సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) పి.రాధాకిషన్‌రావు అండ్ టీమ్ అక్రమాలు బయటపడుతున్నాయి. రాధాకిషన్‌రావు రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్‌కు మద్దతుగా ఇతర పార్టీల నేతలకు సంబంధించిన డబ్బును పట్టుకోవడానికి ఫోన్ ట్యాపింగ్‌ను రాధాకిషన్‌రావు ఆయుధంగా ఉపయోగించుకున్నట్లు ఇప్పటికే పోలీసు దర్యాప్తులో వెల్లడైంది.
అయితే బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా డబ్బు తరలించే వ్యవహారంలోనూ రాధాకిషన్‌రావు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసుల తాజా దర్యాప్తులో బయటపడింది.ఈ ప్రక్రియలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, మాజీ ఐఏఎస్ వెంకట్రామిరెడ్డికి చెందిన డబ్బును ఎక్కువగా తరలించినట్లు తేలింది. రాధాకిషన్‌రావు డబ్బు తరలించేందుకు అప్పట్లో సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ టీంలో పనిచేస్తున్న ఓ ఎస్సైని ఎంచుకున్నారు. ఆయనకు ప్రత్యేకంగా ప్రభుత్వ బొలేరో వాహనాన్ని సమకూర్చి అందులోనే పెద్దఎత్తున నగదును తరలించారు. భారాస ఎమ్మెల్సీ, విశ్రాంత ఐఏఎస్ వెంకట్రామిరెడ్డ్డికి చెందిన డబ్బు తరలింపు వాహనాలకు రాధాకిషన్‌రావు ఆదేశాలతో ఎస్సై పలుమార్లు ఎస్కార్ట్‌గా వ్యవహరించారు.
తెల్లాపూర్‌లోని రాజ్‌పుష్ప గ్రీన్‌డేల్ విల్లాస్‌లో వెంకట్రామిరెడ్డి ఇంటి సమీపంలో ఉండే శివచరణ్‌రెడ్డి అలియాస్ చరణ్‌ను కలవాలని రాధాకిషన్‌రావు ఎస్సైకి సూచించారు. అనంతరం శివచరణ్‌రెడ్డి కొత్త ఐఫోన్‌ను, సిమ్‌కార్డును తీసుకొచ్చి ఎస్సైకి అప్పగించారు రాధాకిషన్‌రావు. నగదు తరలింపు వ్యవహారాల గురించి రాధాకిషన్‌రావు ఆ ఫోన్‌కే కాల్ చేస్తూ ఎస్సైకి ఆదేశాలిచ్చేవారు. డబ్బులకు ఎస్కార్ట్ ఇచ్చి మరీ డెలివరీ చేశారు. సికింద్రాబాద్‌లో ఉండే మాజీ ఎస్పీకి సైతం డబ్బుల రవాణాలో పాత్ర ఉంది. ఆ ఎస్సై పలు సార్లు రూ. 3 కోట్ల డబ్బులు తరలించారు.
డబ్బులు తరలించిన ఎస్ఐ స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేశారు. ప్రభాకర్ రావు ఆదేశాలతో రాజకీయ నాయకులపై నిఘా కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. రాజకీయ నాయకులపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రభాకర్‌కి రాధాకిషన్రావు చేరవేశారు. ప్రణీత్ రావు ఇచ్చే సమాచారంతో రాధా కిషన్ నిఘాను పెట్టారు. రాధాకిషన్ సహకరించిన ఎస్సైలు, ఇన్స్పెక్టర్లను తోపాటు మాజీ పోలీసు అధికారులను పోలీసులు విచారించనున్నారు. పలువురు రాజకీయ నేతల విచారణకు రంగం సిద్దం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment