'Chori Karke Accha Laga Lekin': Thief's Confession to Chhattisgarh Police Goes Viral - Sakshi
Sakshi News home page

చోరీ చేసిన సోత్తు ఏం చేశావ్‌? దొంగ రిప్లై విని ఆశ్చర్యపోయిన పోలీసులు

Published Sun, Dec 4 2022 5:58 PM | Last Updated on Sun, Dec 4 2022 7:46 PM

Thief Told The Police Spent The Stolen Money Goes Viral - Sakshi

ఇంత వరకు దొంగలు రకరకాల విచిత్రమైన వాటిని ఎత్తుకుపోవడం గురించి విన్నాం. అందుకు సంబంధించి వీడియోలు కూడా చూశాం. ఐతే పోలీసులు దొంగలను ఇంటరాగేషన్‌ చేసి.. వారిచేత నిజాలను కక్కిస్తారని అందరికి తెలిసిందే. అచ్చం అలానే ఒక పోలీసు అధికారి అందులో భాగంగా ఒక దొంగను విచారణ చేయగా..పోలీసులు అడుగుతున్న ప్రశ్నలకు దొంగ చెబుతున్న జవాబులు విని ఆశ్చర్యపోతూ నవ్వడం పోలీసుల వంతైంది.

వివరాల్లోకెళ్తే...ఈ ఘటన చత్తీస్‌గడ్‌లోని దుర్గ్‌ పోలీస్టేషన్‌లో చోటు చేసుకుంది. పోలీసులు సిబ్బంది అంతా ఉండగానే అభిషేక్‌ పల్లవ్‌ అనే పోలీస్‌ సూపరింటెండ్‌ అధికారి ఒక దొంగను ఇంటరాగేషన్‌ చేస్తున్నారు. అందులో భాగంగా ఆ అధికారి దొంగను చోరి చేసిన డబ్బును ఏం చేశావ్‌ అని ప్రశ్నించారు. దానికి ఆ దొంగ ఆ డబ్బును పశువుల మేత కోసం విచ్చలవిడిగా ఖర్చు చేశానని, మరికొంత సొమ్మును పేదవాళ్లకు దుప్పట్లు కొన్నానని చెప్పాడు. ఆ దొంగ సమాధానాలకు అధికారుల ఆశ్చర్యపోవడమే గాక వారి ముఖాల్లో నవ్వు తెప్పించాయి.  అందుకు సంబంధించిన వీడియో  ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. 

(చదవండి: చైనా మంకుపట్టుతో అల్లాడితున్న జనాలు..బలవంతంగా ఈడ్చుకెళ్తూ..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement