వికారాబాద్: ఫొటో షూట్‌కు వెళ్లి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపిన ప్రకారం.. గుంటూరు జిల్లా తెనాలి మండలం నందులపేట గ్రామానికి చెందిన మల్లికార్జున్ వృత్తిరీత్యా ఫొటోగ్రాఫర్. ఓ సారీ ఫంక్షన్ ఆర్డర్ ఫొటోషూట్‌కు కొడుకు దీపక్‌సాయి మరో ఇద్దరు సహాయకులు అబ్దుల్ రావుఫ్, వీరవెంకట్‌తో కలిసి శంకర్‌పల్లిలోని త్రిపుర రిసార్ట్స్‌కి వెళ్లారు.
షూట్ ముగించుకుని వారి సొంతకారులో తిరుగు ప్రయాణమయ్యారు. ఎగ్జిట్ నంబర్ 12 వద్ద మొదటి లైన్‌లో వెళ్తున్న భారీ వాహనం నెమ్మదిగా వెళ్తుండడంతో ఆ వాహనాన్ని దాటవేసి పక్కలైన్‌లో వెళ్తున్న డీసీఎంను వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో మల్లికార్జున్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా కుమారుడు, సహాయకులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment