Phone tapping
-
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అనారోగ్య రిత్యా తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఫోన్ ట్యాపింగ్కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం అప్లయి చేశారు. వైద్యం కోసం అమెరికాకు వెళ్లినట్లు నాంప్లలి కోర్టులో ఇప్పటికే మెమో దాఖలు చేశారు. కేసు దర్యాప్తు కోసం పూర్తిగా సహకరిస్తానని పిటిషన్లో పేర్కొన్నారు. మరోవైపు, ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి పోలీసులు ఛార్జిషీట్ ఫైల్ చేసినందున తనకు బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల వేళ మరోసారి తెరపైకి ఫోన్ ట్యాపింగ్ కేసు
-
భయంతోనే YSRCP నేతల ఫోన్ ట్యాపింగ్.. ఆహా అన్న క్యాంటీన్ ఇడ్లి వితౌట్ చట్నీ
-
చంద్రబాబు బంధువే ఫోన్ ట్యాపింగ్ సూత్రదారి: పేర్నినాని
సాక్షి,విజయవాడ: ఏపీలో కూటమి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతోందని మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖలు చేశారు. శుక్రవారం విజయవాడ జిల్లా జైల్లో వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభేనేని వంశీతో ఆయన సతీమణి పంకజశ్రీ, పేర్ని నాని, ఇతర వైఎస్సార్సీపీ నేతలు ములాఖత్ అయ్యారు.ములాఖత్ అనంతరం పేర్నినాని మీడియాతో మాట్లాడారు. అనధికారికంగా కొందరు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల ఫోన్ నెంబర్లను సేకరిస్తున్నారు. నా ఫోన్ ట్యాప్ చేయడంతో పాటు మా పార్టీ కార్యకర్తల ఫోన్ నెంబర్స్‌ను సేకరించారు. నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని నేను భయపడటం లేదు. గ్రామ స్థాయి లీడర్ల భార్యల ఫోన్ నెంబర్లతో ఏం పని? అని ప్రశ్నించారు. చంద్రబాబు బంధువే ఫోన్ ట్యాపింగ్ సూత్రదారి చంద్రబాబు బంధువు ప్రకాష్ అనే ఒక వ్యక్తి అనదికారికంగా విజయవాడలో రమేష్ ఆసుపత్రి దగ్గర ఆఫీసు పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. ఫోన్ ట్యాప్ చేసి నేతలను బెదిరించాలని చూస్తున్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోంది. ఎన్ని తప్పుడు పనులు చేసిన వాళ్ళందరినీ చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు.వల్లభనేనీ వంశీ కేసులో దుర్మార్గంగా పోలీసులువల్లభనేనీ వంశీ కేసులో పోలీసు అధికారులు ఉన్నతాధికారుల పర్యవేక్షణతో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. రాజకీయ నాయకులను సంతృప్తి పరచడం కోసం పటమట పోలీసులు పని చేస్తున్నారు. 10వ తేదిన సత్యవర్ధన్ కోర్టుకు వచ్చి తప్పుడు కేసు అని అఫిడవిట్ ఇచ్చారు. టీడీపీ కార్యకర్త ఫణి కుమార్ అనే వ్యక్తి ద్వారా సత్యవర్ధన్, వంశీపై తప్పుడు కేసులు పెట్టించారు. కిరణ్ అనే వ్యక్తి ద్వారా ఇంకో కంప్లైంట్ తీసుకొని కేసులు నమోదు చేశారు. ఊహాజనిత ఫిర్యాదుతో నాన్ బెయిలబుల్ సెక్షన్లు వంశీపై పెట్టారు. నాపైనా కేసులు సత్య వర్ధన్ చెప్పాడో లేదో కూడా తెలియకుండా కేసు పెడతారా? వంశీకి రిమాండ్ విధించే సమయంలో ఎస్సీ,ఎస్టీ కేసుల న్యాయస్థానంలో హాజరు పరచకుండా వేరే కోర్టులో ప్రవేశపెట్టారు. చట్టాలు, కేసులు, సెక్షన్లు అనేవి లేకుండా పోలీసులు వ్యవహరించారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరులో పర్యటించే సమయంలో నేను లేను. అయినా నాపై కేసులు పెట్టి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కొల్లు రవీంద్రపై పేర్ని ఫైర్ కొల్లు రవీంద్ర మంత్రిగా ప్రజా సేవకు మా ఊరు,రాష్ట్రాన్ని బాగు చేయడానికి పనికిరారు. లోకేష్ ఇస్తే కాసులకు కక్కుర్తి పడే వ్యక్తి. కొడాలి నాని అరెస్టు చేయిస్తా, పేర్ని నానినీ అరెస్టు చేయిస్తా అంటున్నారు. నేనూ ఆరు నెలలుగా మచిలీపట్నం రోడ్లపై తిరుగుతున్నాను. మీరు ఏం చేయలేరు’అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు. -
వ్యూహమా? ప్రభాకర్‌రావుపై ప్రేమా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా సాగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ప్రధానంగా వినిపించింది టి.ప్రభాకర్‌రావు పేరే. ఆ విభాగ మాజీ చీఫ్ అయిన ఈ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ట్యాపింగ్ కేసు నమోదుతో అమెరికా వెళ్లిపోయారు. ఈ కేసు దర్యాప్తు కొలిక్కిరావాలంటే ఆయన్ను వెనక్కి రప్పించడం, విచారించడం అనివార్యంగా మారింది. అయితే ఇప్పుడెందుకో పోలీసులకు ఆయనపై ప్రేమ పుట్టుకొచ్చింది. ఇదే కేసులో ఆరో నిందితుడిగా ఉండి, విదేశాల్లో తలదాచుకున్న శ్రవణ్‌రావును ప్రొక్లైమ్డ్ అఫెండర్‌గా (ప్రకటిత నేరస్తుడు) ప్రకటించాలంటూ ఇటీవల నాంపల్లి కోర్టులో పోలీసు విభాగం పిటిషన్ దాఖలు చేసింది. అయితే ప్రభాకర్‌రావు పేరును మాత్రం ఇందులో చేర్చలేదు. మరోపక్క పి.రాధాకిషన్‌రావు, భుజంగరావులకు హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలంటూ పోలీసు విభాగం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసింది మొదలు.. అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పంజగుట్ట పోలీసులు 2024 మార్చి 10 కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి సంబంధించి ప్రణీత్‌రావుపై నమోదైన ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం ఆరుగురిని నిందితులుగా చేర్చారు. కీలక నిందితులుగా పేర్కొంటూ అదే నెలలో అడిషనల్ ఎస్పీలు నాయిని భుజంగరావు, తిరుపతన్న, మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును అరెస్టు చేశారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, ఓ టీవీ ఛానల్ అధినేత శ్రవణ్‌కుమార్ మాత్రం పరారీలో ఉన్నారు. ఈ కేసులో పోలీసులు గత జూన్‌లో చార్జీషీట్ దాఖలు చేశారు. అప్పట్లో ట్యాపింగ్‌కు గురైన వారిలో కాంగ్రెస్ నేతలు, ఓ న్యాయమూర్తి, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతోపాటు కొందరు బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారని ప్రస్తావించారు. ఇంకా విచారణ సాగుతున్నందున అదనపు చార్జీïÙట్ దాఖలు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. విచారణ ఇంకా పూర్తికాలేదంటూ... ఇప్పటికీ ప్రభాకర్‌రావు, శ్రవణ్‌కుమార్ అమెరికాలో ఉన్నారు. ట్రయల్ కోర్టు రెండుసార్లు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినా స్పందన లేదు. ఇటీవల పోలీసులు కోర్టుకు సమరి్పంచిన సీల్డ్ కవర్ నివేదికలో ప్రస్తుత హైకోర్టు న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తులతోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారుల ఫోన్ నంబర్లు, ఇతర వివరాలు ఉన్నాయి. నిందితుల వ్యక్తిగత కంప్యూటర్ల నుంచి ఫోరెన్సిక్ నిపుణులు రిట్రీవ్ చేసిన డేటాలో వీటిని గుర్తించినట్టు పేర్కొన్నారు. వీరందరి నంబర్లూ ట్యాపింగ్ అయినట్టు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ దశలో కీలక నిందితులకు బెయిల్ ఇవ్వడం విచారణను ప్రభావితం చేస్తుందని అధికారులు చెబుతున్నారు. వారి బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని, వివరాలతో వాదనలు సిద్ధం చేయాలని పీపీకి పోలీసు విభాగం సూచించింది. ‘ప్రొక్లైమ్డ్ అఫెండర్’ ఒక్కరిపైనే ఎందుకు? ఒకరిని న్యాయస్థానం ప్రొక్లైమ్డ్ అఫెండర్‌గా ప్రకటిస్తే.. వారి ఆస్తులు జప్తు చేసే అధికారం పోలీసులకు వస్తుంది. ఇలా ఒత్తిడి తీసుకొచ్చి నిందితులను విదేశాల నుంచి రప్పించే అవకాశం ఉంటుంది. అయితే ఈ పిటిషన్‌ను ప్రధాన నిందితుడైన ప్రభాకర్‌రావుపై దాఖలు చేయకుండా, శ్రవణ్‌కుమార్‌పై దాఖలు చేయడం వెనుక ఆంతర్యం అంతు చిక్కట్లేదు. పోలీసు విభాగం ఇలా వ్యవహరించడం వెనుక ప్రభుత్వ ప్రమేయం ఉందా? లేక వ్యూహంలో భాగమా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. -
రేవంత్.. ముందు నీ భాష మార్చుకో: కౌశిక్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భాష మార్చుకోవాల్సింది తాను కాదు.. సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఘాటు విమర్శలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తనపై అక్రమ కేసులు బనాయించిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఫిర్యాదు చేయడానికి వెళ్తే తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు.పోలీసు విధులకు ఆటంకం కలిగించారన్న కేసులో మాసబ్ ట్యాంక్ సీఐ ఎదుట కౌశిక్ రెడ్డి విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. అయితే ఫిర్యాదుదారుడు సీఐ కావడం, అది బంజారాహిల్స్ పీఎస్‌లోనే కావడంతో.. దర్యాప్తు అధికారిగా మాసబ్ ట్యాంక్ సీఐ పరుశురాంను ఉన్నతాధికారులు నియమించారు. ఈ కేసుకు సంబంధించి తాజాగా కౌశిక్‌కు నోటీసులు వెళ్లాయి. ఈ క్రమంలోనే ఇవాళ విచారణకు హాజరయ్యారు. దాదాపు గంటకుపైగా ఆయనను పోలీసులు విచారించారు.ఇక, విచారణ అనంతరం పీఎస్ బయట కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు నన్ను గంట పాటు విచారించారు. విచారణలో భాగంగా 32 ప్రశ్నలు అడిగారు. అడిగిన ప్రశ్నే అడిగారు మళ్లీ అడిగారు. నేను అన్నింటికీ సమాధానం ఇచ్చాను నా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. నాపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు హామీలపై ప్రశ్నిస్తే నాపై కేసులు పెడుతున్నారు. 420 హామీలు, ఆరు గ్యారంటీలపై ప్రశ్నిస్తూనే ఉంటాను. డిసెంబర్ నాలుగో తేదీన ఫిర్యాదు చేయడానికి నేను బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కి వెళ్ళాను. బంజారాహిల్స్ ఏసీపీ అపాయిట్మెంట్ తీసుకొని అక్కడిని వెళ్ళాను. నా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఫిర్యాదు చేయడానికి పోతే నాపైనే కేసులు పెట్టారు. నేను ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటి వరకు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. పండుగ రోజు కూడా నన్ను దొంగ లాగ అరెస్ట్ చేసి తీసుకుపోయారు. తెలంగాణలో భాష మార్చుకోవాల్సింది నేను కాదు.. రేవంత్ మార్చుకోవాలి అని హితవు పలికారు. -
ఫోన్‌ట్యాపింగ్ ఆరోపణలు..హరీశ్‌రావుపై కేసు నమోదు
సాక్షి,హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్‌రావుపై మంగళవారం(డిసెంబర్3) కేసు నమోదైంది. తన ఫోన్ ట్యాప్ చేశారని బాచుపల్లికి చెందిన చక్రధర్‌గౌడ్ హరీశ్‌రావుపై పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పంజాగుట్ట పోలీసులు హరీశ్‌రావుపై 120బి,386,409 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో హరీశ్‌రావుతో పాటు టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావును కూడా పోలీసులు చేర్చడం గమనార్హం. కాగా, ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన ఫోన్‌ట్యాపింగ్ కేసు విచారణలో ఉంది. బీఆర్ఎస్ హయాంలో టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన పలువురు పోలీసు అధికారులను ఈ కేసులో అరెస్టు చేశారు.ఇటీవలే ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను కూడా పోలీసులు విచారించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కీలకనేత హరీశ్‌రావుపై ఫోన్‌ట్యాపింగ్ ఆరోపణలపై మరో కేసు నమోదు చేయడం చర్చనీయాంశమైంది.ఇదీ చదవండి: ప్రభుత్వ వైఫల్యాలపై 7న ఛార్జ్‌షీట్: హరీశ్‌రావు -
ఫోన్‌ట్యాపింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. ప్రభాకర్‌రావుకు అమెరికాలో గ్రీన్‌కార్డు?
సాక్షి,హైదరాబాద్:ఫోన్ ట్యాపింగ్ కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఈ కేసులో ఇప్పటివరకు విచారణకు హాజరుకాని ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుకు తాజాగా అమెరికాలో గ్రీన్ కార్డు వచ్చినట్లు సమాచారం. అమెరికాలో సెటిల్ అయిన కుటుంబసభ్యుల ద్వారా ఆయన కొద్దిరోజుల క్రితమే గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరయినట్టు తెలుస్తోంది.గ్రీన్ కార్డు మంజూరు విషయం తెలిసి ఫోన్‌ట్యాపింగ్ కేసు దర్యాప్తు అధికారులు ఈ విషయమై ఆరా తీశారు. ప్రభాకర్‌రావుకు గ్రీన్‌కార్డు లభించడంతో దర్యాప్తులో ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే ప్రభాకర్ రావు పై పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు.కాగా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫోన్‌ట్యాపింగ్ జరిగిందని ఆరోపిస్తూ దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో గతంలో ఇంటెలిజెన్స్‌లో పనిచేసిన పలువురు పోలీసు అధికారులను అరెస్టు చేసి విచారించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావును కూడా విచారించేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ ఆయన అమెరికా వెళ్లిపోవడంతో అది సాధ్యం కాలేదు. ఇదీ చదవండి: కేసు పెడితే పెట్టుకో.. దేనికైనా రెడీ: కేటీఆర్ -
పేషీల్లో టీడీపీ నిఘా
సాక్షి, అమరావతి : ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వారిని గుర్తించి, నిరంత నిఘాకు రాష్ట్ర సచివాలయంలో అన్ని శాఖలు, సెక్షన్లల్లో టీడీపీ వేగులు తిష్టవేశారు. ఆ శాఖలు, సెక్షన్లలోనే అనుకూలంగా ఉండే కొందరితో టీడీపీ ఈ నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. శాఖల్లో ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం జరిగిందో సమాచారాన్ని వీరు నిరంతరం టీడీపీ పెద్దలకు చేరవేస్తున్నట్లు సమాచారం. ఉద్యోగుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేస్తున్నట్లు అనుమానాలు కలుగుతుండటంతో అధికారులు, ఉద్యోగుల్లో తీవ్ర భయం నెలకొంది. కొందరు మంత్రులు, ఐఏఎస్ అధికారులు కూడా ఫోన్లలో మాట్లాడేందుకు కూడా జంకుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మాజీ నాయకులతోనే నిఘా వ్యవస్థ! సచివాలయ ఉద్యోగుల సంఘానికి గతంలో నాయకులుగా పనిచేసిన పలువురితో పాటు టీడీపీకి అనుకూలంగా ఉండే కీలక అధికారులతో ఈ నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు తెలిసింది. వివిధ సెక్షన్లలో పనిచేసే అదనపు కార్యదర్శులు, డిప్యూటీ కార్యదర్శులు, ఇతర అధికారులను టీడీపీ, వైఎస్సార్సీపీ, న్యూట్రల్ అని మూడుగా విభజించారు. అందులోనూ ఎవరు ఏ సామాజికవర్గానికి చెందిన వారో కూడా పరిశీలించి, పూర్తిగా తమకు అనుకూలంగా ఉండే వారిని ముఖ్యమైన శాఖల్లో కీలక స్థానాల్లో నియమించారు.వైఎస్సార్సీపీ ముద్ర వేసిన వారిలో కొందరిని జీఏడీకి అటాచ్ చేయగా, మరికొందరిని అప్రాధాన్యమైన పోస్టుల్లోకి పంపించారు. న్యూట్రల్ అనుకున్న వారికీ అప్రాధాన్య పోస్టులు ఇచ్చారు. దాదాపు అన్ని కీలక స్థానాల్లో అనుకూలమైన వారినే పెట్టుకొన్నారు. వారి ద్వారానే సెక్షన్లు, ముఖ్య కార్యదర్శుల పేషీల్లో ఏం జరుగుతుందో నిరంతరం టీడీపీ పెద్దలకు తెలిసే ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది. పార్టీల ముద్ర వేసి మరీ వేధింపులు ఎవరైనా ప్రభుత్వంలో జరుగుతున్న విషయాలపై పిచ్చాపాటిగా మాట్లాడినా, అసంతృప్తి వెలిబుచ్చినా వారి గురించి ఈ నిఘా వర్గాలు ప్రభుత్వ పెద్దలు, ఆయా శాఖల ముఖ్యులకు చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా మాట్లాడిన వారిపై వైఎస్సార్సీపీ ముద్ర వేసి వేధిస్తుండటం పరిపాటిగా మారిందంటున్నారు. ఐఏఎస్‌లూ ఈ నిఘా దెబ్బకు భయపడుతున్నట్లు తెలుస్తోంది. అధికారులను ఎవరు, ఎందుకు కలుస్తున్నారు, వారు ఎవరికి సంబంధించిన వ్యక్తులనే సమాచారాన్ని కూడా పెద్దలకు చెబుతున్నట్లు సమాచారం. మంత్రుల పేషీల్లో ఓఎస్డీలు, పీఎస్‌లు కూడా స్వేచ్ఛగా మాట్లాడేందుకు జంకుతున్నారు.ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని అనుమానాలునిఘాతోపాటు ఫోన్ ట్యాపింగ్ కూడా జరుగుతున్నట్లు సచివాలయంలో ప్రచారం జరుగుతోంది. ఐఏఎస్‌లతోపాటు వివిధ స్థాయిల్లో ఉన్న అధికారులు సైతం ఫోన్లలో మాట్లాడేందుకు భయపడుతున్నట్లు తెలిసింది. వాట్సాప్ కాల్స్ మాట్లడడానికీ వెనుకాడుతున్నారంటే ట్యాపింగ్ భయం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇద్దరి మధ్య సంభాషణ బయటకు తెలిసిపోతుండడంతో కచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పలువురు మంత్రులు సైతం స్వేచ్ఛగా మాట్లాడేందుకు జంకుతున్నారు. ఏ కామెంట్ చేసినా, ఎవరిని కలిసినా పెద్దలకు తెలిసిపోతుందంటూ వారు కూడా ఆందోళన వెలిబుచ్చుతున్నట్లు సమాచారం. -
ఫోన్‌ట్యాపింగ్‌పై స్పందించిన డీజీపీ
సాక్షి,హైదరాబాద్:ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ టీమ్‌తో విచారణ చేస్తున్నామని,కోర్టు పరిధిలో ఉన్నందున ఈ విషయంపై తాను కామెంట్ చేయలేనని డీజీపీ జితేందర్ అన్నారు. ట్యాపింగ్ కేసుపై మంగళవారం(సెప్టెంబర్24) జితేందర్ మీడియాతో మాట్లాడారు.‘ట్యాపింగ్ కేసు కోర్టు పరిధిలో ఉన్నందున నేను కామెంట్ చేయలేను.ప్రభాకర్ రావు,శ్రవణ్ రావుకు రెడ్ కార్నర్ నోటీసు ఇవ్వడానికి కొంత సమయం పట్టింది.రెడ్ కార్నర్ నోటీసుల కోసం ఇంటర్ పోల్కి లేఖ రాశాం.సీబీఐకి రాగానే రెడ్ కార్నర్ నోటీస్ జారీ అవుతుంది’అని తెలిపారు.గణేష్ ఉత్సవాల్లో డీజే సౌండ్స్ ఇబ్బంది పెట్టాయి.. డీజీపీనగరంలో ఇటీవల గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబి ఉత్సవాలు విజయవంతంగా పూర్తిచేశామని డీజీపీ జితేందర్ తెలిపారు. పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు చెప్పారు. నిమజ్జనం కోసం అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పనిచేశాయన్నారు.ట్రైనీ ఎస్సైలు , కానిస్టేబుళ్లు 12వేల మంది సిబ్బంది పాల్గొన్నారని చెప్పారు. గణేష్ ఉత్సవాల్లో డీజేల ఏర్పాటు, శబ్ద కాలుష్యం కొంత నగర వాసులను ఇబ్బంది పెట్టిందన్నారు. డీజేల విషయంలో త్వరలో మార్గదర్శకాలు విడుదలచేస్తామని చెప్పారు. వినికిడి సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నందున జాగ్రత్త వహించాలని డీజీపీ సూచించారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికలకు 15 రోజుల ముందు నుంచి 4,500 ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లు తేలింది. వాటిల్లో కాంగ్రెస్‌కు చెందిన 190 మంది ఫోన్లు ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. వారిలో అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డితో పాటు సోదరులు, మిత్రులు, అనుచరులు సైతం ఉన్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్‌లో 80 శాతానికిపైగా ఎయిర్టెల్ కస్టమర్లు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఎయిర్టెల్ సర్వీస్ ప్రొవైడర్ డేటాను ధ్వంసం చేసినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. మరోవైపు ఫోన్ టాపింగ్ వ్యవహారం దర్యాప్తులో కీలక పురోగతి చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితులుగా భావిస్తున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు, మీడియా ఛానెల్ నిర్వాహకుడు అరువెల శ్రవణ్ రావుకు రెడ్ కార్నర్ నోటీసు జారీ దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి.ప్రస్తుతం వీరిద్దరూ అమెరికాలో ఉన్నారని అనుమానిస్తున్న పోలీసులు వారిని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలకు సీబీఐ అనుమతిచ్చింది. రెడ్ కార్నర్ నోటీసు కోసం హైదరాబాద్ పోలీసులు పంపిన నివేదికను సమ్మతించిన సీబీఐ.. ఇంటర్ పోల్‌కు లేఖ రాసింది.చదవండి : మీ పాలనకో దణ్ణం చంద్రబాబు -
ఫోన్ ట్యాపింగ్ కేసుపై స్పందించిన సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి
-
అనుమతి లేకుండానే ఫోన్ ట్యాపింగ్
సాక్షి, హైదరాబాద్: ‘అనుమతి లేకుండానే రాజ్యాంగ పదవుల్లో ఉన్న అత్యున్నత స్థాయి అధికారులు, నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారు. ఇందుకు సంబంధించి విదేశాల్లో ఉన్న నిందితుల్ని కూడా రప్పించేందుకు చర్యలు చేపడుతున్నాం..’ అని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అధీకృత అథారిటీ ద్వారా ఈ వివరాలు న్యాయస్థానం దృష్టికి తీసుకొస్తున్నామని పేర్కొంది. ఫోన్‌ట్యాపింగ్ కేసుకు సంబంధించి మంగళవారం కౌంటర్ దాఖలు చేసింది. మరోవైపు..ఫోన్ ట్యాపింగ్‌కు తాము కూడా ఎలాంటి అనుమతి ఇవ్వలేదని కేంద్రం తన కౌంటర్లో పేర్కొంది. గత ప్రభుత్వ హయాంలో హైకోర్టు న్యాయమూర్తి ఫోన్ ట్యాప్ అయిందని, జడ్జీల ఫోన్లను ట్యాప్ చేసినట్టు ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ నాయిని భుజంగరావు తన నేరాంగీకార వాంగ్మూలంలో పేర్కొన్నారంటూ పత్రికల్లో వచ్చి కథనాలను హైకోర్టు సుమోటోగా విచారణకు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టి.వినోద్‌కుమార్ ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. కేంద్రం తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ గాడి ప్రవీణ్‌కుమార్, రాష్ట్ర ప్రభుత్వం (రాష్ట్ర హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా (కాంపిటెంట్ అథారిటీ)) తరఫున అడిషనల్ అడ్వొకేట్ జనరల్ ఇమ్రాన్‌ఖాన్ కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేశారు. మా అనుమతి కోరలేదు: కేంద్రం‘బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్‌తో మాకు ఎలాంటి సంబంధం లేదు. మా అనుమతి కోరలేదు. ఫోన్ ట్యాపింగ్‌కు రాష్ట్ర హోంశాఖ కూడా అనుమతి ఇవ్వొచ్చు. రాష్ట్రానికి కూడా ఆ అధికారం ఉంది. గరిష్టంగా 60 రోజుల వరకు అనుమతించాలి. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వ ప్రస్తావన, ప్రమేయం లేదు..’ అని కేంద్రం పేర్కొంది. చిరునామాలూ సేకరించారు: రాష్ట్ర ప్రభుత్వం‘ప్రణీత్‌కుమార్ తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని పలువురితో కుమ్మక్కై పదేళ్లుగా సేకరించిన అనధికారిక సమాచారమంతా తన వ్యక్తిగత పెన్డ్రైవ్ల్లో, హార్డ్ డిస్క్‌ల్లో నిక్షిప్తం చేశారు. ఆ తర్వాత ఆధారాలు లేకుండా చేయడం కోసం సీసీ కెమెరాలు ఆఫ్ చేసి ఆఫీస్‌లోని కంప్యూటర్లతో పాటు హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేశారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను గుర్తించారు. ప్రభాకర్‌రావు(ఏ–1), శ్రవణ్‌కుమార్ (ఏ–6) పరారీలో ఉన్నారు. విదేశాల్లో ఉన్న ప్రభాకర్‌రావును రెడ్ కార్నర్ నోటీసులపై రప్పించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రణీత్‌కుమార్ (ఏ–2), భుజంగరావు (ఏ–3), తిరుపతన్న (ఏ–4), రాధాకిషన్‌రావు (ఏ–5)లతో కలసి వీరంతా నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని విచారణలో వెల్లడైంది. ప్రణీత్‌కుమార్ నేతృత్వంలో స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్ఓటీ)ను ఏర్పాటు చేసి కాల్ డేటా రికార్డు (సీడీఆర్), ఇంటర్నెట్ ప్రొటోకాల్ డేటా రికార్డ్ (ఐపీడీఆర్), లొకేషన్ సర్వీసెస్ ద్వారా అన్ని వర్గాల ప్రజల టెలిఫోన్ల ట్యాపింగ్‌కు పాల్పడమే కాకుండా వారి అడ్రస్‌లను కూడా సేకరించారు. అప్పటి అధికార పార్టీకి అనుకూలంగా పనిచేసేందుకు ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుండా నేరాలకు పాల్పడ్డారు. అత్యవసర పరిస్థితుల్లో ఇంటెలిజెన్స్ ఏడీజీపీ, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఐజీపీ, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఐజీపీలు ఫోన్ ట్యాపింగ్‌కు అనుమతించవచ్చు. అయితే కాంపిటెంట్ అథారిటీకి 3 రోజుల్లో వివరాలు తెలియజేయాలి. ఆయన 7 రోజుల్లో దాన్ని ధ్రువీకరించాలి. కానీ ఇక్కడ అలాంటిదేమీ జరగలేదు..’ అని రాష్ట్ర ప్రభుత్వ అఫిడవిట్లో పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించారు‘ప్రభాకర్‌రావు పదవీ విరమణ పొందిన తర్వాత ఎస్ఐబీ చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్(ఇంటెలిజెన్స్)గా కీలక పోస్టు కట్టబెట్టారు. మూడేళ్ల వరకు ఆయన్ను ఆ పదవిలో కొనసాగనిచ్చారు. టెలికమ్ సంస్థలకు లేఖ రాసిన ప్రభుత్వం.. ప్రభాకర్‌రావు అడిగిన ఏ సమాచారమైనా ఇవ్వాలని చెప్పింది. ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం నిబంధనలు ఇమిడి ఉన్నందున, అప్పటి హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నాకు అధికారం ఉండటంతో నిందితులు రికార్డులను ఎలా తయారు చేశారు? కొందరిని ఎలా తప్పుదోవ పట్టించారు? అనే విషయాలను కోర్టుకు దృష్టికి తీసుకొస్తున్నా. 2019 అక్టోబర్ నుంచి 2022 డిసెంబర్ వరకు నేను హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశా. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ (కాంపిటెంట్ అథారిటీ) అనుమతి లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేయడం చట్టవిరుద్ధం. హోం శాఖ చట్టాలు, నిబంధనలు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లపై నాకు పూర్తి అవగాహన ఉంది. ఇండియన్ టెలిగ్రాఫ్ రూల్స్ 419ఏ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోని రూల్స్‌ను ఉల్లంఘిస్తూ అక్రమాలకు పాల్పడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థనే ప్రభావితం చేసే తీవ్రమైన నేరాలకు పాల్పడ్డారు. ఈ కేసులో దర్యాప్తు నిష్పక్షపాతంగా సాగుతోంది. దీని వెనుక ఎవరున్నా వదిలిపెట్టం..’ అని రవి గుప్తా తన కౌంటర్లో స్పష్టం చేశా>రు. కాగా ఈ కేసుపై తదుపరి విచారణను ధర్మాసనం మూడు వారాలకు వాయిదా వేసింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు: నిందితుల అరెస్ట్‌కు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ టాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగం పెంచారు. ప్రధాన నిందితులు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఓ ఛానల్ ఎండీ శ్రవణ్ రావుల అరెస్ట్‌లకు రంగంసిద్దం చేశారు. విదేశాల నుంచి తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నాలు వేగవంతం చేశారు. అమెరికాలో ఉన్న నిందితులకు రెడ్‌కార్నర్ నోటీసులను జారీ చేసేందుకు ఇంటర్ పోల్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ కేసు దర్యాప్తు బృందం నేషనల్ సెంట్రల్ బ్యూరో అధికారులు, సీబీఐ అధికారులతో సమన్వయం చేసుకుంటోంది. అమెరికా, భారత్ మధ్య ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రకారం నిందితులను అరెస్టకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే విషయాన్ని దర్యాప్తు బృందం కోర్టుకు తెలియజేసింది. వీలైనంత త్వరగా నిందితులను ఇండియాకు తీసుకువచ్చి ఫోన్ టాపింగ్ కేసులో విచారించనున్నారు పోలీసులు. కేసులో ఉన్న మరి కొంతమందికి సంబంధించిన దర్యాప్తు బృందం ఆధారాలను సేకరించింది. త్వరలోనే మరి కొంతమందికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలవనుంది.చదవండి: ప్రభాకర్‌రావును రప్పించేందుకు రెడ్‌కార్నర్ నోటీసులు -
ఫోన్‌ట్యాపింగ్ కేసులో ఎవరినీ వదలం: వెస్ట్‌జోన్ డీసీపీ
సాక్షి,హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంతటివారున్నా చట్టపరమైన చర్యలుంటాయని వెస్ట్‌జోన్ డీసీపీ విజయ్‌కుమార్ తెలిపారు. మంగళవారం(జులై 30) ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ నాయకులున్నా ఎవరున్నా వారిపై చర్యలుంటాయని స్పష్టం చేశారు. ‘ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటివరకు నలుగురు అరెస్ట్ అయ్యారు.మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. విదేశాల్లో ఉన్న ఆ ఇద్దర్ని రప్పించడానికి చట్టపరంగా ప్రాసెస్ జరుగుతోంది. కేసులో ఇప్పటివరకు సేకరించిన సాక్షాధారాలతో చార్జ్ షీట్ దాఖలు చేశాం. దాఖలు చేసిన చార్జిషీట్‌ను కోర్టు అంగీకరించింది. త్వరలో బలమైన సాక్షాలను సేకరించి అనుమానితులను విచారిస్తాం. ఇందుకోసం ప్రత్యేకంగా ఇప్పటికే ఒక టీం పని చేస్తోంది. -
రావును రప్పించగలరా?
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావును అమెరికా నుంచి వెనక్కు రప్పించడం అంత తేలిక కాదని తెలుస్తోంది. ఆయన వైద్యపరమైన కారణాలతో ఆ దేశంలో ఉండటం, ఇంటర్‌పోల్ కేవలం బ్లూకార్నర్ నోటీసు మాత్రమే జారీ చేసే అవకాశం ఉండటంతో దర్యాప్తు అధికారులు ఆయన డిపోర్టేషన్ (బలవంతంగా రప్పించడం) పై మల్లగుల్లాలు పడుతున్నారు. సుదీర్ఘకాలం ఎస్ఐబీ చీఫ్‌గా వ్యవహరించిన ప్రభాకర్‌రావు గత డిసెంబర్ 4న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూసి రాజీనామా చేశారు. అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు, తదితర పరిణామాలను గమనించిన ఆయన తిరుపతికి ప్రయాణమై కనీసం కుటుంబీకులకు కూడా చెప్పకుండా అటు నుంచే చెన్నై మీదుగా అమెరికా వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన టెక్సాస్‌లో వైద్యం చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. గత నెల 12న ప్రభాకర్‌రావు కుమారుడిని విచారించిన పోలీసులు ఆయన తిరిగి ఎప్పుడు వస్తారని ప్రశ్నించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభాకర్‌రావు ఇటీవల ఈ–మెయిల్ ద్వారా దర్యాప్తు అధికారికి లేఖ రాశారు. జూన్ నాటికి పూర్తిగా కోలుకుని తిరిగి వచ్చేస్తానని భావించానని, నిరాధార ఆరోపణలతో కలిగిన మానసిక వేదన కారణంగా ఆరోగ్యం మరింత క్షీణించిందని ఆ లేఖలో పేర్కొన్నారు. బ్లూ కార్నర్ నోటీసు జారీ అయినప్పటికీ... హైదరాబాద్ పోలీసులు ప్రభాకర్‌రావుపై తొలుత ఇంటర్‌పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించాలని భావించారు. అయితే ఆ విభాగం దృష్టిలో ఈ కేసు అంత తీవ్రమైంది కాదనే ఉద్దేశంతో బ్లూ కార్నర్ నోటీసుల జారీ కోసం సీబీఐని ఆశ్రయించారు. ఇవి జారీ అయినా ఇంటర్‌పోల్ ప్రభాకర్‌రావు ఆచూకీ కనిపెట్టి, ఆయన కదలికలపై నిఘా ఉంచుతుంది తప్ప బలవంతంగా తిప్పి పంపదు. ఒకవేళ ఏదో ఒకవిధంగా డిపోర్టేషన్ ఉత్తర్వులు పొందినా.. అవి అమెరికా న్యాయవ్యవస్థ ఆమోదం పొందాలి. అమెరికా న్యాయవ్యవస్థ వద్ద వెయ్యికిపైగా వివిధ నోటీసులు పెండింగ్‌లో ఉండగా.. ఇప్పటివరకు కేవలం 56 నోటీసుల అమలుకే అనుమతి ఇ చ్చింది. అమెరికా వంటి దేశాల్లో వ్యక్తుల ప్రాణాలు, ఆరోగ్యానికి విలువ ఎక్కువ. ప్రభాకర్‌రావు అక్కడ మెడికల్ గ్రౌండ్స్‌పై ఉంటున్నందున ఆయనపై నోటీసు జారీ అయినా డిపోర్టేషన్‌కు అనుమతించే అవకాశాలు చాలా తక్కువే. వీసాగడువులో మతలబులుఎన్నో...తరచూ అమెరికాకు వెళ్లి వస్తున్న ఆయా వ్యక్తుల కుటుంబీకులు, అక్కడే ఉంటున్న ప్రభాకర్‌రావు వంటి వారికి సాధారణంగా 10 నుంచి 15 ఏళ్ల గడువుతో కూడిన వీసాలు లభిస్తుంటాయి. అయితే ఒకసారి ఆ దేశంలో అడుగుపెట్టిన తర్వాత గరిష్టంగా 180 రోజులలోపు తిరిగి బయటకు వచ్చేయాలనే నిబంధన ఉంది. దీంతో ప్రస్తుతం ఆయన 179 రోజులు అక్కడ ఉండి, ఆపై కెనడా లేదా మరో దేశానికి కొన్ని రోజులు వెళ్లి వస్తే.. మళ్లీ 179 రోజులు అమెరికాలో ఉండే అవకాశం దక్కుతుంది. ప్రభాకర్‌రావు వైద్యం చేయించుకుంటున్న నేపథ్యంలో వీసా గడువు తేలిగ్గా పొడిగించుకునే అవకాశం ఉంది. రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయం ద్వారా ఆయన పాస్‌పోర్టు రద్దుకు ప్రయత్నాలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. అయితే ఇది కూడా ఆశించిన ఫలితం ఇవ్వదని కొందరు నిపుణులు చెబుతున్నారు. -
ఫోన్ ట్యాపింగ్ లో కీలక మలుపు నిందితులకు రెడ్ కార్నర్..
-
అడ్డంగా దొరికిన టీవీ5 సాంబశివరావు..
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
-
జస్టిస్ శరత్, రేవంత్‌ల ఫోన్లు ట్యాపింగ్
సాక్షి, హైదరాబాద్: ‘ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. వందల మంది జడ్జీలు, మాజీ మంత్రులు, జర్నలిస్టులు, న్యాయవాదులు.. ఇలా ఎంతో మంది ఫోన్ నంబర్లు, అడ్రస్‌లు, కాల్ రికార్డుల జాబితా అంతా సేకరించారు. వారి ఫోన్లు ట్యాప్ చేసి బీఆర్ఎస్కు అనుకూలంగా మార్చుకునే యత్నం చేశారు. హైకోర్టు జడ్జి జస్టిస్ కాజా శరత్ ఫోన్ కూడా ట్యాప్ అయింది. ఓ వ్యక్తిపై కేసులు లేకుండా చేసేందుకు టీవీ 5 సాంబశివరావు రూ.2 కోట్లు తీసుకున్నారు’ అని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. ఈ మేరకు బుధ వారం హైకోర్టులో అఫిడవిట్ సమర్పించింది.సుమోటోగా తీసుకున్న కోర్టు..గత ప్రభుత్వ హయాంలో హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ కాజా శరత్ ఫోన్ ట్యాప్ అయిందని.. జడ్జీల ఫోన్లను ట్యాప్ చేసినట్టు ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ నాయిని భుజంగరావు తన నేరాంగీకార వాంగ్మూలంలో పేర్కొన్నారని పత్రికల్లో వచ్చి కథనాలను హైకోర్టు సుమోటోగా విచారణకు చేపట్టిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు కూడా జారీ చేసింది. తాజాగా ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌ల ధర్మాసనం బుధవారం మధ్యాహ్న విరామం తర్వాత విచారణ చేపట్టింది.విచారణ 23వ తేదీకి వాయిదా..ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపిస్తూ.. ఫోన్ ట్యాపింగ్ కేసుపై అన్ని వివరాలతో కౌంటర్ దాఖలు చేశామని ధర్మాసనానికి వివరించారు. కేసు ఎప్పుడు నమోదు చేశారు? ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి? నిందితులెవరు? కేసు పురోగతి ఎంత వరకు వచ్చింది వంటి వివరాలు అందులో పేర్కొన్నామని.. కానీ ఇంకా రికార్డు కాలేదని చెప్పారు. ఈ వివరాలను రికార్డు చేయాలని కోర్టు అధికారులను ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణలోగా కౌంటర్ వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో తాను కూడా బాధితుడినేనని, పోలీసు అధికారుల నుంచి తీవ్ర వేధింపులు ఎదుర్కొన్నానని.. తనను ఈ పిటిషన్లో ఇంప్లీడ్ చేయాలంటూ సిద్దిపేట జిల్లాకు చెందిన హయతుద్దీన్ వేసిన పిటిషన్‌పై నిర్ణయాన్ని కూడా ధర్మాసనం వాయిదా వేసింది.ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొన్న వివరావీ..‘‘నాయిని భుజంగరావు (ఏ3) వాంగ్మూలం మేరకు.. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్న విద్యార్థి సంఘాలు, కుల సంఘాల నాయకులు, జర్నలిస్ట్‌లు, జస్టిస్ కాజా శరత్, ఇతర హైకోర్టు న్యాయమూర్తులు, ప్రభుత్వానికి సంబంధించిన కేసులను వాదిస్తున్న న్యాయవాదులు, పార్టీ నేతల వ్యక్తిగత జీవితం, చేసే పనులు తెలుసుకుని ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేలా ప్రభావితం చేశారు. బీఆర్ఎస్కు ఇబ్బందికర పరిస్థితి వచ్చినప్పుడల్లా అవతలి వారి ఫోన్లు ట్యాప్ చేసి బెదిరించేవాళ్లు. హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలకు ఎర కేసులో, టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ అంశం సమయంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. ‘నేను కీలక వ్యక్తుల పేర్లు, ఫోన్ నంబర్లు సేకరించి ప్రణీత్‌కుమార్‌కు అందజేసేవాడిని. వారి ఫొటోలు, అడ్రస్‌లు సేకరించి చర్యలు తీసుకోవడం కోసం ఇంటెలిజెన్స్, లా అండ్ ఆర్డర్ పోలీసులకు పంపేవాళ్లం’ అని భుజంగరావు చెప్పారు. టెలికం సర్వీస్ ప్రొవైడర్ల నుంచి వివరాలు సేకరించినట్టు, ఫోన్ నంబర్ చెబితే వారి కాల్లకు సంబంధించి వివరాలు కూడా సర్వీస్ ప్రొవైడర్లు ఇచ్చినట్టు తెలిసింది. జస్టిస్ కాజా శరత్, ఆయన సతీమణి మాధవి నంబర్లు, కాల్ల వివరాలు, అడ్రస్‌లు జియో ఆఫీస్ నుంచి తెలుసుకున్నారు. కీలక వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్..సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన సోదరుడు కొండల్‌రెడ్డి, ఎనుముల తిరుపతిరెడ్డి, విజయ్‌రెడ్డి, కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఈటల రాజేందర్, ఈటల నితిన్, శివధర్‌రెడ్డి, ఏఆర్ శ్రీనివాస్, రాఘవేందర్‌రెడ్డి, రోనాల్డ్ రోస్, ధర్మపురి అర్వింద్, ఎం.రమేశ్‌రెడ్డి, మేఘా శ్రీనివాస్‌రెడ్డి, మైనంపల్లి రోహిత్, పీడీ కృష్ణకిశోర్, ఐఏఎస్ దివ్య, తాటినేటి శశాంక్, రాజ్‌న్యూస్ సునీల్‌రెడ్డి, చిలుకా రాజేందర్‌రెడ్డి, కె.వెంకటరమణారెడ్డి, నరేంద్రనాథ్ చౌదరి, తీన్మార్ మల్లన్న (నవీన్), ఏఎంఆర్ ఇన్ఫ్రా మహేశ్‌రెడ్డి, వీరమళ్ల సత్యం, గాలి అనిల్‌కుమార్, రామసాయం సురేందర్‌రెడ్డి, కుందూరు రఘువీర్‌రెడ్డి, మేరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మేరెడ్డి స్వప్నిక, కాసాని జ్ఞానేశ్వర్, కొల్లే సరిత, అంజన్న (ఈటల గన్‌మన్), అనుమాండ్ల నరేందర్‌రెడ్డి, బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్, మనాల మోహన్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డితో పాటు మరికొందరి ఫోన్లను ట్యాప్ చేశారు.మధ్యవర్తిగా టీవీ 5 సాంబశివరావు..సంధ్య కన్వెన్షన్ శ్రీధర్‌రావు, టీవీ 5 సాంబశివరావులకు సంబంధించిన హెచ్‌పీసీఎల్ పెట్రోల్ బంక్ వివాదం ఉంది. ఈ పంచాయతీని సాంబశివరావు భుజంగరావు వద్దకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా శ్రీధర్‌రావుపై చాలా క్రిమినల్ కేసులు ఉన్నాయని, వాటి నుంచి బయటపడాలంటే రూ.15 కోట్లు బీఆర్ఎస్కు పార్టీ ఫండ్‌గా ఇవ్వాలని భుజంగరావు ఒత్తిడి తెచ్చారు. శ్రీధర్‌రావు రూ.13 కోట్లు విలువైన బీఆర్ఎస్ బాండ్లు కొనుగోలు చేశారు. ఈ వ్యవహారంలో మధ్యవర్తిత్వం వహించిన సాంబశివరావు రూ.2 కోట్లు తీసుకున్నారని భుజంగరావు వాంగ్మూలంలో పేర్కొన్నారు..’’ అని ప్రభుత్వం అఫిడవిట్లో తెలిపింది. వీటితోపాటు మరిన్ని వివరాలనూ వెల్లడించింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులకు చుక్కెదురు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు చుక్కెదురు
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్ని కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న ఏసీపీ ప్రణీత్ రావు, అడిషనల్ ఎస్పీ భుజంగ రావు, తిరుపతన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లు కొట్టేసింది నాంపల్లి కోర్టు. పోలీసుల వాదనలతో న్యాయ స్థానం ఏకీభవించింది.ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న ఏసీపీ ప్రణీత్ రావు, అడిషనల్ ఎస్పీ భుజంగ రావు, తిరుపతన్నలు బెయిల్ కావాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సమయంలో కేసులో పోలీసులు ఎటువంటి ఛార్జీషీట్ దాఖలు చేయలేదని తమ వాదనల్ని వినిపించారు.అయితే పిటిషన్లు దాఖలు చేసినట్లు చెప్పారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి ఛార్జ్‌షీట్‌లో మూడు కీలకమైన డాక్యుమెంట్లను జత చేసినట్లు తెలిపారు. ఈ కేసులో మరో కీలక నిందితుడైన ప్రభాకర్ రావు విదేశాల్లో ఉన్నారని, ఆయన్ని అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. ఫోన్ ట్యాంపింగ్‌పై మరికొంతమందిని విచారించాల్సి ఉందని, ఈ తరుణంలో వీరికి బెయిల్ ఇస్తే సాక్ష్యాల్ని రూపుమాపడమే కాకుండా..సాక్ష్యుల్ని బెదిరించే అవకాశం ఉందని వాదించారు. పోలీస్ శాఖలో కీలక పదవుల్లో ఉన్నారని, కేసులో మిగిలిన నిందితులు అరెస్ట్ చేసే వరకు బెయిల్ ఇవ్వకూడదని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. పోలీసుల వాదనల్ని ఏకీభవించిన కోర్టు నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది నాంపల్లి కోర్టు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఇండియాకు మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు
-
కరెన్సీ తరలింపులో మరికొందరు ఖాకీలు!
సాక్షి, హైదరాబాద్: అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన ‘పోలీసు వాహనాల్లో ఎలక్షన్ ఫండ్ రవాణా’ వ్యవహారంలో మరికొందరు ఖాకీల పాత్ర ఉన్నట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) పి.రాధాకిషన్‌రావు, ఓ మాజీ ఎస్పీ పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఒకరు ఇప్పటికే అరెస్టు కాగా మరొకరిని పోలీసులు విచారించారు. తెరవెనుక స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు పాత్ర ఉన్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. హైదరాబాద్ నుంచి టాస్క్‌ఫోర్స్, ఎస్ఐబీ వాహనాల్లో ఇతర జిల్లాలకు నగదు తరలినట్లు నిర్థారించారు. ఈ మొత్తాలను ఆయా జిల్లాల్లో రిసీవ్ చేసుకున్నది ఎవరు? అక్కడ నుంచి ఎవరి వద్దకు చేరాయి? అనే అంశాలపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో ఓ ఎస్పీ, మరికొందరు నాన్–క్యాడర్ ఎస్పీ స్థాయి అధికారుల పాత్రపై కొన్ని ఆధారాలు లభ్యమైనట్లు తెలిసింది. ప్రధానంగా ఎన్నికల సమయంలోనే..టాస్క్‌ఫోర్స్, ఎస్ఐబీ అధికారులు ప్రధానంగా గతంలో జరిగిన ఎన్నికలు, ఉప ఎన్నికల సమాయాల్లోనే నగదు అక్రమ రవాణా చేసినట్లు అధికారులు నిర్ధారిస్తున్నారు. ఈ మొత్తం వివిధ జిల్లాల్లో ఉన్న కొందరు నేతలకు చేరినట్లు అనుమానిస్తున్నారు. సిట్ అధికారులు ఇప్పటికే ఆయా నగదు అక్రమ రవాణా వాహనాల్లో ప్రయాణించిన ఎస్సైలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులతో పాటు డ్రైవర్లను ప్రశ్నించి వాంగ్మూలాలు నమోదు చేశారు. 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి వీటిని వాడటం మొదలెట్టారు. 2020లో జరిగిన దుబ్బాక, 2021 అక్టోబర్‌లో జరిగిన హుజూరాబాద్, 2022 అక్టోబర్ రెండో వారంలో జరిగిన మునుగోడు ఉప ఎన్నికలతో పాటు గత ఏడాది డిసెంబర్లో జరిగిన సాధారణ ఎన్నికల సందర్భాల్లో ఈ నగదు అక్రమ రవాణా ఎక్కువ జరిగినట్లు అంచనాకు వచ్చారు. హైదరాబాద్‌లోని వ్యక్తుల నుంచి ఆ మొత్తాలను తరలించే బాధ్యతల్ని అప్పటి రాధాకిషన్‌రావు నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్ పోలీసులు, జిల్లాలకు తీసుకువెళ్లే అంశాన్ని ఎస్ఐబీలోని కొందరు అధికారులు చేపట్టినట్లు సమాచారం. అయితే ఈ మొత్తాలను సురక్షితంగా వివిధ ప్రాంతాల్లోని వ్యక్తుల వద్దకు చేర్చాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు చెందిన స్థానిక అధికారుల సహకారం తీసుకుని ఉంటారని అనుమానించారు. ప్రభాకర్‌రావు లేదా రాధాకిషన్రావుల్లో ఎవరో ఒకరు వారితో మాట్లాడి, నగదు తరలింపులో సహకరించేలా ఒప్పించి ఉంటారనే కోణంలో దర్యాప్తు చేశారు. ఈ కోణంలో లోతుగా ఆరా తీసిన ఉన్నతాధికారులు ఓ ఎస్పీ స్థాయి అధికారి పాత్రను గుర్తించినట్లు సమాచారం. మరికొందరు నాన్–క్యాడర్ ఎస్పీ స్థాయి అధికారుల పాత్రపై కొన్ని ఆధారాలు లభ్యమైనట్లు తెలిసింది. కొందరికి నోటీసులు ఇచ్చి విచారించిన సిట్... అన్ని అంశాలు పూర్తిస్థాయిలో వెలుగులోకి వచ్చాక మిగిలిన వారికీ నోటీసులు జారీ చేసి విచారించాలని, వాంగ్మూలాలు నమోదు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. సంప్రదింపులు ఆపేసిన ప్రభాకర్రావుసుదీర్ఘకాలం ఎస్ఐబీ చీఫ్‌గా వ్యవహరించిన టి.ప్రభాకర్‌రావు గత ఏడాది డిసెంబర్ 4న రాజీనామా చేశారు. ఆపై ఎస్ఐబీలో జరుగుతున్న పరిణామాలు, ఎస్ఐబీ మాజీ డీఎస్పీ డి.ప్రణీత్‌రావుపై కేసు నేపథ్యంలో అమెరికా వెళ్లిపోయారు. పోలీసు అధికారులు ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్నలతో పాటు మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావు అరెస్టుల తర్వాత తిరిగి రావాలని భావించారు. అప్పటి నుంచి కొన్నాళ్లు కొందరు పోలీసు అధికారులు, తన సన్నిహితులతో సంప్రదింపులు జరిపారు. అయితే ప్రస్తుతం ఆయన ఇక్కడ ఉన్న వారితో సంప్రదింపులు పూర్తిగా ఆపేశారని తెలిసింది. ఈ నేపథ్యంలో పోలీసులు రెడ్ కార్నర్ నోటీసుల ద్వారా ఆయన్ను రప్పించాలని నిర్ణయించారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు వేగం పెంచారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఓ ఛానల్ ఓనర్‌ను త్వరలోనే అమెరికా నుంచి తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు.. ఈ కేసులో కీలకమైన టెక్నికల్ ఆధారాలను దర్యాప్తు బృందం సేకరించింది. కొండాపూర్‌లో కన్వర్జేన్ ఇన్నోవేషన్ ల్యాబ్స్‌లో సోదాలు చేశారు. కన్జర్వేషన్ ఇన్నోవేషన్ ల్యాబ్స్‌లో 3 సర్వర్లు, హార్డ్ డిస్క్‌లతో పాటు 5 మాక్ మినీ డివైజ్‌లు సిట్ సీజ్ చేసింది. ఆ సంస్థ డైరెక్టర్ పాల్ రవికుమార్‌కు నోటీసులు ఇచ్చి విచారణ చేస్తున్నారు. ఫోన్ టాపింగ్‌కు సంబంధించిన టెక్నికల్ ఆధారాలను పాల్ రవికుమార్ నుంచి పోలీసులు సేకరించినట్లు సిట్ వెల్లడించింది.. .. అదే సంస్థలో పనిచేసే సీనియర్ మేనేజర్ రాగి అనంత చారి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓలేటి సీతారాం శ్రీనివాస్‌లను స్టేట్మెంట్లను పోలీసులు రికార్డ్ చేశారు. కన్జర్వేషన్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ పరికరాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. పాల్ రవికుమార్ 160 సీఆర్పీసీ నోటీస్ జారీ చేసి స్టేట్మెంట్ను రికార్డు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. -
విదేశాల్లో ప్రభాకర్‌రావు, శ్రావణ్
సాక్షి, హైదరాబాద్: స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కార్యాలయం కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పంజగుట్ట పోలీసులు మంగళవారం అభియోగపత్రాలు దాఖలు చేశారు. ఇప్పటికే అరెస్టయిన పోలీసు అధికారులు దుగ్యాల ప్రణీత్‌రావు, నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్న, మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్రావులతోపాటు పరారీలో ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు, శ్రావణ్ రావులను నిందితులుగా పేర్కొంటూ అభియోగాలు మోపారు. పరారీలో ఉన్న ఇద్దరూ విదేశాల్లో తలదాచుకున్నట్లు కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ ఏడాది మార్చి 10న పంజగుట్ట పోలీసుస్టేషన్లో కుట్ర, నమ్మకద్రోహం, నేరపూరిత చర్యలు, ప్రజా ఆస్తుల విధ్వంసం తదితర సెక్షన్ల కింద నమోదైన ఈ కేసు ఆపై ట్యాపింగ్ టర్న్ తీసుకుంది. దీంతో టెలిగ్రాఫ్ యాక్ట్, సైబర్ టెర్రరిజం చట్టాలను జోడించారు. నిందితుడిగా ఉన్న ప్రణీత్‌ను మార్చి 12న, భుజంగరావును తిరుపతన్నలను 23న, రాధాకిషన్‌రావును 28న అరెస్టు చేశారు. చట్ట ప్రకారం ఓ నిందితుడిని అరెస్టు చేసిన తర్వాత గరిష్టంగా 90 రోజుల్లో అతడిపై అభియోగపత్రం దాఖలు చేయకుంటే న్యాయస్థానం అతడికి మ్యాండేటరీ బెయిల్ మంజూరు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు మంగళవారం ఈ కేసులో సప్లిమెంటరీ చార్జ్ïÙట్ దాఖలు చేశారు. ట్యాపింగ్... వసూళ్లు ట్యాపింగ్ కేసు దర్యాప్తులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డితోపాటు ఆయన కుటుంబీకులు, సంబం«దీకులు, పోలీసు అధికారులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. బీఆర్ఎస్కు చెందిన అసమ్మతి నేతలపైనా అక్రమ నిఘా ఉంచినట్లు వివరించారు. అలాగే, బీజేపీ నేతలు ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్, బండి సంజయ్‌ల ఫోన్లు ట్యాప్ చేశారని అభియోగపత్రాల్లో పేర్కొన్నారు. వివిధ నిర్మాణ సంస్థలు, రియల్ ఎస్టేట్ కంపెనీలకు చెందిన యజమానులు, వ్యాపారవేత్తల ఫోన్ల పైనా అక్రమ నిఘా ఉంచారని, అలా తెలుసుకున్న విషయాలతో వసూళ్లకు పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు. బీఆర్ఎస్ అగ్రనాయకుల ఆదేశాల మేరకు రాధాకిషన్‌రావు భారీ స్థాయిలో వసూళ్లకు పాల్పడినట్లు తేల్చారు. మొత్తమ్మీద నిందితులు 1000 నుంచి 1200 ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆధారాలు లభించాయని, బాధితుల్లో హైకోర్టు న్యాయమూర్తి కాజా శరత్ కూడా ఉన్నట్లు అధికారులు న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. మరోపక్క డీఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై తీర్పును కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే అరెస్టులు జరిగాయని నిందితుల తరఫు న్యాయవాది, బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. -
‘ఫోన్ ట్యాపింగ్’పై మీ వివరణేంటి?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంచనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసుపై మీ వివరణేంటో చెప్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ అనేది తీవ్ర ఆందోళన కలిగించే విషయమని.. ఇది టెలిఫోన్ ట్యాపింగ్ లాంటి సాధారణ సమస్య కాదని, వ్యక్తుల గోప్యతలోకి చొరబడిన అంశమని వ్యాఖ్యానించింది. మూడు వారాల్లో దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. కేంద్ర హోం శాఖ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ, హైదరాబాద్ సీపీలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 3కు వాయిదా వేసింది. గత ప్రభుత్వ హయాంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కాజా శరత్ ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారంటూ ఓ పత్రికలో వచ్చిన వార్తను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం సుమోటోగా విచారణ చేపట్టాలని నిర్ణయించింది. సుమోటాగా విచారణ చేపట్టిన హైకోర్టు ‘ఫోన్ ట్యాపింగ్, జీపీఎస్ లొకేషన్ నుంచి వివరాలు తెలుసుకుని రేవంత్‌రెడ్డి స్నేహితుడు గాలి అనిల్‌కుమార్ నుంచి రూ.90 లక్షలు, కె.వినయ్‌రెడ్డి నుంచి రూ.1.95 కోట్లు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్నేహితుడు వేణు నుంచి రూ.3 కోట్లు, జి.వినోద్ నుంచి రూ.50 లక్షలు, ఉత్తమ్ మిత్రుల నుంచి రూ.50 లక్షలు.. ఇలా పలువురి నుంచి ఎన్నికల సమయంలో నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ తిరుపతన్న తన వాంగ్మూలంలో చెప్పారు. హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ నాయిని భుజంగరావు తన నేరాన్ని అంగీకరిస్తూ ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు’అంటూ వచ్చిన కథనాన్ని హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టి.వినోద్‌కుమార్ ధర్మాసనం మంగళవారం మధ్యాహ్న విరామం తరువాత విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ, విచారణ వాయిదా వేసింది. -
ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐ విచారణ జరిపించాలి
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీబీఐ విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్.. సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. రాష్ట్రంలోకి సీబీఐని నిషేధిస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలన్నారు. ట్యాపింగ్ ద్వారా ప్రతిపక్షాలపై సైబర్‌దాడికి కారకులైన కేసీఆర్, కేటీఆర్‌లకు నోటీసులిచ్చి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బండి సంజయ్ శనివారం ముఖ్యమంత్రికి బహిరంగలేఖ రాశారు. తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిద్దరూ ఎమ్మెల్యే పదవులకు అనర్హులని, ఈ మేరకు స్పీకర్‌కు సీఎం లేఖ రాయాలన్నారు. విపక్షాలను దెబ్బతీయడానికి ఉద్దేశపూర్వకంగా కేసీఆర్, కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపించారని విచారణలో తెలిసినా.. ఇంతవరకు వారికి కనీసం నోటీసులు ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ వ్యవహారంలో భారీగా డబ్బులు కూడా చేతులు మారినట్లు తెలుస్తోందని సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం కేసీఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ కాపాడే యత్నాలు చేస్తోందనే చర్చతో ప్రజల్లో ప్రభుత్వ విశ్వసనీయత దెబ్బతిన్నదన్నారు. ఏఐసీసీకి రాష్ట్రం ఏటీఎంగా మారింది ఏఐసీసీకి తెలంగాణ రాష్ట్రం ఏటీఎంగా మారిందని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ ఢిల్లీకి వచ్చి కాంగ్రెస్ అధినాయకత్వాన్ని ఒప్పించి, మెప్పించారు కాబట్టే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఒత్తిడి వస్తోందని, అందుకే ఆయా కేసుల విచారణ ముందుకు వెళ్లడం లేదన్నారు. శనివారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ను విలీనం చేసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని ఆరోపించారు.దశాబ్ది వేడుకలకు సోనియాను ఆహా్వనించిన రేవంత్‌రెడ్డి, తెలంగాణ బిల్లు ఆమోదంలో కీలకపాత్ర పోషించిన బీజేపీ నాయకులను ఎందుకు ఆహా్వనించలేదని ప్రశ్నించారు. కాగా, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్‌లో కీలక వ్యక్తుల అరెస్టు ఎప్పుడు: ఎంపీ లక్ష్మణ్
సాక్షి,హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దోషులకు శిక్ష పడేవరకు బీజేపీ పోరాటం చేస్తుందని, ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ సీనియర్ నేత, ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. తెలంగాణ చరిత్రలో రేవంత్ రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా ఉండాలంటే ఫోన్ ట్యాపింగ్ సీబీఐకి అప్పగించాల్సిందేననన్నారు. ఫోన్‌ట్యాపింగ్ కేసులో చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద శుక్రవారం జరిగిన ధర్నాలో లక్ష్మణ్ మాట్లాడారు. ‘కాంగ్రెస్ మోసాన్ని గ్రహించి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి మరోసారి ప్రజలు పట్టం కడ్తారు. తెలంగాణలో కాంగ్రెస్ కంటే అత్యధిక ఎంపీ సీట్లు సాధిస్తాం. కేసీఆర్ అవినీతిని అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి పదే పదే ప్రస్తావించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాళేశ్వరం, ధరణి పేరుతో దోచుకున్నదాన్ని కక్కిస్తాం అన్నారు. కేసీఆర్ అవినీతి, కుంభకోణాల మీద రేవంత్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అధికారాన్ని శాశ్వత పరుచుకునేందుకు నిఘా వ్యవస్థను కేసీఅర్ దుర్వినియోగం చేశారు. ఉప ఎన్నికల్లో ఓటర్లను కొనుగోలు చేయడానికి, ప్రత్యర్ధులను దెబ్బ కొట్టడానికి ఫోన్ ట్యాపింగ్ వాడారు. అరెస్ట్ అయిన వాళ్ళు వాంగ్మూలం ఇచ్చినా మిగిలిన వారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు. టెలికాం రెగ్యులేటరీ నిబంధనలకు భిన్నంగా, కేంద్రం అనుమతి లేకుండా కేసీఆర్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసింది.తాను కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడినని చెప్పుకున్న రేవంత్‌రెడ్డి ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం కేసీఆర్ లోపాయికారీ ఒప్పందం చేసుకుందా..? రేవంత్ రెడ్డికి ఏ మాత్రం పౌరుషం ఉన్నా.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిందితులను శిక్షించాలి. రేవంత్ రెడ్డి కుర్చీ కోసం అధిష్టానానికి లొంగిపోతారా స్పష్టం చేయాలి. బీజేపీ సీనియర్‌నేత బీఎల్ సంతోష్ మీద కేసీఆర్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టింది. లిక్కర్ కేసు నుంచి కవితను తప్పించడం కోసమే బీజేపీ నేతలపై కేసులు పెట్టడం దుర్మార్గం. బీఆర్ఎస్ నీచ రాజకీయాలకు పాల్పడింది. బీఆర్ఎస్ నేతలను ఏ మాత్రం కాపాడినా రేవంత్ రెడ్డికి కూడా అదే గతిపడుతుంది’అని లక్ష్మణ్ హెచ్చరించారు. -
నేడు ధర్నాచౌక్‌లో బీజేపీ ధర్నా
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న ‘ఫోన్‌ట్యా పింగ్’ అంశాన్ని రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం చేయాలని బీజేపీ భావి స్తోంది. ఫోన్‌ట్యాపింగ్‌పై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐతో విచారణ లేదా సమగ్ర దర్యాప్తు జరిపించాలనే డిమాండ్‌తో ధర్నాలు, వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమైంది. ఈ కార్యాచరణలో భాగంగా...శుక్రవారం ఉదయం 11 గంటలకు ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద ధర్నా నిర్వహించనుంది. లోక్‌సభ ఎన్నికల కోడ్ కొనసా గుతున్న నేపథ్యంలో...ఈ ధర్నా నిర్వహణకు ఎన్ని కల కమిషన్ అనుమతి కోరుతూ రాష్ట్ర పార్టీ లేఖ రాసింది.ధర్నాచౌక్‌లో నిరసన తెలిపేందుకు పోలీసుల అనుమతి కోరుతూ సంబంధిత అధికారులకు లేఖను అందజేసింది. ఈ ఆందోళనా కార్యక్రమంలో బీజేపీ ఓబీసీమోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, సీనియర్ నాయకులు పాల్గొననున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణను నీరుగార్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని బీజేపీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి కేసును తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. -
ట్యాపింగ్‌లో కదలిక!
నిజామాబాద్, కామారెడ్డి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో జిల్లాలోనూ ప్రకంపనలు వస్తున్నాయి. ప్రతిపక్షాల కదలికలను పసిగట్టి, చెక్ పెట్టడానికి గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఇంటెలిజెన్స్ ఏఎస్పీ భుజంగరావు వాంగ్మూలంలో ఇందుకు సంబంధించిన మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. దీంతో ట్యాపింగ్‌కు సహకరించిన జిల్లాకు చెందిన అధికారులు, నాయకుల్లో గుబులు మొదలైంది.అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి సీఎం కేసీఆర్ తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలోనూ పోటీ చేశారు. ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఇక్కడినుంచి బరిలో నిలిచారు. రేవంత్‌రెడ్డి తరఫున ఆయన సోదరుడు కొండల్‌రెడ్డి ఎన్నికల ప్రచార బాధ్యతలను చూసుకున్నారు. మరోవైపు బీజేపీ అభ్యరి్థగా కె.వెంకటరమణారెడ్డి పోటీ చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలో వెంకటరమణారెడ్డి వైపు ఓటర్ల మొగ్గు ఉన్నట్లు సర్వేల ద్వారా తెలుసుకుని బీజేపీతోపాటు కాంగ్రెస్‌లపైనా అప్పటి ప్రభుత్వం నిఘా పెట్టింది.వెంకటరమణారెడ్డి, కొండల్‌రెడ్డిల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారడంతో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను సీరియస్‌గా తీసుకుని విచారణకు ఆదేశించింది. కాగా ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన అప్పటి ఏఎస్పీ భుజంగరావు వాగ్మూలాన్ని సిట్ ఇటీవల రికార్డు చేసింది. బీఆర్ఎస్ను వరుసగా మూడోసారి అధికారంలోకి తీసుకురావాలనే సంకల్పంతో ఈ పనిచేసినట్లు ఆయన అంగీకరించడం గమనార్హం. ఆయన కామారెడ్డి నియోజకవర్గంలో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన వివరాలనూ వెల్లడించినట్లు తెలిసింది.హోటల్లో వార్ రూం.. ప్రత్యర్థుల కదలికలను తెలుసుకునేందుకు ఫోన్ ట్యాపింగ్ గ్యాంగ్‌ను కామారెడ్డికి పంపారని, ప్రతిపక్షాల ఆర్థిక మూలాలను టార్గెట్ చేశారని ప్రాథమిక విచారణలో సిట్ గుర్తించింది. వార్ రూంను ఎక్కడ ఏర్పాటు చేశారు, ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేశారు, ఎవరి పాత్ర ఏమిటనే పూర్తి వివరాలను ఇంటెలిజెన్స్ వర్గాలు సేకరించి రెండు నెలల క్రితమే నివేదికను ‘సిట్’కు అందించినట్లు తెలిసింది. కాంగ్రెస్, బీజేపీ నేతల వ్యవహారాలపై నిఘా పెట్టడం కోసం కామారెడ్డికి వచ్చిన ట్యాపింగ్ గ్యాంగ్ జిల్లా కేంద్రంలో ఉన్న ఓ ప్రముఖ హోటల్లో నాలుగు గదులను అద్దెకు తీసుకున్నట్లు తెలిసింది.అక్కడే వార్ రూంను ఏర్పాటు చేసి తమ కార్యకలాపాలను నడిపించారు. అక్కడి నుంచి ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం, ఆర్థిక మూలాలు, ఇతర విలువైన సమాచారాన్ని తెలుసుకుని అధికార పక్ష నేతలకు అందించడం లాంటివి చేశారని తెలుస్తోంది. వార్ రూం ఇన్‌చార్జీగా వ్వవహరిస్తూ, ఇక్కడకు వచ్చిన గ్యాంగ్‌కు అన్ని రకాలుగా సౌకర్యాలు కలి్పంచిన ముఖ్య నేతలు ఎవరు, ఇక్కడి అధికారులు ఎవరైనా సహకారం అందించారా అన్న విషయాలు తెలియాల్సి ఉంది. కాగా ఈ వ్యవహారం ఎవరి మెడకు చుట్టుకుంటుందో అని బీఆర్ఎస్ నేతలు, వారికి సహకరించిన అధికారులు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.ఆరోపణలకు బలం..ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలకు బలం చేకూరేలా ఎన్నికల సమయంలో పలు సంఘటనలు చో టు చేసుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు మూడు రోజుల ముందు జిల్లా కాంగ్రెస్‌లో ముఖ్య నాయుకుడైన గూడెం శ్రీనివాస్‌రెడ్డికి చెందిన వ్యాపార కార్యాలయంపై అధికారులు దాడులు చేశారు. ఇందులో రూ.58 లక్షలు ప ట్టుబడ్డాయి. దేవునిపల్లి ప్రాంతంలో సీఎం రే వంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డి నివాసం ఉన్న ఇంట్లో కూడా ఆకస్మిక తనిఖీలు జరిగాయి.ఆయనను గృహ నిర్భంధం కూడా చేశారు. అంతే కాకుండా విద్యానగర్‌కాలనీలో నివసించే ప్ర స్తుత మున్సిపల్ చైర్ పర్సన్ ఇందుప్రియ ఇంటిపై కూడా దాడులు జరిగాయి. ఈ సందర్భంగా పోలీసులు, కాంగ్రెస్ నాయకుల మధ్య వా గ్వాదం కూడా జరిగింది. ఫోన్ ట్యాపింగ్‌తోనే వివరాలు తెలుసుకుని దాడులు చేశారని సిట్ విచారణలో తేలినట్లు సమాచారం. -
హైకోర్టు జడ్జీల ఫోన్లనూ ట్యాప్ చేశాం
సాక్షి, హైదరాబాద్: స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు తాము హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లనూ ట్యాప్ చేశామని ఈ కేసులో నిందితుడిగా ఉన్న అదనపు ఎస్పీ నాయిని భుజంగరావు బయటపెట్టారు. తాము నిఘా ఉంచి, పర్యవేక్షించిన వారిలో జస్టిస్ శరత్ కాజా కూడా ఉన్నారని వెల్లడించారు. అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో 2024 మార్చి 23న అరెస్టయిన భుజంగరావును పోలీసులు రెండుసార్లు తమ కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఈ నేపథ్యంలోనే ఆయన పలు విషయాలు వెల్లడించినట్లు నేరాంగీకార వాంగ్మూలాల్లో పొందుపరిచిన పోలీసులు.. వీటిని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాటిలోని వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా మిర్యాల గ్రామానికి చెందిన భుజంగరావు 1991లో ఎస్సైగా ఎంపికయ్యారు. మల్కాజిగిరి, నాచారం, వనస్థలిపురంలో పనిచేసి, 2005లో ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందారు. మాదాపూర్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తించిన తర్వాత డిప్యుటేషన్‌పై 2011 జనవరి నుంచి 2014 ఫిబ్రవరి వరకు ట్రాన్స్‌కోలో పనిచేశారు. పదోన్నతి పొందిన తర్వాత 2014–15 మధ్య ఎస్ఐబీలో డీఎస్పీగా పని చేశారు. అదనపు ఎస్పీగా పదోన్నతి పొందిన తర్వాత 2021లో డిప్యుటేషన్‌పై నిఘా విభాగంలోకి వెళ్లారు. గత ఏడాది డిసెంబర్ 16 వరకు పొలిటికల్ ఇంటెలిజెన్స్ వ్యవహారాలు పర్యవేక్షించారు. బీఆర్ఎస్ను మళ్లీ అధికారంలోకి తేవడానికి... భుజంగరావు ఇంటెలిజెన్స్‌లో టాప్ సీక్రెట్ సెల్ అనే స్పెషల్ వింగ్‌ను పర్యవేక్షించారు. ఇందులో తనకు నమ్మకస్తులైన ఇన్స్పెక్టర్లు చలపతి, శ్రీధర్, ఎస్సై సెయింట్ ప్రభాకర్ రాజు, ఏఎస్సైలు నర్సింగ్ రావు, జంగయ్య కీలకంగా వ్యవహరించారు. భుజంగరావు రాజకీయ నాయకుల కార్యకలాపాలతోపాటు అసమ్మతి నేతలు, ప్రతిపక్ష పార్టీల్లోని పరిస్థితులను గమనిస్తూ వివరాలను ఉన్నతాధికారులకు ఇచ్చేవారు. ఇంటెలిజెన్స్‌లో పని చేస్తుండగానే భుజంగరావుకు ప్రభాకర్ రావుతో పరిచయం ఏర్పడింది. ఇద్దరి సామాజిక వర్గం ఒకటే కావడంతో బాగా దగ్గరయ్యారు. ప్రభాకర్‌రావు 2020 జూన్‌లో పదవీ విరమణ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన్ను ఓఎస్డీ హోదాలో చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్‌గా నియమించింది. అప్పటి ప్రభుత్వ పెద్దల ఆశీర్వాదంతో 2020 నవంబర్‌లో నిఘా విభాగాధిపతిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఆయన తన సామాజిక వర్గానికి చెందిన, తనకు నమ్మకమైన వారిని నిఘా విభాగంలోకి తీసుకురావడం ప్రారంభించారు. డీఎస్పీ ప్రణీత్‌రావు, అదనపు ఎస్పీగా రిటైర్ అయిన వేణుగోపాల్ రావు, అదనపు ఎస్పీ తిరుపతన్నల, వెంకట్రావు ఇలా ఎస్ఐబీలోకి వచి్చనవారే. ప్రత్యర్థి పార్టీల నాయకులతోపాటు బీఆర్ఎస్లోని తిరుగుబాటుదారులను పర్యవేక్షించడం, వారికి సంబం«ధించిన ఆర్థిక వనరులను దెబ్బతీయడం ద్వారా బీఆర్ఎస్ను మూడోసారి అధికారంలోకి తీసుకురావడానికి వీళ్లు పని చేశారు. దీనికోసం ఎస్ఐబీ, నిఘా విభాగాల్లో ఉన్న అన్ని వనరులనూ వినియోగించుకున్నారు. ఎవరి నిఘాకు చిక్కకుండా... హైదరాబాద్ నగరంపై పట్టు నిలుపుకోవడం కోసం బీఆర్ఎస్ నాయకులు పి.రాధాకిషన్‌రావును టాస్‌్కఫోర్స్ ఓఎస్డీగా నియమించుకున్నారు. ఇన్స్పెక్టర్ గట్టుమల్లు రాధాకిషన్ రావు ద్వారానే ఎస్ఐబీలోకి వచ్చారు. భుజంగరావు సహా అంతా బీఆర్ఎస్ కోసం పనిచేసేలా ఒప్పించిన ప్రభాకర్‌రావు అందుకు ప్రతిఫలంగా వారికి యాక్సిలేటరీ పదోన్నతులు, వివిధ పతకాలతోపాటు ఇన్సెంటివ్స్ కూడా ఇప్పించేవాడు. వీళ్లంతా ఎవరి నిఘాకు చిక్కకుండా ఉండేందుకు వీళ్లంతా వాట్సాప్ వంటి ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్‌లోనే సంప్రదింపులు జరిపారు. 2018కి ముందు అప్పటి నిఘా చీఫ్ నవీన్ చంద్ ద్వారా ప్రభాకర్‌రావు ఏర్పాటు చేయించిన స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) పని తీరు రానురాను మారిపోయింది. ప్రణీత్‌రావు చేతికి వచ్చిన తర్వాత కేవలం అక్రమ ఫోన్ ట్యాపింగ్ కోసమే పని చేసింది. బీఆర్ఎస్ రాజకీయ ప్రత్యర్థుల సమాచారాన్ని సేకరించే భుజంగరావు ఆ వివరాలను ప్రభాకర్‌రావుతోపాటు ప్రణీత్‌కు ఇచ్చి వారి ఫోన్లు ట్యాపింగ్ చేయించేవాడు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ప్రణీత్ ఇచి్చన సమాచారంతోనే ఆ పట్టణ శివార్లలో రూ.కోటి నగదు పోలీసులు స్వా«దీనం చేసుకోగలిగారు. వాట్సాప్ గ్రూప్‌ల ఏర్పాటు సాధారణంగా నిఘా విభాగం ఓ ఫోన్ నంబర్‌ను నిఘాలో ఉంచాలన్నా, ట్యాప్ చేయాలన్నా అదనపు డీజీ అనుమతి తీసుకోవాలి. అయితే ఆ అవసరం లేకుండా నేరుగా ఏ నంబర్ అయినా ట్యాప్ చేసే స్వేచ్ఛను భుజంగరావుకు ప్రభాకర్‌రావు ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కామారెడ్డిలోనూ పోటీ చేశారు. ఆయన్ను గెలిపించడం కోసం ప్రతిపక్ష పార్టీల నేతలను దెబ్బతీయడానికి ప్రభాకర్‌రావు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. బీజేపీ అభ్యర్థి కె.వెంకట రమణారెడ్డి, రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి కదలికలను ట్రాక్ చేయడానికి డీఎస్పీ తిరుపతన్న నేతృత్వంలో ప్రత్యేక బృందం పని చేసింది. దీనికోసం ప్రణీత్ ఎస్ఐబీ టీమ్‌తో ‘కేఎంఆర్’పేరుతో ప్రత్యేక వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. గత ఎన్నికల సమయంలో హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతిపక్షాలకు చెందిన నగదును పట్టుకోవడానికీ తిరుపతన్న టీమ్ పని చేసింది. దీనికోసం ‘పోల్–2023’పేరుతో మరో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. దాదాపు 15 కీలక ఆపరేషన్లలో ప్రతిపక్షాలకు చెందిన నగదు పట్టుకోవడంతోపాటు ఇతర చట్ట విరుద్ధ కార్యకలాపాలు చేశారు. విద్యార్ధి, కులసంఘాల నాయకుల పైనా... ప్రభాకర్‌రావు నేతృత్వంలోని ఎస్ఐబీ అధికారులు ప్రభుత్వాన్ని విమర్శించే విద్యార్థి సంఘాల, కులసంఘాల నాయకుల పైనా నిఘా ఉంచారు. జర్నలిస్టులు, హైకోర్టు న్యాయమూర్తులు, ప్రభుత్వం, బీఆర్ఎస్ నాయకులకు సంబంధించిన ముఖ్యమైన కేసులను వాదించే న్యాయవాదుల ఫోన్లతోపాటు వారి వ్యక్తిగత జీవితాలనూ ప్రభాకర్‌రావు మానిటర్ చేయించారు. ఈ వివరాలన్నీ తెలుసుకోవడం ద్వారా వారిని ప్రభావితం చేయడం లేదా భయపెట్టాలని భావించారు. ఈటల రాజేందర్ బీఆర్ఎస్ నుంచి బయటకు రావడంతోపాటు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్‌పై ఆందోళన చేయడం, కేటీఆర్, ఎమ్మెల్యేలకు ఎర కేసులపై వ్యాఖ్యలు చేయడం, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం తదితర సందర్భాల్లో ఆయన కదలికలు, ఫోన్‌పై నిఘా కొనసాగిందని భుంజగరావు చెప్పారు. ప్రధానంగా ప్రతిపక్షాలను ఇరుకున పెట్టాలని, ఆర్థికంగా దెబ్బతీయాలని బీఆర్ఎస్కు లాభం చేకూర్చాలనే లక్ష్యాలతోనే తాము పని చేసినట్లు అంగీకరించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఊహించని విధంగా ఓడిపోవడంతో ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు ట్యాపింగ్, అక్రమ నిఘాకు సంబంధించిన సాక్ష్యాధారాలు ధ్వంసం చేయడానికి భుజంగరావు సహా అధికారులంతా కలిసి కుట్ర చేసి అమలుపరిచారని పోలీసులు కోర్టుకు తెలిపారు. -
ఏ ఒక్కరినీ వదల్లేదు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన వాంగ్మూలం
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలం.. సంచలన విషయాలను బయటపెట్టింది. ప్రతిపక్షం, పాలక పక్షం అని చూడకుండా.. నాటి అధికార బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పని చేసిన ప్రతీ ఒక్కరినీ లక్ష్యంగా చేసుకుని నడిచింది ఈ వ్యవహారం. గులాబీ పార్టీకి అవసరమైన పనులు చేసి పెట్టిన భుజంగరావు.. ప్రణీత్‌రావు సహకారంతోనే ట్యాపింగ్ చేసినట్లు తేలింది.భుజంగరావు వాంగ్మూలంలోని విషయాలు యథాతథంగా.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఆర్థికసాయం అందించే వారి ఫోన్ ట్యాప్ బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ వ్యతిరేక స్వరం వినిపించే నేతల ఫోన్లు ట్యాప్ ట్యాపింగ్ చేసి SOT, టాస్క్ ఫోర్స్ సహకారంతో ముందుకు వెళ్లాం. ప్రతిపక్ష నేతలు విద్యార్థి నాయకులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేశాం. ప్రతిపక్ష నేతల కుటుంబసభ్యుల ఫోన్లు, వాహనాలను ట్రాక్ చేశాం. .. జీహెచ్ఎంసీ ఎన్నికలతో మూడు ఉపఎన్నికల సమయంలో ట్యాపింగ్ చేశాం. రాజకీయ సమాచారాన్ని ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్‌తో పాటు మరో ప్రైవేట్ వ్యక్తి ద్వారా తెలుసుకున్నాం. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ సపోర్టర్ల ఫోన్లను ట్యాప్ చేశాం. మాదాపూర్ SOT నారాయణ సపోర్ట్‌తో ఆపరేషన్ చేశాం. అక్టోబర్‌లో ఎన్నికల సంఘం రాధాకిషన్ రావుతో పాటు పలువురిని బదిలీ చేసింది. ఎలాగైనా సరే మూడోసారి బీఆర్ఎస్ను అధికారంలోకి తెచ్చేందుకు ప్లాన్ చేశాం. .. సివిల్ తగాదాలను సెటిల్ చేశాం. కంపెనీలు, వీఐపీలు, వ్యాపారవేత్తల పలు వివాదాలను బీఆర్ఎస్ నేతల సూచనలతో పరిష్కరించాం. రెండు ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి డబ్బులను పెద్దఎత్తున తరలించా ఎన్నికల ముందు బీఆర్ఎస్ నేతల ఆదేశాల ప్రకారం టాస్క్‌ఫోర్స్ వాహనాల్లో డబ్బులు తీసుకెళ్లాం. రియల్టర్ సంధ్యా శ్రీధర్‌రావును రూ.13కోట్ల ఎలక్ట్రోరల్ బాండ్స్ కొనేలా చేశాం. మాట వినక పోతే క్రిమినల్ కేసులతో చిత్రహింసలు పెట్టాం. .. కామారెడ్డి ఎన్నికల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. బీజేపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్రెడ్డిపై ప్రత్యేక నిఘా పెట్టాం. హైకోర్టు జడ్జితో పాటు అడ్వకేట్ల ఫోన్లను ట్యాప్ చేశాం. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో నాటి మంత్రి కేటీఆర్‌పై విమర్శలుచేసిన ప్రతిఒక్కరి ఫోన్లను ట్యాప్ చేశాం అని భుజంగరావు తన వాంగ్మూలంలో వెల్లడించారు.ఫోన్ ట్యాపింగ్ కేసులో భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ (గతంలో ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీ) ఎన్. భుజంగరావును, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్ అడిషనల్ డీసీపీ తిరుపతన్నను మార్చి చివరి వారంలో ఒకేసారి దర్యాప్తు బృందం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
బీజేపీ అగ్రనేతల ఫోన్లను ప్రణీత్ టీం ట్యాప్ చేసింది: రాధాకిషన్
-
బీఆర్ఎస్ నేతలపైనా నిఘా!
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా సాగిన ఈ నిఘా కేవలం ప్రతిపక్ష నేతలకే పరిమితం కాలేదని, అధికార బీఆర్ఎస్కు చెందిన అసమ్మతి నేతలపైనా సాగినట్లు తెలిసింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు, హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు నేతృత్వంలో అనేక అక్రమాలు సాగాయని నేరాంగీకార వాంగ్మూలాల్లో పోలీసులు పేర్కొన్నారు. మొయినాబాద్ ఫామ్‌హౌస్ ఆపరేషన్ కోసం అవసరమైన నిఘా పరికరాలను ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి కొనుగోలు చేయగా... కేరళకు చెందిన ఓ కీలక వ్యక్తిని పట్టుకోవడానికి పోలీసులు ఏకంగా చార్టర్డ్ ఫ్లైట్‌లో అక్కడకు వెళ్లినట్లు బయటపడింది. పంజగుట్ట పోలీసులు గతంలో అరెస్టు చేసిన మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు, డీఎస్పీ నాయిని భుజంగరావులకు సంబంధించిన నేరాంగీకార వాంగ్మూలాల్లో ఈ కీలకాంశాలను పొందుపరిచిన దర్యాప్తు అధికారులు.. వీటిని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో ఆపరేషన్ దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో ఆ పారీ్టకి బ్రేక్ వేయాలని నాటి సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు. 2022 అక్టోబర్ చివరి వారంలో నాటి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి ద్వారా ఓ కీలక విషయం కేసీఆర్‌కు తెలిసింది. బీఆర్ఎస్ను వీడి తమ పార్టీలో చేరేలా బీజేపీకి చెందిన కొందరు వ్యక్తులు ఎర వేస్తున్నారంటూ రోహిత్‌రెడ్డి నాటి సీఎంకు చెప్పారు. అప్పటికే మునుగోడు ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీని ఇరుకున పెట్టాలని నిర్ణయించుకున్న కేసీఆర్ ఈ విషయాన్ని ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావులకు అప్పగించడంతోపాటు వారికి సహకరించాలని రోహిత్‌రెడ్డిని ఆదేశించారు. డీఎస్పీ ప్రణీత్‌రావు ద్వారా కొందరు ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టడం ద్వారా కీలక విషయాలు రాబట్టారు. ఈ ఆడియో క్లిప్స్‌ను కేసీఆర్‌కు అందించారు. వీటి ఆధారంగా మొయినాబాద్ సమీపంలోని అజీజ్ నగర్లో ఉన్న రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో ప్రత్యేక ఆపరేషన్‌కు ప్లాన్ చేశారు. ఫలానా రోజున అక్కడికి రావాలని రోహిత్‌రెడ్డి ద్వారా నందుతోపాటు ఇద్దరు స్వామీజీలకు సందేశం పంపారు. అప్పట్లో హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్‌లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి, ఎస్సై శ్రీకాంత్‌లను రాధాకిషన్‌రావు ఢిల్లీకి పంపి ప్రత్యేక స్పై కెమెరాలు ఖరీదు చేయించారు. వీటిని శ్రీకాంత్‌తోపాటు మరో ఇద్దరు ఎస్సైలు మల్లికార్జున్, అశోక్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో బిగించారు. రోహిత్‌రెడ్డితోపాటు వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలను స్వయంగా కేసీఆర్ రంగంలోకి దింపారు. క్షేత్రస్థాయిలో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఆపై ఏర్పాటైన సిట్ ద్వారా ఆర్ఎస్ఎస్ కీలక నేత బీఎల్ సంతోష్‌ను అరెస్టు చేయించాలని తద్వారా బీజేపీని దారిలోకి తెచ్చుకుని తన కుమార్తె, ఎమ్మెల్సీ కవితపై ఉన్న ఈడీ కేసు నీరుగారేలా చేయాలని భావించారు. కొందరు సైబరాబాద్ పోలీసుల అసమర్థత కారణంగా కేరళలోని మాతా అమృతానందమయి ఆశ్రమానికి చెందిన ఒక ముఖ్యమైన వ్యక్తి తప్పించుకున్నాడు. దీంతో ఆయన్ను పట్టుకోవడానికి ఎస్పీ రెమా రాజేశ్వరి, ఇన్స్పెక్టర్ బి.గట్టుమల్లుతో కూడిన బృందాన్ని ఏకంగా చార్టర్డ్ ఫ్లైట్‌లో అక్కడకు పంపించారు. ఈ ప్రయత్నమూ సఫలీకృతం కాకపోవడంతోపాటు ఆయా నిందితులను అరెస్టు చేయొద్దని, కేసును సీబీఐకి అప్పగించాలని న్యాయస్థానం నుంచి ఆదేశాలు రావడంతో అంతా అసంతృప్తి చెందారు. తాను అనుకున్నది జరగకపోవడంపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్కు ఇబ్బందికరంగా ఉన్న పరిణామాలను గుర్తించి... ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావు మధ్య తరచూ వివిధ నియోజకవర్గాల్లోని రాజకీయ పరిస్థితులపై చర్చలు జరిగేవి. బీఆర్ఎస్తోపాటు దాని నాయకులకు ఇబ్బందికరంగా ఉన్న పరిణామాలను వీళ్లు గుర్తించే వాళ్లు. ఈ సమాచారాన్ని ప్రణీత్‌కు పంపి ఆయా వ్యక్తులపై నిఘా పెట్టమని ఆదేశించే వాళ్లు. ఇలా ఎస్ఐబీ నిఘా ఉంచిన వారిలో బీఆర్ఎస్కు చెందిన వాళ్లూ ఉండటం గమనార్హం. నాటి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేతో విభేదించిన అప్పటి ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, అప్పట్లో కడియం శ్రీహరితో విభేదాలు ఉన్న మాజీ మంత్రి టి.రాజయ్య, తాండూరు ఎమ్మెల్యేపై అసంతృప్తిగా ఉన్న పట్నం మహేందర్ రెడ్డి దంపతులతోపాటు మాజీ ఐపీఎస్ అధికారి, నాటి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తీగల కృష్ణారెడ్డి, తీన్మార్ మల్లన్న, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, రెండు మీడియా సంస్థల అధినేతలు, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర్, గద్వాలకు చెందిన సరిత తిరుపతయ్య, కోరుట్ల వాసి జువ్వాడి నర్సింగరావు, అచ్చంపేటకు చెందిన వంశీకృష్ణ, మానకొండూరుకు చెందిన కవ్వంపల్లి సత్యనారాయణ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్, బండి సంజయ్‌ల ఫోన్లు ట్యాప్ చేశారు. వీరితోపాటు వివిధ నిర్మాణ సంస్థలు, రియల్ ఎస్టేట్ కంపెనీలకు చెందిన యజమానులు, వ్యాపారవేత్తల ఫోన్ల పైనా అక్రమ నిఘా ఉంచారు. ఫోన్ కాల్స్‌కు దూరంగా ఉన్న వారిపై.. ఎస్ఐబీ నిఘా ఉంటుందన్న భయంతో అప్పట్లో అనేక మంది రాజకీయ నాయకులు, న్యాయాధికారులు, ప్రభుత్వ అధికారులు ఫోన్ కాల్స్‌కు దూరంగా ఉన్నారు. వీళ్లు ఎక్కువగా సిగ్నల్, స్నాప్‌చాట్ తదితర సోషల్ మీడియాను వినియోగిస్తూ ఎ¯న్‌క్రిపె్టడ్ విధానంలో మాట్లాడటం ప్రారంభించారు. దీన్ని గుర్తించిన ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావు.. వారు ఎవరితో మాట్లాడారో గుర్తించడానికి వారి ఐపీడీఆర్‌లు (ఇంటర్నెట్ ప్రోటోకాల్ డేటా రికార్డ్స్) సేకరించి, విశ్లేషించారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు అక్టోబర్–నవంబర్‌ల్లో ట్యాపింగ్ మరింత పెరిగింది. నాటి మంత్రి టి.హరీశ్‌రావు సిఫార్సుతో ఐన్యూస్ సంస్థ అధినేత శ్రావణ్ కుమార్ ప్రభాకర్‌రావుతో సన్నిహితంగా మెలిగారు. అనేక సందర్భాల్లో ఆయన వాట్సాప్ ద్వారా ప్రణీత్‌రావుతో టచ్‌లో ఉన్నారు. అలా కాంగ్రెస్, బీజేపీ నాయకులు, వారి మద్దతుదారుల వివరాలు సేకరించి అందించే వారు. ప్రత్యర్థి నాయకులను లక్ష్యంగా చేసుకుని వారి నగదును స్వా«దీనం చేసుకోవడానికి, టార్గెట్ చేసిన వ్యక్తులను ట్రోల్ చేయడానికి శ్రావణ్ పూర్తి సహాయ సహకారాలు అందించారు. తాను 2020లో పదవీ విరమణ చేసిన తర్వాత రెండుసార్లు టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీగా పెద్దాయన (కేసీఆర్) అవకాశం ఇచ్చారని, ఈ విశ్వాసంతో కొన్ని కేసులకు అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలు బయటపెట్టనని రాధాకిషన్‌రావు వాంగ్మూలంలో పేర్కొన్నారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనాలు
-
జవాన్లను అవమానిస్తారా..!?
సిరిసిల్ల/కరీంనగర్‌టౌన్: కరీంనగర్లో ముస్లిములంతా ఒక్కటై తనను ఓడించాలని కేసీఆర్ అన్నారని, ‘నేను హిందువుల ఓటు బ్యాంకుతో బంపర్ మెజార్టీతో గెలుస్తానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతే పార్టీ దుకాణం బంద్ చేస్తావా? మగాడివైతే, హిందువైతే నీ శరీరంలో మందు కాకుండా రక్తమే ప్రవహిస్తే నా సవాల్‌ను స్వీకరించాలని బండి సంజయ్ సవాల్ విసిరారు.దేశ రక్షణ కోసం సర్జికల్ స్ట్రయిక్స్ చేసిన జవాన్లను అవమానించిన కాంగ్రెస్‌కు ఓటెందుకు వేయాలని ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం సాయంత్రం బీజేపీ శ్రేణులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల గాం«దీచౌక్‌లో ఆయన మాట్లాడుతూ..సర్జికల్ స్ట్రయిక్స్‌ను సమర్థించే వారంతా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయాలన్నారు. గాడిద గుడ్డూ పెట్టదు..కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలూ చేయదని విమర్శించారు. కాంగ్రెస్ వాళ్లు సర్వనాశనం చేసేస్తారు మోదీ ప్రధాని కాకపోతే కాంగ్రెస్ వాళ్లు దేశాన్ని సర్వనాశనం చేస్తారని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ 12ఎంపీ సీట్లు గెలవబోతోందని సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలో సంజయ్‌కు మద్దతుగా ‘మహా బైక్ ర్యాలీ’నిర్వహించగా, ఆయన పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దేశ ద్రోహానికి పాల్పడ్డారని ఆరోపించారు.ఫోన్ ట్యాపింగ్ కేసులో దొరికిపోతారనే భయంతో కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఇంటెలిజెన్స్ వద్దనున్న దేశ భద్రత డేటాను ధ్వంసం చేశారని, అలాంటి కేసీఆర్‌ను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో బీజేపీ అధికార ప్రతినిధి రాణీరుద్రమారెడ్డి, మట్ట వెంకటేశ్వర్‌రెడ్డి, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తదితరులు పాల్గొన్నారు. -
ఫోన్ ట్యాంపరింగ్ పై కేసీఆర్ కీ కామెంట్స్
-
ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పనిచేశా
సాక్షి, హైదరాబాద్: అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం అమెరికాలో తలదాచుకున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు తొలిసారి అధికారికంగా స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు ఆరోపిస్తున్నట్లుగా తనకు ఎలాంటి ప్రత్యేక మైన అధికారాలు లేవని, అప్పటి డీజీపీ, నిఘా విభాగం అధిపతి పర్యవేక్షణలోనే తాను పని చేశానని చెప్పారు. పోలీసుల పిటిషన్ నేపథ్యంలో తనపై అరెస్టు వారెంట్ ఇవ్వొద్దని న్యాయస్థానాన్ని కోరారు. ఈ కేసు నమోదైన వెంటనే అమెరికా వెళ్లిన ప్రభాక ర్రావు వైద్యం పేరుతో అక్కడే ఉన్నారు. కొంతమంది పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్లు చేసి మాట్లాడటం మినహా ఇప్పటివరకు దేనిపైనా స్పందించలేదు. అయితే పంజగుట్ట పోలీసులు ఆయనపై రెడ్ కార్నర్ నోటీసుల జారీ ప్రక్రియ ప్రారంభించడంతో పాటు కేసులో ప్రధాన నిందితుడిగా చేర్చి అరెస్టు వారెంట్ కోసం పిటిషన్ వేయడంతో మౌనం వీడారు. ఆయనతో పాటు ఓ మీడియా సంస్థ అధినేత శ్రావణ్‌కుమార్‌పై అరెస్టు వారెంట్లు కోరుతూ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో అలా వారెంట్లు జారీ చేయవద్దని కోరుతూ ప్రభాకర్‌రావుతో పాటు శ్రావణ్‌కుమార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన న్యాయవాది వి.సురేందర్‌రావు ద్వారా వేసిన పిటిషన్లో ప్రభాకర్‌రావు పలు అంశాలు ప్రస్తావించారు.అనుభవం దృష్ట్యానే..దర్యాప్తు అధికారులు ఆరోపిస్తున్నట్లు తాను ఎస్ఐబీ చీఫ్ కావడానికి సామాజిక వర్గం కారణం కాదని, తన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునే నాటి డీజీపీ ఎంపిక చేశారని ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. నల్లగొండ ఎస్పీగా పని చేస్తున్న తనను రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ముఖ్యమంత్రి హఠాత్తుగా బదిలీ చేసిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. తనకు డీఐజీ నుంచీ ఐజీగా రావాల్సిన పదోన్నతి కూడా చాలా ఆలస్యమైందని తెలిపారు. తాను అమెరికా వెళ్లడానికి కారణం కేసుల భయం కాదని, వైద్యం కోసమే అని వివరించారు. అది పూర్తయిన తర్వాత స్వదేశానికి వస్తానని కోర్టుకు తెలిపారు. సోదరి అనారోగ్య కారణాల నేపథ్యంలో తాను అమెరికా వెళ్లినట్లు శ్రావణ్‌కుమార్ కూడా తన న్యాయవాది (సురేందర్‌రావు) ద్వారా కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయాస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. -
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఎస్ఐటీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావునే ప్రధాన నిందితుడిగా చేర్చుతూ కోర్టులో పోలీసులు మెమో దాఖలు చేశారు.కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుతో పాటుగా మరో ప్రైవేటు వ్యక్తిని కూడా పోలీసులు నిందితుడిగా చేర్చారు. ఇక, ప్రభాకర్ రావుతో పాటుగా సదరు ప్రైవేటు వ్యక్తి కూడా పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమంతా ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే జరిగిందని పోలీసులు తేల్చారు.మరోవైపు.. ఎస్ఐబీలో హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేయడంలో కూడా ప్రభాకర్ రావే ప్రధాని సూత్రధారి అని పోలీసులు వెల్లడించారు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ప్రణీత్ రావు హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. అలాగే, ప్రభాకర్ రావు చెప్పిన నంబర్లను ప్రణీత్ రావు ట్యాపింగ్ చేసినట్టు చెప్పారు. ఇక, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్లిపోయారని అన్నారు. ఇదిలా ఉండగా.. ఈ కేసులో ఇప్పటికే ప్రభాకర్ రావుకు పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. -
అలా విమర్శించిన.. కాంగ్రెస్, బీజేపీపై చర్యలు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావును టార్గెట్ చేస్తూ కాంగ్రెస్, బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై చట్టప్రకారం తగిన నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల కమిషన్ హైకోర్టుకు తెలియజేసింది. దీంతో బీఆర్ఎస్ పిటిషన్లో విచారణను న్యాయస్థానం ముగించింది. ఎలాంటి ఆధారాలు లేకున్నా ఫోన్ ట్యాపింగ్ కేసును తమ పార్టీకి, నాయకులకు అంటగట్టాలని కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు చూస్తూ.. రెచ్చగొట్టేలా, పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.దీనిపై ఈసీకి ఫిర్యాదు చేసి అలాంటి వ్యాఖ్యలను అడ్డుకోవాలని కోరినా చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మార్చి 29న సీఎం రేవంత్‌రెడ్డి, ఏప్రిల్ 1న మంత్రి కొండా సురేఖ, ఏప్రిల్ 6న తుక్కుగూడ సభలో రాహుల్ గాం««ధీ, మరో సందర్భంలో బీజేపీ నాయకుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్‌కు కేటీఆర్‌కు సంబంధం ఉందని నిరాధార విమర్శలు చేశారన్నారు. ఈసీకి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోలేదన్నారు. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదును 3వ తేదీ(శుక్రవారం) పరిష్కరించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. దీంతో ఈ పిటిషన్లో విచారణను ముగిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. -
‘ఫోన్ ట్యాపింగ్‌లో రేవంత్, హరీష్ రావు కూడా బాధితులే’
సాక్షి, కరీంనగర్: సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని సంచలన కామెంట్స్ చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్‌లో తాను, సీఎం రేవంత్, హరీష్ రావు కూడా బాధితులేనని ఆసక్తికర కామెంట్స్ చేశారు.కాగా, బండి సంజయ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘ఫోన్ ట్యాపింగ్ కేసును కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి చర్చలో లేకుండా డైవర్ట్ చేశాయి. సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసును నీరు కార్చడానికి కరీంనగర్‌కు చెందిన మంత్రి ప్రయత్నం చేస్తున్నారు. అధికారులకు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. రాధాకిషన్ రావు చెప్పిన అంశాలను పోలీసులు రికార్డు చేశారు. కేసీఆర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు రాధాకిషన్ ఇచ్చిన స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్‌లో నేను కూడా బాధితుడినే, నాతో పాటు రేవంత్, హరీష్ రావు కూడా బాధితులే.కరీంనగర్లో ప్రతిమ హోటల్లో 341 గదిలో ఉండి రాధా కిషన్ రావు ఫోన్ ట్యాపింగ్ చేశారు. ప్రభాకర్ రావు వియ్యంకుడు అశోక్ రావు ఇంట్లో ఫోన్ ట్యాపింగ్ తతంగం అంతా జరిగింది. ఇప్పుడు కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రావు వ్యవహారాలన్నీ అశోక్ రావు చూస్తున్నారు. రాజేందర్ రావుకు కాంగ్రెస్ టికెట్ రావడానికి ప్రధాన కారణం మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు. కరీంనగర్ మంత్రి ద్వారా మధ్యవర్తిత్వం వర్తించారు. కోట్ల రూపాయల నిధులు చేతులు మారాయి. జాతీయ స్థాయి కాంగ్రెస్ నేతలకు కూడా పైసలు ఇచ్చారు. ప్రభాకర్ రావు వియ్యంకుడు అశోక్ రావును ఇతర మంత్రుల దగ్గరకు తీసుకొని వెళ్ళారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. కేసీఆర్ కొడుక్కు తెలియకుండానే సిరిసిల్లను ఫోన్ ట్యాపింగ్ కేంద్రంగా పెట్టుకున్నారా?. బీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తోంది. అమెరికాలో అశోక్ రావు కూతురు ఇంట్లో ప్రభాకర్ రావు ఉంటున్నారు. ఇక్కడ అశోక్ రావు ఇంట్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉంటున్నారు. నయీం కేసు మాదిరిగా ఫోన్ ట్యాపింగ్ కేసును నీరు కారుస్తున్నారు.ప్రభాకర్ రావు ఇచ్చిన డబ్బులు కరీంనగర్ మంత్రి ద్వారా ఢిల్లీ వరకు ముట్టాయి. ఫోన్ ట్యాపింగ్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణ జరపాలి. చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణను రాష్ట్ర ప్రభుత్వం కోరాలి. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో జరిగిన తతంగం రేవంత్ రెడ్డికి తెలియకవచ్చు. ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్లు అనుమానం వస్తుంది. కరీంనగర్‌తో పాటు ఇతర లోక్‌సభ నియోజవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ డబ్బులు పంపినట్లు అనుమానం వస్తుంది’ అని కామెంట్స్ చేశారు. -
బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్.. కాంగ్రెస్ వీడియో మార్ఫింగ్‌తో ప్రజాస్వామ్యం ఖూనీ
వేములవాడ/సిరిసిల్లటౌన్: ఫోన్ ట్యాపింగ్స్లో బీఆర్ఎస్.. వీడియోల మార్ఫింగ్స్లో కాంగ్రెస్ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని, ఈ రెండు పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ అన్నారు. మంగళవారం వేములవాడలో నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం స్థానికంగా ఓ హోటల్లో జరిగింది. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ ఈనెల 8న వేములవాడకు ప్రధాని నరేంద్రమోదీ వస్తున్నారని, ఆయన పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఉదయమే ప్రధాని సభ ఉంటుందని, ఎన్నికల కోడ్ వల్ల ఎలాంటి ఆటంకాలు ఉండకుంటే రాజన్నను తప్పకుండా దర్శించుకుంటారని చెప్పారు. పదేళ్ల కాలంలో రాష్ట్రంలో నీచ రాజకీయాలు జరిగాయని, సభ్యసమాజం తలదించుకునేలా బీఆర్ఎస్ నాయకులు ఫోన్ ట్యాపింగ్ చేశారన్నారు. ఇక కాంగ్రెస్ నేతలు ఫేక్ వీడియోలు తయారు చేస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్లను బీజేపీ పక్కాగా అమలు చేస్తుందని స్పష్టం చేశారు. అనంతరం ఎంపీ సంజయ్‌తోపాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ తదితరులు బైపాస్‌రోడ్డులోని పలు ఖాళీ స్థలాలను పరిశీలించారు. రెండు రోజుల్లో సభ స్థలాన్ని ఫైనల్ చేస్తామని వారు చెప్పారు. రేవంతన్నా.. నా గుండుతో నీకేమన్నా.. ‘రేవంతన్నా.. నా గుండుతో నీకేం పనన్నా.. నేను ఆరు గ్యారంటీల గురించి అడిగితే గుండు.. అరగుండు’అంటూ అవహేళనగా మాట్లాడుతున్నావని ఎంపీ బండి సంజయ్ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై మంగళవారం రాత్రి సిరిసిల్లకు వచ్చిన బండి గట్టి కౌంటర్ ఇస్తూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి భాషను చూసి జనాలు అసహ్యించుకుంటున్నారన్నారు. మీరు ఎన్ని అవాకులుచవాకులు మాట్లాడినా కరీంనగర్లో తాను భారీ మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు. సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ, గంగాడి మనోహర్‌రెడ్డి, గండ్ర నళిని, జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
రాజస్థాన్ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.. గెహ్లాట్‌కు ఎదురుదెబ్బ!
జైపూర్: లోక్‌సభ ఎన్నికల వేళ రాజస్థాన్ రాజకీయం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో మాజీ సీఎం అశోక్ గెహ్లాట్‌పై అతని మాజీ ఓఎస్డీ లోకేష్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో, పొలిటికల్ వాతావరణం హీటెక్కింది. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్, రీట్ (రాజస్థాన్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) పరీక్ష పేపర్ లీక్ వ్యవహారాల్లో గెహ్లాట్‌పై మాజీ లోకేశ్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క రోజు తనకు సీఎం పీఎస్ఓ రాం నివాస్ నుంచి ఫోన్ వచ్చిందన్నారు. సీఎం గెహ్లాట్ నివాసానికి రావాలని చెప్పారు. దీంతో, అక్కడికి వెళ్లాను. ఈ సందర్భంగా కొన్ని ఆడియో క్లిప్‌లతో కూడిన పెన్ డ్రైవ్‌ను గెహ్లాట్ తనకు అందజేశారని, ఆ తర్వాత అవి మీడియాకు లీక్ అయ్యాయని అన్నారు. అవి ఫోన్ సంభాషణలు అని తనకు చెప్పారని, అయితే అవి చట్టబద్ధమైనవో కాదో తనకు తెలియదని పేర్కొన్నారు. తనను ఒక హోటల్‌కు పిలిపించి వీటి గురించి మాట్లాడినట్టు చెప్పుకొచ్చారు. రీట్ పేపర్ లీక్ వ్యవహారంలో తన సన్నిహితులకు అశోక్ గెహ్లాట్ రక్షణ కల్పించారని శర్మ ఆరోపించారు. అనంతరం, ఆడియో సంభాషణను లోకేష్ శర్మ లీక్ చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తోంది. ఇదివరకే లోకేశ్ శర్మను విచారణకు పిలిచి ప్రశ్నించారు. లోకేశ్ శర్మ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. అయితే, ఈ విషయంపై గెహ్లాట్‌పై లోకేశ్ శర్మ పరువు నష్టం దావా వేశారు. ఇక, ఈ ఆరోపణలపై అశోక్ గెహ్లాట్ ఇప్పటివరకు స్పందించలేదు. Gehlot, in order to save his Govt, tapped Sachin Pilot and other’s phone, and made it appear as if Gajendra Singh Sekhawat and the BJP tried to topple his Govt.- Lokesh Sharma, Ashok Gehlot’s former OSD pic.twitter.com/PuxYilQkZn— Rishi Bagree (@rishibagree) April 25, 2024 అయితే, 2020 జూలైలో కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ మొత్తం 19 మంది ఎమ్మెల్యేలతో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. ఆ సమయంలో ఎమ్మెల్యేలుగా ఉన్న విశ్వేంద్ర సింగ్, భన్వర్ లాల్ శర్మ వంటి తిరుగుబాటు ఎమ్మెల్యేల ఫోన్ సంభాషణ లీక్ అయ్యింది. తిరుగుబాటు ఎమ్మెల్యే భన్వర్ లాల్, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మధ్య జరిగిన సంభాషణ ఆడియో క్లిప్ కూడా వీటిలో ఉంది. ఈ క్రమంలో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నించిందంటూ రాజకీయంగా పెను దుమారం రేగింది. ఇదిలా ఉండగా.. లోకేష్ శర్మ ఆరోపణలను కాంగ్రెస్ నేతలు ఖండిస్తున్నారు. తాజాగా శర్మ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి స్వర్ణిమ్ చతుర్వేదీ స్పందిస్తూ.. లోకేష్ శర్మ ప్రభుత్వ అధికారి కాదు. పైగా అతను బీజేపీ నాయకులతో టచ్‌లో ఉన్నాడు. వారి సూచనలు మేరకు మాత్రమే అతను ఇలాంటి కామెంట్స్ చేశాడని చెప్పుకొచ్చారు. అయితే, రాజస్థాన్‌లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో శర్మ వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు నష్టం కలిగిస్తాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. -
కిడ్నాప్ కేసులో 'మైత్రీ మూవీ మేకర్స్' అధినేత నవీన్ యర్నేని
క్రియా హెల్త్‌కేర్ వివాదంలో బలవంతపు షేర్లు, యాజమాన్య బదిలీ వ్యవహారంలో టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సినీ నిర్మాత, మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ యర్నేని పేరు ఉన్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన నిందితుల జాబితాలో ఆయన కూడా ఉన్నారని జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం పెద్ద సంచలనంగా మారింది. అక్రమ ఫోన్ ట్యాపింగ్, వ్యాపారుల పట్ల బెదిరింపు వసూళ్లు ఆరోపణలపై హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) పి.రాధాకిషన్‌రావుతో పాటు ఇన్స్పెక్టర్ గట్టుమల్లు, ఎస్సై మల్లికార్జున్‌పై జూబ్లీహిల్స్ ఠాణాలో కిడ్నాప్ కేసు నమోదైన విషయం తెలిసిందే. సంచలనంగా మారిన ఈ ఫోన్ ట్యాపింగ్ వివాదం విషయాన్ని తెలుసుకున్న క్రియా హెల్త్‌కేర్ డైరెక్టర్ చెన్నుపాటి వేణుమాధవ్ జూబ్లీహిల్స్ పోలీసులను కొద్దిరోజుల క్రితం సంప్రదించారు. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్‌లో చిక్కుకున్న వారిలో కొందరు గతంలో తనను కిడ్నాప్ చేసి తన కంపెనీ షేర్లను బలవంతంగా బదలాయించుకున్నారని ఫిర్యాదు చేశారు. ప్రాణభయంతో ఇన్నాళ్లు మిన్నకుండిపోయిన వేణుమాధవ్‌కు ఇటీవల రాధాకిషన్‌రావు అరెస్టు విషయం తెలిసి ధైర్యంగా ముందుకు వచ్చి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా అధికారులు రాధాకిషన్‌రావు, చంద్రశేఖర్ వేగే, గట్టుమల్లు, మల్లికార్జున్, కృష్ణ, గోపాల్, రాజ్, రవి, బాలాజీ తదితరులపై ఐపీసీలోని 386, 365, 341, 120 (బీ), రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్‌కు చెందిన వేణుమాధవ్ చెన్నుపాటి ప్రపంచ బ్యాంక్‌లో కొన్నాళ్లు పని చేసిన తర్వాత 2008లో తిరిగి వచ్చి 2011లో క్రియా హెల్త్‌కేర్ సంస్థను స్థాపించారు. ఈ కేసు వ్యవహారంలో పోలీసులతోపాటు తన సంస్థకు చెందిన నలుగురు పార్ట్‌టైమ్ డైరెక్టర్లకు సైతం లబ్ధి చేకూరినట్లు తాజాగా ఫిర్యాదులో వేణుమాధవ్ పేర్కొన్నారు. దీంతో ఆ కంపెనీ డైరెక్టర్లుగా ఉన్న నిర్మాత నవీన్ యర్నేని, గోపాలకృష్ణ సూరెడ్డి,రాజ్ తలసిల, రవికుమార్ మందలపు, వీరమాచినేని పూర్ణచందర్రావులను నిందితుల జాబితాలో తాజాగా చేర్చారు. దీంతో వారందరికీ నోటీసులు ఇచ్చి విచారించేందుకు పోలీసులు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనాలు బయటకు..
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) పి.రాధాకిషన్‌రావు అండ్ టీమ్ అక్రమాలు బయటపడుతున్నాయి. రాధాకిషన్‌రావు రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్కు మద్దతుగా ఇతర పార్టీల నేతలకు సంబంధించిన డబ్బును పట్టుకోవడానికి ఫోన్ ట్యాపింగ్‌ను రాధాకిషన్‌రావు ఆయుధంగా ఉపయోగించుకున్నట్లు ఇప్పటికే పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. అయితే బీఆర్ఎస్కు అనుకూలంగా డబ్బు తరలించే వ్యవహారంలోనూ రాధాకిషన్‌రావు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసుల తాజా దర్యాప్తులో బయటపడింది.ఈ ప్రక్రియలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ ఐఏఎస్ వెంకట్రామిరెడ్డికి చెందిన డబ్బును ఎక్కువగా తరలించినట్లు తేలింది. రాధాకిషన్‌రావు డబ్బు తరలించేందుకు అప్పట్లో సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ టీంలో పనిచేస్తున్న ఓ ఎస్సైని ఎంచుకున్నారు. ఆయనకు ప్రత్యేకంగా ప్రభుత్వ బొలేరో వాహనాన్ని సమకూర్చి అందులోనే పెద్దఎత్తున నగదును తరలించారు. భారాస ఎమ్మెల్సీ, విశ్రాంత ఐఏఎస్ వెంకట్రామిరెడ్డ్డికి చెందిన డబ్బు తరలింపు వాహనాలకు రాధాకిషన్‌రావు ఆదేశాలతో ఎస్సై పలుమార్లు ఎస్కార్ట్‌గా వ్యవహరించారు. తెల్లాపూర్‌లోని రాజ్‌పుష్ప గ్రీన్డేల్ విల్లాస్‌లో వెంకట్రామిరెడ్డి ఇంటి సమీపంలో ఉండే శివచరణ్‌రెడ్డి అలియాస్ చరణ్‌ను కలవాలని రాధాకిషన్‌రావు ఎస్సైకి సూచించారు. అనంతరం శివచరణ్‌రెడ్డి కొత్త ఐఫోన్‌ను, సిమ్‌కార్డును తీసుకొచ్చి ఎస్సైకి అప్పగించారు రాధాకిషన్‌రావు. నగదు తరలింపు వ్యవహారాల గురించి రాధాకిషన్‌రావు ఆ ఫోన్‌కే కాల్ చేస్తూ ఎస్సైకి ఆదేశాలిచ్చేవారు. డబ్బులకు ఎస్కార్ట్ ఇచ్చి మరీ డెలివరీ చేశారు. సికింద్రాబాద్‌లో ఉండే మాజీ ఎస్పీకి సైతం డబ్బుల రవాణాలో పాత్ర ఉంది. ఆ ఎస్సై పలు సార్లు రూ. 3 కోట్ల డబ్బులు తరలించారు. డబ్బులు తరలించిన ఎస్ఐ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. ప్రభాకర్ రావు ఆదేశాలతో రాజకీయ నాయకులపై నిఘా కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. రాజకీయ నాయకులపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రభాకర్‌కి రాధాకిషన్‌రావు చేరవేశారు. ప్రణీత్ రావు ఇచ్చే సమాచారంతో రాధా కిషన్ నిఘాను పెట్టారు. రాధాకిషన్ సహకరించిన ఎస్సైలు, ఇన్స్పెక్టర్లను తోపాటు మాజీ పోలీసు అధికారులను పోలీసులు విచారించనున్నారు. పలువురు రాజకీయ నేతల విచారణకు రంగం సిద్దం చేశారు. -
ఫోన్ ట్యాపింగ్ అంటూ లోకేష్ కొత్త డ్రామాకు తెరలేపాడా ?
-
ఐఫోన్ అప్డేట్ కూడా తెలియదా..పరువు పోగొట్టుకున్న లోకేష్
-
ఓటమి భయంతోనే ట్యాపింగ్ డ్రామా
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం తథ్యమని స్పష్టం కావడంతో చంద్రబాబు కోటరీ బెంబేలెత్తుతోంది. ప్రజల దృష్టిని మళ్లించేందుకు కొత్త పన్నాగాలు పన్నుతోంది. టీడీపీ అధికారంలో ఉండగా ఫోన్ ట్యాపింగ్ కుట్రలకు పాల్పడిన చరిత్ర ఉన్న చంద్రబాబు తిరిగి అవే ఆరోపణలతో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దు్రష్పచారం చేసేందుకు యత్నిస్తున్నారు. చంద్రబాబు కుమారుడు లోకేశ్ ఐ ఫోన్‌ను ట్యాపింగ్ చేస్తున్నారంటూ టీడీపీ ఎన్నికల కమిషన్ (ఈసీ)కి ఫిర్యాదు చేయడం ఆ కుట్రలో భాగమేనన్నది సుస్పష్టం. వాస్తవం ఏమిటంటే అసలు ఫోన్లు ట్యాపింగ్ చేసే టెక్నాలజీ ప్రస్తుత ఏపీ ప్రభుత్వం వద్ద లేనే లేదు. ఈ విషయాన్ని కేంద్రం కూడా ఇటీవల స్పష్టంగా చెప్పింది. అసలు వాస్తవానికి వస్తే డాటా చోరీ, ఫోన్ల ట్యాపింగ్‌లో చంద్రబాబే సిద్ధహస్తుడు. ఇందుకోసం ఆయన సీఎంగా ఉండగా ఇజ్రాయెల్ నుంచి స్పైవేర్ 2019ను కొనుగోలు చేశారన్నది బహిరంగ రహస్యం. ఆ విషయాన్ని పశ్చిమ బెంగాల్ సీఎం మమత ఆ రాష్ట్ర అసెంబ్లీలోనే వెల్లడించారు కూడా. భద్రతా చట్టాలను ఉల్లంఘించి పెగసస్ సాఫ్ట్వేర్ కొన్న చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఫోన్ ట్యాపింగ్ జాడ్యానికి ఆద్యుడు చంద్రబాబే. 2004 ఎన్నికల్లో అప్పటి సీఎంగా ఉన్న ఆయన ప్రతిపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్ కోసం ఏకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన తరువాత 2014లో ఆంధ్రప్రదేశ్‌కు సీఎం అయిన చంద్రబాబు మరోసారి ఫోన్ ట్యాపింగ్ అక్రమాలకు పాల్పడ్డారు. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు నేతృత్వంలో ప్రత్యేకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ నేతల ఫోన్ల ట్యాపింగ్‌తోపాటు ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడటం ఆ వ్యవస్థ లక్ష్యం. ఐటీ గ్రిడ్స్ అనే ప్రైవేటు కంపెనీ, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కుమారుడు భాగస్వామిగా ఉన్న ఆకాశ్ ఎంటర్ప్రైజెస్ కంపెనీల ద్వారా ఏరోస్టాట్ బెలూన్లు, ఇతర ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ కొనుగోలుకు ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్‌తో సంప్రదింపులు జరిపారు. అందుకోసం ఏబీవీ బృందం ఇజ్రాయెల్‌లో పర్యటించింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం విదేశీ కంపెనీల నుంచి ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ కొనాలంటే కేంద్ర రక్షణ శాఖ అనుమతి తప్పనిసరి. జాతీయ భద్రత చట్టాన్ని సైతం చంద్రబాబు ప్రభుత్వం ఉల్లంఘించింది. రక్షణ శాఖకు సమాచారం ఇవ్వకుండానే ఐటీ గ్రిడ్స్ కంపెనీ ద్వారా ఫోన్ ట్యాపింగ్ పరికరాలు కొనుగోలు చేసి, వాటిని టీడీపీ కార్యాలయాల్లో పెట్టుకుంది. 35 లక్షల మంది డేటా చౌర్యం అక్రమంగా కొన్న ఫోన్ ట్యాపింగ్, డేటా చౌర్యం సాఫ్ట్‌వేర్‌తో చంద్రబాబు ప్రభుత్వం బరితెగించింది. అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌తో పాటు వైఎస్సార్సీపీకి చెందిన 65 మంది నేతల ఫోన్ల ట్యాపింగ్‌కు పాల్పడింది. దీనిపై పూర్తి ఆధారాలతో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2019 ఎన్నికలకు ముందు వివిధ కేసుల దర్యాప్తు ముసుగులో ఏకంగా వైఎస్సార్సీపీకి చెందిన 150 మంది ఫోన్లను ట్యాప్ చేయడం చంద్రబాబు దుర్మార్గ రాజకీయాలకు నిదర్శనం. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన ప్రజా సాధికార సర్వే ద్వారా సేకరించిన ఓటర్ల సమాచారం మొత్తాన్ని టీడీపీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం రూపొందించిన సేవా మిత్ర యాప్‌నకు అనుసంధానించారు. ఇలా రాష్ట్రంలోని ఓటర్ల వ్యక్తిగత సమాచారం చౌర్యానికి పాల్పడ్డారు. మరోవైపు టీడీపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్న 35 లక్షల మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు కుట్ర పన్నారు. ఈ కుట్రకు వ్యతిరేకంగా అప్పట్లోనే వైఎస్సార్సీపీ ఆందోళనలు చేసింది. పోలీసులు, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పూర్తి ఆధారాలతో ఫిర్యాదులు చేసింది. నిగ్గు తేల్చిన శాసన సభ ఉప సంఘం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ ప్రభుత్వం చేసిన డేటా చౌర్యంపై విచారణకు శాసన సభ ఉప సంఘాన్ని నియమించింది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి నేతృత్వంలోని ఈ కమిటీ హోం, ఆర్థిక, సమాచార–పౌర సంబంధాల శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులను విచారించింది. అప్పటి సీఎం చంద్రబాబు ఆదేశాలతోనే తాము ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని టీడీపీ సేవా మిత్ర యాప్‌నకు బదీలీ చేశామని ఆ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇజ్రాయెల్ నుంచి ఫోన్ ట్యాపింగ్, డేటా చౌర్యం సాఫ్ట్‌వేర్‌ను అక్రమంగా కొన్న మాట వాస్తవమేనని, అందుకే ఆ దేశంలో పర్యటించామని తెలిపారు. ఈ వ్యవహారంపై శాసన సభా ఉప సంఘం మధ్యంతర నివేదికను కూడా శాసన సభకు సమరి్పంచింది. ఐ ఫోన్‌ను ట్యాప్ చేసే టెక్నాలజీ ఏపీ వద్ద లేదు ఫోన్ల ట్యాపింగ్ అంశంపై కేంద్ర హోమ్ శాఖ ఇటీవల కీలక ప్రకటన చేసింది. ఐ ఫోన్లను ట్యాప్ చేసే టెక్నాలజీ ఏపీ ప్రభుత్వం వద్ద లేదని తెలిపింది. ఆ టెక్నాలజీ కేంద్ర హోం, రక్షణ శాఖల వద్దే ఉంది. ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించడం, దేశ భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం అత్యున్నతస్థాయిలో ఆ పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. మరి లోకేశ్ ఐ ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారని యాపిల్ కంపెనీ అలెర్ట్ మెస్సేజ్ పంపిందని టీడీపీ అంటోంది. అంటే లోకేశ్ ఫోన్‌ను ట్యాప్ చేసే అవకాశం కేంద్ర ప్రభుత్వానికే ఉందని పరిశీలకులు చెబుతున్నారు. మరి కేంద్ర ప్రభుత్వాన్నిగానీ, బీజేపీనిగానీ ప్రశ్నించే ధైర్యం టీడీపీకి ఉందా? బీజేపీ నేతలతో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్న చంద్రబాబు ఆ సమయంలోనే వారిని లోకేశ్ ఫోన్ ట్యాపింగ్‌పై నిలదీయవచ్చు. చంద్రబాబు అంత ధైర్యం చేయగలరా? కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈసీకి ఫిర్యాదు చేస్తారా? లేకపోతే తాము వైఎస్సార్సీపీపై చేస్తున్న ఆరోపణలను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్తారా? చంద్రబాబు పెగసస్ సాఫ్ట్వేర్ కొన్నారు: మమతా బెనర్జీ ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం రూ.25 కోట్లు వెచ్చించి పెగసస్ నుంచి అక్రమంగా ఫోన్ ట్యాపింగ్, డేటా చౌర్యం సాఫ్ట్వేర్ కొన్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా ప్రకటించడం జాతీయ స్థాయిలో పెను సంచలనం సృష్టించింది. 2022లో పశ్చిమ బెంగాల్ శాసన సభలో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ డేటా చౌర్యం సాఫ్ట్వేర్ కొనాలని పెగసస్ కంపెనీ ప్రతినిధులు తనను సంప్రదించినా, తిరస్కరించినట్టు వెల్లడించారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఆ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసిందని, మీరు కూడా కొనాలంటూ ఆ సంస్థ ప్రతిపాదించిందని తెలిపారు. చట్ట విరుద్ధమైన ఆ పనిని తాను చేయలేనని తిరస్కరించానని ఆమె చెప్పారు. ఇవన్నీ చంద్రబాబు కుతంత్రాలను బయటపెట్టే వాస్తవాలు. -
TG: ఎవరా పెద్ద సారు?
సాక్షి, హైదరాబాద్: పోలీసు విభాగంలో డీజీపీ కార్యాలయాన్ని మించిన ఉన్నత విభాగం (టాప్ ఆఫీస్) మరొకటి లేదు. ఆ కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాలు ఎవరైనా పాటించాల్సిందే. కానీ గతంలో ఓ ఉన్నతాధికారి (హయ్యర్ అప్) ఇందుకు విరుద్ధంగా వ్యవహరించారా? అంటే.. క్రియ హెల్త్ కేర్ డైరెక్టర్ వేణుమాధవ్ చెన్నుపాటి కిడ్నాప్ కేసును పరిశీలిస్తే అవుననే సమాధానమే లభిస్తోంది. అదే సమయంలో ఎవరా ఉన్నతాధికారి? అనే సందేహం కలుగుతోంది. కృష్ణారావు ద్వారా హయ్యర్ అప్ వద్దకు.. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్లో రిజిస్టర్ అయిన ఈ కేసులో హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) పి.రాధాకిషన్‌రావు, ఇన్స్పెక్టర్లు బి.గట్టుమల్లు, ఎస్.మల్లికార్జున్ తదితరులు నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కిడ్నాప్ కేసులో ఐదో నిందితుడిగా ఉన్న కృష్ణారావు అలియాస్ కృష్ణ పాత్ర కీలకమని తెలుస్తోంది. ఈయన గతంలో ఓ మీడియా చానల్లో కీలక స్థానంలో పని చేశారు. అప్పట్లోనే పలువురు పోలీసు ఉన్నతాధికారులతో పరిచయాలు ఏర్పడ్డాయి. అలాంటి వారిలో ఈ ‘హయ్యర్ అప్’కూడా ఒకరని సమాచారం. వేణు మాధవ్‌ను కిడ్నాప్ చేసి, తీవ్ర స్థాయిలో బెదిరించి, పత్రాలపై సంతకాలు చేయించుకుని క్రియా హెల్త్ కేర్ సంస్థను చేజిక్కించుకోవాలని దాని పార్ట్‌టైమ్ డైరెక్టర్లు గోపాల్, రాజ్ తలసిల, నవీన్, రవి... గోల్డ్ ఫిష్ అబోడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ వేగేతో కలిసి కుట్ర పన్నారు. కృష్ణారావు అనేక మంది పోలీసు ఉన్నతాధికారులకు సన్నిహితుడని తెలిసిన చంద్రశేఖర్ ఆయన్ను సంప్రదించాడని, కృష్ణారావు ద్వారానే హయ్యర్ అప్ వరకు ఈ వ్యవహారం వెళ్లిందని సమాచారం. కాగా విషయం సెటిల్ చేయడానికి రూ.10 కోట్లకు డీల్ మాట్లాడుకున్న ఆ పెద్ద సారు.. పని పూర్తి చేసే బాధ్యతల్ని రాధాకిషన్‌రావు, గట్టు మల్లులకు అప్పగించినట్లు, దీంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. డీజీపీ కార్యాలయం గట్టు మల్లుకు ఫోన్ సిట్ సమాచారం మేరకు.. 2018 నవంబర్ 22న ఉదయం 5.30 గంటలకు అప్పట్లో టాస్క్‌ఫోర్స్ ఎస్సైగా పని చేస్తున్న మల్లికార్జున్.. వేణుమాధవ్‌ను తన బృందంతో కిడ్నాప్ చేసి సికింద్రాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తరలించాడు. అక్కడ రాధాకిషన్‌రావు ప్రోద్భలంతో అప్పటి వెస్ట్‌జోన్ టాస్‌్కఫోర్స్ ఇన్స్పెక్టర్ గట్టు మల్లు తీవ్రస్థాయిలో వేణును బెదిరించాడు. అతి కష్టంమ్మీద తన ఫోన్ దక్కించుకున్న వేణుమాధవ్ టాస్క్‌ఫోర్స్ కార్యాలయం నుంచే తొలుత తన న్యాయవాది శ్రీనివాస్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు. ఆయన కోర్టులో తేల్చుకుందాం అన్నారు. తర్వాత తన స్నేహితుడైన లహరి రిసార్ట్స్ యజమాని సంజయ్‌ను వేణు సంప్రదించారు. దీంతో డీజీపీ కార్యాలయానికి వెళ్లిన సంజయ్ అక్కడ నుంచి గట్టు మల్లుకు ఫోన్ చేయించారు. ఆ కాల్ అందుకున్న రాధాకిషన్ రావు మాటాడుతూ.. ఇది ఉన్నతాధికారే అప్పగించిన విషయని చెప్పడంతో డీజీపీ కార్యాలయం చేతులెత్తేసింది. దీంతో రాధాకిషన్‌రావు, గట్టు మల్లు, మల్లికార్జున్ తదితరులు వేణుమాధవ్‌తో పత్రాలపై సంతకాలు చేయించి క్రియా హెల్త్‌కేర్‌లో షేర్లు, ఆయన యాజమాన్యం మార్పు చేశారు. ఆ నలుగురి వాంగ్మూలాలు కీలకమే.. వేణును తీవ్రస్థాయిలో భయపెట్టడానికి ఉగ్రవాదం, మనీలాండరింగ్ కేసులు నమోదు చేస్తామంటూ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బెదిరించారు. ఇందుకు సంబంధించి రాధాకిషన్‌రావు సహా తొమ్మిది మందిపై కేసు నమోదైంది. వేణు మాధవ్ తన నలుగురు పార్ట్‌టైమ్ డైరెక్టర్ల వేధింపులపై 2018 అక్టోబర్ 3న జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అదే నెల 12 నుంచి నలుగురి నుంచి వేణుకు వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. అయితే ఈ ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడంతో అప్పటి బంజారాహిల్స్ ఏసీపీని కలిసి న్యాయం చేయమని కోరినా ఫలితం దక్కలేదు. ఈ ఫిర్యాదు విషయంలో పోలీసుల ఉదాశీన వైఖరికి కారణం తెలియాలంటే నాటి బంజారాహిల్స్ ఏసీపీని పిలిచి విచారించాల్సి ఉంది. ముఖ్యంగా డీజీపీ కార్యాలయం, హయ్యర్ అప్‌తో పాటు న్యాయవాది శ్రీనివాస్, లహరి రిసార్ట్స్ యజమాని సంజయ్‌ల నుంచీ వాంగ్మూలాలు సేకరించాలి. అయితే డీజీపీ కార్యాలయం, ‘హయ్యర్ అప్ విషయంలో సిట్ అధికారులు ఏ విధంగా ముందుకు వెళ్తారన్నది వేచి చూడాల్సి ఉంది. సిట్ అదుపులో ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ రాధాకిషన్‌రావు ఇప్పటికే అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టై, జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. దీంతో ఆయన్ను కిడ్నాప్ కేసులో పీటీ వారెంట్‌పై అరెస్టు చేసి, కోర్టు అనుమతితో పోలీసు కస్టడీలోకి తీసుకోవాలని జూబ్లీహిల్స్ పోలీసులు, సిట్ అధికారులు నిర్ణయించారు. మరోపక్క ఇదే కేసులో నిందితుడిగా ఉన్న నాటి టాస్క్‌ఫోర్స్ ఎస్సై, ప్రస్తుతం స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో (ఎస్ఐబీ) ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న మల్లికార్జున్‌ను సిట్ అధికారులు శుక్రవారం అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. -
కిడ్నాప్ చేసి.. బెదిరించి
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: అక్రమ ఫోన్ ట్యాపింగ్, బెదిరింపు వసూళ్లు ఆరోపణలపై అరెస్టయిన హైదరాబాద్ టాస్‌్కఫోర్స్ మాజీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) పి.రాధాకిషన్‌రావుపై జూబ్లీహిల్స్ ఠాణాలో కిడ్నాప్ కేసు నమోదైంది. క్రియా హెల్త్‌కేర్ వివాదంలో తలదూర్చి దాని డైరెక్టర్ వేణుమాధవ్ చెన్నుపాటిని కిడ్నాప్ చేసి, షేర్లు, యాజమాన్య బదిలీ చేయించడంతో పాటు రూ.10 లక్షలు వసూలు చేసిన ఆరోపణలపై దీన్ని రిజిస్టర్ చేశారు. ఈ కేసులో ఇన్స్పెక్టర్లు బి.గట్టుమల్లు, ఎస్.మల్లికార్జున్ సైతం నిందితులుగా ఉన్నారు. ఇది సోమవారమే రిజిస్టర్ కాగా... బుధ వారం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే రాధాకిషన్‌రావుపై కూకట్పల్లి ఠాణాలో బెదిరింపుల కేసు నమోదైన విషయం విదితమే. మరోపక్క అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన పోలీసు కస్టడీ బుధవారంతో ముగిసింది. వారం రోజుల పాటు ఆయ న్ను వివిధ కోణాల్లో ప్రశ్నించిన సిట్ అధికారులు కీలక సమాచారం సేకరించినట్లు తెలిసింది. వ్యాపారవేత్త వేణును ఎలా ట్రాప్ చేశారంటే.. నగరానికి చెందిన వేణుమాధవ్ చెన్నుపాటి ప్రపంచ బ్యాంక్‌లో కొన్నాళ్లు పని చేసిన తర్వాత 2008లో తిరిగి వచ్చి 2011లో క్రియా హెల్త్‌కేర్ సంస్థను స్థాపించారు. 2014లో ఉమ్మడి రాష్ట్రంలో 165 పట్టణ ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, టెలి మెడిసిన్ సౌకర్యాలు, అత్యవసర వాహనాలతో సహా ప్రధాన ప్రాజెక్టులను ఈ సంస్థ నిర్వహించేది. 2016 నాటికి క్రియా హెల్త్‌కేర్ మూడు ప్రధాన ప్రాజెక్ట్‌లను చేజి క్కించుకుని ఐదేళ్లల్లో తమ ప్రాజెక్టు విలువను రూ.250 కోట్లకు పెంచుకుంది. ఇది జరిగిన కొన్నాళ్లకు గోపాల్, రాజ్, నవీన్, రవి క్రియాలో పార్ట్ టైమ్ డైరెక్టర్లుగా చేరారు. 2015లో బాలాజీ ఈ సంస్థకు సీఈఓగా నియమితులయ్యారు. 2016–17 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి క్రియా హెల్త్‌కేర్‌లో ఆరుగురు డైరెక్టర్లు ఉండగా... వేణు 60, బాలాజీ 20, గోపాల్ 10, రాజ్ 10 శాతం చొప్పున షేర్లు కలిగి ఉన్నారు. వీరిలో వేణు, బాలాజీ మాత్రమే ఫుల్‌టైమ్ డైరెక్టర్లు. 2018లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నాన్ ఎమర్జెన్సీ మొబైల్ హెల్త్‌కేర్ క్లినిక్‌ల ఏర్పాటుకు బిడ్డింగ్‌కు పిలిచింది. అందులో పాల్గొన్న క్రియా హెల్త్‌కేర్ 1500 మొబైల్ అంబులెన్స్ హెల్త్ క్లినిక్‌లను నడిపే ప్రాజెక్టును తీసుకునే ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ సంస్థ పార్ట్‌టైమ్ డైరెక్టర్లు నలుగురూ వేణుకు ఉన్న 60 శాతం షేర్లను తక్కువ విలువకు విక్రయించాలని పట్టుబట్టారు. సీఈఓ బాలాజీని కూడా వారి వైపు తిప్పుకున్నారు. రాధాకిషన్‌రావు తనదైన శైలిలో బెదిరించి.. అక్కడ రాధాకిషన్‌రావు ప్రోద్బలంతో అప్పటి వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ గట్టుమల్లు తీవ్రస్థాయిలో వేణును బెదిరించారు. దాదాపు రూ.100 కోట్ల విలువైన క్రియా హెల్త్‌కేర్ కంపెనీలోని షేర్లు, యాజమాన్యం వదులుకోవాలని హెచ్చరించారు. రాధాకిషన్‌రావుతో పాటు ఇతర నిందితుల సమక్షంలో నాటకీయ పరిణామాల మధ్య తుపాకులు, కర్రలతో బెదిరించడంతో గత్యంతరం లేక వేణు సెటిల్మెంట్ అగ్రిమెంట్‌పై సంతకం చేయాల్సి వచ్చింది. వేణు నుంచి రూ.10 లక్షలు వసూలు చేసి గట్టుమల్లు, మల్లికార్జున్‌తో కూడిన బృందం ఈ విషయాన్ని పోలీసులు, మీడియా, కోర్టుల్లో ఎవరి దృష్టికి తీసుకువెళ్లినా ప్రాణహాని ఉంటుందని హెచ్చరించి పంపింది. తాజా పరిణామాలతో ధైర్యం తెచ్చుకుని ఫిర్యాదు ప్రాణభయంతో ఇన్నాళ్లు మిన్నకుండిపోయిన వేణుమాధవ్‌కు ఇటీవల రాధాకిషన్‌రావు అరెస్టు విషయం తెలిసి ధైర్యంగా ముందుకు వచ్చి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా అధికారులు రాధాకిషన్‌రావు, చంద్రశేఖర్ వేగే, గట్టుమల్లు, మల్లికార్జున్, కృష్ణ, గోపాల్, రాజ్, రవి, బాలాజీ తదితరులపై ఐపీసీలోని 386, 365, 341, 120 (బీ), రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో రాధాకిషన్‌రావుపై కోర్టు ద్వారా పీటీ వారెంట్ తీసుకుని అరెస్టు చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం గట్టుమల్లు రాచకొండ ఐటీ సెల్లో, మల్లికార్జున్ ఎస్ఐబీలో ఇన్స్పెక్టర్లుగా పని చేస్తున్నారు. మల్లికార్జున్ సుదీర్ఘకాలం వెస్ట్‌జోన్ టాస్‌్కఫోర్స్‌లో ఎస్సైగా పని చేశారు. పదోన్నతి తర్వాత రాధాకిషన్‌రావు సిఫార్సుతోనే ప్రభాకర్‌రావు ఎస్ఐబీలోకి తీసుకున్నారు. రూ.40కోట్ల షేర్లను రూ.40 లక్షలకే బదిలీ చేయించుకుని .. ♦ ఇదిలా ఉండగా.. గోల్డ్ ఫిష్ అబోడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వేగే చంద్రశేఖర్ తన కంపెనీలో పెట్టుబడి కోసం 2018 మార్చిలో వేణుమాధవ్‌ను సంప్రదించారు. ఆ సందర్భంలోనే క్రియా హెల్త్‌కేర్ వివాదాలు తెలుసుకుని, పార్ట్‌టైమ్ డైరెక్టర్లతో మాట్లాడి విషయం సెటిల్ చేస్తానని చెప్పారు. ఇలా మార్కెట్లో రూ.40 కోట్ల విలువైన షేర్లను కేవలం రూ.40 లక్షలకే వేణు నుంచి బదిలీ చేయించుకున్నారు. నలుగురు పార్ట్‌టైమ్ డైరెక్టర్లతో అతడు మరో రహస్య ఒప్పందం కేసుకుని తనను మోసం చేసినట్లు వేణుకు తర్వాత తెలిసింది. వేణు మాధవ్ తన నలుగురు పార్ట్‌టైమ్ డైరెక్టర్ల వేధింపులపై 2018 అక్టోబర్ 3న జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అదే నెల 12 నుంచి నలుగురి నుంచి వేణుకు వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లో ప్రాజెక్టు ప్రారంభించడానికి గడువు సమీపిస్తుండటంతో 2018 నవంబర్‌లో చంద్రశేఖర్ వేగే, గోపాల్, రాజ్ తలసిల, నవీన్, రవి అప్పటి టాస్‌్కఫోర్స్ డీసీపీ పి.రాధా కిషన్ రావును ఆశ్రయించారు. కంపెనీకి సంబంధించిన మిగిలిన షేర్లనూ తమకు ఇప్పించమని వీళ్లు కోరా రు. దీంతో రాధాకిషన్‌రావు, అప్పటి టాస్్క ఫోర్స్ ఎస్సై మల్లికార్జున్ అదే నెల 22న ఉద యం 5.30 గంటలకు వేణును తమ సిబ్బందితో కలిసి కిడ్నాప్ చేసి సికింద్రాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తరలించారు. -
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్‌ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మనీలాండరింగ్ కోణాన్ని విచారించాలని హైకోర్టు న్యాయవాది సురేష్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ని కోరారు. ఈ మేరకు బుధవారం(ఏప్రిల్ 10) ఆయన ఈడీకి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పీఎంఎల్ఏ చట్టం కింద కేసు నమోదు చేయాలన్నారు. ప్రముఖ వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసి వారిని బ్లాక్ మెయిల్ చేయడం ద్వారా కోట్లు వసూలు చేశారని, ఈ డబ్బును పోలీసు వాహనాల్లో ఎన్నికల కోసం తరలించారని నిందితులే ఒప్పుకున్న విషయాన్ని ఆయన ఫిర్యాదులో ప్రస్తావించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలు నిందితులను ఇప్పటివరకు విచారించలేదని, ఈడీ కేసు నమోదు చేసి విచారిస్తే అసలు నిందితులు బయటికి వస్తారని ఫిర్యాదులో తెలిపారు. కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసిన కేసులో పోలీసులు ఇప్పటికే ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు. అప్పట్లో ఇంటెలిజెన్స్ బ్యూరోలో కీలక పాత్ర వహించిన పలువురు పోలీసు ఉన్నతాధికారులను ఈ కేసులో ఇప్పటికే అరెస్టు చేసి విచారిస్తున్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వంలో ఎస్ఐబీ చీఫ్‌గా పనిచేసి ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభాకర్‌రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఇదీ చదవండి.. ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్‌రావు రిమాండ్ పొడిగింపు -
Phone Tapping: రాధాకిషన్ రావు రిమాండ్ పొడిగింపు
-
ఫోన్ ట్యాపింగ్ కేసు: రాధాకిషన్‌రావు రిమాండ్ పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. తాజాగా ఈ కేసు వ్యవహారంలో టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు రిమాండ్‌ను కోర్టు పొడిగించింది. ఈ క్రమంలో ఏప్రిల్ 12 వరకు రిమాండ్ విధించిన అనంతరం ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్‌రావుకు సంబంధించి వారం రోజుల కస్టడీ నేటితో ముగియడంతో పోలీసులు ఆయన్ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఇక, విచారణ సందర్భంగా తనను జైలులో లైబ్రరీకి వెళ్లేందుకు అనుమతించడం లేదని రాధాకిషన్‌రావు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జైలు సూపరింటెండెంట్‌ను సైతం కలవనీయడం లేదని తెలిపారు. దీంతో, పోలీసులను న్యాయమూర్తి పిలిపించి ప్రశ్నించారు. లైబ్రరీలోకి అనుమతించడంతో పాటు సూపరింటెండెంట్‌ను కలిసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం, న్యాయస్థానం ఈ నెల 12 వరకు రిమాండ్‌ను పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఈ కేసుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కోసం స్పెషల్ పీపీను ప్రభుత్వం నియమించనుంది. పోలీసులు నెల రోజులుగా ఫోన్ టాపింగ్ కేసు విచారిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురు అధికారులను అరెస్టు చేశారు. మాజీ డీసీపీ రాధా కిషన్ రావు, మాజీ అడిషనల్ ఎస్పీలు భుజంగరావు తిరుపతన్న, మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావులు అరెస్టు అయిన విషయం తెలిసిందే. హై ప్రొఫైల్ కేసు కావడంతో ప్రత్యేక పీపీని నియమించాలని నిర్ణయించినట్లు సమాచారం. -
రేవంత్ ఇంటి దగ్గర్లోనూ ఓ వార్‌రూమ్!
సాక్షి, హైదరాబాద్: ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోపాటు ఆయన కుటుంబీకులు, అనుచరులపై నిఘా ఉంచడానికి ఓ గెస్ట్‌హౌస్ తీసుకున్నట్టు తెలిసింది. జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసానికి సమీపంలో ఉన్న దీంట్లో ప్రణీత్‌రావు వార్‌రూమ్ నిర్వహించాడు. ఈ గెస్ట్‌హౌస్ కేంద్రంగానే భారీ సెటిల్మెంట్లు కూడా జరిగినట్టు తెలిసింది. పోలీసు కస్టడీలో ఉన్న హైదరాబాద్ టాస్‌్కఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు విచారణలో ఈ విషయాలు గుర్తించిన అధికా రులు ఆదివారం రాత్రి ఆ గెస్ట్‌హౌస్‌లో సోదాలు చేశారు. మరోపక్క రాధాకిషన్‌రావు కస్టడీ బుధవారంతో ముగి యనుండటంతో సిట్ అధికారులు తమ దర్యా ప్తు, విచారణ ముమ్మరం చేశారు. నిఘా అధికారులు చేసిన ఫోన్ ట్యాపింగ్ కారణంగానే 2015 నాటి ‘ఓటుకు కోట్లు’వ్యవహారం, 2022లో చోటు చేసుకున్న ‘ఎమ్మెల్యేలకు ఎర’అంశం వెలుగులోకి వచ్చాయి. ప్రభాకర్‌రావు ఎస్ఐబీ చీఫ్‌గా మారిన తర్వాత ట్యాపింగ్ దుర్వినియోగం కావడం మొదలైంది. తొలినాళ్లలో ఈ విభాగం నిబంధనల ప్రకారమే అవసరమైన ఫోన్‌నంబర్లను లీగల్ ఇంటర్సెప్షన్గా (ఎల్ఐ) పిలిచే చట్టబద్ధమైన విధానం ద్వారానే ట్యాప్ చేసింది. అయితే 2018 ఎన్నికల నుంచి వీరి ట్యాపింగ్ పంథా మారిపోయింది. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఫోన్లతోపాటు సోషల్‌మీడియాను ట్యాప్ చేయాలని భావించారు. ప్రణీత్‌రావు, తిరుపతన్న, వేణుగోపాల్‌రావు తదితరులను ఎస్ఐబీలోకి తీసుకున్న తర్వాత, భుజంగరావు పొలిటికల్ ఇంటెలిజెన్స్ బాధ్యతలు చేపట్టడంతో ప్రభాకర్‌రావు ట్యాపింగ్‌ను కొత్త పుంతలు తొక్కించారు. దీనికోసం విదేశాల నుంచి ఉపకరణాలు, సాఫ్ట్వేర్స్ అక్రమంగా దిగుమతి అయ్యాయి. టెక్నాలజీ కన్సల్టెంట్ రవిపాల్ అలియాస్ పాల్ రవికుమార్ సహకారంతో ఇజ్రాయెల్ నుంచి సాఫ్ట్వేర్స్, ఎంసీ క్యాచర్స్ సమీకరించుకున్నారు. సూట్‌కేస్‌లో ఇమిడిపోయి ఉండే ఈ ట్యాపింగ్ పరికరం మ్యాన్ ఇన్ ది మిడిల్ (ఎంఐటీఎం) ఎటాక్స్‌కు వినియోగించారు. దీన్ని ప్రణీత్‌రావు టీమ్ ఓ వాహనంలో పెట్టుకొని టార్గెట్ చేసిన వ్యక్తి ఇల్లు, కార్యాలయ సమీపంలో మాటు వేసేది. ఈ పరికరానికి ఓ కృత్రిమ సెల్‌ఫోన్ టవర్గా మారిపోయి 300 మీటర్ల పరిధిలో పనిచేస్తున్న ప్రతి ఫోన్ ద్వారా జరిగే కమ్యూనికేషన్ తెలుసుకునే సామర్థ్యం ఉంది. వాటిలో తమకు కావాల్సిన దాన్ని ఎంచుకొని, దానికి సంబంధించిన సోషల్‌మీడియా సహా ప్రతి కమ్యూనికేషన్‌ను ట్యాప్ చేసే అవకాశం దానిని ఆపరేట్ చేసే వ్యక్తికి ఉంటుంది. ఇలాంటి ఓ ఉపకరణాన్నే ప్రణీత్‌రావు బృందం రేవంత్‌రెడ్డి ఇంటికి సమీపంలో తీసుకున్న గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసింది. అక్కడ నుంచే రేవంత్‌తోపాటు ఆయన కుటుంబీకులు, ప్రధాన అనుచరుల ఫోన్లపై నిఘా ఉంచింది. రాధాకిషన్‌రావు, భుజంగరావులు ఇదే గెస్ట్‌హౌస్ కేంద్రంగా కొన్ని సెటిల్మెంట్లు కూడా చేశారని తెలుస్తోంది. ఈ వ్యవహారాలను ప్రభాకర్‌రావు నేరుగా పర్యవేక్షించి భారీ వసూళ్లకు తెర లేపినట్టు పోలీసులు గుర్తించారు. -
ఫోన్ ట్యాపింగ్ డెన్‌గా ఆ గెస్ట్‌హౌజ్!
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో పోలీసులు దూకుడు పెంచారు. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంటి సమీపంలోని ఓ గెస్ట్ హౌజ్‌లో సోమవారం ఉదయం సోదాలు జరిపారు. అయితే ఆ గెస్ట్‌హౌజ్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుకు చెందిందనే ప్రచారం జరిగింది. మరోవైపు.. ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి దీనినే ప్రణీత్ రావు బృందం డెన్‌గా మార్చుకుని ఉంటుందని దర్యాప్తు బృందం భావిస్తోంది. ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంలో ఈ గెస్ట్ హౌజ్‌నే ప్రణీత్ రావు బృందం వినియోగించుకున్నారు. రేవంత్ ఇంటికి కూతవేటు దూరంలో ఉండడంతోనే తమ పని ఇక్కడి నుంచే సులువు అవుతుందని ఆ టీం భావించింది. ఈ గెస్ట్ హౌజ్ నుంచే అడిషనల్ ఎస్పీ భుజంగరావు ట్యాపింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ మేరకు నిందితులు వెల్లడించిన సమాచారం మేరకే ఇప్పుడు పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ ఆపరేషన్‌కు పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఆఫీస్ కంటే ఈ గెస్ట్ హౌజ్ మేలని ప్రణీత్ రావు బృందం భావించింది. ప్రతిపక్ష నాయకుల ఫోన్ల ట్యాపింగ్ అంతా ఇక్కడే మీటింగ్ పెట్టి నిర్వహించినట్లు నిందితులు దర్యాప్తులో వెల్లడించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో గెస్ట్ హౌజ్‌లో ఫోన్ ట్యాపింగ్ సంబంధిత ఆధారాలన్నింటిని భుజంగరావు ముందే మాయం చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. వ్యవహారంలో ఎమ్మెల్సీ నవీన్ రావును సైతం రేపో, మాపో దర్యాప్తు పిలిచి విచారణ జరపొచ్చని, నవీన్ రావుతో పాటు మరో ఎమ్మెల్సీకి కూడా నోటీసులు జారీ కావొచ్చనే ప్రచారం నడిచింది. ఎమ్మెల్సీ నవీన్ రావు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు. తెలంగాణ ఉద్యమం సమయం నుంచి కేసీఆర్ వెంట నడుస్తున్నాడు. గతంలో ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన నవీన్‌కు నిరాశే ఎదురైంది. అయితే కేసీఆర్ మాత్రం ఆయన్ని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేశారు. అదంతా దుష్ప్రచారం: ఎమ్మెల్సీ నవీన్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన పేరు, తన గెస్ట్ హౌజ్ ప్రస్తావన రావడంతో ఎమ్మెల్సీ నవీన్ రావు స్పందించారు. ఆ ప్రచారమంతా అవాస్తవమని చెబుతున్నారాయన. ‘‘నాకు ఫోన్ ట్యాపింగ్ తో ఏలాంటి సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లో నాపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు నా గెస్ట్ హౌస్‌ను ఈ వ్యవహారంలోకి లాగారు. నా గెస్ట్ హౌజ్‌లో ఎలాంటి తనిఖీలు జరగలేదు. కుట్ర పూరితంగానే నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి ప్రచారాలు చేస్తున్న వాళ్లపై చట్టరిత్యా చర్యలు తీసుకుంటా అని ఎమ్మెల్సీ నవీన్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. -
ట్యాపింగ్ మాటున లైంగిక వేధింపులు.. వసూళ్లు!
నల్లగొండ క్రైం: ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారం నల్లగొండలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే జిల్లాలోని టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన ముగ్గురు పోలీస్ అధికారులను అదుపులోకి తీసుకున్న ప్రత్యేక అధికారుల బృందం ఆదివారం వారిని మరోసారి విచారించినట్టు చర్చ జరుగుతోంది. అప్పటి జిల్లా ఉన్నతాధికారితో నమ్మకంగా ఉన్న కానిస్టేబుల్‌తో మునుగోడు ఉప ఎన్నికలో డబ్బు పంపిణీతో పాటు వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపణలున్నాయి. పోలీసు ఉన్నతాధికారితో ఉన్న నమ్మకాన్ని టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన పలువురు కిందిస్థాయి పోలీసుఅధికారులు దందాలు, సెటిల్మెంట్లకు తెర లేపారని ఆరోపణలు వచ్చాయి. మిర్యాలగూడలో రౌడీషీటర్లతో సెటిల్మెంట్లు, నార్కట్‌పల్లి వద్ద దొరికిన గంజాయి కేసులో వసూళ్లకు పాల్పడ్డట్టు సమాచారం. పేకాట, బియ్యం దందా చేసేవారిని ఫోన్ ట్యాపింగ్ ద్వారా పట్టుకొని బ్లాక్మెయిల్ చేసి వసూళ్లకు పాల్పడినట్లు చర్చ జరుగుతోంది. పార్కులో తిరిగే ప్రేమ జంటలను, ఏదేని కేసులో ఉన్న వారిని కలవడానికి వచ్చే కుటుంబ సభ్యులైన మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు సమాచారం. పోలీసు అధికారులు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో అక్రమ సంపాదనతో ఒక పోలీస్ అధికారి గుర్రంపోడు మండల కేంద్ర సమీపంలోని 9ఎకరాల తోటను కొనుగోలు చేసినట్టు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. ఈ విషయమై దర్యాప్తు అధికారులు కీలకమైన సమాచారం సేకరించినట్టు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. దర్యాప్తు అధికారుల విచారణలో మరిన్ని విస్తుగొలిపే అంశాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. -
ఫోన్స్ ట్యాపింగ్ అవుతున్నాయట!
ఫోన్స్ ట్యాపింగ్ అవుతున్నాయట! -
Phone Tapping Case: పగలు చేశారా? రాత్రి చేశారా?
-
ఈసీ, గవర్నర్ జోక్యం చేసుకోవాలి
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఎన్నికల సంఘం, గవర్నర్, ఇతర దర్యాప్తు సంస్థలు సుమోటోగా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశా రు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ట్యాపింగ్ ద్వారా దేశ సమగ్రతకు భంగం కలిగించేలా గత ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపించారు. దీనిపై గవర్నర్ ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని కోరారు. అలాగే గతంలో ఎన్నికల నిబంధనలు బీఆర్ఎస్ ఉల్లంఘించినందున ఈసీ కూడా జోక్యం చేసుకోవాలన్నారు. 2014 నుంచి ఎన్నికలు, ఇతర సందర్భాల్లో పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడుతూ ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినందున బీఆర్ఎస్ గుర్తింపును రద్దు చేయాలని ఈసీని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంలో మాజీ సీఎం కేసీఆర్‌పైనా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఫోన్ ట్యాపింగ్‌కు కారణం ఎవరో చెప్పాలని కేసీఆర్‌ను ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక షాడో సీఎం గా వ్యవహరించిన కేటీఆర్ ఇప్పుడు ఫోన్‌ట్యాపింగ్ కేసుతో తనకేం సంబంధం అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ట్యాపింగ్‌తో రూ. కోట్లు వసూలు చేశారు.. ట్యాపింగ్ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టే ప్రయత్నం చేసినా బీజేపీ విడిచిపెట్టబోదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. రిటైరైన ఓ అధికారిని ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమించి కేసీఆర్ ఇష్టమొచ్చినట్లు వ్యవహరించడం మామూలు విషయం కాదన్నారు. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఎన్నికల సందర్భంగా బీజేపీ నేతల ఫోన్లతోపాటు, బడా పారిశ్రామికవేత్తలు, ప్రముఖుల ఫోన్లను బీఆర్ఎస్ నేతలు ట్యాప్ చేశారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ రూ. కోట్లలో వసూళ్లు చేసినట్లు, ఇందులో కేసీఆర్, అయన కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్నట్లు బయటపడుతోందని వ్యాఖ్యానించారు. దీని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని కిషన్‌రెడ్డి హెచ్చరించారు. రైతు హామీలను కాంగ్రెస్ అమలు చేయదేం? రైతులకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ఎందుకు అమలు చేయట్లేదని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ‘కౌలు రైతులకు ఆర్థిక సహాయం ఇవ్వలేదు. రుణమాఫీ ఏ డిసెంబర్ 9న చేస్తారో తెలియదు? రైతులకు రూ. 500 బోనస్ బోగసేనా? రైతులకు కొత్త రుణాలు ఎందుకు ఇవ్వట్లేదు’అని ఆయన నిలదీశారు. హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్‌కు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. -
ట్యాపింగ్ ద్వారానే ‘ఎమ్మెల్యేలకు ఎర’ వెలుగులోకి!
సాక్షి, హైదరాబాద్: ఎస్ఐబీ అధీనంలోని స్పెషల్ ఆపరేషన్ టీమ్ చేసిన ఫోన్ ట్యాపింగ్ ద్వారానే బీజేపీ అగ్రనేత బీఎల్.సంతోష్ సహా పలువురు ప్రముఖులు నిందితులుగా ఉన్న ‘ఎమ్మెల్యేలకు ఎర’వ్యవహారం వెలుగులోకి వచ్చినట్టు తేలింది. నందకుమార్, రామచంద్రభారతి, సింహయాజిస్వామి ట్రాప్ కావడం, పట్టుబడటంలో అప్పట్లో హైదరాబాద్ టాస్‌్కఫోర్స్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా (ఓఎస్డీ) పనిచేసిన పి.రాధాకిషన్‌రావుతోపాటు సైబరాబాద్‌కు చెందిన మరో అధికారి కీలకంగా వ్యవహరించినట్టు సిట్ గుర్తించింది. రాధాకిషన్‌ను వారంరోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించడంతో గురువారం వైద్య పరీక్షల అనంతరం బంజారాహిల్స్ ఠాణాకు తరలించారు. ఈయన నుంచి కేసుకు సంబంధించి కీలక సమాచారం సేకరించాల్సి ఉందని పశ్చిమ మండల డీసీపీ విజయ్‌కుమార్ ప్రకటించారు. భారీ స్కెచ్...: 2022లో మునుగోడు ఉపఎన్నిక సమీపిస్తున్న వేళ.. మెయినాబాద్‌లోని అజీజ్‌నగర్‌లో అప్పటి తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో తిరుపతికి చెందిన సింహయాజిస్వామి, ఫరీదాబాద్‌లోని ఓ దేవాలయంలో ఉండే ఢిల్లీకి చెందిన సతీష్‌శర్మ అలియాస్ రామచంద్రభారతి, నగరవ్యాపారి నందకుమార్ సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) పోలీసులకు చిక్కారు. వీరు అప్పటి అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలతో బేరసారాలు చేస్తున్నట్టు మొయినాబాద్ ఠాణాలో కేసు నమోదైంది. బీజేపీ ఎర వేసినట్టు ఆరోపణలు ఉన్న ఎమ్మెల్యేల్లో పైలెట్ రోహిత్‌రెడ్డితో పాటు హర్షవర్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతరావు ఉన్నారు. అప్పటి ఎస్ఐబీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు ఈ నలుగురు ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేసినట్టు వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే ఎర అంశం వెలుగులోకి రావడంతో ఆయన ప్రభాకర్‌రావును అప్రమత్తం చేశారు. అప్పటి సర్కారుకు సమాచారం ఇచ్చిన ప్రభాకర్‌రావు టాస్క్‌ఫోర్స్‌కు ఓఎస్డీగా ఉన్న రాధాకిషన్‌రావుతో కలిసి భారీ స్కెచ్ వేశారు. సైబరాబాద్ అధికారులతో కలిసి అమలు... వీరు వేసుకున్న పథకం ప్రకారం బీజేపీ తరఫున వస్తున్న సింహయాజిస్వామి, సతీష్ శర్మ, నందకుమార్‌లను ట్రాప్ చేయడానికి హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్‌తో పాటు సైబరాబాద్ ఎస్ఓటీ, ఇంటెలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. నందకుమార్ ఫోన్‌ను కూడా కొన్నాళ్లు ట్యాప్ చేయడం ద్వారా మరికొంత సమాచారం సేకరించారు. రాధాకిషన్‌రావు సహా మరికొందరు అధికారులు ట్రాప్ జరగడానికి ముందు రోజు (2022 అక్టోబర్ 25) ఫామ్‌హౌస్‌ను సందర్శించారు. అక్కడ అవసరమైన ప్రాంతాల్లో రహస్యంగా సీసీ కెమెరాలు, వాయిస్ రికార్డర్లు, మైక్‌లు.. ఇలా మొత్తం 75 సాంకేతిక ఉపకరణాలు అమర్చారు. ఈ వ్యవహారంలో రాధాకిషన్‌రావుతో పాటు సైబరాబాద్‌లో ఇన్స్పెక్టర్గా పనిచేసిన అధికారి కీలకంగా వ్యవహరించినట్టు తేలింది. 2022 అక్టోబర్ 26 రాత్రి ఫామ్‌హౌస్ సమీపంలో వలపన్ని ఉన్న హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్, సైబరాబాద్ ఎస్ఓటీ, రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు నలుగురు ఎమ్మెల్యేలతో బేరసారాలు చేస్తున్న ముగ్గురినీ పట్టుకున్నారు. ఈ ఎపిసోడ్ మొత్తం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌కు సంబంధించినది అయినా.. ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు రాధాకిషన్‌రావు రంగంలోకి దిగారని తెలుస్తోంది. కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉండటంతో... ఎమ్మెల్యేల ఎర కేసును తొలుత మొయినాబాద్ పోలీసులే దర్యాప్తు చేశారు. అయితే లోతైన దర్యాప్తునకు నాటి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసింది. దీని దర్యాప్తు తుది దశకు చేరిన తర్వాత సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. దీన్ని విచారించిన న్యాయస్థానం ఆ మేరకు ఆదేశాలు ఇచ్చింది. అయితే సీబీఐ దర్యాప్తు అవసరం లేదని, తాము ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు పూర్తి చేస్తోందంటూ హైకోర్టు ఆదేశాలను నాటి ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ప్రస్తుతం ఈ పిటిషన్ అక్కడే పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలోనే తాజా కేసులో భాగంగా నాటి ‘ఎర కేసు’లోని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలా? వద్దా? అనే అంశంపై పోలీసులు న్యాయనిపుణుల సలహా తీసుకోనున్నారు. రాధాకిషన్‌రావును పోలీసు కస్టడీలోకి తీసుకున్న నేపథ్యంలో పశ్చిమ మండల డీసీపీ విజయ్‌కుమార్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో ‘ఎస్ఐబీలో అనధికారికంగా, రహస్యంగా, చట్ట విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తుల ప్రొఫైల్‌లను అభివృద్ధి చేయడంలో రాధాకిషన్‌రావు కీలకపాత్ర పోషించారు. కొంతమంది వ్యక్తుల ఆదేశానుసారం వాటిని రాజకీయపార్టీకి అనుకూలంగా, పక్షపాత ధోరణిలో ఉపయోగించుకోవడంలో మరికొందరితో కలిసి పన్నిన కుట్రలో భాగస్వాముడయ్యారు. ఆ నేరాలకు సంబంధించిన ఆధారాలు ధ్వంసం చేయడానికి కుట్ర పన్నారు. ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న రాధాకిషన్‌రావు నుంచి కీలక సమాచారం సేకరించే కోణంలో దర్యాప్తు అధికారి, ఆయన బృందం ప్రశ్నిస్తోంది. ఈ కేసు దర్యాప్తు పురోగతిలో ఉంది’అని పేర్కొన్నారు. -
బీజేపీ ఎందుకు సుమోటోగా తీసుకోవడం లేదు?
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘ఇండియన్ టెలికం యాక్ట్‌పై కేంద్రానికి పూర్తి అధికారం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసును సుమోటోగా స్వీకరించొచ్చు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ కేసును ఎందుకు సుమోటోగా తీసుకోవడం లేదు? ఆ పార్టీ నేతలు అవగాహన రాహిత్యంతో ప్రత్యక్షంగా కాంగ్రెస్‌పై అడ్డగోలు ఆరోపణలు చేస్తూ..పరోక్షంగా బీఆర్ఎస్కు సహకరిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న వారు ఎంతటి పెద్దమనుషులైనా వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ విషయంలో చట్టం తనపని తాను చేసుకుని పోతోంది’అని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబులు స్పష్టం చేశారు. తుక్కుగూడలో ఈ నెల 6న కాంగ్రెస్ నిర్వహించ తలపెట్టిన జనజాతర మహాసభ ఏర్పాట్లను బుధవారం వారు పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పూర్తి వివరాలు వారి మాటల్లోనే...బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా వ్యవహరించింది. మా ఫోన్లు కూడా ట్యాప్ చేసింది. వీటిని అడ్డం పెట్టుకొని అక్రమ వసూళ్లకు పాల్పడింది. ఈ ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్నవారు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వారిని అరెస్టు చేసి జైలుకు పంపడం ఖాయం. ప్రాజెక్టులు, విద్యుత్ కొనుగోళ్లు పేరుతో తిన్న కమీషన్లు కక్కిస్తాం. ధరణి ఫోర్టల్‌ను అడ్డుపెట్టుకొని వారు కొల్లగొట్టిన ప్రభుత్వ, అసైన్డ్, భూదాన్, వక్ఫ్, సీలింగ్ భూములను వెనక్కి తీసుకుంటాం. ఆర్థిక దోపిడికి పాల్పడిన వారికి జైలుకు పంపిస్తాం. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకో.. మీరు మా తాట తీయడం కాదు.. ప్రజలే మీ తాట తీస్తారు అని హెచ్చరించారు. కర్రుకాల్చి వాత పెట్టినా సిగ్గురాలే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది..కరువొచ్చిందని బీఆర్ఎస్ నేతలు పదేపదే ప్రచారం చేస్తున్నారు. కరువుకు కాంగ్రెస్‌కు సంబంధం ఏమిటీ? కాంగ్రెస్ డిసెంబర్ 7న అధికారంలోకి వచ్చింది. నాటి నుంచి నేటి వరకు వర్షపు చినుకు కురవలేదు. వర్షాకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఈ ఏడాది 56 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని సెపె్టంబర్ 5న త్రిసభ్య కమిటీ ప్రకటించింది. ఉన్న నీటి నిల్వలను జాగ్రత్తగా వాడుకోవాలని కేఆర్ఎంబీ కమిటీ ముందే హెచ్చరించింది. అయినా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. బీఆర్ఎస్ పాలనలో కరువొస్తే...కాంగ్రెస్‌కు అంటగట్టే ప్రయత్నం చేస్తుంది. ప్రజలు తెలివైనవారు. ఎవరు ఏమిటో వారికి తెలుసు. ఇప్పటికే ఒకసారి కర్రుకాల్చి వాతపెట్టారు. అయినా సిగ్గురాలే. మళ్లీ వారికి వాతపెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జనజాతరకు భారీగా తరలిరావాలి అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఇదే తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రకటించింది. ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చింది. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకుంది. ఇదే స్ఫూర్తితో ఇదే వేదికపై నుంచి ఈ నెల 6న కాంగ్రెస్ జాతీయ గ్యారంటీలను ప్రకటించనుంది. ఏఐసీసీ ముఖ్యనేతలు రాహుల్‌గాందీ, ప్రియాంకగాంధీ ముఖ్య అతిథులుగా హాజరుకానుండటంతో కాంగ్రెస్ పార్టీ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఐదు లక్షల మందికి తగ్గకుండా సభకు తరలించాలని నిర్ణయించింది. సభలో మహిళలకు పెద్దపీట వేయబోతున్నాం. వారికి ప్రత్యేక క్యాబిన్లు ఏర్పాటు చేస్తున్నాం. సభను విజయవంతం చేసేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసుకున్నాం’అని మంత్రులు వివరించారు. ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ సీనియర్ నేత దేప భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నిందితుల చేతిలో ‘పోలీసుల’ భవిత!
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా క్రిమినల్ కేసుల దర్యాప్తులో నిందితుల భవిష్యత్తు పోలీసుల చేతు ల్లో ఉంటుంది. ఎవరెవరిని నిందితులుగా చేర్చాలి? వారిపై ఏఏ సెక్షన్ల కింద అభియోగాలు మోపాలి? అనేది కేసుల దర్యాప్తు ఆధారంగా వీళ్లే నిర్ణయిస్తారు. అయితే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ ఐబీ) లోని స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) కేంద్రంగా జరిగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొందరు పోలీసు ఉన్నతాధికారుల భవిత ఈ కేసులో నిందితులుగా ఉన్న పోలీసుల చేతిలో ఉండటం ఆసక్తి కలిగిస్తోంది. వీళ్లు చెప్పే అంశాలపై డీజీ పీ, అదనపు డీజీ స్థాయి అధికారులకు నోటీసులు ఇవ్వాలా? వద్దా? అనేది ఆధారపడి ఉందని అంటున్నారు. ఇలావుండగా ట్యాపింగ్ కేసులో అరెస్టు అయిన హైదరాబాద్ టాస్‌్కఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావును ఈ నెల 10 వరకు పోలీసు కస్టడీకి ఇస్తూ నాంపల్లి కోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు పోలీసు కస్టడీ పూర్తయి, జ్యుడీషియల్ రిమాండ్‌కు వెళ్లిన అదనపు ఎస్పీ నాయిని భుజంగరావును అదనపు కస్టడీకి కోరుతూ పంజగుట్ట పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ప్రభాకర్‌రావు దగ్గరే ఆగిన కేసు ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన అంశాలు, నిందితులుగా ఉన్న పోలీసు అధికారుల వాంగ్మూలాలను బట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు నేతృత్వంలో సాగింది. దర్యాప్తు అధికారులు కూడా ప్రస్తుతానికి ఇంతవరకే పరిమితం అవుతున్నారు. అయితే ఎస్ఐబీకి ఓఎస్డీ హోదాలో ప్రభాకర్‌రావే నేతృత్వం వహించినప్పటికీ.. ఈ విభాగం కూడా ప్రధాన ఇంటెలిజెన్స్‌లో అంతర్భాగమే. దీనికి అదనపు డీజీపీ లేదా ఐజీ స్థాయి అధికారులు బాస్‌లుగా ఉంటారు. విదేశాలనుంచి ఎలాంటి నిఘా ఉపకరణాలు ఖరీదు చేయాలన్నా కచ్చితంగా నిఘా విభాగాధిపతితో పాటు డీజీపీ అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు అరెస్టు అయిన పోలీసులతో పాటు అరెస్టు కాబోయే వారు, విదేశాల్లో ఉన్న ప్రభాకర్‌రావు పట్టుబడిన తర్వాత.. ఉన్నతాధికారులకు తెలిసే ఈ వ్యవహారం జరిగిందని వారు చెప్తే వారికీ నోటీసులు ఇవ్వక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సిట్ అదుపులో వేణుగోపాల్‌రావు పోలీసులు ఇచ్చిన నోటీసుల ఆధారంగా బంజారాహిల్స్ ఠాణాకు వచ్చిన ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ వేణుగోపాల్‌రావును బుధవారం సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఎస్ఐబీలోని ఎస్ఓటీలో కీలకంగా వ్యవహరించిన నలుగురు అధికారుల్లో ఓఎస్డీ హోదాలో పని చేసిన ఈయన కూడా ఒకరు. అదనపు ఎస్పీగా పదవీ విరమణ చేసిన అనంతరం ప్రభాకర్‌రావు సూచనల మేరకు ఓఎస్డీగా పని చేశారు. ప్రత్యేక విభాగాలు కమిషనర్ల అదీనంలో టార్గెట్ చేసిన ప్రతిపక్ష నేతలు, వ్యాపారులు తదితరులపై సాంకేతిక నిఘా ఉంచడం, వారి ఫోన్లు ట్యాప్ చేయడం ఎస్ఐబీ అ«దీనంలో ఎస్ఓటీ చేసింది. అయితే వారిని పట్టుకోవడం, నగదు స్వాదీనం చేసుకోవడం, వసూళ్లకు పాల్పడటం ఫీల్డ్ ఆపరేషన్లు మాత్రం రాజధానిలోని మూడు కమిషనరేట్లలో ఉన్న ప్రత్యేక విభాగాలు చేశాయి. దీంతో ఇప్పటివరకు జరిగిన అక్రమ ఆపరేషన్లు ఆ విభాగాలకు నేతృత్వం వహించిన కమిషనర్లకు తెలియకుండానే జరిగాయా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ విషయాలపై నిందితులు ఏదైనా చెబితే ఆయా ఉన్నతాధికారులకూ నోటీసులు ఇచ్చి విచారించడం అనివార్యంగా మారుతుంది. దీనిపై ఓ రిటైర్డ్ అధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘ఆయా ఉన్నతాధికారులు కేసులో నిందితులు కాకపోయినా, వారి పర్యవేక్షణ లోపం కచ్చితంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వాళ్లు క్రిమినల్ చర్యలకు కాకపోయినా..డిపార్ట్మెంటల్ యాక్షన్‌కు అర్హులే’అని అన్నారు. -
నా వ్యక్తిత్వ హననానికి రేవంత్‌రెడ్డి యత్నం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘నాకు ఎలాంటి చట్ట వ్యతిరేక వ్యవహారాలతో, ఫోన్ ట్యాపింగ్‌తో సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ అంటూ లీకు వీరుడు రేవంత్‌రెడ్డి నా వ్యక్తిత్వ హననానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఆయనకు మీడియా సమావేశం పెట్టి ఆధారాలు బయట పెట్టే దమ్ము లేదు. పోలీసు రిమాండులో ఉన్న వారి ఫోన్ల నుంచి కూడా లీకులు వస్తున్నాయి. నేను ఎవరో హీరోయిన్లను బెదిరించినట్లు మంత్రి కొండా సురేఖ మెదడు లేని విమర్శలు చేస్తోంది. ఇలాంటి దిక్కుమాలిన పనులు చేయాల్సిన కర్మనాకేంటి? ఎవరి ఫోన్లూ ట్యాపింగ్ చేయాల్సిన, బెదిరించాల్సిన అవసరం మాకు లేదు. అడ్డగోలుగా చెత్త మాటలు మాట్లాడితే మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాటతీస్తాం.. న్యాయపరంగా ఎదుర్కొంటాం..’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హెచ్చరించారు. బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్లో బుధవారం పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ట్యాపింగ్‌పై 2004 నుంచే విచారణ జరిపించాలి ‘2011లో కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నపుడు, అప్పుడు ఎంపీలుగా ఉన్న రాజగోపాల్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు తమ ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నాడని ఆరోపించారు. అందువల్ల విచారణ పరిధి పెంచి 2014 నుంచి కాదు 2004 నుంచి ట్యాపింగ్ అంశంపై విచారణ జరిపించాలి. పోలీసు అధికారులు మహేందర్‌రెడ్డి, శివధర్‌రెడ్డి, రవిగుప్తా తదితరులు 2014కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ కీలక పోస్టుల్లో పనిచేశారు. కేసీఆర్ మాత్రమే బాధ్యులు అని లీకులు ఇస్తున్నవారు ఆ ఆధికారులను ఎందుకు విచారణకు పిలవడం లేదు. గతంలో నా ఫోన్ మీదా నిఘా ఉన్నట్లు ఆపిల్ సంస్థ నుంచి మెసేజ్ వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ అంటూ యూ ట్యూబ్‌లు, పనికి మాలిన ఛానళ్లకు రిమాండు రిపోర్టు పేరిట లీకులు ఇస్తున్నారు..’అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం ‘రుణమాఫీపై వెకిలిగా నవ్వుతున్న రేవంత్‌రెడ్డి మొగోడు అయితే రైతులకు ఊరటనివ్వాలి. కాళేశ్వరం, గొర్రెలు..బర్రెల స్కీంలో అవినీతి, ఫోన్ ట్యాపింగ్ అంటూ రోజుకో అంశం తెరమీదకు తెస్తూ ప్రజల దృష్టిని మళ్లించేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నాడు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌పై స్పీకర్ చర్యలు తీసుకోని పక్షంలో ఇద్దరి పదవులు ఊడగొట్టేందుకు హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వెళ్లి న్యాయ పోరాటం చేస్తాం. రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడిన 218 మంది రైతుల వివరాలను వెంటనే సీఎం రేవంత్‌రెడ్డికి పంపిస్తాం. గతంలో ప్రకటించినట్టుగా ఒక్కో రైతు కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి..’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. నీటి నిర్వహణ చేత కావడం లేదు ‘రాష్ట్రంలో సాగు, తాగునీటి సమస్య తీవ్ర స్థాయికి చేరుకోవడంతో మహిళలు ఖాళీ బిందెలతో ధర్నాలు చేస్తున్నారు. ఢిల్లీకి ధన వనరులు తరలిస్తున్న రేవంత్‌రెడ్డికి జలరాశులు తరలింపునకు ఓపిక లేదు. బీఆర్ఎస్ పాలనలో రూ.38 వేల కోట్లతో మిషన్ భగీరథ పూర్తి చేయడంతో పాటు హైదరాబాద్ నగరానికి వచ్చే 50 ఏళ్ల పాటు తాగునీతి కొరత రాకుండా చేశాం. రాష్ట్రంలో 14 శాతం అధిక వర్షపాతం నమోదైనా నీటి నిర్వహణ చేత కావడం లేదు. హైదరాబాద్‌కు తాగునీటిని అందించే నాగార్జునసాగర్, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్, ఎల్లంపల్లిలో నీళ్లు ఉన్నా ప్రజలు ట్యాంకర్లు బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. తాగునీటి కోసం ఢిల్లీని దేబిరించాల్సిన పరిస్థితిని రేవంత్ ప్రభుత్వం కల్పించింది. బోనస్ ఇవ్వాల్సి వస్తుందని పంటలు ఎండబెట్టారు కాళేశ్వరం నీళ్లను దాచి పెట్టడంతో లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. మేడిగడ్డకు మరమ్మతులు చేసి ఉంటే సాగు, తాగునీటి కష్టాలు ఉండేవి కావు. పంటలు పండితే బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే కుట్రతోనే పంటలను ప్రభుత్వం ఎండబెట్టింది. కాంగ్రెస్‌కు హైదరాబాద్ నగర ఓటర్లు ఓటు వేయలేదనే కక్షతోనే నీటి సరఫరా చేయడం లేదు. తాగునీటి సమస్యపై అవసరమైతే జలమండలి ఎదుట ధర్నా చేస్తాం. ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌పై కాకుండా వాటర్ ట్యాపింగ్‌పై దృష్టి పెట్టాలి..’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, కేపీ వివేకానంద, పార్టీ నాయకులు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి పాల్గొన్నారు. -
ముక్కలు చేసి.. మూసీలో పడేసి!
సాక్షి, హైదరాబాద్: ఎస్ఐబీలోని స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) ద్వారా జరిగిన అక్రమ ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టు అయిన అదనపు ఎస్పీల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్నలను ఐదు రోజులపాటు పోలీసు కస్టడీకి తీసుకున్న సిట్ అధికారులు వివిధ కోణాల్లో ప్రశ్నించారు. ఫలితంగా ట్యాపింగ్‌తో పాటు ఆధారాల ధ్వంసానికి సంబంధించిన సమాచారం సేకరించారు. ఈ వివరాలను పోలీసులు తమ రిమాండ్ రిపోర్టు ద్వారా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. భుజంగరావు, తిరుపతన్నలు తమ నేరం అంగీకరించారని, ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు ఆదేశాలతోనే నేరం చేసినట్టు బయటపెట్టారని కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు. మంగళవారం వీరిద్దరిని గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి శనివారం వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించగా, చంచల్‌గూడ జైలుకు తరలించారు. ప్రణీత్‌రావు దారికి వచ్చాడంటూ... ఈ కేసులో తొలి అరెస్టు ఎస్ఐబీ మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావుదే. తొలుత పోలీసు విచారణకు అతడు సహకరించలేదని, అయితే రానురాను సహకరిస్తూ కీలక వివరాలు వెల్లడించారని పోలీసులు కోర్టుకు తెలిపారు. ప్రభాకర్‌రావు రాజీనామా చేసిన రోజే (గత ఏడాది డిసెంబర్ 4న) ఆయన ఆదేశాల మేరకు ప్రణీత్‌రావు ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న టీఎస్ఎస్పీ హెడ్‌కానిస్టేబుల్ కైతోజు కృష్ణతో కలిసి ఎస్ఐబీ కార్యాలయంలోకి వెళ్లారు. అక్కడ తాను ఏర్పాటు చేసుకున్న వార్ రూమ్‌తోపాటు అధికారిక ట్యాపింగ్స్ జరిగే లాగర్ రూమ్ దగ్గర సీసీ కెమెరాలు ఆఫ్ చేయించాడు. వార్‌రూమ్‌లోని 17 కంప్యూటర్లలో ఉన్న వాటితోపాటు విడిగా భద్రపరిచిన 50 హార్డ్‌డిస్క్ లను ధ్వంసం చేయడానికి ఉపక్రమించాడు. తనతో వచ్చిన ఎల్రక్టీషియన్తోపాటు నమ్మినబంటుగా ఉన్న ఓ పోలీసు సహాయంతో ఎలక్ట్రిక్ కట్టర్ వినియోగించి ఈ హార్డ్‌డిస్క్‌లు ముక్కలు చేశాడు. వీటి శకలాలను నాగోలు వద్ద మూసీనదిలో పారేశాడు. ఈ విషయాలు వెలుగులోకి రావడంతోనే అప్రమత్తమైన సిట్ అధికారులు మూసీలో సోదాలు చేశారు. వీరికి ధ్వంసమైన హార్డ్‌డిస్క్ కేసులు 5, హార్డ్‌డిస్క్ ముక్కలు తొమ్మిది లభించాయి. వీటితో పాటు తాము మూసీ నుంచే ఆరు మెటల్ హార్డ్‌డిస్క్ ముక్కల్నీ సీజ్ చేశామని కోర్టుకు తెలిపారు. ఎస్ఐబీ కార్యాలయం నుంచి ఆధారాలు ప్రణీత్‌రావు వాంగ్మూలం ఆధారంగా సిట్ అధికారులు మూసీనది నుంచే కాకుండా గ్రీన్‌లాండ్స్‌లోని ఎస్ఐబీ కార్యాలయం, దాని ఆవరణ, పరిసరాల నుంచి కొన్ని ఆధారాలు, భౌతిక సాక్ష్యాలు సేకరించారు. అక్రమ ట్యాపింగ్‌కు వినియోగించిన 12 కంప్యూటర్లు, 7 సీపీయూలు, ల్యాప్‌టాప్, మానిటర్లు, పవర్ కేబుళ్లు స్వాదీనం చేసుకున్నారు. అక్కడ ఉన్న ఎలక్ట్రిషియన్ గదిలో క్లూస్, ఫోరెన్సిక్ అధికారులతో కలిసి సోదాలు చేసిన సిట్ హార్డ్‌డిస్క్‌లు కట్ చేస్తున్నప్పుడు కింద పడి, మూలలకు చేరిన వాటి పొడిని సీజ్ చేశారు. ఎస్ఐబీ కార్యాలయ ఆవరణలో పాక్షికంగా కాలిన డాక్యుమెంట్లు, స్పైరల్ బైండింగ్ చేసిన పత్రాలతో పాటు సీసీ కెమెరాల ఫుటేజీకి సంబంధించిన లాగ్‌బుక్ ప్రతులను పోలీసులు సేకరించారు. ఎస్ఐబీ కానిస్టేబుల్ కొత్త నరేష్ గౌడ్ నుంచి వాంగ్మూలం నమోదు చేశారు. టి.ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు ప్రతిపక్షాలపై తాము నిఘా పెట్టినట్టు అతడు బయటపెట్టాడు. ప్రధానంగా ప్రైవేట్ వ్యక్తులపై అక్రమ నిఘా ఉంచడంలో భుజంగరావు, తిరుపతన్న కీలకంగా వ్యవహరించారని, ఈ విషయాన్ని వారు అంగీకరించారని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. -
కోర్టుకెళ్తా.. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కేటీఆర్ సీరియస్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏఎస్పీలకు రిమాండ్
-
ఫోన్ ట్యాపింగ్ కేసు: మరో కీలక పరిణామం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఎస్ఐబీ) ఫోన్ టైపింగ్ కేసులో కీలక పరిమాణం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారి అయిన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు అమెరికా నుంచి వస్తున్నట్లు సమాచారం. అమెరికా నుండి రేపు (సోమవారం) హైదరాబాద్‌కు రానున్న తెలుస్తోంది. ఫోన్ టాపింగ్ కేసులో కీలకంగా ఉన్న ప్రభాకర్ రావు చుట్టూ.. ఈ కేసు తిరుగుతున్న విషయం తెలిసిందే. ప్రభాకర్ రావును విచారిస్తే సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉంది. ప్రభాకర్ రావు విచారణ అనంతరం బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎస్ఐబీ చీఫ్‌గా ఉండి ఫోన్ ట్యాపింగ్‌లకు పాల్పడ్డ ప్రభాకర్ రావు.. రాజకీయ నేతలు, ప్రముఖులు, వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేశారు. ఇక.. ఇప్పటికే ఈ కేసులో అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్న కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. అదే విధంగా టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావుకు సైతం14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. సిట్ అధికారులు రాధాకిషన్‌రావుతో పాటు భుజంగరావు, తిరుపతన్నలను ప్రధానంగా రెండు కోణాల్లో ప్రశ్నించారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావుతో వీరికి ఉన్న సంబంధాలు, ఆయన ఆదేశాల మేరకు చేసిన ఫోన్ ట్యాపింగ్‌పై ఎక్కువగా దృష్టి పెట్టారు. డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు నేతృత్వంలోని బృందం సహాయంతో వీరు ప్రతిపక్ష నేతలు, కీలక వ్యక్తులతో పాటు వ్యాపారుల ఫోన్లూ ట్యాప్ చేసి వ్యక్తిగత విషయాలు తెలుసుకున్నారు. ఈ రకమైన ఆదేశాలు ఎవరు ఇచ్చారు? గుర్తించిన వివరా లను తొలుత ఆ వ్యక్తులకు చెప్పేవారా? అనే కోణాల్లో సిట్ ప్రశ్నించింది. వీరి వేధింపుల నేపథ్యంలో ఓ పార్టీకి వివిధ రూపాల్లో విరా ళాలు ఇవ్వడంతో పాటు ప్రభాకర్‌రావు, రాధా కిషన్‌రావు తదితరులకు కప్పం కట్టిన వాళ్లల్లో బడా బిల్డర్లు, జ్యువెలరీ దుకాణాల యజమా నులు, రియల్టర్లతో పాటు హవాలా వ్యాపా రులూ ఉన్నట్టు సిట్ అనుమానిస్తోంది. ఈ ముగ్గురినీ ప్రశ్నించిన సిట్ అధికారులు దీనికి సంబంధించి కీలక సమాచారం సేకరించారని తెలిసింది. రాచకొండ ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ భూపతి గట్టుమల్లును శుక్రవారం తెల్లవారు జామున విడిచిపెట్టారు. దాదాపు ఆరుగంటల పాటు రాధాకిషన్‌రావుతో కలిపి గట్టుమల్లును ప్రశ్నించిన సిట్ ఆయన నుంచి వాంగ్మూలం నమోదు చేసింది. ఎస్ఐబీ, టాస్క్‌ఫోర్స్‌ల్లో పనిచేసిన అనేక మంది అధికారులు, సిబ్బందినీ సిట్ విచారిస్తూ వారి నుంచి వాంగ్మూలాలు సేకరిస్తోంది. ఇప్పటి వరకు 47మంది నుంచి స్టేట్మెంట్స్ రికార్డు చేశారని సమాచారం. రాధాకిషన్‌రావు, నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్నలు అక్రమ ఆస్తులు కూడబెట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని ప్రాథమిక ఆధారా లు సేకరించారు. ఈ అంశాలను క్రోడీకరిస్తూ అవినీతి నిరోధక శాఖకు సమాచారమివ్వాలని సిట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వివరాలు అందిన తర్వాత ఏసీబీ అధికారులు ఆదాయా నికి మించిన ఆస్తుల కేసు నమోదు చేయనున్న ట్లు సమాచారం. మరోపక్క అక్ర మ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉండి, అరెస్టు అయిన అధికారుల పూర్వాపరాల ను ఉన్నతా ధికారులు పరిశీలిస్తున్నారు. వీరు గతంలో ఎక్క డెక్కడ పనిచేశారు? ఆయాచోట్ల వీరిపై ఉన్న వివాదాలు ఏంటి? కేసులు ఉన్నా యా? అని ఆరా తీస్తున్నారు. తిరుపతన్నపై పెద్దగా వివాదాల్లేనప్పటికీ.. భుజంగ రావు సర్వీసు మొత్తం అక్రమ దందాలతోనే సాగిందని అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. రాధాకిషన్‌రావు ఉప్ప ల్ ఏసీపీగా ఉండగా 2013లో చోటు చేసుకున్న యాంజాల్ శ్రీధర్‌రెడ్డి అలియాస్ ఉప్పల్ వైఎస్సార్ ఆత్మహత్య కేసును అధికా రులు తవ్వుతున్నారు. అప్పటి రామంతాపూర్ కార్పొరేటర్ పరమేశ్వర్‌రెడ్డితోపాటు రాధా కిషన్‌రావు వేధింపులతోనే ఉప్పల్ వైఎస్సార్ ఆత్మహత్య చేసుకున్నట్లు కేసు నమోదైంది. 2007లో జరి గిన పరమేశ్వర్‌రెడ్డి సోదరుడు జగదీశ్వర్‌రెడ్డి హత్య కేసులో ఉప్పల్ వైఎస్సార్ నిందితుడు. ఇతడు మరికొందరితో కలిసి పరమేశ్వర్‌రెడ్డికి హత్యకు కుట్ర పన్నిన ఆరోపణలపై ఉప్పల్ వైఎస్సార్ తదితరులను పోలీ సులు 2013 జూన్‌లో అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి రాధా కిషన్ రావు రూ.10 లక్షల లంచం డిమాండ్ చేసి వేధించడంతోనే ఉప్పల్ వైఎస్సార్ ఆత్మహత్య చేసుకున్నట్టు అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసు ఇప్పటికీ ట్రయల్ పూర్తి కాకపోవడానికి కారణాలను ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. చదవండి: ఫోన్ ట్యాపింగ్ కేసు.. యూఎస్ నుంచి ప్రభాకర్‌రావు రియాక్షన్ ఇది! -
ఇద్దరు వ్యక్తుల ప్రైవేటు సంభాషణ మూడో వ్యక్తి ఎలా వింటున్నాడు..!
ఫోన్ ట్యాపింగ్.. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ట్యాపింగ్ మాటున కొందరు అధికారులు సాగించిన దందా.. రోజురోజుకూ వెలుగుచూస్తున్న సంచలన విషయాలు విస్తుగొలుపుతున్నాయి. దీనిపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధాలు.. ఫిర్యాదుల వంటి విషయాలను పక్కనపెడితే.. అసలు ట్యాపింగ్ కథేంటి? దీనిని ఎలా చేస్తారు? ఇద్దరు వ్యక్తులు ప్రైవేటుగా మాట్లాడుకునే మాటలన్నీ మూడో వ్యక్తి ఎలా వినగలుగుతున్నాడు? ఓసారి చూద్దామా? ► ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు టెలిఫోన్ లేదా మొబైల్ ఫోన్ లేదా ఇంటర్నెట్ ద్వారా జరిపే సంభాషణలను వారికి తెలియ కుండా రహస్యంగా వినడం, రికార్డు చేయడాన్నే ట్యాపింగ్ అంటారు. వాస్తవానికి ట్యాపింగ్ చేయడం చట్టవిరు ద్ధం. దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో ట్యాపింగ్ చేయాల్సి వస్తే.. నిర్దేశిత ప్రభుత్వ ఏజెన్సీలు కేంద్ర హోంశాఖ అనుమతి తీసుకోవాలి. ప్రైవేటు వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ట్యాపింగ్ చేయడానికి అనుమతి లేదు. అనుమతి పొందిన ప్రభుత్వ సంస్థలు సైతం ట్యాపింగ్ చేయడానికి బోలెడు నిబంధనలు పాటించాలి. ఎవరి ఫోన్ అయినా గరిష్టంగా 180 రోజులు మాత్రమే ట్యాపింగ్ చేయాలి. పైగా ప్రతి 60 రోజులకు ఓసారి తాజాగా అనుమతి తెచ్చుకోవాల్సి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో అనుమతి లేకుండా గరిష్టంగా 24గంటలకు మించి ఫోన్ ట్యాపింగ్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ సదరు ట్యాపింగ్‌కు కేంద్ర హోంశాఖ అనుమతి నిరాకరిస్తే అప్పటివరకు రికార్డు చేసిన సంభాషణలన్నీ 48 గంటల్లోగా ధ్వంసం చేయాల్సి ఉంటుంది. ట్యాపింగ్‌లో రకాలు.. సెల్యులర్ ఇంటర్సెప్టర్లు.. ► వీటిని ఐఎంఎస్ఐ క్యాచర్స్ లేదా స్టింగ్రేస్ అని పిలు స్తారు. టవర్ల ద్వారా ప్రసార మయ్యే నిర్దేశిత మొబైల్ సిగ్నల్స్‌ను ఇవి అడ్డుకుంటా యి. అందు లోని డేటాను క్యాప్చర్ చేయడమే కాకుండా.. మొబైల్ లొకేషన్ కూడా ట్రాక్ చేస్తాయి. కాల్స్‌తో పాటు ఎస్సెమ్మెస్ లను సైతం సంగ్రహిస్తాయి. వీఓఐపీ ఇంటర్సెప్షన్ సాధనాలు.. ► వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ (వీఓఐపీ) కమ్యూనికేషన్లను సంగ్రహించేందుకు రూపొందించిన సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ ఆధారిత సాధనాలివి. వీఓఐపీ ప్రొటోకాల్స్‌లోని బలహీనతలను ఆసరాగా చేసుకుని ఇంటర్నెట్లో ప్రయాణించే డేటా ప్యాకెట్లను ఇవి అడ్డుకుని అందులోని డేటాను సంగ్రహిస్తాయి. క్లోన్డ్ సిమ్ కార్డులు.. ► ట్యాపింగ్ చేయాలనుకున్న వ్యక్తి సిమ్‌కు క్లోన్డ్ సిమ్ సంపాదిస్తే చాలు.. సదరు వ్యక్తి మొబైల్ ఫోన్‌కు వచ్చే కాల్స్ అన్నీ చక్కగా వినొచ్చు. రాజకీయపరమైన నిఘా.. ► సర్వీస్ ప్రొవైడర్ సహకారంతో రాజకీయ నాయకుల కాల్స్ రికా ర్డు చేస్తారు. ప్రభుత్వం నుంచి దీనికి అనుమతి ఉండదు. అందువల్ల ఇది అక్రమ ట్యాపింగ్. మానిటరింగ్ సాఫ్ట్వేర్.. హానికరమైన సాఫ్ట్వేర్ లేదా స్పైవేర్‌ను నిర్దేశిత వ్యక్తి మొబైల్ ఫోన్లో వారికి తెలియకుండా చొప్పిస్తారు. ఇవి ఆ ఫోన్ సంభాషణలను రికార్డు చేసి బయటి వ్యక్తు లకు పంపించడంతోపాటు ఫోన్లో ఉన్న సమస్త సమాచారాన్ని మనకు తెలియకుండా బహిర్గతం చేస్తుంది. అధికారిక ట్యాపింగ్.. ప్రభుత్వ అనుమతి తీసుకుని సర్వీస్ ప్రొవైడర్ సహకారంతో చేసే ట్యాపింగ్ ఇది. క్లండెస్టైన్ రికార్డర్ ఉపయోగించి సంభాషణలను రికార్డు చేస్తారు. లా ఎన్ఫోర్స్మెంట్ సంస్థలు డిజి టల్ ఫోరెన్సిక్స్ కోసం ప్రత్యేకమైన సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ సాధనాలను ఉపయోగించి ఈ ట్యాపింగ్ చేస్తాయి. ల్యాప్‌టాప్ సైజు పరికరంతోనే.. ► అక్రమంగా ట్యాపింగ్ చేసేవాళ్లకు పెద్దగా ఎక్విప్మెంట్ కూడా అక్కర్లేదు. ఓ ల్యాప్ టాప్ సైజులో ఉండే సెల్యులర్ ఇంటర్సెప్షన్ మెషీ న్ను కారులో పెట్టుకుంటే చాలు.. ఎవరి ఫోన్ అయినా సులభంగా ట్యాప్ చేసేయొచ్చు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన వ్యక్తి ఇల్లు లేదా ఆఫీసు వద్ద కారు పార్క్ చేసుకుంటే చాలు అవతలి వ్యక్తి సంభాషణలన్నీ వినొచ్చు.. రికార్డు చేయొచ్చు. ఇందుకోసం ముందుగా ఆ వ్యక్తి ఫోన్ నంబర్‌ను మెషీన్లో ఫీడ్ చేయాలి. అనంతరం ఆ వ్యక్తికి ఫోన్ వస్తే.. ఆటోమేటిగ్గా మెషీన్లో రికార్డు అయిపో తుంది. సదరు వ్యక్తి గొంతును రికార్డు చేసి మెషీన్లో ఫీడ్ చేసినా సరే.. దాని ఆధారంగా ఆ కాల్‌ను మెషీన్ రికార్డు చేస్తుంది. ఇజ్రాయెల్ పేరే ఎందుకు? ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాలు తెరపైకి వచ్చిన ప్పుడు ఇజ్రాయెల్ పేరే వినిపిస్తుంది. అధునాతన సాంకేతిక రంగానికి ఇజ్రాయెల్ ప్రసిద్ధి చెందడమే ఇందుకు కారణం. ఫోన్ ట్యాపింగ్ టెక్నాలజీతో సహా నిఘా, గూఢచార సేకరణ పరికరాలను అభివృద్ధి చేసే నైపుణ్యం ఇజ్రాయెల్ సొంతం. ఇటీవల మన దేశంలో సహా పలు దేశాల్లో సంచలనం సృష్టించిన పెగాసస్ స్పైవేర్ రూపొందించింది ఇజ్రాయెలే కావడం గమనార్హం. ట్యాపింగ్ చేసే అధికారం ఎవరికి ఉంది? జాతీయ స్థాయిలో ఇంటెలిజెన్స్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, రీసెర్చ్ అనాలసిస్ వింగ్, డైరెక్టరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్, ఢిల్లీ పోలీస్ కమిషనర్‌తో పాటు రాష్ట్ర పోలీసు విభాగాలు నిబంధనలకు అనుగు ణంగా ఎవరి ఫోన్ అయినా ట్యాపింగ్ చేయొచ్చు. సెల్యులర్ ఇంటర్‌సెప్టర్ ఎలా పనిచేస్తుందంటే? ఇది చాలా సులభమైన ట్యాపింగ్ ప్రక్రియ. కాకపోతే ఖరీదు మాత్రం చాలా ఎక్కువ. చిన్న సూట్ ్డకేసులో ఇమిడిపోయే ఈ పరికరంతో.. నిర్దేశిత వ్యక్తుల ఫోన్లను భౌతికంగా ముట్టు కోకుండా.. ఎలాంటి స్పైవేర్లూ చొప్పించకుండా ట్యాపింగ్ చేయొచ్చు. సాధారణంగా మనం ఎవరికైనా కాల్ చేసినప్పుడు మన సెల్ ఫోన్ నుంచి సిగ్నల్స్ సమీపంలోని టవర్ ద్వారా నిర్దేశిత మార్గంలో అవతలి వ్యక్తికి చేరతాయి. ఈ ప్రక్రియలో సెల్ టవర్ల నుంచి ప్రసారమయ్యే సిగ్నల్స్‌ను నేరుగా ఈ మెషీన్లు సంగ్రహించి ఆ సంభాషణలు వినేలా, రికార్డు చేసేలా పనిచేస్తాయి. ఈ మెషీన్లలో కూడా చాలా రకాలున్నాయి.200 మీటర్ల పరిధి నుంచి దాదాపు 20 కిలోమీ టర్ల పరిధిలోని సెల్‌ఫోన్ సిగ్నల్స్‌ను ఇవి సంగ్రహించగలవు. కొన్ని మెషీన్లు సెల్‌ఫోన్ నుంచి వచ్చే సిగ్నల్స్‌ను టవర్‌కు వెళ్లకుండా ముందుగానే సంగ్రహిస్తాయి. అలాగే సామార్థ్యాన్ని బట్టి పదుల సంఖ్య నుంచి వందల సంఖ్యలో కాల్స్ వరకు ఒకేసారి ఈ మెషీన్లు రికా ర్డు చేయగలవు. కాల్స్, ఎస్సెమ్మెస్‌లే కాకుండా సోషల్ మీడియాతోపాటు మన సెల్ డివైస్ లోని సమస్త సమాచారాన్ని యాక్సెస్ చేసే ఇంటర్సెప్టర్లు ఉన్నాయి. వాస్తవా నికి వీటిని కొనాలన్నా చాలా అనుమ తుల తతంగం ఉంటుంది. అయితే, ఇజ్రాయెల్, సింగ పూర్ తదితర దేశాల నుంచి వీటిని అక్రమ పద్ధతిలో సమ కూర్చుకుంటున్నారు. మీ ఫోన్లో వైరస్ ఉందా!? తగిన జాగ్రత్తలతో డేటాను భద్రపరచుకోవచ్చంటున్న నిపుణులు సాక్షి, హైదరాబాద్: స్మార్ట్ఫోన్లు అందు బాటులోకి వచ్చాక మన పనులు ఎంత సులు వయ్యాయో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే దానితో బోలెడు ముప్పులు సైతం పొంచి ఉన్నాయని సైబర్ నిపుణులు హెచ్చరిస్తు న్నారు. ముఖ్యంగా సైబర్ నేరగాళ్లు ఫోన్లలోకి ఏదో ఒక రూపంలో వైరస్‌ను చొప్పించి ఫొటో లు, వీడియోలు సహా కీలక డేటా కొట్టేయడం, మార్ఫింగ్‌కు వాడుకోవడం లేదా ఆ సమాచారంతో బ్లాక్మెయిల్ చేయడం వంటి ఆగడాలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మన ఫోన్లో వైరస్ చొరబడితే దాని పనితీరు ఎలా ఉంటుందో, హ్యాకింగ్‌కు గురైన ఫోన్‌ను తిరిగి ఎలా బాగుచేసుకోవాలో కీలక సూచనలు చేశారు. హ్యాకింగ్‌కు గురయ్యే ఫోన్ పనితీరు ఇలా ► ఫోన్ చార్జింగ్ చేసిన కాసేపటికే చార్జింగ్ డౌన్ కావడం లేదా వేగంగా బ్యాటరీ తగ్గి పోవడం ఫోన్ హ్యాకింగ్‌కు అత్యంత ముఖ్య మైన సంకేతం. మన ఫోన్లో ఏవైనా అనుమానాస్పద సాఫ్ట్వేర్లు బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతుంటే.. మన మొబైల్ ఫోన్‌ను తక్కువగా వాడినా, బ్యాటరీ మాత్రం అసాధరణంగా తగ్గిపోతుంది. ► మనకు తెలియని సోర్స్‌ల నుంచి కొత్తకొత్త యాడ్స్ వస్తుండటం, ఫ్లాష్ యాడ్స్ వస్తుండటం సైతం హ్యాకింగ్‌కు గురైనట్లు తెలిపే సూచిక. ► మనకు తెలియకుండానే బ్యాక్‌గ్రౌండ్ యాప్స్ రన్ అవడం, కొన్ని హిడెన్ యాప్స్ పనిచేస్తుండటంతో మొబైల్ ఫోన్ బాగా వేడెక్కుతుంది. ఇలా జరిగితే కూడా ఫోన్ హ్యాక్ అయినట్లు అనుమానించాలి. ► కొత్త నంబర్ల నుంచి తరచూ ఫోన్ కాల్స్ వస్తుండటం, టెక్సŠట్ మెసేజ్‌లలో వింత సింబల్స్, క్యారెక్టర్ల కాంబినేషన్స్‌తో రావడం గమనిస్తే ఫోన్ హ్యాక్ అయినట్లు గుర్తించాలి. ► మొబైల్‌ఫోన్ హ్యాక్ అయితే పనితీరు బాగా నెమ్మదిస్తుంది. ఫోన్‌కాల్ చేయడానికి, మెసేజ్‌లు ఓపెన్ కావడానికి, ఇతర యాప్‌లు పనిచేయడం నెమ్మదిగా జరుగుతుంది. ► ఫోన్లోని కెమెరా, మైక్రోఫోన్లు మనకు తెలియకుండానే యాక్టివ్ కావడం గమనిస్తే అనుమానించాల్సిందే. ► ఫోన్లోని స్క్రీన్‌లాక్, యాంటీ వైరస్ వంటి సెక్యూరిటీ ఫీచర్లన్నీ మనకు తెలియకుండానే డిసేబుల్ కావడం ఫోన్ హ్యాకింగ్ అయ్యిందనడానికి అత్యంత కీలకమైన మార్పుగా గుర్తించాలి. ఫోన్ హ్యాక్ అయితే ఏం చేయాలి..? ► ఏదైనా ఉత్తమమైన యాంటీ వైరస్ సాప్ట్‌వేర్‌ను ఇన్స్టాల్ చేసుకొని ఫోన్‌ను స్కాన్ చేయాలి. ► ఫోన్లో అనుమానాస్పద యాప్‌లను గమనిస్తే వాటిని వెంటనే డిలీట్ చేయాలి. ► ఫోన్ హ్యాక్ అయి, ఫోన్ నుంచి డేటా ట్రాన్స్ఫర్ అవుతున్నట్లు అనుమానిస్తే వెంటనే ఇంటర్నెట్ డేటా ఆఫ్ చేయాలి. వైఫై కనెక్షన్ తొలగించాలి. ఇలా చేయడం వల్ల హ్యాకర్లకు డేటా ట్రాన్స్ఫర్ ఆగిపోతుంది. ► ఫోన్ స్కీన్ర్ లాక్, యాప్ లాక్‌లు, ఈ–మెయిల్, సోషల్ మీడియా ఖాతాల పాస్‌వర్డ్‌లను మార్చేయాలి. ఇలా చేయడం వల్ల మన వ్యక్తిగత సమాచారం చోరీ కాకుండా అడ్డుకోవచ్చు. ► పైవన్నీ చేసినా ఫలితం లేనట్లు గుర్తిస్తే వెంటనే ఫోన్‌ను రీసెట్ చేయాలి. దీనివల్ల మాల్వేర్ అంతా పోవడంతోపాటు అను మాస్పద యాప్‌లు డివైస్ నుంచి తొలగి పోతాయి. అయితే మన వ్యక్తిగత సమా చారం, ఫొటోలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఈ జాగ్రత్తలు పాటిస్తే మేలు.. ► మొబైల్ ఫోన్లోని ఫొటోలు, వీడియో లు, ఇతర డేటాను, సోషల్ మీడియా ఖాతాల్లోని సమాచారాన్ని ఎప్పటిక ప్పుడు పెన్‌డ్రైవ్, ఇతర డివైస్‌లలో బ్యాకప్ చేస్తూ ఉండాలి. ఫోన్ హ్యాక్ అయినా వెంటనే దాన్ని రీసెట్ చేయొ చ్చు.ముందే బ్యాక్అప్ ఉంటుంది కాబ ట్టి డేటా పోయే ప్రమాదం ఉండదు. ► యాపిల్, ఆండ్రాయిడ్ ఫోన్లకు ఆరు అంకెల పాస్వర్డ్లు తప్పక పెట్టుకోవాలి. వాటిని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. ► కొత్త యాప్‌లు ఇన్స్టాల్ చేసే ముందు పూర్తిగా వాటికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలి. ► పబ్లిక్ వైఫైను వీలైనంత వరకు వాడకపోవడం ఉత్తమం. తప్పనిసరైతే వీపీఎన్ టూల్స్ ద్వారా వాడాలి. ఇలా చేయడం వల్ల మన డేటా ప్రైవేటు ఎన్క్రిప్టెడ్ చానల్ ద్వారా వెళ్తుంది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ ముగ్గురిపై కేసులు పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వ హయాంలో జరిగి న ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్, దుబ్బాక ఎన్నికల ఇన్చార్జ్గా ఉన్న మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు అప్పటి కలెక్టర్ వెంకటరామి రెడ్డిని ముద్దాయిలుగా చేర్చి కేసులు పెట్టాలని డీజీపీ రవిగుప్తాకు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు విజ్ఞప్తి చేశారు. ఈ ముగ్గురిపై విడివిడిగా ఒక్కో ఎఫ్ఐఆర్ పెట్టి, ఈ కేసులపై వెంటనే విచారణ జరిపి త్వరితంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వ్యవహారంపై స్పందించి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి, చీఫ్ జస్టిస్‌లకు కూడా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. దుబ్బా క ఉపఎన్నికతో పాటు, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తనతోపాటు, తన కుటుంబసభ్యుల ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేయడంపై చర్యలు తీసు కోవాలని కోరుతూ బుధవారం డీజీపీ ఆఫీసులో రవిగుప్తాకు వినతిపత్రం సమర్పించాక రఘునందన్‌రావు మీడియాతో మాట్లాడారు. ట్యాపింగ్‌పై సమగ్ర విచారణ జరిపించాలని డీజీపీని కోరానని, ఆవిధంగా జరగని పక్షంలో న్యాయస్థానాలను ఆశ్రయిస్తానని చెప్పారు. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికలప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అరెస్ట్ అయిన ప్రణీత్‌రావు చెప్పినట్టు మీడియాలో వచ్చిందని, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్పై చర్యలు తీసుకోవాలని డీజీపీకి విజ్ఞప్తి చేశామన్నారు. అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశాలు లేకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగే ప్రసక్తే లేదని రఘునందన్ స్పష్టం చేశారు. సినిమా పరిశ్రమలో ఉన్న వారితో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లను కొందరు ట్యాపింగ్ చేసి బెదిరింపులతో డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. హైకోర్టు జడ్జీల ఫోన్ సంభాషణలు విన్నారని కూడా తెలుస్తోందని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తెలంగాణకు వస్తున్నందున ఆయనకు ఫోన్ ట్యాపింగ్ విషయం ఇక్కడి న్యాయమూర్తులు తెలియజేయాలని కోరారు. -
నాకు పోటీ చేయడం ఇష్టం లేదని చెప్పా
సాక్షి, హైదరాబాద్: భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి తనను పోటీ చేయాల్సిందిగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కోరారని, గెలిపించుకునే బాధ్యత కూడా తీసుకుంటానని ఆయన చెప్పినా తనకు పోటీ చేయడం ఇష్టలేదని స్పష్టం చేశానని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలు రాజకీయంగా వెనుకబడి పోతున్నారని అభిప్రాయపడ్డారు. తెలంగాణకు చెందిన బీసీ నేత ఆర్.కృష్ణయ్యకు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం ద్వారా ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి బీసీలకు తగిన ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు. బీఆర్ఎస్నుద్దేశించి సీఎం రేవంత్ ఒక్క మాట మాట్లాడితే ఎగిరెగిరి పడిన ఆ పార్టీ నేతలు, ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతున్న మాటలకు, ఆయన భాషకు ఏం చెప్తారని ప్రశ్నించారు. కేటీఆర్‌కు ముసళ్ల పండుగ ముందుందని, బీఆర్ఎస్ ఆరిపోయే దీపమని వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ వెనక కేటీఆర్ ఉండి ఉంటారని అభిప్రాయపడ్డ మధుయాష్కీ.. ఈ కేసులో కేసీఆర్, కేటీఆర్‌లు ఎ1, ఎ2 అవుతారని జోస్యం చెప్పారు. ఎన్నికలకు ముందు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడాన్ని మాత్రమే తప్పు పట్టామని, కేజ్రీవాల్‌పై విచారణను ఏఐసీసీ తప్పు పట్టలేదని మధుయాష్కీ స్పష్టం చేశారు. -
రేవంత్‌ను చూసి ఎవరూ భయపడరు
సాక్షి, హైదరాబాద్: ‘అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రజల దృష్టిని మళ్లించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అంటున్నడు. ఎక్కడ జరిగిందో చెప్పకుండా యూట్యూబ్ చానళ్లు, మీడియాకు లీకులు ఇస్తూ ఏదో జరిగిందనే ప్రచారం చేస్తున్నడు. నీ చేతిలో అధికారం ఉంది కదా.. విచారణ చేసి తప్పులు ఎక్కడ జరిగాయో బయటపెట్టి బాధ్యులపై చర్యలు తీసుకో. ఎవడికీ భయపడేది లేదు. నువ్వు వెంట్రుక కూడా పీకలేవు. ఇలాంటి వాటిని చూసి కేడర్ ఆగం కావద్దు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. తెలంగాణ భవన్లో మంగళవారం సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘సెక్రటేరియట్లో లంకె బిందెలు లేవని చెబుతున్న రేవంత్ గతంలో ఏం చేసెటోడో తెలియదు. జేబులో కత్తెరలు పెట్టుకుని తిరుగుతున్న జేబుదొంగ రేవంత్.. పేగులు మెడలో వేసుకునేందుకు నువ్వేమైనా బోటీ కొట్టెటోడివా. మున్సిపల్ శాఖ బాధ్యతలు చూస్తున్న రేవంత్‌రెడ్డి మూడు నెలలుగా భవన నిర్మాణ అనుమతులు ఎందుకు ఇవ్వడం లేదు. పార్లమెంటు ఎన్నికల డబ్బుల కోసం రైస్ మిల్లర్లు, రియల్టర్లు, బిల్డర్లపై దాడులు చేసి బెదిరించి రూ.2500 కోట్లు జమ చేసి ఢిల్లీకి కప్పం కట్టిండు. ఇది దోపిడీ సొమ్ము కాదా. ఇలాంటివి బయటకు రాకుండా బర్లు, గొర్ల స్కీమ్‌లంటూ ప్రజల మెదళ్లలో తప్పుడు సమాచారం నింపేందుకు చానళ్లలో కేసీఆర్‌ను తిడుతూ దొంగ మాటలు చెప్తున్నడు’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు, కరెంటు, మహిళలకు రూ.2500, వృద్ధులకు రూ.4వేలు, కళ్యాణలక్ష్మితోపాటు తులం బంగారం ఇవ్వలేని ఇతనా మన సీఎం అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీజేపీలో మొట్టమొదట చేరేది రేవంత్ ‘కేంద్రంలో బీజేపీని ఆపే శక్తి, ధైర్యం కాంగ్రెస్‌కు లేవు. ఎన్నికల రేసులో ఎవరూ ఉండొద్దని మోదీ ప్రయత్నిస్తున్నారు. దేశంలో బలంగా ఉన్న ప్రాంతీయ నాయకులు కేసీఆర్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్ వంటి నేతలకు మాత్రమే బీజేపీని అడ్డుకునే శక్తి ఉంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోదీని చౌకీదార్ అంటే రేవంత్ మాత్రం బడేభాయ్ అంటున్నడు. అదానీ మంచివాడు కాదని రాహుల్ అంటే, రేవంత్ మాత్రం కౌగిలించుకుని ఫొటోలు తీసుకుంటుండు. లిక్కర్ స్కామ్ ఏమీ లేదు, కేజ్రీవాల్ అరెస్టు అక్రమం అని రాహుల్ అంటే, కవిత అరెస్టును ఇక్కడి సీఎం సమర్థిస్తాడు. కాంగ్రెస్‌లో రాహుల్ గాం«దీ, రేవంత్‌కు నడుమ పొంతన కుదరడం లేదు. దేశంలో పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ 40 సీట్లకు మించి గెలవదు. 40 సీట్లు దాటకుంటే వెంటనే తనతోపాటు మరికొందరిని మూటగట్టుకుని బీజేపీలో చేరే మొదటి వ్యక్తి రేవంత్‌రెడ్డి. ఈ విషయంలో ఎన్నిమార్లు ఆయనపై విమర్శలు చేసినా స్పందించక పోవడం వెనుక మతలబు ఇదే. జీవితకాలమంతా కాంగ్రెస్‌లో కొనసాగుతానని రేవంత్ చెప్పకపోవడమే దీనికి నిదర్శనం’ అని కేటీఆర్ పేర్కొన్నారు. కిషన్‌రెడ్డి సికింద్రాబాద్‌కు చేసిందేమీ లేదు.. ‘కాంగ్రెస్ కొన్ని యూట్యూబ్ చానళ్లను అడ్డుపెట్టుకుని అబద్ధాలు ప్రచారం చేస్తుంటే.. బీజేపీ రాముడి పేరును చెప్పి నాటకం ఆడుతోంది. ప్రతిపక్షాల నేతలపై కేసులతో గొంతు నొక్కి జైలుకు పంపి మానసికంగా వేధిస్తోంది. లిక్కర్ స్కామ్ బయట పెడతానని అంటున్న కిషన్‌రెడ్డి ఆధారాలను కోర్టుకు సమర్పించాలి. ఐదేళ్లుగా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి సికింద్రాబాద్‌కు చేసిందేమీ లేదు. పార్టీ మారిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు కోసం అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు. సమావేశంలో సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యరి్థ, ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తోపాటు పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
రీల్ కాదు.. ‘కాల్’ నాయక్!
సాక్షి, హైదరాబాద్: రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేసిన ‘నాయక్’ అనే సినిమాలో.. నాయక్ భాయ్‌గా మారిన కథానాయకుడు ఆ ప్రాంతానికి చెందిన అసాంఘిక శక్తుల్ని, రౌడీలను పిలిచి ఓ మీటింగ్ పెడతాడు. వారిని భయపెట్టి, దండించి వారు చేసిన నేరాలు, అలాగే వారు సంపాదించిన ఆస్తుల వివరాలు తెలుసుకుంటాడు. తర్వాత కొన్ని పత్రా లపై సంతకాలు చేయించడం ద్వారా వారి స్థిర చరాస్తులు అనాథాశ్రమాలకు చెందేలా చేస్తాడు. ఇందుకోసం ఓ స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసుకుంటాడు. ఈ రీల్ సీన్‌తో కొన్ని సారూప్యతలు ఉన్న రియల్ సీన్ ఒకటి గతంలో హైదరా బాద్ శివార్లలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. శివారు కమిషనరేట్ అప్పటి ఉన్నతాధికారి.. ఓ పార్టీకి విరాళాలు సేకరించి ఇచ్చేందుకు ఈ తరహా పద్ధతిని అనుసరించారు. నేను సైతం.. అనుకున్న ఈయన కూడా స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) నుంచి అందిన ఫోన్ ట్యాపింగ్ రికార్డుల్ని ఆధారంగా చేసుకున్నారు. పలువురు వ్యాపారు లను వేర్వేరుగా తమ ప్రాంతానికి పిలిపించారు. ఎవరి రికా ర్డులు వారికి వినిపించి ‘కప్పం’ కట్టేలా చేశారు. ఇందులో ఓ అధికారి నేతృత్వంలోని స్పెషల్ టీమ్ కీలకంగా వ్యవహరించినట్లు తెలిసింది. దీనిపై సిట్ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారని సమాచారం. టార్గెట్లు నిర్దేశించి మరీ.. ఎస్ఐబీ, టాస్క్‌ఫోర్స్‌ల్లో ఓఎస్డీలుగా పని చేసిన టి.ప్రభా కర్రావు, పి.రాధాకిషన్‌రావు ట్యాపింగ్‌లో వెలుగులోకి వచ్చి న అంశాల ఆధారంగా బెదిరింపు వసూళ్లకు, విరాళాల సేకరణకు తెగబడినట్టుగా సిట్ ఇప్పటికే గుర్తించింది. ఓపక్క వీరి వ్యవహారాలు ఇలా సాగుతుండగా.. శివారు ప్రాంత కమిషనరేట్ ఉన్నతాధికారి కూడా తన వంతుగా ఎంతోకొంత చేయాలని భావించారు. ప్రభాకర్‌రావు నుంచి తనకు అందిన ట్యాపింగ్ రికార్డులను విశ్లేషించి, అవతలి వ్యక్తులను సంప్రదించడానికి వీలుగా స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేశా రు. వీరిలో ఫార్మా వ్యాపారులు, బిల్డర్లు, రియల్టర్లతో పాటు సాఫ్ట్వేర్ కంపెనీలకు చెందిన వాళ్లూ ఉన్నట్టు సమాచారం. కాగా స్పెషల్ టీమ్‌కు నేతృత్వం వహించిన అధికారి తన సిబ్బందితో ఆయా వ్యాపారులు, బిల్డర్లు, రియల్టర్లు నిర్దేశించిన సమయాల్లో మీటింగ్‌కు వచ్చేలా ఒత్తిడి చేసేవారు. ఇలా వచ్చిన వారితో సమావేశమయ్యే శివారు ఉన్నతాధికారి ట్యా పింగ్ ఆడియోలను వినిపించే వారు. అందులోని సున్నిత, వ్యక్తిగత అంశాలు ప్రస్తావించి వాళ్లు ఇవ్వాల్సిన మొత్తానికి సంబంధించి టార్గెట్లు ఇచ్చేవారు. వారు ఎప్పుడు? ఎలా? ఎవరికి? ఆయా మొత్తాలు చెల్లిస్తారో అప్పటికప్పుడే తెలుసు కునేవారు. ఇక వారి వెంటపడి వసూలు చేసే బాధ్యతల్ని స్పెషల్ టీమ్ ఇన్చార్జికి అప్పగించేవారు. కాగా ఇలా వసూ లైన మొత్తం ఓ పార్టీకి విరాళంగా అందినట్లు సమాచారం. తిరుపతన్నకు ‘ద్వితీయ శ్రేణి’ బాధ్యతలు నాటి ప్రతిపక్ష నేత, ఆయన కుటుంబీకులతో పాటు మరికొందరు కీలక వ్యక్తులకు సంబంధించిన ఫోన్ల ట్యాపింగ్‌ను ప్రభాకర్‌రావు నేతృత్వంలోని ప్రణీత్‌రావు టీమ్ చేపట్టింది. అయితే ప్రతిపక్ష నేత లేదా ఆ స్థాయిలో ప్రాధాన్యం లేని, ద్వితీయ శ్రేణికి చెందిన వారి నంబర్లు ట్యాప్ చేసే బాధ్యతల్ని తిరుపతన్న తన బృందంతో కలిసి నిర్వర్తించినట్లు సిట్ చెప్తోంది. ఆ వ్యక్తుల్ని, వారి నంబర్లు గుర్తించే బాధ్యతల్ని టాస్క్‌ఫోర్స్‌లో ఉన్న పి.రాధాకిషన్‌రావు నిర్వర్తించారు. తన టీమ్ ద్వారా ఇతర మార్గాల్లో వివరాలను సేకరించే ఈయన, వాటిని తిరుపతన్నకు అందించేవారు. వీటిపై ప్రభాకర్‌రావుకు సమాచారం ఇచ్చే తిరుపతన్న ట్యాపింగ్ రికార్డులను కూడా ప్రభాకర్‌రావుకే అందించేవారని తెలిసింది. ప్రాథమిక విచారణలోనే ఈ విషయం గుర్తించిన సిట్ అధికారులు తిరుపతన్న నేరాంగీకార వాంగ్మూలంలోనూ దాన్ని పొందుపరిచినట్లు సమాచారం. ప్రభాకర్‌రావు టీమ్ గత ఏడాది కర్ణాటక ఎన్నికల సమయంలో అక్కడి కాంగ్రెస్ నాయకుల ఫోన్లనూ ట్యాప్ చేసినట్లు సమాచారం. దీనికోసం కొన్నాళ్లు బెంగళూరుతో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండి వచ్చినట్లు తెలిసింది. పరిచయస్తులకు ప్రభాకర్‌రావు ఫోన్లు! ప్రస్తుతం అమెరికాలో తలదాచుకున్న ప్రభాకర్‌రావు తనకు పరిచయం ఉన్న పలువురు అధికారులకు ఫోన్లు చేస్తున్నట్లు తెలిసింది. ట్యాపింగ్ వ్యవహారంలో తన ఒక్కడినే బాధ్యుణ్ణి ఎలా చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారని సమాచారం. ట్యాపింగ్ జరిగిన సమయంలో తాను రెగ్యులర్ అధికారిని కాదని, పద వీ విరమణ తర్వాత ఎక్స్‌టెన్షన్‌పై ఉన్న ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) మాత్రమే అని చెప్తున్నట్లు సమాచారం. తాను ఓఎస్డీగా ఉన్న సమయంలో నిఘా విభాగాధిపతు లుగా పని చేసిన అదనపు డీజీలు, అప్పటి డీజీపీలు సైతం బాధ్యులే అని, వారికి తెలిసే ఎస్ఐబీ కేంద్రంగా వ్యవహారా లు సాగినట్లుగా వాదిస్తున్నారని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నల్ని తదుపరి విచారణ నిమిత్తం 5 రోజుల కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరుతూ పంజగుట్ట పోలీసులు మంగళవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పుత్రరత్నం లీలలు.. ట్యాపింగ్ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించి, తన హవా చెలాయించిన ఉన్నతాధికారి పుత్రరత్నం లీలలు తాజాగా బయటకు వస్తున్నాయి. తన తండ్రి పలుకుబడిని వినియోగించి ఇతను తన రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని భారీగా విస్తరించుకున్నట్లు తెలు స్తోంది. అంతేకాకుండా శివారు పోలీసులకు మన‘శ్శాంత్’ లేకుండా చేసినట్లు సమాచారం. నగరం వెలుపల ఇతను ఓ ఫామ్‌హౌస్ ఏర్పాటు చేసుకోగా.. అక్కడి నిర్మాణాలు, జనరేటర్‌తో పాటు నాటిన మొక్కలు సైతం పోలీసుల ‘సౌజన్యమే’ అని తెలుస్తోంది. ఏదైనా కావాలనుకున్నప్పుడు ఈ పుత్రరత్నం తండ్రికి ఫోన్ చేసి చెప్పేవాడు. ఆయన తన కార్యాలయం ల్యాండ్ లైన్ నుంచి ఏదో ఒక పోలీసు అధికారికి ఫోన్ చేసి, తన కుమారుడు ఫోన్ చేస్తాడని చెప్పేవారు. ఆ తర్వాత వారికి ఫోన్ చేసే సుపుత్రుడు తన డిమాండ్ చెప్పి పీడించి మరీ నెరవేర్చుకునేవాడని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇతడికి ఓ డీఎస్పీ స్థాయి అధికారి షాక్ ఇచ్చాడని తెలిసింది. ఈయనకు ఫోన్ చేసిన సుపుత్రుడు ఐదు జేసీబీలు, ఐదు టిప్పర్లు ఫామ్‌హౌస్ వద్దకు పంపాలంటూ హుకుం జారీ చేశారని, దీంతో ఆ డీఎస్పీ ‘డబ్బు ఎవరు ఇస్తారు? ఎంత డిస్కౌంట్ కావాలి?’ అంటూ ప్రశ్నించడంతో ఫోన్ పెట్టేశారని సమాచారం. -
సీఎం రేవంత్ ఇంటి దగ్గరే సెటప్.. ఫోన్ ట్యాపింగ్ లో సంచలన విషయాలు
-
రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు.. అసలు ట్యాపింగ్ అంటే ఏంటీ?
-
ఫోన్ ట్యాపింగ్ కేసు: ప్రభాకర్‌రావే కీలక సూత్రధారి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావును ఏ1గా నిందితుడిగా పోలీసులు చేర్చారు. ఏ1 ప్రభాకర్‌రావు, ఏ2 ప్రణీత్‌రావు, ఏ3 రాధాకిషన్, ఏ4 భుజంగరావు ఏ5 తిరుపతన్న, ఏ6 ప్రైవేట్ వ్యక్తి పేరును చేర్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావే కీలక సూత్రధారి అని పోలీసులు గుర్తించారు. ప్రభాకర్‌రావు కనుసన్నల్లోనే ట్యాపింగ్ జరిగిందని తెలిపారు. ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకే ట్యాపింగ్ డివైజ్‌లు ధ్వంసం చేశారు. ప్రభాకర్‌రావు చెప్పిన మేరకే హార్డ్ డిస్క్‌లను ప్రణీత్‌రావు ధ్వంసం చేశాడని చెప్పారు. ప్రణీత్‌రావు ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్‌లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెడిపోయిన ట్యాపింగ్ డివైజ్‌ను పోలీసులు రిట్రీవ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. హార్డ్ డిస్కుల నుంచి సమాచారాన్ని పోలీసులు రిట్రీవ్ చేస్తున్నారు. చదవండి: ఫోన్ ట్యాపింగ్ కేసు: ఇద్దరు అదనపు ఎస్పీలకు రిమాండ్ -
ట్యాపింగ్ వీరుడు.. డేటా చోరుడు.. బాబే
సాక్షి, అమరావతి : ఈ ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమని తేలిపోవడంతో ఈనాడు రామోజీరావు బెంబేలెత్తుతున్నారు. అందుకే టీడీపీ ఓటమికి ఇప్పటి నుంచే కుంటిసాకులు వెతికే పనిలో పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం టీడీపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తోందంటూ చిత్తకార్తి రాతలు రాస్తూ వైఎస్సార్సీపీపై దుష్ప్రచార కుట్రకు తెరతీశారు. పచ్చ పైత్యం సోకి రామోజీరావుకు ఉద్దేశపూర్వక మతిమరుపు వచ్చిందేమోగానీ... రాష్ట్ర ప్రజలకు మాత్రం అన్నీ గుర్తున్నాయి. రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ప్రభుత్వం ఫోన్ల ట్యాపింగ్‌కు పాల్పడటం, ఓటర్ల వ్యక్తిగత డేటా చౌర్యానికి బరితెగించడం అంతా ప్రజలకు గుర్తుంది. ఫోన్ల ట్యాపింగ్ కోసం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ఇజ్రాయెల్ వెళ్లి మరీ అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్‌వేర్‌ను కొన్నారన్నది బహిరంగ రహస్యమే. చంద్రబాబు బాగోతాన్ని శాసన సభ ఉప సంఘం కూడా నిగ్గు తేల్చింది. మరోవైపు చంద్రబాబు పెగసస్ కంపెనీ నుంచి ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ కొన్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే స్వయంగా ఆ రాష్ట్ర శాసన సభలో వెల్లడించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏ పోలీసు అధికారీ ఇజ్రాయెల్ వెళ్లలేదు. ఎలాంటి సాఫ్ట్వేర్ కొనలేదు. వీటన్నింటినీ మరుగున పరుస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే ధ్యేయంగా ఈనాడులో ఓ కట్టుకథ రాశారు. అసలు వాస్తవాలేమిటంటే... ట్యాపింగ్ చరిత్ర బాబుదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఫోన్ ట్యాపింగ్ అనే జాడ్యానికి ఆద్యుడు చంద్రబాబే. 2004 ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ప్రతిపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్ కోసం ఏకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అప్పటి ఇంటెలిజెన్స్ విభాగంలో ఓ కీలక అధికారిని, మరో పోలీసు ఉన్నతాధికారిని అందుకోసం ప్రత్యేకంగా నియమించారు. ప్రతిపక్ష నేత నుంచి ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల వరకూ అందరి ఫోన్ల ట్యాపింగ్‌కు పాల్పడ్డారు. ఆ కుట్రలో భాగస్వామి అయిన ఆ పోలీసు ఉన్నతాధికారికి 2014లో చంద్రబాబు మళ్లీ సీఎం అయిన తరువాత రాష్ట్ర పోలీస్ బాస్‌గా పోస్టింగ్ ఇచ్చారు కూడా. భద్రతా చట్టాలను ఉల్లంఘించి మరీ పెగసస్ సాఫ్ట్వేర్ కొన్న చంద్రబాబు రాష్ట్ర విభజన తరువాత 2014లో ఆంధ్రప్రదేశ్‌కు సీఎం అయిన చంద్రబాబు మరోసారి ఫోన్ ట్యాపింగ్ అక్రమాలకు పాల్పడ్డారు. ప్రధానంగా తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు వ్యవహారంలో ‘మా వాళ్లు బ్రీఫ్డ్ మీ’ అంటూచంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. రాత్రికి రాత్రే విజయవాడకు మకాం మార్చేశారు. ఇక్కడ ఆయన మరోసారి ఫోన్ ట్యాపింగ్‌పై దృష్టి సారించారు. అందుకోసం అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు నేతృత్వంతో ప్రత్యేకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ నేతల ఫోన్లు ట్యాపింగ్‌తోపాటు ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడటం ఆ వ్యవస్థ లక్ష్యం. ఐటీ గ్రిడ్స్ అనే ప్రైవేటు కంపెనీ, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కుమారుడు కూడా భాగస్వామిగా ఉన్న ఆకాశ్ ఎంటర్‌ప్రైజస్ కంపెనీల ద్వారా ఏరోస్టాట్ బెలూన్లు, ఇతర ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ కొనుగోలుకు పెగసస్‌తో సంప్రదింపులు జరిపారు. అందుకోసం ఏబీ వెంకటేశ్వరరావు బృందం ఇజ్రాయెల్‌లో పర్యటించింది. పెగసస్ సంస్థతో సంప్రదింపులు జరిపింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం విదేశీ కంపెనీల నుంచి ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ కొనాలంటే రక్షణ శాఖ అనుమతి తప్పనిసరి. ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ ఉగ్రవాద సంస్థలకు చిక్కితే దేశంలో విధ్వంసకర కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉన్నందువల్ల దేశ భద్రత దృష్ట్యా ఈ నిబంధన విధించారు. కానీ, జాతీయ భద్రత చట్టాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఉల్లంఘించింది. రక్షణ శాఖకు సమాచారం ఇవ్వకుండానే పెగసస్ కంపెనీతో సంప్రదింపులు జరిపింది. ఐటీ గ్రిడ్స్ కంపెనీ ద్వారా ఫోన్ ట్యాపింగ్ పరికరాలను కొనుగోలు చేసి దిగుమతి చేసుకుంది. అందుకోసం నిధులు కూడా చెల్లించింది. రూ.25 కోట్లతోచంద్రబాబు పెగసస్ సాఫ్ట్వేర్ కొన్నారు: మమత ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం రూ.25 కోట్లు వెచ్చించి పెగసస్ నుంచి అక్రమంగా ఫోన్ ట్యాపింగ్, డేటా చౌర్యం సాఫ్ట్వేర్ కొన్నారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్వయంగా ప్రకటించడం జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. 2022లో పశ్చిమ బెంగాల్ శాసనసభలో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ డేటా చౌర్యం సాఫ్ట్వేర్ కొనాలని పెగసస్ కంపెనీ ప్రతినిధులు తనను సంప్రదించారని వెల్లడించారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఆ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసిందని, మీరు కూడా కొనాలంటూ ఆ సంస్థ ప్రతిపాదించిందని తెలిపారు. చట్ట విరుద్ధమైన ఆ పనిని తాను చేయలేనని తిరస్కరించానని మమతా బెనర్జీ చెప్పారు. ఇవన్నీ చంద్రబాబు కుతంత్రాలను బయటపెట్టే వాస్తవాలు. వీటిని ఏనాడూ ప్రశ్నించని రామోజీరావు.. ఇప్పుడు మాత్రం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఫోన్ల ట్యాపింగ్‌కు పాల్పడకపోయినా, ఓ అసత్య కథనాన్ని ప్రజల్లోకి వదిలి, టీడీపీ ఓటమికి ఓ కుంటిసాకును సిద్ధం చేసుకున్నారు. యథేచ్ఛగా ఫోన్ ట్యాపింగ్..35 లక్షల మందిడేటా చౌర్యం అక్రమంగా కొన్న ఫోన్ ట్యాపింగ్, డేటా చౌర్యం సాఫ్ట్‌వేర్‌తో చంద్రబాబు ప్రభుత్వం బరితెగించింది. అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌తోపాటు వైఎస్సార్సీపీకి చెందిన 65 మంది నేతల ఫోన్ల ట్యాపింగ్‌కు పాల్పడింది. దీనిపై పూర్తి ఆధారాలతో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2019 ఎన్నికలకు ముందు వివిధ కేసుల దర్యాప్తు ముసుగులో ఏకంగా వైఎస్సార్సీపీకి చెందిన 150 మంది ఫోన్లను ట్యాప్ చేయడం చంద్రబాబు దుర్మార్గ రాజకీయాలకు నిదర్శనం. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన ప్రజా సాధికార సర్వే ద్వారా సేకరించిన ఓటర్ల డేటా (సమాచారం) మొత్తాన్ని టీడీపీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం రూపొందించిన ‘సేవా మిత్ర’ యాప్‌కు అనుసంధానించారు. రాష్ట్రంలోని ఓటర్ల వ్యక్తిగత సమాచారం చౌర్యానికి పాల్పడ్డారు. మరోవైపు టీడీపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్న 35 లక్షల మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు కుట్ర పన్నారు. ఈ కుట్రకు వ్యతిరేకంగా అప్పట్లోనే వైఎస్సార్సీపీ ఆందోళనలు చేసింది. పోలీసులు, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పూర్తి ఆధారాలతో ఫిర్యాదులు చేసింది. నిగ్గు తేల్చిన శాసనసభ ఉప సంఘం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ ప్రభుత్వ డేటా చౌర్యంపై విచారణకు సభా సంఘాన్ని నియమించింది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి నేతృత్వంలోని ఈ కమిటీ హోం, ఆర్థిక, సమాచార–పౌర సంబంధాల శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులను విచారించింది. అప్పటి సీఎం చంద్రబాబు ఆదేశాలతోనే తాము ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని టీడీపీ సేవామిత్ర యాప్‌నకు బదిలీ చేశామని ఆ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇజ్రాయెల్ నుంచి ఫోన్ ట్యాపింగ్, డేటా చౌర్యం సాఫ్ట్‌వేర్‌ను అక్రమంగా కొన్న మాట వాస్తవమేనని, అందుకే ఆ దేశంలో పర్యటించామని తెలిపారు. ఈ వ్యవహారంపై ఉప సంఘం మధ్యంతర నివేదికను కూడా శాసనసభకు సమర్పించింది. -
అజ్ఞాతంలోకి ప్రభాకర్‌రావు!
సాక్షి, హైదరాబాద్: అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కర్త, కర్మ, క్రియగా వ్యవహరించిన స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు అజ్ఞాతంలోకి వెళ్లినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈయన ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు భావిస్తున్నారు. ప్రణీత్ రావు కేసును అక్కడి నుంచే నిశితంగా గమనిస్తున్న ప్రభాకర్‌రావు.. అతని పోలీసు కస్టడీ ముగిసిన తర్వాత హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోపక్క సిట్ అధికారులు ప్రణీత్ రావును ఐదో రోజైన గురువారమూ బంజారాహిల్స్ ఠాణాలో ప్రశ్నించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా మరో నలుగురు పోలీసులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. వీళ్లు గతంలో ‘ప్రభాకర్‌రావు సైన్యం’లో కీలక సభ్యులని సమాచారం. హోదా ఏదైనా బాధ్యత మాత్రం చీఫే రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొన్నాళ్లు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) డీసీపీగా పని చేసిన ప్రభాకర్‌రావును ప్రభుత్వం ఏరికోరి ఎస్ఐబీకి డీఐ జీని చేసింది. ఐజీగా పదోన్నతి పొందినా అక్కడే కొనసాగారు. చివరకు 2020లో పదవీ విరమణ చేసిన ప్రభాకర్‌రావును నాటి ప్రభుత్వం ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా నియమించింది. హోదా ఏదైనా ఎస్ఐబీ చీఫ్‌గానే కొనసాగారు. ఇలా ఏళ్లుగా అక్కడ పాతుకుపోయిన ప్రభాకర్‌రావు తనకంటూ ఓ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గత ఎన్నికల నేపథ్యంలోనే అడ్డదారి ఎస్ఐబీలో 2017 వరకు లీగల్ ఇంటర్సెప్షన్ (ఎల్ఐ)గా పిలిచే అధికారిక ట్యాపింగ్ మాత్రమే జరిగింది. అయితే ఆ తర్వాత ఎన్నికలు సమీపిస్తుండటం, ప్రతిపక్ష పార్టీలు పుంజుకోవడం గమనించిన ప్రభాకర్‌రావు, అప్పటి కొందరు కీలక రాజకీయ నాయకులు.. అక్రమ ట్యాపింగ్‌పై దృష్టి పెట్టారు. అయితే ప్రతిపక్ష నేతలు తరచుగా వేర్వేరు నంబర్లతో సంప్రదింపులు జరుపుతుండటంతో ప్రభాకర్‌రావు బృందం రష్యా, ఇజ్రాయెల్‌లో పర్యటించి వచ్చింది. ఆయా దేశాల్లో అందుబాటులో ఉన్న ఆధునిక ట్యా పింగ్, ఇతర నిఘా పరికరాలను పరిశీలించి వచ్చింది. ఏవేవి ఖరీదు చేయాలో చెప్పాల్సిందిగా పేర్కొంటూ కొందరు పెద్దలకు నివేదిక సమర్పించింది. కొనుగోలులో కీలక పాత్ర పోషించిన రవి పాల్ టెక్నికల్ అనుభవం ఉన్న రవి పాల్ అనే నిపుణుడు గతంలో ఇంటెలిజెన్స్ విభాగానికి కన్సల్టెంట్, అడ్వైజర్‌గా పని చేశారు. ప్రభాకర్‌రావుతో పాటు కొందరు కీలక అధికారులతో సన్నిహితంగా మెలిగారు. రవి పాల్ సూచనల మేరకు ప్రభాకర్‌రావు ఇజ్రాయెల్ నుంచి సూట్‌కేస్‌లో ఇమిడిపోయి ఉండే అక్రమ ట్యాపింగ్ పరికరం ఖరీదు చేశారు. దీన్ని ప్రణీత్‌రావు టీమ్ ఓ వాహనంలో పెట్టుకుని టార్గెట్ చేసిన వ్యక్తి ఇల్లు, కార్యాలయం సమీపంలో మాటు వేసేది. ఈ పరికరానికి 300 మీటర్ల పరిధిలో ఉన్న ప్రతి ఫోన్ ద్వారా జరిగే కమ్యూనికేషన్ తెలుసుకునే సామర్థ్యం ఉంది. ‘ఆదిలాబాద్’కోసం వినియోగించారు 2018లో ఆదిలాబాద్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతారణం నెలకొన్న సమయంలోనూ ఎస్ఐబీ అధికారులు ఈ బ్రీఫ్‌కేస్ ఉపకరణాన్ని వినియోగించారు. రెండు వర్గాలకు చెందిన కీలక నేతలు ఇద్దరిని పట్టుకోగలిగారు. ఈ వ్యవహారాల్లో ప్రణీత్ రావుకు కుడిభుజంగా వ్యవహరించిన ఆరుగురు అధికారులను సిట్ గుర్తించింది. వీరిలో ఇద్దరి నుంచి ఇప్పటికే వాంగ్మూలాలు నమోదు చేయగా.. మరో నలుగురికి విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. -
ప్రణీత్ రావు పిటిషన్.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ట్యాపింగ్ కేసు నిందితుడు ప్రణీత్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. ప్రణీత్ రావు పిటిషన్‌పై వాదనలు ముగిసిన అనంతరం తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ సందర్భంగా వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, పంజాగుట్ట ఇన్స్పెక్టర్ శోభన్ హాజరయ్యారు. హైకోర్టులో ప్రణీత్ రావు తరపు న్యాయవాది గండ్ర మోహన్ రావు వాదనలు వినిపించారు. ‘ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రణీత్ రావును ఆక్రమంగా అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టు వాస్తవ అంశాలను పరిగణలోకి తీసుకోకుండా పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 వరకు విచారిస్తున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరగాలి. కానీ అలా జరగడం లేదు. ప్రణీత్ రావుకు ప్రతి రోజు మెడికల్ చెక్అప్ చేయించాలి. కస్టడీలో దర్యాప్తు విషయాలు మీడియాకు చెపుతున్నారు.కస్టడీ ఇప్పటికే నాలుగు రోజులు అయ్యింది. పోలీస్ స్టేషన్లో నిద్ర పోవడానికి ఎలాంటి సౌకర్యాలు లేవు’అని న్యాయవాది గండ్ర మోహన్‌రావు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు వాదనలు వినిపించారు. ‘24 గంటలు ప్రణీత్ రావు ను పోలీస్ కస్టడీ లోకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. పోలీస్ స్టేషన్ లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మీడియా కు ఎలాంటి లీకులు ఇవ్వడం లేదు. ప్రణీత్ రావు అరెస్ట్ 13 మార్చిన మాత్రమే డీసీపీ ప్రెస్‌నోట్ ఇచ్చాడు. పోలీస్ అధికారులు మీడియాకు లీకులు ఇస్తారని చెప్పడం సరైంది కాదు. జూబ్లీహిల్స్ ఏసీపీ ఈ కేసులో ఐవో అధికారిగా ఉన్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణ చేస్తున్నాం. అడిషనల్ ఎస్పీ రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయ్యింది. అడిషనల్ ఎస్పీ రమేష్ ఎక్కడ కూడా ఈ కేసులో జోక్యం చేసుకోలేదు. ప్రణీత్ రావు బంధువులు అనుదీప్ అతని కౌన్సిల్ వాసుదేవన్ రోజు కలుస్తున్నారు. ఇంకా మూడు రోజులు ప్రణీత్ రావు పోలీస్ కస్టడీ ఉంది. దర్యాప్తు దశలో ఉన్న కేసులో ఇప్పుడు పిటిషన్ వేయ్యడం కరెక్ట్ కాదు. ప్రణీత్ రావు వేసిన పిటిషన్‌ను కొట్టివేయాలి’అని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసినట్లు పేర్కొంది. ట్యాపింగ్ కేసు నిందితుడు ప్రణీత్‌రావు.. కస్టడీ విషయంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించడం లేదని.. కస్టడీ ముగిసిన వెంటనే జైలుకు తరలించేలా ఆదేశాలివ్వాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. అలాగే.. తనకు సరైన సదుపాయాలు కల్పించడం లేదంటూ పిటిషన్లో ఆరోపించారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు... వెలుగులోకి సంచలన నిజాలు
-
అన్ని వేళ్లూ అటు వైపే!
సాక్షి, హైదరాబాద్: అక్రమ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు ‘సైన్యానికి’, నల్లగొండ జిల్లాకు లింకు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వాళ్లు గతంలో ఆ ఉమ్మడి జిల్లాలో పని చేసిన వాళ్లే కావడం గమనార్హం. పోలీసు కస్టడీలో ఉన్న మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును సిట్ అధికారులు మూడో రోజైన మంగళవారమూ బంజారాహిల్స్ ఠాణాలో ప్రశ్నించారు. మరోపక్క ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న ఇద్దరు ఇన్స్పెక్టర్లను సిట్ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ప్రభాకర్‌రావు 2014కు ముందు ప్రాధాన్యత కలిగిన పోస్టింగ్స్ చాలా తక్కువ చేశారు. అలాంటి వాటిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎస్పీ కూడా ఒకటి. ప్రభాకర్‌రావుకు ప్రణీత్ అక్కడే పరిచయమైనట్లు తెలిసింది. అతడితోపాటు ఎస్ఐబీ కేంద్రంగా ప్రభాకర్‌రావుకు, కొందరు రాజకీయ నాయకులకు ప్రైవేట్ సైన్యంలా పని చేసిన అనేక మంది అధికారులు ఆయన హయాంలో నల్లగొండ జిల్లాలో పని చేసిన వాళ్లే అని పోలీసులు చెబుతున్నారు. అలా తనకు నమ్మకస్తులుగా మారిన కొందరిని ప్రభాకర్‌రావు ఎస్ఐబీ చీఫ్‌గా మారిన తర్వాత ఆ విభాగంలోకి తెచ్చుకున్నారు. వీళ్లందరూ అక్రమ ట్యాపింగ్‌లో కీలక పాత్ర పోషించారని సమాచారం. ఇలాంటి అధికారుల్లో ఇద్దరు ఇన్స్పెక్టర్లు ప్రస్తుతం వరంగల్ పరిధిలో పని చేస్తున్నారు. విదేశాల నుంచి సాఫ్ట్వేర్లు... ప్రభాకర్‌రావుతోపాటు ఓ కీలక రాజకీయ నేత ఆదేశాల మేరకు ప్రణీత్‌రావు అండ్ టీమ్ సర్వీస్ ప్రొవైడర్లతో సంబంధం లేకుండానే అక్రమంగా ట్యాపింగ్ చేసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. దీనికోసం ప్రత్యేక సాఫ్ట్వేర్లను విదేశాల నుంచి ఖరీదు చేసి ఉంటారని భావిస్తున్నారు. ఎస్ఐబీ కార్యాలయంలో ప్రణీత్ ఏర్పాటు చేసుకున్న 17 కంప్యూటర్లలో ఈ సాఫ్ట్వేర్లు ఉండొచ్చని, ఆ విషయం బయటకు రాకూడదని సంబంధిత హార్డ్‌డిస్క్‌లను ధ్వంసం చేసి నగర శివార్లలోని అటవీ ప్రాంతంలో పారేసినట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ప్రణీత్‌కు ఇన్ఫార్మర్గా పని చేసి, అతడితో కలిసి బెదిరింపు వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ మీడియా సంస్థ యజమాని ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రణీత్ ఎస్ఐబీ కార్యాలయంలోపాటు సదరు మీడియా సంస్థ ఆఫీస్, వరంగల్, సిరిసిల్లలోనూ కొన్ని కంప్యూటర్లు, సర్వర్లు ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓ కీలక రాజకీయ నాయకుడి ఆదేశాల మేరకు మరో నేత సహకారంతో ఇవి ఏర్పాటు చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇవి ఆయా ప్రాంతాల్లో ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అక్కడ ఉంచి ఏం చేశారు? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజం ఒప్పుకున్న ప్రణీత్
-
ట్యాపింగ్‌లో ఇద్దరు ఉన్నతాధికారుల పాత్ర!
-
ఇంకా రహస్య ప్రదేశంలోనే ప్రణీత్ రావు!
సాక్షి, హైదరాబాద్: ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రహస్య ప్రదేశంలో ప్రణీత్‌రావును పోలీసులు విచారిస్తున్నారు. ఎస్ఐబీలోని హర్డ్ డిస్క్‌లు ధ్వంసం, రికార్డుల మాయం వ్యవహారంలో పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్ఐబీలో కీలకంగా పనిచేసిన మాజీ ఐపీఎస్ ప్రభాకరరావు పాత్రపై పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల విచారణకు సహకరించని ప్రణీత్‌రావు.. అధికారుల ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటున్నట్లు సమాచారం. ప్రణీత్‌రావు సెల్ ఫోన్ సీజ్ చేసిన పోలీసులు.. వాట్సాప్ చాటింగ్, కాల్ డీటెయిల్స్, డేటా రీట్రీవ్ చేయనున్నారు. ప్రణీత్ రావు ఎవరి ఫోన్లు టాపింగ్ చేశాడనే సమాచారాన్ని పోలీసులు రాబడుతున్నారు. ఫోన్ టాపింగ్ చేసిన వివరాలను ఎప్పటికప్పుడు ఓ ఉన్నతాధికారికి పంపినట్టు పోలీసులు గుర్తించారు. ఎస్ఐబీలో ప్రణీత్‌రావుకు ప్రభాకర్ రావు ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు. ప్రణీత్ రావుకు సహకరించిన అధికారులకు నోటీసులు ఇవ్వనున్న పంజాగుట్ట పోలీసులు విచారణ పిలవనున్నారు. ప్రణీత్‌రావు కేసును సీఐడీకి లేదా సిట్‌కు బదిలీ చేసే అవకాశం ఉంది. ప్రణీత్ రావు భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నాయకుల ఫోన్ నంబర్లను టాపింగ్ చేసిన ప్రణీత్ రావు.. ప్రధాన ప్రతిపక్ష నాయకులు, వారి అనుచరుల కదలికలపై ప్రణీత్‌రావు బృందం నిరంతరం నిఘా పెట్టారు. హైదరాబాద్ నుంచి ఎవరు డబ్బులు తరలించిన ప్రణీత్‌రావుకి ముందే సమాచారం తెలిసేది.. ఆ జిల్లా పోలీసులకి ప్రణీత్ రావు ముందే సమాచారం అందిందేవాడని పోలీసులు గుర్తించారు. -
అదానీ కోసమే ఫోన్ ట్యాపింగ్: మోదీ సర్కార్‌పై రాహుల్ ధ్వజం
న్యూఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్ అంశం అధికార బీజేపీ, ప్రతిపక్షాల మధ్య పొలిటికల్ హీట్ పెంచుతోంది. విపక్ష ఎంపీలకు యాపిల్ నుంచి వార్నింగ్ మెసెజ్‌లు రావడంతో నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అల్గారిథమ్ లోపం యాపిల్ నుంచి ఈ సందేశాలు వస్తున్నట్లు కేంద్రం చెబుతోంది. ఇక కేంద్రం సమాధానంపై శివసేన (ఉద్ధవ్ వర్గం) ఎంపీ ప్రియాంక చతుర్వేది సెటైర్లు వేశారు. ప్రతిపక్షాల ఫోన్లలో మాత్రమే యాపిల్ అల్గారిథమ్ పనిచేయకపోవడం హాస్యాస్పందంగా ఉందన్నారు. కేంద్రంలోని మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. విపక్ష ఎంపీలు, నేతలపై కేంద్రం నిఘా పెట్టిందని రాహుల్ ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్‌లు అవుతున్నాయని తెలిపారు. ప్రశ్నించేవారి నోళ్లు నొక్కేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. అదానీ కోసమే ఫోన్ ట్యాంపింగ్‌లు చేస్తున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాంపింగ్‌లకు భయపడేది లేదని స్పష్టం చేశారు. కావాలంటే తన ఫోన్ ఇస్తానని, తీసుకోవాలని సవాల్ విసిరారు. కాగా పలువురు విపక్ష నేతల ఫోన్లకు యాపిల్ సంస్థల నుంచి వార్నింగ్ మెయిల్స్ వచ్చాయి. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, శివసేన(ఉద్దవ్ వర్గం) ఎంపీ ప్రియాంక చతుర్వేది, ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా, తదితరులకు స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్స్ తమ ఐఫోన్, ఈ-మెయిల్స్ హ్యాక్ చేస్తున్నట్లు హెచ్చరికలు అందాయి. చదవండి: ప్రతిపక్ష ఎంపీలకు యాపిల్ అలర్ట్.. మీ ఫోన్ హ్యాక్ అవుతుందంటూ వార్నింగ్ -
Rahul Gandhi: ఆ మొదటి వ్యక్తిని నేనేనేమో!
2004లో నేను రాజకీయాల్లోకి వచ్చా. ఆ సమయంలో భారత్ ఇలా అవుతుందని అస్సలు ఊహించలేదు. పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయి.. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ చెప్పిన మాటలివి. ఎంపీగా తనపై పడిన అనర్హత వేటు గురించి విదేశీ గడ్డపైనా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. బుధవారం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో నిర్వహించిన ఇష్టాగోష్టిలో పాల్గొన్నారు. భారత్‌లో పరువు నష్టం కేసులో ఇలాంటి శిక్షను ఎదుర్కొన్న నేతను బహుశా తానేనేమోనని వ్యాఖ్యానించారాయన. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో.. దేశం ఇలా అయిపోతుందని ఊహించలేదు. పరువు నష్టం దావాతో గరిష్ట శిక్షను ఎదుర్కొన్న మొదటి నేతను బహుశా నేనే కావొచ్చు. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు అని పేర్కొన్నారాయన. 52 ఏళ్ల రాహుల్ గాంధీ ఇప్పటివరకు నాలుగుసార్లు ఎంపీగా నెగ్గారు. అయితే.. 2019 నాటి పరువు నష్టం దావా కేసులో రెండేళ్ల గరిష్ట శిక్ష పడగా, ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం చట్టం ప్రకారం అనర్హత వేటు పడి ఎంపీ(వయనాడ్ లోక్‌సభ స్థానం) పదవిని కోల్పోయారాయన. అయితే పార్లమెంట్లో కూర్చొని గళం వినిపించడంతో పోలిస్తే ఇప్పుడు తనకు మరింత అవకాశం దొరికిందని చెబుతూ.. భారత్ జోడో పాదయాత్ర ప్రస్తావన తీసుకొచ్చారు. It was a pleasure to engage with the learned audience at @Stanford on 'The New Global Equilibrium'. We discussed the challenges and opportunities of a changing world order. Actions based on truth is the way forward. pic.twitter.com/6tEoCV6OsM — Rahul Gandhi (@RahulGandhi) June 1, 2023 Relive the captivating moments as Shri @RahulGandhi graced the stage at Stanford University for an unforgettable interactive session. pic.twitter.com/IbcaPQ3o8y — Congress (@INCIndia) June 1, 2023 హలో.. మిస్టర్ మోదీ తన పర్యటనలో భాగంగా.. సిలికాన్ వ్యాలీలో సందడి చేసిన రాహుల్ గాంధీ, పలువురు స్టార్టప్ ఎంటర్ప్రెన్యూర్లతో కాసేపు రాహుల్ గాంధీ ముచ్చటించారు. వాళ్ల మధ్య ఏఐతో పాటు ఇతర టెక్నాలజీల గురించి చిట్‌చాట్ జరిగింది. ఈ క్రమంలో.. భారత్‌లో టెక్నాలజీ విస్తరణ గురించి ప్రస్తావనకు రాగా.. పెగాసస్ కుంభకోణం అంశం లేవనెత్తారు రాహుల్ గాంధీ. దాని గురించి(ఫోన్ ట్యాపింగ్) నేనేం దిగులుచెందడం లేదు. ఒకానొక టైంలో నా ఫోన్‌ట్యాపింగ్ అవుతోందని నాకు అర్థమైంది. అంటూ.. తన ఐఫోన్లో ‘‘హలో మిస్టర్ మోదీ’’ అంటూ ఛలోక్తి విసిరారాయన. ఒక ప్రభుత్వమే ఫోన్లు ట్యాప్ చేయాలని అనుకుంటే.. దానిని ఎవరూ ఆపలేరు కదా. అది పోరాటం చేయదగ్గ అంశమూ కాలేదు. ఎందుకంటే.. చేసే ప్రతీ పని ప్రభుత్వానికి చేరుతుంది కాబట్టి.. అని రాహుల్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: దేశ మనోభావాల్ని కించపరిచారు -
అది ట్యాపింగ్ కాదు.. రికార్డింగ్ వాయిస్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తన ఫోన్‌ను ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేసిన ఆరోపణలను ఆయన స్నేహితుడు లంకా రామశివారెడ్డి కొట్టిపారేశారు. అది ఫోన్ ట్యాపింగ్ కాదని.. ఫోన్లో తాను రికార్డ్ చేసిన వాయిస్ మాత్రమేనని స్పష్టం చేశారు. రామశివారెడ్డి బుధవారం నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. ఇంత రాద్ధాంతం చేస్తాడనుకోలేదు.. ‘నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నా స్నేహితుడే. ఒకే కాలేజీలో చదువుకున్నాం. ఆ తర్వాత ఆయన రాజకీయాలు వైపు వెళ్లగా.. నేను కాంట్రాక్టర్‌గా మారాను. డిసెంబర్లో నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కోటంరెడ్డి ప్రభుత్వ అధికారుల మీద, ఆయనకు కలిగిన ఇబ్బందుల మీద సుదీర్ఘంగా మాట్లాడారు. అదే రోజు సాయంత్రం 7 నుంచి 8 గంటల మధ్య కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నాకు ఫోన్ చేశాడు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశం విషయాలపై చర్చించుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల విషయంలో తొందరపాటుగా మాట్లాడకుండా ఉంటే బాగుండేదని సలహా ఇచ్చాను. నియోజకవర్గ నిధులు, కాంట్రాక్టు పనులు, ఇతర పరిణామాలన్నీ సుదీర్ఘంగా చర్చించుకున్నాం. అవన్నీ కూడా నా ఫోన్లో ఆటోమేటిక్‌గా రికార్డయ్యాయి. నేను చెన్నై వెళ్లినప్పుడు.. కోటంరెడ్డితో ఫోన్లో మాట్లాడిన వాయిస్ రికార్డును నా స్నేహితుడికి పంపాను. అది యాదృచ్ఛికంగా జరిగిందే తప్ప.. కావాలని చేసింది కాదు. ఆ తర్వాత అది కాస్తా వైరల్ అయ్యింది. ఇంత పెద్ద వివాదం అవుతుందని ఊహించలేదు. కోటంరెడ్డి అనవసరంగా చిన్న విషయంపై ఇంత రాద్ధాంతం చేస్తాడని అనుకోలేదు. రెండు, మూడు రోజుల్లో సమసిపోతుందనుకున్నా. అందుకే ఇంతకాలం బయటకు రాలేదు. కానీ కోటంరెడ్డి కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో నాకు కొంత ఆందోళన కలిగింది. ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఇప్పుడు బయటకు వచ్చా. కోటంరెడ్డి కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేసినా ఫర్వాలేదు. నాది ఆండ్రాయిడ్ ఫోన్. ప్రతి ఫోన్ కాల్ రికార్డ్ అవుతుంది. గత 5 నెలలుగా నేను వాడుతున్న ఫోన్‌ను చెక్ చేసుకోండి. అన్ని కాల్స్ రికార్డ్ అయిన విషయం తెలుస్తుంది. ఎవరు వచ్చినా.. నా ఫోన్ ఇస్తా.. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి నిజాలు తెలుసుకోవచ్చు. నేను వాయిస్ రికార్డు పంపిన నా స్నేహితుడి పేరును విచారణ అధికారులకు చెబుతా. ఆయన పేరు ఇప్పుడు బహిరంగంగా చెప్పి.. ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు’ అని లంకా రామశివారెడ్డి వివరణ ఇచ్చారు. -
కోటంరెడ్డికి మంత్రి కాకాణి స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, నెల్లూరు: 2014 ఎన్నికల సమయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిత్వం విషయంలో ఎంత పోటీ ఉందనేది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి తెలుసని, ఆనాడు జగన్మోహన్రెడ్డి స్థానంలో ఎవరున్నా కోటంరెడ్డికి సీటు దక్కి ఉండేది కాదని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాతిక్రేయ సమావేశం నిర్వహించగా.. దానికి కౌంటర్ ప్రెస్‌మీట్ నిర్వహించారు కాకాణి. పార్టీ మారాలనేది కోటంరెడ్డి వ్యక్తిగత విషయం. కానీ, వైఎస్ఆర్సీపీపై బురద జల్లడం సరికాదు. అక్కడ జరిగింది ఫోన్ ట్యాపింగ్ కాదు.. మ్యాన్ ట్యాపింగ్ జరిగింది. చంద్రబాబు నాయుడు, కోటంరెడ్డిని ట్యాప్ చేశారు. చంద్రబాబు ట్రాప్‌లో పడ్డారు కోటంరెడ్డి. ఒకవేళ నిజంగా ట్యాపింగ్ జరిగి ఉంటే.. అవమానం, అనుమానం అనే బదులు విచారణకు ముందుకు వెళ్లొచ్చు కదా అని కాకాణి పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ఇన్నిరోజులు కోర్టుకు ఎందుకు వెళ్లలేదు. కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని చెప్పావు.. ఏమైంది?. అది ఆడియో రికార్డ్ అని తెలుసు కాబట్టే అవమానించారని డ్రామాలు ఆడుతున్నావు అంటూ కోటంరెడ్డిపై మండిపడ్డారు మంత్రి కాకాణి. టీడీపీ అభ్యర్థిగా ఖరారైన తర్వాతే ఆరోపణలు చేస్తున్నావ్. కోటంరెడ్డి నువ్వు వీరవిధేయుడివి కాదు.. వేరే వాళ్లకు విధేయుడివి. సీఎం జగన్ టికెట్ ఇచ్చారు కాబట్టే.. ఎమ్మెల్యే అయ్యావు. ఈ స్థితిలో ఉండడానికి ఆయన కారణం కాదా?. సీఎం జగన్ 1 అయితే.. ఆ ముందు ఉండే సున్నాలం మనం. ఆ ఒక్కటే లేకపోతే.. మనమంతా జీరోలం. ఒకరిద్దరు పార్టీ నుంచి వెళ్లిపోయినంత మాత్రాన వైసీపీకి నష్టం లేదు. అంతకంటే మంచి నేతలు పార్టీలోకి వస్తారు. కోటంరెడ్డి తీసుకున్న నిర్ణయం ఆత్మహత్యా సదృశ్యంగా మారబోతోందని కాకాణి జోస్యం పలికారు. -
కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ అవాస్తవం: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు
సాక్షి, అమరావతి: తన ఫోన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేసిన ఆరోపణలను వైఎస్సార్సీపీ నేతలు, ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. అవి పూర్తిగా అవాస్తవాలని చెప్పారు. ఆయన టీడీపీలోకి వెళ్లడానికి సిద్ధమయ్యారని, అందుకే ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని వాస్తవాలను బట్టబయలు చేశారు. కోటంరెడ్డి వినిపిస్తున్న మాటలు ఎవరో రికార్డింగ్ చేసినవే తప్ప, ప్రభుత్వం ట్యాపింగ్ చేయలేదని స్పష్టంచేశారు. ఎవరితోనో కోటంరెడ్డి మాట్లాడుతూ పరుషమైన వ్యాఖ్యలు చేస్తే.. వాటిని మరెవరో రికార్డు చేసి సర్క్యులేట్ చేస్తే.. దాన్నే కోటంరెడ్డికి శ్రేయోభిలాషిగా ఇంటెలిజెన్స్ చీఫ్ పంపి ఉండొచ్చని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఎవరి ఫోన్లూ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పారు. ఆయన బుధవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీలోకి వెళ్లడానికి సిద్ధమయ్యాకే కోటంరెడ్డి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. ఆయనకు వైఎస్ జగన్ సముచిత గౌరవం ఇచ్చారన్నారు. కోరుకున్న పదవులు రాలేదనే అసంతృప్తి ఉన్నట్లు కోటంరెడ్డే అన్నారని గుర్తు చేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని కోటంరెడ్డి మాట్లాడిన ఆడియో కూడా సర్క్యులేట్ అవుతోందని, దాన్ని కూడా ట్యాపింగ్ చేశారంటారా అని ప్రశ్నించారు. చంద్రబాబుతో కలిసి కోటంరెడ్డి, ఆనం ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని తెలిపారు. ఆ బురదలో వారే కొట్టుకుపోతారని చెప్పారు. చంద్రబాబు, రామోజీరావులతో ఎవరైనా మాట్లాడాలంటే వారి సహాయకులకే ఫోన్ చేస్తారని అన్నారు. అదే రీతిలో వైఎస్ వివేకా మరణించారనే సమాచారాన్ని ఇవ్వడానికి సీఎం వైఎస్ జగన్ ఇంట్లో పనిచేసే నవీన్‌కు వైఎస్ అవినాష్‌రెడ్డి ఫోన్ చేశారని, ఇందులో అసహజం ఏముందని ప్రశ్నించారు. దీన్ని పట్టుకుని చంద్రబాబు, ఎల్లో మీడియా బురదజల్లడం రాక్షసత్వమని మండిపడ్డారు. పరిపాలన వికేంద్రీకరణతోనే సమతుల అభివృద్ధి సాధ్యమని సీఎం వైఎస్ జగన్ ఆదిలోనే ఆయన విధానాన్ని ప్రకటించారన్నారు. అందులో భాగంగా మూడు రాజధానులను ప్రకటించారని తెలిపారు. 3 నెలల కిందటే ఎందుకు చెప్పలా? : మాజీ మంత్రి పేర్ని నాని మూడు నెలలుగా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంటే అప్పుడే ఎందుకు చెప్పలేదని, ఇప్పుడెందుకు చెబుతున్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పేర్ని వెంకటరామయ్య(నాని) నిలదీశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్సీపీ పెట్టకపోతే ఇంత మంది ఎమ్మెల్యేలు అయ్యేవారా? ఒక్కసారి కోటంరెడ్డి ఆత్మావలోకనం చేసుకోవాలన్నారు. చంద్రబాబు ఏం చెబితే అది చేయడానికి శ్రీధర్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారన్నారు. తమ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ సామాన్లు కొనలేదని, ట్యాపింగ్ చేసే సదుపాయం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. శ్రీధర్‌రెడ్డిది అవకాశవాద రాజకీయమని ఆగ్రహం వ్యక్తంచేశారు. కోటంరెడ్డిలాంటి వారు పోతే పార్టీకి దరిద్రం పోతుంది: కొడాలి నాని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి లాంటి నాయకులు వెళ్లిపోతే వైఎస్సార్సీపీకి దరి ద్రం పోతుందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరావు (నాని) అన్నారు. ఆయన బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. కోటంరెడ్డిని సీఎం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి ఉంటాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబే సీఎం అయ్యే పరిస్థితిలేదని, కోటంరెడ్డికి మంత్రి పదవి ఇచ్చేది ఎక్కడని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసే అలవాటు చంద్రబాబుదేనన్నారు. సీఎం జగన్ ఎవరినీ మభ్య పెట్టరని, ఉన్నది ఉన్నట్లు చెబుతారని తెలిపారు. ఈ పనికిమాలిన వారు ఏమి మాట్లాడుతారో వినే సమయం సీఎంకు ఉంటుందా అని ప్రశ్నించారు. అది రికార్డింగ్ వాయిస్ : మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సాక్షి ప్రతినిధి నెల్లూరు: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేస్తున్న ఆరోపణలు అర్థరహితమైనవని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. శ్రీధర్‌రెడ్డి పార్టీని వీడి వెళ్లిపోవడానికి ఏదో కారణం చూపించాలన్న ఉద్దేశంతోనే ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఫోన్ టాపింగ్ అనేదే లేదని మంత్రి స్పష్టం చేశారు. రికార్డింగ్ మెసేజ్‌ను పట్టుకుని యాగీ చేయడం సరైన పద్ధతి కాదన్నారు.పోన్లో మాట్లాడింది ట్యాపింగా లేదా రికార్డింగా అనే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా, కోర్టు ద్వారా దర్యాప్తు చేయించినా అభ్యంతరం లేదన్నారు. ట్యాపింగ్ అని నిరూపిస్తే రాజకీయాలకు నేను దూరం: బాలినేని సాక్షి ఒంగోలు: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఫోన్ ట్యాపింగ్ నిరూపిస్తే తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని, నిరూపించలేకపోతే శ్రీధర్‌రెడ్డి రాజకీయాలకు దూరమవుతారా అని నెల్లూరు, తిరుపతి, వైఎస్సార్ కడప జిల్లాల వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు. అది ఫోన్ ట్యాపింగ్ కాదని, కోటంరెడ్డి పక్కన ఉండే స్నేహితుడే ఆయన కాల్‌ను రికార్డు చేసి పార్టీ అధిష్టానానికి పంపారన్నారు. అది తెలుసుకున్న ఇంటెలిజెన్స్ అధికారి సీతారామాంజనేయులు కోటంరెడ్డితో ఉన్న పరిచయాల కారణంగా దానిని ఫోన్లో వినిపించారని తెలిపారు. దానిని పట్టుకుని ఫోన్ ట్యాపింగ్ అనడం అర్థరహితమని చెప్పారు. వారిద్దరి మధ్య ఉన్న చనువుతోనే ఇంటెలిజెన్స్ అధికారి శ్రీధర్‌రెడ్డిని అడిగారని, చివరకు ఆ స్నేహంపైనే మచ్చ వేయడం దారుణమని అన్నారు. కాల్ రికార్డు చేసిన వ్యక్తిని ప్రెస్మీట్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమన్నారు. ఆయన స్నేహితుడు రామశివారెడ్డినే అడిగి తెలుసుకోవాలన్నారు. చంద్రబాబు టిక్కెట్ ఇస్తానని చెప్పకపోతే 20 24లో టీడీపీ తరఫున పోటీచేస్తానని ఎలా ప్రకటిస్తారని అన్నారు. ఆనం రామనారాయణరెడ్డికి భద్రత తగ్గించలేదని తెలిపారు. ఫోన్‌ట్యాపింగ్ రాజకీయ ఆరోపణ: మిథున్‌రెడ్డి సాక్షి, న్యూఢిల్లీ : ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందనడం రాజకీయ ఆరోపణ అని వైఎస్సార్‌సీపీఎంపీ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. రాజకీయ స్వార్ధంతోనే ఈ ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. -
బీఆర్ఎస్, బీజేపీ నా ఫోన్ ట్యాప్ చేస్తున్నాయి
కాగజ్‌నగర్‌టౌన్: ప్రశ్నించే గళాలను అణచివేయడా నికి బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు కుట్రలు చేస్తు న్నాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఈ కుట్రల్లో భాగంగా తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. తన ఆపిల్ సెల్‌ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నట్లు ఆ సంస్థ తనకు మెయిల్ పంపించిందని తెలిపారు. ప్రవీణ్‌కుమార్ చేపట్టిన రెండో విడత బహుజన రాజ్యాధికార యాత్ర సోమవారం కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బహుజన రాజ్యం కోసం తాను చేస్తున్న పోరాటాన్ని జీర్ణించుకోలేక, బీఎస్పీకి పెరుగుతున్న ఆదరణను తట్టు కోలేక ప్రభుత్వాలు ఇలాంటి నేరపూరిత చర్యలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా పలువురు జర్నలిస్టులు, ప్రజా సంఘాలు, రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని, బీజేపీ, బీఆర్ఎస్ కలిసే ఈ పనిచేస్తున్నాయని ఆరోపించారు. కాగా, రైతుస్వరాజ్య వేదిక నాయకులను ఉద్దేశించి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, రైతులకు పల్లా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సిర్పూర్ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల ఆగడాలు ఎక్కువయ్యాయని, పేదల భూములను ఎమ్మెల్యే అనుచరులు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి సిడాం గణపతి, జిల్లా అధ్యక్షుడు ఆకుల సంతోష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఫోన్ ట్యాపింగ్‌పై భారీగా ఫిర్యాదులు?
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ప్రతిపక్షాల నేతలు, ఇతర ముఖ్య నాయకుల ఫోన్లు ట్యాప్ అవుతున్నా యంటూ అనేక ఫిర్యాదులు వస్తున్నాయని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ప్రభు త్వంలోని కీలక వ్యక్తుల కనుసన్నల్లో ఫోన్ ట్యాపింగ్ జరు గుతోందని, దీనికి పోలీసులు సహకరిస్తు న్నారని వివిధ పార్టీల నేతలు తనకు ఫిర్యాదు చేశారని వివరించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. సోమవా రం మధ్యాహ్నం ఢిల్లీ పర్యటనకు వచ్చిన గవర్నర్.. సాయంత్రం నార్త్‌బ్లాక్‌లోని హోంశాఖ కార్యాలయంలో అమిత్ షాతో భేటీ అయ్యారు. సుమారు పది నిమిషాల పాటు వారు వివిధ అంశాలపై చర్చించారు. తన మూడేళ్ల పదవీ కాలంలో రాష్ట్రంలో చేపట్టిన కార్యక్రమాలు, తీసుకున్న నిర్ణ యాలకు సంబంధించిన నివేదికను అమిత్‌షాకు తమి ళిసై అందజేశారు. రాష్ట్రంలో ఇటీ వలి రాజకీయ పరిణా మాలు, ఎమ్మెల్యేల కొను గోలు అంశం, పలు బిల్లుల ఆమోదం విషయంలో ప్రభుత్వ సహ కారం వంటి అంశాలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల కొను గోలు వ్యవహారంలో కేసీఆర్ అనుసరిస్తున్న రాజకీయ వ్యూహం, కేంద్రంలోని పెద్దలను ఇరకాటంలోకి నెట్టేలా వ్యవహరి స్తున్న తీరుపైనా చర్చ జరిగినట్టు సమాచారం. ఇక తన ఆమోదం కోసం వచ్చిన పలు బిల్లుల విషయంలో అదనపు సమాచారం కోరినా ప్రభుత్వ యంత్రాంగం నుంచి స్పందన కరువైన విషయాన్ని అమిత్‌షా దృష్టికి గవర్నర్ తీసుకెళ్లినట్టు తెలిసింది. విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగాల భర్తీ కోసం కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు బిల్లుపై సందేహాలు ఉన్నాయని.. వాటి నివృత్తి కోసం రాష్ట్ర విద్యా మంత్రికి లేఖ రాసినా స్పందన లేదని వివరించినట్టు సమాచారం. మామూలు భేటీయే: గవర్నర్ అమిత్‌షాతో భేటీ అనంతరం గవర్నర్ తమిళిసై మీడియాతో ముక్తసరిగా మాట్లాడారు. తెలంగాణ గవర్నర్‌గా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర హోంమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశానని తెలిపారు. గవర్నర్‌గా తన మూడో ఏడాదికి సంబంధించిన కార్యకలాపాలను నివేదిక రూపంలో హోంమంత్రికి ఇచ్చానని వివరించారు. కేంద్ర హోంమంత్రితో భేటీ సాధారణంగా జరిగే ప్రక్రియలో భాగమేనని, ఎలాంటి ప్రత్యేకతా లేదని పేర్కొన్నారు. చదవండి: వచ్చి చర్చించండి.. సబితకు గవర్నర్ పిలుపు -
ఏపీ అసెంబ్లీకి ఫోన్ ట్యాపింగ్ హౌస్ కమిటీ నివేదిక
సాక్షి, అమరావతి: చంద్రబాబు హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్‌పై ఏపీ అసెంబ్లీకి హౌస్ కమిటీ నివేదిక సమర్పించింది. నివేదికను హౌస్ కమిటీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి.. స్పీకర్‌కు అందజేశారు. చంద్రబాబు పాలనలో డేటా చౌర్యం జరిగిందని నిర్ధారించినట్టు సమాచారం. చదవండి: మార్గదర్శి కేసులో రామోజీకి సుప్రీంకోర్టు నోటీసులు ఈ సందర్భంగా హౌస్ కమిటీ సభ్యుడు జక్కంపూడి రాజా మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారు. ప్రాథమిక నివేదికను స్పీకర్‌కు అందజేశామని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్‌పై సమగ్ర విచారణ జరగాల్సి ఉందన్నారు. రేపు(మంగళవారం)ఈ నివేదికపై చర్చించే అవకాశం ఉందని రాజా అన్నారు. -
సాక్షి కార్టూన్ 28-07-2022
ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ఇలానే మాట్లాడుకుంటున్నారు!! -
ఫోన్ ట్యాపింగ్‌పై విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ ఆళ్వా సంచలన వ్యాఖ్యలు
సాక్షి,న్యూఢిల్లీ: విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ ఆళ్వా కేంద్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతోందని అన్నారు. బీజేపీలోని తన మిత్రులతో ఫోన్లో మాట్లాడాక తన కాల్స్ అన్నీ డైవర్ట్ అవుతున్నాయని ట్విట్టర్లో పేర్కొన్నారు. రాజకీయ నాయకులు ఏం మాట్లాడుకుంటున్నారో ‘పెద్దన్న’ వింటూనే ఉంటారన్నారు. కలిసినప్పుడు కూడా నాయకులు గుసగుసలాడాల్సిన పరిస్థితి నెలకొందని ఆక్షేపించారు. భయం ప్రజాస్వామ్యాన్ని చంపేస్తోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్ఎల్) పంపిన నోటీసును మార్గరెట్ ఆళ్వా ట్విట్టర్లో షేర్ చేశారు. I thank the Chairman of MTNL/ BSNL for action on my complaint. My phone services have now been restored. I’m glad that a FIR has been registered by the authorities. https://t.co/PBjS7px9AH — Margaret Alva (@alva_margaret) July 26, 2022 అయితే మార్గరెట్ ఆళ్వా ఆరోపణలను కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఖండించారు. ఆమె ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం తమకేముందని ప్రశ్నించారు. ఆళ్వా అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని.. ఓ సీనియర్ నేత అయ్యుండి ఇలాంటి అసత్య ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు. చదవండి: ఉచితాలు ప్రకటించే రాజకీయ పార్టీలను రద్దు చేయాలని పిటిషన్.. కేంద్రం స్పందన కోరిన సుప్రీంకోర్టు -
చంద్రబాబు పెగాసస్ బండారం బయట పెడతాం: భూమన కరుణాకర్‌రెడ్డి
-
పెగాసస్ గుట్టు తేల్చనున్న ఏపీ ప్రభుత్వం
-
టీడీపీకి వణుకు పెగాసస్ పై హౌస్ కమిటీ విచారణ ప్రారంభం
-
హౌస్ కమిటీ అంటే టీడీపీకి భయమెందుకు?: మంత్రి కన్నబాబు
-
హౌస్ కమిటీ అంటే టీడీపీకి భయమెందుకు?
తాడేపల్లి: పెగాసస్ వ్యవహారంపై హౌస్ కమిటీ వేస్తే టీడీపీకి భయమెందుకని మంత్రి కన్నబాబు ప్రశ్నించారు. ‘తప్పు చేశాం.. ప్రాయశ్చిత్తం చేసుకుందాం’ అని కూడా టీడీపీకి లేదని కన్నబాబు విమర్శించారు. అసెంబ్లీ ప్రాంగణంలో మాట్లాడిన కన్నబాబు పెగాసస్ వ్యవహారంపై కమిటీ వేయడం శుభపరిణామం అని అన్నారు. కాగా, పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం మాట్లాడుతూ.. పెగాసస్‌పై హౌస్‌కమిటీ వేస్తున్నామని ప్రకటించారు. ఈ వ్యవహారంపై విచారణ హౌస్ కమిటీ విచారణ చేపడుతుందని తెలిపారు. దీనికీ సంబంధించి కమిటీ సభ్యులను రేపు(మంగళవారం) కానీ, ఎల్లుండి(బుధవారం)కానీ ప్రకటిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో గత చంద్రబాబు ప్రభుత్వం అప్పటి ప్రతిపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్ కోసం రూ.25 కోట్లతో ఇజ్రాయెల్ నుంచి పెగసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేసిందనేది పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్వయంగా వెల్లడించడం సంచలనం సృష్టిస్తోంది. ఈ వ్యవహారం కలకలం సృష్టిస్తుండగా, దీనిపై హౌస్ కమిటీ వేస్తున్నట్లు ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని అసెంబ్లీలో ప్రకటించారు. ‘అనధికార సంఘటనలకు ఈనాడు మద్దతు పలుకుతుందా?’ -
అది ఇప్పుడు నిజమని తేలిపోయింది: మంత్రి వెల్లంపల్లి
-
‘అది నిజమేనని తేలిపోయింది’
సాక్షి, విజయవాడ: చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పెగాసస్‌ను ఉపయోగించారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ, తమ ఫోన్లను ట్యాప్ చేశారని, ఈ విషయాన్ని గత ఎన్నికల సమయంలోనే చెప్పామన్నారు. అది ఇప్పుడు నిజమని తేలిపోయిందన్నారు. చదవండి: పెగాసస్‌పై టీడీపీ ఎందుకు కంగారుపడుతోంది: అంబటి రాంబాబు చంద్రబాబుపై సీబీఐ విచారణ చేయాలని, కేంద్రాని కూడా కోరతామని తెలిపారు. ప్రజా క్షేత్రంలో నిలబడలేక చంద్రబాబు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారన్నారు. చంద్రబాబు నిజాయితీ పరుడైతే విచారణ జరపమని ఆయనే డిమాండ్ చేయాలన్నారు. పెగాసస్‌ను ఉపయోగించడం ద్వారా రాష్ట్రానికే కాదు. దేశ రక్షణకు విఘాతం కలిగించారన్నారు. చంద్రబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి వెల్లంపల్లి డిమాండ్ చేశారు. -
బాబు.. ఏబీ.. ఓ పెగసస్ ఇప్పుడేమంటారు..?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత చంద్రబాబు ప్రభుత్వం అప్పటి ప్రతిపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్ కోసం రూ.25 కోట్లతో ఇజ్రాయెల్ నుంచి పెగసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేసిందనేది నూటికి నూరు శాతం నిజమని నిర్ధారణ అయ్యింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించడం సంచలనం సృష్టిస్తోంది. దీంతో చంద్రబాబు రాజకీయ పన్నాగాలు జాతీయ స్థాయిలో బహిర్గతమయ్యాయి. ఇదే విషయంపై 2019 ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసినప్పుడు ఒకింత సందేహాస్పదంగా చూసిన వారంతా, చంద్రబాబు రాజకీయ ప్రయాణమంతా అడ్డదారులేనని ఇప్పుడు ఒప్పుకుంటున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మమతా బెనర్జీ ఈ విషయమై స్పష్టమైన సమాచారం ఉండబట్టే ఈ ప్రకటన చేశారని అధికారులు, విశ్లేషకులు భావిస్తున్నారు. ముందుగా స్పైవేర్ పరికరాలను కొనుగోలు చేసిన చంద్రబాబు.. భవిష్యత్‌లో జాతీయ స్థాయిలో మమతా బెనర్జీ సహకారాన్ని ఆశించారు. అందుకే తాను కొనుగోలు చేసిన స్పైవేర్ సాఫ్ట్వేర్ సమాచారం గురించి ఆమెకు తెలిపారు. కొనుగోలు చేయాలంటూ సంప్రదింపులు జరిపారు. అప్పటి ఇంటలిజెన్స్ విభాగం చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ద్వారా ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్వో కంపెనీ ప్రతినిధులు పశ్చిమ బెంగాల్ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. అనంతరం ఏపీలో సమర్థంగా ఫోన్ల ట్యాపింగ్ చేస్తున్నామని రాష్ట్ర ఇంటలిజెన్స్ విభాగం అధికారులు మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ పోలీసు ఉన్నతాధికారులకు ప్రజెంటేషన్ కూడా ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. అయితే ఫోన్ ట్యాపింగ్ అప్రజాస్వామ్యంగా భావించడంతోపాటు నేరమని మమత అప్పట్లో స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం స్పైవేర్ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేయదని తేల్చి చెప్పారు. టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారం కోసం మమతా బెనర్జీ మన రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా ఈ విషయం గురించి మరోమారు చర్చించగా, ఆమె సున్నితంగా తిరస్కరించారని తెలిసింది. చంద్రబాబు డైరెక్షన్.. ఏబీ యాక్షన్ టీడీపీ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతోందని గుర్తించిన అప్పటి సీఎం చంద్రబాబు 2019 ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు కుతంత్రాలకు తెరతీశారు. వైఎస్సార్సీపీ నేతల ఫోన్ల ట్యాపింగ్ ఓ వైపు, ఓటర్ల డాటా చోరీకి మరోవైపు పన్నాగం పన్నారు. ఆ బాధ్యతను అప్పటి ప్రభుత్వ ఇంటలిజెన్స్ విభాగం చీఫ్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావుకు అప్పగించారు. ఎందుకంటే అప్పటికే 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను ప్రలోభాలకు గురి చేసి, టీడీపీలో చేర్పించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అందుకే ఫోన్ల ట్యాపింగ్, డాటా చోరీ బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించారు. 3.50 కోట్ల మంది డేటా చోరీ రాష్ట్ర ఓటర్ల వ్యక్తిగత వివరాల చోరీకి చంద్రబాబు అండ్ కో హైదరాబాద్‌లోని ‘ఐటీ గ్రిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే కంపెనీ కేంద్రంగా తెరలేపింది. టీడీపీ ఎన్నికల ప్రచారం కోసం ‘సేవా మిత్ర’ అనే యాప్‌ను ఈ కంపెనీ రూపొందించింది. ఏబీ వెంకటేశ్వరరావు ద్వారా కొనుగోలు చేసిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో రాష్ట్ర ఓటర్ల వ్యక్తిగత డాటాను తస్కరించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ)’ ఆధీనంలో ఉండే అత్యంత విశ్వసనీయమైన ఆధార్ డాటాను తస్కరించడం విస్మయ పరుస్తోంది. మరోవైపు బ్యాంకు ఖాతాల డాటాలోకి చొరబడి ఆ వివరాలను కూడా సేకరించారు. ఏకంగా రాష్ట్రంలో 3.50 కోట్ల మంది ఓటర్ల వ్యక్తిగత వివరాలు చోరీ చేశారు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలను భద్రపరిచే బాధ్యతను విశాఖపట్నానికి చెందిన ‘బ్లూ ఫ్రాగ్’ అనే కంపెనీకి అప్పగించింది. ఈ కంపెనీ వద్ద ఉన్న లబ్ధిదారుల వివరాలను కూడా ఐటీ గ్రిడ్స్ కంపెనీకి అందుబాటులోకి తెచ్చింది. దాంతో టీడీపీ ప్రచారం కోసం రూపొందించిన ‘సేవా మిత్ర’ యాప్‌ను రాష్ట్రంలో ఓటర్ల పేర్లు, చిరునామాలు, ఓటరు గుర్తింపు కార్డు నంబర్లు, బాం్యకు ఖాతాలు, ఇతర వ్యక్తిగత సమాచారంతో అనుసంధానించారు. కుట్రపై అప్పట్లోనే ఫిర్యాదు అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడంతోపాటు టీడీపీ అనుకూల ఓటర్ల పేర్లను ఒకటికి మించి నియోజకవర్గాల్లో చేర్చేందుకు ఎత్తుగడ వేశారు. 2019 ఎన్నికల్లో భారీ అక్రమాలకు పాల్పడేందుకు రంగం సిద్ధం చేశారు. దీన్ని గుర్తించిన వైఎస్సార్సీపీ.. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లింది. మరోవైపు ఐటీ గ్రిడ్స్ కంపెనీ డేటా చోరీకి పాల్పడుతుండటంపై హైదరాబాద్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. దీనిపై హైదరాబాద్ పోలీసులు ఐటీ గ్రిడ్స్ కంపెనీలో తనిఖీలు చేయడంతో మొత్తం బండారం బట్టబయలైంది. దాంతో ఆ కంపెనీకి చెందిన రెండు కార్యాలయాల్లో ఏపీ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, ఓటర్ల వివరాలకు సంబంధించిన కీలక పత్రాలు, హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఐటీ గ్రిడ్స్ కంపెనీపై కేసు నమోదు చేశారు. డేటా చోరీకి పాల్పడుతున్న కేసులో ఐటీ గ్రిడ్స్ కంపెనీ ప్రతినిధులతోపాటు ఏపీ నిఘా విభాగానికి చెందిన కొందరు సిబ్బందిని కూడా హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం టీడీపీ కుట్రను బహిర్గతం చేసింది. ట్యాపింగ్ నిజమేనన్న టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు అప్పట్లో చంద్రబాబు, ఆయన బృందం వైఎస్సార్సీపీ కీలక నేతల ఫోన్ల ట్యాపింగ్‌కు పాల్పడింది. అందుకోసం అప్పటి నిఘా విభాగం చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు అధునాతన సమాచార సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ‘ఏరోస్టర్ ’ అనే ఫోన్ ట్యాపింగ్ పరికరాలను తెప్పించినట్టు సమాచారం. గాలిలో ఎగురవేసే ఈ ఏరోస్టర్ బెలూన్లలో ఉండే ప్రత్యేకమైన పరికరాలు ఫోన్ల ట్యాపింగ్‌తోపాటు అవసరమైన ఫొటోలు తీస్తూ నిఘా వ్యవస్థగా పని చేస్తాయి. చంద్రబాబు కుతంత్రాలపై సందేహించిన వైఎస్సార్సీపీ నేతలు ఫోన్ల ట్యాపింగ్ అంశంపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు. మరోవైపు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను కూడా బాధ్యులను చేశారు. దాంతో సజ్జల రామకృష్ణారెడ్డితోపాటు వైఎస్సార్సీపీ నేతల ఫోన్లు ట్యాప్ చేయాలని తమకు అప్పటి నిఘా విభాగం అధికారులు లేఖ ద్వారా ఆదేశించారని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు వెల్లడించడం గమనార్హం. కేంద్ర భద్రతా చట్టాల ఉల్లంఘన రాజకీయ ప్రత్యర్థుల ఫోన్ల ట్యాపింగ్ కోసం చంద్రబాబు ప్రభుత్వం కేంద్ర భద్రతా చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘించింది. ‘ఏరోస్టర్’ స్పైవేర్ పరికరాల కోసం అప్పటి ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అధికారిక హోదాతో ఇజ్రాయెల్ కంపెనీలతో సంప్రదింపులు జరిపారు. దేశ భద్రతతో ముడిపడిన స్పైవేర్ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేయాలంటే కచ్చితంగా కేంద్ర రక్షణ, హోం, విదేశీ వ్యవహారాల శాఖల ముందస్తు అనుమతి ఉండాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఆ విషయాన్నే పట్టించుకోలేదు. ఏపీ ప్రభుత్వం కాంట్రాక్టు పొందిన తన కుమారుడు చేతన్ సాయి కృష్ణ సీఈవోగా ఉన్న ఆకాశ్ అడ్వాన్డ్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఏర్పాటు చేసిన కంపెనీకి ఆ స్పైవేర్ పరికరాలను సరఫరా చేయాలని కోరా>రు. ఆ కంపెనీనే ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాల కొనుగోలుకు ప్రధాన బిడ్డర్‌గా వ్యవహరించింది. దీనిపై పూర్తి ఆధారాలు లభించినందునే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసి, కేసు నమోదు చేసింది. ఐపీఎస్ అధికారిగా ఉంటూ కూడా దేశ భద్రతా చట్టాలను ఉల్లంఘించిన ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారాన్ని కేంద్ర డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(డీవోపీటీ)కు నివేదించింది. ట్యాపింగ్ కోసమే వాటి వినియోగం ఇజ్రాయెల్‌కు చెందిన వెర్టిన్ అనే కంపెనీ ద్వారానే చంద్రబాబు ప్రభుత్వం పెగాసస్ కంపెనీతో వ్యవహారం నెరిపింది. వెబ్ ఇంటలిజెన్స్ సాఫ్ట్వేర్ కొనుగోలు పేరుతో ‘ఐఎంఎస్ఐ క్యాచర్స్’ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలను తెప్పించింది. ఫోన్ల ట్యాపింగ్ కోసమే ఈ పరికరాలను ఉపయోగిస్తారు. ఈ విషయంపై 2019 ఎన్నికల పోలింగ్ ముగిశాక.. ఫలితాలు వెల్లడయ్యేలోపు ఆ సాఫ్ట్వేర్ కోసం రూ.12.50 కోట్లు ఆ కంపెనీకి చెల్లించేందుకు ఫైల్ నడిపింది. దీనిపై అప్పట్లోనే వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం దృష్టికి తీసుకెళ్లి చెల్లింపులు చేయొద్దని కోరారు. వెర్టిన్ కంపెనీకి ఇజ్రాయెల్‌కు చెందిన స్పైవేర్ సాఫ్ట్వేర్ పరికరాల ఉత్పత్తిదారు ఎన్ఎస్వో కంపెనీతో సాన్నిహిత్యం ఉంది. ఒకే రకమైన స్పైవేర్ పరికరాలను ఉత్పత్తి చేస్తున్న ఆ రెండు కంపెనీలు విలీనం కావాలని ఒకానొక దశలో భావించాయి కూడా. -
చిక్కుల్లో ఫడ్నవీస్.. మాజీ సీఎంకు పోలీసుల నోటీసులు
ముంబై: అక్రమంగా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిన కేసులో తమ ఎదుట హాజరుకావాలని ముంబై పోలీసులు బీజేపీ నేత, మహరాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు నోటీసులు జారీ చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఫడ్నవీస్‌ను ఆదివారం ఉదయం 11 గంటలకు బీకేసీ సైబర్ పోలీస్‌స్టేషన్‌లో హాజరై వాంగ్మూలం ఇవ్వాలని సూచించారు. ఐపీఎస్ అధికారి రష్మీ శుక్లా రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగానికి నేతృత్వం వహిస్తున్న సమయంలో అక్రమ ఫోన్ ట్యాపింగ్‌పై నమోదైన కేసులో ఫడ్నవీస్ సాక్షి అని రాష్ట్ర ప్రభుత్వం గతంలో కోర్టుకు తెలిపింది. నోటీసులు అందిన అనంతరం ఆయన వీటిని ట్వీటర్లో షేర్ చేశారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వంపై మాజీ సీఎం ఫైర్ అయ్యారు. బదిలీ పోస్టింగ్ స్కాంపై రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలలుగా ఏమీ చేయకపోవడం తనను ఆశ్చర్యపరిచిందని అన్నారు. మహరాష్ట్ర ప్రభుత్వం చర్యల్లో తప్పులను బయటపెట్టినందుకే తనకు నోటీసులు అందాయి. అయినా తాను ఇలాంటి వాటికి భయపడనని ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నట్లు దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు. రాష్ట్ర పోలీసు శాఖలో బదిలీల కుంభకోణాన్ని తాను బయటపెట్టినందున రాష్ట్ర ప్రభుత్వం తనపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు. అయితే ఫడ్నవీస్ ఈ నోటీసులకు సమాధానం ఇవ్వడంతో పాటు ముంబై పోలీసుల ముందు హాజరు కావాలని కోరింది. -
యోగి నా ఫోన్లను ట్యాప్ చేయిస్తున్నారు
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన ఫోన్లపై నిఘా పెట్టారని, ట్యాపింగ్ చేయిస్తున్నారని సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. ఫోన్ల ట్యాపింగ్ ద్వారా రికార్డు చేసిన సంభాషణలను ప్రతిరోజు సాయంత్రం యోగి వింటున్నారని అన్నారు. యోగిని నిరుపయోగిగా అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం యూపీ సీఎంపై ప్రశంసలు కురిపిస్తూ ఆంగ్లంలో యూపీ, యోగి కలిస్తే ‘ఉపయోగి’ అవుతుందని పేర్కొన్న విషయం తెలిసిందే. ఆదివారం అఖిలేఖ్ విలేకరులతో మాట్లాడారు. ఫోన్ల ట్యాపింగ్ జరుగుతోంది కాబట్టి తనతో మాట్లాడేటపుడు జాగురుకతతో ఉండాలని విలేకరులకుసూ చించారు. యోగి సర్కారు రాష్ట్రంలో ‘వాట్సాప్ యూనివర్సిటీ’ నడుపుతోందని విమర్శించారు. ఓటమి భయంతోనే 12 మంది బీజేపీ పాలితరాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇటీవల వారణాసి, ఆయోధ్యల్లో పర్యటించారన్నారు. లఖింపూర్ ఖేరి హింసాకాండలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రాను కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు వెనకేసుకొస్తున్నాయన్నారు. అధికారంలోకి వస్తే యూపీలో కులగణన చేపడతామని హామీ ఇచ్చారు. వచ్చే ఫిబ్రవరి– మార్చి నెలల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. -
వాంఖెడే X నవాబ్ మాలిక్
ముంబై: ముంబై తీరంలోని నౌకలో మాదకద్రవ్యాలు లభించిన కేసులో ఇప్పుడు అందరి దృష్టి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడేపైనే ఉంది. వాంఖెడేపై వచ్చిన ముడుపుల ఆరోపణలకు సంబంధించి బుధవారం ఆయనపై శాఖాపరమైన దర్యాప్తు మొదలైంది. ఈ కేసులో వాంఖెడేపై రోజుకొక కొత్త ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. అవినీతి దందా, ఫోన్ ట్యాపింగ్, సాక్షుల్ని ముందే కూడగట్టారు, జన్మతః ముస్లిం వంటి ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్, సమీర్ వాంఖెడేపై మధ్య పోరాటంగా ఈ కేసు మలుపులు తిరుగుతోంది. అయిదుగురు సభ్యులున్న విజిలెన్స్ దర్యాప్తు బృందం బుధవారం ఉదయం ముంబైకి చేరుకొని వాంఖెడేపై విచారణ మొదలు పెట్టింది. ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్న ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (డీడీజీ) జ్ఞానేశ్వర్ సింగ్ అవినీతి అరోపణలపై సమీర్ వాంఖెడే స్టేట్మెంట్ను రికార్డు చేసినట్టుగా మీడియాకి వెల్లడించారు. వాంఖెడే స్టేట్మెంట్ రికార్డు చేయడానికి నాలుగున్నర గంటలకు పైగా పట్టింది. ఎన్సీబీ కార్యాలయం నుంచి ఈ కేసుకి సంబంధించి కీలకమైన డాక్యుమెంట్లు కూడా తీసుకున్నారు. అయితే వాంఖెడే తనపై వచ్చిన ఆరోపణలపై ఏమంటున్నారో ఆయన వెల్లడించలేదు. శాఖాపరమైన దర్యాప్తు జరుగుతోంది కాబట్టి ఇప్పుడే వివరాలను బయటపెట్టలేమన్నారు. అవసరమైతే వాంఖెడే నుంచి మళ్లీ సమాచారం సేకరిస్తామని జ్ఞానేశ్వర్ సింగ్ తెలిపారు. మరోవైపు ఇదే కేసులో ఆర్యన్‌ఖాన్‌ని విడిచిపెట్టడానికి ఎన్సీబీ అధికారులు రూ.25 కోట్లు డిమాండ్ చేశారని ఆరోపించిన సాక్షి ప్రభాకర్ సాయిల్ స్టేట్మెంట్ను ముంబై పోలీసులు రికార్డు చేశారు. సాయిల్ రికార్డు పూర్తి చేయడానికి వారికి ఎనిమిది గంటల సమయం పట్టింది. మంగళవారం సాయంత్రం మొదలైన ప్రక్రియ బుధవారం తెల్లవారుజామున 3 గంటలకి ముగిసింది. మరోవైపు సాయిల్కి ఎవరూ హాని తలపెట్టకుండా మహారాష్ట్ర పోలీసులు ఆయనకు భద్రత ఏర్పాటు చేశారు. ఆర్యన్ బెయిల్‌పై కొనసాగుతున్న వాదనలు ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ బాద్షా షారుక్‌ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్ బెయిల్ పిటిషన్‌పై వరసగా రెండోరోజు బుధవారం బాంబే హైకోర్టులో వాదనలు కొనసాగాయి. ఆర్యన్‌ఖాన్, అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాలు కుట్ర చేశారని ఆరోపిస్తున్న ఎన్సీబీ ఈ అంశంలో అధికారికంగా ఎలాంటి అభియోగాలు నమోదు చేయలేదని న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌డబ్ల్యూ సాంబ్రే దృష్టికి లాయర్లు తీసుకువచ్చారు. అరెస్ట్ మెమోలో సరైన సాక్ష్యాధారాలేవీ లేవని సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీ చెప్పారు. మరోవైపు ఇదే కేసులో అరెస్టయిన మరో ఇద్దరికి ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పుడు తమ క్లయింట్లకు ఎందుకు ఇవ్వడం లేదని మరో న్యాయవాది అమిత్ దేశాయ్ ప్రశ్నించారు. తదుపరి విచారణ గురువారానికి వాయిదా పడింది. షారుఖ్‌కు గతంలో జరిమానా! బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌కు సమీర్ వాంఖెడేతో పరిచయం కొత్తదేమీ కాదు. 2011లో ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేసిన కాలంలోనే సమీర్... షారుఖ్‌కు చుక్కలు చూపించారు. అప్పట్లో హాలెండ్, లండన్లలో సెలవులు గడిపి ముంబైకి తిరిగివచ్చిన షారుఖ్ దగ్గర పరిమితికి మించిన అధిక బ్యాగేజీ ఉందని సమీర్ వాంఖెడే ఆయన్ను విచారించారు. రూ.1.5 లక్షల జరిమానా విధించి వదిలిపెట్టారు. -
సీబీఐ డైరెక్టర్‌కు సమన్లు
ముంబై: మహారాష్ట్ర మాజీ డీజీపీ, సీబీఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైశ్వాల్‌కు ముంబై పోలీసులు సమన్లు పంపారు. ఫోన్‌ట్యాపింగ్, డేటా లీక్ వ్యవహారానికి సంబంధించిన కేసులో ఈ నెల 14న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఈ–మెయిల్ ద్వారా జైశ్వాల్‌కు సమాచారమిచి్చనట్లు సైబర్ విభాగం పోలీసులు చెప్పారు. మహారాష్ట్రలో పోలీసు బదిలీల్లో అక్రమాల ఆరోపణలపై గతంలో ఐపీఎస్ అధికారిణి రష్మీ శుక్లా ఓ నివేదిక తయారు చేశారు. రాజకీయ నాయకులు, సీనియర్ అధికారులను విచారిస్తున్న సమయంలో వారి ఫోన్లు ట్యాపింగ్ జరిగాయని అనిపించేలా, కావాలనే ఈ నివేదికను లీక్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి నమోదైన కేసులో జైశ్వాల్‌కు తాజాగా సమన్లు పంపారు. -
ఇందిరా పార్క్ వద్ద ఉద్రిక్తత: ఛలో రాజ్‌భవన్ అడ్డగింత
-
ఇందిరా పార్క్ వద్ద ఉద్రిక్తత: ఛలో రాజ్‌భవన్ అడ్డగింత
సాక్షి, హైదరాబాద్: పెగాసెస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దేశవ్యాప్త పిలుపులో భాగంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఛలో రాజ్‌భవన్ కార్యక్రమం చేపట్టారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన బాట పట్టారు. ఈ సందర్భంగా ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేసిన అనంతరం రాజ్‌భవన్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ సమయంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాట, వాగ్వాదంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రాజ్‌భవన్ ముట్టడికి వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారు. పోలీసుల తీరును ఖండించారు. ఈ సందర్భంగా ఆయన ఇలా మాట్లాడారు.. ‘పెగాసస్ ఫోన్ ట్యాపింగ్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతల ఆందోళన బీజేపీ చేస్తున్న ఆగడాలు చూడలేక ప్రజాస్వామ్యవాదులు ఆందోళన చెందుతున్నారు.. స్వేచ్ఛ కోసం ఈ దేశంలో పోరాడాల్సి వస్తోంది. స్వాతంత్ర్యం తెచ్చుకున్నదే స్వేచ్ఛ కోసమని ఇప్పుడు ఆ స్వేచ్ఛనే హరించేశారు. స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థలు, ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతల ఫోన్లు ట్యాప్ అవడం దారుణం. ఉగ్రవాదుల సమాచారం తెలుసుకునేందుకు వాడే సాఫ్ట్‌వేర్‌ను ప్రతిపక్షాలపై బీజేపీ వాడుతోంది. ఉగ్రవాదులను అంత మొందించాల్సింది పోయి.. ప్రతిపక్షాలను బీజేపీ అంత మొందిస్తోంది. ప్రతిపక్షాలు లేకుండా చేసి , నియంతృత్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ కుట్ర చేస్తోంది. ఈ దేశానికి స్వేచ్ఛను తీసుకువచ్చింది కాంగ్రెస్సే. ఆ స్వేచ్ఛను హరిస్తుంటే చూస్తూ ఊరుకోలేక ఆందోళన చేస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని కుప్పకూల్చినప్పుడే ఈ దేశ ప్రజాస్వామ్యం నిలబడుతుంది.’ అని తెలిపారు. -
‘పెగాసస్ ఫోన్ ట్యాపింగ్’ వ్యవహారంపై కదలిక
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన పెగాసస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కదలిక వచ్చింది. పార్లమెంట్లో పోరాటం చేస్తున్న ప్రతిపక్షాలు చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. ఈ వ్యవహారం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందుకు చేరింది. స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ఉన్న శశిథరూర్ ఈ వ్యవహారంపై చర్యలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఈనెల 28వ తేదీన స్టాండింగ్ కమిటీ పౌరుల భద్రత, గోప్యతపై చర్చించనుంది. ఈ మేరకు ఐటీ, సమాచార, హోంశాఖకు కమిటీ సమన్లు జారీ చేయనుంది. వచ్చే బుధవారం సాయంత్రం 4 గంటలకు ఈ కమిటీ సమావేశమయ్యే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ నిఘా సాఫ్ట్వేర్ పెగాసస్ ద్వారా భారతదేశానికి చెందిన 40 మంది రాజకీయ నాయకులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాపింగ్‌కు గురయ్యాయని ఓ విదేశీ మీడియా కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నానా రభస మొదలైంది. దేశంలో పౌరుల భద్రత, గోప్యతకు భంగం కలిగించేలా కేంద్రం చేస్తోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. దీనిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆ క్రమంలోనే కాంగ్రెస్ ఎంపీగా ఉన్న శశిథరూర్ ఈ వ్యవహారంపై విచారణ చేయనున్నారు. -
రాజస్తాన్ సంక్షోభం.. నిజాన్ని అంగీకరించిన సీఎం
జైపూర్: ఫోన్ ట్యాపింగ్ అంశం గతేడాది రాజస్తాన్‌లో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఎమ్మెల్యేల ఫోన్ ట్యాప్ చేస్తున్నారనే ఆరోణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇవి నిజమని నిరూపిస్తే.. తాను రాజీనామా చేస్తానని.. రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించారు సీఎం అశోక్ గహ్లోత్. ఈ క్రమంలో తాజాగా తాము ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు అంగీకరించిది గహ్లోత్ సర్కార్. ఈ విషయాన్ని రాజస్తాన్ అసెంబ్లీ వెబ్సైట్లో చేర్చింది. సీనియర్ బీజేపీ నాయకుడు, మాజీ ఆరోగ్యశాఖ మంత్రి కాళిచరణ్ షరఫ్ గతేడాది అడిగిన ప్రశ్నకు బదులుగా రాజస్తాన్ అసెంబ్లీ వెబ్సైట్లో ఈ విషయాన్ని పోస్ట్ చేసింది. ‘‘ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవమేనా..ఒకవేళ నిజమే అయితే ఏ చట్టం కింద, ఎవరి ఆదేశాల మేరకు ట్యాప్ చేశారు. ఈ వివరాలను అసెంబ్లీ టేబుల్ మీద పెట్టండి’’ అని బీజేపీ ఎమ్మెల్యే కాళిచరణ్ షరాఫ్ ప్రశ్నించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ.. ‘‘ప్రజా ప్రయోజనార్థం, ప్రజల భద్రత కోసం... శాంతి భద్రతలకు భంగం కలిగించగల నేరాలను అడ్డుకునేందుకు టెలీఫోన్లను నియంత్రించడం జరిగింది. భారత టెలీగ్రాఫ్ చట్టం-1885లోని సెక్షన్ 5(2), భారత టెలీగ్రాఫ్ సవరణ చట్టం 2007, ఐటీ చట్టం 2000లోని సెక్షన్ 69 కింద సంబంధిత అధికారి ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకోవడం జరిగింది’’ అని ప్రభుత్వం వెల్లడించింది. సంబంధిత అధికారి నుంచి అనుమతులు తీసుకున్న తర్వాత మాత్రమే పై చట్టాల కింద రాజస్తాన్ పోలీసులు టెలీఫోన్లను నియంత్రించారంటూ చెప్పుకొచ్చింది. అయితే ఏయే నంబర్లతో ఉన్న ఫోన్లను ఇంటర్సెప్ట్ చేశారు.. ఎప్పుడు వాటిపై నిఘా పెట్టారు అనే వివరాలను మాత్రం ప్రభుత్వం వెల్లడించ లేదు. ప్రభుత్వం సమాధానం సరిగా లేకపోవడంతో సీఎం గహ్లోత్‌ని ఉద్దేశించి రాజస్తాన్ బీజేపీ అధ్యక్షుడు సతీశ్ పూనియా ట్విటర్లో విరుచుకుపడ్డారు. తన సొంత పార్టీ నేతలపైనే గహ్లోత్ కుట్రపన్నారంటూ మండి పడ్డారు. గాంధీవాదం ముసుగు వేసుకుని ప్రజాస్వామం కోసం మొసలి కన్నీరు కార్చుతున్నారంటూ సతీశ్ ఎద్దేవా చేశారు. గహ్లోత్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు అంగీకిరంచడంతో ప్రస్తుతం అందరి దృష్టి సచిన్ పైలట్ మీదనే ఉంది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు నిజమని తెలితే తాను సీఎం పదవికి రాజీనామా చేస్తానని గతంలో గహ్లోత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు సచిన్ పైలట్ ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తారా.. లేక మన్నించి వదిలేస్తారా అనే అంశంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. సచిన్ దీనిపై ఇంతవరకు స్పందించలేదు. కానీ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఒకరు మాట్లాడుతూ.. ‘‘ఫోన్ ట్యాపింగ్ అంశంలో కాంగ్రెస్ హై కమాండ్ ఎలా స్పందిస్తుందో చూశాకే మేము దీనిపై నిర్ణయం తీసుకుంటాము’’ అని తెలిపారు. చదవండి: రాజస్తాన్‌లో మళ్లీ రాజకీయ అలజడి! -
ఆంధ్రజ్యోతి తప్పుడు కథనం: ఆ పిల్‌ను కొట్టేయండి
సాక్షి, అమరావతి: న్యాయమూర్తుల ఫోన్లను ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందంటూ ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన నిరాధార, తప్పుడు కథనాన్ని ఆధారంగా చేసుకుని దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ప్రాథమిక దశలోనే కొట్టేయాలని రాష్ట్ర ప్రభుత్వం గురువారం హైకోర్టును అభ్యర్థించింది. ఈ వార్తా కథనం ప్రామాణికతను తెలుసుకోకుండా ప్రభుత్వంపై నిరాధారణ ఆరోపణలు చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలు చేయడం ద్వారా పిటిషనర్ న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేశారని తెలిపింది. తప్పుడు కథనం ప్రచురించిన ఆ పత్రికకు ఇప్పటికే లీగల్ నోటీసు జారీ చేశామని, ఆ తదుపరి చర్యలు కూడా ఉంటాయని వివరించింది. ప్రామాణికత లేని వార్తల ఆధారంగా పిల్ దాఖలు చేయడానికి కుదరదంది. ఇదే విషయాన్ని కుసుమలత వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పిందని పేర్కొంది. ఆంధ్రజ్యోతి ప్రచురించిన తప్పుడు కథనం ఆధారంగా విశాఖపట్నంకు చెందిన న్యాయవాది నిమ్మిగ్రేస్ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం విచారణార్హతపై అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రభుత్వం ఈ విషయంలో కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపింది. ఇందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది. అందులో భాగంగా ప్రభుత్వం తరఫున హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ కౌంటర్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో ప్రభుత్వం తరఫున హాజరవుతున్న అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కరోనాతో బాధపడుతుండటంతో హైకోర్టు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. (బ్యాంకు రుణం ఎగ్గొట్టి సొంత ఖాతాలకు..) -
ఏ మొహం పెట్టుకొని సీఎస్‌కు లేఖ రాశావ్
సాక్షి, అమరావతి: ఫోన్ ట్యాపింగ్ జరిగిందనడానికి ఆధారాలు సమర్పిస్తే చర్యలు తీసుకుంటామని డీజీపీ ఉత్తరం రాస్తే దాన్ని తప్పుపట్టిన చంద్రబాబు, ఇప్పుడు మళ్లీ ఏ మొహం పెట్టుకొని సీఎస్‌కు లేఖ రాశారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే జోగి రమేష్ నిలదీశారు. ఒక ఆధారం అయినా ఇవ్వండి అని డీజీపీ అడిగితే, అడగటానికి డీజీపీ ఎవరు అని ప్రశ్నించారని తెలిపారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ► ఎటువంటి ఆధారం, సమాచారం లేకుండా ఫోన్ ట్యాపింగ్ అంటూ చంద్రబాబు చేస్తున్న డ్రామాలు ఇకనైనా ఆపాలి. ఒక పత్రిక పిచ్చి రాతలు రాస్తే.. దాన్ని పట్టుకుని ప్రధానికి లేఖ రాయటం చూస్తుంటే చంద్రబాబు 40 ఇయర్స్ అనుభవం ఏమైందనే అనుమానం కలుగుతోంది. అసలు ఆయన బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడేనా? ► బాధ్యతగల సామాన్య పౌరులే ఆధారాలు చూపుతారు. అలాంటిది ప్రతిపక్ష నేతగా, రాజకీయాల్లో ఎంతో సీనియర్ అని చెప్పుకునే బాబుకు సామాన్య పౌరుడికి ఉన్న జ్ఞానం కూడా లేకపోవటం ఆశ్చర్యం. ► సైనికుల్లా పని చేస్తున్న 4 లక్షల మంది వలంటీర్లను, గ్రామ సచివాలయ సిబ్బందిని కించపరిచేలా మాట్లాడుతున్న లోకేష్‌ను చంద్రబాబు కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలిపించుకోలేరు. వార్డు మెంబర్‌గా లోకేష్‌ను పోటీ చేయిస్తే, వలంటీర్‌ను పెట్టి గెలిపించుకుంటాం. ఈ సవాల్‌ను బాబు స్వీకరించాలి. ఇటువంటి లోకేష్‌ను చంద్రబాబు నాలుగు శాఖలకు మంత్రిని, టీడీపీకి జాతీయ ప్రధాన కార్యదర్శిని చేశారు. ► చంద్రబాబు శిఖండిలా అడ్డుపడినా 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరుతాం. చంద్ర విఘ్నాలను అధిగమిస్తాం. గత ఎన్నికల్లో ప్రజలు దూరం పెట్టినా బాబుకు జ్ఞానం రాలేదు. ► భూముల్లో ఆవగింజంత అవినీతి కూడా జరగలేదు. అవినీతి గురించి బాబు మాట్లాడటం సిగ్గుచేటు. స్కాం బాబు అంటే నారా బాబు. ఏటీఎం బాబు, సూట్ కేసు బాబు అంటే లోకేష్ బాబే. జూమ్ మీటింగ్‌లకు తప్ప బాబు ఏపీకి పనికి రాడు అని ప్రజలు భావించే పరిస్థితి వచ్చింది. -
చంద్రబాబు చేస్తున్న డ్రామాలు ఇకనైనా ఆపాలి
-
ఆధారాలు చూపించండి బాబు: సజ్జల
సాక్షి, అమరావతి: తాము ప్రతిపక్షంలో ఉన్నపుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఫోన్‌ను ట్యాప్ చేయించారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అందుకు తగిన ఆధారాలను న్యాయస్థానానికి సమర్పించినట్లు తెలిపారు. ఏవైనా ఆరోపణలు చేస్తే ఆధారాలు చూపాల్సి ఉంటుందని, ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపిస్తున్న చంద్రబాబు ఇలాంటి ఆధారాలు ఎందుకు చూపడంలేదని ప్రశ్నించారు. ఈ మేరకు బుధవారం ట్వీట్ చేసిన సజ్జల.. టీడీపీ హయాంలో జరిగిన తన ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన పత్రాలను షేర్ చేశారు. (చంద్రబాబు తీరుపై విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం) మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైయస్సార్సీపీ నాయకుడిగా ఉన్న నాఫోన్‌ను చంద్రబాబుగారు @ncbn ట్యాపింగ్ చేయించారు. దీనికి సంబంధించిన ఆధారం ఇది. దీన్ని న్యాయస్థానాలకూ సమర్పించాం. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపిస్తున్న బాబుగారు ఇలా ఆధారాలు ఎందుకు చూపడంలేదు? pic.twitter.com/jthxGycxOf — Sajjala Ramakrishna Reddy (@SRKRSajjala) August 19, 2020 -
చంద్రబాబు సాయం కోర్టులకు అక్కర్లేదు
సాక్షి, న్యూఢిల్లీ: స్వయంప్రతిపత్తి కలిగిన న్యాయస్థానాలకు ప్రతిపక్ష నేత చంద్రబాబు సహాయం అవసరం లేదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. కుట్రలు జరుగుతున్నాయనుకుంటే కోర్టులకు తమ అధికారాలను ఎలా వినియోగించుకోవాలో బాగా తెలుసన్నారు. కోర్టుల విషయంలో రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవడం సరైన విధానం కాదని సూచించారు. జీవీఎల్ మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ► వ్యవస్థల గురించి అందరికంటే ఎక్కువగా చంద్రబాబుకే తెలుసు. వ్యవస్థల్లో లేని వాటిని కూడా ఆయన తనకు అనుకూలంగా చెప్పుకున్న రోజులున్నాయి. ఆయన హయాంలో సీబీఐని రాష్ట్రానికి రానివ్వకుండా చేశారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏ విషయంలో పడితే ఆ విషయంలో జోక్యం చేసుకునే అవకాశం లేదు. ► చంద్రబాబు లేఖలో నాకు తెలిసి తన ఫోన్ ట్యాప్ అవుతోందని చెప్పలేదు. ఒకవేళ అలా ఉన్నా కోర్టుల దృష్టికి తీసుకెళ్లాలి తప్పితే ఇలాంటి విషయాల్లో కేంద్రం జోక్యం చేసుకోదు. 2015లో ఆయన ఫోన్ ట్యాప్ అయితే రాష్ట్రమంతా మారుమోగింది. ► చంద్రబాబు ఏదైనా విచారణ జరగాలనుకుంటే ముఖ్యమంత్రికి లేఖ రాయాలి. ప్రధానికి కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఏవైనా ప్రాథమిక ఆధారాలు సేకరించి విచారణ కోరితే కేంద్రం సహకరిస్తుంది. రాష్ట్రాల అభ్యర్థన మేరకు, కోర్టుల ఆదేశాల మేరకు మాత్రమే సీబీఐ విచారణ ఉంటుంది. ► న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయని లేఖలో ప్రస్తావించారు. న్యాయమూర్తులు, కోర్టులకు స్వయం ప్రతిపత్తి ఉంది. తమ అధికారాలను ఎలా వినియోగించుకోవాలో వారికి బాగా తెలుసు. ► చంద్రబాబు ఆస్తులపై సీబీఐ విచారణ జరపాలని లక్ష్మీపార్వతి 2005లో దాఖలు చేసిన పిటిషన్‌పై 14 ఏళ్లుగా స్టే ఉంది. ఇదొక గిన్నీస్ బుక్‌లో చేర్చాల్సిన అంశం. అన్ని సంవత్సరాలు ఏరకంగా స్టే ఇచ్చారన్నది చాలా ప్రధానమైన అంశం. -
ట్యాపింగ్ శుద్ధ అబద్ధం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రముఖుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారన్న ఆరోపణలను సెల్‌ఫోన్ ఆపరేటర్లు నిర్ద్వందంగా తోసిపుచ్చారు. ప్రముఖుల నంబర్లను ట్యాపింగ్ చేయాలని కోరుతూ ఇంటెలిజన్స్ అధికారుల నుంచి ఏడాది కాలంగా తమకు ఎలాంటి అభ్యర్థన రాలేదని స్పష్టం చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ అంటే చెప్పినంతసులభం కాదని, ఎన్నో నిబంధనలు ఉంటాయని కమ్యూనికేషన్ విభాగానికి చెందిన అధికారులు వ్యాఖ్యానించారు. ► ఇంటర్సెప్ట్ కోసం గతంలో సీబీఐ, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), రాష్ట్రస్థాయిలో ఇంటెలిజెన్స్ విభాగం సెల్‌ఫోన్ ఆపరేటర్లకు నంబర్లు అందచేసేవి. 2016 తరువాత నిబంధనలు కఠినతరమయ్యాయి. ► కొత్త నిబంధనల ప్రకారం ఇంటర్సెప్ట్ కోసం కేంద్ర హోంశాఖ కార్యదర్శి లేదా రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి నుంచి 1885 టెలిగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 5(2) ప్రకారం లిఖితపూర్వక అనుమతి తప్పనిసరి. అత్యవసర సందర్భాల్లో ప్రభుత్వం నియమించిన అధీకృత అధికారి కూడా అనుమతి ఇవ్వవచ్చు. ప్రముఖుల నంబర్లు ఉంటే తిరస్కృతి.. ► ఇంటర్సెప్ట్ చేసే నంబర్లను అనుమతి పత్రంలోపొందుపరచాలి. హోంశాఖ కార్యదర్శి లిఖితపూర్వక అనుమతి ఇచ్చిన తరువాత ఆ నెంబర్లను డీవోటీకి సమర్పించాలి. డీవోటీ ఆ వివరాలను సెంట్రల్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా ఆయా సెల్‌ఫోన్ ఆపరేటర్లకు పంపుతుంది. సీఎంఎస్ ద్వారా వచ్చిన అభ్యర్థనను మాత్రమే సెల్‌ఫోన్ ఆపరేటర్లు ఆమోదిస్తారు. హోంశాఖ కార్యదర్శి అనుమతి లేకుండా వచ్చే ఏ అభ్యర్థననూ సెల్‌ఫోన్ ఆపరేటర్లు స్వీకరించరు.ఒకవేళ ఇందులో ప్రముఖుల నంబర్లు ఉంటే తిరస్కరిస్తారు. ఏడాదిగా ఎలాంటి అభ్యర్థన రాలేదు.. ► గత ఏడాది కాలంగా ఇంటర్సెప్ట్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి అభ్యర్థనా రాలేదని అతి పెద్ద సెల్‌ఫోన్ ఆపరేటర్లలో ఒకటైన ’బీఎస్ఎన్ఎల్’కు చెందిన ఓ అధికారి ధృవీకరించారు. అధికారులు, మంత్రులు, న్యాయమూర్తులు తదితర ప్రముఖులు తమ కంపెనీ సిమ్‌లనే ఉపయోగిస్తారని, వారి నెంబర్లు ఇంటర్సెప్ట్ కోసం వస్తే వెంటనే గుర్తించి తిరస్కరిస్తామన్నారు. గడువు మేరకే.. ► అత్యంత విపత్కర పరిస్థితుల్లో, విస్తృత ప్రజా ప్రయోజనాలు ఉన్నప్పుడు మాత్రమే నిబంధనలను కొద్దిగా సడలించడం జరుగుతుందని మరో సంస్థకు చెందిన అధికారి తెలిపారు. ఢిల్లీ మర్కజ్ యాత్రికుల వివరాలు దీనికి ఉదాహరణగా పేర్కొన్నారు. ’ఇంటర్సెప్ట్‌అభ్యర్థన గడువు కేవలం 60 రోజులు మాత్రమే. ఆ తరువాత మరో అభ్యర్థన తప్పనిసరి. ఇలా 180 రోజుల వరకు మాత్రమే అవకాశం ఉంది’ అని పేర్కొన్నారు. -
ఏదో చిన్న పిల్లల వ్యవహారంలా ఉంది
-
ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ 20 కి వాయిదా
సాక్షి, అమరావతి: ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై దాఖలైన వ్యాజ్యంపై రాష్ట్ర హైకోర్టు మంగళవారం విచారించింది. ప్రభుత్వం తరపున అడిషనల్ ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, న్యాయవాది సుమన్ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు విచారణను ఈనెల 20 కి వాయిదా వేసింది. ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించాలంటే.. సమాచారం ఏ సోర్స్ నుంచి వచ్చిందనేది చాలా ముఖ్యమైన అంశమని ప్రభుత్వ న్యాయవాదులు అంతకు ముందు కోర్టుకు తెలిపారు. ఈ పిల్‌ను చూస్తే ఏదో చిన్నపిల్లల వ్యవహారంలా ఉందని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ మీద హైకోర్టు జడ్జి మీడియాతో మాట్లాడినట్టుగా కథనం ప్రచురించారని, తమకు తెలిసినంత వరకు హైకోర్టు జడ్జి ఎవరూ కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏ మీడియా సంస్థతోనూ మాట్లాడలేదని నమ్ముతున్నట్టు కోర్టుకు విన్నవించారు. కాబట్టి.. ఈ కథనం అంతా అసహనంతో నిండిన కథనంగా వారు పేర్కొన్నారు. చట్ట ధిక్కరణకు పాల్పడుతూ కథనం రాశారని స్పష్టం చేశారు. (చదవండి: ట్యాపింగ్ శుద్ధ అబద్ధం) ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం పరువునష్టం నోటీసు ఇచ్చిందని కోర్టుకు తెలిపారు. చట్టపరమైన చర్యలకు సన్నద్ధమైందని వెల్లడించారు. ఈ కేసులో కథనాన్ని ప్రచురించిన మీడియా సంస్థను కూడా పార్టీని చేయండని న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ట్యాపింగ్ మీద వారికి ఎక్కడ నుంచి సమాచారం వచ్చింది? వారు ఈ కథనాన్ని ఎలా రాశారు? వారితో జడ్జి మాట్లాడి ఉంటే ఏం చెప్పారో కోర్టుకు చెప్పాలని అన్నారు. ‘జడ్జిల కదలికలపై నిఘా పెట్టారంటూ.. ఒక సీనియన్ ఐపీఎస్ అధికారి చెప్పారని పిటిషనర్ చెప్తున్నారు. ఆ వివరాలను పొందుపరుస్తూ అఫడవిట్ వేయమని కోర్టు ఆదేశించింది’ అని అడిషనల్ ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, న్యాయవాది సుమన్ పేర్కొన్నారు. -
ట్యాపింగ్ శుద్ధ అబద్ధం
సాక్షి, అమరావతి: ఏపీలో జడ్జిల ఫోన్లు ట్యాపింగ్ చేశారనేది శుద్ధ అబద్ధమని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పష్టం చేశారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఫోన్ ట్యాపింగ్ అంటూ ప్రధాన మంత్రికి చంద్రబాబు రాసిన లేఖలో మోదీని కీర్తించారు. అందితే జుట్టు.. అందకుంటే కాళ్లు అనే సిద్ధాంతం పాటిస్తున్న చంద్రబాబు పచ్చ కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందన్న విధంగా ఆరోపణలు చేస్తున్నారు’ అని ధ్వజమెత్తారు. అంబటి ఇంకా ఏమన్నారంటే.. ► ఎన్నికల ముందు మోదీని తీవ్రంగా దూషించిన చంద్రబాబు ఇంత బ్రహ్మాండంగా పొగిడే దశకు ఎపుడొచ్చారు? ► భార్యను ఏలుకోలేనివాడు దేశాన్ని ఎలా పాలిస్తాడని మోదీని విమర్శించిన చంద్రబాబు తాను సీనియర్‌నని.. మోదీ జూనియర్ అనలేదా? మోదీ వల్ల దేశానికి అన్యాయం జరుగుతోందని, మోదీ దుష్ట పాలనను అంతమొందిస్తానంటూ రాజకీయ పార్టీలను ఏకం చేసేందుకు రాష్ట్రాలు తిరగలేదా? ► ఫోన్ల ట్యాపింగ్ జరిగిందని ఏ ఆధారాలతో చంద్రబాబు మాట్లాడతాడు. చంద్రబాబు పది హత్యలు చేశాడని.. లోకేష్ మానభంగాలు చేశాడని ఆరోపిస్తే ఆయనిచ్చే సమాధానం ఏమిటి? గతంలో చంద్రబాబు ప్రభుత్వమే సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ ట్యాప్ చేయించింది. ఇజ్రాయెల్ నుంచి ఫోన్ ట్యాపింగ్ పరికరాలను టీడీపీ రాజకీయ అవసరాల కోసం తెప్పించారు. ► జడ్జీల ఫోన్లు ట్యాపింగ్ చేశారనేది శుద్ధ అబద్ధం. జర్నలిస్టులు సామాజికవేత్తల ఫోన్లను ట్యాపింగ్ చేయరు. చట్టప్రకారం ఉగ్రవాదులు, అసాంఘిక నిషేధిత శక్తుల ఫోన్లను ఇంటెలిజెన్స్వారు ట్యాపింగ్ చేస్తారు. ఇందులో తాను ఏ కోవలో ఉన్నారని చంద్రబాబు భయపడుతున్నారు? ఆయన చేసిన మనీల్యాండరింగ్ బయటకు వస్తుందని భయపడుతున్నాడా. ► వీటన్నింటి ఆధారంగా కోర్టులో రిట్ పిటిషన్లు వేయడం.. ఆ తర్వాత తాను ఒక లేఖ రాయడం, ఆ లేఖను ఎల్లో మీడియాలో ప్రచురించి డిబేట్లు చేయడం చంద్రబాబు మార్క్ రాజకీయం. ► ఇప్పుడు మోదీని పొగుడుతున్న బాబు రేపు ఏదైనా తేడా వస్తే ఆయన దుర్మార్గుడని మాట్లాడగలడు. ► ట్యాపింగ్‌పై కేంద్ర ప్రభుత్వ సంస్థతో విచారణ జరిపించాలని కోరిన చంద్రబాబు తన పాలనలో రాష్ట్రంలో సీబీఐ రాకుండా ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలి. ఒక ముఠాను తయారు చేసి.. ఫోన్ల ట్యాపింగ్ జరిగినట్టుగా ఓ పథకం ప్రకారం ఒక ఛానల్లో అబద్ధపు వార్తలు ప్రసారం చేయడం, మరో ఛానల్లో దానిపై చర్చలు పెట్టడం.. ఒకటి, రెండు పత్రికల్లో ఆ అసత్యాన్ని ప్రచురించడం ఆయనకే చెల్లింది. -
రాజస్తాన్ రచ్చ.. రంగంలోకి అమిత్ షా
సాక్షి, న్యూఢిల్లీ : రాజస్తాన్ రాజకీయాల్లో నెలకొన్న సంక్షోభం జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. స్వయంగా కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎమ్మెల్యేలతో భేరసారాలకు దిగారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించడం సంచలనం రేపుతోంది. మరోవైపు కేంద్ర మంత్రితో పాటు మరో ఇద్దరు నేతలతో రాజస్తాన్ ప్రభుత్వం ఇదివరకే కేసు నమోదు చేసి విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. ఫోన్ ట్యాంపరింగ్ ఆరోపణలపై స్పందించారు. దీనిపై పూర్తి నివేదికను తమకు అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదివారం ఆదేశించారు. దీంతో రాష్ట్ర రాజకీయం మరింత వేడెక్కింది. (గవర్నర్‌తో సీఎం భేటీ అందుకేనా!) ఇదిలావుండగా రాజస్తాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రాతో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లత్ సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. తిరుగుబాటు నేత సచిన్ పైలట్‌తో పాటు మరో 18 మందికి పార్టీ అధిష్టానం పంపిన సోకాజు నోటీసులను సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషిన్ సోమవారం విచారణకు రానుంది. తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుందనే దానిపై పార్టీ, ప్రభుత్వ వర్గాల్లో విస్తృత చర్చసాగుతోంది. తీర్పు సచిన్ వర్గాన్నికి వ్యతిరేకంగా వస్తే అసెంబ్లీలో బలపరీక్షలకు గెహ్లెత్ సిద్ధమవ్వక తప్పదు. దీనిని దృష్టిలో ఉంచుకునే ముఖ్యమంత్రి గవర్నర్‌తో సమావేశమైనట్లు తెలుస్తోంది. విశ్వాస పరీక్షకు తాము సిద్ధంగా ఉన్నామన్న కబురును కల్రాజ్ మిశ్రాకు చేరవేసేందుకే భేటీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక హైకోర్టు ఇచ్చి తీర్పుపై ప్రభుత్వ భవిష్యత్ ఆధారపడి ఉంది. (పైలట్‌తో 18 నెలలుగా మాటల్లేవ్..) -
రాజస్థాన్ ప్రభుత్వం ఫోన్లను ట్యాప్ చేస్తోందా
-
ఎవ్వరికీ వ్యక్తిగత గోప్యత మిగల్లేదు
న్యూఢిల్లీ: ఓ ఐపీఎస్ అధికారి ఫోన్ ట్యాపింగ్ విషయమై సుప్రీంకోర్టు తీవ్రంగా ప్రతిస్పందించింది. ‘ఎవ్వరికీ వ్యక్తిగత గోప్యత మిగలలేదు’ అని వ్యాఖ్యానించింది. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఓ ఐపీఎస్ అధికారికీ, వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫోన్లను ట్యాప్‌చేయడంపై కోర్టు స్పందించింది. ఫోన్ ట్యాపింగ్ చేసి పౌరుల వ్యక్తిగత గోప్యత హక్కును ఇలా హరించివేయొచ్చా? అంటూ ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అసలు మిమ్మల్ని ఫోన్ ట్యాప్ చేయాలని ఆదేశించెందెవరో, అందుకు కారణాలేమిటో పూర్తివివరాలను కోర్టుముందుంచాల్సిందిగా∙ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘ఇలా చేయడానికి కారణమేమిటి? ఏ ఒక్కరికీ వ్యక్తిగత గోప్యత హక్కు మిగల్లేదు. అసలీ దేశంలో ఏం జరుగుతోంది?’అని కోర్టు ప్రశ్నించింది. ఎవరివ్యక్తిగత విషయాలపైనైనా నిఘావేసి, వారి వ్యక్తిగత గోప్యతను హరించివేయొచ్చా అని కోర్టు ప్రశ్నించింది. ఐపీఎస్ అధికారి తరఫున వాదిస్తోన్న న్యాయవాదిపై ప్రత్యేక ఎఫ్ఐఆర్ నమోదు అయినప్పటికీ తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు అతనిపై బలవంతంగా ఎటువంటి చర్యలు తీసుకోరాదని కోర్టు స్పష్టం చేసింది. ఈ యేడాది ఫిబ్రవరి 9న సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కుంభకోణంలో ఆర్థిక ఆరోపణలపై స్పెషల్ డీజీపీ ముఖేష్ గుప్తా సహా ఇద్దరు అధికారులను ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఫిబ్రవరి 2015లో 25 సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కార్యాలయాల్లో ఏసీబీ, ఈఓడబ్ల్యూ ఏకకాలంలో నిర్వహించిన దాడుల్లో ఈ కుంభకోణం బయటపడింది. అయితే ఈ కోట్లాదిరూపాయల కుంభకోణంపై దర్యాప్తు జరిపేందుకు బాగెల్ ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 8న ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నేతృత్వంలో 12 మంది సభ్యులతో దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. -
నా ఫోన్ ట్యాపింగ్ చేశారు : మమత
కోల్‌కతా : తన ఫోన్ ట్యాపింగ్ చేశారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఫోన్ ట్యాంపింగ్ చేశారనడానికి తన వద్ద ఆధారాలు ఉన్నాయని ఆమె తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. మెబైల్ ఫోన్ల నుంచి సమాచారం సేకరించడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని ఆమె అభిప్రాయపడ్డారు. ఛత్ పూజా సందర్భంగా కోల్‌కతాలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడారు. తన ఫోన్ ట్యాప్ చేసినట్లు గతంలో చాలాసార్లు చెప్పానని.. ఇది పూర్తిగా భద్రతను అతిక్రమించడమేనని వ్యాఖ్యానించారు. ఇది వ్యక్తిగత స్వేచ్ఛ మీద దాడి అని విమర్శించారు. దీంతో మనం ఎవరితో స్వేచ్ఛగా మాట్లాడలేమని అన్నారు. అలాగే చాలా మంది ప్రముఖల వ్యక్తిగత సమచారం చోరీకి గురవుతుందని ఆరోపించారు. పలువురు జర్నలిస్టుల, లాయర్ల వ్యక్తిగత సమాచారం వాట్సాప్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా తస్కరణకు గురైందని ఆ సంస్థల అధికారులు అంగీకరించిన సంగతి తెలిసిందే. ఇందులో కేంద్ర ప్రభుత్వ ప్రమేయం ఉందని కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మమతా ఈ మేరకు స్పందించారు. -
ఫోన్‌ట్యాపింగ్ దుమారం: రంగంలోకి సీబీఐ
బెంగళూరు: బెంగళూరు మాజీ పోలీసు కమిషనర్ అలోక్ కుమార్ ఇంట్లో సీబీఐ అధికారులు గురువారం దాడులు నిర్వహిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా ఆయన నివాసంలో సీబీఐ బృందం తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. అలోక్ కుమార్ ప్రస్తుతం కర్ణాటక స్టేట్ రిజర్వు పోలీసు అదనపు డీజీపీగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల కుమారస్వామి ప్రభుత్వం తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొని.. అధికారాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. పలువురు కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు కుమారస్వామి ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి రాజకీయ సంక్షోభాన్ని సృష్టించారు. ఈ రాజకీయ సంక్షోభ సమయంలో అప్పటి సీఎం కుమారస్వామి తమ ఫోన్లను ట్యాప్ చేశారని పలువురు జేడీఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఓ ఫోన్ సంభాషణ క్లిప్ మీడియాకు లీక్ కావడంతో ఇది తీవ్ర దుమారం రేపింది. ఈ ఆడియో క్లిప్‌లో ఓ ఐపీఎస్ అధికారి పేరుతోపాటు కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్, మాజీ మంత్రి హెచ్డీ రేవణ్ణ తదితరులు పేర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో యడ్యూరప్ప ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ.. విచారణను చేపట్టింది. గత కుమారస్వామి ప్రభుత్వం తనతోపాటు మరో 300 మంది నాయకుల ఫోన్లను ట్యాప్ చేసిందని అన్హరత వేటుకు గురైన జేడీఎస్ ఎమ్మెల్యే ఏహెచ్ విశ్వనాథ్ ఆరోపించడం సంచలనం రేపింది. కాంగ్రెస్ నేతలు కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని కోరుతుండగా.. దీని వెనుక ఉన్నది కుమారస్వామియేనని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. -
థర్డ్ డిగ్రీలకు కాలం చెల్లింది
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా క్రిమినల్ కేసుల్లో నేర నిర్థారణ శాతం చాలా తక్కువగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. పోలీసులు అనుమానితుల పట్ల థర్డ్ డిగ్రీని ప్రయోగించడం, ఫోన్ల ట్యాపింగ్ లాంటి పురాతన విధానాలు నేరాలను అరికట్టడంలో ఆశించిన ఫలితాలను ఇవ్వలేవని చెప్పారు. బుధవారం ఢిల్లీలో పోలీస్ పరిశోధన, అభివృద్ధి సంస్థ (బీపీఆర్డీ) 49వ వ్యవస్థాపక దినోత్సవంలో అమిత్ షా మాట్లాడారు. దర్యాప్తులో పోలీసులు ఫోరెన్సిక్ ఆధారాలను వినియోగించుకోవాలని, వీటి ద్వారా మెరుగైన ఫలితాలు ఉంటాయని సూచించారు. నేర శిక్షా స్మృతి, భారతీయ శిక్షా స్మృతిని సవరించడంపై చర్చల ప్రక్రియను ప్రారంభించాలన్నారు. దీనిపై సూచనలు, సలహాలు సేకరించి హోంశాఖకు పంపాలన్నారు. శిక్షా కాలం ఏడేళ్లు అంతకు మించిన క్రిమినల్ కేసుల్లో ఫోరెన్సిక్ ఆధారాలను తప్పనిసరి చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. శాస్త్రీయ విధానాలను అనుసరించాలి ‘ఫోరెన్సిక్ ఆధారాలను సైతం జత చేస్తూ పోలీసులు సమగ్రవంతమైన చార్జ్‌షీటును కోర్టుకు సమర్పిస్తే నిందితుల తరపు న్యాయవాదులకు వాదించడానికి పెద్దగా అవకాశాలు ఉండవు. శిక్ష పడే అవకాశాలు సైతం బాగా పెరుగుతాయి. నేరగాళ్లు, నేర ప్రవృత్తి వ్యక్తుల కన్నా పోలీసులు నాలుగు అడుగులు ముందు ఉండటం అత్యవసరం. పోలీసులు వెనకపడకూడదు. బలగాల ఆధునికీకరణతోనే ఇది సాధ్యం. ఇది థర్డ్ డిగ్రీలు ప్రయోగించే కాలం కాదు. దర్యాప్తులో శాస్త్రీయ విధానాలను అనుసరించాలి. ఫోన్ల ట్యాపింగ్ సత్ఫలితాలు ఇవ్వదు. పౌర పోలీసింగ్, ఇన్ఫార్మర్ల వ్యవస్థతో చాలా ప్రయోజనాలున్నాయి. బీట్ కానిస్టేబుళ్ల విధానాన్ని బలోపేతం చేయాలి’ అని అమిత్ పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో ఫోరెన్సిక్ వర్సిటీ జాతీయ స్థాయిలో పోలీస్ ఫోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేయాలని కేంద్రం భావిస్తోందని అమిత్ షా వెల్లడించారు. వర్సిటీకి ప్రతి రాష్ట్రంలో అనుబంధ కాలేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. 12వ తరగతి తరువాత పోలీస్ దళాల్లోకి ప్రవేశించాలనుకునే విద్యార్థుల కోసం శిక్షణ ఇచ్చి పరీక్షల్లో వెయిటేజ్ కల్పిస్తామన్నారు. ఈమేరకు బీపీఆర్డీ అందచేసిన ప్రతిపాదనలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. గుజరాత్లో ఈ ప్రయోగం విజయవంతమైందని, ఫోరెన్సిక్ వర్సిటీల నుంచి పట్టా పొందిన విద్యార్థుల్లో ఒక్కరు కూడా నిరుద్యోగిలా మిగిలిపోలేదన్నారు. -
300 మంది ఫోన్లు ట్యాప్ చేశారు : సుమలత
మండ్య : ‘ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించడం మంచిదే, దీనివల్ల ఎవరు ఏం చేశారు అన్న అన్ని నిజాలు బయటకి వస్తాయి. ట్యాపింగ్ కేసుపై తప్పకుండా సీబీఐ దర్యాప్తు చేయించాల్సిందే’ అని మండ్య ఎంపీ సుమలత అంబరీష్ అన్నారు. తన ఫోన్ కూడా ట్యాప్ అయ్యిందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఆదివారం మండ్య తాలుకాలోని పణకనహళ్ళి గ్రామంలో సుమలత మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా జరగని విధంగా కర్ణాటకలో సుమారు 300 మంది ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపించారు. దీనిపై ఆరోపణలు రావడంతో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. త్వరలోనే ఎవరు ఎవరి ఫోన్లను ట్యాప్ చేశారో తప్పకుండా బయటకి వస్తుందని అన్నారు. నిజం వెలుగు చూస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎన్నికల సమయంలో తాను కూడా చాలా ఇబ్బందులు పడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. -
కుమారస్వామి బెదిరించారు: విశ్వనాథ్
బెంగళూరు సాక్షి/ శివాజీనగర/ మైసూరు: ఇద్దరు వ్యక్తులు ఫోన్లో మాట్లాడుకోవడాన్ని మూడో చెవి కూడా విందా?, అవుననే అంటున్న కొందరు నాయకులు. కన్నడనాట మళ్లీ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు కలకలం రేకెత్తిస్తున్నాయి. గత నెలాఖరు వరకు పరిపాలించిన జేడీఎస్– కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి హెచ్.డీ.కుమారస్వామి పలువురు ఎమ్మెల్యేలు, బీజేపీ నాయకుల ఫోన్లను ట్యాప్ చేయించారని తాజాగా తీవ్ర దుమారం రేగుతోంది. బీజేపీకి చెందిన మాజీ డిప్యూటీ సీఎం ఆర్.అశోక్, జేడీఎస్ అనర్హత ఎమ్మెల్యే హెచ్.విశ్వనాథ్‌తో పాటు పలువురు నాయకులు తమ ఫోన్ల ట్యాపింగ్‌జరిగిందని ఆరోపిస్తూ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గత నెలలో సంకీర్ణ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేల ఫోన్ల సంభాషణలను చాటుగా విన్నట్లు ఆరోపణలున్నాయి. ఇందుకు అప్పటి బెంగళూరు పోలీస్ కమిషనర్ అలోక్ కుమార్ సుత్రధారిగా భావిస్తున్నారు. కుమారస్వామి బెదిరించారు: విశ్వనాథ్ మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనతో పాటు అనర్హతకు గురైన ఎమ్మెల్యేలందరి ఫోన్లను ట్యాపింగ్ చేయించి ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారంటూ జేడీఎస్ అనర్హత ఎమ్మెల్యే హెచ్.విశ్వనాథ్ ఆరోపించారు. బుధవారం ఆయన మైసూరులో మీడియాతో మాట్లాడుతూ ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి ఫోన్ ట్యాప్ కావడంతో తమ ఫోన్లు కూడా ట్యాపింగ్‌కు గురయ్యాయన్న విషయం వెలుగు చూసిందన్నారు. ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడానికి ఇది కూడా ఒక కారణమన్నారు. వీటన్నింటి వెనుక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి హస్తం ఉందని, అనర్హత ఎమ్మెల్యేలను తమ అధీనంలోకి తెచ్చుకోవడానికి కుమారస్వామి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్‌కు గురైందని, రాజీనామాను ఉపసంహరించుకోకపోతే ఆడియో క్లిప్పులు బహిర్గతం చేస్తామంటూ ప్రభుత్వం కూలిపోకముందు కుమారస్వామి స్వయం గా ఫోన్ చేసి బెదిరించారని చెప్పారు. దీనిపై అనర్హత ఎమ్మెల్యేలమంతా న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నామన్నారు. తమ కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేయించారని ఆరోపించారు. ట్యాపింగ్‌పై విచారించాలి: జీటీ మైసూరు: ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై విచారణ జరిపించాలని జేడీఎస్ మాజీ మంత్రి జీటీ దేవేగౌడ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి తమకు ఎటువంటి సమాచారం లేదని, దానిపై ఆసక్తి కూడా లేదన్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పార్టీలోని స్నేహితులు కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. ఇక ముఖ్యమంత్రి యడియూరప్పతో భేటీ కావడం వెనుక మైసూరు పాల సమాఖ్య ఎన్నికల గురించి చర్చ తప్ప మరేమీ లేదన్నారు. మైసూరు దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు. -
వైఎస్సార్సీపీ నేతల ఫోన్లు ట్యాప్ చేశాం
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ఫోన్ ట్యాపింగ్ నిజమేనని హైకోర్టు ముందు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. టెలిగ్రాఫ్ చట్టం 1885లోని సెక్షన్ 5(2)ను అనుసరించే ఆ పని చేశామని తెలిపింది. దీనిపై స్పందించిన హైకోర్టు, ఈ వివరాలను కౌంటర్ రూపంలో లిఖితపూర్వకంగా తమ ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ ఉప్మాక దుర్గా ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తనతో పాటు తమ పార్టీకి చెందిన నాయకుల ఫోన్లను అధికార పార్టీ కోసం పోలీసులు ట్యాపింగ్ చేస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ పార్టీకి చెందిన ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేస్తున్నారో జాబితాను సమర్పించేలా కేంద్ర హోంశాఖ కార్యదర్శి, టెలి కమ్యూనికేషన్స్ కార్యదర్శి, వోడాఫోన్ ఏపీ, తెలంగాణ నోడల్ ఆఫీసర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు. అలాగే డీజీపీ ఠాకూర్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, ఇంటెలిజెన్స్ డీజీలను టెలిగ్రాఫ్ చట్టం కింద ప్రాసిక్యూట్ చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన హైకోర్టును అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ, ఏఏ సందర్భాల్లో ట్యాపింగ్ చేయవచ్చో సెక్షన్ 5(2) చెబుతోందని, ఇదే విషయంపై సుప్రీంకోర్టు సైతం స్పష్టమైన తీర్పునిచ్చిందని గుర్తు చేసింది. దీనికి ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ, సెక్షన్ 5(2)ను అనుసరించే ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పారు. తాము చట్ట ప్రకారమే నడుచుకున్నామని వివరించారు. అయితే ఈ వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి ఎస్పీ ఇంటెలిజెన్స్, విజయవాడ పేరు మీద గత వారం తమకు ఇచ్చిన సీల్డ్ కవర్‌ను వెనక్కి ఇచ్చేస్తున్నామని ధర్మాసనం ఏజీకి చెప్పింది. ఆ సీల్డ్ కవర్‌ను కోర్టు వద్ద ఉంచుకున్నా తమకు అభ్యంతరం లేదని ఏజీ చెప్పగా, ప్రస్తుతం ఆ వివరాలతో తమకు అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేస్తూ విచారణను జూన్ 6కి వాయిదా వేసింది. సెక్షన్ 5(2) చెబుతోంది ఇదే.. 1.దేశ సమగ్రత, సార్వభౌమత్వం 2. దేశ భద్రత 3.విదేశాలతో స్నేహ సంబంధాలు 4. పబ్లిక్ ఆర్డర్ 5.నేర ప్రేరేపణను నిరోధించడం. ఈ ఐదు సందర్భాల్లో మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చునని టెలిగ్రాఫ్ చట్టం చెబుతోంది. ఈ సందర్భాలు మినహా మిగిలిన ఏ సందర్భాల్లోనూ ఫోన్ ట్యాప్ చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు పీయూసీఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో స్పష్టమైన తీర్పునిచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం ఈ ఐదు సందర్భాలను అనుసరించే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లు చెబుతోంది. కాని వాస్తవానికి సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ నెంబర్‌తో పాటు ఇతర వైఎస్సార్సీపీ నేతల ఫోన్ నెంబర్లను కూడా ఉగ్రవాదుల జాబితాలో చేర్చి ట్యాప్ చేయాలని వోడాఫోన్ కంపెనీకి ప్రభుత్వం ఇచ్చింది -
ఫోన్ ట్యాపింగ్‌పై ఏపీ ప్రభుత్వానికి నోటీసులు
-
ఫోన్ ట్యాపింగ్‌పై ఏపీ ప్రభుత్వానికి నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీచేసింది. అంతేకాకుండా సర్వీస్ ప్రొవైడర్లకు కూడా నోటీసులు ఇచ్చింది. తమ పార్టీ నేతల ఫోన్లను ఏపీ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందని, దీనిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదును ఏపీ ప్రభుత్వానికి పంపినట్టు పేర్కొంది. వారం రోజుల్లోగా పిటిషన్‌కు సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 15వ తేదీకి వాయిదా వేసింది. -
రాజకీయ ప్రత్యర్థులపై.. ట్యాపింగ్ అస్త్రం!
సాక్షి, అమరావతి బ్యూరో : ‘రాష్ట్రంలో ఏం జరుగుతోంది.. ఎలా జరుగుతోంది.. ఎవరేం మాట్లాడుకుంటున్నారో నాకు తెలియాలి’....ఇదీ రాష్ట్ర పోలీసు బాస్‌లకు సీఎం చంద్రబాబు డైరెక్షన్. అందుకు ఆయన జపిస్తున్న మంత్రం.. అమలుచేస్తున్న కుతంత్రం ఫోన్ ట్యాపింగ్. అందుకోసం ఆయన ఇంటెలిజెన్స్ విభాగంలో ఓ ఉన్నతాధికారిని ప్రత్యేకంగా నియమించుకుని పోలీసు ఇంటెలిజెన్స్ వ్యవస్థను అడ్డగోలుగా దుర్వినియోగం చేస్తున్నారు. అసాంఘిక శక్తుల కట్టడికి ఉద్దేశించిన కాల్ ఇంటర్‌సెప్టర్ వ్యవస్థను తన రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టారాజ్యంగా వాడుకునేందుకు బరితెగిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులు, ఉన్నతాధికారులే టార్గెట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లజ్జగా అడ్డదారులు తొక్కుతోంది. రాష్ట్రంలో రాజకీయ ప్రత్యర్థులు, ఉన్నతాధికారులతోపాటు సొంత నేతల కదలికలు, ఫోన్ సంభాషణలను ట్యాపింగ్ చేయమని పోలీసు ఉన్నతాధికారులకు ప్రభుత్వ పెద్దలు విస్పష్టమైన ఆదేశాలిచ్చారు. నిబంధనల ప్రకారం ఫోన్ ట్యాపింగ్‌కు స్పష్టమైన విధివిధానాలున్నాయి. ఉగ్రవాద సంస్థలు, మావోయిస్టు పార్టీలు, ఇతర అసాంఘిక శక్తుల కట్టడికి మాత్రమే పోలీసులు ఆ పనిచేయాలి. ఎవరి ఫోన్లను ట్యాపింగ్ చేయాలన్న దానిపై కేంద్ర ప్రభుత్వానికి ముందస్తు సమాచారం ఇచ్చి మరీ అమలుచేయాల్సి ఉందని కేంద్ర టెలిగ్రాఫ్ చట్టం చెబుతోంది. కానీ, ఇందుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతోందని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ఓటుకు కోట్లు కేసు అనుభవంతో.. పక్కా వ్యవస్థను ఏర్పాటుచేసుకుని మరీ రాష్ట్ర ప్రభుత్వం ట్యాపింగ్ దారుణానికి పాల్పడుతోంది. తీవ్రవాదులు, అసాంఘిక శక్తుల కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ కేంద్రంగా కాల్ ఇంటర్‌సెప్టర్ వ్యవస్థ ఉండేది. విభజన అనంతరం మన రాష్ట్రంలో ఆ వ్యవస్థను ఏర్పాటుచేయలేదు. 2015లో తెలంగాణా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలుకు చంద్రబాబు ప్రయత్నించిన ఉదంతాన్ని ఈ కాల్ ఇంటర్‌సెప్టర్ వ్యవస్థ ద్వారానే కేసీఆర్ ప్రభుత్వం బట్టబయలు చేసింది. దాంతో ఉలిక్కిపడ్డ రాష్ట్ర ప్రభుత్వం అప్పటికప్పుడు అమరావతిలో ఈ వ్యవస్థ ఏర్పాటుకు నిర్ణయించింది. దీంతో రాష్ట్రంలో మావోయిస్టుల కట్టడికి కాల్ ఇంటర్‌సెప్టర్ వ్యవస్థను కొనుగోలుకు అనుమతివ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కేంద్రం అనుమతితో విదేశాల నుంచి భారీ మొత్తం వెచ్చించి ఈ వ్యవస్థను ఏర్పాటుచేసుకుంది. దీని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏటా అప్డేట్ చేయడానికి కూడా పెద్దఎత్తున ఖర్చుచేస్తోంది. మరి ఇంత భారీగా ప్రజాధనాన్ని వెచ్చిస్తూ నిర్వహిస్తున్న కాల్ ఇంటర్‌సెప్టర్ వ్యవస్థను భద్రతాపరమైన అంశాలకు కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుండటం అందరినీ విస్మయపరుస్తోంది. ట్యాపింగ్‌తో విజిలెన్స్ దాడులు కూడా.. కాగా, ఇటీవల విశాఖపట్నంతోపాటు పలు ప్రాంతాల్లో టీడీపీ రాజకీయ ప్రత్యర్థుల వ్యాపార సంస్థలపై విజిలెన్స్ దాడులు నిర్వహించి వేధించడం వెనుక కూడా ఫోన్ ట్యాపింగ్ అంశమే ప్రధాన పాత్ర పోషించిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో ఇలా మరింతగా అధికార దుర్వినియోగానికి పాల్పడేందుకు ప్రభుత్వం బరితెగించనుందని కూడా ఆ వర్గాలు చెబుతున్నాయి. అస్మదీయ అధికారుల కనుసన్నల్లో.. ఇంటెలిజెన్స్ విభాగాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఇప్పటికే దుర్వినియోగం చేస్తూ వస్తోంది. మరోవైపు.. ఇంటర్‌సెప్టర్ వ్యవస్థ అజమాయిషీకి ఈ విభాగంలో అస్మదీయ అధికారులను కూడా ఇటీవలే ప్రత్యేకంగా నియమించింది. ఇప్పటికే ఇంటెలిజెన్స్ విభాగంలో కీలక ఉన్నతాధికారిగా ఉన్న వ్యక్తి ఫక్తు టీడీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీడీపీ కొనుగోలులో ఈయనే క్రియాశీలంగా వ్యవహరించడం తెలిసిందే. తాజాగా రాజకీయ ప్రత్యర్థులు, ఉన్నతాధికారుల ఫోన్ ట్యాపింగ్ కోసం మరో అస్మదీయ అధికారిని ఇంటెలిజెన్స్ విభాగంలో ప్రభుత్వం నియమించింది. ఈ కాల్ ఇంటర్‌సెప్టర్ వ్యవస్థ కొనుగోలు చేయడంలో ఆయనే క్రియాశీలంగా వ్యవహరించారు. తరువాత ఆయన పలు జిల్లాల్లో విధులు నిర్వర్తించారు. తాజాగా ఆయన్ని మళ్లీ ఇంటెలిజెన్స్ విభాగానికి బదిలీ చేశారు. కాల్ ఇంటర్‌సెప్టర్ వ్యవస్థ పనితీరు, ఫోన్ ట్యాపింగ్‌లపై ఆయనకు పూర్తి అవగాహన ఉన్నందునే ఆయన్ని కీలకస్థానంలో నియమించారు. అంతేకాకుండా.. ఫోన్ ట్యాపింగ్, ఇతర సాంకేతిక అంశాలపై అవగాహన ఉన్న నలుగురు అధికారులను కూడా ఆయన పరిధిలోకి తీసుకువచ్చారు. ఆ బృందం ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఇటీవల ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగానే.. ఎంతో సమర్థుడిగా గుర్తింపు పొందిన ఓ కలెక్టర్‌ను హఠాత్తుగా అమరావతికి బదిలీ చేశారు. మరో ఐపీఎస్ అధికారిని లా అండ్ ఆర్డర్ నుంచి అప్రధాన పోస్టుకు మార్చారు. -
సిట్.. ఒక కీలుబొమ్మ
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిన ప్రతీసారి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) తెరపైకి తీసుకొస్తోంది. అధికార పార్టీ పెద్దలు, ప్రజాప్రతినిధుల అవినీతి, అక్రమాలు.. నేరాలపై చర్యలు తీసుకోకుండా ‘సిట్’ పేరిట కాలయాపన చేస్తూ తప్పించుకుంటోంది. కుంభకోణాలు, సంచలన çఘటనలపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించడం.. ఆ తర్వాత నివేదికలను బుట్టదాఖలు చేయడం, విచారణను అటకెక్కించడం పరిపాటిగా మారింది. విశాఖ ఎయిర్‌పోర్టులో వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నంపై విచారణకు ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. అయితే, ఈ ఘటన జరిగిన ఆరు రోజులు గడిచినా ఇప్పటిదాకా ‘సిట్’ తేల్చిందేమీ లేకపోవడం గమనార్హం. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం కూలీల కాల్చివేత, విశాఖలో భూ కుంభకోణం, కాల్‌మనీ సెక్స్ రాకెట్, విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుపై భూకబ్జా కేసు, హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబుపై ఓటుకు కోట్లు కేసులో ఫోన్ ట్యాపింగ్, తాజాగా విశాఖ మన్యంలో మావోయిస్టులు చేసిన జంట హత్యలు వంటి కీలక ఘటనలపై సిట్ దర్యాప్తులతో ఎలాంటి ఫలితంలేదు. ప్రత్యేక దర్యాప్తు బృందాలు ప్రభుత్వ పెద్దల చేతుల్లో కీలుబొమ్మలుగా మారుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. (కాల్‌డేటాను దాటని విచారణ) ► శేషాచలం అడవుల్లో 2015 ఏప్రిల్ 7న ఏపీ టాస్క్‌ఫోర్స్ పోలీసుల కాల్పుల్లో 20 మంది ఎర్రచందనం కూలీలు మరణించారు. ఈ ఘటనపై పౌరహక్కుల సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం కావడంతో రాష్ట్ర సర్కారు 2015 ఏప్రిల్ 24న సీనియర్ ఐపీఎస్ అధికారి ఎస్.రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ దర్యాప్తు అసలు నేరస్తుల పాత్ర బయటపడలేదు. ► తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఓటును టీడీపీ అభ్యర్థికి వేయించుకోవడానికి రూ.50 లక్షలు ఇస్తుండగా, 2015 మే నెలలో అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని ఏసీబీ అధికారులు ఆధారాలతో సహా పట్టుకున్నారు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం తెలంగాణ సీఎం కేసీఆర్‌తోపాటు పలువురిపై ఏపీలో 88 ఫోన్ ట్యాపింగ్ కేసులు నమోదు చేయించింది. ఫోన్ ట్యాపింగ్‌పై విచారణకు 2015 జూన్ 17న సిట్ ఏర్పాటు చేసింది. ఈ విచారణ అడ్రసు లేకుండా పోయింది. ► విశాఖపట్నం రూరల్‌లో అధికార టీడీపీ ముఖ్యనేతల కనుసన్నల్లోనే భూ కుంభకోణం జరగిందనే ఆరోపణలు గుప్పుమన్నాయి. దీంతో గతేడాది జూన్‌లో గ్రేహౌండ్స్ డీఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. భూ కుంభకోణంలో టీడీపీ మంత్రులు, నేతలదే ప్రధాన పాత్ర అని తేలడంతో ‘సిట్’ విచారణ అటకెక్కేసింది. ► విశాఖ ఏజెన్సీలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మట్టుబెట్టేందుకు మావోయిస్టులకు స్థానిక టీడీపీ నేతలే ఉప్పందించారని పోలీసులు నిర్ధారించి అరెస్టులు కూడా చేశారు. కానీ, సిట్ అధికారులు ఎక్కడా బహిరంగంగా మాట్లాడకుండా, నివేదిక ఇవ్వకుండా అర్ధంతరంగా వదిలేశారు. ► విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుపై భూ కబ్జా కేసుతో టీడీపీ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఈ నేపథ్యంలోనే విశాఖ తరహాలోనే విజయవాడ, గుంటూరులలో భూ వివాదాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేసి, అసలు వివాదాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేసింది. ► రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయవాడలోని కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ చేసిన దర్యాప్తు మూడేళ్లు దాటినా అతీగతీ లేదు. థర్ట్‌పార్టీ దర్యాప్తు ఎందుకంటే.. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే పని చేసే ప్రత్యేక దర్యాప్తు బృందాలపై నమ్మకం సన్నగిల్లుతోంది. అధికార పార్టీ నేతల అరాచకాలను ఇప్పటివరకు ఏ ఒక్క సిట్ కూడా తేల్చలేకపోయింది. ఒక్కరికైనా శిక్ష పడేలా ఆధారాలను సంపాదించలేదు. తాజాగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర డీజీపీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఘటన జరిగిన రోజే వారు చేసిన వ్యాఖ్యలు దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేలా ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేని ఏదైనా కేంద్ర దర్యాప్తు సంస్థతో(థర్డ్ పార్టీ) విచారణ జరిపిస్తేనే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు. -
‘కాంగ్రెస్ నేతల ఫోన్లన్నీ ట్యాపింగ్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతల ఫోన్లన్నింటినీ ట్యాపింగ్ చేస్తున్నారని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఇంటెలిజెన్స్ డీఐజీ ప్రభాకర్‌రావు, అడిషనల్ ఎస్పీ నర్సింగ్‌రావు, టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావులు కాంగ్రెస్ నేతల ఫోన్ ట్యాపింగ్‌లో కీలకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వీరి తీరుపై త్వరలోనే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ బంధువులం కాబట్టి తమకు ఏం కాదని ఇలాగే వ్యవహరిస్తే భవిష్యత్తులో ఏం జరగాలో అదే జరుగుతుందని హెచ్చరించారు. ఫోన్‌ట్యాపింగ్‌లు చట్ట వ్యతిరేక చర్య అని, అలా చేసిన వారెవరైనా జైలుకు పోతారని చెప్పారు. బుధవారం గాంధీభవన్‌లో మీడియాతో ఉత్తమ్ పలు అంశాలపై మాట్లాడా రు. ప్రగతి భవన్లో టీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. దీనిపైనా ఈసీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ గ్రాఫ్ తగ్గుతోందని, కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోందన్నారు. ప్రస్తుత పరిíస్థితుల్లో టీఆర్ఎస్కు 30 సీట్లు దాటవని జోస్యం చెప్పారు. ముందస్తు అభ్యర్థుల ప్రకటనతో టీఆర్ఎస్కు భారీ నష్టం జరిగిందన్నారు. రూ.500 కోట్లతో గల్ఫ్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.500 కోట్లతో గల్ఫ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. బుధవారం గాంధీభవన్‌లో గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన కార్మికులకు, వారి కుటుంబాలకు అండగా ఉండటానికి కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ’గల్ఫ్ భరోసా యాత్ర’ను ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి కుంతియా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ, గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని హామీ ఇచ్చారు. 2014 ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ తన ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రవాసుల సంక్షేమం పేరిట ఇచ్చిన హామీలను, అధికారంలోకి వచ్చిన తర్వాత తుంగలో తొక్కిందని విమర్శించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నారై సెల్ చైర్మన్ అంబాసిడర్ బీఎం వినోద్ కుమార్, టీపీసీసీ గల్ఫ్ ఎన్నారై కన్వీనర్ నంగి దేవేందర్ రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి మంద భీంరెడ్డి ఆధ్వర్యంలో గల్ఫ్ భరోసా యాత్ర కొనసాగుతుందన్నారు. గల్ఫ్ వలసలు అధికంగా ఉన్న కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పరిధిలోని 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈయాత్ర నిర్వహిస్తామని చెప్పారు. టీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడాలి: ఉత్తమ్ టీఆర్ఎస్ దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేసీఆర్ నాలుగేళ్ల పాటు ప్రజలకు ఆశలు చూపించి మోసం చేయడమే కాకుండా నిలదీసిన వారిని అణచివేశారని దుయ్యబట్టారు. హామీలు నెరవేర్చలేకనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యారని ఆయన ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. గాంధీభవన్‌లో బుధవారం మిర్యాలగూడ టీఆర్ఎస్ నేత అమరేందర్ రెడ్డి, నర్సాçపూర్ టీఆర్ఎస్ జెడ్పీటీసీ జయశ్రీ, హైదరాబాద్ మలక్‌పేట మాజీ కార్పొరేటర్ టీఆర్ఎస్ నేత సీహెచ్ శ్రీనివాస్, డోర్నకల్‌కు చెందిన భరత్ రెడ్డిలు తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొత్తగా చేరిన వారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ మోసపూరిత హామీలతో కాలం గడిపిన టీఆర్ఎస్కు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. ఈ ఎన్నికలు కేసీఆర్ కుటుంబం, తెలంగాణ ప్రజల మధ్య జరుగుతున్న ఎన్నికలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేద వైశ్యు లు, రెడ్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా మని ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. -
ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం ఎవరికీ లేదు
సాక్షి, కామారెడ్డి: ఇతరుల ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం ఎవరికీ లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, శాసన మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంచనూరు గ్రామంలోని 50 మంది యువకులు ఆయన సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే అధికారం ఎవరికీ లేదని తెలిపారు. దేశానికి ముప్పు ఉందనుకున్న సమయంలో కేంద్ర హోం శాఖ అనుమతి తీసుకుని మాత్రమే ట్యాప్ చేస్తారని పేర్కొన్నారు. కానీ తెలంగాణలో కొందరు అధికారులు కూడా తమ ఫోన్లు ట్యాపింగ్ గురవుతన్నాయేమోనని భయపడుతున్నారని ఆయన ఆరోపించారు. ట్యాపింగ్ ద్వారా ఏదైనా సమాచారం దొరుకుతుందని వెతుకుతున్నారని.. వారు ఎంత వెతికినా పర్వలేదని అన్నారు. తన ఫోన్ కూడా మార్చలేదని తెలిపారు. తన ఒక్కడి నెంబర్ మాత్రమే కాదని.. ఇంకా చాలా మంది నెంబర్లు ట్యాప్ చేస్తున్నారని మండిపడ్డారు. కాగా, అధికార టీఆర్ఎస్ ప్రోద్బలంతో పోలీసు ఉన్నతాధికారులు తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారని శాసన మండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఆయన గవర్నర్ నరసింహాన్‌కు కూడా లేఖ రాశారు. -
టీడీపీలో ఫోన్ ట్యాపింగ్ రగడ
-
కర్ణాటక: బీజేపీ సంచలన ఆరోపణలు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఎమ్మెల్యేల కొనుగోళ్లకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తల నడుమ.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బీజేపీలో కలకలం రేపుతున్నది. మా ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు: జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బీజేపీ రూ.100కోట్లు ఆఫర్ చేస్తున్నదన్న కుమారస్వామి ఆరోపణలను కొట్టిపారేసిన కాషాయదళం... ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తెచ్చింది. కర్ణాటక ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌లకు పాల్పడుతున్నదని, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలే టార్గెట్‌గా వ్యవహారం నడుస్తున్నదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు బుధవారం ఫిర్యాదులు వెళ్లాయి. బీజేపీ ఎంపీలు శోభా కరంద్లాజే, జీఎం సిద్ధేశ్వర, పీసీ మోహన్‌లు ఉమ్మడిగా కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాశారు. ‘‘కర్ణాటకలో అధికార దుర్వినియోగానికి సంబంధించి మా వద్ద స్పష్టమైన కారణాలున్నాయి. చట్టవిరుద్ధంగా మా ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై వెంటనే జోక్యం చేసుకోండి..’ అని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం సిద్దరామయ్య ఆపద్ధర్మముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ వ్యవహారంపై కాంగ్రెస్ స్పందించాల్సిఉంది. కేంద్రానికి బీజేపీ ఎంపీ శోభ రాసిన లేఖ The #kannadigas mandate is clear and it favours BJP only. now they are tapping phones of @BJP4Karnataka ‘s leaders . its hard to see people can stoop this level for power. The saga of unholy nexus continues #KaranatakaVerdict pic.twitter.com/ebkTxgOlrQ — Shobha Karandlaje (@ShobhaBJP) May 16, 2018 -
మళ్లీ ఫోన్ ట్యాపింగ్
రాష్ట్రంలో మళ్లీ ఫోన్ ట్యాపింగ్ రగడ తెరపైకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల ఫోన్ సంభాషణలను చాటుగా వింటోందని రాష్ట్ర హోంమంత్రి మరోసారి ఆరోపణలు సంధించడం ఆసక్తికరంగా మారింది. కొద్దినెలల కిందట సీఎం సిద్ధరామయ్యతో పాటు పలువురు మంత్రులు ఇవే ఆరోపణలు చేయడం తెలిసిందే. బనశంకరి: కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేతల ఫోన్లను కేంద్ర ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి రామలింగారెడ్డి ఆరోపించారు. దివంగత ప్రధానమంత్రి లాల్‌బహదూర్‌శాస్త్రి 52వ వర్ధంతి సందర్భంగా గురువారం విధానసౌధ ఆవరణలోనున్న శాస్త్రి విగ్రహానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్‌పై చాలారోజుల కిందటే ప్రస్తావించానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన వారే ట్యాపింగ్‌కు పాల్పడుతున్నారు, ఇది చేయడానికి ఇతరులకు సాధ్యమా? అని ప్రశ్నించారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నిరంతరం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతున్నారని, చట్టం ప్రకారం ఇతరుల ఫోన్ ట్యాపింగ్ చేయడం తప్పు, దీనిని ఉన్నత న్యాయస్థానాలు ప్రశ్నించాలని మంత్రి పేర్కొన్నారు. పోలీసుల స్థైర్యంపై దాడులు చేస్తున్నారు చిక్కమంగళూరు జిల్లా మూడగెరె తాలూకాలో డిగ్రీ విద్యార్థిని ధన్యశ్రీ ఆత్మహత్య కేసులో బుధవారం బెంగళూరులో సంతోష్ అనే యువకుడితో పాటు మొత్తం నలుగురిని అరెస్ట్ చేశామని రామలింగారెడ్డి తెలిపారు. పోలీస్‌ల నైతికస్థైర్యంపై బీజేపీ యువమోర్చా దౌర్జన్యానికి పాల్పడుతున్నట్లు సమాచారం ఉందన్నారు. గతంలో బీజేపీ ప్రభుత్వం ఉండగా దౌర్జన్యాలు అధికమయ్యాయని, తమ ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన అనంతరం తగ్గిందన్నారు. కానీ అక్కడక్కడ ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయన్నారు. పోలీసులు నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. అంతకుముందు లాల్‌బహదూర్ శాస్త్రి గురించి మాట్లాడిìన రామలింగారెడ్డి పేదల ఆకలి తీర్చడానికి రేషన్ వ్యవస్థను అమల్లోకి తీసుకువచ్చారని, కరువులను సమర్థంగా ఎదుర్కొన్నారని చెప్పారు. -
మా ఫోన్లను కేంద్రం ట్యాప్ చేస్తోంది..
కర్ణాటక సీఎం సిద్ధు, హోంమంత్రి రామలింగారెడ్డి ఆరోపణ సాక్షి, బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తుండగా, కన్నడనాట అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీల మధ్య ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ గొడవ మొదలైంది. బెంగళూరులో సీఎం క్యాంపు కార్యాలయంలో హోం మంత్రి రామలింగారెడ్డి మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ....‘రాష్ట్రానికి చెందిన కొంత మంది మంత్రులతో పాటు ప్రముఖ నేతల ఫోన్లను కేంద్ర ప్రభుత్వం ట్యాప్ చేస్తోంది. గత కొంత కాలంగా కేంద్రం ఈ విధంగా ఫోన్లను ట్యాప్ చేస్తూ వస్తోంది’ అని ఆరోపించారు. ’రాష్ట్ర ప్రభుత్వం ఎవరి ఫోన్లనూ ట్యాపింగ్ చేయడం లేదు. బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో ఎంత మాత్రం వాస్తవం లేదు. కేవలం కేంద్రం చేస్తున్న ఫోన్ ట్యాపింగ్‌ను కప్పిపుచ్చుకునేందుకే ఇలా ఆరోపణలు చేస్తున్నారు’ అని ఆయన అన్నారు. సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ...‘కేంద్రం ఎప్పటి నుంచో రాష్ట్ర మంత్రులు, ఇతర నేతల ఫోన్లను ట్యాప్ చేస్తూ వస్తోంది. అయితే ఈ అంశంపై నేను ఇప్పుడు మాట్లాడబోను. ఎందుకంటే ఇలాంటి చిల్లర విషయాలపై స్పందించేంత తీరిక నాకు లేదు’ అని వ్యాఖ్యానించారు. -
ఐపీఎస్ ఫోన్‌నే ట్యాప్ చేస్తారా?
► ఇదేమి పరిపాలన ► బాధ్యులపై చర్యలు తీసుకోరెందుకు? ► విధానసభలో బీజేపీ పక్షనేత శెట్టర్ ► ఐజీపీ చరణ్‌రెడ్డి ఫోన్‌ను డీసీపీ హిలోరియా ట్యాప్ చేయడంపై ఆగ్రహం సాక్షి, బెంగళూరు: ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్ల ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారం బుధవారం విధానసభలో ప్రతిధ్వనించింది. ఈ విషయంలో అధికార కాంగ్రెస్ – పార్టీ, ప్రధాన విపక్షమైన బీజేపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. జీరో అవర్‌లో బీజేపీ పక్షనేత జగదీష్ శెట్టర్ మాట్లాడుతూ... ఐజీపీ అయిన చరణ్‌రెడ్డి ఫోన్‌కాల్‌ను డీసీపీ అజయ్ హిలోరియా అక్రమంగా ట్యాప్ చేసి ఆ వివరాలను బహిరంగ పరడం ఎంత వరకూ సమంజసమని నిలదీశారు. దీని వల్ల రాష్ట్రంలో పాలనా వ్యవస్థ ఎంత అధ్వాన్నంగా తయారయ్యిందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ ఘటన జరిగి దాదాపు ఏడాది గడుస్తున్నా ఇప్పటివరకూ బాధ్యులపై ఎందుకు చర్యలు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలనపై సర్కారుకు పట్టు లేకపోతే నిజాయితీగల అధికారులు స్వతంత్రంగా పనిచేయలేరన్నారు. ‘అసలు ఫోన్ ట్యాపింగ్‌కు అనుమితి ఇచ్చింది ఎవరు? ఒక వేళ అనుమతి లేకుండానే ఫోన్ ట్యాప్ చేయడం నేరం కాదా? ఆ యంత్ర పరికరాలు ఎలా సమకూర్చుకున్నారు.?’ అన్న విషయాల పై ప్రభుత్వం వెంటనే బహిరంగంగా సమాధానం చెప్పాలన్నారు. ఉగ్రవాదులు, మావోయిస్టుల ఫోన్లను ట్యాప్ చేయడం చూశాంకాని ఐపీఎస్ అధికారుల ఫోన్లను ట్యాప్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఈ సమయంలో అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే స్పీకర్ కోళివాడ సర్దిచెప్పారు. మంత్రి ఎం.బీ పాటిల్ మాట్లాడుతూ పాలనా వ్యవస్థ పై ప్రభుత్వానికి పట్టు లేదనడం సరికాదన్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయమై శాసనసభకు ప్రభుత్వం తరఫున స్పష్టతనిస్తామని తెలిపారు. ఇదీ ట్యాపింగ్ కథ గత ఏడాది సెప్టెంబర్‌లో కావేరి నదీ జలాల వివాద సమయంలో ఆందోళనకారులు బెంగళూరులో విధ్వంసానికి పాల్పడ్డారు. ఆ సమయంలో అదనపు పోలీస్ కమిషనర్‌గా ఉన్న చరణ్‌రెడ్డి పశ్చిమ విభాగ డీసీపీ అజయ్ హిలోరితో నగరంలో పరిస్థితులు శృతి మించకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఫోన్లో చర్చించారు. అనుమానితుల ఫోన్లపై నిఘా ఉంచాలని కూడా చర్చించారు. విధ్వంసానికి పాల్పడ్డట్లు ఆరోపణలు రావడంతో బ్యాటరాయనపుర పోలీసులు అరెస్ట్ చేసిన కన్నడ సంఘానికి చెందిన కార్యకర్త ప్రకాశ్‌ను విడుదల చేయాలంటూ చరణ్‌రెడ్డి డీసీపీ అజయ్‌హిలోరికి సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఫోన్ సంభాషణను డీసీపీ అజయ్ హిలోరీ ఓ విలేఖరికి అందించారంటూ అదనపు కమిషనర్ చరణ్‌రెడ్డి అప్పటి డీజీపీ ఓం ప్రకాశ్‌కు ఫిర్యాదు చేశారు. కొద్దిరోజులకే ఓంప్రకాశ్ రిటైర్ కావడంతో తదుపరి డీజీపీ ఆర్కె దత్తా... చరణ్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపి నివేదిక అందజేయాలని నగర పోలీస్ కమిషనర్ ప్రవీణ్‌సూద్‌ను ఆదేశించారు. -
జడ్జీల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయా?
జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయన్న అనుమానాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తం చేశారు. అయితే ఆయన ఆరోపణలను కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెంటనే ఖండించారు. ''ఫోన్లో మాట్లాడొద్దు, అవి ట్యాప్ అవుతున్నాయి'' అంటూ ఇద్దరు జడ్జీలు మాట్లాడుకోవడం తాను విన్నానని, ఇలా జడ్జీల ఫోన్లను ట్యాప్ చేయడం సరికాదని కేజ్రీవాల్ చెప్పారు. అది నిజమో కాదో తనకు తెలియదు గానీ.. ఒకవేళ నిజమైతే మాత్రం చాలా ప్రమాదకరమైన పరిణామమని ఆయన వ్యాఖ్యానించారు. ఇలా జరిగితే అసలు న్యాయవ్యవస్థకు స్వాతంత్ర్యం ఎక్కడ ఉంటుందని ఆయన ప్రశ్నించారు. ఎవరైనా జడ్జి ఏదైనా తప్పు చేసినా, అప్పుడు కూడా వాళ్ల ఫోన్లు ట్యాప్ చేయకూడదని.. సాక్ష్యాలు సేకరించడానికి ఇంకా చాలా రకాల మార్గలున్నాయని కేజ్రీవాల్ అన్నారు. అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలను కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తీవ్రంగా ఖండించారు. భారతదేశంలో ఇప్పటివరకు జడ్జీల ఫోన్లను అసలు ట్యాప్ చేయలేదన్న విషయాన్ని తాను కచ్చితంగా చెప్పగలనని ఆయన అన్నారు. -
ఫోన్లు ట్యాపింగ్ చేయిస్తున్న చంద్రబాబు
వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి మండిపాటు సాక్షి,హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పేది అభివృద్ధి మంత్రం.. చేసేది అవినీతి తంత్రమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. తనను ప్రశ్నించేవాళ్లపై, అసహనంగా ఉన్న ప్రజలపై, ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తున్న ప్రజా సంఘాలపై, తన అవినీతిపై అనునిత్యం పోరాటం చేస్తున్న ప్రతిపక్షాలపై భరించలేని తత్వంతో ఎన్నో దారుణాలకు పాల్పడుతున్నారని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. భూమన శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం వైఎస్సార్సీపీ నేతల ఫోన్లు ట్యాప్ చేస్తోందని ఆరోపించారు. దీనికి సంబంధించి తమ వద్ద కచ్చితమైన ఆధారాలున్నాయని అన్నారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు అదే అంశాన్ని ఆయుధంగా చేసుకున్నారని చెప్పారు. ప్రజా సంఘాలను, ప్రతిపక్షాలను, తమను వ్యతిరేకించే ప్రతి ఒక్కరినీ లోబరుచుకునేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని దుయ్యబట్టారు. వ్యతిరేకించే వారందరిపైనా నిఘా: ‘‘1885,1971 ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం.. కేంద్ర హోంశాఖ అనుమతితో దేశద్రోహుల ఫోన్లను మాత్రమే ట్యాప్ చేస్తారు. కానీ, చంద్రబాబు అవేమీ పట్టించుకోకుండా తనను వ్యతిరేకించే ప్రతి ఒక్కరి మీదా నిఘా వేస్తూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షంతోపాటు పారిశ్రామికవేత్తలు, పోలీసు అధికారులు, పత్రికల యజమానులు, తనను వ్యతిరేకించే విలేకరులు, ఆఖరికి సొంత పార్టీ నేతల ఫోన్లను సైతం చంద్రబాబు ట్యాప్ చేయిస్తున్నారు. చంద్రబాబుకు దమ్మూ ధైర్యం ఉంటే తామేమీ ఫోన్లను ట్యాప్ చేయలేదని స్పష్టంగా ప్రకటించాలి. లేకపోతే ప్రభుత్వం చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతాం. ప్రజా సంఘాలను కలుపుకుని సర్కారు తీరుపై పోరాడుతాం’’ అని భూమన హెచ్చరించారు. -
‘ ప్రభుత్వం మా ఫోన్లు ట్యాపింగ్ చేస్తోంది’
-
ట్యాపింగ్‌పై ప్రభుత్వం వివరణ ఇవ్వాలి: చాడ
హైదరాబాద్: జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వివరణ ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి బుధవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. కోదండరాం ఫోన్‌ను ట్యాప్ చేయడం వ్యక్తి స్వేచ్ఛను హరించడం, ప్రాథమిక హక్కుకు భంగం కలిగించడమే అవుతుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపితే, ఫోన్‌ట్యాపింగ్‌కు పాల్పడతారా అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని సీపీఐ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. -
నాపై నిఘా ఎందుకో ప్రభుత్వమే చెప్పాలి
తన ఫోన్‌ను ట్యాపింగ్ వార్తలపై కోదండరాం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం తన ఫోన్‌ను ట్యాపింగ్ చేస్తున్నట్లు మీడియాలో వచ్చిన కథనాలపై తెలంగాణ జేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం ఘాటుగా స్పందించారు. తనపై నిఘా ఎందుకు పెట్టిందో, ఫోన్‌కాల్స్‌ను ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు. మీడియా కథనాలపై తన వ్యక్తిగత మిత్రులు, శ్రేయోభిలాషులు మాట్లాడారని, ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న మాట నిజమేనని చెబుతున్నారని వెల్లడించారు. ప్రజాస్వామిక ప్రభుత్వాలు, ప్రజాస్వామికంగా వ్యవహరించాలని సూచించారు. ఇలాంటి నిఘాను వ్యతిరేకించాలని, దాన్ని రూపుమాపాలని కోరారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫోన్లలో తాను మాట్లాడే రహస్యాలేవీ లేవన్నారు. తెలంగాణ సాధన ఉద్యమం, రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అభివృద్ధి కోసం పోరాడుతున్న క్రమంలోనూ చట్టానికి లోబడే వ్యవహరిస్తున్నామన్నారు. తాము రాజ్యాంగ పరిధికి లోబడి పనిచేయాలని స్పష్టంగా రాసుకున్నామన్నారు. చట్టానికి లోబడి, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రజలకోసం పనిచేస్తున్న జేఏసీ లాంటి సంస్థలపై నిఘా అవసరమే లేదన్నారు. ప్రభుత్వంలో ఉన్నవారు ఎప్పుడు కోరినా వివరాలన్నీ ఇవ్వడానికి అభ్యంతరం లేదన్నారు. తాము ఫోన్లలో ఏం మాట్లాడతామో బయటా అదే చెప్తామన్నారు. ట్యాపింగ్‌ల వంటివి దీర్ఘకాలంలో ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ప్రజాస్వామ్య విలువలు, సంప్రదాయాలను పాటిస్తే నిఘా అవసరం ఉండదన్నారు. ప్రభుత్వానికి అభద్రత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతోపాటు అంతర్గత రాజకీయ వ్యవహారాలపై ప్రభుత్వ పెద్దలు అభద్రతాభావంలో ఉన్నారని జేఏసీ ముఖ్యులు విశ్లేషిస్తున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంగా తెలంగాణ ఉద్యమం సాగిందని, తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులపై టీఆర్ఎస్లోనే ఆందోళన ఉన్నట్టుగా కనపడుతోందని అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 26 నెలల్లో ఇంకా ఆంధ్రా కాంట్రాక్టర్లు అన్ని రంగాల్లో పెత్తనం చేయడంపై టీఆర్ఎస్లోనే తీవ్ర అసంతృప్తి నెలకొందని, అందుకే ప్రభుత్వంలోని పెద్దలు భయపడుతున్నట్టుగా కనిపిస్తోందని జేఏసీ ముఖ్య నాయకుడొకరు వ్యాఖ్యానించారు. ఇదే ప్రజాసంఘాలపై నిఘాకు కారణం కావొచ్చని జేఏసీ నాయకుడొకరు చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ సిగ్గుచేటు: రావుల సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఫోన్‌ను ప్రభుత్వం ట్యాప్ చేయడం సిగ్గుచేటని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం ఎన్టీఆర్ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ చివరకు తెలంగాణ ఉద్యమకారులపై కూడా నిఘా పెట్టడం ప్రభుత్వ దిగజారుడుతనాన్ని రుజువు చేస్తోందన్నారు. వ్యక్తి స్వేచ్ఛను హరించే హక్కు ఏ ప్రభుత్వానికీ ఉండదన్నారు. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న డబుల్ బెడ్రూం ఇళ్ల పరిస్థితి ఏమైందో అంతుబట్టడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య తెలంగాణ కోసం టీజేఏసీ పనిచేయాలని రావుల కోరారు. -
'కోదండరామ్ ఫోన్ ట్యాప్ చేయడం సిగ్గుచేటు'
హైదరాబాద్ : తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఫోన్‌ను టీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాపింగ్ చేయడం సిగ్గుచేటని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. చివరకు తెలంగాణ ఉద్యమ కారులపై కూడా నిఘా పెట్టడడంతో ప్రభుత్వ నిజరూపం బట్టబయలైందన్నారు. ఆయన మంగళవారం ఎన్టీఆర్ భవన్లో విలేకరులతో మాట్లాడారు. ఈ వ్యవహారం ప్రభుత్వ దిగజారుడు తనాన్ని రుజువు చేస్తోందని వ్యాఖ్యానించారు. తమకు నచ్చని వ్యక్తులపై నిఘా పెట్టడం తెలంగాణ ప్రభుత్వానికి ఓ అలవాటుగా మారిందని ఆరోపించారు. వ్యక్తి స్వేచ్చను హరించే హక్కు ఏ ప్రభుత్వానికి ఉండదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీ పోషించిన కీలక పాత్ర గురించి అందరికీ తెలుసనీ, అప్పటి కంటే ఇప్పుడే జేఏసీ అవసరం ఎంతో ఉందని ఆయన అభిప్రాయ పడ్డారు. ప్రజాస్వామ్య తెలంగాణ కోసం జేఏసీ పనిచేయాలని ఆయన కోరారు. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న డబుల్ బెడ్ రూం ఇళ్ల పరిస్థితి ఏమైందో అంతుబట్టడం లేదని రావల వ్యాఖ్యానించారు. -
పన్ను ఎగవేతదారుల ఫోన్లు ఇకపై ట్యాప్!
న్యూఢిల్లీ: పన్ను ఎగవేతదారుల ఆట కట్టించడానికి ఆదాయపు పన్ను శాఖ కొత్త కొత్త దారులు వెతుకుతోంది. తరచూ విదేశాలకు వెళ్లే వారి ఫేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్లపై దృష్టి పెట్టే యోచనలో ఉన్న శాఖ అధికారులు.. తాజాగా వ్యక్తుల ఫోన్లను ట్యాంపింగ్ చేసే యోచనను హోం మంత్రిత్వశాఖ అధికారుల ముందుంచారు. ఫోన్ ను ట్యాప్ చేస్తే కాల్ రికార్డుల ఆధారాలు దొరుకాతాయని, అప్పుడు నిందితులు తప్పించుకోలేరని ఓ సీనియర్ ఐటీ అధికారి అన్నారు. నల్లధనాన్ని అంతమొందించడం తమ లక్ష్యమని ఎన్డీయే సర్కారు ప్రకటించడంతో ఈ ఆలోచనకు ఆమోదముద్ర పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 2014-2015, 2015-2016 మధ్య కాలంలో ఐటీ దాడులు నిర్వహించి సరిగ్గా లెక్కలు లేనివారిని ఈ జూన్ 1 తర్వాత ఆదాయమార్గాలను చూపాలని ఆదేశించింది. ఈ లెక్కలకు సంబంధించిన డాక్యుమెంట్లను ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) సింగిల్ విండో విధానంలో పరిశీలించనుంది. ప్రస్తుతం ఫ్రాన్స్ లోని హెచ్ఎస్ బీసీ బ్యాంక్ లో 398 కేసులకు, పనామా పేపర్ల నుంచి 53 కేసులకు సంబంధించిన లీకులు ప్రభుత్వం వద్ద ఉన్నట్లు రెవెన్యూ శాఖ కార్యదర్శి హస్ ముఖ్ ఆధియా తెలిపారు. -
మా ఎంపీల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు
న్యూఢిల్లీ: తమ పార్టీ తరఫున పంజాబ్‌లో గెలచిన ఎంపీలు భగవంత్‌మన్, ధరంవీర్ గాంధీ టెలిఫోన్ సంభాషణలు లీక్ కావడంతో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ సోమవారం విమర్శలతో విరుచుకుపడింది. తమ ఎంపీల ఫోన్లను బీజేపీ ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని ఆరోపించింది. ఇందుకు భగవంత్‌మన్, ధరంవీర్ సంభాషణల టేప్ బహిర్గతం కావడమే ఉదాహరణ అని పేర్కొంది. ఫోన్ల ట్యాపింగ్ అంశంపై కేంద్రానికి వ్యతిరేకంగా లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాయాలని ఆప్ తమ ఎంపీలను కోరింది. టేపుల్లోని భగవంత్‌మన్ సంభాషణకు అంత ప్రాధాన్యం లేదని ఆప్ పేర్కొంది. ఆప్ అధికార ప్రతినిధి దీపక్ బాజ్‌పేయి మాట్లాడుతూ, ఇతర పార్టీల ఎంపీలను తమ వైపుకు తిప్పుకునేందుకు బీజేపీ ప్రభుత్వం వేస్తున్న ఎత్తుగడలివని విమర్శించారు. ఈ అంశంపై తప్పక విచారణ జరగాల్సిందేనన్నారు. చీపురు గుర్తు వల్ల నేను గెలవలేదు.. పంజాబ్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున భగవంత్‌మన్, ధరంవీర్లు ఎంపీలుగా గెలిచారు. కాగా, సామాజిక మీడియాలో వీరి సంభాషణల టేప్ హల్చల్ చేస్తోంది. ఇందులో ధరంవీర్‌తో భగవంత్‌మన్ మాట్లాడుతూ ఆప్ నాయకత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. చీపురు గుర్తు వల్ల తాను గెలవలేదని, ప్రజల్లో తనకు ఉన్న గుర్తింపు వల్లనే గెలిచానని భగవంత్‌మన్ అన్నారు. ఢిల్లీలో లాగా ఇక్కడి ప్రజలు గుర్తును చూసి ఓటేయలేదని, అభ్యర్థులను చూసి ఓట్లేశారని గాంధీతో వ్యాఖ్యానిస్తూ పార్టీపై తన అసంతృప్తిని మన్ వ్యక్తం చేశారు. వీరిద్దరి ఈ సంభాషణ ఫిబ్రవరిలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయడానికి ముందురోజుదిగా తెలుస్తోంది. ఈ టేప్‌పై ధరంవీర్ స్పందిస్తూ ‘ మన్ వాదన సరైనదే. తను హృదయంలోని బాధను తెలియజేశాడు’ అని చెప్పారు. టేప్ బహిర్గతం కావడంలో తన పాత్రపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించాడు. తన ఫోన్‌కు సంభాషణలను రికార్డ్ చేసే సౌలభ్యం లేదని తెలిపారు. చెత్త రాజకీయాలకు ఇదొక ఉదాహరణ: భగవంత్‌మన్ కాగా, నెల రోజుల క్రితమే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ధరంవీర్‌ను ఆప్ నుంచి సస్పెండ్ చేశారు. మరోవైపు భగవంత్‌మన్ స్పందిస్తూ కేజ్రీవాల్ నాయకత్వం మీద తనకు పూర్తి నమ్మకం ఉందని, పార్టీకి విధేయుణ్ని అని తెలిపారు. చెత్త రాజకీయాలకు ఇదొక ఉదాహరణ అని అన్నారు. పంజాబ్‌లో ఆప్‌ని ఎదగనీయకుండా చేసేందుకు ‘పంజాబ్ కనెక్ట్ ర్యాలీ’ తర్వాతి రోజే తమ సంభాషణల పేరుతో టేప్‌లు విడుదల చేశారని ఆరోపించారు. పార్టీలో ఏమైనా గ్రూప్ రాజకీయాలు నడుస్తుంటే.. వాటిపై పార్టీ అధినాయకత్వానికి చెప్పాలనే అంశంపై తాము మాట్లాడుకున్నామని ఆయన వివరణనిచ్చారు. -
తెలంగాణ హోంశాఖ కార్యదర్శికి ఊరట
-
తెలంగాణ హోంశాఖ కార్యదర్శికి ఊరట
హైదరాబాద్ : తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేదికి హైకోర్టులో ఊరట లభించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విజయవాడ కోర్టు తీర్పుపై హైకోర్టు సోమవారం స్టే విధించింది. కాగా కాల్ డేటా వివరాలు సీల్డు కవర్ లో హైకోర్టు వద్ద ఉన్నాయని తెలంగాణ అడ్వకేట్ జనరల్ తెలిపారు. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన వివరాల కోసం విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు (సిఎంఎం) తనకు ఉత్తర్వులు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. -
ఓటుకు కోట్లు, ఫోన్ ట్యాపింగ్‌పై హైకోర్టులో పిల్
హైదరాబాద్ : ఓటుకు కోట్లు, ఫోన్ ట్యాపింగ్, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులపై సీబీఐతో విచారణ జరిపించాలంటూ న్యాయవాది పీవీ కృష్ణయ్య సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సెక్షన్ 8 అమలుపై కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ తన పిటిషన్లో కోరారు. ఈ సందర్భంగా న్యాయస్థానం... పిటిషన్ విచారణ అర్హతను ప్రశ్నించింది. పిటిషన్‌పై విచారణ చేపట్టాలంటే రెండు వారాల్లోగా రూ.లక్ష డిపాజిట్ చేయాలని హైకోర్టు ఆదేశించింది.