హైదరాబాద్: మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నాలుగో రోజు విచారణ కొనసాగుతోంది. విచారణలో భాగంగా ప్రణీత్ రావు నుంచి కీలక విషయాలు రాబడుతోంది దర్యాప్తు బృందం. ఈ క్రమంలో ప్రణీత్ రావు మరికొందరు అధికారుల పేర్లను వెల్లడించినట్లు తెలుస్తోంది. దీంతో.. ఆ అధికారులకు నోటీసులు ఇచ్చి, వారిని విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
ఇక విచారణలో ప్రణీత్ రావు..ఫోన్ ట్యాపింగ్ కోసం విదేశాల నుంచి ప్రత్యేక సాఫ్ట్ వేర్, పరికరాలు తీసుకువచ్చి వాడినట్టు ఒప్పుకన్నారు. అయితే టెలిఫోన్ సర్వీసులకు సంబంధం లేకుండా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డట్టు గుర్తించారు. అందుకోసం విదేశాల నుంచి ప్రత్యేక సాఫ్ట్ వేర్ తెప్పించింది ఎవరు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కానీ ప్రణీత్ రావు మాత్రం విచారణ ఈ ఫోన్ ట్యాపింగ్ అధికారుల ఆదేశాల మేరకు చేశానని చెబుతుండటం గమనార్హం. దీంతో ఈ కేసులో మరొకందరిక నోటీసులు, కీలక అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, ట్యాపింగ్ కేసు నిందితుడు ప్రణీత్‌రావు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ఇవాళ విచారణ జరగనుంది. కస్టడీ విషయంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించడం లేదని.. కస్టడీ ముగిసిన వెంటనే జైలుకు తరలించేలా ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో ఆయన పేర్కొన్నారు. అలాగే.. తనకు సరైన సదుపాయాలు కల్పించడం లేదంటూ పిటిషన్‌లో ఆరోపించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇప్పటికే పోలీసుల నుంచి వివరణ కోరింది. మరోవైపు.. తనను దర్యాప్తు చేస్తున్న టీంలో ఇంటలిజెన్స్ అధికారులతో పాటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు, అలాగే SIB అడిషనల్ ఎస్పీ రమేష్ విచారణలో పాల్గొనకుండా ఆదేశాలు ఇవ్వాలని ప్రణీత్ రావు కోరడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment