అక్రమ కట్టడాల కూల్చివేత డ్రైవ్‌లో చోటు చేసుకున్న షాకింగ్ దృశ్యాలు తీవ్ర కలకలం రేపాయి. ఈ ఘటన చత్తీస్‌గఢ్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం చత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్‌లో టిల్సివా గ్రామంలో ఆక్రమణలకు వ్యతిరేకంగా జరుగుతున్న డ్రైవ్‌లో ఈ దారుణం చోటచేసుకుంది. ఓ పోలీసు అధికారి స్థానిక మహిళను జుట్టుపట్టి నేలపై లాగి.. తన్నుతూ పోలీస్ వ్యాన్‌లోకి లాక్కెళ్లారు. ఆక్రమణలకు వ్యతిరేకంగా కొంతమంది మహిళలు, స్థానికులు రెవెన్యూ అధికారులపై దాడి చేయడంతో వారి ఇలా అదుపు చేయాల్సి వచ్చిందిన పోలీసులు పేర్కొన్నారు.
పశువులు షెడ్డు కోసం ఉద్దేశించిన భూమిని పద్దెనిమిది మంది ఆక్రమించారని స్థానికులు ఆరోపించారు. తాము ఏళ్ల తరబడి ఇక్కడే నివశిస్తున్నామని, మమ్మల్ని ఎవరూ ఆపలేదని ఓ మహిళ చెప్పుకొచ్చింది. మహిళలపై పోలీసులు బలప్రయోగం చేసి దారుణం ప్రవర్తిచారని చెప్పారు. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఒక గర్భిణిపై కూడా పోలీసులు దాడి చేసినట్లు స్థానికులు పేర్కొన్నారు. అయితే అదనపు పోలీసు సూపరింటెండెంట్ మధులికా శర్మ మాత్రం మహిళలు స్థానిక రెవెన్యూ అధికారులపై దాడి చేశారని అందుకే వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
(చదవండి: రాహుల్ పాస్‌పోర్టుకు కోర్టు ఓకే)
Comments
Please login to add a commentAdd a comment