praneeth
-
ప్రణీత్ హనుమంత్ కి బెయిల్ కూడా రాకుండా చేస్తున్నారు..
-
ట్రోల్స్, రోస్టర్స్ ముసుగులో రెచ్చిపోతున్న కామాంధులు..
-
పోక్సో కేసు.. చంచల్‌గూడ జైలుకు యూట్యూబర్ ప్రణీత్
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియాలో తండ్రి,కూతురు వీడియోపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన నిందితుడు యూట్యూబ్ ప్రణిత్ హనుమంతు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. పోక్సో చట్టంతో పాటు 67B ఐటీ యాక్ట్, భారత న్యాయ సంహిత చట్టం సెక్షన్లు 79, 294 ప్రకారం కేసు నమోదు చేశారు. ప్రణీత్‌తోపాటు ఆ లైవ్ ఛాటింగ్ చేసిన మరో ముగ్గురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో A2 డల్లాస్ నాగేశ్వర్ రావు, A3 బుర్రా యువరాజ్, A4 సాయి ఆదినారాయణగా ఉన్నారు. ప్రస్తుతం యూట్యూబ్ ప్రణిత్ హనుమంతు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అదుపులో ఉన్నాడు. నిన్న(బుధవారం) బెంగళూరు నుంచి పిటి వారెంట్‌పై పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి హైదరాబాకు తీసుకొచ్చారు. హనుమంతును విచారించిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో.. ఈ మధ్యాహ్నం నాంపల్లి కోర్టులో హాజరు పరిచింది. ప్రణీత్ హనుమంతుకు 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. -
ప్రణీత్ హనుమంతు పై పోక్సో చట్టం
-
ఇలాంటి సమయంలో చెప్పాల్సి వస్తుందని ఊహించలేదు: ప్రణీత్ బ్రదర్
సోషల్ మీడియాలో చిన్నపిల్లలపై అసభ్యకరమైన వీడియోలు చేస్తోన్న ప్రముఖ యూట్యూబర్ ప్రణీత్ హనుమంతును పోలీసులు అరెస్ట్ చేశారు. హీరో సాయి ధరమ్ తేజ్ చేసిన ట్వీట్‌తో అతని పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. ప్రణీత్‌పై చర్యలు తీసుకోవాలంటూ పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. దీంతో అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు.తాజాగా ప్రణీత్ అరెస్ట్‌పై ఆయన సోదరుడు అజయ్ హనుమంతు(అయే జుడే) స్పందించారు. తప్పు ఎవరు చేసినా తప్పేనని.. అది తమ్ముడైనా సరే శిక్ష పడాల్సిందే అన్నారు. తన పెళ్లి గురించి ఇలాంటి సమయంలో చెప్పాల్సి వస్తుందని ఊహించలేదన్నారు. కానీ తప్పడం లేదు.. నాకు పెళ్లై ఇప్పటికే ఆరేళ్లయిందని అయే జుడే తెలిపారు. ఇంజినీరింగ్ పూర్తయిన వెంటనే లవ్ మ్యారేజ్ చేసుకున్నట్లు తెలిపారు.అజయ్ మాట్లాడుతూ..' నా పెళ్లి విషయం సంతోషకరమైన సమయంలో చెబుదామని అనుకున్నా. కానీ చెప్పక తప్పడం లేదు. నా పెళ్లి జరిగి ఆరేళ్లైంది. కాలేజీ పూర్తవ్వగానే లవ్ మ్యారేజ్ చేసుకున్నా. అప్పటి పరిస్థితులు వేరు. లైఫ్‌లో చాలాసార్లు ఫెయిలయ్యా. జీవనోపాధి లేక కష్టాలు పడ్డా. ఐఏఎస్ ఆఫీసర్ కుమారుడినైనా రోడ్ మీద నుంచే నా లైఫ్ స్టార్ట్ చేశా. అడల్డ్ అండ్ కామెడీని పర్సనల్‌గా నేను ప్రోత్సహించను. అలాంటివి చూడను కూడా. అది ఎవరు చేసిన తప్పే. ఈ విషయంలో మీరు ఎంత దూరంగా ఉన్నారో.. నేను కూడా అంతే.' అని అన్నారు. Naaku 6 years back marriage ayyindhi... Ah taravatha nen intlo nundi bayataki vachesa..Social Media lo Vunna incident ki meeru entha dooranga unnaro, nenu anthe dooranga unnanu~#AyeJude (youtuber) #PhanHanumantu brother pic.twitter.com/szbX3xWfBF— Filmy Bowl (@FilmyBowl) July 10, 2024 -
ప్రణీత్ హనుమంతు అరెస్ట్ ఈడ్చుకొస్తున్న పోలీసులు
-
యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తండ్రీ కూతుళ్ల బంధంపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అరెస్ట్ అయ్యారు. బుధవారం బెంగళూరులో అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్‌కు తీసుకురానున్నారు. ఇప్పటికే అతనిపై సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు.కొన్నేళ్లుగా తన స్నేహితులతో వీడియో చాటింగ్ చేస్తూ అసభ్యకర మాటలతో రెచ్చిపోతున్న ప్రణీత్ హనుమంతు తీరుపై టాలీవుడ్ హీరో సాయి దుర్గ తేజ్ మొదటిసారి రియాక్ట్ అయ్యాడు. ఆయన తీరును తప్పుబడుతూ ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులకు సోషల్ మీడియా ద్వారా విషయాన్ని షేర్ చేశారు. దీంతో ఈ విషయం నెట్టింట వైరల్ అయింది.తండ్రీకూతుళ్ల బంధంపై విచక్షణ మరచి ప్రణీత్ హనుమంతు మాట్లాడాడు. తండ్రి, కుమార్తె బంధంలో అశ్లీలం ధ్వనించేలా తన స్నేహితులతో ఆయన మాట్లాడాడు. సాయి దుర్గ తేజ్ ఈ విషయాన్ని తెరపైకి తీసుకురావడంతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చర్యలకు ఆదేశించారు. తాజాగా ప్రణీత్ హనుమంతును టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. అక్కడే ఆయన్ను కోర్టులో హాజరుపరిచారు. ట్రాన్సిట్ వారెంట్ ద్వారా ప్రణీత్ హనుమంతును హైదరాబాద్‌కు తీసుకురానున్నారు. ఆయనపై నాన్‌బెయిలబుల్ వారెంట్ కేసు నమోదు చేశారు. ప్రణీత్‌తో పాటు అతని స్నేహితులలో మరో ముగ్గుర్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు: నాంపల్లి కోర్టులో హైడ్రామా
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టులో హైడ్రామా నడిచింది. పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను కోర్టు వెనక్కి పంపగా.. ఇదే అదనుగా ఈ కేసులో నిందితుడు ప్రణీత్‌రావు బెయిల్ కోసం ప్రయత్నించాడు. అయితే ఇక్కడే ఊహించని ట్విస్టు చోటు చేసుకుంది.ఛార్జ్‌షీట్‌లో కొన్ని తప్పిదాలను గుర్తించిన నాంపల్లి కోర్టు.. దానిని పోలీసులకు తిప్పి పంపించింది. అయితే ఈ గ్యాప్‌లో ప్రణీత్ రావు కోర్టును ఆశ్రయించాడు. తొంభై రోజుల్లో పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేయలేదు కాబట్టి బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థించాడు. అయితే ఈలోపే తప్పులు కరెక్ట్ చేసిన పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. అంతేకాదు.. బెయిల్ ఇస్తే ప్రణీత్‌రావు సాక్ష్యాల్ని తారుమారు చేస్తారని వాదించారు. కొత్త ఛార్జ్‌షీట్ పరిగణనలోకి తీసుకోవడమే కాకుండా.. పోలీసుల వాదనతో నాంపల్లి కోర్టు ఏకీభవించింది. ఫలితంగా.. ప్రణీత్‌రావు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. -
1200 వందల ప్రముఖుల ఫోన్లు ట్యాప్ నిజాలు ఒప్పుకున్నా ప్రణీత్ రావు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనాలు బయటకు..
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) పి.రాధాకిషన్‌రావు అండ్ టీమ్ అక్రమాలు బయటపడుతున్నాయి. రాధాకిషన్‌రావు రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్కు మద్దతుగా ఇతర పార్టీల నేతలకు సంబంధించిన డబ్బును పట్టుకోవడానికి ఫోన్ ట్యాపింగ్‌ను రాధాకిషన్‌రావు ఆయుధంగా ఉపయోగించుకున్నట్లు ఇప్పటికే పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. అయితే బీఆర్ఎస్కు అనుకూలంగా డబ్బు తరలించే వ్యవహారంలోనూ రాధాకిషన్‌రావు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసుల తాజా దర్యాప్తులో బయటపడింది.ఈ ప్రక్రియలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ ఐఏఎస్ వెంకట్రామిరెడ్డికి చెందిన డబ్బును ఎక్కువగా తరలించినట్లు తేలింది. రాధాకిషన్‌రావు డబ్బు తరలించేందుకు అప్పట్లో సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ టీంలో పనిచేస్తున్న ఓ ఎస్సైని ఎంచుకున్నారు. ఆయనకు ప్రత్యేకంగా ప్రభుత్వ బొలేరో వాహనాన్ని సమకూర్చి అందులోనే పెద్దఎత్తున నగదును తరలించారు. భారాస ఎమ్మెల్సీ, విశ్రాంత ఐఏఎస్ వెంకట్రామిరెడ్డ్డికి చెందిన డబ్బు తరలింపు వాహనాలకు రాధాకిషన్‌రావు ఆదేశాలతో ఎస్సై పలుమార్లు ఎస్కార్ట్‌గా వ్యవహరించారు. తెల్లాపూర్‌లోని రాజ్‌పుష్ప గ్రీన్డేల్ విల్లాస్‌లో వెంకట్రామిరెడ్డి ఇంటి సమీపంలో ఉండే శివచరణ్‌రెడ్డి అలియాస్ చరణ్‌ను కలవాలని రాధాకిషన్‌రావు ఎస్సైకి సూచించారు. అనంతరం శివచరణ్‌రెడ్డి కొత్త ఐఫోన్‌ను, సిమ్‌కార్డును తీసుకొచ్చి ఎస్సైకి అప్పగించారు రాధాకిషన్‌రావు. నగదు తరలింపు వ్యవహారాల గురించి రాధాకిషన్‌రావు ఆ ఫోన్‌కే కాల్ చేస్తూ ఎస్సైకి ఆదేశాలిచ్చేవారు. డబ్బులకు ఎస్కార్ట్ ఇచ్చి మరీ డెలివరీ చేశారు. సికింద్రాబాద్‌లో ఉండే మాజీ ఎస్పీకి సైతం డబ్బుల రవాణాలో పాత్ర ఉంది. ఆ ఎస్సై పలు సార్లు రూ. 3 కోట్ల డబ్బులు తరలించారు. డబ్బులు తరలించిన ఎస్ఐ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. ప్రభాకర్ రావు ఆదేశాలతో రాజకీయ నాయకులపై నిఘా కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. రాజకీయ నాయకులపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రభాకర్‌కి రాధాకిషన్‌రావు చేరవేశారు. ప్రణీత్ రావు ఇచ్చే సమాచారంతో రాధా కిషన్ నిఘాను పెట్టారు. రాధాకిషన్ సహకరించిన ఎస్సైలు, ఇన్స్పెక్టర్లను తోపాటు మాజీ పోలీసు అధికారులను పోలీసులు విచారించనున్నారు. పలువురు రాజకీయ నేతల విచారణకు రంగం సిద్దం చేశారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్‌రావుకు ఏడు రోజుల కస్టడీ
సాక్షి, హైదరాబాద్: ఫోన్ టాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధా కిషన్ రావును తమ కస్టడీకి కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్‌పై బుధవారం నాంపల్లి కోర్టు విచారణ జరిపింది. ఈమేరకు రాధాకిషన్‌రావును పదిరోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే రాధా కిషన్‌రావును ఏడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు పోలీసులు ప్రశ్నించానున్నారు. దీంతో గురువారం చంచలగూడ జైలు నుంచి పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. కాగా ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు A4గా ఉన్నారు. చదవండి: రాధాకిషన్ రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు -
ముక్కలు చేసి.. మూసీలో పడేసి!
సాక్షి, హైదరాబాద్: ఎస్ఐబీలోని స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) ద్వారా జరిగిన అక్రమ ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టు అయిన అదనపు ఎస్పీల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్నలను ఐదు రోజులపాటు పోలీసు కస్టడీకి తీసుకున్న సిట్ అధికారులు వివిధ కోణాల్లో ప్రశ్నించారు. ఫలితంగా ట్యాపింగ్‌తో పాటు ఆధారాల ధ్వంసానికి సంబంధించిన సమాచారం సేకరించారు. ఈ వివరాలను పోలీసులు తమ రిమాండ్ రిపోర్టు ద్వారా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. భుజంగరావు, తిరుపతన్నలు తమ నేరం అంగీకరించారని, ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు ఆదేశాలతోనే నేరం చేసినట్టు బయటపెట్టారని కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు. మంగళవారం వీరిద్దరిని గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి శనివారం వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించగా, చంచల్‌గూడ జైలుకు తరలించారు. ప్రణీత్‌రావు దారికి వచ్చాడంటూ... ఈ కేసులో తొలి అరెస్టు ఎస్ఐబీ మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావుదే. తొలుత పోలీసు విచారణకు అతడు సహకరించలేదని, అయితే రానురాను సహకరిస్తూ కీలక వివరాలు వెల్లడించారని పోలీసులు కోర్టుకు తెలిపారు. ప్రభాకర్‌రావు రాజీనామా చేసిన రోజే (గత ఏడాది డిసెంబర్ 4న) ఆయన ఆదేశాల మేరకు ప్రణీత్‌రావు ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న టీఎస్ఎస్పీ హెడ్‌కానిస్టేబుల్ కైతోజు కృష్ణతో కలిసి ఎస్ఐబీ కార్యాలయంలోకి వెళ్లారు. అక్కడ తాను ఏర్పాటు చేసుకున్న వార్ రూమ్‌తోపాటు అధికారిక ట్యాపింగ్స్ జరిగే లాగర్ రూమ్ దగ్గర సీసీ కెమెరాలు ఆఫ్ చేయించాడు. వార్‌రూమ్‌లోని 17 కంప్యూటర్లలో ఉన్న వాటితోపాటు విడిగా భద్రపరిచిన 50 హార్డ్‌డిస్క్ లను ధ్వంసం చేయడానికి ఉపక్రమించాడు. తనతో వచ్చిన ఎల్రక్టీషియన్తోపాటు నమ్మినబంటుగా ఉన్న ఓ పోలీసు సహాయంతో ఎలక్ట్రిక్ కట్టర్ వినియోగించి ఈ హార్డ్‌డిస్క్‌లు ముక్కలు చేశాడు. వీటి శకలాలను నాగోలు వద్ద మూసీనదిలో పారేశాడు. ఈ విషయాలు వెలుగులోకి రావడంతోనే అప్రమత్తమైన సిట్ అధికారులు మూసీలో సోదాలు చేశారు. వీరికి ధ్వంసమైన హార్డ్‌డిస్క్ కేసులు 5, హార్డ్‌డిస్క్ ముక్కలు తొమ్మిది లభించాయి. వీటితో పాటు తాము మూసీ నుంచే ఆరు మెటల్ హార్డ్‌డిస్క్ ముక్కల్నీ సీజ్ చేశామని కోర్టుకు తెలిపారు. ఎస్ఐబీ కార్యాలయం నుంచి ఆధారాలు ప్రణీత్‌రావు వాంగ్మూలం ఆధారంగా సిట్ అధికారులు మూసీనది నుంచే కాకుండా గ్రీన్‌లాండ్స్‌లోని ఎస్ఐబీ కార్యాలయం, దాని ఆవరణ, పరిసరాల నుంచి కొన్ని ఆధారాలు, భౌతిక సాక్ష్యాలు సేకరించారు. అక్రమ ట్యాపింగ్‌కు వినియోగించిన 12 కంప్యూటర్లు, 7 సీపీయూలు, ల్యాప్‌టాప్, మానిటర్లు, పవర్ కేబుళ్లు స్వాదీనం చేసుకున్నారు. అక్కడ ఉన్న ఎలక్ట్రిషియన్ గదిలో క్లూస్, ఫోరెన్సిక్ అధికారులతో కలిసి సోదాలు చేసిన సిట్ హార్డ్‌డిస్క్‌లు కట్ చేస్తున్నప్పుడు కింద పడి, మూలలకు చేరిన వాటి పొడిని సీజ్ చేశారు. ఎస్ఐబీ కార్యాలయ ఆవరణలో పాక్షికంగా కాలిన డాక్యుమెంట్లు, స్పైరల్ బైండింగ్ చేసిన పత్రాలతో పాటు సీసీ కెమెరాల ఫుటేజీకి సంబంధించిన లాగ్‌బుక్ ప్రతులను పోలీసులు సేకరించారు. ఎస్ఐబీ కానిస్టేబుల్ కొత్త నరేష్ గౌడ్ నుంచి వాంగ్మూలం నమోదు చేశారు. టి.ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు ప్రతిపక్షాలపై తాము నిఘా పెట్టినట్టు అతడు బయటపెట్టాడు. ప్రధానంగా ప్రైవేట్ వ్యక్తులపై అక్రమ నిఘా ఉంచడంలో భుజంగరావు, తిరుపతన్న కీలకంగా వ్యవహరించారని, ఈ విషయాన్ని వారు అంగీకరించారని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు: రాధాకిషన్ రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అటు రాజకీయంగానూ తీవ్ర దమారం రేపుతోంది. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్తోపాటు బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధానికి తెరదీసింది. తాజాగా ట్యాపింగ్ కేసులో A4గా ఉన్న రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు వెలుగుచూశాయి. 2018 ఎన్నికలు, దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికలు, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి డబ్బులు తరలించినట్లు పోలీసుల ఎదుట అంగీకరించారు. 8 సార్లు టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులు తరలించినట్లు ఒప్పుకున్నారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలు మేరకు ఎన్నికల సమయంలో ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు వెల్లడించారు. బీఆర్ఎస్ గెలుపు కోసం కొందరు అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు రాధాకిషన్ రావు తెలిపారు. టాస్క్‌ఫోర్స్‌లోని సిబ్బందిని బెదిరించి బీఆర్ఎస్ పార్టీకి చెందిన డబ్బులను సరఫరా చేసినట్లు అంగీకరించారు. టాస్క్‌ఫోర్స్ బృందానికి వాహనాలు సమకూర్చినట్లు ఒప్పుకున్నారు. ఓ ఎమ్మెల్సీ చిన్ననాటి స్నేహితుడు కావడంతో అతడి డబ్బులు తరలించినట్లు పేర్కొన్నారు. 2023లో టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన ఇన్స్పెక్టర్లు, సిబ్బంది డబ్బుల పట్టుకోవడంలో కీలక పాత్ర వహించినట్లు వెల్లడించారు. 8 సార్లు పట్టుకున్న డబ్బు మొత్తం ప్రతిపక్షాలకు చెందినదేనని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా 2018లో శేరిలింగంపల్లి టీడీపీ అభ్యర్థి భవ్య సిమెంట్ ఆనంద్ ప్రసాద్ నగదు ప్యారడైజ్ వద్ద 70 లక్షలు సీజ్ చేసినట్లు తెలిపారు. 2020 దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో రఘునంధన్ రావు, ఆయన బందువుల నుంచి కోటి రూపాయలు సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ముడుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సహచరుల నుంచిరూ.3.50 కోట్ల స్వాధీనం చేసుకున్నామని రాధకిషన్ రావు చెప్పినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు: మరో కీలక పరిణామం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఎస్ఐబీ) ఫోన్ టైపింగ్ కేసులో కీలక పరిమాణం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారి అయిన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు అమెరికా నుంచి వస్తున్నట్లు సమాచారం. అమెరికా నుండి రేపు (సోమవారం) హైదరాబాద్‌కు రానున్న తెలుస్తోంది. ఫోన్ టాపింగ్ కేసులో కీలకంగా ఉన్న ప్రభాకర్ రావు చుట్టూ.. ఈ కేసు తిరుగుతున్న విషయం తెలిసిందే. ప్రభాకర్ రావును విచారిస్తే సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉంది. ప్రభాకర్ రావు విచారణ అనంతరం బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎస్ఐబీ చీఫ్‌గా ఉండి ఫోన్ ట్యాపింగ్‌లకు పాల్పడ్డ ప్రభాకర్ రావు.. రాజకీయ నేతలు, ప్రముఖులు, వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేశారు. ఇక.. ఇప్పటికే ఈ కేసులో అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్న కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. అదే విధంగా టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావుకు సైతం14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. సిట్ అధికారులు రాధాకిషన్‌రావుతో పాటు భుజంగరావు, తిరుపతన్నలను ప్రధానంగా రెండు కోణాల్లో ప్రశ్నించారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావుతో వీరికి ఉన్న సంబంధాలు, ఆయన ఆదేశాల మేరకు చేసిన ఫోన్ ట్యాపింగ్‌పై ఎక్కువగా దృష్టి పెట్టారు. డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు నేతృత్వంలోని బృందం సహాయంతో వీరు ప్రతిపక్ష నేతలు, కీలక వ్యక్తులతో పాటు వ్యాపారుల ఫోన్లూ ట్యాప్ చేసి వ్యక్తిగత విషయాలు తెలుసుకున్నారు. ఈ రకమైన ఆదేశాలు ఎవరు ఇచ్చారు? గుర్తించిన వివరా లను తొలుత ఆ వ్యక్తులకు చెప్పేవారా? అనే కోణాల్లో సిట్ ప్రశ్నించింది. వీరి వేధింపుల నేపథ్యంలో ఓ పార్టీకి వివిధ రూపాల్లో విరా ళాలు ఇవ్వడంతో పాటు ప్రభాకర్‌రావు, రాధా కిషన్‌రావు తదితరులకు కప్పం కట్టిన వాళ్లల్లో బడా బిల్డర్లు, జ్యువెలరీ దుకాణాల యజమా నులు, రియల్టర్లతో పాటు హవాలా వ్యాపా రులూ ఉన్నట్టు సిట్ అనుమానిస్తోంది. ఈ ముగ్గురినీ ప్రశ్నించిన సిట్ అధికారులు దీనికి సంబంధించి కీలక సమాచారం సేకరించారని తెలిసింది. రాచకొండ ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ భూపతి గట్టుమల్లును శుక్రవారం తెల్లవారు జామున విడిచిపెట్టారు. దాదాపు ఆరుగంటల పాటు రాధాకిషన్‌రావుతో కలిపి గట్టుమల్లును ప్రశ్నించిన సిట్ ఆయన నుంచి వాంగ్మూలం నమోదు చేసింది. ఎస్ఐబీ, టాస్క్‌ఫోర్స్‌ల్లో పనిచేసిన అనేక మంది అధికారులు, సిబ్బందినీ సిట్ విచారిస్తూ వారి నుంచి వాంగ్మూలాలు సేకరిస్తోంది. ఇప్పటి వరకు 47మంది నుంచి స్టేట్మెంట్స్ రికార్డు చేశారని సమాచారం. రాధాకిషన్‌రావు, నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్నలు అక్రమ ఆస్తులు కూడబెట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని ప్రాథమిక ఆధారా లు సేకరించారు. ఈ అంశాలను క్రోడీకరిస్తూ అవినీతి నిరోధక శాఖకు సమాచారమివ్వాలని సిట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వివరాలు అందిన తర్వాత ఏసీబీ అధికారులు ఆదాయా నికి మించిన ఆస్తుల కేసు నమోదు చేయనున్న ట్లు సమాచారం. మరోపక్క అక్ర మ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉండి, అరెస్టు అయిన అధికారుల పూర్వాపరాల ను ఉన్నతా ధికారులు పరిశీలిస్తున్నారు. వీరు గతంలో ఎక్క డెక్కడ పనిచేశారు? ఆయాచోట్ల వీరిపై ఉన్న వివాదాలు ఏంటి? కేసులు ఉన్నా యా? అని ఆరా తీస్తున్నారు. తిరుపతన్నపై పెద్దగా వివాదాల్లేనప్పటికీ.. భుజంగ రావు సర్వీసు మొత్తం అక్రమ దందాలతోనే సాగిందని అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. రాధాకిషన్‌రావు ఉప్ప ల్ ఏసీపీగా ఉండగా 2013లో చోటు చేసుకున్న యాంజాల్ శ్రీధర్‌రెడ్డి అలియాస్ ఉప్పల్ వైఎస్సార్ ఆత్మహత్య కేసును అధికా రులు తవ్వుతున్నారు. అప్పటి రామంతాపూర్ కార్పొరేటర్ పరమేశ్వర్‌రెడ్డితోపాటు రాధా కిషన్‌రావు వేధింపులతోనే ఉప్పల్ వైఎస్సార్ ఆత్మహత్య చేసుకున్నట్లు కేసు నమోదైంది. 2007లో జరి గిన పరమేశ్వర్‌రెడ్డి సోదరుడు జగదీశ్వర్‌రెడ్డి హత్య కేసులో ఉప్పల్ వైఎస్సార్ నిందితుడు. ఇతడు మరికొందరితో కలిసి పరమేశ్వర్‌రెడ్డికి హత్యకు కుట్ర పన్నిన ఆరోపణలపై ఉప్పల్ వైఎస్సార్ తదితరులను పోలీ సులు 2013 జూన్‌లో అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి రాధా కిషన్ రావు రూ.10 లక్షల లంచం డిమాండ్ చేసి వేధించడంతోనే ఉప్పల్ వైఎస్సార్ ఆత్మహత్య చేసుకున్నట్టు అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసు ఇప్పటికీ ట్రయల్ పూర్తి కాకపోవడానికి కారణాలను ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. చదవండి: ఫోన్ ట్యాపింగ్ కేసు.. యూఎస్ నుంచి ప్రభాకర్‌రావు రియాక్షన్ ఇది! -
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మాజీ టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు, ఎన్స్పెక్టర్ గట్టు మల్లును అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరిని గురువారం హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు విచారిస్తున్నారు. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావుతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. కాగా ప్రణీత్‌రావుపై కేసు నమోదుకాగానే రాధాకిషన్‌రావు అమెరికా వెళ్లిపోయారు. లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో హైదరాబాద్‌కు తిరిగివచ్చారు. ప్రణీత్ రావు డ్రైవర్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభాకర్‌రావుతో సమానంగా రాధాకిషన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేయడంతో రాధాకిషన్ గట్టుమల్లు కీలకపాత్ర వహించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ప్రణీత్‌రావుతో పాటు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రముఖుల వ్యక్తిగత విషయాలపై వీరు నిఘా పెట్టి, ప్రభుత్వం మారాక హార్డ్‌డిస్క్‌లను ధ్వంసం చేసినట్లు ఆరోపణలున్నాయి. మరో వైపు భుజంగరావు, తిరుపతన్నను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో బుధవారం వాదనలు ముగియగా.. న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. చదవండి: ఎస్ఐబీలో నడిచిన ఓఎస్డీల రాజ్యం.. -
ఫోన్ ట్యాపింగ్ కేసు లో ఎమ్మెల్సీ..
-
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో టెలిగ్రాఫ్ చట్టాన్ని జోడించిన అధికారులు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
HYD: ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు పోలీసులు ముమ్మరం చేశారు. 15 మంది అధికారులు చెప్పు చేతుల్లో ఎస్ఐబీ కీలుబొమ్మగా మారింది. అధికారులు ఎస్ఐబి కంట్రోల్ చేసినట్లుగా గుర్తించారు. రిటైర్డ్ ఐజీ ప్రభాకర్‌రావుతో పాటు ఒక మాజీ డీఐజీ నేతృత్యంలో ఎస్ఐబీ నడిచింది. ముగ్గురు మాజీ ఎస్పీలు, ఐదుగురు అదనపు ఎస్పీల కంట్రోల్లో ఎస్ఐబీ నడిచింది. అదనపు ఎస్పీ భుజంగరావు, తిరుపతన్నను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. రిటైర్డ్ అయిన తర్వాత కూడా ముగ్గురు అదనపు ఎస్పీలు, ఐదుగురు డిఎస్పీలు అక్కడే తిష్ట వేశారు. ప్రణీత రావు నేతృత్వంలో మాజీ అధికారులు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారు. ప్రణీతరావుకి పూర్తిగా ఐదుగురు ఇన్స్పెక్టర్లు సహకరించినట్లు గుర్తించారు. ఎస్ఐబిలో మొత్తం 38 మంది సిబ్బందితో ప్రణీత్‌రావు లాగర్ రూమ్ నడిపారు. ప్రభాకర్ రావు ఆదేశాలతో పలువురి నంబర్లను ట్రాప్ చేసిన మాజీలు.. రిటైర్డ్ అయిన అధికారులు ఓఎస్డీ పేరుతో ఎస్ఐబీలో చలామణి అయ్యారు. సర్వీస్‌లో ఉన్న అధికారుల పేర్లతో ఓఎస్డీలు అక్రమాలను సిట్ గుర్తించింది. ప్రణీత్ రావుకి సహకరించిన వారందరినీ విచారించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇదీ చదవండి: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.. వెలుగులోకి ఎమ్మెల్సీ పాత్ర -
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.. వెలుగులోకి ఎమ్మెల్సీ పాత్ర
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ట్యాపింగ్ టీమ్ అక్రమ వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి నిత్యం కొత్త వ్యక్తుల పేర్లు తెరమీదకు వస్తున్నాయి. తాజాగా ఈ వ్యవహారంలో ఓ ఎమ్మెల్సీ పాత్ర ఉన్నట్లు తేలింది. ఎమ్మెల్సీ పాత్రపై సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. ఇజ్రాయిల్‌లో అధునాతన పరికరాలు కొని హైదరాబాధ్‌కు రప్పించడంలో ఎమ్మెల్సీ కీలక పాత్ర వహించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఎమ్మెల్సీ తన పలుకుబడితో రవిపాల్‌తో ట్యాపింగ్ డివైజ్‌లను తెప్పించినట్లు గుర్తించారు. అదే విధంగా ఎస్ఐబీ కేంద్రంగా అక్రమ ట్యాపింగ్‌కు పాల్పడిన మాజీ ఓఎస్డీ టి. ప్రభాకర్‌రావు అండ్ టీమ్ సాగించిన దందాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ప్రతిపక్ష నేతలు, కీలక వ్యక్తులు, వారి కుటుంబీకులపై నిఘా ఉంచడంతో పాటు, ట్యాపింగ్ సందర్భంగా తెలుసుకున్న సమాచారం ఆధారంగా పలు కంపెనీలు, పలువురు రియల్టర్లు, బిల్డర్లు, జ్యువెలర్స్‌ను బెదిరించి భారీ స్థాయిలో వసూళ్లకు పాల్పడినట్లు సిట్ అధికారులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలు సైతం లభించినట్లు సమాచారం. చదవండి: ఆ నలుగురూ ఉమ్మడి నల్లగొండలో పనిచేసిన వారే.. మరోవైపు ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో రవిపాల్ కీలకంగా మారారు. ఎస్ఐబీ టెక్నికల్ కన్సల్టెంట్‌గా ఉన్న రవిపాల్ నేతృత్యంలోనే ట్యాపింగ్ డివైజ్‌లు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా డివైజ్‌ను తీసుకొచ్చిన రవిపాల్, ఓ సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతో ఇజ్రాయిల్ నుంచి ట్యాపింగ్ డివైజ్‌లు దిగుమతి చేసినట్లు సమాచారం. ఇందుకు రవిపాల్‌కు ఎస్ఐబీ కోట్లలో డబ్లులు చెల్లించినట్లు తెలిసింది. రవిపాల్, ప్రభాకర్ కలిసి ఆధునాతన డివైజ్‌లను దిగుమతి చేసుకున్నట్లు పోలీసులు విచారణలో తేలింది. 300 మీటర్ల పరిధిలో మాటలను వినే వీలున్న డివైజ్‌లు తెచ్చిన రవిపాల్ ..రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో ఆఫీస్ తీసుకొని డివైజ్ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. రేవంత్ ఇంట్లో జరిగే ప్రతి విషయన్ని ఎప్పటికప్పుడు ప్రణీత్‌రావు, రవిపాల్ విన్నారు. ఈ క్రమంలో రవిపాల్‌ను ప్రశ్నించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. -
ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో కొత్త కోణం..
సాక్షి, హైదరాబాద్: ప్రణీత్ రావుఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొత్త కోణం వెలుగు చూసింది. రియల్ ఎస్టేట్, ఫార్మా, సాఫ్ట్వేర్ కంపెనీ యజమానుల ఫోన్లను ప్రణీత్ ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రతిపక్ష నేతలతో టచ్‌లోకి వెళ్లిన రాజకీయ, వ్యాపారులను ప్రణీత్‌రావు గ్యాంగ్ బెదిరించినట్లు తెలిసింది. వ్యాపార వేత్తల వాయిస్‌ను వారికే వినిపించి బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. ఆడియోలు బయటకు రావొద్దంటే బీఆర్ఎస్ నేతలకు డబ్బులు ఇవ్వాలని ప్రణీత్ రావు డిమాండ్ చేసినట్లు వెల్లడైంది. బెదిరింపు ఆడియోలను వ్యాపారుల ముందు పెట్టి వారిచేత ప్రణీత్ గ్యాంగ్ ఎలక్టోరల్ బాండ్స్ కొనిపించినట్లు గుర్తించారు. కొన్ని సంవత్సరాలుగా వ్యాపారులు అత్యధికంగా బీర్ఎస్కు ఎలక్టోరల్ బాండ్లు కొన్నట్లు తేలింది. చదవండి: ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ కేసు.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలనాలు మరోవైపు ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో రవిపాల్ కీలకంగా మారారు. ఎస్ఐబీ టెక్నికల్ కన్సల్టెంట్‌గా ఉన్న రవిపాల్ నేతృత్యంలోనే ట్యాపింగ్ డివైజ్‌లు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా డివైజ్‌ను తీసుకొచ్చిన రవిపాల్, ఓ సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతో ఇజ్రాయిల్ నుంచి ట్యాపింగ్ డివైజ్‌లు దిగుమతి చేసినట్లు సమాచారం. ఇందుకు రవిపాల్‌కు ఎస్ఐబీ కోట్లలో డబ్లులు చెల్లించినట్లు తెలిసింది. రవిపాల్, ప్రభాకర్ కలిసి ఆధునాతన డివైజ్‌లను దిగుమతి చేసుకున్నట్లు పోలీసులు విచారణలో తేలింది. 300 మీటర్ల పరిధిలో మాటలను వినే వీలున్న డివైజ్‌లు తెచ్చిన రవిపాల్ ..రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో ఆఫీస్ తీసుకొని డివైజ్ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. రేవంత్ ఇంట్లో జరిగే ప్రతి విషయన్ని ఎప్పటికప్పుడు ప్రణీత్‌రావు, రవిపాల్ విన్నారు. ఈ క్రమంలో రవిపాల్‌ను ప్రశ్నించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. చదవండి: ట్యాపింగ్ కేసులో ముగ్గురికి రిమాండ్ -
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ లీడర్లకు నోటీసులు?
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు కస్టడీ ద్వారా కీలక విషయాల్ని రాబట్టడంలో దర్యాప్తు బృందం దూకుడుగా వ్యవహరించింది. ఏడు రోజుల విచారణలో ఆయన నుంచి ప్రధాన పాత్రధారులెవరనేది దాదాపుగా నిర్ధారించుకున్న అధికారులు.. ఇప్పుడు రాజకీయ నేతలపై ఫోకస్ చేసినట్లు సమాచారం. విచారణ సమయంలో ప్రణీత్‌రావు పోలీస్ అధికారులతో పాటు పలువురు నేతల పేర్లు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ నేతలకు నోటీసులు ఇచ్చి పశ్నించాలని అధికారులు భావిస్తున్నారు. బీఆర్ఎస్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఇద్దరు నేతలకు నేడో, రేపో నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం. తద్వారా ప్రణీత్ చెప్పిన విషయాలకు సంబంధించి వాళ్ల నుంచి సమాచారాన్ని సేకరించాలని.. వాళ్లిచ్చే సమాధానంతో తదుపరి చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రణీత్‌రావు నడిపించిన ట్యాపింగ్ రాకెట్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ ఇప్పటికే బీఆర్ఎస్ కీలక నేతలు కొందరు బహిరంగంగా మీడియా ముందుకు వచ్చారు. ఇక.. ఇప్పటికే ఈ వ్యవహారంలో గత ప్రభుత్వంతో అంటకాగిన మాజీ పోలీస్ బాస్‌లు పరారీలో ఉండగా.. ఇద్దరు అదనపు ఎస్పీలు భుజంగ్‌రావు, తిరుపతన్నలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. -
ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ కేసు.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలనాలు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రణీత్, భుజంగరావు, తిరుపతన్న రిమాండ్ రిపోర్ట్ బహిర్గతమైంది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు చెబితేనే చేశామని ప్రణీత్, భుజంగరావు, తిరుపతన్న తెలిపారు. 7 రోజుల విచారణలో ప్రణీత్‌రావు కీలక విషయాలు బయటపెట్టారు. కాగా, ఈ కేసులో ప్రభాకర్‌రావును ఏ1గా పోలీసులు చేర్చారు. ఏ1 ప్రభాకర్‌రావు, ఏ2 ప్రణీత్‌రావు, ఏ3 రాధాకిషన్, ఏ4 భుజంగరావు, ఏ5 తిరుపతన్న, ఏ6 ప్రైవేట్ వ్యక్తి పేరును పోలీసులు చేర్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావే కీలక సూత్రధారిగా తేలింది. ప్రభాకర్‌రావు కనుసన్నల్లోనే ట్యాపింగ్ జరిగినట్లు పోలీసులు నిర్థారించారు. ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకే ట్యాపింగ్ డివైజ్‌లను ప్రణీత్‌రావు ధ్వంసం చేశాడు. ప్రణీత్‌రావు ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్‌లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెడిపోయిన ట్యాపింగ్ డివైజ్‌ను పోలీసులు రిట్రీవ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్‌లో ఏముంది? భుజంగరావు, తిరపతన్న ఇచ్చిన నెంబర్లను ప్రణీత్ ట్యాప్ చేశారు. ఎన్నికల సమయంలో వందలాది రాజకీయ నేతలు, వారి కుటుంబసభ్యుల ఫోన్లను ట్యాప్ చేశానని, రాజకీయ నేతలు కదలికలు, నిధుల సమీకరణపై దృష్టిపెట్టానని ప్రణీత్‌రావు వెల్లడించాడు. వ్యాపారవేత్తలతో పాటు సమాజంలో పేరు ఉన్న వారి ఫోన్లను కూడా టాప్ చేశాం. ట్యాపింగ్ సంబంధించిన మెయిన్ డివైజ్‌ని పూర్తిగా ధ్వంసం చేశాను. 17 కంప్యూటర్లలో ఉన్న హార్డ్ డిస్క్‌లు అన్నిటిని ధ్వంసం చేశాను. హార్డ్ డిస్కులు ప్రధాన డివైజ్‌ని కట్టర్‌తో ముక్కలు ముక్కలుగా కట్ చేశాం. ముక్కలుగా చేసిన హార్డ్ డిస్క్‌లు, డివైజ్‌లు తీసుకువెళ్లి మూసీ నదిలో పడవేశాం. రెండు లాకర్ రూములలో ఉన్న డాక్యుమెంట్లు అన్నిటిని తగలబెట్టామని ప్రణీత రావు వెల్లడించాడు. బీఆర్ఎస్ కీలక నేత ఇచ్చిన నెంబర్లను ట్యాప్‌చేశానని.. ప్రణీత్ ఇచ్చిన సమాచారాన్ని బీఆర్ఎస్ కీలక నేతకు చేరవేశామని భుజంగరావు చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు చాలా మంది రాజకీయ నేతల ఫోన్లను కుటుంబ సభ్యుల నెంబర్లను టాప్ చేశామని తెలిపారు. మాజీ టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు ఇచ్చే నంబర్లను ప్రణీత్‌కి ఇచ్చానని తిరుపతన్న వెల్లడించారు. హైదరాబాద్ సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు డీసీపీ షేర్ చేశాడు. డీసీపీ చెప్పిన నంబర్లతో పాటు కొంతమంది కదలికలను ట్రాక్ చేశామని తిరుపతన్న తెలిపారు. ఇదీ చదవండి: ఫోన్ ట్యాపింగ్ కేసు: ప్రభాకర్‌రావే కీలక సూత్రధారి -
ఫోన్ ట్యాపింగ్ కేసు: ప్రభాకర్‌రావే కీలక సూత్రధారి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావును ఏ1గా నిందితుడిగా పోలీసులు చేర్చారు. ఏ1 ప్రభాకర్‌రావు, ఏ2 ప్రణీత్‌రావు, ఏ3 రాధాకిషన్, ఏ4 భుజంగరావు ఏ5 తిరుపతన్న, ఏ6 ప్రైవేట్ వ్యక్తి పేరును చేర్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావే కీలక సూత్రధారి అని పోలీసులు గుర్తించారు. ప్రభాకర్‌రావు కనుసన్నల్లోనే ట్యాపింగ్ జరిగిందని తెలిపారు. ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకే ట్యాపింగ్ డివైజ్‌లు ధ్వంసం చేశారు. ప్రభాకర్‌రావు చెప్పిన మేరకే హార్డ్ డిస్క్‌లను ప్రణీత్‌రావు ధ్వంసం చేశాడని చెప్పారు. ప్రణీత్‌రావు ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్‌లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెడిపోయిన ట్యాపింగ్ డివైజ్‌ను పోలీసులు రిట్రీవ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. హార్డ్ డిస్కుల నుంచి సమాచారాన్ని పోలీసులు రిట్రీవ్ చేస్తున్నారు. చదవండి: ఫోన్ ట్యాపింగ్ కేసు: ఇద్దరు అదనపు ఎస్పీలకు రిమాండ్ -
భుజంగరావు, తిరుపతన్నకు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం...