Rao
-
యూ బెగ్గర్ అంటూ.. తాత అవమానించాడు
హైదరాబాద్: నగరంలో సంచలనం సృష్టించిన ప్రముఖ పారిశ్రామికవేత్త చంద్రశేఖర్ జనార్దనరావు(Industrialist Janardhan Rao) హత్యకేసులో నిందితుడు, ఆయన మనవడు కిలారు కీర్తితేజ(Keerthi Teja) నాలుగు రోజుల (Police custody) సోమవారం ముగిసింది. కీర్తితేజ తన తాతను హత్య చేసిన విధానం, ఎందుకు చేశాడో పంజాగుట్ట పోలీసులకు వివరించారు. ప్రతిరోజూ తన తాత జనార్దన్‌రావు అవమానించేవాడని.. అది భరించలేకనే ఈ ఘోరానికి పాల్పడినట్లు కీర్తితేజ వెల్లడించాడు. ఏరోజూ తనను సొంత మనిషిగా చూడలేదని, అందరి కంటే హీనంగా చూస్తూ దారుణంగా వ్యవహరించేవాడని, అందుకే తాతను హత్య చేశానని పోలీసుల విచారణలో చెప్పాడు. సీఐ శోభన్ తెలిపిన వివరాల ప్రకారం తన తాత తనను కుటుంబంలో ఒక సభ్యుడుగా తనను ఎప్పుడూ చూసేవాడు కాదన్నాడు.ప్రతీరోజూ తనను బెగ్గర్ అంటూ సంబోధించడమే కాకుండా ఆఫీసుకు వెళ్తే అక్కడ కూడా అవమానించేవారని కీర్తి తేజ చెప్పాడు. దీంతో స్టాఫ్ కూడా తనను చిన్నచూపు చూసేవారంటూ తెలిపాడు. ఆస్తి పంపకాలు పదవుల కేటాయింపుల్లోనూ తనను తక్కువ చేశాడని, చివరకు డైరెక్టర్ పదవి కూడా జనార్దన్‌రావు రెండవ కుమార్తె కొడుకుకు ఇచ్ఛాడని, అప్పటినుంచి తనకు, తాతకు మధ్య గొడవలు పెరిగాయని చెప్పాడు. అందుకే తాతను చంపేయాలని నిర్ణయించుకుని ప్లాన్ చేసుకున్నానని, అందులో భాగంగా ఇన్‌స్టామార్ట్ నుంచి కత్తి కొనుగోలు చేశానని చెప్పాడు.హత్య జరిగిన రోజు తనకు తాతకు మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగిందని, తనకు వాటా కావాలని అడిగితే ఇయ్యను పొమ్మనడంతో కోపంతో కత్తితో కసితీరా పొడిచి చంపేసి తర్వాత అక్కడినుంచి పారిపోయానని కీర్తి తేజ తెలిపాడు. హత్య చేసిన తర్వాత బిఎస్మక్తా ఎల్లమ్మగూడ పక్కనే ఖాళీ స్థలంలో కత్తి, రక్తంతో కూడిన బట్టలను తగులబెట్టానని వివరించాడు. అయితే మంటల్లో కత్తి కాలిపోకుండా అలాగే ఉండడంతో పోలీసులు ఆ కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అయితే మొదటిరోజు విచారణలో కీర్తితేజ పోలీసులకు సహకరించలేదు.ఎందుకు హత్య చేశావంటూ పోలీసులు ఎంత ప్రశ్నించినా నోరు మెదపలేదు. ఘటనాస్థలానికి తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్‌కు ప్రయత్నిస్తే కీర్తి తేజ సహకరించలేదు. ఏ ప్రశ్న అడిగినా నేల చూపులు చూసేవాడని పోలీసులు చెప్పారు. రెండవరోజు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. అప్పటినుంచి విచారణ వేగవంతమైనట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని విచారణ అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించినట్లు పోలీసులు చెప్పారు. -
రీచింగ్ ది అన్రీచ్డ్..!
వాళ్లంతా ఆదివాసులు.. కొండకోనల్లో ఎక్కడో విసిరేసినట్లు ఉండే వారికి జీవించటానికి కనీస మౌలిక సదుపాయాలు కూడా ఉండవు. రోడ్లు, కరెంటు మాటే తెలియదు. జన బాహుళ్యంలోకి రావాలంటే కొన్ని కిలోమీటర్ల దూరం నడవాల్సిందే. ఇక వారి పిల్లలకు చదువు అంటే ఏమిటో తెలియదనే చెప్పాలి. తరతరాలు ఆదివాసుల జీవితాలు ఇలాగే తెల్లారిపోతున్నాయని కలత చెందిన కొందరు యువకులు.. వారికి అక్షర జ్ఞానం అందించాలని సంకల్పించారు. భీం చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్ (బీసీహెచ్‌సీ) పేరిట చిన్న సంస్థను నెలకొల్పి పిల్లలకు పాఠాలు చెప్పడం ప్రారంభించారు. దీనిని గుర్తించిన ఉస్మానియా యూనివర్సిటీలోని ఈఎంఆర్సీ డైరెక్టర్ రఘుపతిరావు.. ఆ సంస్థ సేవలపై డాక్యుమెంటరీ నిర్మించారు. దీనికి యూజీసీ ఆధ్వర్యంలో జోధ్‌పూర్‌లో జరిగిన 16వ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో మొదటి బహుమతి లభించింది. - సాక్షి, హైదరాబాద్అసాధ్యాన్ని సుసాధ్యం చేసి.. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని అడవుల్లో జీవించే ఆదివాసీ గూడేలకు వెళ్లేందుకు కనీసం రోడ్డు కూడా ఉండదు. రాళ్లు రప్పల దారుల్లో కిలోమీటర్ల దూరం నడవాల్సిందే. వారి భాష, వేషం, నమ్మకాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. పిల్లలను స్కూల్‌కు పంపడం తల్లిదండ్రులకు ఇష్టం ఉండదు. బయటి వ్యక్తులను కనీసం నమ్మరు కూడా. అలాంటివారికి విద్యాబుద్ధులు నేర్పుతోంది బీసీహెచ్‌సీ. సంతోష్ ఈస్రం అనే యువకుడి ఆలోచనల నుంచి పుట్టిందే ఈ సంస్థ. కొంతమంది మిత్రులతో కలిసి ఆయన.. తమ ఉద్దేశాన్ని ఆ గిరిజనులకు వివరించి ఒప్పించడానికే రెండున్నర నెలల పాటు కష్టపడ్డారు. వారి భాష కూడా నేర్చుకున్నారు. పిల్లలను బడికి రప్పించేందుకు రోజూ కోడిగుడ్లు ఇచ్చారు. అలా వారితో కలిసిపోయి నెమ్మదిగా పాఠాలు చెప్పడం మొదలు పెట్టారు. చివరికి 2020 జూన్ 23న బీసీహెచ్‌సీ పేరుతో సంస్థను స్థాపించారు. తాడ్వాయి మండలంలోని నీలంగోతు అనే చిన్న పల్లెలో గుడిసె కట్టి అందులో 10 ఏళ్ల లోపు ఉన్న 45 మంది చిన్నారులకు పాఠాలు చెప్పడం ప్రారంభించారు.కొండ కోనల్లో నడిచి.. నీలంగోతులో పాఠశాల విజయవంతం కావడంతో భూపాలపల్లి జిల్లాల్లోని బండ్లపహాడ్, సారలమ్మగుంపు, తక్కెళ్లగూడెం, ఐలాపురం, ప్రాజెక్ట్ నగర్, కల్వపల్లి, దండుపల్లి, ముసలమ్మ పెంటలో గుడిసె బడులు తెరిచి ఒక్కో టీచర్‌ను నియమించారు. వాళ్లు రోజూ ఏకంగా 10 నుంచి 18 కిలోమీటర్లు సైకిల్‌పై వెళ్లి పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. వీరితో పాటు అనేకమంది వలంటీర్లు ఈ బృహత్ కార్యంలో పాలుపంచుకుంటున్నారు. వీరి సేవలను గుర్తించిన ప్రభుత్వం.. పిల్లలకు చదువు చెప్పేందుకు వీలుగా ఒకచోట పక్కా భవనం నిర్మించింది. డాక్యుమెంటరీకి అవార్డు.. భీం చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్ కార్యకలాపాల గురించి తెలుసుకున్న ఓయూలోని ఎడ్యుకేషనల్ మల్టీ మీడియా రిసెర్చ్ సెంటర్ డైరెక్టర్ రఘుపతి.. ఆయా ప్రాంతాల్లో కొన్ని రోజుల పాటు ఉండి, పిల్లల స్థితిగతులు.. టీచర్ల కృషిని చూసి ముగ్ధుడయ్యారు. ‘రీచింగ్ ది అన్రీచ్డ్’పేరిట డాక్యుమెంటరీ తీశారు. తాజాగా రాజస్తాన్‌లోని జోద్‌పూర్‌లో జరిగిన 16వ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో డెవలప్మెంట్ కేటగిరీలో దీనికి బెస్ట్ షార్ట్‌ఫిల్మ్ అవార్డు లభించింది. అలాగే మానవ హక్కుల కేటగిరీలో కూడా స్క్రీనింగ్‌కు ఎంపికైంది. దీనికి వచి్చన రూ.50 వేల నగదు బహుమతిని ఆయన బీసీహెచ్సీకే అందజేశారు.ఎంతో కష్టపడాల్సి వచ్చిoది..ఆదివాసుల కష్టాలు కళ్లారా చూశాను. నేను కూడా దాదాపు అదే నేపథ్యం నుంచి వచ్చాను. వాళ్ల గూడేల్లోకి వెళ్లాలంటే కనీసం రోడ్డు కూడా లేదు. అలాంటి వారికి చదువుకోవటం అనేది చాలా పెద్ద విషయం. తల్లిదండ్రులు కూడా పిల్లలకు చదువు నేర్పించేందుకు సుముఖత చూపించరు. ఎంతో కష్టపడి వారిని ఒప్పించి బడి వరకు రప్పించాం. మా సంస్థపై తీసిన డాక్యుమెంటరీకి అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. –సంతోష్ ఈస్రం, భీం చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్ వ్యవస్థాపకుడు -
మేయర్ విదేశీ యాత్ర దుమారం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: నగర మేయర్ సునీల్‌రావు అమెరికా పర్యటన వివాదం చివరికి కలెక్టర్ వద్దకు చేరింది. ఇటీవల మేయర్ 14 రోజులపాటు తాను అమెరికా వెళ్తున్నానని కమిషనర్, కార్పొరేటర్లకు ముందుగానే సమాచారం ఇచ్చారు. దీనిపై కార్పొరేటర్లతో పాటు, డిప్యూటీ మేయర్ కూడా తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. ఆయన వెళ్తూవెళ్తూ.. డిప్యూటీ మేయర్‌కు ఇన్చార్జి బాధ్యతలు ఇవ్వకుండా వెళ్లారని, ఇది నిబంధనలకు విరుద్ధమని, తాను బీసీ మహిళ అయినందునే మేయర్ చిన్నచూపు చూస్తున్నారని ఆక్షేపించారు. మరోవైపు మాజీ కార్పొరేటర్ మెండి చంద్రశేఖర్, బీసీ సంఘాలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాయి. ఆయన పర్యటన నిబంధనలకు విరుద్ధమని ఆరోపించాయి. ఆయన 33 రోజులపాటు పర్యటించేలా టికెట్లు బుక్ చేశారని, వాస్తవానికి 14 రోజులకు మించి విదేశాలకు వెళ్లినట్లయితే.. నిబంధనలకు ప్రకారం డిప్యూటీ మేయర్‌కు ఇన్చార్జి అప్పగించాలన్న వాదన తెరమీదకు తీసుకొచ్చారు.వెలుగుచూసిందిలా..వాస్తవానికి మేయర్ సునీల్‌రావు వ్యక్తిగత పనులపై అమెరికా వెళ్లారు. ఈనెల 23న వెళ్లి.. సెప్టెంబర్ 25న (33 రోజులు) వచ్చేలా ఆయన బుక్ చేసుకున్న టికెట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో వివాదం రాజుకుంది. ఆయన తీరుపై సొంత పార్టీ, విపక్ష కార్పొరేటర్లు కూడా విమర్శించారు. నిబంధనల ప్రకారం.. 14 రోజులు దాటితే తనకు బాధ్యతలు ఇవ్వాలని, కానీ.. తాను బీసీ మహిళను అనే వివక్షతోనే మేయర్ సునీల్‌రావు తనకు ఇన్చార్జి బాధ్యతలు ఇవ్వలేదని డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి ఆరోపించారు. అసలు మేయర్ పర్యటనకు అధికారిక అనుమతే లేదంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ చట్టం 2009 34(2) ప్రకారం తనకు ఇన్చార్జి మేయర్‌గా అవకాశం కల్పించాలని ఫిర్యాదులో విన్నవించారు. కాగా, ఈ విషయంపై బల్దియాలోని ప్రతి విభాగం, ప్రతి ఉద్యోగి చర్చించుకోవడం ప్రారంభించారు. మేయర్ వివరణ కోరిన కలెక్టరేట్మేయర్పై వరుస ఫిర్యాదులు రావడంతో కలెక్టర్ కార్యాలయం నుంచి మేయర్‌ను వివరణ కోరింది. దానికి ఆయన సమాధానమిస్తూ.. తాను మున్సిపల్ కమిషనర్‌కు సమాచారం ఇచ్చాకే విదేశీ పర్యటనకు వచ్చానని, నిబంధనల మేరకు తాను అనుమతి తీసుకున్నానని, ఎక్కడా నిబంధనలను ఉల్లంఘించలేదని వివరణ ఇచ్చారు.6న ఇండియాకు: మేయర్తాను నిబంధనల ప్రకారం మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పేయికి సమాచారం ఇచ్చానని, తనది కేవలం వ్యక్తిగత పర్యటన మాత్రమేనని మేయర్ సునీల్‌రావు తెలిపారు. తాను కేవలం 14 రోజుల వరకే అందుబాటులో ఉండనని కార్పొరేటర్లకు ముందస్తుగానే సమాచారమిచ్చానని పేర్కొన్నారు. తాను బుక్ చేసిన టికెట్లను సాకుగా చూపి తనపై దాడికి దిగడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు. ఆ టికెట్లను ఎప్పుడైనా రీ షెడ్యూల్ చేసుకోవచ్చని, వచ్చే నెల 6వ తేదీన కరీంనగర్లో ఉంటానని వెల్లడించారు. ఆయన చెప్పిన ప్రకారం మేయర్ 14 రోజుల పర్యటన ముగుస్తుంది. కాగా, ఈ వ్యవహారమంతా టీ కప్పులో తుపానులా సమసిపోనుందని నగర ప్రజలు చర్చించుకుంటున్నారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనాలు బయటకు..
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) పి.రాధాకిషన్‌రావు అండ్ టీమ్ అక్రమాలు బయటపడుతున్నాయి. రాధాకిషన్‌రావు రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్కు మద్దతుగా ఇతర పార్టీల నేతలకు సంబంధించిన డబ్బును పట్టుకోవడానికి ఫోన్ ట్యాపింగ్‌ను రాధాకిషన్‌రావు ఆయుధంగా ఉపయోగించుకున్నట్లు ఇప్పటికే పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. అయితే బీఆర్ఎస్కు అనుకూలంగా డబ్బు తరలించే వ్యవహారంలోనూ రాధాకిషన్‌రావు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసుల తాజా దర్యాప్తులో బయటపడింది.ఈ ప్రక్రియలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ ఐఏఎస్ వెంకట్రామిరెడ్డికి చెందిన డబ్బును ఎక్కువగా తరలించినట్లు తేలింది. రాధాకిషన్‌రావు డబ్బు తరలించేందుకు అప్పట్లో సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ టీంలో పనిచేస్తున్న ఓ ఎస్సైని ఎంచుకున్నారు. ఆయనకు ప్రత్యేకంగా ప్రభుత్వ బొలేరో వాహనాన్ని సమకూర్చి అందులోనే పెద్దఎత్తున నగదును తరలించారు. భారాస ఎమ్మెల్సీ, విశ్రాంత ఐఏఎస్ వెంకట్రామిరెడ్డ్డికి చెందిన డబ్బు తరలింపు వాహనాలకు రాధాకిషన్‌రావు ఆదేశాలతో ఎస్సై పలుమార్లు ఎస్కార్ట్‌గా వ్యవహరించారు. తెల్లాపూర్‌లోని రాజ్‌పుష్ప గ్రీన్డేల్ విల్లాస్‌లో వెంకట్రామిరెడ్డి ఇంటి సమీపంలో ఉండే శివచరణ్‌రెడ్డి అలియాస్ చరణ్‌ను కలవాలని రాధాకిషన్‌రావు ఎస్సైకి సూచించారు. అనంతరం శివచరణ్‌రెడ్డి కొత్త ఐఫోన్‌ను, సిమ్‌కార్డును తీసుకొచ్చి ఎస్సైకి అప్పగించారు రాధాకిషన్‌రావు. నగదు తరలింపు వ్యవహారాల గురించి రాధాకిషన్‌రావు ఆ ఫోన్‌కే కాల్ చేస్తూ ఎస్సైకి ఆదేశాలిచ్చేవారు. డబ్బులకు ఎస్కార్ట్ ఇచ్చి మరీ డెలివరీ చేశారు. సికింద్రాబాద్‌లో ఉండే మాజీ ఎస్పీకి సైతం డబ్బుల రవాణాలో పాత్ర ఉంది. ఆ ఎస్సై పలు సార్లు రూ. 3 కోట్ల డబ్బులు తరలించారు. డబ్బులు తరలించిన ఎస్ఐ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. ప్రభాకర్ రావు ఆదేశాలతో రాజకీయ నాయకులపై నిఘా కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. రాజకీయ నాయకులపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రభాకర్‌కి రాధాకిషన్‌రావు చేరవేశారు. ప్రణీత్ రావు ఇచ్చే సమాచారంతో రాధా కిషన్ నిఘాను పెట్టారు. రాధాకిషన్ సహకరించిన ఎస్సైలు, ఇన్స్పెక్టర్లను తోపాటు మాజీ పోలీసు అధికారులను పోలీసులు విచారించనున్నారు. పలువురు రాజకీయ నేతల విచారణకు రంగం సిద్దం చేశారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు: మరో కీలక పరిణామం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఎస్ఐబీ) ఫోన్ టైపింగ్ కేసులో కీలక పరిమాణం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారి అయిన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు అమెరికా నుంచి వస్తున్నట్లు సమాచారం. అమెరికా నుండి రేపు (సోమవారం) హైదరాబాద్‌కు రానున్న తెలుస్తోంది. ఫోన్ టాపింగ్ కేసులో కీలకంగా ఉన్న ప్రభాకర్ రావు చుట్టూ.. ఈ కేసు తిరుగుతున్న విషయం తెలిసిందే. ప్రభాకర్ రావును విచారిస్తే సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉంది. ప్రభాకర్ రావు విచారణ అనంతరం బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎస్ఐబీ చీఫ్‌గా ఉండి ఫోన్ ట్యాపింగ్‌లకు పాల్పడ్డ ప్రభాకర్ రావు.. రాజకీయ నేతలు, ప్రముఖులు, వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేశారు. ఇక.. ఇప్పటికే ఈ కేసులో అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్న కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. అదే విధంగా టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావుకు సైతం14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. సిట్ అధికారులు రాధాకిషన్‌రావుతో పాటు భుజంగరావు, తిరుపతన్నలను ప్రధానంగా రెండు కోణాల్లో ప్రశ్నించారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావుతో వీరికి ఉన్న సంబంధాలు, ఆయన ఆదేశాల మేరకు చేసిన ఫోన్ ట్యాపింగ్‌పై ఎక్కువగా దృష్టి పెట్టారు. డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు నేతృత్వంలోని బృందం సహాయంతో వీరు ప్రతిపక్ష నేతలు, కీలక వ్యక్తులతో పాటు వ్యాపారుల ఫోన్లూ ట్యాప్ చేసి వ్యక్తిగత విషయాలు తెలుసుకున్నారు. ఈ రకమైన ఆదేశాలు ఎవరు ఇచ్చారు? గుర్తించిన వివరా లను తొలుత ఆ వ్యక్తులకు చెప్పేవారా? అనే కోణాల్లో సిట్ ప్రశ్నించింది. వీరి వేధింపుల నేపథ్యంలో ఓ పార్టీకి వివిధ రూపాల్లో విరా ళాలు ఇవ్వడంతో పాటు ప్రభాకర్‌రావు, రాధా కిషన్‌రావు తదితరులకు కప్పం కట్టిన వాళ్లల్లో బడా బిల్డర్లు, జ్యువెలరీ దుకాణాల యజమా నులు, రియల్టర్లతో పాటు హవాలా వ్యాపా రులూ ఉన్నట్టు సిట్ అనుమానిస్తోంది. ఈ ముగ్గురినీ ప్రశ్నించిన సిట్ అధికారులు దీనికి సంబంధించి కీలక సమాచారం సేకరించారని తెలిసింది. రాచకొండ ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ భూపతి గట్టుమల్లును శుక్రవారం తెల్లవారు జామున విడిచిపెట్టారు. దాదాపు ఆరుగంటల పాటు రాధాకిషన్‌రావుతో కలిపి గట్టుమల్లును ప్రశ్నించిన సిట్ ఆయన నుంచి వాంగ్మూలం నమోదు చేసింది. ఎస్ఐబీ, టాస్క్‌ఫోర్స్‌ల్లో పనిచేసిన అనేక మంది అధికారులు, సిబ్బందినీ సిట్ విచారిస్తూ వారి నుంచి వాంగ్మూలాలు సేకరిస్తోంది. ఇప్పటి వరకు 47మంది నుంచి స్టేట్మెంట్స్ రికార్డు చేశారని సమాచారం. రాధాకిషన్‌రావు, నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్నలు అక్రమ ఆస్తులు కూడబెట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని ప్రాథమిక ఆధారా లు సేకరించారు. ఈ అంశాలను క్రోడీకరిస్తూ అవినీతి నిరోధక శాఖకు సమాచారమివ్వాలని సిట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వివరాలు అందిన తర్వాత ఏసీబీ అధికారులు ఆదాయా నికి మించిన ఆస్తుల కేసు నమోదు చేయనున్న ట్లు సమాచారం. మరోపక్క అక్ర మ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉండి, అరెస్టు అయిన అధికారుల పూర్వాపరాల ను ఉన్నతా ధికారులు పరిశీలిస్తున్నారు. వీరు గతంలో ఎక్క డెక్కడ పనిచేశారు? ఆయాచోట్ల వీరిపై ఉన్న వివాదాలు ఏంటి? కేసులు ఉన్నా యా? అని ఆరా తీస్తున్నారు. తిరుపతన్నపై పెద్దగా వివాదాల్లేనప్పటికీ.. భుజంగ రావు సర్వీసు మొత్తం అక్రమ దందాలతోనే సాగిందని అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. రాధాకిషన్‌రావు ఉప్ప ల్ ఏసీపీగా ఉండగా 2013లో చోటు చేసుకున్న యాంజాల్ శ్రీధర్‌రెడ్డి అలియాస్ ఉప్పల్ వైఎస్సార్ ఆత్మహత్య కేసును అధికా రులు తవ్వుతున్నారు. అప్పటి రామంతాపూర్ కార్పొరేటర్ పరమేశ్వర్‌రెడ్డితోపాటు రాధా కిషన్‌రావు వేధింపులతోనే ఉప్పల్ వైఎస్సార్ ఆత్మహత్య చేసుకున్నట్లు కేసు నమోదైంది. 2007లో జరి గిన పరమేశ్వర్‌రెడ్డి సోదరుడు జగదీశ్వర్‌రెడ్డి హత్య కేసులో ఉప్పల్ వైఎస్సార్ నిందితుడు. ఇతడు మరికొందరితో కలిసి పరమేశ్వర్‌రెడ్డికి హత్యకు కుట్ర పన్నిన ఆరోపణలపై ఉప్పల్ వైఎస్సార్ తదితరులను పోలీ సులు 2013 జూన్‌లో అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి రాధా కిషన్ రావు రూ.10 లక్షల లంచం డిమాండ్ చేసి వేధించడంతోనే ఉప్పల్ వైఎస్సార్ ఆత్మహత్య చేసుకున్నట్టు అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసు ఇప్పటికీ ట్రయల్ పూర్తి కాకపోవడానికి కారణాలను ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. చదవండి: ఫోన్ ట్యాపింగ్ కేసు.. యూఎస్ నుంచి ప్రభాకర్‌రావు రియాక్షన్ ఇది! -
ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ కేసు.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలనాలు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రణీత్, భుజంగరావు, తిరుపతన్న రిమాండ్ రిపోర్ట్ బహిర్గతమైంది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు చెబితేనే చేశామని ప్రణీత్, భుజంగరావు, తిరుపతన్న తెలిపారు. 7 రోజుల విచారణలో ప్రణీత్‌రావు కీలక విషయాలు బయటపెట్టారు. కాగా, ఈ కేసులో ప్రభాకర్‌రావును ఏ1గా పోలీసులు చేర్చారు. ఏ1 ప్రభాకర్‌రావు, ఏ2 ప్రణీత్‌రావు, ఏ3 రాధాకిషన్, ఏ4 భుజంగరావు, ఏ5 తిరుపతన్న, ఏ6 ప్రైవేట్ వ్యక్తి పేరును పోలీసులు చేర్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావే కీలక సూత్రధారిగా తేలింది. ప్రభాకర్‌రావు కనుసన్నల్లోనే ట్యాపింగ్ జరిగినట్లు పోలీసులు నిర్థారించారు. ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకే ట్యాపింగ్ డివైజ్‌లను ప్రణీత్‌రావు ధ్వంసం చేశాడు. ప్రణీత్‌రావు ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్‌లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెడిపోయిన ట్యాపింగ్ డివైజ్‌ను పోలీసులు రిట్రీవ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్‌లో ఏముంది? భుజంగరావు, తిరపతన్న ఇచ్చిన నెంబర్లను ప్రణీత్ ట్యాప్ చేశారు. ఎన్నికల సమయంలో వందలాది రాజకీయ నేతలు, వారి కుటుంబసభ్యుల ఫోన్లను ట్యాప్ చేశానని, రాజకీయ నేతలు కదలికలు, నిధుల సమీకరణపై దృష్టిపెట్టానని ప్రణీత్‌రావు వెల్లడించాడు. వ్యాపారవేత్తలతో పాటు సమాజంలో పేరు ఉన్న వారి ఫోన్లను కూడా టాప్ చేశాం. ట్యాపింగ్ సంబంధించిన మెయిన్ డివైజ్‌ని పూర్తిగా ధ్వంసం చేశాను. 17 కంప్యూటర్లలో ఉన్న హార్డ్ డిస్క్‌లు అన్నిటిని ధ్వంసం చేశాను. హార్డ్ డిస్కులు ప్రధాన డివైజ్‌ని కట్టర్‌తో ముక్కలు ముక్కలుగా కట్ చేశాం. ముక్కలుగా చేసిన హార్డ్ డిస్క్‌లు, డివైజ్‌లు తీసుకువెళ్లి మూసీ నదిలో పడవేశాం. రెండు లాకర్ రూములలో ఉన్న డాక్యుమెంట్లు అన్నిటిని తగలబెట్టామని ప్రణీత రావు వెల్లడించాడు. బీఆర్ఎస్ కీలక నేత ఇచ్చిన నెంబర్లను ట్యాప్‌చేశానని.. ప్రణీత్ ఇచ్చిన సమాచారాన్ని బీఆర్ఎస్ కీలక నేతకు చేరవేశామని భుజంగరావు చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు చాలా మంది రాజకీయ నేతల ఫోన్లను కుటుంబ సభ్యుల నెంబర్లను టాప్ చేశామని తెలిపారు. మాజీ టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు ఇచ్చే నంబర్లను ప్రణీత్‌కి ఇచ్చానని తిరుపతన్న వెల్లడించారు. హైదరాబాద్ సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు డీసీపీ షేర్ చేశాడు. డీసీపీ చెప్పిన నంబర్లతో పాటు కొంతమంది కదలికలను ట్రాక్ చేశామని తిరుపతన్న తెలిపారు. ఇదీ చదవండి: ఫోన్ ట్యాపింగ్ కేసు: ప్రభాకర్‌రావే కీలక సూత్రధారి -
ఫోన్ ట్యాపింగ్ కేసు: ప్రభాకర్‌రావే కీలక సూత్రధారి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావును ఏ1గా నిందితుడిగా పోలీసులు చేర్చారు. ఏ1 ప్రభాకర్‌రావు, ఏ2 ప్రణీత్‌రావు, ఏ3 రాధాకిషన్, ఏ4 భుజంగరావు ఏ5 తిరుపతన్న, ఏ6 ప్రైవేట్ వ్యక్తి పేరును చేర్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావే కీలక సూత్రధారి అని పోలీసులు గుర్తించారు. ప్రభాకర్‌రావు కనుసన్నల్లోనే ట్యాపింగ్ జరిగిందని తెలిపారు. ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకే ట్యాపింగ్ డివైజ్‌లు ధ్వంసం చేశారు. ప్రభాకర్‌రావు చెప్పిన మేరకే హార్డ్ డిస్క్‌లను ప్రణీత్‌రావు ధ్వంసం చేశాడని చెప్పారు. ప్రణీత్‌రావు ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్‌లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెడిపోయిన ట్యాపింగ్ డివైజ్‌ను పోలీసులు రిట్రీవ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. హార్డ్ డిస్కుల నుంచి సమాచారాన్ని పోలీసులు రిట్రీవ్ చేస్తున్నారు. చదవండి: ఫోన్ ట్యాపింగ్ కేసు: ఇద్దరు అదనపు ఎస్పీలకు రిమాండ్ -
ఫోన్ ట్యాపింగ్ కేసు: పోలీసుల అదుపులో ఏఎస్పీ భుజంగరావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా మరో కీలక మలుపు చోటు చేసుకుంది. భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రణీత్ రావుతో కలిసి భుజంగరావు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. భూపాలపల్లి ఏఎస్పీగా ఉన్న భుజంగరావు.. గతంలో తెలంగాణ ఇంటెలిజెన్స్‌లో పనిచేశారు. రేపు ఆయన్ను న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరు పర్చునున్నారు. ప్రణీత్ రావును, భుజంగరావును శనివారం పోలీసులు ఎనిమిది గంటలపాటు విచారించారు. అనంతరం బంజారాహిల్స్ పోలీస్ పోలీసులు.. భుజంగరావు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రణీత్‌రావును ఇప్పటికే ఆరు రోజుల పాటు పోలీసులు విచారించారు. రేపు( ఆదివారం) మెజిస్ట్రేట్ ఇంట్లో హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రణీత్‌రావు ఇచ్చిన సమాచారం ఆధారంగా.. ఎస్ఐబీలో పని చేసిన పలువురు అధికారులు, కానిస్టేబుల్స్‌ను పిలిచి విచారించారు. మరోవైపు ఎస్ఐబీలో పని చేసిన అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు నోటీసులు ఇచ్చారు. దీంతో ఆయన బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో స్పెషల్ టీమ్ ముందు హాజరయ్యారు. వీరితో పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్ఐబీలో పని చేసిన వాళ్లందరినీ విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
ప్రణీత్‌రావు పిటిషన్లో తీర్పు రిజర్వు
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం తన విచారణ జరగడం లేదంటూ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు దాఖలు చేసిన పిటిషన్లో వాదనలు ముగించిన హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. కస్టడీ సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శ కాలను పాటించడం లేదని, పీఎస్‌లో నిద్రపోవడానికి సరైన సౌకర్యాలు లేవని, విచారణ పూర్తయిన తర్వాత తిరిగి జైలుకు తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరడంతోపాటు పోలీస్ కస్టడీ ఇస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రణీత్ హైకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపిస్తూ.. ‘24 గంటలూ ప్రణీత్‌రావును పోలీసులు విచారిస్తున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారించాల్సి ఉన్నా.. దాన్ని పాటించడంలేదు. ప్రణీత్ పరువుకునష్టం కలిగించేలా అధికారులు వివరాలు మీడియాకు లీక్ చేస్తున్నారు’ అని చెప్పారు. అనంతరం పీపీ పల్లె నాగేశ్వర్రావు వాదిస్తూ.. ‘పిటిషనర్ న్యాయవాది వాదనలు సరికాదు. 2023లో అక్రమంగా ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారు. ఇది చాలా తీవ్ర నేరం. నిబంధనల మేరకే ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేస్తోంది. సాక్ష్యాలను అందించేందుకే రమేశ్ విచారణ జరిగే ప్రాంతానికి వచ్చారు తప్ప.. విచారణలో పాల్గొనలేదు’ అని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. తీర్పును రిజర్వు చేశారు. గురువారం తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. -
ప్రణీత్ రావు పిటిషన్.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ట్యాపింగ్ కేసు నిందితుడు ప్రణీత్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. ప్రణీత్ రావు పిటిషన్‌పై వాదనలు ముగిసిన అనంతరం తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ సందర్భంగా వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, పంజాగుట్ట ఇన్స్పెక్టర్ శోభన్ హాజరయ్యారు. హైకోర్టులో ప్రణీత్ రావు తరపు న్యాయవాది గండ్ర మోహన్ రావు వాదనలు వినిపించారు. ‘ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రణీత్ రావును ఆక్రమంగా అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టు వాస్తవ అంశాలను పరిగణలోకి తీసుకోకుండా పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 వరకు విచారిస్తున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరగాలి. కానీ అలా జరగడం లేదు. ప్రణీత్ రావుకు ప్రతి రోజు మెడికల్ చెక్అప్ చేయించాలి. కస్టడీలో దర్యాప్తు విషయాలు మీడియాకు చెపుతున్నారు.కస్టడీ ఇప్పటికే నాలుగు రోజులు అయ్యింది. పోలీస్ స్టేషన్లో నిద్ర పోవడానికి ఎలాంటి సౌకర్యాలు లేవు’అని న్యాయవాది గండ్ర మోహన్‌రావు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు వాదనలు వినిపించారు. ‘24 గంటలు ప్రణీత్ రావు ను పోలీస్ కస్టడీ లోకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. పోలీస్ స్టేషన్ లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మీడియా కు ఎలాంటి లీకులు ఇవ్వడం లేదు. ప్రణీత్ రావు అరెస్ట్ 13 మార్చిన మాత్రమే డీసీపీ ప్రెస్‌నోట్ ఇచ్చాడు. పోలీస్ అధికారులు మీడియాకు లీకులు ఇస్తారని చెప్పడం సరైంది కాదు. జూబ్లీహిల్స్ ఏసీపీ ఈ కేసులో ఐవో అధికారిగా ఉన్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణ చేస్తున్నాం. అడిషనల్ ఎస్పీ రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయ్యింది. అడిషనల్ ఎస్పీ రమేష్ ఎక్కడ కూడా ఈ కేసులో జోక్యం చేసుకోలేదు. ప్రణీత్ రావు బంధువులు అనుదీప్ అతని కౌన్సిల్ వాసుదేవన్ రోజు కలుస్తున్నారు. ఇంకా మూడు రోజులు ప్రణీత్ రావు పోలీస్ కస్టడీ ఉంది. దర్యాప్తు దశలో ఉన్న కేసులో ఇప్పుడు పిటిషన్ వేయ్యడం కరెక్ట్ కాదు. ప్రణీత్ రావు వేసిన పిటిషన్‌ను కొట్టివేయాలి’అని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసినట్లు పేర్కొంది. ట్యాపింగ్ కేసు నిందితుడు ప్రణీత్‌రావు.. కస్టడీ విషయంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించడం లేదని.. కస్టడీ ముగిసిన వెంటనే జైలుకు తరలించేలా ఆదేశాలివ్వాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. అలాగే.. తనకు సరైన సదుపాయాలు కల్పించడం లేదంటూ పిటిషన్లో ఆరోపించారు. -
‘ఫోన్ ట్యాపింగ్ తెలియదు.. వార్ రూమ్ తెలియదు’
హన్మకొండ: తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి పలువురు నేతలు కాంగ్రెస్, బీజేపీలో చేరుతున్న నేపథ్యంలో ఎర్రబెల్లి కూడా పార్టీ మారనున్నట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. కేసీఆర్ సారథ్యంలో పార్టీ కోసం ఒక సైనికుడిగా పనిచేస్తానని తెలిపారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం ఓ ఫేక్ అని స్పష్టం చేశారు. మంగళవారం ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. ‘నా రాజకీయ జీవితంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాను. ప్రణీత్ రావు ఎవరో కుడా తెలియదు. ఆయన అమ్మమ్మ ఊరు పర్వతగిరి. నా పేరు చెప్పాలని ప్రణీత్‌రావు మీద ఒత్తిడి తెస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ తెలియదు.. వార్ రూమ్ కూడా నాకు తెలియదు. చాలా మంది నాయకులు పార్టీ వీడి పోతున్నారు. బిజినెస్, ల్యాండ్ దందాలు, తప్పుడు పనులు చేసేవారు అధికార పార్టీలోకి పోతున్నారు. కాంగ్రెస్ వంద రోజుల పాలన ఫెయిల్ అయిందని ప్రజలు అనుకుంటున్నారు. ఆరు గ్యారంటిలు అమలు చేయలేరు. ఎన్నికల కోసమే డ్రామా చేశారు. కేసీఆర్ పెట్టిన పథకాలు కూడా అమలు చేయట్లేరు. మాయ మాటలు చెప్పడం, మోసాలు చేయడం సీఎం రేవంత్‌రెడ్డికి అలవాటే. నీళ్లు లేవు.. పంటలు ఎండిపోతున్నాయి. మండే వేసవిలో కూడా చెరువులు నింపిన మహానుభావుడు కేసీఆర్. కార్యకర్తలు ధైర్యంగా ఉండండి, నాయకులు పోయినంత మాత్రాన ఏమీ కాదు. కార్యకర్తలు మీద తప్పుడు కేసులు పెడితే మేము పోలీస్ స్టేషన్లో కూర్చుంటాం. బీఆర్ఎస్ పార్టీని కాపాడుకుందాం.. గెలుపు, ఓటములు సహజం. ఎన్టీఆర్ లాంటి నాయకునికి కూడా ఓటమి తప్పలేదు’అని ఎర్రబెల్లి అన్నారు. -
ప్రణీత్‌రావుకు 14రోజుల జ్యుడీషియల్ రిమాండ్
సాక్షి, హైదరాబాద్: స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును పోలీసులు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. బుధవారం పంజాగుట్ట పోలీసులు.. ప్రణీత్‌రావును న్యాయముర్తి ముందు ప్రవేశ పెట్టారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావుకు న్యాయమూర్తి ఈ నెల 26 వరకు రిమాండ్ విధించారు. అనంతరం ఆయన్ను పంజాగుట్ట పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఎస్ఐబీలోని హర్డ్ డిస్క్‌లు ధ్వంసం, రికార్డుల మాయం వ్యవహారంలో పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. ఎస్ఐబీ, ఎడిషనల్ ఎస్పీ రమేశ్ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద ప్రణీత్ రావుతో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రణీత్‌రావు సెల్ ఫోన్ సీజ్ చేసిన పోలీసులు.. వాట్సాప్ చాటింగ్, కాల్ డీటెయిల్స్, డేటా రీట్రీవ్ చేయనున్నారు. ప్రణీత్‌రావు ఎవరి ఫోన్లు టాపింగ్ చేశాడనే సమాచారాన్ని పోలీసులు రాబడుతున్నట్లు తెలుస్తోంది. -
పంజాగుట్ట పోలీసుల అదుపులో SIB మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు
-
విధి రాతను ఎదురించి.. విశ్వ వేదికపై నిలిచి..
అతడికి కాళ్లు లేవు.. కానీ కలలు ఉన్నాయి. ఆ కుర్రాడికి కదలడానికి శక్తి లేదు.. అయితేనేం ఎదగాలనే కాంక్ష ఉంది. యువకుడి చుట్టూ కష్టాల చీకట్లు అలముకున్నాయి.. మరేం కాదు రేపటి వెలుగు కోసం వెతకడం అతడికి తెలుసు. రోడ్డు ప్రమాదంలో కాళ్లు పోగొట్టుకుని కన్నీళ్లు పెట్టిన దశ నుంచి విశ్వ వేదికపై మువ్వన్నెల జెండా పట్టుకుని గర్వంగా ఆనంద భాష్పాలు రాల్చినంత వరకు పూర్ణారావు చేసిన ప్రయాణం సాధారణమైనది కాదు. ఒక్క రోడ్డు ప్రమాదం తన బతుకును మార్చేస్తే.. ఆ మార్పును తన కొత్త ప్రస్థానానికి దేవుడిచ్చిన తీర్పుగా చేసుకున్న నేర్పరి అతడు. శ్రీకాకుళం: ఇండోనేషియాలో ఈ నెల 5నుంచి 10వ తేదీ వరకు జరిగిన ఇంటర్నేషనల్ పారా బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఓ సిక్కోలు కుర్రాడు మిక్స్డ్ డబుల్స్‌లో సిల్వర్, డబుల్స్‌లో బ్రాంజ్ మెడల్ సాధించాడు. ఇంత ఘనత సాధించిన ఆ క్రీడాకారుడికి రెండు కాళ్లు పనిచేయవు. అది కూడా పుట్టుకతో కాదు. అందరిలాగానే బాల్యంలో సరదాగా గడిపి, చక్కగా చదువుకుని, విదేశంలో ఓ ఉద్యోగం వెతుక్కుని కుటుంబాన్ని పోషించేంత వరకు అతను అందరిలాంటి వాడే. కానీ ఓ రోడ్డు ప్రమాదం అతడిని దివ్యాంగుడిని చేసింది. పరిపూర్ణంగా చె ప్పాలంటే రోడ్డు ప్రమాదానికి ముందు పూర్ణారావు వేరు. ప్రమాదం తర్వాత పూర్ణారావు వేరు. టెక్కలి మండలం శ్రీరంగం గ్రామంలో ని రుపేద కుటుంబానికి చెందిన చాపరా లక్ష్మణరావు, మోహిని దంపతుల చిన్న కుమారుడు చాపరా పూర్ణారావు. పూర్ణారావు ఇంటర్ పూర్తి చేసి 2015 సంవత్సరంలో సింగపూర్‌లో ఫైర్ సేఫ్టీలో ఉద్యోగంలో చేరాడు. తన తల్లిదండ్రులను చూసేందుకు 2017 సంవత్సరంలో సొంత గ్రామం వచ్చాడు. మరో రెండు రోజుల్లో సింగపూర్ వెళ్లిపోతున్న తరుణంలో వజ్రపుకొత్తూరు మండలం పూండి సమీపంలో ద్విచక్రవాహనంతో ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో వెన్నుపూసకు తీవ్రంగా గాయం కావడంతో రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. ఆ ప్రమాదం పూర్ణారావు బతుకులో చీకట్లు నింపింది. 2020 వరకు ఇంటిలో మంచానికే పరిమితమయ్యాడు. చిన్నపాటి పాన్‌షాప్ నిర్వహిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న తల్లిదండ్రులకు పూర్ణారావు పరిస్థితి మరింత ఆవేదనకు గురి చేసింది. ఫేస్బుక్ ద్వారా తెలుసుకుని.. అప్పుడే ఫేస్బుక్లో బెంగళూరులో గల దివ్యాంగుల పునరావాస కేంద్రం గురించి పూర్ణారావు తెలుసుకున్నాడు. స్నేహితుల ఆర్థిక సహకారంతో బెంగళూరులో గల దివ్యాంగుల పునరావాస కేంద్రంలో చేరాడు. అక్కడ మనోధైర్యంపై నేర్చుకున్న అంశాలు అతడిని ఒక లక్ష్యానికి దగ్గర చేశాయి. ఈ క్రమంలో పారా బ్యాడ్మింటన్‌పై ఆసక్తి కలిగింది. యూట్యూబ్‌లో వీడియోలను చూస్తూ సొంతంగా నేర్చుకున్నాడు. తోటి మిత్రులతో కలిసి ప్రతి రోజూ సాధన చేసేవాడు. తొలి ఆటలోనే.. 2020లో కర్ణాటకలో జరిగిన రాష్ట్ర స్థాయి పారా బ్యాడ్మింటన్ పోటీల్లో పూర్ణారావు మొట్టమొదటిగా పాల్గొని గోల్డ్, సిల్వర్ మెడల్ సాధించాడు. దీంతో అతని పట్టుదలకు మెడల్స్ మరింత ప్రోత్సాహాన్నిచ్చాయి. ఆ తర్వాత భువనేశ్వర్‌లో జరిగిన నాల్గో నేషనల్ పారా బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పాల్గొన్నప్పటికీ ఎలాంటి మెడల్స్ రాలేదు. దీంతో కొంత నిరాశ చెందినప్పటికీ, పూర్ణారావు ఆటను కోచ్ ఆనంద్‌కుమార్ గమనించారు. దీంతో మైసూర్లో 2 నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత లక్నోలో జరిగిన ఐదో నేషనల్ పారా బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొని క్వార్టర్స్ ఫైనల్ వరకు వెళ్లాడు. 2023 జూలై నెలలో యుగాండాలో జరిగిన ఇంటర్నేషనల్ పారా బ్యాడ్మింటన్ పోటీలకు సిద్ధమైనప్పటికీ పాస్ పోర్టు సక్రమంగా లేదని ఎయిర్‌పోర్టులోనే ఆపివేశారు. దీంతో పూర్ణారావు తీవ్ర నిరాశతో వెనుతిరిగాడు. మెడల్స్‌తో ఉత్సాహం తాజాగా సెప్టెంబర్ 5 నుంచి 10 తేదీలలో ఇండోనేషియాలో జరిగిన ఇంటర్నేషనల్ పారా బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పూర్ణారావు పాల్గొని మిక్స్డ్ డబుల్స్‌లో సిల్వర్, డబుల్స్‌లో బ్రాంజ్ మెడల్ సాధించడంతో కొత్త ఉత్సాహం వచ్చింది. అతను ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్‌ను సాధించాడు. కర్ణాటక ఓపెన్ స్టేట్ టోర్నమెంట్లో 2 సిల్వర్, ఒక బ్రాంజ్ మెడల్ సాధించాడు. 2002లో విశాఖపట్టణంలో జరిగిన టోర్నమెంట్లో 2 గోల్డ్ మెడల్స్ సాధించాడు. 2023లో విశాఖపట్టణంలో జరిగిన టోర్నమెంట్లో గోల్డ్ మెడల్ సాధించాడు. వీటితో పాటు 2023 మార్చి నెలలో విశాఖపట్టణంలో జరిగిన ఏపీ నేషనల్ ట్రయల్స్ టోర్నమెంట్లో గోల్డ్ మెడల్ గెలిచాడు. పారా ఒలింపిక్సే లక్ష్యం నాకు ఆర్థిక సాయం అందితే పారా ఒలింపిక్స్‌లో పాల్గొని దేశానికి పతకం తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. మరి కొద్ది రోజుల్లో ఖేలో ఇండియా టోర్నమెంట్‌తో పాటు జపాన్‌లో జరగనున్న ఇంటర్నేషనల్ టోర్నమెంట్ లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నా. – చాపరా పూర్ణారావు -
కందుకూరు సంఘటన దురదృష్టకరం : నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు
-
నిట్ డైరెక్టర్ సీఎస్పీ రావు సస్పెండ్
తాడేపల్లిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నిట్ డైరెక్టర్ సీఎస్పీ రావును కేంద్ర విద్యా శాఖ సస్పెండ్ చేసింది. సీఎస్పీ రావుపై రాష్ట్రపతితో పాటు కేంద్ర ఉన్నత విద్యా శాఖకు అందిన ఫిర్యాదులను సీబీఐ క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేసి నివేదిక ఇచ్చింది. దాని ఆధారంగా సీఎస్పీ రావును సస్పెండ్ చేస్తున్నట్టు మార్చి 29న ఇచ్చిన ఆదేశాలు.. బుధవారం నిట్ కార్యాలయానికి చేరాయి. వివరాలు.. నాగాలాండ్ నిట్‌లో పనిచేసే అసోసియేట్ ప్రొఫెసర్ ధనలక్ష్మి.. పుదుచ్చేరిలో పోస్టింగ్ కోసం సీఎస్పీ రావుకు రూ.5.55 లక్షలు ఇచ్చారంటూ ఫిర్యాదులు అందడంతో ఫిబ్రవరి నెలలో ఏపీ నిట్, కాజీపేటలో సీబీఐ దర్యాప్తు చేసింది. సీఎస్పీ రావు నిట్ డైరెక్టర్‌గా ఉంటూ అధికార దుర్వినియోగానికి, అవినీతికి పాల్పడుతూ, అనర్హులకు ఉద్యోగాలిచ్చారని సీబీఐ ఫిబ్రవరి 16న రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. నిట్‌కు పీఆర్వో పోస్టు మంజూరు కాకపోయినా దానిని భర్తీ చేశారని.. సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల నియామకంలో వయసు నిబంధనను పాటించలేదని సీబీఐ పేర్కొంది. వీరేశ్‌కుమార్ అనే వ్యక్తికి వయోపరిమితి సడలించి అసోసియేట్ ప్రొఫెసర్‌గా పదోన్నతి కల్పించారని తెలిపింది. పోస్టింగ్‌లకు లంచాలు.. నిట్‌కు క్యాటరింగ్ సర్వీస్ చేసే అవకాశమిచ్చినందుకు ఎస్ఎస్ క్యాటరర్స్ అనే సంస్థ నుంచి లంచం తీసుకొన్నారని ఎఫ్ఐఆర్లో సీబీఐ పేర్కొంది. పీహెచ్డీ గైడ్‌గా వ్యవహరించినందుకు ఎన్.విష్ణుమూర్తి నుంచి రూ.1.50 లక్షలు, ఒక వ్యాయామ పరికరాన్ని లంచంగా తీసుకున్నారని తెలిపింది. లంచాలుగా తీసుకున్న సొమ్మును వేరే ఖాతాల్లోకి మళ్లించారని వెల్లడించింది. సీఎస్పీ రావుతో పాటు పీఆర్వో రాంప్రసాద్, సూపరింటెండెంట్లు చెక్కలపల్లి అన్నపూర్ణ, కాపాక గోపాలకృష్ణ, జూనియర్ అసిస్టెంట్ వీవీ సురేష్‌బాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్ వీరేష్‌కుమార్, అసోసియేట్ ప్రొఫెసర్ ధనలక్ష్మి, ఎస్ఎస్ క్యాటరర్స్ నేరెళ్ల సుబ్రహ్మణ్యం, ఎన్.విష్ణుమూర్తిని నిందితులుగా పేర్కొంటూ సీబీఐ వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. -
అనవసరంగా ఎవరూ రోడ్లపైకి రావొద్దు: సీపీ ద్వారకా తిరుమలరావు
-
‘చేయి’కలిపేనా?
సాక్షిప్రతినిధి, ఖమ్మం : ఇటీవల కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత జలగం ప్రసాదరావు అంశంపై తీవ్ర చర్చ సాగుతోంది. నేతలు, అప్పటి శ్రేణులు ఏం జరుగుతుందా..? అని ఆసక్తిగా చూస్తున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత మాజీ మంత్రి, జిల్లా కాంగ్రెస్ రాజకీయాలను ఒకప్పుడు ఒంటిచేత్తో నడిపిన నేతగా పేరొందిన జలగం ప్రసాదరావు మళ్లీ రాజకీయ అరంగేట్రం చేస్తారన్న ప్రచారం అటు కాంగ్రెస్ పార్టీలోనూ.. ఇటు అన్ని రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి రేపుతోంది. జిల్లా కాంగ్రెస్‌లో తమకంటూ ప్రత్యేకవర్గాన్ని ఏర్పాటు చేసుకుని..జిల్లాపై చెరగని ముద్రతో సుదీర్ఘ రాజకీయ పయనం చేసిన దివంగత మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుటుంబం తదనంతరం సంభవించిన రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీకి దూరం కావాల్సి వచ్చింది. అయినా కాంగ్రెస్ పార్టీలో ఆ కుటుంబానికి ఇప్పటికీ తగిన ఆదరణ ఉందన్న భావన, వారు క్రియాశీలకంగా వ్యవహరిస్తే పార్టీకి ప్రయోజనం కలుగుతుందన్న విశ్వాసం ఆ పార్టీకి చెందిన అనేకమంది ద్వితీయశ్రేణి నేతల్లో ఉండటం విశేషం. జిల్లాలోని పలు మండలాల నేతలు జలగం ప్రసాదరావును కాంగ్రెస్ పార్టీలోకి మళ్లీ ఆహ్వానించాలంటూ ఏకంగా మండల కమిటీల ద్వారా తీర్మానం చేయడం కాంగ్రెస్ పార్టీతో జలగం కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తోందని ఆ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ, దాదాపు రెండు దశాబ్దాలుగా జిల్లా రాజకీయ పరిణామాలను పరిశీలించడానికే పరిమితమైన జలగం ప్రసాదరావు వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా..చురుకైన పాత్ర పోషిస్తారన్న ప్రచారం కాంగ్రెస్‌లో కొందరు మోదంగా.. మరికొందరు ఖేదంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు రాజకీయ కార్యకలాపాలపై దృష్టి సారించకుండా పెనుబల్లి మండలంలోని కుప్పెనకుంట్లలో గల తన ఇంటి వద్ద ఉంటూనే జిల్లా రాజకీయ పరిణామాలను తెలుసుకుంటూ, అడపా దడపా రాజకీయ అంశాలను ప్రస్తావించడం వంటి అంశాలకే పరిమితమయ్యారు. ఈసారి రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారని చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈయన సోదరుడు, ప్రస్తుతం అధికార పార్టీ నుంచి కొత్తగూడెం శాసనసభ్యుడిగా జలగం వెంకట్రావు రాజకీయాల్లో ఉన్న విషయం విదితమే. అప్పట్లో ఆయన హవా.. 1983కు ముందు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడిగా పనిచేసిన జలగం ప్రసాదరావు 1983లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఎన్టీఆర్ ప్రభంజనంలోనూ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు. ఆ ఎన్నికల్లో ప్రస్తుత మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై విజయం సాధించడం విశేషం. 1985 ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి లక్కినేని జోగారావుపై తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించగా..1989 ఎన్నికల్లో అప్పటికే ఎన్టీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావుపై ప్రసాదరావు విజయం సాధించారు. 1989లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో జలగం ప్రసాదరావు హవా జిల్లాలో కొనసాగింది. నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రిగా, అంతకు ముందు లఘుపరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన జలగం జిల్లా రాజకీయాలను, కాంగ్రెస్ పార్టీని ఒంటిచేత్తో నడిపించారన్న పేరుంది. దీంతో ఆయనకు పార్టీలోనే అనేకమంది ప్రత్యర్థులు తయారయ్యారని, ఆయన హవాను నిలువరించేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలే విశ్వప్రయత్నాలు చేశారని సీనియర్ కాంగ్రెస్ నేతలు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. రాజకీయాలకు ఇలా దూరం.. 1994లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో సత్తుపల్లి నుంచి పోటీచేసిన జలగం ప్రసాదరావు అప్పుడు టీడీపీ నుంచి పోటీచేసిన తుమ్మల నాగేశ్వరరావుపై ఓడిపోయారు. అప్పటి నుంచి 1999 వరకు కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న జలగం ప్రసాదరావు..1999లో జరిగిన ఎన్నికల్లో సత్తుపల్లి సీటు ఆశించారు. అయితే కాంగ్రెస్‌పార్టీలో జరిగిన అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ ఎన్నికల్లో సత్తుపల్లి నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి పోటీచేసి టీడీపీ నుంచి పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావుపై ఓటమిచెందారు. తదనంతరం రాజకీయ పరిణామాల్లో జిల్లాకు చెందిన జలగం ప్రసాదరావును పార్టీ నుంచి బహిష్కరించాలని కాంగ్రెస్ పార్టీలోని వివిధ వర్గాల నేతలు పోరు చేయడంతో ఎట్టకేలకు ఆయనను బహిష్కరించారని సీనియర్ కాంగ్రెస్ నేతలు చెబుతుంటారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న జల గం ప్రసాదరావు గతంలో అనేకసార్లు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని, పార్టీ ఆయన సేవలను వినియోగించుకుంటుందని ప్రచారం జరిగింది. తండ్రి కూడా సుదీర్ఘ విరామం తర్వాతే.. జలగం ప్రసాదరావు తండ్రి, దివంగత ముఖ్యమంత్రి జలగం వెంగళరావు సుదీర్ఘ రాజకీయ విరామం అనంతరం 1984లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ మరణంతో రాజీవ్‌గాంధీ పిలుపు మేరకు తిరిగి క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. అప్పుడు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. అనంతరం కేంద్రంలో పరిశ్రమల శాఖ మంత్రిగా, ఆ తర్వాత కొద్ది కాలానికి పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ విధానాలపై పోరు సలిపారని సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇప్పటికీ మననం చేసుకుంటారు. ఈసారి రావడం ఖాయమేనా..? ఈసారి జలగం ప్రసాదరరావు..క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రాయాన్ని, మద్దతును ఒకవైపు కూడగట్టుకుంటూ, కాంగ్రెస్ అధిష్టానం ఆశీస్సుల కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ రామచంద్రకుంతియాతోపాటు ఢిల్లీలో పలువురు సీనియర్ నేతలతో సంప్రదింపులు జరిపినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. జిల్లాకు చెందిన ఇరువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు చేస్తున్న ప్రయత్నాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలో ఉన్నప్పుడు తమ ఓటమికి కంకణం కట్టుకున్నారని, ఇప్పుడు పార్టీ బలోపేతమైన దిశలో చేరుతామంటే ఎలా అంగీకరిస్తామని తేల్చిచెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే జలగం ప్రసాదరావును కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నా..చేర్చుకోకపోయినా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందన్న ప్రచారంతో..స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు. ప్రసాదరావు కాంగ్రెస్‌కు చేరువ అవుతున్నారన్న ప్రచారం అనేక గ్రామ పంచాయతీల్లో..విజయతీరాలకు తీసుకెళ్తుందని, అందుకే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని కార్యకర్తలు ప్రచారం చేసుకుంటున్నారని, రావాలని గట్టిగా పట్టుపడుతున్నారని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఒకరు అభిప్రాయపడ్డారు. జిల్లా కాంగ్రెస్ పార్టీలోని రాజకీయ పద్మవ్యూహాన్ని ఛేదించేందుకు జలగం ప్రసాదరావు సైతం అదే స్థాయిలో తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
ఏపీ నిట్ డైరెక్టర్‌గా సీఎస్పీ రావు
తాడేపల్లిగూడెం : ఏపీ నిట్ డైరెక్టర్‌గా చిలకలపల్లి సూర్యప్రకాశరావు (సీఎస్పీ రావు) నియమితులయ్యారు. ఏపీ నిట్ ప్రారంభించాక వరంగల్ నిట్ డైరెక్టరే దీనికి మెంటార్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల పార్లమెంటులో నిట్ డైరెక్టర్ పోస్టు భర్తీకి ఆమోద ముద్ర లభించడంతో పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానించి భర్తీ ప్రక్రియ పూర్తిచేశారు. వరంగల్ నిట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న విజయనగరం జిల్లాకు చెందిన సీఎస్పీరావును ఏపీ నిట్ డైరెక్టర్‌గా ఎంపిక చేశారు. అధికారిక ఉత్తర్వులు మంగళవారం వచ్చాయి. రావు ఢిల్లీ వెళ్లి బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. ప్రస్తుతం ఏపీ నిట్ మెంటర్ డైరెక్టర్‌గా వరంగల్ నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణరావు వ్యవహరిస్తున్నారు. అంకితభావంతో పనిచేసే వ్యక్తి చిలకలపల్లి సూర్యప్రకాశరావు అంకిత భావంతో పనిచేసే వ్యక్తి అని ఆయన గురించి తెలిసినవారు చెబుతున్నారు. ఆయన పలుమార్లు కేంద్ర మానవవనరుల శాఖ ప్రశంసలు అందుకున్నారు. 1985లో కాకినాడ జేఎన్టీయూలో బీటెక్ పూర్తిచేశారు. 1988లో వరంగల్ రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎంటెక్, ఇదే కళాశాలలో పీహెచ్డీ చేశారు. వరంగల్ నిట్‌లో డిపార్టుమెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజినీరింగ్ హెచ్ఓడీగా, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ హెడ్‌గా, రిజిస్ట్రార్‌గా, గెస్టు హౌస్ ఫెసిలిటీ ఇన్చార్జిగా, నిట్ హాస్టళ్ల వార్డెన్‌గా పనిచేశారు. ఎన్నో అవార్డులు పీహెచ్డీ విద్యార్థులకు మార్గదర్శకం చేసినందుకు 30 అవార్డులు రావుకు దక్కాయి. మరో 8 ప్రతిపాదనలో ఉన్నాయి. జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో రావు వ్యాసాలు రాశారు. పది జాతీయ జర్నల్స్, 75 జాతీయ జర్నల్స్‌లో ఆయన వ్యాసాలు ప్రచురించారు. 75 జాతీయ సమావేశాలు, 109 జాతీయ సమావేశాలలో రావు పాల్గొన్నారు. రావు నాలుగు పుస్తకాలు రాశారు. 11 ప్రాజెక్టులను పూర్తి చేశారు. ది ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా, గవర్నమెంటు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంజనీర్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డును 2008లో పొందారు. 2008లోనే సైంటిస్టు ఆఫ్ ది ఇయర్ అవార్డును సాధించారు. 2013లో ఎక్కువ పీహెచ్‌డీలు పూర్తిచేసినందుకు పురస్కారం అందుకున్నారు. 25ఏళ్లపాటు వరంగల్ నిట్‌కు సేవలను అందించినందుకు 2015లో పురస్కారం అందుకున్నారు. క్యాడ్ అండ్ క్యామ్‌కు సంబంధించి 2004లో, ప్రొడక్షన్ టెక్నాలజీపై 2008లో, ఆటోక్యాడ్ వినియోగంపై 2014లో పుస్తకాలు రాశారు. డిఫెన్సు ఫోర్సులకు సంబంధించి ఆర్మామెంట్ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. పోస్టుల భర్తీకిలైన్ క్లియర్ నిట్‌లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ వచ్చింది. దరఖాస్తులనూ పరిశీలించారు. అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి, పోస్టుల భర్తీ చేయడానికి డైరెక్టర్ రాకతో మార్గం సుగమమైంది. -
ఆరుగురూ.. అనాథలయ్యారు
సాక్షి, కుప్పం: నిరుపేద కుటుంబం. ఆపై అధిక సంతానం. మతి స్థిమితం లేని తల్లి ఎటో వెళ్లిపోయింది. తండ్రి అనారో గ్యంతో మృతిచెందాడు. అనాథలైన వారి పిల్లలు తమకు దిక్కెవరు దేవుడా అంటూ తండ్రి మృతదేహం వద్ద విలపించడం స్థానికుల హృదయాలను కదిలించింది. ఈ దయనీయ సంఘటన కుప్పం సమీపంలోని షికారి కాలనీలో బుధవారం చోటు చేసుకుంది. కాలనీకి చెందిన రావు (52)కు విజయ్ (12), అర్జున్(10), తిరుపతి(8), చిరంజీవి(7), బాలి(6), గంగ(3) అనే ఆరుగురు పిల్లలు ఉన్నారు. భార్యకు మతిస్థిమితం లేకపోవడంతో కొద్ది రోజుల క్రితం ఎటో వెళ్లిపోయింది. ఆమె కోసం వెతికినా లాభం లేకపోయింది. సంతలో ఆట బొమ్మలు అమ్ముకుంటూ రావు తన ఇద్దరు కుమార్తెలు, నలుగురు కుమారులను పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆయనకు కాలేయ సంబంధిత వ్యాధి వచ్చింది. వైద్యం చేయించుకునేందుకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో అలాగే వదిలేశాడు. ఈ క్రమంలో వ్యాధి తీవ్రమై బుధవారం మృతిచెందాడు. తండ్రి మృతదేహం వద్ద పిల్లలు బోరున విలపిస్తూ ఉండడం అందర్నీ కంటతడి పెట్టిం చింది. ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్ సుబ్రమణ్యం స్పందించారు. మానవతా దృక్పథంతో పిల్లలను ఓదార్చి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. -
గాలివాన
క్లాసిక్ కథ ఆ తళుకు రావుగారి హృదయంలో ప్రయోజనం లేని విరోధ భావాన్ని రేకెత్తించింది. ఆమె వయస్సు షుమారు ముప్పయి ఏళ్లుంటాయి. ఆకలితో చచ్చిపోతున్నట్టు కన్పించడం లేదు. ఎంత అసహాయత నటించినా, ఆమెలో స్థైర్యం ఉంది. మబ్బు మసగ్గా అలుముకుపోయింది. రైలు ఆలస్యంగా వచ్చింది. రావుగారు రెండోతరగతి పెట్టె ఎక్కుతుంటే తన యిల్లు, ఆ యింట్లో అలవాటుపడ్డ సుఖాలు జ్ఞాపకం వచ్చాయి. ఆయన చదువుకునే గది అతి శుభ్రంగా తుడిచి వుంటుంది. అందులో నల్ల విరుగుడు చేవతో చేసిన రాతిబల్ల, దాని మీద ఒక మూలగా ఆకుపచ్చ గొట్టంలో దీపం వెలు గుతూ ఉంటుంది. ఆయన కుర్చీ మెత్తలో కూర్చునే చోట అనుకూలమైన పట్టాలు ఏర్పడ్డాయి. సోఫాలో ఉన్నట్టు కూడా తెలియకుండా ఆయన భార్య కూర్చుని ఉంటుంది. ఆయనకు నలుగురు పిల్లలు. ఇద్దరు ఆడ, యిద్దరు మగ. వాళ్లని చూస్తే ఆయనకు ఎంతో గర్వం. రైలు పెట్టెలో మూడు మెత్తలూ ఎవరో ఆక్రమించుకుని పరుపులు పరుచు కున్నారు. తను ఎక్కినందుకు అందులో ఉన్న నలుగురు ప్రయాణీకులు చిరాకు పడుతున్నట్టు, రావుగారు వాళ్ల ముఖాలు చూడకుండానే గ్రహించారు. ఇంకో పెట్టి లోకి వెడితే బాగుంటుందని అనిపించింది. కాని రైలు కదిలిపోయింది. కూర్చుని పరిసరాలు వీక్షించడం ప్రారంభించారు. నలుగురూ దూర ప్రయాణీకులని ఆయన గ్రహించాడు. కిటికీల పక్కనివున్న రెండు మెత్తల మీదా ఇద్దరు పెద్ద వయసువాళ్లు కూర్చున్నారు. లోపలగా వుండే నిడుపైన బల్లమీద ఒక యువకుడు, ఒక యువతీ కూర్చుని ఉన్నారు. యువతి ఆ యువకుని భార్య అయివుంటుంది. సిగరెట్టు పొగ మెల్లని ఘాటు రావుగారి నాసికా రంధ్రాలలోకి తెలియకుండానే ప్రవేశించి ఒక క్షణంపాటు ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. రైలుపెట్టెలో సిగరెట్టు పొగ గురించి రావుగారికి తీవ్రమైన అభిప్రాయా లున్నాయి. అనేక విషయాలను గురించి ఆయనకు తీవ్రమైన అభిప్రాయాలు న్నాయి. ఆయన వేదాంతి. వేదాంతం జీవితం తోటీ, జీవన విధానం తోటీ, వ్యక్తికీ సంఘానికీ మధ్య ఏర్పడే రకరకాల సమస్యల తోటీ అనుబంధించి వుంటుం దని ఆయన వాదము. ఒక్క వేదాంతిగానే గాకుండా, మంచి వక్తగా కూడా ప్రఖ్యాతి పొందాడు. ఈ ప్రయాణం చేస్తున్నది ఒక ఉపన్యాసం యివ్వడం కోసం. రావుగారు యువ దంపతుల వేపు చూచారు. యువతి ముఖం చాలా బరువుగా వుంది. ఆమెకు కాస్త వుత్సాహం కలగడానికి కాబోలు యువకుడు నవ్వుతూ ఆమె చెవిలో ఏదో అన్నాడు. బహుశా తన భర్తతో కూడా ఏదో అతను ఉద్యోగంలో వున్న దూరదేశానికి మొదటిసారి ఆమె వెడుతున్నట్లుంది. గాలి పెరిగింది. బలంగా కిటికీ తలు పుల మీద ఒత్తుతోంది. ఉన్నట్టుండి పెట్టిలో చీకటిగా అయిపోయింది ఎంచేతో. ఇంకా సాయంత్రం అయివుండదు. రావు గారి పక్కన కూర్చున్న పెద్దమనిషి కని పించీ కనిపించని దీపపు వెలుగులో ఒక అపరాధ పరిశోధక నవలను తదైక్యంతో చదువుకున్నారు. ఆయనకు రావుగారి వయస్సు వుంటుంది ఏభై ఏళ్ల మనిషి. ఒక అపరాధ పరిశోధక నవల చదువుతూ ఆనందించటం రావుగారికి వింతగా కన్పించింది. ఎదురుగా కూర్చున్న ముసలాయన గంభీరంగా చుట్ట కాలుస్తూ దాని రుచిని ఆస్వాదిస్తున్నాడు. ఆయన రావుగారికంటె పెద్దవాడై యుంటాడు. కాని ముఖంలో చురుకు ఉంది. అయినా జారిపోయిన దవడలు, ముడతలు పడ్డ నుదురు వయస్సును చాటుతూనే ఉన్నాయి. తాను చాలా అదృష్టవంతుడని రావు గారికి గర్వం. ఆయన జుట్టు ఒత్తుగా నల్లగా ఉంటుంది. ఆయన భార్య ఆయన కంటె పెద్దదిలా కన్పిస్తుంది. ఆయనకొక ఇరవయ్యయిదేళ్ల కొడుకున్నాడనీ, ఆ కొడుక్కి అప్పుడే యిద్దరు పిల్లలున్నారనీ, అతను ఈమధ్యనే తండ్రిగారి న్యాయవాద వృత్తినంతనీ చూసుకోవడం ప్రారంభించా డనీ వాళ్లెవ్వరూ అనుకోరు. ఆయన తన జీవితంలో కొన్ని నియమాలను పాటించా లని నిశ్చయించుకున్నాడు. మనిషి నడవడిని దిద్దడానికి కొన్ని నియమాలు ఉండి తీరాలని, కోరికలు వాళ్ల ఆత్మను బంధించేటంత బలంగా వుండకూడదని ఆయన అభిప్రాయం. ఆయన యింట్లో తుచ తప్పని క్రమపద్ధతి చాలా శ్రమపడి అమలులో పెట్టాడు. ఆ పద్ధతి ఆయన మనస్సుకీ శరీరానికీ కూడా ఎంతో శాంతీ, సుఖం సమకూరుస్తోంది. గాలి అరుస్తోంది. జల్లు కూడా ప్రారం భించింది. యువకుడు యువతికి కొంచెం దగ్గరగా జరగబోయాడు. యువతి అటూ ఇటూ చూచి దూరంగా జరిగింది. చక్కగా దువ్విన తలకట్టులోనించి ముంగురులు విడిపోయి ఆమె నుదురుమీద, చెక్కుల మీద కదులుతున్నాయి. తన కుమార్తెలు తల దువ్వుకునే పద్ధతి రావుగారు నిర్ణ యించారు. ఆ సంగతి ఆయనకు జ్ఞాపకం వచ్చింది. వాళ్ల అలవాట్లు, నోములు, వ్రతాలు, స్నేహాలు, దుస్తులు వేసుకునే పద్ధతి అన్నీ రావుగారి అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయమైపోయాయి. గాలి అంతకంతకు భయంకరంగా వీస్తోంది. పెద్ద చినుకులు హోరుగా రైలు పెట్టె మీద మొత్తుతున్నాయి. పెట్టె తలుపు తెరుచుకుంది. ఒక్కసారి పెద్దగా గాలీ వానా పెట్టెలోకి చొచ్చుకు వచ్చాయి. చినిగి పోయి తడిసిపోయిన గుడ్డలతో ఒక ఆమె ప్రవేశించింది. లోపల వున్నవారు చెప్పే అభ్యంతరాలు లక్ష్యపెట్టకుండా తలుపు మూసి ఒక మూల నీరు కారుతూ నిలబ డింది. ముసలాయన ‘ఇది పరుపుల పెట్టి అని తెలియదూ’ అన్నాడు. ‘బాబ్బాయి! తాతగారు! ముష్టిముండకి కొంత నిలబట్టాక సోటివ్వరా బాబుగారూ. దయగల బాబులు! బిడ్డలున్నాతండులు! ఓ కానీ పారెయ్యండి బాబు. ఆకలి కడుపులో సిచ్చెడుతంది బాబులు...’ రావుగారు ఆమెవేపు చూశారు. ఆమె కళ్లల్లో తమాషాగా మెరిసే ఒక తళుకుంది. ఆ తళుకు రావుగారి హృదయంలో ప్రయో జనం లేని విరోధ భావాన్ని రేకెత్తించింది. ఆమె వయస్సు షుమారు ముప్పయి ఏళ్లుంటాయి. ఆకలితో చచ్చిపోతున్నట్టు కన్పించడం లేదు. ఎంత అసహాయత నటించినా, ఆమెలో స్థైర్యం ఉంది. బిచ్చ మెత్తుకోడం మీద రావుగారికి అసలు సానుభూతి లేదు. బిచ్చమెత్తడం తప్పని ఆయన నిశ్చితాభిప్రాయం. ఆ అమ్మి ఆయన దగ్గరగా వచ్చి బిచ్చం అడిగితే ఆయన ఇంక అనుమానం లేనంత గట్టిగా ‘ఫో’ అన్నారు. ఆమె ముఖం అదో మోస్తరుగా పెట్టి రెండో పక్కకు తిరిగింది. ఎదురుగా కూర్చున్న ముసలాయన దగ్గరకు వెళ్లి వంగి పాదాలు ముట్టుకుంది. ముసలాయన కాళ్లు వెనక్కి లాక్కున్నాడు. ‘వెళ్లు, వెళ్లు’ అన్నాడు. ‘అల్లా అనకండి తాతగారు. ఆ బాబంత రాతిగుండె కాదు బాబు నీది. ఆ బాబుగారికి యింత మాత్రం జాలి లేదు. ‘ఫో’ అంటాడు’. తను అన్న ‘ఫో’ ఆమె అనుకరించడం పెద్ద పొగరుబోతుతనమని రావుగారికి అనిపించింది. ఇష్టం లేకపోయినా ఆమె వేపు చూస్తూ కూర్చున్నాడు. ముసలాయన చిత్రమైన అవస్థలో పడ్డాడు. దానికి ఓ డబ్బు యిచ్చి పంపేస్తే పెట్టిలో నలుగురూ పైకేమీ అనకపోయినా హర్షించరని ఆయన అనుమానం. ఇవ్వకపోతే ఆ ముష్టిది నోరు ఎలా జారవిడస్తుందోనని భయం. ఏది ఉత్తమమో ఆయనకు తేలలేదు. చివరికి ఆమెను పొమ్మన్నాడు. ముష్టిది గోల ప్రారంభించింది. ‘డబ్బున్న దొరలున్నా రని, నాబోటి ముష్టిముండని ఆకలితో సచ్చిపోనివ్వరని ఎంతో ఆశగా ఈ పెట్టిలో కొచ్చాన్రా దేముడ! మూడోకలాసు పెట్టెల్లో పేదోళ్లుంటారు. ఆళ్లకే ఎక్కువ జాలి. డబ్బున్నా బాబులంతా రాతిగుండె లని తెలుసుకోలేక పోయాన్రా దేముడా! రావుగారి పక్కనున్న పెద్దమనిషి విచిత్రంగా ఆమెవేపు చూశాడు. ‘ఉనది ఏమి ఊరు’ అని తమిళుల తెలుగులో అడిగాడు.‘ఓ వూరేటి, ఓ పల్లేటి బాబు మాబోటి పేదోళ్లకి. తమబోటి పెభువులకి వూళ్లుంటాయి. పెద్ద పెద్ద లోగిళ్లుంటాయి. గేటు ముందు బంట్రోతులు కూచోని ముష్టోళ్లని రానీకుండా తరిమేయిత్తారు. నాబోటి పేదముండకో వూరేటి? ఓ పల్లేటి?’ ‘నాలుక చాలావాడి’ అన్నాడాయన రావుగారిని ఉద్దేశించి, ఇంగ్లీషులో. చీకటి పడుతున్న కొద్దీ గాలి మరీ బలంగా వీస్తోంది. రైలు వానపాములా పాకు తోంది. ముష్టిది పెట్టెలో యువ దంపతు లకు ఎదురుగా కూర్చుంది. యువకుడు అన్నాడు: ‘మాతో కూడా వచ్చేయ కూడదూ నువ్వు? పనీపాటా చేస్తూ వుందుగాని తిండీ గుడ్డా యిస్తామ్.’ ‘ఏదో యిచ్చి దాన్ని పంపెయ్య కూడదూ?’ అంది యువతి భర్తని ఉద్దేశించి. రావుగారు తప్ప తక్కిన అందరూ ఆమెకు ఏదో యిచ్చారు. ఆమె మాటలు వింటుంటే అందరికీ సరదాగా వుంది. కాని రావుగారి మనస్సు ఇతర విష యాలతో నిండిపోయింది. ఆయన గాలి వానను గురించీ, తను రైలులోంచి దిగడాన్ని గురించీ ఆలోచిస్తున్నాడు. రైలు ఆగినట్టు రావుగారికి ఒక ముహూర్తం పాటు తెలియలేదు. సరిగ్గా అప్పుడే గాలివాన మరీ తీవ్రమైంది. ఆయన గొడుగు ఒక చేత్తో బట్టుకు లేచాడు. తలుపు తెరవడంతోటే గాలి ఆయన్ను తీవ్రంగా వెనక్కు నెట్టివేసింది. తూలిపోయారు. ముష్టిమనిషి ఆయన సామానులు దింపి పెడతానంది. రావు గారికి ఆ సందర్భంలో మంచి చెడ్డలు ఆలో చించడానికి అవకాశం లేదు. ఆమె సహా యాన్ని అంగీకరించక తప్పలేదు. కాని ఏదో అస్పష్టమైన నియమాన్ని ఉల్లం ఘిస్తున్నట్లు ఆయన మనస్సులో కొంచెం బాధ. కాని రైలు దిగి స్టేషనులోకి పరుగెత్తి వెళ్లిపోయారు. ముష్టి ఆమె సామానుల బరువుతో తూలుతూ వెనకాల వచ్చింది. సామానులు వెయిటింగు రూములో పెట్టింది. ఎక్కడా ఒక్క దీపం లేదు. రావు గారు కొంత డబ్బు తీసి ఆమెకు ఇవ్వబో యాడు. ఆమె వద్దనలేదు గాని, ఏదో విన బడకుండా అని మాయమైపోయింది. రావుగారు కూర్చున్నాడు. గింగురు మనే ఆ గాలిలో కళ్లు పట్టు తప్పిపోతు న్నాయి. గుడ్డలన్నీ తడిసిపోయాయి. పెట్టి తీసి చేత్తో యిటూ అటూ తడిమాడు. బాటరీ లైటు చేతికి తగిలింది. పట్టరాని సంతోషం వచ్చింది. తడిబట్టలు విప్పి పొడిబట్టలు కట్టుకున్నాడు. స్వెట్టరు తొడుక్కున్నాడు. మఫ్లరు చెవులకు, తలకు చుట్టుకున్నాడు. ఇంతలో రైలు దీపాలు కదిలాయి. స్టేషనులో ఎవరో ఒకరు ఉండి తీరాలని బయటికి వచ్చాడు. ఇద్దరు ప్లాట్ ఫారం దాటివెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. రావుగారు పిలిచారు. ఇద్దరూ ఆగారు. ఒకరు స్టేషను మాష్టరనీ ఇంకొకరు బంట్రోతనీ రావుగారు గుర్తించారు. ‘నేను వూర్లోకి వెళ్లాలి’ అన్నారు రావుగారు ఆదుర్దాగా. ‘చాలా కష్టం. రోడ్డుమీద అంగుళం అంగుళానికీ చెట్లు పడి వున్నాయి. గాలివాన చాలా తీవ్రంగా వుంటుందనీ, 36 గంటల వరకూ తగ్గదనీ మాకు వార్త వచ్చింది.’ ‘కాని స్టేషన్లో యింకెవరూ లేరు.’ ‘నేనేం చేస్తాను? ఎల్లాగో స్టేషనులోనే మీరు గడపాలి.’ స్టేషను మాష్టరు వెళ్లిపోయాడు. రావు గారు వెయిటింగ్ రూంలోకి వెళ్లిపోయారు. మనస్థైర్యాన్ని చేకూర్చే వేదాంతమేదీ రావు గారికి తోచలేదు. క్రమశిక్షణ, నియ మాలు, విలువలు అన్నీ కూడా మానవా తీతమైన కొన్ని శక్తులు విజృంభించినపుడు అర్థరహితాలైపోతాయని ఆయనకు మొదటిసారి అనుభవంలోకి వచ్చింది. ఎన్నడూ ఎరుగని భీతి రావుగారి మనస్సును ఆవరించింది. ఆ బాధ దుర్భరంగా వుంది. చుట్టుపక్కల ఎక్కడా మానవ హృదయమన్నది లేదు. గాలివాన ఉగ్రరూపం దాల్చింది. ఆయన మనస్సు ఒక పీడకలలో చిక్కుకున్నట్టు ఉక్కిరి బిక్కిరైపోయింది. ఆ గదిలో యింకో వస్తువేదో వున్నట్టు రావుగారికి కనిపించింది, తెరచిన తలుపులో నుంచి లోపలికేదో ప్రవేశించినట్టుగా. చేతిలో దీపం వెలిగించి ఆయన ఆ వేపు చూశాడు. ముష్టి ఆమె గజగజ వణుకుతూ వొక మూల నిలబడివుంది. ఆమె తడి వెంట్రు కలు ముఖాన్నీ చెక్కులనీ అంటుకున్నాయి. వాటి వెంట నీరు కారుతోంది. ‘బాబుగారు! తలుపు ముయ్యలేదే! కొంచెం వెచ్చగా ఉంటుంది’ అంది ఆమె గొంతుక బాగా పెద్దది చేసి. ఆయన ఒక యంత్రంలాగా లేచి తలుపు ముయ్యడానికి ప్రయత్నించి విఫలుడయ్యాడు. ఆమె సహాయం చేసింది. ఎలాగో తలుపు మూసి లోపల గడియ వేశారు. కాని గాలి ఒక్కసారి వూపింది. గడియ వూడిపోయింది. ఇద్దరూ మళ్లీ తలుపులు మూసి గదిలో వున్న కొన్ని కుర్చీలూ, ఒక బీరువ, డ్రాయరూ తలుపుకి అడ్డంగా చేర్చారు. తలుపులు ముయ్యాలని తనకు తోచకపోవడం రావుగారికి వింతగా తోచింది. ఇపుడు కొంత వెచ్చగా వుంది. భయం తగ్గింది. ‘‘ఏం గాలివానండి బాబుగారు. నేను పుట్టిన్నాటినుండి యింత గాలివాన నేను చూడలేదు’’ అంది ముష్టి ఆమె. ఆమె గొంతులో బెదురులేదు. అంత ప్రశాంతంగా ఎట్లా మాట్లాడకల్గుతూందో ఆయనకు అర్థం కాలేదు. ఆమెవేపు దీపం వేసి చూశాడు. మూలగా వొణుకుతూ కూచున్నది. రావుగారు తన పంచ ఒకటి తీసి ఆమె వేపు విసరి ‘యిది కట్టుకో’ అన్నారు. కృతజ్ఞత చూపిస్తూ బట్ట మార్చుకుంది. ఆ మూలే పొడిగా వున్న చోట కూర్చుంది. రావుగారికి ఆకలి వేస్తున్నట్లు జ్ఞాపకం వచ్చింది. బిస్కట్ల పొట్లం తీశాడు. ఒకటొ కటి చొప్పునా నమలడం ప్రారంభించాడు. ఆమెకు కూడా ఆకలి వేస్తున్నదేమోనని కొన్ని బిస్కట్లిచ్చాడు. ఆమె గదిలో వుండడం వల్ల కొంచెం ధైర్యం వచ్చింది. ఎవరూ లేకపోవడం కంటే ఆమె వుండడం కొంత నయం. ఆమె దేన్ని గూర్చీ బాధ పడదు గాలీ వానను గురించి కూడా. జీవితంలో కష్టనిష్ఠురాలు బాగా ఆమెకు అనుభవమై వుంటాయి. రావుగారు గడియారం వంక చూచారు. తొమ్మిది గంటలయింది. ‘ఈ యిల్లు కూలిపోదు గదా?’ అని ఆయన అడిగారు. ‘ఎవరు చెప్పగలరు? యిల్లు గట్టిగానే వున్నట్టుంది. గాలిబలం ఎక్కువైతే ఏది ఆగుద్ది?’... ఆమె గొంతులో ఏదో ఒక చనువూ స్థైర్యం. ఆయన పెట్టె దగ్గరకు పోయి కూర్చు న్నాడు. ఆయన కూర్చున్న మూలకు ఆమె కూడా చేరింది. అక్కడ కూచుంటే ఒకరి మాట ఒకరికి వినబడదు అంది. ‘గాలివాన యింత ముదిరిపోతుందని నేననుకోలేదు.’ ‘బాబుగారు ఎందుకలా భయపడతా’ రందామె. ‘ఒక్కరుండేకంటె యిద్దర మున్నాం గదా! టిక్కెట్టు కలెక్టరు రైలు కదులు తూంటే నన్ను దింపేశాడు, ఏం చేయను! ఇక్కడుండి పోయాను. అయినా నాకేటి విసారం? బాబుగారు చుట్టుమెట్టుకోనాకి ఓ పొడి గుడ్డ యిచ్చారు. ఆకలికి మేత పడేశారు. వున్నంతలో సుకంగా వుండాలి బాబుగారు! అది లేదనీ, యిది లేదనీ సీకాకు పడితే ఏం లాభం?’ ఆమె గొంతు అలా మోగుతుంటే ఆయన మనస్సు కాస్త స్థిమితపడింది. ఆమె భౌతిక దేహాన్ని చూస్తే ఆయన కసహ్యం. ఆయన మనస్సుకీ మన మనస్సుకీ ఎంతో అంతరం వుంది. అయినా ఆ భయంకరమైన రాత్రివేళ తనకు తోడుగా ఆమె వున్నందుకు కృతజ్ఞత ఆయన మనసులో నిండింది. ‘నీకెవరూ చుట్టాలు లేరా?’ అన్నా రాయన. వెంటనే యింత చనువుగా ప్రశ్న వేసినందుకు నొచ్చుకున్నారు. రైలులో ఒక కానీ కూడా యివ్వనందుకు ఆమెకు తన మీద ఏమన్నా కోపముందేమోనని ఆయన అనుమానం. కాని ఆమె మాటల్లో గానీ చేతల్లో గానీ కోపం కనబడలేదు. గట్టిగా గొంతు ఎత్తి మాట్లాడవలసిన అవసరం లేకుండా ఆయన దగ్గరగా జరిగింది. ‘సుట్టాలందరికీ వుంటారు. ఏం లాబం బాబుగారు? మా అయ్య తాగు తాడు. ఆడే మా అమ్మని సంపేశాడం టారు. నాకు మనువు అవలేదు. కానీండి బాబుగారు ఓ దొంగ ముండావాడితో సేవితం కలిగింది. నాకు ఇద్దరు పిల్లలండి బాబుగారు. ఆడికి జూదం, తాగుడు అలవాటైపోయాయండి. ఇంట్లో తిండికీ తిప్పలకీ నా సంపాదనే. పిల్లలింకా చిన్నోళ్లు బిచ్చమెత్తుకోనాకి. మావోడికి రోజుకో పావలా ఇత్తానండి తాగుడికి. ‘నువ్వు ఏమాత్రం సంపాదిస్తావు?’ ‘ఒక్కొక్కరోజు ఐదు రూపాయలు దాకా దొరుకుద్ది. ఒక్కొక్కరోజు కానీ కూడా ఉండదు.’ రావుగారు అనుకోకుండానే ఆమె ముఖం మీదికి దీపం వేశారు. ఆమె నవ్వింది. ఎవరినైనా సరే ఆమె కిందా మీదా పెట్టేయగలదు. అయినా ఆమెకు మనస్సులో అంత లోతుగా యిష్టాలు అయిష్టాలు లేనట్టు ఆయనకు అనిపిం చింది. జరుగుతున్న ఆ క్షణంతోనే ఆమెకు సజీవమైన అనుబంధం. గడచిన కాలపు స్మృతుల బరువు గానీ, రాబోయే రోజుల గూర్చిన ఆశలు గానీ ఆమెకు లేవు. ఆయన ఆమె కొంటె చిరునవ్వుని యింకా అలానే చూస్తూ కూచున్నారు. ‘ఏటండి బాబుగారు! నాకేసలా చూత్తారు?’ అంది. ‘మునుపున్నంత రంగుగా యిపుడు లేనండి.’ వెంటనే ఆయన తనలోకి ముడుచుకు పోయారు. తన మనస్సులో అశ్లీలైన భావాలు వుంటాయన్నట్లు ఆమె సూచిం చినందుకు ఆమె మీద అసహ్యం కలిగింది. ‘నీవేపు చూడ్డం లేదు’ అన్నారాయన గట్టిగా. ‘దీపం ఆర్పడం మరచిపోయాను.’ అకస్మాత్తుగా పెద్ద చప్పుడైంది. గది తలుపులు ఒక్క వూపులో తెరుచు కున్నాయి. అడ్డుగా పెట్టిన సామాను చెల్లాచెదురైపోయింది. ఒక తలుపు పూర్తిగా ఊడిపోయి ఒక కుర్చీమీద నుంచి పల్టీ కొట్టింది. రావుగారి గుండె గొంతుకలో అడ్డింది. శక్తి కొద్దీ ఒక మూలలోకి గెంతి, పిచ్చిగా ఆయన ముష్టి ఆమెను కౌగలించు కున్నాడు. వెంటనే సిగ్గుపడ్డాడు. కాని ఆమె ఆయన చెయ్యిపట్టి నడిపించుకుని వెడితే మాట్లాడకుండా వెళ్లాడు మూలలోకి. ఆమె ఆయనను ఆ మూలలో కూచోబెట్టింది. తను కూడా దగ్గరగా కూర్చుని చేతు లాయన చుట్టూ చుట్టింది. ఆ కౌగిలింతలో సంకోచాలేమీ లేవు. ఆయన మనస్సులో ప్రళయమంతటి మథన జరుగుతోంది. కాని ఆ వెచ్చదనం ఆయనకు ప్రాణావ సరం. అంచేత ఆయన కాదనలేదు. ఆమె మరీ దగ్గరగా జరిగి వొళ్లోకి వాలింది. ఆయన ముడుచుకుని దీర్ఘంగా అవమానకరమైన ఆలోచనా పరంపరలో మునిగిపోయాడు. ఆమె మాట్లాడుతూనే వుంది. ‘ఈ మూల భయం లేదండి. బాబుగారికి చక్కని కూతుళ్లుంటారు యింటికాడ. బాబుగారు ఆరిని తలుచు కుంటున్నారు. మా గుడిసి ఎగిరిపోయుం టది. పిల్లేమైయుంటారో! ఇరుగు పొరు గోళ్లు సూత్తుంటార్లెండి. మావోడు చిత్తుగా తాగి పడుంటే గుడిసి ఎగిరిపోతే ఆడికేం తెలుత్తాది? పిల్లలు సుకంగా వున్నారో లేదో?’ ఒక మానవ హృదయంలోనించి వెలువడిన యీ వేదన వింటుంటే ఆయన హృదయం చుట్టూ పెట్టుకున్న గోడలన్నీ మాయమైపోయాయి. పెద్ద ఆవేదనతో ఆమెను గట్టిగా అదుముకున్నాడు క్రమంగా ఆయన మనస్సు ఆలోచించడం మానివేసింది. గాలి చేసే గోల మనస్సు పొలిమేరల్లోకి పోయింది. కాలం అతి మెల్లగా జరుగుతోంది. కాని ఆ సంగతి ఆయనకు తెలియదు. గాలివాన బలం హెచ్చింది. పైకప్పు పెంకులన్నీ గాలికి ఎగిరిపోయాయి. కాని గాలివల్ల వాన వారిద్దరినుంచీ దూరంగా రెండో పక్కకి పడుతోంది. కొంతసేపటికి రావుగారి మనస్సు మేలుకుంది. లైటు వెలిగించి ఆమె ముఖం వంక చూశాడు. అమాయికంగా, నిశ్చింతగా వుంది. స్వచ్ఛమైన, నిసర్గమైన ఒక శోభ ఆ ముఖంలో దివ్యత్వం స్ఫురింప జేసింది. గాలివాన జోరు హెచ్చింది. కాని ఆయన మనస్సులో అమితమైన ప్రశాంతి నిండింది. శరీరం అలసిపోయి విశ్రాంతి కోరింది. క్రమంగా ఆయన పరిసరాలను మరచిపోయి నిద్రలో మునిగిపోయాడు. మళ్లీ మెలకువ వచ్చేసరికి వాన తగ్గింది. గాలి మాత్రం బలంగా వీస్తోంది. ముష్టి ఆమె లేచి వెళ్లిపోయింది. గడియారం చూచుకున్నారు. ఐదుగంటలయింది. అనుకోకుండానే జేబులు తడుము కున్నారు. ఆయనకు స్ఫురించిన మొదటి మాట ‘దొంగ ముండ’. కాని ఆమె అల్లా దొంగతనం చేసి వుంటుందనుకోడం ఆయనకు యిష్టం లేదు. గదిలో నాల్గు మూలలా వెతికారు. కనబడలేదు. గదిలో నుంచి బయటికి వచ్చారు. భీభత్సంగా వుంది. ప్లాట్ఫారం తప్ప చుట్టుపక్క లంతా నీటిమయం. కొందరు దెబ్బలు తిన్నవాళ్లు స్టేషను రెండో పక్కన కింద పడుకుని వున్నారు. ఏదో హాస్పిటల్లో తెల్లగా శుభ్రంగా వరసల్లో పడుకోబెట్టి నప్పుడు తప్ప అంత నగ్నంగా మనిషి బాధపడడం ఆయనెప్పుడూ చూడలేదు. వికారం వచ్చింది. వెనక్కు తిరిగాడు. టికెట్లు అమ్మే గది పూర్తిగా కూలిపోయింది. వెయిటింగు రూము కూలిపోతే ఏమైయుండునని ఆయన అనుకున్నాడు. ఆ కల్లోలాన్ని చూస్తూ నిలబడిపోయాడు. ఆ సామాను కింద ఏదో శరీరం ఆనింది. దీపం వేసి చూశారు. ముష్టి ఆమె. తట్టుకోలేకపోయాడు. వంగి నుదురు తాకి చూచారు. చల్లగా చచ్చిపోయివుంది. చేతులు రెండూ యివతలకు వున్నాయి. క్రింది భాగం పూర్తిగా నలిగిపోయి నట్టుంది. ఒక చేతిలో ఆయన పర్సుంది. రెండో చేతిలో కొన్ని నోట్లు, కొంత చిల్లరా వుంది. బహుశా టిక్కట్లు అమ్మిన డబ్బై వుంటుంది. గుమస్తా ఆ డబ్బు డ్రాయర్లో పెట్టి తొందరగా యింటికి పోయుంటాడు. రావు చిన్నపిల్లవాడి వలె ఏడుపు ప్రారంభించాడు. చల్లని ఆ నుదురు ముద్దుపెట్టుకున్నాడు. తనకు ఆత్మ స్థైర్యాన్నీ శాంతినీ గాలివానకు తట్టుకోగల శక్తిని చేకూర్చిన ఆ మూర్తి అక్కడ పడి పోయి వుంది. ఆ గాలివానకు ఆమె బలి అయిపోయింది. ఆయన హృదయం తుఫానులో సముద్రం లాగా ఆవేదనతో పొంగిపొరలింది. తనకు జీవితంలో మిగిలిన ఒక్క ఆనందమూ శాశ్వతంగా పోయినట్టు అనిపించింది. తన పర్సును దొంగలించినందుకు గాని, అంత గాలి వానలో డబ్బేమన్నా దొరికితే తీసుకోవచ్చు నని టిక్కట్ల గదిలోకి వెళ్లినందుకు గాని ఆయన ఆమెను మనస్సులో కూడా దూషించలేదు. ఆమె ఆఖరుతత్వం ఆయనకు తెలుసును. ఇప్పుడు ఆమె చిలిపితనాలు, కొంటెతనాలు ఆయనకు ప్రేమపాత్రాలయ్యాయి. ఆయనలో లోతుగా మాటుపడియున్న మానవతత్వాన్ని ఈ జీవి వికసింపజేసింది. ఆయన భార్య గాని ఆయన పిల్లల్లో ఎవరుగానీ ఈమె వచ్చినంత దగ్గరగా రాలేదు. ఆయన విలువలు, నియమాలూ, ధర్మచింతా, వేదాంతం... అన్నీ త్యజిస్తాడాయన ఈ వ్యక్తికి ప్రాణం పొయ్యగలిగితే. అవతల మనుష్యులు వస్తున్న సవ్వడి వినిపించింది. రావుగారు కళ్లు తుడుచుకుని ఒక క్షణం ఆలోచిస్తూ నిలబడ్డారు. తర్వాత ఒక నిశ్చయంతో ఆమె వేళ్ల సందులోంచి డబ్బు తీసి తెరచి వున్న డ్రాయరులో వేసి డ్రాయరు మూశాడు. కాని తన పర్సు ఆమె చేతిలోంచి విడదీయడానికి ఆయన మనస్సు వొప్పలేదు. తనకు సంబంధించినదేదో ఒక చిహ్నంగా ఆమె శరీరంతో ఉండిపోవాలని ఆయనకు అనిపించింది. కాని యితరులు ఆమె దొంగతనం చేసిందని అనుకుంటే ఆయన భరించలేడు. అంతచేత జాగ్రత్తగా ఆ పర్సులో నుంచి తన పేరుగల కార్డు తీసివేసి బరువైన హృదయంతో అక్కణ్నించి వెళ్లిపోయాడు. (స్థలాభావం కారణంగా కాస్త సంక్షిప్తీకరించడం జరిగింది) - పాలగుమ్మి పద్మరాజు -
గ్రేటర్లో దూకుడుగా 'టీఆర్ఎస్'
-
ఇప్పటికైనా అరెస్టు చేస్తారా లేదా..?
-
గల్లంతైన వారి కోసం గాలింపు
కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం రామన్నపేట వద్ద కృష్ణా నదిలో గల్లంతైన ముగ్గురి కోసం స్థానికులు తీవ్రంగా గాలిస్తున్నారు. శనివారం సాయంత్రం బల్లకట్టు సైడ్ గ్రిల్ విరిగి రామన్నపేటకు చెందిన నరసింహారావు, గోపి, రమణ నదిలో పడిపోయారు. అయితే, తమ పరిధిలోకి రాదంటూ ఇటు కృష్ణా, అటు గుంటూరు జిల్లాల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో స్థానికులే గాలింపు చర్యలు చేపట్టారు. ఘటన జరిగి 16గంటలు గడుస్తున్నా... నదిలో గల్లంతైన వారి ఆచూకీ లభించపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. -
‘వైద్య’ అక్రమార్కులపై వేటు
* ‘సాక్షి’ కథనంతో ప్రభుత్వం చర్యలు * రూ. 2 కోట్లు చేతులు మారినట్లు ఇంటెలిజెన్స్ నివేదికతో కదలిక * ఆరోగ్య శాఖ డెరైక్టర్ సాంబశివరావు, ఎన్హెచ్ఎం ఏవో శ్రీనివాసరెడ్డిపై వేటు * బాధ్యతల నుంచి తొలగించిన సర్కారు * వైద్య మంత్రి పేషీలోని ఓఎస్డీలపైనా చర్య సాక్షి, హైదరాబాద్: ‘అంగట్లో డాక్టర్ పోస్టులు’ శీర్షికతో ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా నియమించిన ఔట్సోర్సింగ్ ఏజెన్సీలను వెంటనే రద్దు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో అందుకు కారకులైన నలుగురు ఉన్నతాధికారులపై గురువారం వేటుపడింది. సదరు ఏజెన్సీలకు అనుమతినిస్తూ అంతర్గత ఉత్తర్వులు ఇచ్చిన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డెరైక్టర్ సాంబశివరావును బాధ్యతల నుంచి తొలగించింది. ఆ శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాశ్‌కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. సాంబశివరావును సస్పెండ్ చేసినట్లు వార్తలు వచ్చినా ప్రభుత్వం ధ్రువీకరించలేదు. జాతీయ ఆరోగ్య మిషన్ పరిపాలనాధికారి(ఏవో) శ్రీనివాసరెడ్డినీ ఆ బాధ్యతల నుంచి తొలగించింది. వైద్య, పారామెడికల్ పోస్టులను అమ్ముకుంటున్న ఔట్సోర్సింగ్ ఏజెన్సీలకు అనుమతిచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అలాగే వైద్య మంత్రి రాజయ్య పేషీలోని ఓఎస్డీలు డాక్టర్ సంపత్, డాక్టర్ గంగాధర్‌ను కూడా బాధ్యతల నుంచి తొలగించినట్లు తెలిసింది. అయితే మంత్రి కార్యాలయవర్గాలు మాత్రం దీనిని ధ్రువీకరించడం లేదు. ఎన్హెచ్ఎం మంజూరు చేసిన 1500 వైద్య సిబ్బంది పోస్టుల్లో నియామకాలు చేపట్టేందుకు కొన్ని ఔట్సోర్సింగ్ ఏజెన్సీలకు సాంబశివరావు అనుమతించారు. అయితే ఇందుకు ప్రభుత్వంలోని కీలక నేతతో పాటు కొందరు ఉన్నతాధికారులు సదరు ఏజెన్సీల నుంచి లంచం తీసుకున్నారన్న విషయాన్ని ‘సాక్షి’ బయటపెట్టింది. దీనిపై విచారణ జరిపిన నిఘా వర్గాలు.. రూ. రెండు కోట్లు చేతులు మారినట్లు స్పష్టం చేశాయి. ఈ నివేదిక ఆధారంగానే తాజాగా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఓఎస్డీలు కూడా అతిగా వ్యవహరిస్తున్నారని, విభాగాధిపతులు, అధికారులతో సమీక్షలు కూడా నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు రావడంతో వారిని తొలగించినట్లు సమాచారం. మార్గదర్శకాలు ఖరారు... ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఔట్సోర్సింగ్ వైద్య, పారామెడికల్ పోస్టుల నియామకానికి సంబంధించిన మార్గదర్శకాలను ఖరారు చేశారు. ఆ ప్రకారం జిల్లా ఆరోగ్య సంస్థల(డీహెచ్సీ) ద్వారానే పోస్టులను నింపాలి. తప్పనిసరిగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి. అభ్యర్థి స్థానికుడై ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటర్వ్యూలు నిర్వహించకూడదు. మెరిట్ ఆధారంగా అభ్యర్థుల నియామకం జరగాలి. ఇద్దరు అభ్యర్థులకు ఒకే విధమైన మార్కులుంటే వారి పుట్టిన రోజును ఆధారం చేసుకోవాలి. పుట్టిన రోజులు కూడా ఒకే తేదీగా ఉంటే... వారి మండలాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఔట్సోర్సింగ్ ఏజెన్సీల అర్హతలు, వాటి అనుభవాన్ని ఆధారం చేసుకోవాలి. కలెక్టర్ ఆధ్వర్యంలోని డీహెచ్ఎస్ల నిపుణుల కమిటీ ఆ ఏజెన్సీలను ఆమోదించాలి. ఈ మార్గదర్శకాలను సీఎంకు పంపిస్తామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ‘సాక్షి’కి చెప్పారు. సీఎం ఆమోదం లభించాక జిల్లాస్థాయిలో నోటిఫికేషన్ జారీచేసి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల నియామకం చేపడతారు. అనంతరం పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలుకానుంది. -
స్టార్టప్స్‌కు సదుపాయాలెన్నో
మై క్యాంపస్ లైఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) - హైదరాబాద్.. భాగ్యనగరం కీర్తికిరీటంలో మరో కలికితురాయి. బీటెక్, ఎంటెక్, పీహెచ్డీ వంటి కోర్సులను అందిస్తూ తన విశిష్టతను చాటుకుంటోంది. ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో సెకండియర్ చదువుతున్న రావుల మనీశ్చంద్రరెడ్డి తన క్యాంపస్ లైఫ్ ముచ్చట్లను మనతో పంచుకుంటున్నారిలా.. క్యాంపస్‌లో సాధారణంగా ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు తరగతులు, ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. ఈ సమయంలో ఆయా బ్రాంచ్‌లు, సబ్జెక్టులను బట్టి క్లాసులు ఉంటాయి. మధ్యాహ్నం ఒంటి గంట కల్లా తరగతులు ముగుస్తాయి. లంచ్ తర్వాత 2.30 నుంచి 5.30 గంటల వరకు ప్రాక్టికల్స్, ల్యాబ్ వర్క్ ఉంటుంది. ఫ్యాకల్టీ.. ఎంతో ఫ్రెండ్లీ ఫ్యాకల్టీలో ఎక్కువ మంది యువతే. స్టూడెంట్స్‌కు.. ఫ్యాకల్టీ మధ్య పెద్దగా వయసులో తేడా లేదు. అందువల్ల విద్యార్థులను చక్కగా అర్థం చేసుకుంటారు. ఎప్పటికప్పుడు కొత్త బోధన పద్ధతులు అమలు చేస్తారు. మేము ఫ్యాకల్టీ నుంచి ఏమి ఆశిస్తున్నామో సులువుగా గ్రహిస్తారు. స్నేహపూరిత వాతావరణంలో అన్ని విషయాలపైనా అవగాహన కల్పిస్తారు. పరిశోధనలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. విద్యార్థులను పరిశోధనల దిశగా ప్రోత్సహిస్తారు. సబ్జెక్టుపరంగా ఏవైనా సందేహాలు ఎదురైతే మెయిల్ ద్వారా ఫ్యాకల్టీని సంప్రదించే వీలుంది లేదా స్వయంగా ఎప్పుడైనా ఫ్యాకల్టీని కలవొచ్చు. మూస పద్ధతికి స్వస్తి బోధన వినూత్నంగా ఉంటుంది. ఒక్కో పీరియడ్ గంటన్నరపాటు ఉంటుంది. విద్యార్థులతోనే పాఠాలు చెప్పిస్తారు లేదా విద్యార్థులు ప్రశ్నలు అడిగితే ప్రొఫెసర్ సమాధానాలివ్వడం.. నిజ జీవితంలో ఎదురవుతున్న వివిధ సమస్యలకు పరిష్కారాలు కనుగొనడం లేదా పాఠం చెప్పి.. ప్రాక్టికల్స్ చేయించడం ఇలా బోధనలో వివిధ పద్ధతులను పాటిస్తారు. విద్యార్థులే ఆయా అంశాలపై సొంతంగా ఆలోచించేలా, నేర్చుకునేలా ప్రోత్సహిస్తారు. వివిధ అంశాలపై అవగాహన కల్పించడానికి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్స్, ప్రొజెక్టర్, ఆన్‌లైన్‌ను వినియోగిస్తారు. ఆన్లైన్లో కోర్సులు అందించే ఎన్పీటీఈఎల్, ఎడెక్స్, కోర్సెరా ద్వారా కూడా విద్యార్థులు కోర్సులు చేస్తుంటారు. ఇంజనీరింగ్ కోర్సులతోపాటే ప్రతి విద్యార్థీ లిబరల్ ఆర్ట్స్ కోర్సులను అభ్యసించాలి. నేను ఇప్పటివరకు క్రియేటివ్ ఆర్ట్స్, వెస్ట్రన్ పెయింటింగ్, మానవ సంబంధాలపై సోషల్ మీడియా ప్రభావం, షార్ట్‌స్టోరీ రైటింగ్, ఎకనామిక్స్ బేసిక్ కాన్సెప్ట్స్ వంటివాటిని అధ్యయనం చేశాను. స్టార్టప్స్‌కు ఎంతో ప్రోత్సాహం యువ పారిశ్రామికవేత్తలుగా రాణించాలనుకునేవారికి క్యాంపస్‌లో మంచి అవకాశాలున్నాయి. ఇన్స్టిట్యూట్లో ప్రత్యేకంగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెల్, ఇంక్యుబేషన్ సెంటర్ ఉన్నాయి. సొంత స్టార్టప్ ఏర్పాటు చేయాలనుకునేవారికి ఈ-సెల్ ఆధ్వర్యంలో సూచనలు, సలహాలు అందిస్తారు. అంతేకాకుండా ఐడియా కాంపిటీషన్స్, వర్క్‌షాప్స్ నిర్వహిస్తారు. ఇంక్యుబేషన్ సెంటర్ పరిధిలో ప్రస్తుతం మూడు స్టార్టప్స్ విజయవంతంగా నడుస్తున్నాయి. స్టార్టప్ ఏర్పాటు చేసేవారికి కార్యాలయం కోసం స్థలం, కంప్యూటర్స్, ఇంటర్నెట్, ప్రింటర్స్, ఫ్యాక్స్, టెలిఫోన్ వంటి సదుపాయాలు కల్పిస్తారు. క్యాంపస్.. కలర్‌ఫుల్ ప్రతి ఏటా క్యాంపస్‌లో టెక్నికల్ ఫెస్ట్, కల్చరల్ ఫెస్ట్ కూడా నిర్వహిస్తారు. కల్చరల్ ఈవెంట్స్‌లో భాగంగా డ్యాన్స్, పాటలు, డ్రామాలు, చిన్నచిన్న స్కిట్లు వంటి మొత్తం 180 ఈవెంట్లు ఉంటాయి. నేను కల్చరల్ ఫెస్ట్ ఆర్గనైజర్‌గా వ్యవహరిస్తున్నాను. ఇక టెక్నికల్ ఫెస్ట్‌లో భాగంగా టెక్నికల్ ఈవెంట్స్, రోబో వాక్, రోబో కాంపిటీషన్స్తోపాటు వివిధ పరిశోధన సంస్థల నుంచి వచ్చే శాస్త్రవేత్తల లెక్చర్స్ ఉంటాయి. సాధారణ రోజుల్లోనూ ప్రముఖ వ్యక్తులు ఉపన్యాసాలుంటాయి. సదుపాయాలెన్నో.. క్యాంపస్ సదుపాయాల విషయానికొస్తే ప్రవేశం లభించిన విద్యార్థులందరికీ హాస్టల్ వసతి కల్పిస్తారు. క్యాంపస్ అంతా మంచి స్పీడ్‌తో వై-ఫై సౌకర్యం ఉంది. క్యాంపస్‌లో రెండు భోజనశాలలున్నాయి. ఆహారం రుచికరంగా ఉంటుంది. విద్యార్థులు సేదతీరడానికి క్రీడా మైదానాలున్నాయి. ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ అత్యంత ముఖ్యం కాబట్టి ఆధునిక లేబొరేటరీలున్నాయి. ప్రస్తుతం వివిధ బ్రాంచ్‌లకు సంబంధించి 150 ల్యాబ్‌లు ఉన్నాయి. అయితే లైబ్రరీని మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ఆన్లైన్ లైబ్రరీ విద్యార్థులకు అందుబాటులో ఉంది. ఆన్లైన్లో చదువుకోవడానికి అందరికీ యూజర్‌నేమ్, పాస్వర్డ్ ఇస్తారు. పీహెచ్డీ చేస్తా పరిశోధనలంటే నాకు ఎంతో ఆసక్తి. ఇప్పుడు కూడా నేను ఎక్కువ సమయం ప్రాక్టికల్స్‌కే కేటాయిస్తున్నాను. బీటెక్ పూర్తయ్యాక ఎంఎస్, పీహెచ్డీ చేయాలనుకుంటున్నా. -
బాలుడి బుర్రలో కత్తి
తొలగించిన కేజీహెచ్ వైద్యులు విశాఖపట్నం: తుపానులో నేలకొరిగిన చెట్టు కొమ్మలు కొడుతుండగా పిడి నుంచి వేరుపడిన కత్తి ప్రమాదవశాత్తూ ఓ బాలుడి తలలో గుచ్చుకుపోయింది. భీమిలి మండలం తిమ్మాపురం గ్రామంలో ఈనెల 16న జరిగిన సంఘటన వివరాలు....ఎన్.సురేష్ అనే వ్యక్తి తన ఇంటి ఆవరణలో నేలకొరిగిన చెట్టుకొమ్మలను కత్తితో తొలగిస్తుండగా కత్తి పిడి నుంచి వేరై సమీపంలో వున్న కుమారుడు ఈశ్వరరావు తలలో 5 సెం.మీ లోతున గుచ్చుకుంది. కేజీహెచ్ న్యూరోసర్జరీ విభాగం వైద్యులు అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించి బాలుడి తల నుంచి కత్తిని తొలగించారు. -
నేటి నుంచి టెక్నోజియాన్-14
నిట్ క్యాంపస్ : నిట్ టెక్నోజియాన్‌ను ఈ నెల 17 నుంచి 19వ వరకు నిర్వహించనున్నామని, ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశామని నిట్ వరంగల్ ఇన్చార్జ్ డెరైక్టర్ ఎస్.శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు బుధవారం నిట్‌లోని ఎంబీఏ సెమినార్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన టెక్నోజియన్ వివరాలు వెల్లడించారు. గురువారం సాయంత్రం 5.30 గంటలకు నిట్ ఇన్స్టిట్యూట్ ఆడిటోరియంలో టెక్నోజియాన్ వేడుకలను ఎల్అండ్టీ, మెట్రోరైల్ మేనేజింగ్ డెరైక్టర్ గాడ్గిల్ లాంఛనంగా ప్రారంభిస్తారన్నారు. ఈ టెక్నోజియాన్‌కు దేశం నలుమూలల నుంచి మొత్తం 15,000 మంది విద్యార్థు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఈ నెల 18న టెక్నోజియాన్‌లో భాగం గా యూఎస్ నుంచి లైవ్ వీడియో కాన్ఫరెన్స్ నిట్ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పా రు. మ్యూజికల్ నైట్ షో, డీజే షోతోపాటు పలు సామాజిక అంశాలపై ఈవెంట్లు ఉంటాయన్నారు. సమావేశంలో నిట్ టెక్నోజియాన్ ఫ్యాకల్టీ అడ్వయిజర్ ప్రొఫెసర్ వెంకటరత్నం, నిట్ స్టూడెంట్స్ వెల్ఫేర్ అసోసియేట్ డీన్ సెల్వరాజ్, నిట్ టెక్నోజియాన్ కోఆర్డినేటర్ వె భవ్, డిప్యూటీ కోఆర్డినేటర్ నమ్రత, టెక్నోజియాన్ ఈవెంట్ కోఆర్డినేటర్ సాయి కల్యాణ్ మాట్లాడారు. -
రేపు హెచ్‌సీయూ స్నాతకోత్సవం
1443 మందికి పట్టాలు ప్రదానం ఆరుగురు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు 16వ స్నాతకోత్సవానికి యూనివర్సిటీ ముస్తాబు సెంట్రల్ యూనివర్సిటీ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 16వ స్నాతకోత్సవం బుధవారం జరుగనుంది. 1443 పట్టాలను విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయనున్నారు. ఆరుగురు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు అందించేందుకు యూనివర్సిటీ నిర్ణయించింది. అక్టోబర్ 1న గచ్చిబౌలి శాంతి సరోవర్‌లోని గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో హెచ్‌సీయూ 16వ స్నాతకోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. పీహెచ్డీ విభాగంలో 184, ఎంటెక్‌లో 165, ఎంఫిల్‌లో 180, పీజీ, ఇంటిగ్రేటెడ్ పీజీలో 914 డిగ్రీలను అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పలు అంశాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు 104 మెడల్స్‌ను అందించనున్నారు. దీనిలో 29 యూనివర్సిటీ మెడల్స్, 31 ఎస్సీ, ఎస్టీ విభాగ మెడల్స్, 44 దాతల మెడల్స్ విద్యార్థులకు ప్రదానం చేయనున్నారు. 2013-14 విద్యా సంవత్సరానికి 1011 డిగ్రీలు ప్రదానం చేయగా, ఈ సారి ఆ సంఖ్య 1443కి పెరిగింది. హెచ్‌సీయూలో 33 స్కూళ్లలో 133 కోర్సులు నిర్వహిస్తున్నారు. దాదాపు 5000 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఆరుగురికి గౌరవ డాక్టరేట్లు... వివిధ విభాగాల్లో ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేయాలని యూనివర్సిటీ నిర్ణయించింది. వీరిలో ప్రముఖ రచయిత, పద్మభూషణ్ గుల్జార్, హెచ్‌సీయూ మాజీ వీసీ, భౌతిక శాస్త్ర వేత్త పల్లె రామారావు, పద్మవిభూషణ్, కార్డియో సర్జన్ డాక్టర్ ఎంఎస్ వలియాతన్, ప్రముఖ గణిత శాస్త్ర వేత్త ఎంఎస్ రఘునాథన్, ప్రముఖ శాస్త్రీయ నృత్యకారిణి కపిల వాత్సాయన్, దివంగత మాజీ నటి, పద్మవిభూషణ్ జోహ్రా సెహగల్లకు గౌరవ డాక్టరేట్లు అందజేయనున్నారు. సెహగల్ స్థానంలో ఆమె కూతురు కిరణ్ సెహగల్ డాక్టరేట్ అందుకోనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ప్రముఖ తత్వవేత్త, పద్మభూషణ్ మృణాల్ మిరి, రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, హెచ్‌సీయూ చాన్స్‌లర్ హనుమంతరావు హాజరుకానున్నారు. -
నవ్యాంధ్రగా అవతరించాలి
సిక్కిం పూర్వ గవర్నర్ రామారావు కైకలూరు : నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు పయనించాలని సిక్కిం మాజీగవర్నర్, బీజేపీ జాతీయ మాజీ ఉపాధ్యక్షుడు వెంట్రప్రగడ రామారావు అన్నారు. కైకలూరు మండలంలోని వివిధ దేవాలయాల సందర్శనకు భార్య వసంతకుమారి, కుమారుడు శ్రీనివాస్‌తో కలసి సోమవారం ఆయన వచ్చారు. ముందుగా స్థానిక శ్రీ శ్యామలాంబ అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ మేనేజర్ శింగనపల్లి శ్రీనివాసరావు ఆయనను ఘనంగా సత్కరించారు. ఆటపాకలోని కామినేని రామకృష్ణ నివాసంలో అల్పహారం తీసుకున్నారు. అనంతరం వరహాపట్నం గ్రామంలోని శ్రీ భూసమేత శ్రీ లక్ష్మీనృసింహ దేవాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. కైకలూరులోని శ్రీ రామకృష్ణా సేవాసమితిని సందర్శించారు. అధ్యక్ష, ఉపాధ్యక్షులు చెరుకువాడ శివరామరాజు, చింతపల్లి వెంకటనారాయణలు ఆయనను ఘనంగా సత్కరించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేంపాటి విష్ణురావు , ఎంపీపీ బండి సత్యవతి, బీజేపీ నాయకులు లావేటి వీరశివాజీ, ప్రత్తిపాటి అమృత కమలాకరరావు, బండి శ్రీనివాసరావు, బందా సత్యనారాయణ ప్రసాద్, గుల్లపల్లి పద్మినీ, సుబ్బరాజు, జోసఫ్, వీరరాఘవులు, శ్రీనివాసగుప్తా పాల్గొన్నారు. కేంద్రం, రాష్ట్రాల మైత్రి పెరగాలి కేంద్ర, రాష్ట్రాల మధ్య మైత్రీబంధం పెరిగి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అగ్రగామిగా నిలవాలని వెంట్రప్రగడ రామారావు ఆకాంక్షించారు. దేవాలయాల సందర్శనలో భాగంగా కైకలూరు వచ్చారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా నూతన రాష్ట్రాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అసెంబ్లీలో చిన్న చిన్న విషయాలకు సమయాన్ని వృథా చేయకూడదని సూచించారు. పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును త్వరగా పూర్తిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు.