సాక్షి, హైదరాబాద్: ఫోన్ టాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధా కిషన్ రావును తమ కస్టడీకి కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్‌పై బుధవారం నాంపల్లి కోర్టు విచారణ జరిపింది. ఈమేరకు రాధాకిషన్‌రావును పదిరోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టుకు తెలిపారు.
అయితే రాధా కిషన్‌రావును ఏడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు పోలీసులు ప్రశ్నించానున్నారు. దీంతో గురువారం చంచలగూడ జైలు నుంచి పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. కాగా ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు A4గా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment