సాక్షి, హైదరాబాద్: స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును పోలీసులు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. బుధవారం పంజాగుట్ట పోలీసులు.. ప్రణీత్‌రావును న్యాయముర్తి ముందు ప్రవేశ పెట్టారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావుకు న్యాయమూర్తి ఈ నెల 26 వరకు రిమాండ్ విధించారు. అనంతరం ఆయన్ను పంజాగుట్ట పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఎస్ఐబీలోని హర్డ్ డిస్క్‌లు ధ్వంసం, రికార్డుల మాయం వ్యవహారంలో పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది.
ఎస్ఐబీ, ఎడిషనల్ ఎస్పీ రమేశ్ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద ప్రణీత్ రావుతో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రణీత్‌రావు సెల్ ఫోన్ సీజ్ చేసిన పోలీసులు.. వాట్సాప్ చాటింగ్, కాల్ డీటెయిల్స్, డేటా రీట్రీవ్ చేయనున్నారు. ప్రణీత్‌రావు ఎవరి ఫోన్లు టాపింగ్ చేశాడనే సమాచారాన్ని పోలీసులు రాబడుతున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment