interrogating
-
ఇంకా రహస్య ప్రదేశంలోనే ప్రణీత్ రావు!
సాక్షి, హైదరాబాద్: ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రహస్య ప్రదేశంలో ప్రణీత్‌రావును పోలీసులు విచారిస్తున్నారు. ఎస్ఐబీలోని హర్డ్ డిస్క్‌లు ధ్వంసం, రికార్డుల మాయం వ్యవహారంలో పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్ఐబీలో కీలకంగా పనిచేసిన మాజీ ఐపీఎస్ ప్రభాకరరావు పాత్రపై పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల విచారణకు సహకరించని ప్రణీత్‌రావు.. అధికారుల ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటున్నట్లు సమాచారం. ప్రణీత్‌రావు సెల్ ఫోన్ సీజ్ చేసిన పోలీసులు.. వాట్సాప్ చాటింగ్, కాల్ డీటెయిల్స్, డేటా రీట్రీవ్ చేయనున్నారు. ప్రణీత్ రావు ఎవరి ఫోన్లు టాపింగ్ చేశాడనే సమాచారాన్ని పోలీసులు రాబడుతున్నారు. ఫోన్ టాపింగ్ చేసిన వివరాలను ఎప్పటికప్పుడు ఓ ఉన్నతాధికారికి పంపినట్టు పోలీసులు గుర్తించారు. ఎస్ఐబీలో ప్రణీత్‌రావుకు ప్రభాకర్ రావు ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు. ప్రణీత్ రావుకు సహకరించిన అధికారులకు నోటీసులు ఇవ్వనున్న పంజాగుట్ట పోలీసులు విచారణ పిలవనున్నారు. ప్రణీత్‌రావు కేసును సీఐడీకి లేదా సిట్‌కు బదిలీ చేసే అవకాశం ఉంది. ప్రణీత్ రావు భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నాయకుల ఫోన్ నంబర్లను టాపింగ్ చేసిన ప్రణీత్ రావు.. ప్రధాన ప్రతిపక్ష నాయకులు, వారి అనుచరుల కదలికలపై ప్రణీత్‌రావు బృందం నిరంతరం నిఘా పెట్టారు. హైదరాబాద్ నుంచి ఎవరు డబ్బులు తరలించిన ప్రణీత్‌రావుకి ముందే సమాచారం తెలిసేది.. ఆ జిల్లా పోలీసులకి ప్రణీత్ రావు ముందే సమాచారం అందిందేవాడని పోలీసులు గుర్తించారు. -
చోరీ చేసిన సోత్తు ఏం చేశావ్? దొంగ రిప్లై విని ఆశ్చర్యపోయిన పోలీసులు
ఇంత వరకు దొంగలు రకరకాల విచిత్రమైన వాటిని ఎత్తుకుపోవడం గురించి విన్నాం. అందుకు సంబంధించి వీడియోలు కూడా చూశాం. ఐతే పోలీసులు దొంగలను ఇంటరాగేషన్ చేసి.. వారిచేత నిజాలను కక్కిస్తారని అందరికి తెలిసిందే. అచ్చం అలానే ఒక పోలీసు అధికారి అందులో భాగంగా ఒక దొంగను విచారణ చేయగా..పోలీసులు అడుగుతున్న ప్రశ్నలకు దొంగ చెబుతున్న జవాబులు విని ఆశ్చర్యపోతూ నవ్వడం పోలీసుల వంతైంది. వివరాల్లోకెళ్తే...ఈ ఘటన చత్తీస్‌గడ్‌లోని దుర్గ్ పోలీస్టేషన్లో చోటు చేసుకుంది. పోలీసులు సిబ్బంది అంతా ఉండగానే అభిషేక్ పల్లవ్ అనే పోలీస్ సూపరింటెండ్ అధికారి ఒక దొంగను ఇంటరాగేషన్ చేస్తున్నారు. అందులో భాగంగా ఆ అధికారి దొంగను చోరి చేసిన డబ్బును ఏం చేశావ్ అని ప్రశ్నించారు. దానికి ఆ దొంగ ఆ డబ్బును పశువుల మేత కోసం విచ్చలవిడిగా ఖర్చు చేశానని, మరికొంత సొమ్మును పేదవాళ్లకు దుప్పట్లు కొన్నానని చెప్పాడు. ఆ దొంగ సమాధానాలకు అధికారుల ఆశ్చర్యపోవడమే గాక వారి ముఖాల్లో నవ్వు తెప్పించాయి. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. View this post on Instagram A post shared by SIS / Shit Indians Say (@shitindianssay) (చదవండి: చైనా మంకుపట్టుతో అల్లాడితున్న జనాలు..బలవంతంగా ఈడ్చుకెళ్తూ..) -
ఇస్రో గగనతలంపై అనుమానాస్పద విహారం
చెన్నై: తమిళనాడు తిరునల్వేలి జిల్లా మహేంద్రగిరిలోని భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) ఉపరితలంపై అనుమానాస్పదంగా ఏదో ఎగురుతోందన్న వార్తలు కలకలం సృష్టించాయి. దీనిపై స్థానిక గొర్రెల కాపరులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆందోళన నెలకొంది. ఇస్రోకు సమీపంలోని నిషిద్ధ ప్రదేశం ఏడో వాచ్ టవర్ దగ్గర ఆకాశంలో అనుమానాస్పదంగా ఎగురుతున్న విమానాన్ని చూశామని తెలిపారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఇక్కడ గగనతలంలో ఏదో నిగూఢంగా ఎగురుతున్న విషయాన్ని గమనించి ఆందోళన చెందామన్నారు. సమీపంలోని అటవీ ప్రాంతాల గుండా పయనిస్తూ ఇస్రో వైపు రావడాన్ని తాము స్పష్టంగా చూశామని చెప్పారు. అయితే ఇస్రో అధికారులు మాత్రం ఈ వార్తలను ధ్రువీకరించలేదు. అలాంటి సంకేతాలేవీ శాస్త్రీయంగా తమకు అందలేదంటున్నారు. సుమారు 55 కి.మీ దూరంనుంచే గగనతలంలో సంచరించేవాటిని కనిపెట్టే సాంకేతిక పరిజ్ఞానం తమ సంస్థ కలిగి ఉందన్నారు. అయితే అటవీ, పోలీసు శాఖ ఉన్నతాధికారులు దీనిపై సిరియస్‌గా దృష్టి పెట్టారు. గొర్రెల కాపరులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఏడో వాచ్ టవర్ దగ్గర నిఘా పెట్టారు. సమాచారంలో వాస్తవికతను నిర్ధారించేందుకు గొర్రెల కాపరులను ప్రశ్నిస్తున్నారు. వారు చూసిన వస్తువు ఏమై ఉంటుందనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.