సాక్షి, హైదరాబాద్: ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రహస్య ప్రదేశంలో ప్రణీత్‌రావును పోలీసులు విచారిస్తున్నారు. ఎస్ఐబీలోని హర్డ్ డిస్క్‌లు ధ్వంసం, రికార్డుల మాయం వ్యవహారంలో పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
ఎస్‌ఐబీలో కీలకంగా పనిచేసిన మాజీ ఐపీఎస్ ప్రభాకరరావు పాత్రపై పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల విచారణకు సహకరించని ప్రణీత్‌రావు.. అధికారుల ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటున్నట్లు సమాచారం. ప్రణీత్‌రావు సెల్ ఫోన్ సీజ్ చేసిన పోలీసులు.. వాట్సాప్ చాటింగ్, కాల్ డీటెయిల్స్, డేటా రీట్రీవ్ చేయనున్నారు. ప్రణీత్ రావు ఎవరి ఫోన్లు టాపింగ్ చేశాడనే సమాచారాన్ని పోలీసులు రాబడుతున్నారు.
ఫోన్ టాపింగ్ చేసిన వివరాలను ఎప్పటికప్పుడు ఓ ఉన్నతాధికారికి పంపినట్టు పోలీసులు గుర్తించారు. ఎస్ఐబీలో ప్రణీత్‌రావుకు ప్రభాకర్ రావు ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు. ప్రణీత్ రావుకు సహకరించిన అధికారులకు నోటీసులు ఇవ్వనున్న పంజాగుట్ట పోలీసులు విచారణ పిలవనున్నారు.
ప్రణీత్‌రావు కేసును సీఐడీకి లేదా సిట్‌కు బదిలీ చేసే అవకాశం ఉంది. ప్రణీత్ రావు భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నాయకుల ఫోన్ నంబర్లను టాపింగ్ చేసిన ప్రణీత్ రావు.. ప్రధాన ప్రతిపక్ష నాయకులు, వారి అనుచరుల కదలికలపై ప్రణీత్‌రావు బృందం నిరంతరం నిఘా పెట్టారు. హైదరాబాద్ నుంచి ఎవరు డబ్బులు తరలించిన ప్రణీత్‌రావుకి ముందే సమాచారం తెలిసేది.. ఆ జిల్లా పోలీసులకి ప్రణీత్ రావు ముందే సమాచారం అందిందేవాడని పోలీసులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment