గుంటూరు జిల్లా చిలకలూరిపేట బస్టాండ్ సమీపంలో లారీ ఢీకొని ఓ ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు.
గుంటూరు జిల్లా చిలకలూరిపేట బస్టాండ్ సమీపంలో లారీ ఢీకొని ఓ ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. బుధవారం ఉదయం సాయి అనే మహిళ తన ఐదేళ్ల కుమారుడు ప్రణీత్‌తోపాటు పొరుగింటికి చెందిన నర్సరీ చదివే శ్రావణిని స్కూటీపై స్కూల్‌కు తీసుకెళుతోంది. బస్టాండ్ సమీపంలో గుంటూరు వైపు నుంచి వచ్చిన లారీ స్కూటీని ఢీకొంది. సాయి, శ్రావణి ఒక వైపు పడిపోగా, ప్రణీత్ మరో వైపు పడిపోయాడు. అతడిపై నుంచి లారీ వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.