సాక్షి, హైదరాబాద్: మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు వ్యవహారంలో విచారణ కొనసాగుతోంది. ఎస్ఐబీలోని టాపింగ్ డివైజ్ మొత్తాన్ని ప్రణీత్‌రావు ధ్వంసం చేసినట్లు గుర్తించారు. మరోసారి పనికిరాకుండా.. డివైజ్‌ను ధ్వంసం చేసి అందులో హార్డ్ డిస్క్ మొత్తాన్ని పగలగొట్టినట్లు తేలింది. అడవుల్లో పడేసిన డివైజ్‌లను స్వాధీన పరుచుకునేందుకు పోలీసుల ప్రయత్నిస్తున్నారు. మరో వైపు ప్రణీత్‌రావు వెనకాల మీడియా సంస్థ యజమాని ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఒక మీడియా సంస్థ యజమాని ఇచ్చిన నెంబర్లను ట్యాప్ చేసిన ప్రణీత్ రావు.. ఆ మీడియా సంస్థ యజమాని దగ్గర ఏకంగా ఒక సర్వర్ పెట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. మరొక రెండు సర్వర్ లను రెండు చోట్ల పెట్టినట్లు గుర్తించారు. వరంగల్‌తో పాటు సిరిసిల్లలో సర్వర్‌లు ఏర్పాటు చేసినట్లు వెల్లడైంది. బీఆర్ఎస్ కీలక నేత ఆదేశాలతో ప్రణీత్ రావు సర్వర్లు ఏర్పాటు చేసినట్లు గుర్తించారు.
ఇదీ చదవండి: ‘ఫోన్ ట్యాపింగ్ తెలియదు.. వార్ రూమ్ తెలియదు’
Comments
Please login to add a commentAdd a comment