DCM hits car
-
ఫొటోషూట్‌కు వెళ్లి వస్తుండగా.. ఒక్కసారిగా తీవ్ర విషాదం!
వికారాబాద్: ఫొటో షూట్‌కు వెళ్లి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన ప్రకారం.. గుంటూరు జిల్లా తెనాలి మండలం నందులపేట గ్రామానికి చెందిన మల్లికార్జున్ వృత్తిరీత్యా ఫొటోగ్రాఫర్. ఓ సారీ ఫంక్షన్ ఆర్డర్ ఫొటోషూట్‌కు కొడుకు దీపక్‌సాయి మరో ఇద్దరు సహాయకులు అబ్దుల్ రావుఫ్, వీరవెంకట్‌తో కలిసి శంకర్‌పల్లిలోని త్రిపుర రిసార్ట్స్‌కి వెళ్లారు. షూట్ ముగించుకుని వారి సొంతకారులో తిరుగు ప్రయాణమయ్యారు. ఎగ్జిట్ నంబర్ 12 వద్ద మొదటి లైన్లో వెళ్తున్న భారీ వాహనం నెమ్మదిగా వెళ్తుండడంతో ఆ వాహనాన్ని దాటవేసి పక్కలైన్లో వెళ్తున్న డీసీఎంను వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో మల్లికార్జున్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా కుమారుడు, సహాయకులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
కారును ఢీకొన్న డీసీఎం, ఐదుగురు దుర్మరణం
-
కారును ఢీకొన్న డీసీఎం, ఐదుగురు దుర్మరణం
నల్గొండ : నల్లగొండ జిల్లా భువనగిరి మండలం అనాజిపురం శివార్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వలిగొండ వైపు నుంచి భువనగిరి వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న డీసీఎం వాహనం ఢీ కొట్టడంతో ఐదుగురు దుర్మరణం చెందారు. కారులో ప్రయాణిస్తున్న చెన్నారెడ్డి, తుమ్మల శేఖర్‌రెడ్డి, శివరాత్రి అశోక్ అక్కడికక్కడే మృతిచెందగా.. పూర్ణచందర్, లక్ష్మణరావు భువనగిరి ఏరియా ఆసుపత్రిలో చికిత్సపొందుతూ చనిపోయారు. అశోక్ స్వస్థలం వలిగొండ మండలం జంగారెడ్డి పల్లి కాగా.. శేఖర్రెడ్డిది వలిగొండ మండలం ఎం.తుర్కపల్లి. చెన్నారెడ్డిది ఆత్మకూరు మండలం లింగరాజుపల్లి. పూర్ణచందర్ది హైదరాబాద్‌కాగా.. లక్ష్మణ్రావుది కరీంనగర్. కాగా ప్రమాదానికి కారకుడైన డీసీఎం డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదుచేసి విచారణ జరుపుతున్నారు.