్రి టి. పద్మారావుగౌడ్‌తో ఎక్సైజ్ కమిషనర్ ఆర్.వి. చంద్రవదన్ తాజాగా సమావేశమై నూతన మద్యం విధానం విధివిధానాలను వివరించారు. లెసైన్స్ ఫీజుల్లో మార్పులు రాష్ట్రంలో మద్యం దుకాణాలకు ప్రస్తుతం ఆరు స్లాబుల్లో అనుమతులిస్తున్నారు. 10 వేల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో లెసైన్స్ ఫీజు రూ.3.25 లక్షలుగా ఉంది. 10 వేల నుంచి 50 వేల జనాభా గల ప్రాంతాల్లో రూ. 34 లక్షలు, 50 వేల నుంచి 3 లక్షల జనాభా ఉంటే రూ. 42 లక్షలు, 3-5 లక్షల జనాభా ఉంటే రూ.46 లక్షలు, 5-20 లక్షల జనాభాకు రూ. 68 లక్షలు, 20 లక్షలకు మించిన జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 90 లక్షలను లెసైన్స్ ఫీజుగా వసూలు చేస్తున్నారు. అయితే 10 వేల జనాభా లోపున్న ప్రాంతాల కేటగిరీలో కేవలం ఏజెన్సీ ప్రాంతాల్లోనే తప్ప ఎక్కడా మద్యం దుకాణాలు లేవు. గ్రామాల్లో వైన్‌షాపునకు అనుమతిచ్చేటప్పుడు దాని చుట్టుపక్కల గ్రామాలను కూడా పరిగణనలోకి తీసుకుని అనుమతిస్తారు. ఇప్పుడు ప్రతి 10 వేల జనాభాకు ఓ వైన్‌షాప్ ప్రాతిపదికన అనుమతులిస్తే లెసైన్స్ ఫీజుల్లోనూ మార్పులు తప్పనిసరి. జనాభా ప్రాతిపదికన దుకాణాల ఏర్పాటు వల్ల గ్రామాలు, బస్తీల్లో బెల్టుషాపుల బెడద కూడా తీరుతుందని ఎక్సైజ్ శాఖ తన ప్రతిపాదనల్లో పేర్కొన్నట్లు సమాచారం. రూ. 40లోపే 180ఎంఎల్ మందు రాష్ట్రంలో ఏరులై పారుతున్న నాటుసారా(గుడుంబా)ను అరికట్టాలంటే సారాయి తరహాలో చౌక మద్యాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు ఎక్సైజ్ అధికారులు వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి చౌకమద్యంపై అధ్యయనం చేశారు. ఆ నివేదిక ప్రకారం మహారాష్ట్రలో అమ్ముడవుతున్న ‘దేశీ దారూ’ తరహాలో వైన్‌షాపుల్లోనే చౌక మద్యాన్ని విక్రయించాలని, తద్వారా కొంత రెవెన్యూ నష్టపోయినా గుడుంబాను అరికట్టవచ్చని ఎక్సైజ్ శాఖ అభిప్రాయపడింది. దీనికి ప్రభుత్వం కూడా ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. త్వరలో ముఖ్యమంత్రితో జరిగే సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే వచ్చే జులై నుంచి కొత్త విధానం అమలులోకి వస్తుంది. -
సల్మాన్... ప్రైస్‌లెస్!
ఇప్పటి వరకు మనకు షర్ట్‌లెస్ సల్మాన్‌ఖాన్ తెలుసు. కానీ అతడిలో మరో యాంగిల్ బయటకు తీసింది శ్రీలంక చిన్నది జాక్వెలిన్ ఫెర్నాండెజ్. తన కెరీర్‌ను మలుపు తిప్పిన సల్లూభాయ్ ప్రైస్‌లెస్ అంటూ ఆకాశానికెత్తేసింది. అవకాశాల కోసం ఆశగా ఎదురు చూసి చూసి నిరాశలో కూరుకుపోయిన సమయంలో సల్మాన్ తనకు ‘కిక్’ సినిమా ఇచ్చాడని, ఆ ఉపకారానికి వెల కట్టలేమని ఎంతో ఉద్వేగంగా చెబుతోంది. ‘ఏ సినిమా అయినా సరే చాన్స్ వస్తే చాలని పరితపిస్తున్న రోజులవి. ఒక టైమ్‌లో అసలు హోప్స్ వదిలేసుకున్నా. ఫీల్డ్‌కు గుడ్‌బై చెబుదామా అన్న ఆలోచనా వచ్చింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సల్మాన్, సాజిద్ నదియావాలా ఆఫర్ ఇచ్చి ఆదుకున్నారు. ఏమిచ్చినా వారి రుణం తీర్చుకోలేనిది’ అంటూ అంతరాంగాన్ని ఆవిష్కరించింది జాక్వెలిన్. ఏదిఏమైనా... ‘కిక్’ అమ్మడికి డబుల్ కిక్ ఇచ్చిందనే చెప్పాలి. కెరీర్‌కు ఓ సూపర్ హిట్ టర్నింగ్ పాయింట్‌తో పాటు, సల్మాన్‌తో డేటింగ్షిప్! లక్కంటే అదే మరి! -
వ్యాపారులకే కిక్కు!
మార్కెట్లోకి జోరుగా కల్తీ మద్యం సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పెగ్గు మీద పెగ్గు కొడితే...! నిషా నింగినంటాలే... చుక్కలు నేలకు దిగి రావాలే. మందుబాబులు మబ్బులో విహరించాలి. ఇదీ మద్యం మహత్యం. అదేంటో ఈ మధ్య ఏ మందుబాబును కదిపినా ‘ఫుల్లు కొట్టినా కిక్కు ఎక్కుత లేదు గురూ’ అంటూ నిట్టూరుస్తున్నారు. తేడా ఎక్కడొస్తుందో తెలియక తలలు గోక్కుంటున్నారు. ఇంతకీ ఏం జరుగుతోందంటే....లిక్కర్ వ్యాపారుల చేతివాటంతోనే మద్యంలో తేడా వచ్చి.. మందుప్రియులకు మత్తెక్కడం లేదని ఇటీవలి సంఘటనలు చెబుతున్నాయి. మద్యం అమ్మకాలు తగ్గాయట! జిల్లాలో ఉన్నట్టుండి మద్యం సేల్స్ 18 శాతం తగ్గినట్టు ఎక్సైజ్ నివేదికలు చెప్తున్నాయి. గత ఏడాది ఈ నెలతో పోలిస్తే జిల్లా వ్యాప్తంగా 3 వేల కేసుల లిక్కర్ (ఐఎంఎల్) తక్కువగా అమ్ముడు పోయింది. నిజానికి ప్రతి ఏడాది కనీసం 10 శాతం లిక్కర్ అమ్మకాలు పెరగాలి. కానీ జిల్లాలో అనూహ్యంగా లిక్కర్ విక్రయాలు పడిపోవడం చర్చనీయంగా మారింది. అధికారులు ఇచ్చిన అలుసే... జిల్లాలో మద్యానికి మంచి డిమాండ్ ఉంది. రోజుకు సగటున రూ.33 కోట్ల వ్యాపారం జరుగుతుంది. అయితే ఇటీవల ఇది రూ.31 కోట్లకు పడిపోయిందని ఎక్సైజ్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. పక్క రాష్ట్రం నుంచి అక్రమ మద్యం (ఎన్డీపీల్ )గానీ, దుకాణ దారులు చేతి వాటం ప్రదర్శించడం గానీ జరిగి ఉండాలని రాష్ట్ర ఎక్సైజ్ నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. నిబంధనల ప్రకారం మద్యం దుకాణంలో సీసాలవారీగా మినహాయించి, విడి మద్యం (లూజ్సేల్) అమ్మకూడదు. అయితే ఎక్సైజ్ అధికారులు అక్రమంగా కల్పించిన వెసులు బాటుతో దుకాణదారులు విడిగా అమ్మకాలు సాగిస్తున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి కేసులు జిల్లాలో నమోదు కాకపోవడం గమనార్హం. మూతలు తీసి...నీళ్లు పోసి. ఎకై ్సజ్ అధికారులు వేసిన లేబుల్ చెదిరిపోకుండా దుకాణం యాజమాన్యం సీసాపై మూతను తొలగిస్తున్నారు. సీసాలోంచి 100 నుంచి 150 మిల్లీ లీటర్ల లిక్కర్ తీసివేసి అంతే మొత్తంలో నీళ్లు పోస్తున్నారు. అనుమానం రాకుండా తిరిగి యథాతధంగా లేబుల్ అతికించి విక్రయిస్తున్నారు. లేబులింగ్ విభాగంలో పనిచేసే ఎకై ్సజ్ అధికారులు తప్ప సాధారణ విధులు నిర్వర్తించే ఎక్సైజ్ సిబ్బంది గుర్తు పట్టలేరు. ఇలాంటి మోసాలు గతంలో మొట్రొపాలిటన్ సీటీలోని మద్యం దుకాణాల్లో మాత్రమే జరిగేవి. వేసిన లేబుల్ పోకుండా సీసాపై మూతలు తొలగించ గల నిపుణులు గతంలో చాలా కొద్ది మంది మాత్ర మే ఉండేవారు. ఇప్పుడు మాత్రం గల్లీకొకరు పుట్టుకొచ్చారు. అంతేకాదు వీరు ఆసక్తి ఉన్న వాళ్లకు మూతలు తీయడంలో తర్ఫీదు నిస్తున్నారు. మద్యం దుకాణం యాజమాన్యాలు తమకు నమ్మకస్తుడైన వ్యక్తికి ఇలాంటి తర్ఫీదు ఇస్తారు. మండలాల్లో కూడా మద్యం కల్తీ జరుగుతోంది. ఇటీవల గజ్వేల్ నియోజకవర్గంలో దుకాణంలో పనివాళ్లు మద్యం సీసాల మూత లు తీసి నీళ్లు పోస్తుండగా ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. అయితే ఆ తర్వాత జరిగిన తతంగంతో సదరు అధికారులు మద్యం దుకాణం మీద ఎలాంటి కేసులు నమోదు చేయకుండ వదిలేశారు. వ్యాపారుల, కిక్కు, మద్యం, Merchants, kick, alcohol -
కిక్ సీక్వెల్ తీస్తున్న సల్మాన్?
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ ఇప్పటివరకు తన 'దబాంగ్' సినిమా తప్ప మరి దేనికీ సీక్వెల్ తీయలేదు. కానీ త్వరలోనే 'కిక్' సినిమా సీక్వెల్ తీయబోతున్నారని సమాచారం. తెలుగులో సూపర్‌హిట్ అయిన కిక్ సినిమాను హిందీలో రీమేక్ చేసిన సల్లూభాయ్.. ఇప్పుడు సాజిద్ నడియాడ్వాలా దర్శకత్వంలో దానికి సీక్వెల్ చేయాలనుకుంటున్నారట. ఇప్పటివరకు సల్మాన్ నటించిన సినిమాలన్నింటిలోకీ కిక్ అత్యధిక వసూళ్లు సాధించింది. ఇప్పటివరకు అది దాదాపు రూ. 234 కోట్లు వసూలు చేసినట్లు బాక్సాఫీసు వర్గాలు చెబుతున్నాయి. ఇంతకుముందు సల్మాన్ నటించిన 'ఏక్ థా టైగర్' 188 కోట్లు వసూలు చేయగా, దాన్ని కూడా కిక్ ఓ తన్ను తన్నింది. దాంతో సాజిద్ స్నేహితులు, పంపిణీదారులు అందరూ కూడా దాని సీక్వెల్ తీయాల్సిందిగా చెబుతున్నారు. ఇప్పటికైతే నిర్మాతగా సాజిద్‌కు చేతినిండా సినిమాలున్నాయి. సల్మాన్ స్టార్ పవర్ కారణంగా కిక్ అనుకున్నదాని కంటే చాలా ఎక్కువ వసూళ్లు సాధించిందని, సీక్వెల్ ఎప్పుడు చేస్తామో అప్పుడే చెప్పలేమని అన్నారు. -
అటో సెక్సీ తార... ఇటో బొద్దుగుమ్మ...
అటో సెక్సీ తార... ఇటో బొద్దుగుమ్మ... అయినా కిక్ ఎక్కినట్టు లేదు తమిళ తంబి జయం రవికి. ఆలోచన అతనిదో... దర్శకుడిదో గానీ.. ఓ సాంగ్ కోసం ఏకంగా వంద మంది ఫారిన్ డ్యాన్సర్లను సెట్స్‌పైకి రప్పిస్తున్నారు. రవి హీరోగా నటిస్తున్న ‘రోమియో అండ్ జూలియట్’ సినిమాలో హన్సిక, పూనమ్ బజ్వా హీరోయిన్లు. వీరిద్దరూ సరిపోరనుకున్నారేమో... ‘రోమియో రోమియో జూలియట్’ పాటను భారీ స్థాయిలో ఇలా వంద మంది విదేశీ డ్యాన్సర్లతో ఇలా ‘బిగ్’ స్క్రీన్‌పై చూపాలని తపన పడుతున్నారు దర్శకనిర్మాతలు. -
'కిక్' ఇవ్వలేదు.. కోట్లు కొల్లగొడుతున్నాడు!
సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా బాలీవుడ్ లో రికార్డులను తిరగరాయడంలో సల్మాన్ ఖాన్ ఓ డిఫరెంట్ స్టైల్. ఇప్పటి వరకు బాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలో తన ఏడు చిత్రాలను వంద కోట్ల క్లబ్ చేర్చిన ఏకైక హీరోగా సల్లూభాయ్ ఓ రికార్డును క్రియేట్ చేశారు. ఇక తాజాగా విడుదలైన కిక్ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయినా.. కలెక్షన్లు మాత్రం కుమ్మెస్తున్నాయి. తెలుగులో విజయం సాధించిన కిక్ చిత్రం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. హిందీలో 'కిక్' రీమేక్ పై టాలీవుడ్ దర్శకుడు సురేందర్ రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారు. తెలుగులో కిక్ చిత్రంలోని ఉండే మజా.. హిందీ రీమేక్ లో కనిపించలేదని సురేందర్ రెడ్డి అన్న సంగతి తెలిసిందే. అభిమానులు, ప్రేక్షకులు పెదవి విరిచినా.. కలెక్షన్లు మాత్రం భారీగా వచ్చాయి. కిక్ చిత్రంతో తొలిసారి సల్మాన్ ఖాన్ 200 కోట్ల క్లబ్ లో చేరి అమీర్ ఖాన్, షారుక్ ఖాన్ లకు సవాల్ విసిరాడు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కిక్ చిత్రం 309 (గాస్) కోట్లు వసూలు చేయగా, ప్రపంచవ్యాప్తంగా 377 (గ్రాస్) కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ధూమ్3 చిత్రం 542 కోట్లు, చెన్నై ఎక్స్ ప్రెస్ 422 కోట్లు, 3 త్రీ ఇడియెట్స్ 395 కోట్లు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేశాయి. -
కిక్ మార్చింది భవిత
జాక్విలిన్ ఫెర్నాండెజ్‌కు బాగానే ‘కిక్’ దొరికింది. సల్మాన్‌తో నటించిన ‘కిక్’ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తుండటంతో జాక్విలిన్‌కు ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. ఇప్పటికే ‘రాయ్’తో పాటు హృతిక్ రోషన్‌తో ఒక చిత్రానికి సంతకం చేసిన జాక్విలిన్, తాజాగా కరణ్ జోహార్ చిత్రం ‘వారియర్’లో నటించేందుకు సంతకం చేసింది. ఇందులో అక్షయ్ కుమార్, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. కౌర్‌కు దొరికింది కథ తొలిచిత్రం ‘కర్లే ప్యార్ కర్లే’ బాక్సాఫీస్ వద్ద బోల్తాపడటంతో కొన్నాళ్లు తెరమరుగైన హస్లీన్ కౌర్, తాజాగా ‘డీఎన్ఏ ఆఫ్ లవ్’ చిత్రంతో తెర ముందుకొస్తోంది. అమిత్ కసారియా రూపొందిస్తున్న ఈ చిత్రంలో అధ్యయన్ సుమన్ సరసన హస్లీన్ హీరోయిన్గా నటించనుంది. ఒక రాత్రి జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ చిత్ర కథ ఉత్కంఠభరితంగా ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. కుర్ర హీరోకు దక్కింది ఘనత జాకీ షరాఫ్ కొడుకు టైగర్ షరాఫ్‌ను దక్షిణ కొరియా సర్కారు సత్కరించనుంది. తొలిచిత్రం ‘హీరోపంతి’లో టైగర్ షరాఫ్ తైక్వాండో పోరాట దృశ్యాలు కొరియన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంతో తైక్వాండో రాజధానిగా పేరుపొందిన కుకివాన్ పట్టణంలో టైగర్ షరాఫ్కు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. తైక్వాండోలో ఐదో డిగ్రీ బ్లాక్‌బెల్ట్ సాధించిన టైగర్ షరాఫ్‌ను యూత్ ఐకాన్‌గా సత్కరించాలని దక్షిణ కొరియా సర్కారు నిర్ణయించుకున్నట్లు సమాచారం. -
నాకు ఈ సినిమాతో మరింత 'కిక్'!
ముంబై: ఈ మధ్యనే బాలీవుడ్ లో విడుదలై రికార్డులు సృష్టిస్తున్న కిక్ చిత్రంలో విలన్ గా నటించిన నవాజుద్దీన్ సిద్ధిఖి తన సినీ భవిష్యత్తుపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాతో తనకు మరిన్ని అవకాశాలు కల్పిస్తోందని ఆశా భావం వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికే పలు చిత్రాల్లో నటించినా ఈ చిత్ర విజయం మాత్రం కచ్చితంగా తన రాబోయే చిత్రాలపై ప్రభావం చూపుతుందన్నాడు.'నేను నటుడిగా చాలా చిత్రాలు చేశాను. ఇది నిజంగా ఒక సవాల్ గా భావించి చేశాను.అది నాకు కచ్చితంగా లాభిస్తుంది'అని తెలిపాడు. కహానీ, మిస్ లవ్లీ చిత్రాల్లో నటించిన సిద్ధిఖి చేతిలో ప్రస్తుతం ఏడు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు సల్మాన్ ఖాన్ తాజా చిత్రం వసూళ్లలో కొత్త రికార్డులు సృష్టిస్తూ కిక్కెక్కిస్తోంది. షారుక్ ఖాన్ నటించిన 'జబ్ తక్ హై జాన్', సల్లూభాయ్ నటించి 'దబాంగ్2' చిత్రం వసూళ్లను 'కిక్' అధిగమించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డును తిరగరాస్తోంది. -
బాక్సాఫీస్ రికార్డులతో కిక్కెక్కిస్తున్న సల్మాన్!
బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు సల్మాన్ ఖాన్ తాజా చిత్రం వసూళ్లలో కొత్త రికార్డులు సృష్టిస్తూ కిక్కెక్కిస్తోంది. షారుక్ ఖాన్ నటించిన 'జబ్ తక్ హై జాన్', సల్లూభాయ్ నటించి 'దబాంగ్2' చిత్రం వసూళ్లను 'కిక్' అధిగమించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డును తిరగరాస్తోంది. దబాంగ్ చిత్ర వసూలు చేసిన 265 కోట్ల గ్రాస్ కలెక్షన్లను దాటింది. కిక్ చిత్రం రెండవ శుక్రవారం ముగింపు రోజున ప్రపంచవ్యాప్తంగా 313 కోట్ల రూపాయలను వసూలు చేసింది. కేవలం భారత దేశంలోనే నికరంగా 197.70 (గ్రాస్ 262) కోట్ల రూపాయలను వసూలు చేసింది. -
మూవీ బజ్: సల్మాన్ ఔదార్యం
ఈసారి ఈద్-ఉల్-ఫితర్ పండుగ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు వంద కోట్ల ‘కిక్’ ఇచ్చింది. అయితే, ‘కిక్’ తలకెక్కించుకోకుండా అతడు హృద్రోగులపై ఔదార్యాన్ని చాటుకోవడం విశేషం. తన స్వచ్ఛంద సంస్థ ‘బీయింగ్ హ్యూమన్’ ద్వారా గుండె జబ్బులతో బాధపడే వందమంది చిన్నారులకు ఉచితంగా చికిత్స కల్పించనున్నట్లు ఈద్ సందర్భంగా ప్రకటించాడు. శ్రద్ధాకు గాయం వరుణ్ ధావన్ హీరోగా రెమో డిసౌజా రూపొందిస్తున్న ‘ఏబీసీడీ 2’ చిత్రం రిహార్సల్స్‌లో హీరోయిన్ శ్రద్ధా కపూర్ గాయపడింది. నాట్య ప్రధానమైన ఈ చిత్రంలో ఒక సన్నివేశం కోసం రిహార్సల్స్ చేస్తుండగా, అనుకోకుండా ఆమెకు గాయమైంది. వైద్యుల సూచన మేరకు వారం రోజులు విశ్రాంతి తీసుకుంటూ, ఫిజయోథెరపీ చేయించుకుంటోంది. వివేక్ పునరాగమనం యశ్‌రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ రూపొందిస్తున్న ‘బ్యాంక్ చోర్’లో వివేక్ ఓబెరాయ్ సీబీఐ పాత్ర పోషిస్తున్నాడు. ‘సాథియా’ విడుదలైన పన్నెండేళ్ల విరామం తర్వాత వివేక్ తిరిగి యశ్‌రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ సినిమాలో నటిస్తుండటం విశేషం. వివేక్ పునరాగమనం పట్ల యశ్‌రాజ్ ఫిలిమ్స్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేసింది. -
ఏకైక బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ భారతీయ సినిమా చరిత్రలో ఓ ఆరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఇటీవల కాలంలో తాను నటించిన ఏడు చిత్రాలను వరుసగా వంద కోట్ల క్లబ్ లో చేర్చిన ఏకైక బాలీవుడ్ నటుడిగా సల్మాన్ ఖాన్ ఓ ఘనతను సాధించారు. తాజాగా విడుదలైన కిక్ చిత్రం వంద కోట్ల క్లబ్ లో చేరింది. కిక్ చిత్రంపై మిశ్రమ స్పందన వస్తున్నప్పటికి త్వరలోనే 200 కోట్ల క్లబ్ చేరనుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వంద కోట్ల క్లబ్ లో సల్మాన్ ఖాన్ నటించిన చిత్రాలు: కిక్ -126.70* ఏక్ థా టైగర్ -198.00 దబాంగ్-2 - 158.50 దబాంగ్ - 145.00 బాడీగార్డ్ - 142.00 రెఢీ - 120.00 జై హో -111.00 -
సల్మాన్ ఖాన్ 'కిక్'.. తొలిరోజు రూ. 26 కోట్లు
ముంబై: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటించిన తాజా చిత్రం కిక్ తొలిరోజే కలెక్షన్ల వర్షం కురిపించింది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ఒక్క రోజే 26 కోట్ల రూపాయిలకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాలో సల్మాన్ సరసన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించింది. సాజిద్ నడియాడ్వాలా నిర్మించిన ఈ చిత్రంలో రణదీప్ హుడా, నవాజుద్దీన్ ఇతర ముఖ్య తారాగణం. నర్గీస్ ఫక్రీ ఐటం సాంగ్‌లో చిందేసింది. ఈ సినిమాకు బాక్సాఫీసు వద్ద హిట్ టాక్ వచ్చింది. -
కొనసాగుతున్నఫొటోల నిషేధం
తెలుగులో హిట్టయిన ‘కిక్’ హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా రీమేకై, శుక్రవారం విడుదలై, పాజిటివ్ టాక్‌తో నడుస్తోంది. అయితే, ఈ చిత్ర ప్రచారం సందర్భంగా పది రోజుల క్రితం ఫొటోగ్రాఫర్లతో, సల్లూ భాయ్‌కి రేగిన వివాదం మాత్రం ఇంకా నడుస్తూనే ఉంది. సాజిద్ నడియాడ్వాలా దర్శకత్వంలో తయారైన ఈ చిత్రాన్ని ప్రత్యేక ప్రదర్శన వేసినప్పుడు ఫొటోగ్రాఫర్లు కూడా హాజరయ్యారు కానీ, సల్మాన్‌ను ఫొటో తీయలేదు. సినీ కార్యక్రమాల్లో సల్మాన్ ఫొటోలు తీయకూడదంటూ, తమకు తాముగా విధించుకున్న నిషేధానికి ముంబయ్ ఫొటోగ్రాఫర్లు కట్టుబడి ఉన్నారు. ఈ నిషేధం ఫలితంగా ‘కిక్’ సినిమా ప్రచార కార్యక్రమాల్లో సల్మాన్ ఖాన్ ఫొటోలు రావడం లేదు. సల్మాన్ దురుసు ప్రవర్తనకు నిరసనగా, ఆయనను బాయ్‌కాట్ చేయాలని ముంబయ్ ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ నిర్ణయించుకున్నప్పటికీ, సినిమా ప్రమోషన్‌కు మాత్రం సహకరించాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆ మాట మీదే నిలబడింది. అయితే, సల్లూ భాయ్ మాత్రం ఫొటోగ్రాఫర్ల నిషేధాన్ని తేలికగా తీసుకొని, ‘వాళ్ళ వల్ల నేనేమీ స్టార్‌ను కాలేద’న్న మాటకే కట్టుబడ్డారు. వెరసి, ప్రత్యేక ప్రదర్శనలో హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్, స్క్రీన్‌ప్లే రచనలో పాలుపంచుకొన్న ప్రముఖ రచయిత చేతన్ భగత్, నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ లాంటి వారి ఫోటోలు తీయడంలో ఫొటోగ్రాఫర్లు మునిగిపోయారు. ‘కిక్’ వాణిజ్య ఫలితం ఎలా ఉన్నా, మీడియాతో ఈ వివాదానికి సల్లూ భాయ్ ఫుల్స్టాప్ పెడితేనే, ఇరు పక్షాలకు మేలని వేరే చెప్పాలా? -
ఐటెం సాంగులకైనా నేను రెడీ
బాలీవుడ్ సినిమాల్లో తాను ఐటెం సాంగులు చేయడానికి కూడా సిద్ధమేనని చెబుతోంది జాక్వెలిన్ ఫెర్నాండెజ్. బాలీవుడ్ సినిమాలలో పాటలు, డాన్సులు చాలా ముఖ్యమైన భాగమని, అందుకే.. ఏదైనా సినిమాలో తనకు ఐటెం సాంగ్ వస్తే తప్పకుండా చేస్తానని ఈ శ్రీలంక చిన్నది చెప్పింది. ప్రస్తుతం కిక్ సినిమా ప్రమోషన్లో మహా బిజీగా ఉన్న జాక్వెలిన్.. ఎందుకోగానీ, కత్రినా కైఫ్‌ను పొగడ్తల్లో ముంచెత్తింది. కత్రినా కైఫ్ భలే కష్టపడి పనిచేస్తుందని, అందుకే ఇన్ని సంవత్సరాల నుంచి ఆమె బాలీవుడ్‌ను ఏలుతోందని జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తెగ పొగిడేసింది. కిక్ సినిమాలో హీరో సల్మాన్‌ఖాన్‌కు మాజీ ప్రేయసి అయిన కత్రినాను పొగిడితే తనకు ఉపయోగం ఉంటుందని భావించిందో ఏమో గానీ.. ఈ పని మొదలుపెట్టింది. కష్టపడకుండా ఏమీ సాధించలేమని, కత్రినా ఇన్ని సంవత్సరాల నుంచి బాగా కష్టపడుతుండటం వల్లే ఇన్నేళ్ల నుంచి అగ్రస్థానంలో కొనసాగుతోందని తెలిపింది. -
అధరం.. మధురం.... గచ్ఛామి!
ఆఫ్ స్క్రీన్‌పై ఎలా ఉన్నా.. ఆన్‌స్క్రీన్‌పై బుద్ధిమంతుడిగా కనిపించే సల్లూ.. లైన్ దాటాడు. కామన్‌గా తన సినిమాల్లో లిప్‌లాక్‌లకు చోటివ్వని సల్మాన్ ‘కిక్’లో మాత్రం.. పెదాలు కలిపాడట. జాక్వెలిన్‌తో లిప్‌లాక్ సన్నివేశంలో నటించాడట. ఈ కండల వీరుడు ముద్దు సన్నివేశం ఎలా పండించాడో చూడాలి! స్క్రీన్‌పై ముద్దులు పంచే ఇమ్రాన్హష్మీని చూసి మొదట్లో ఆకతాయి అనుకున్నాననేది పాకిస్థానీ నటి హుమైమా మాలిక్ కామెంట్. రాజా నట్వర్లాల్ సినిమాలో హష్మీతో చేసిన ఈ అమ్మడు మాట మార్చుకుంది. హష్మీ ఎలాంటివాడో ఆయనతో కలసి నటి స్తే గానీ తనకు అర్థం కాలేదని చెప్పుకొచ్చింది. ఫన్నీగై అని కితాబిచ్చింది. సోనమ్ కపూర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. రానున్న ‘ఖూబ్సూరత్’ సినిమాలో ఈ ముద్దుగుమ్మ ముద్దు సీన్ సోషల్ హబ్‌లో చక్కర్లు కొడుతోంది. ‘ఖూబ్సూరత్’లో హీరో విక్రమ్ బుగ్గలను అధరాలతో తడిమిన సీన్‌ను సోనమ్ ఆన్లైన్లో ‘షేర్’ చేసి అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. -
హాలీవుడ్ కంటే... బాలీవుడ్డే బాగుంది..!
ముంబై: హాలీవుడ్ చిత్రం ‘స్పై’తో తెరంగేట్రం చేసిన నాజూకు సుందరి నర్గిస్ ఫఖ్రీ తనకు బాలీవుడ్ చిత్రాల్లో నటించడమే సౌకర్యవంతంగా ఉందని చెబుతోంది. ‘హాలీవుడ్ కంటే బాలీవుడ్ సినిమాల్లో నటించడమే నాకు సౌకర్యవంతంగా ఉంది. ఎందుకంటే నేను ఎక్కువ సమయం ఇక్కడే గడుపుతున్నాను. పైగా ఎన్నో విషయాలను బాలీవుడ్లో నటించడం ద్వారా నేర్చుకుంటున్నాను. అందుకే నాకు ఇక్కడే బాగుంది. మరెక్కడికీ వెళ్లే ఆలోచన కూడా లేద’ని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. తనకు సంగీతం, నృత్యమంటే ఎంతో ఇష్టమని, బాలీవుడ్ చిత్రాల్లో వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని, తాను ఇక్కడ సౌకర్యవంతంగా ఉందని భావించడం వెనుకు ఇది కూడా ఓ కారణమని తెలిపింది. ప్రస్తుతం హాలీవుడ్ చిత్రాలతోపాటు బాలీవుడ్ చిత్రాలను కూడా అంగీకరిస్తున్నానని, బాలీవుడ్లో కూడా అవకాశాలు వస్తుండడంపై సంతోషంగా ఉందని చెప్పింది. ఈ గుర్తింపు తనకు తానుగా తెచ్చుకున్నదని, అందుకే తన ప్రయాణం తనకెంతో గర్వంగా ఉందంది. బాలీవుడ్లో కొన్ని కథలు వింటున్నానని, అంగీకరించే విషయంలో తగినంత సమయం తీసుకుంటానని, తొందరపాటుగా అంగీకరించడం తనకు అటవాటు లేదని ఈ ‘రాక్‌స్టార్’ నటి చెప్పింది. నటనను కెరీర్‌గా ఎంచుకున్నప్పటి నుంచి పెద్దపెద్దవారితో నటించే అవకాశం దక్కిందని, ఇదంతా దేవుడి దయవల్లే జరిగిందని తెలిపింది. రణ్‌బీర్ కపూర్‌తో కలిసి ‘రాక్‌స్టార్’లో నటించడం, జాన్ అబ్రహాంతో కలిసి ‘మద్రాస్ కేఫ్’లో నటించడం, వరుణ్ ధవన్‌తో కలిసి ‘మై తేరా హీరో’లో నటించడం తనకు బాలీవుడ్లో ఎంతో గుర్తింపు తీసుకొచ్చిందని, అందుకు తాను సంతోషంగా ఉన్నానని చెప్పింది. -
అబ్బో.. జాక్వెలిన్ అదుర్స్
బాలీవుడ్ ముదురు బ్రహ్మచారి సల్మాన్‌ఖాన్‌కు ఎప్పుడు ఏ హీరోయిన్ నచ్చుతుందో అతడికే తెలీదు. తాజాగా తనతో కలిసి కిక్ సినిమాలో నటించిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మీద సల్లూభాయ్ తెగ ప్రశంసలు కురిపించేశాడు. ఈ సినిమాలోని ఓ పాటలో ఆమె చాలా అద్భుతంగా ఉందని సల్మాన్ చెప్పాడు. 28 ఏళ్ల ఫెర్నాండెజ్‌ను ట్విట్టర్లో కూడా వదలకుండా ఫాలో అవుతున్న 48 ఏళ్ల సల్మాన్ ఖాన్.. ఆమె చాలా ఫన్నీగా ఉంటుందని చెబుతున్నాడు. హేంగోవర్ పాటలో ఆమె చాలా అద్భుతంగా ఉందని, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలలో ఆమె చాలా ఫన్నీగా ఉంటుందని చెబుతూ ఆకాశానికి ఎత్తేశాడు. దబాంగ్ సినిమాలో సల్మాన్ ఖాన్‌ను చూసినప్పటి నుంచి ఎలాగైనా ఆయనతో కలిసి నటించాలని అనుకున్నానని, ఇన్నాళ్ల తర్వాత కిక్ సినిమాలో అవకాశం రావడంతో తాను వెంటనే అంగీకరించేశానని జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా ఆమధ్య మీడియాతో చెప్పింది. సల్మాన్ ఖాన్ స్వయంగా పాడిన 'హేంగోవర్' పాట ఇప్పటికే యూట్యూబ్‌లో విడుదలైంది. మూడు రోజుల్లోనే దీన్ని దాదాపు 4 లక్షల మంది చూశారు. ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాడ్వాలా తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 25న విడుదల కావచ్చని అంటున్నారు. -
నేను అర్జంట్‌గా టాయిలెట్‌కి వెళ్లాలి...
ఇదేంటి! సల్మాన్‌ఖాన్ స్టిల్ పెట్టి ‘నేను అర్జంట్‌గా టాయిలెట్‌కి వెళ్లాలి’ అంటారేం టనుకుంటున్నారా! అయితే ముందు అర్జంట్‌గా ఇటీవలే విడుదలైన సల్మాన్ ‘కిక్’ ప్రచార చిత్రం చూడండి. ఎందుకో మీకే అర్థమవుతుంది. అసలు విషయం ఏంటంటే... ఈ ట్రైలర్లో సల్మాన్ చెప్పిన డైలాగ్ ఇది. సల్మాన్ ఈ డైలాగుని హిందీలో చెప్పారనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. అచ్చ తెలుగులో చెప్పారు. అవును.. నిజం. ‘నేను అర్జంట్‌గా టాయిలెట్‌కి వెళ్లాలి’ అంటూ చక్కగా తెలుగులో డైలాగ్ చెప్పారు. కథ రీత్యా లాకప్‌లో ఉన్న సల్మాన్... పోలీసులతో చెప్పే డైలాగ్ ఇది. అసలు ఆ సన్నివేశంలో ఆయన తెలుగులో మాట్లాడాల్సిన అవసరం ఎందుకొచ్చింది? తెలుగు డైలాగ్ ఈ సినిమాలో ఇదొక్కటేనా? ఇంకా ఉంటాయా? అనేది ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం. ఇక ట్రైలర్ విషయానికొస్తే... దేశవ్యాప్తంగా ఉన్న సల్మాన్ అభిమానులు పండుగ చేసుకునేలా ఉంది. కేవలం రెండున్నర నిమిషాల ట్రైలర్లోనే ఊహకందని ఫీట్లు చేసేశాడు సల్మాన్. ఇక సినిమాలో ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. సూపర్‌హీరో లుక్‌తో సల్మాన్ చేసిన విన్యాసాలు ప్రేక్షకుల్ని అబ్బురపరిచేలా ఉన్నాయి. రెండు చక్రాల సైకిల్ నుంచి గాల్లో ఎగిరే హెలికాప్టర్ వరకూ ప్రతి వాహనంతో ఆడుకున్నారు సల్మాన్. ఈ ప్రచారచిత్రంతో సినిమాపై అంచనాలు ఆకాశమంత ఎత్తుకు చేరాయనడం తప్పేం కాదు. హాలీవుడ్ స్థాయిలో ‘కిక్’ ఉండబోతోందనడానికి ఈ ట్రైలరే ఓ నిదర్శనం. తెలుగు సినిమాలపై విపరీతమైన అభిమానం కనబరిచే సల్మాన్... గతంలో ‘పోకిరి, రెఢీ, స్టాలిన్’ చిత్రాలను బాలీవుడ్లో రీమేక్ చేశారు. రాబోతున్న ‘కిక్’ కూడా రవితేజ ‘కిక్’ సినిమాకు రీమేక్ కావడం గమనార్హం.పైగా ఈ ట్రైలర్లో ఆయన తెలుగులో మాట్లాడడం నిజంగా విశేషమే. -
40 అంతస్థుల బిల్డింగ్‌పై సాహసం
బాలీవుడ్ స్టార్లలో మాస్ ఇష్టపడే హీరో ఎవరు? అంటే... టక్కున వచ్చే సమాధానం సల్మాన్‌ఖాన్. ఆటోల మీద, లారీల పైన, మెకానిక్ షాపుల్లో, బ్యాచ్లర్స్ రూముల్లో... ఇలా ఉత్తరాదిన ఎక్కడపడితే అక్కడ సల్మాన్ బొమ్మలే కనిపిస్తుంటాయి. అయితే... ఇక్కడే కాదు... ప్రపంచం మొత్తం ఈ కండలవీరుడికి అభిమానులున్నారని ఇటీవల జరిగిన ఓ సంఘటనతో స్పష్టమైంది. వివరాల్లోకెళ్తే... సినిమా షూటింగులకు సౌకర్యవంతంగా ఉండటం, నిర్మాతలకు ఖర్చు కూడా తక్కువగా అవుతుండటంతో ఇటీవల పోలండ్‌లో మన భారతీయ సినిమాల షూటింగులు ఊపందుకున్నాయి. ‘జిందగీ న మిలేగీ దొబారా’ చిత్రం కూడా అక్కడ తెరకెక్కిందే. ప్రస్తుతం పలు బాలీవుడ్ సినిమాల షూటింగులు పోలండ్‌లోనే రూపొందుతున్నాయి. అయితే, ఏ సినిమాకూ ఎదురుకాని సమస్య... సల్మాన్‌ఖాన్ హీరోగా రూపొందుతోన్న ‘కిక్’ సినిమాకు తలెత్తింది. పోలండ్ రాజధాని వార్సాలో ఈ సినిమాకు సంబంధించిన పతాక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సాజిద్ నడియాడ్వాలా. పోలండ్ దేశంలోనే అత్యంత ఎత్తయిన బిల్డింగ్(కల్చర్ అండ్ సైన్స్) పై నుంచి వేళ్లాడుతూ, రకరకాల ఫీట్లు చేస్తూ సల్మాన్ ఫైట్ చేయాలి. అది నలభై అంతస్థుల బిల్డింగ్. సల్లూభాయ్ కెరీర్లోనే అత్యంత ప్రమాదకరమైన ఫీట్ ఇది. వారం రోజుల పాటు జరిగే ఈ ఫైట్ చిత్రీకరణ విషయంలో దర్శకుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారట. ఈ ఫైట్ వివరాలను పోలండ్‌లోని అత్యధిక సర్క్యులేషన్‌గల పత్రికైన ‘గజెటా వైబోర్కా’ ప్రచురించింది. దాంతో అక్కడి చానల్స్‌లో కూడా ఈ ఫైట్ గురించి పెద్ద ఎత్తున కథనాలు ప్రసారమయ్యాయి. దాంతో వేలాది మంది అభిమానులు కల్చర్ అండ్ సైన్స్ బిల్డింగ్ వద్దకు చేరుకున్నారు. ‘సల్మాన్... సల్మాన్’ అంటూ నినాదాలు చేస్తూ లొకేషన్ మొత్తాన్నీ రచ్చ రచ్చ చేశారు. దాంతో, విదేశీయుల్లో కూడా తనకు ఇంతమంది అభిమానులున్నారా అని విస్తుపోవడం సల్మాన్ వంతు అయిందట. వారిని కట్టడి చేయడం పోలండ్ పోలీసులకు పెద్ద సమస్యగా మారింది. మరి సల్లూభాయా మజాకా! -
పోలెండ్ లో సల్మాన్ వెంటపడ్డ అభిమానులు!
సల్మాన్.. సల్మాన్ అంటూ బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్, కండలవీరుడు సల్లూభాయ్ వెంట ముంబై, హైదరాబాద్.. ఇతర ప్రాంతాల్లో వెంట పడితే అది సామాన్యమైన విషయమే. భారత దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ సల్మాన్ కు ఫ్యాన్ పాలోయింగ్ బాగానే ఉందనే విషయం అందరికి తెలిసిందే. సల్మాన్ కు ఉన్న ఇమేజ్ ఎలాంటిదనే విషయం పోలాండ్ లో మరోసారి స్పష్టమైంది. అయితే పోలాండ్ లో సల్లూ అభిమానులు, బాలీవుడ్ చిత్రాలను అభిమానించే విదేశీయులు సల్మాన్ వెంటపడి వార్సాలో రచ్చరచ్చ చేశారు. ఈ ఘటన సాజిద్ నడియావాలా రూపొందిస్తున్న 'కిక్' షూటింగ్ చోటు చేసుకుంది. గత పది రోజులుగా చిత్ర క్లైమాక్స్ ను సల్మాన్, జాక్వెలైన్ ఫెర్నాండేజ్ లతో చిత్రీకరిస్తున్నారు. సల్మాన్ షూటింగ్ వివరాలను పొలాండ్ లోని అత్యధిక సర్కులేషన్ ఉన్న పత్రిక గజెటా వైబోర్కా ప్రచురించగా, అక్కడి టెలివిజన్ చానెల్ టీవీన్ పెద్ద ఎత్తున కవరేజ్ ఇచ్చింది. దాంతో పెద్ద ఎత్తున బాలీవుడ్ అభిమానులు షూటింగ్ వద్దకు చేరుకున్నారు. పోలెండ్ లో షూటింగ్ వ్యయం తక్కువగా ఉండటంతో 'జిందగీ నా మిలేగి దోబారా' చిత్రం తర్వాత భారతీయ సినిమాల నిర్మాణం ఊపందుకుంది. -
40 వ అంతస్తు నుంచి దూకేసిన సల్మాన్ ఖాన్
కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు కిక్కు కావలసి వచ్చింది. అందుకే ఏకంగా ఏడు సముద్రాలు దాటి పోలండ్ వెళ్లి, ఆ దేశంలోనే ఎత్తైన ఓ భవనం 40 వ అంతస్తు నుంచి కిందకి దూకాడు. బంగీ జంప్ చేసి అంతెత్తు భవనం నుంచి తలకిందులుగా వేలాడాడు. ఇదంగా కిర్రెక్కో లేక కిక్ ఎక్కో చేసిన పనికాదు. ఇది తెలుగు కిక్ హిందీ రీమేక్ లో సల్మాన్ ఖాన్ చేసిన ఫీటు. పోలండ్ లోని అత్యంత ఎత్తైన భవనం ప్యాలెస్ ఆఫ్ కల్చర్ అండ్ సైన్స్ నుంచి సల్మాన్ బంగీజంప్ చేసే సీను షూట్ చేశారు. అయితే 'డూపు ఎందుకు, నేనే చేస్తాను' అని సల్మాన్ పట్టుబట్టాడు. చివరికి తన మాటే నెగ్గించుకున్నాడు. వందలాది సల్మాన్ అభిమానులు కేరింతలు కొడుతూండగా సల్మాన్ ఈ ఫీట్ చేసి చూపించాడు. వయసు మీరుతున్నా 'జియో జీ భర్ కే' అంటూ మైండ్ లో ఫిక్సై బ్లైండ్ గా దూకేశాడు. ఈ మొత్తం షూటింగ్ కి అయిదు గంటలు పట్టింది. ఈ సినిమాలో జాక్విలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్. -
బన్నీకి అదే కరెక్ట్!
సందర్భం:సురేందర్ రెడ్డి బర్త్‌డే అతనొక్కడే, అశోక్, అతిథి, కిక్, ఊసరవెల్లి చిత్రాలతో మాస్‌లోకి చొచ్చుకుపోయిన దర్శకుడు సురేందర్‌రెడ్డి.యాక్షన్ ఎంటర్టైనర్లను తెరకెక్కించడంలో బాగా నేర్పు కలిగిన ఆయన ప్రస్తుతం అల్లు అర్జున్‌ని ‘రేసుగుర్రం’గా తీర్చిదిద్దుతున్నారు. నేడు సురేందర్‌రెడ్డి పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘సాక్షి’ జరిపిన సంభాషణ. 2005లో ‘అతనొక్కడే’తో దర్శకుడయ్యారు. ఈ ఎనిమిదేళ్లలో ఆరు సినిమాలే చేయగలిగారెందుకని? ‘స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్’ అనే సిద్ధాంతాన్ని నేను బాగా నమ్ముతాను. ఒక సినిమా చేస్తున్నానంటే నేనందులో పూర్తిగా లీనమై పని చేస్తాను. ఆదరాబాదరాగా ఏ పనీ పూర్తి చేయడం నాకిష్టం ఉండదు. ఎక్కువ సినిమాలు చేస్తే ఎక్కువ డబ్బులొస్తాయి. కానీ నాకు ఆర్థిక సంతృప్తి కన్నా ఆత్మ సంతృప్తి ముఖ్యం. మీరు క్రాంతికుమార్ శిష్యులు కదా. ఆయన తరహా సినిమాలు చేసే ఉద్దేశం ఉందా? ఆయన తరహా అని కాదు కానీ, తక్కువ బడ్జెట్లో అంతా కొత్త తారలతో ఓ చిన్న సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. వచ్చే ఏడాది కచ్చితంగా చేస్తాను. బన్నీతో మీరు చేస్తున్న సినిమాకు ‘రేసుగుర్రం’ టైటిల్ ఓకే చేశారా? డబుల్ ఓకే. బన్నీ ఎనర్జీకి, ఈ కథకు ఆ టైటిల్ వందశాతం కరెక్ట్. అలాగని గుర్రపు పందాల నేపథ్యంలో సినిమా అనుకునేరు. ఇందులో బన్నీ పాత్ర ఫుల్ ఎనర్జిటిగ్గా ఉంటుంది. ఒకసారి లక్ష్యాన్ని ఫిక్స్ అయితే ఇక పక్క చూపులు ఉండని పాత్ర తనది. అందుకే ఈ టైటిల్ పెట్టాం. బన్నీతో పనిచేయడం ఎలా ఉంది? బన్నీ అంటేనే ఫుల్ ఎనర్జీకి ప్రతిరూపం. తనతో ఉంటే భయంకరమైన ఎంజాయ్మెంట్. తానో స్టార్‌ననే ఫీలింగ్ లేకుండా అందరితోనూ ఇట్టే కలిసిపోతాడు. ఎవరన్నా డల్‌గా కనిపిస్తే, అస్సలు క్షమించడు. వెంటనే వాళ్లల్లో ఎనర్జీ నింపేవరకూ వదలడు. భోజ్‌పురి హీరో రవికిషన్‌తో ఇందులో విలన్‌గా చేయిస్తున్నారట? అవును. ‘ఊసరవెల్లి’లోనే తనతో విలనీ చేయించాలనుకున్నా కుదర్లేదు. ‘రేసుగుర్రం’లో విలన్‌గా చాలామందిని అనుకున్నాం. చివరకు రవికిషన్ ఓకే అన్నారు. ఆయన చాలా ఇంట్రస్ట్ తీసుకుని పని చేస్తున్నారు. తెలుగు తెరకు ఓ మంచి విలన్ దొరికినట్టే. ఇంతకూ ‘రేసుగుర్రం’ విశేషాలు చెప్పండి? ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. రెండు పాటలు మినహా దాదాపుగా షూటింగ్ పూర్తయిపోయినట్టే. పోస్ట్ ప్రొడక్షన్ కూడా జరుగుతోంది. రిలీజ్ ఎప్పుడనేది నిర్మాతలు నల్లమలుపు బుజ్జి, డా.కె.వెంకటేశ్వర్రావులు చెబుతారు. బాలీవుడ్‌కి వెళ్లే ఉద్దేశం ఉందా? హిందీలో సల్మాన్‌ఖాన్ హీరోగా ‘కిక్’ నేనే చేయాలి. ‘ఊసరవెల్లి’ బిజీలో ఉండి చేయలేకపోయాను. ఇంకొన్ని ఆఫర్లు వచ్చాయి. ఎప్పటికైనా హిందీ సినిమా చేస్తాను. మీ నెక్ట్స్ కమిట్మెంట్స్? కొత్తవాళ్లతో సినిమా అని చెప్పానుగా. అలాగే రవితేజతో ‘కిక్-2’ చేయాలి. స్క్రిప్టు రెడీగా ఉంది. అలాగే నితిన్‌తో ఓ సినిమా చేయాలి. మీ డ్రీమ్ ప్రాజెక్ట్? నా మనసులో ఒక ఆలోచన ఉంది. చాలా బిగ్ ప్రాజెక్ట్ అది. కార్యరూపం దాల్చడానికి చాలా కాలం పడుతుంది. -
సల్లూభాయ్‌కి యూకే వీసా ఓకే!
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌కు యూకే వీసా లభించడంతో కొంత ఊరట లభించింది. వీసా కోసం అవసరమయ్యే పత్రాలు సమర్పించని కారణంగా సల్లూభాయ్‌కి యూకే వీసాను ఇటీవల నిరాకరించిన సంగతి తెలిసిందే. తెలుగులో విజయవంతమైన ‘కిక్’ రీమేక్ కోసం లండన్‌లో జరిగే షూటింగ్లో పాల్గొనేందుకు సల్మాన్ కాన్సులేట్‌లో వీసాకు దరఖాస్తు చేసుకున్నాడు. పలు కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న సల్మాన్ ఖాన్ వీసాకు అవసరమయ్యే పత్రాలు సమర్పించడంలో ఆలస్యం కావడంతో యూకే కాన్సులేట్ వీసాను ఇవ్వడానికి నిరాకరించింది. ఆ తర్వాత వీసా మంజూరు కావాల్సిన పత్రాలను దాఖలు చేశామని, దాంతో వీసా మంజూరు చేశారని సల్మాన్ తం డ్రి సలీం ఖాన్ తెలిపారు. 1998లో ’హమ్ సాథ్ సాథ్ హై’ చిత్ర షూటింగ్ సందర్భంగా రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో అనుమతి లేకుండా జింకలను వేటాడినట్టు, 2002 సంవత్సరంలో ’హిట్ అండ్ రన్’ కేసు సల్మాన్‌పై నమోదైంది. ఈ కేసులో నేరారోపణలు రుజువైతే సల్మాన్ ఖాన్‌కు పదేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉంది అని న్యాయనిపుణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.