అబ్బో.. జాక్వెలిన్ అదుర్స్ | Salman Khan praises Jacqueline Fernandez | Sakshi
Sakshi News home page

అబ్బో.. జాక్వెలిన్ అదుర్స్

Published Sat, Jul 5 2014 1:03 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

అబ్బో.. జాక్వెలిన్ అదుర్స్ - Sakshi

అబ్బో.. జాక్వెలిన్ అదుర్స్

బాలీవుడ్ ముదురు బ్రహ్మచారి సల్మాన్ఖాన్కు ఎప్పుడు ఏ హీరోయిన్ నచ్చుతుందో అతడికే తెలీదు. తాజాగా తనతో కలిసి కిక్ సినిమాలో నటించిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మీద సల్లూభాయ్ తెగ ప్రశంసలు కురిపించేశాడు. ఈ సినిమాలోని ఓ పాటలో ఆమె చాలా అద్భుతంగా ఉందని సల్మాన్ చెప్పాడు. 28 ఏళ్ల ఫెర్నాండెజ్ను ట్విట్టర్లో కూడా వదలకుండా ఫాలో అవుతున్న 48 ఏళ్ల సల్మాన్ ఖాన్.. ఆమె చాలా ఫన్నీగా ఉంటుందని చెబుతున్నాడు.

హేంగోవర్ పాటలో ఆమె చాలా అద్భుతంగా ఉందని, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలలో ఆమె చాలా ఫన్నీగా ఉంటుందని చెబుతూ ఆకాశానికి ఎత్తేశాడు. దబాంగ్ సినిమాలో సల్మాన్ ఖాన్ను చూసినప్పటి నుంచి ఎలాగైనా ఆయనతో కలిసి నటించాలని అనుకున్నానని, ఇన్నాళ్ల తర్వాత కిక్ సినిమాలో అవకాశం రావడంతో తాను వెంటనే అంగీకరించేశానని జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా ఆమధ్య మీడియాతో చెప్పింది. సల్మాన్ ఖాన్ స్వయంగా పాడిన 'హేంగోవర్' పాట ఇప్పటికే యూట్యూబ్లో విడుదలైంది. మూడు రోజుల్లోనే దీన్ని దాదాపు 4 లక్షల మంది చూశారు. ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాడ్వాలా తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 25న విడుదల కావచ్చని అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement