జాక్వెలిన్ ఫెర్నాండెజ్
‘‘స్టార్స్‌గా వెలుగుతున్న ప్రతి ఒక్కరికి ఒక స్ట్రగులింగ్ పాస్ట్ ఉంటుంది. ఎంత హార్డ్‌వర్క్ చేసి ఆ దశ దాటుతామో అంత మంచి సక్సెస్‌ను చూడగలుగుతాం’’ అని చెబుతున్నారు జాక్వెలిన్ ఫెర్నాండెజ్. యాక్టర్‌గా బిగ్ సక్సెస్‌ను అందుకోక ముందు తన కెరీర్‌లో చూసిన స్ట్రగులింగ్ పాస్ట్‌ను గుర్తు చేసుకున్నారు జాక్వెలిన్. ‘‘నా లైఫ్‌లో నేను చూసిన చీకటి రోజులంటే యాక్టర్‌గా నా తొలి రోజులు. కొన్ని సంవత్సరాల పాటు నాలో కాన్ఫిడెన్స్ అనేదే లేదు. నన్ను నేనే యాక్సెప్ట్ చేయలేనంత నెగటివిటీకి వెళ్లిపోయాను. మా నాన్నగారు వాటికన్ సిటీ చూడాలని అడిగారు.
మా పేరెంట్స్‌ను ట్రీప్‌కు తీసుకువెళ్ళాను. నేను సొంతంగా వాళ్లకు చూపించే ఆఖరి ట్రిప్ ఇదే అవుతుందనుకున్నాను. చాలా బాధ అనిపించింది. ఒకవేళ మా పేరెంట్స్‌కు చూపించే లాస్ట్ ట్రిప్ ఇదే అనుకుంటే.. అదే అయ్యేదేమో. కానీ నేను ఇదే లాస్ట్ ట్రిప్ అవ్వాలనుకోలేదు. వాళ్లకి ఇంకా చూపించాలి, చాలా ఇవ్వాలని బలంగా నిర్ణయించుకున్నాను. నన్ను నిరుత్సాహరిచే వాళ్లందరినీ దూరం పెట్టాను. నా గోల్ మీద ఫుల్ ఫోకస్‌తో ట్రై చేశాను. అదే సమయంలో హీరో సల్మాన్ ఖాన్, దర్శకుడు సాజిద్ నడియాడ్‌వాలా నాకు ‘కిక్’ సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆ సినిమా నా కెరీర్‌కు ఫుల్ కిక్కిచ్చింది. సో.. ఎప్పుడూ మనం చేసే పని మీద కాన్ఫిడెన్స్ వదులుకోకూడదు. అదే నా ఎక్స్‌పీరియన్స్‌లో నేను నేర్చుకున్న లెసన్’’ అన్నారు జాక్వెలిన్.
Comments
Please login to add a commentAdd a comment