Custodial Interrogation
-
Praneeth Rao: ట్యాపింగ్ తీగ లాగితే..
హైదరాబాద్: మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నాలుగో రోజు విచారణ కొనసాగుతోంది. విచారణలో భాగంగా ప్రణీత్ రావు నుంచి కీలక విషయాలు రాబడుతోంది దర్యాప్తు బృందం. ఈ క్రమంలో ప్రణీత్ రావు మరికొందరు అధికారుల పేర్లను వెల్లడించినట్లు తెలుస్తోంది. దీంతో.. ఆ అధికారులకు నోటీసులు ఇచ్చి, వారిని విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇక విచారణలో ప్రణీత్ రావు..ఫోన్ ట్యాపింగ్ కోసం విదేశాల నుంచి ప్రత్యేక సాఫ్ట్ వేర్, పరికరాలు తీసుకువచ్చి వాడినట్టు ఒప్పుకన్నారు. అయితే టెలిఫోన్ సర్వీసులకు సంబంధం లేకుండా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డట్టు గుర్తించారు. అందుకోసం విదేశాల నుంచి ప్రత్యేక సాఫ్ట్ వేర్ తెప్పించింది ఎవరు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కానీ ప్రణీత్ రావు మాత్రం విచారణ ఈ ఫోన్ ట్యాపింగ్ అధికారుల ఆదేశాల మేరకు చేశానని చెబుతుండటం గమనార్హం. దీంతో ఈ కేసులో మరొకందరిక నోటీసులు, కీలక అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ట్యాపింగ్ కేసు నిందితుడు ప్రణీత్‌రావు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ఇవాళ విచారణ జరగనుంది. కస్టడీ విషయంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించడం లేదని.. కస్టడీ ముగిసిన వెంటనే జైలుకు తరలించేలా ఆదేశాలివ్వాలని పిటిషన్లో ఆయన పేర్కొన్నారు. అలాగే.. తనకు సరైన సదుపాయాలు కల్పించడం లేదంటూ పిటిషన్లో ఆరోపించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇప్పటికే పోలీసుల నుంచి వివరణ కోరింది. మరోవైపు.. తనను దర్యాప్తు చేస్తున్న టీంలో ఇంటలిజెన్స్ అధికారులతో పాటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు, అలాగే SIB అడిషనల్ ఎస్పీ రమేష్ విచారణలో పాల్గొనకుండా ఆదేశాలు ఇవ్వాలని ప్రణీత్ రావు కోరడం గమనార్హం. -
ప్రణీత్‌రావు విచారణలో వెలుగులోకి సంచలనాలు
సాక్షి, హైదరాబాద్: మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు వ్యవహారంలో విచారణ కొనసాగుతోంది. ఎస్ఐబీలోని టాపింగ్ డివైజ్ మొత్తాన్ని ప్రణీత్‌రావు ధ్వంసం చేసినట్లు గుర్తించారు. మరోసారి పనికిరాకుండా.. డివైజ్‌ను ధ్వంసం చేసి అందులో హార్డ్ డిస్క్ మొత్తాన్ని పగలగొట్టినట్లు తేలింది. అడవుల్లో పడేసిన డివైజ్‌లను స్వాధీన పరుచుకునేందుకు పోలీసుల ప్రయత్నిస్తున్నారు. మరో వైపు ప్రణీత్‌రావు వెనకాల మీడియా సంస్థ యజమాని ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒక మీడియా సంస్థ యజమాని ఇచ్చిన నెంబర్లను ట్యాప్ చేసిన ప్రణీత్ రావు.. ఆ మీడియా సంస్థ యజమాని దగ్గర ఏకంగా ఒక సర్వర్ పెట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. మరొక రెండు సర్వర్ లను రెండు చోట్ల పెట్టినట్లు గుర్తించారు. వరంగల్‌తో పాటు సిరిసిల్లలో సర్వర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడైంది. బీఆర్ఎస్ కీలక నేత ఆదేశాలతో ప్రణీత్ రావు సర్వర్లు ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. ఇదీ చదవండి: ‘ఫోన్ ట్యాపింగ్ తెలియదు.. వార్ రూమ్ తెలియదు’ -
మారన్ సహకరించడం లేదు: సీబీఐ
న్యూఢిల్లీ: టెలిఫోన్ ఎక్స్చేంజీ స్కామ్ దర్యాప్తుకు కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ సహకరించడం లేదని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది. ఆయనను కస్టడీలో ఇంటరాగేషన్ చేయాల్సిన అవసరముందని పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో సీబీఐ శుక్రవారం అఫిడవిట్ దాఖలు చేసింది. 'టెలిఫోన్ ఎక్స్చేంజీ స్కామ్ లో మారన్ ను కస్టడీలో విచారించాల్సిన అవసరముంది. ప్రభుత్వ టెలిఫోన్ వ్యవస్థను అక్రమంగా సన్ టీవీ కోసం వాడుకున్నారని వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలు తెలియాలంటే ఆయనను విచారించాల్సిందే' అని అఫిడవిట్ లో సీబీఐ పేర్కొంది. దీనిపై సమాధానం ఇవ్వాలని దయానిధి మారన్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను నవంబర్ 27కు వాయిదా వేసింది. మారన్ కు ముందస్తు బెయిల్ రద్దు చేస్తూ మద్రాస్ హైకోర్టును ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు అంతకుముందు స్టే విధించింది.