Mallikarjun
-
కీచకుడికే జేసీ ప్రభాకర్ అండ!
సాక్షి, అనంతపురం: తాడిపత్రి టీడీపీ నేత, కౌన్సిలర్ మల్లికార్జున కీచక పర్వం నియోజకవర్గంలో కలకలం రేపింది. ప్రేమ పేరుతో తనను శారీరకంగా వాడుకున్నాడని.. తనకు న్యాయం చేయాలంటూ అనూష అనే యువతి పోరాటానికి దిగింది. ఈ క్రమంలో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. మల్లికార్జున్ వ్యవహారంపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డికి ఫిర్యాదు చేసేందుకు బాధితురాలు ప్రయత్నించింది. మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకున్న ఆమెను సిబ్బంది అడ్డుకున్నారు. అయితే ఆమె అప్పాయింట్మెంట్ కోసం యత్నించగా.. జేసీ అందుకు నిరాకరించారు. ఆమెను లోనికి రానియొద్దంటూ సిబ్బందికి సూచించారు. దీంతో గేటు వద్దే ఆమె చాలాసేపు ఉండిపోయింది. బాధితురాలికి న్యాయం చేయాల్సిందిపోయి.. కీచకుడికే అండగా నిలబడడం ఏంటని? జేసీ తీరుపై మండిపడుతున్నారు పలువురు. టీడీపీ కౌన్సిలర్ మల్లికార్జున తనను శారీరకంగా వాడుకున్నాడని, రెండు సార్లు అబార్షన్ చేయించాడని, పెళ్లి చేసుకోమంటే నిరాకరిస్తున్నాడని, తనను చంపుతానని టీడీపీ నేత మల్లికార్జున బెదిరిస్తున్నాడని బాధితురాలు అనూష వాపోతోంది. ఈ క్రమంలో ఎస్పీని కలిసి ‘స్పందన’లో తన గోడును సైతం వెల్లబోసుకుందామె. సంబంధిత వార్త: మల్లికార్జున కీచక పర్వమిది! -
డబుల్ ఇంజిన్ సర్కారులో డబుల్ అనారోగ్యం: ఖర్గే
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో 14 మంది చిన్నారులకు ఇన్ఫెక్షన్ కలిగిన రక్తాన్ని ఎక్కించారు. ఈ నేపధ్యంలో ఈ చిన్నారులు హెచ్ఐవి, ఎయిడ్స్, హెపటైటిస్ బీ, సీ తదితర వ్యాధుల బారిన పడ్డారు. దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అటు కేంద్రం, ఇటు యూపీ ప్రభుత్వాలను లక్ష్యంగా చేసుకుని ‘డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఆరోగ్య వ్యవస్థను రెట్టింపు అనారోగ్యానికి గురి చేసిందని’ వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో మల్లికార్జున్ ఖర్గే ‘డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఆరోగ్య వ్యవస్థను రెట్టింపు అనారోగ్యానికి గురి చేసింది. యూపీలోని కాన్పూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో తలసేమియాతో బాధపడుతున్న 14 మంది చిన్నారులకు వ్యాధి సోకిన రక్తాన్ని ఎక్కించారు. ఫలితంగా ఆ పిల్లలకు హెచ్ఐవీ ఎయిడ్స్,హెపటైటిస్ బీ, సీ తదితర తీవ్రమైన వ్యాధులు సోకాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వం చేసిన ఈ క్షమించరాని నేరానికి అమాయక పిల్లలు శిక్షను అనుభవించాల్సి వస్తున్నదన్నారు. బీజేపీ ప్రభుత్వాలు ఎన్నడైనా జవాబుదారీతనాన్ని కలిగివున్నాయా? అని ఆయన ప్రశ్నించారు. కాన్పూర్‌లోని లాలా లజపత్ రాయ్ (ఎల్ఎల్ఆర్) ఆసుపత్రిలో 14 మంది పిల్లలకు వ్యాధి సోకిన రక్తాన్ని ఎక్కించారు. ఆ తర్వాత వారు పలు వ్యాధులకు గురయ్యారని తేలింది. ఈ చిన్నారులు ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్, ఫరూఖాబాద్, ఇటావా, ఔరైయా, కన్నౌజ్లతో సహా వివిధ జిల్లాలకు చెందినవారు. ఇది కూడా చదవండి: ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌పై ఇజ్రాయెల్ ఆగ్రహం डबल इंजन सरकार ने हमारी स्वास्थ्य व्यवस्था को डबल बीमार कर दिया है। यूपी के कानपुर में एक सरकारी अस्पताल में थैलीसीमिया के 14 बच्चों को संक्रमित खून चढ़ा दिया गया, जिससे इन बच्चों को HIV AIDS और हेपेटाइटिस B, C जैसी चिंताजनक बीमारियाँ हो गई हैं। ये गंभीर लापरवाही शर्मनाक है।… — Mallikarjun Kharge (@kharge) October 25, 2023 -
రెగ్యులర్ కథలు చేయను : శివ కంఠమనేని
శివ కంఠమనేని, క్యాథలిన్ గౌడ జంటగా మల్లికార్జున్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఫిల్మ్ ‘మధురపూడి గ్రామం అనే నేను’. ముప్పా వెంకయ్య చౌదరి సారథ్యంలో జి.రాంబాబు యాదవ్ సమర్పణలో కేఎస్ శంకర్ రావు, ఆర్. వెంకటేశ్వర రావు నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా శివ కంఠమనేని మాట్లాడుతూ– ‘‘ఒంగోలు బ్యాక్‌డ్రాప్‌లో సాగే యాక్షన్ డ్రామా ఈ చిత్రం. మొరటుగా ఉండే సూరి పాత్రలో కనిపిస్తాను. తన మిత్రుడు బాబ్జీ ఎమ్మెల్యే కావడం కోసం సూరి ఏం చేస్తాడు? ఈ క్రమంలో అతని ప్రేమకథ ఏ విధంగా ప్రభావితమైంది? అనే అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి. కమర్షియల్ పంథాలోనే ఈ సినిమా కథనం సాగుతుంది. ప్రేమ అనేది శరీరానికి కాదు.. మనసులకు సంబంధించినదనే సందేశం అంతర్లీనంగా ఉంటుంది. నేను రెగ్యులర్ కథలు చేయను. నేను చేసిన ‘అక్కడొకడుంటాడు’లో నా పోస్టర్స్ చూసి ‘మధురపూడి..’ సినిమా కథకు నన్ను ఎంపిక చేసుకున్నారు మల్లికార్జున్గారు. దాదాపు 150కిపైగా థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నాం. నా తర్వాతి చిత్రాలు ‘మణిశంకర్, రాఘవరెడ్డి’ త్వరలో రిలీజ్ కానున్నాయి. మంచు లక్ష్మిగారి ‘ఆదిపర్వం’ చిత్రంలో పవర్ఫుల్ రోల్ చేస్తున్నాను’’ అన్నారు. -
ఫొటోషూట్‌కు వెళ్లి వస్తుండగా.. ఒక్కసారిగా తీవ్ర విషాదం!
వికారాబాద్: ఫొటో షూట్‌కు వెళ్లి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన ప్రకారం.. గుంటూరు జిల్లా తెనాలి మండలం నందులపేట గ్రామానికి చెందిన మల్లికార్జున్ వృత్తిరీత్యా ఫొటోగ్రాఫర్. ఓ సారీ ఫంక్షన్ ఆర్డర్ ఫొటోషూట్‌కు కొడుకు దీపక్‌సాయి మరో ఇద్దరు సహాయకులు అబ్దుల్ రావుఫ్, వీరవెంకట్‌తో కలిసి శంకర్‌పల్లిలోని త్రిపుర రిసార్ట్స్‌కి వెళ్లారు. షూట్ ముగించుకుని వారి సొంతకారులో తిరుగు ప్రయాణమయ్యారు. ఎగ్జిట్ నంబర్ 12 వద్ద మొదటి లైన్లో వెళ్తున్న భారీ వాహనం నెమ్మదిగా వెళ్తుండడంతో ఆ వాహనాన్ని దాటవేసి పక్కలైన్లో వెళ్తున్న డీసీఎంను వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో మల్లికార్జున్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా కుమారుడు, సహాయకులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
జాతీయ చేనేత ఐక్య వేదిక అధికార ప్రతినిధిగా అక్షిత
కరీంనగర్: జాతీయ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధిగా కరీంనగర్‌కు చెందిన డాక్టర్ అక్షితను నియమిస్తూ జాతీయ అధ్యక్షుడు అవ్వారు మల్లికార్జున్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కష్టపడేవారికి సరైన గుర్తింపు ఉంటుందని, సంఘం బలోపేతానికి పాటుపడుతున్న కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలు అక్షిత సేవలను మరింతగా వినియోగించుకునేందుకు రాష్ట స్థాయి బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్, రాష్ట్ర ఇన్చార్జి కాటా రాందాస్, అధ్యక్షుడు మాడ రాజా, గౌరవ అధ్యక్షులు తిరందాస్ వేణుగోపాల్, కోట దామోదర్, యువజన విభాగం అధ్యక్షుడు చిలివేరి రామకృష్ణ, మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు ఎలుబాక సుజాతలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. -
ఏడాదిన్నార కాలంలోనే 245 శాశ్వత నియామకాలు
-
విషం చుట్టూ తిరుగుతున్న కన్నడ రాజకీయం
-
పందులు కాస్తున్నారని గుడిలోకి అనుమతి నిరాకరణ?
ఇల్లెందు: గుడి నిర్మాణానికి స్థలం ఇచ్చిన తమను ఆలయంలోకి అనుమతించడం లేదని ఆరోపిస్తూ ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన చోటాలాల్ పాసీ కొన్నేళ్ల కిందట సాయిబాబా ఆలయ నిర్మాణానికి స్థలం ఇచ్చాడు. అయితే, ఆయన కుమారుడు మోహన్‌లాల్ పాసీని కొంత కాలంగా గుడిలోకి కమిటీ సభ్యులు రానివ్వడం లేదని చెబుతున్నారు. పందులు కాస్తూ జీవిస్తున్నారనే అభియోగంతో అడ్డుకోవడమే కాక గుడి సమీప స్థలాన్ని కూడా స్వాదీనం చేసుకున్నారని ఆరోపిస్తూ మోహన్ ఆదివారం పురుగుల మందు తాగాడు. కాగా, ఆలయంలోకి రానివ్వని అంశంపై పోలీసులు, కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఈవిషయమై ఆలయ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ను వివరణ కోరగా.. మోహన్‌లాల్ ఆరోపణలు అవాస్తవమని, ఏనాడు కూడా ఏమీ అనలేదన్నారు. -
మల్లికార్జున్ ఖర్గేపై ఈడీ ప్రశ్నల వర్షం!
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్- యంగ్ ఇండియాకు చెందిన ఆస్తుల మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీకి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇప్పటికీ హస్తం జాతీయ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను పలు దఫాలు విచారించింది ఈడీ. తాజాగా.. మరోమారు విచారణకు హాజరుకావాలని రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గేకు సమన్లు పంపించింది. ఈ సమన్లపై రాజ్యసభలో కొద్దిసేపు కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉద్రిక్త వాతారవణ నెలకొంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకున్నారు. ఈ సందర్భంగా.. తాము చట్టాన్ని గౌరవిస్తామని తెలిపారు ఖర్గే. అనంతరం హెరాల్డ్ కార్యాలయం వద్దకు వెళ్లారు. ఆయన సమక్షంలోనే యంగ్ ఇండియా ఆఫీసులో మరోమారు సోదాలు నిర్వహించింది ఈడీ. అనంతరం ఖర్గే వాగ్మూలాన్ని నమోదు చేసింది. సుమారు నాలుగున్నర గంటల పాటు ప్రశ్నల వర్షం కురిసినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. ఇంకా విచారణ కొనసాగుతున్నట్లు పేర్కొన్నాయి. ఇదీ చదవండి: అనారోగ్యానికి గురైన షిండే.. ఆ బాధ్యతలు ఫడ్నవీస్‌కు! -
దేశ సగటు కంటే ఎక్కువగా టెస్టులు ఏపీలో చేస్తున్నాం
-
తొలి ఉద్యమ సైరన్
ఈరగాని భిక్షం, సాక్షి– సిద్దిపేట : నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం సాగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తొలిదశ 1969లో ప్రారంభమైంది. ఈ ఉద్యమం ఉవ్వెత్తున లేవడానికి అగ్గిరవ్వలు రాజేసి ఉద్యమ బావుటా ఎగురవేసిన నాయకుల్లో మల్లికార్జున్ గౌడ్ ముఖ్యులు. ఏ ప్రాంతంలోని ఉద్యోగాలు ఆ ప్రాంతం వారికే ఇవ్వాలనే డిమాండ్‌తో సాగిన ముల్కీ, నాన్ ముల్కీ ఉద్యమంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి నాయకుడిగా ఉద్యమ పాఠాలు నేర్చిన ఆయన తెలంగాణ ఉద్యమ నాయకుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేసి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకున్నారు. విద్యార్థి లీడర్ నుంచి ఉద్యమ నేతగా.. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన మల్లికార్జున్ మెదక్ జిల్లా నల్లగండ్ల గ్రామంలో గీత కార్మికుల కుటుంబంలో 1941లో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా చేరి అక్కడ విద్యార్థి సంఘ నాయకుడిగా పనిచేశారు. ముల్కీ, నాన్ ముల్కీ ఉద్యమంలో ముందుండి నడిచారు. ఈ ప్రాంతంలో వేలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేకుండా ఉన్నా.. వేరే ప్రాంతం వారికి ఉద్యోగాలు ఇవ్వడాన్ని ప్రశ్నించారు. అప్పటి ఉద్యమ నాయకుడు, ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన మదన్మోహన్, మర్రి చెన్నారెడ్డితో కలిసి ఉద్యమంలో పనిచేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రజా సమితిలో కీలక నాయకుడిగా ఉన్నారు. 1971లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ నుంచి టీపీఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నర్సింహారెడ్డిపై 53,431 ఓట్ల మెజార్టీతో విజయబావుటా ఎగురవేసి ప్రత్యేక తెలంగాణ వాదాన్ని చాటారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. అనంతరం 1980లో ఇందిరాగాంధీని పిలిపించి తన సిట్టింగ్ స్థానం మెదక్ నుంచి పోటీ చేయించి అత్యధిక మెజార్టీతో ఆమె గెలిచేందుకు కృషి చేశారు. అదే సమయంలో ఆయన మహబూబ్‌నగర్ ఎంపీగా పోటీ చేశారు. ఇందిరా కాంగ్రెస్ నుండి పోటీ చేసిన మల్లికార్జున్ కాంగ్రెస్ (యూ) నుంచి పోటీ చేసిన రామేశ్వర్‌రావుపై 1,52,661 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అనంతరం 1989, 1991, 1996 ఎన్నికల్లో మహబూబ్‌నగర్ ఎంపీగా గెలిచారు. ఈ సందర్భంగా ఆయన ఇందిరాగాంధీ, రాహుల్‌గాంధీ, పీవీ నర్సింహారావు మంత్రి వర్గాలలో కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి, సమాచారశాఖ మంత్రిగా పని చేశారు. 1996 నుంచి 1998 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2002 డిసెంబర్ 24న మరణించారు. జాతీయ నాయకుడిగా..విద్యార్థి నాయకుడి దశ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ రాజకీయాల్లో జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగిన మల్లికార్జున్‌ది రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర. టీపీఎస్‌ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత రెండుసార్లు మెదక్ నుంచి, నాలుగుసార్లు మహబూబ్‌నగర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలోని కాంగ్రెస్ నాయకులతో ఉన్న అనుబంధం ఆయనను కేంద్ర మంత్రిగా నియమించింది. ఇందిరాగాంధీ, రాహుల్‌గాంధీ, పీవీ నర్సింహారావు వంటి మహామహులతో ఆయన సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. ఆయన చివరి వరకు ప్రత్యేక తెలంగాణ కోసం పరితపించారు. 2009 ఎస్.జైపాల్‌రెడ్డి (కాంగ్రెస్).. సమీప ప్రత్యర్థి ఎ.పి.జితేందర్‌రెడ్డి (టీడీపీ)పై 18,532 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. చేవెళ్లచాంపియన్లు 2014 కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (టీఆర్ఎస్).. పి.కార్తీక్‌రెడ్డి (కాంగ్రెస్)పై 73,023 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. చేవెళ్ల లోక్‌సభ ఓటర్లు పురుషులు 12,51,210 మహిళలు 11,64,093 ఇతరులు 295 మొత్తం 24,15,598 -
సోకులెక్కువ
మల్లిఖార్జున్, కవిత మెహతా జంటగా అన్నం చంద్రశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కాలేజ్ పోరగాళ్ళు’. ‘సదువు తక్కువ.. సోకులెక్కువ’ అన్నది ఉప శీర్షిక. మంత్ర ఆర్ట్స్‌పై కెమెరామెన్ శ్రీధర్ నేతృత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఎల్ఎం ప్రేమ్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. ‘‘మా చిత్రం ద్వారా మంచి సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాం. సినిమా బాగా వచ్చింది. అతి త్వరలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు అన్నం చంద్ర శేఖర్. -
కబడ్డీ ఆడుతూ..
రఘునాథపాలెం: ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కబడ్డీ ఆడుతూ యువకుడు మృతిచెందిన సంఘటన జిల్లాలోని రఘునాథపాలెం మండలం బూడిదంపాడులో బుధవారం అర్ధరాత్రి దాటాక వెలుగుచూసింది. గ్రామంలో వినాయక మండపం వద్ద ఏర్పాటు చేసిన కబడ్డీ పోటీలో పాల్గొన్న మల్లికార్జున్(24) అనే యువకుడు కోర్టులోనే కుప్పకూలి మృతి చెందాడు. ఇటీవలే ఇంజనీరింగ్ పూర్తిచేసిన మల్లికార్జున్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వ్యాపారి
‘‘చిక్కినట్లే చిక్కి పారిపోయారు’’ చెప్పుకుంటూ పోతున్నాడు అశోక్. ‘‘ఎంత దారుణం... ఎంత దారుణం’’ అని ఒకరంటే... ‘‘ఇది కాలనీయా? అడవా?’’ అని ఇంకొకరు ఆక్రోశిస్తున్నారు.రాత్రి జరిగిన మల్లికార్జున్ హత్య గురించి తలా ఒకరకంగా మాట్లాడుకుంటున్నారు. అరవై రెండు సంవత్సరాల మల్లికార్జున్ ఆ కాలనీలో ప్రతి ఇంటికీ సుపరిచితుడే. దీనికి కారణం... అతడి మంచితనం కాదు. మల్లికార్జున్ వడ్డీ వ్యాపారి. దీంతో పాటు రకరకాల వ్యాపారాలు ఉన్నాయి. ఎవరికి ఏ అవసరం వచ్చినా మల్లికార్జున్ ఇంటి తలుపులు తడుతుంటారు. ఎండాకాలం కావడంతో కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. ఆరోజు రాత్రి కూడా కరెంట్ పోయింది. కరెంట్ పోయిన సమయంలో... పెరట్లో మంచం వేసుకొని పడుకున్న మల్లికార్జున్‌ను ఎవరో కాల్చి చంపారు. అరుపులు వినిపించడంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చారు. ఈలోపే... అక్కడిని నుంచి ఉడాయించాడు హంతకుడు. ‘‘ఎవరి మీదైనా అనుమానం ఉందా?’’ మల్లికార్జున్ భార్య జానకిని అడిగాడు ఇన్స్పెక్టర్ నరసింహ.‘‘చీమకు కూడా హాని తలపెట్టని దేవుడు నా భర్త...’’ అంటూ శోకాలు తీయడం తప్ప...‘ఫలానా వ్యక్తి మీద అనుమానం ఉంది’ అని చెప్పలేదు ఆమె. ఈలోపు అక్కడ ఉన్నవారిలో ఒకరు... ‘‘ఈయన వడ్డీవ్యాపారం చేస్తాడండీ. దీంతో రోజూ తగాదాలతోనే గడుపుతుంటాడు. ఈ ఫీల్డ్‌లో ఇవి మామూలే అనుకోండి. అందుకే... అనుమానించదగిన వ్యక్తి అని ఎవరి వంకా వేలెత్తి చూపలేం. ఈ వడ్డీ వ్యాపారంలో తగాదాలు ఎంత సహజమో...ఆ మరుసటి రోజు స్నేహం కూడా అంతే సహజం...’’ అన్నాడు అతడు. ‘‘ఈయన మీకేమవుతారు?’’ అడిగాడు ఇన్స్పెక్టర్. ‘‘ఏమీ కాడండీ. స్నేహితుడు మాత్రమే. నా పేరు శంకర్రావు’’ అన్నాడు ఆ వ్యక్తి.‘‘శంకర్రావు గారు... అలా నీడ పట్టున కూర్చొని మాట్లాడుకుందాం’’ అంటూ తీసుకెళ్లాడు ఇన్స్పెక్టర్.‘‘మల్లికార్జున్ గురించి ఇంకేమైనా చెబుతారా?’’ సిగరెట్ ముట్టిస్తూ అడిగాడు ఇన్స్పెక్టర్.‘‘చెప్పడానికి ఏముందండీ... ఈ మల్లికార్జున్ పచ్చి దుర్మార్గుడని అందరూ అనుకుంటారు. ప్రజల రక్తాన్ని తాగి ఆస్తులు కూడబెట్టుకున్నాడని కూడా అంటుంటారు... ఎవరి అభిప్రాయం వారిది. కాని నా దృష్టిలో ప్రజలు అనుకుంత దుర్మార్గుడేమీ కాదు మల్లికార్జున్...’’ చెప్పుకుంటూ పోతున్నాడు. శంకర్రావు వాలకం చూస్తే... ప్రజలు నిజంగానే తిట్టారా? లేకపోతే వారి పేరు చెప్పి ఈయన తిడుతున్నాడా? అనిపించింది. ఈలోపు అక్కడికి వేరే వ్యక్తి వచ్చి... ఇన్స్పెక్టర్ను విష్ చేసి తనను తాను పరిచయం చేసుకున్నాడు. ‘‘నాగరాజు గారు... మీకు ఎవరిమీదైనా అనుమానం ఉందా?’’ అడిగాడు ఇన్స్పెక్టర్.‘‘ఎవరినని అనుమానిస్తామండీ... వడ్డీ వ్యాపారం అన్నాక శత్రువులు ఉంటారు. మిత్రులు ఉంటారు. తగాదాలు ఉంటాయి. అంతెందుకు... మీ పక్కన కూర్చున్న శంకర్రావు, మల్లికార్జున్ నిన్నగాక మొన్న నా ముందే గొడవ పడ్డారు. అంతమాత్రాన శంకర్రావును అనుమానించలేము కదా’’ అన్నాడు నాగరాజు.‘‘మీతో కూడా గొడవ అయిందని చెప్పలేదేం?’’ అడిగాడు ఇన్స్పెక్టర్.‘‘అబ్బే... అదంత చెప్పుకోదగ్గ విషయమేమీ కాదండి. ఏదో చిన్న తగాదా..’’ చెప్పడానికి వెనకడుగు వేస్తున్నాడు శంకర్రావు. ‘‘అసలు దేని గురించి మీకు తగాదా వచ్చింది?’’ అడిగాడు ఇన్స్పెక్టర్.‘‘ఆయనకు ఇవ్వాల్సి డబ్బు టైమ్‌కు ఇవ్వలేదని నా మీద ఫైర్ అయ్యాడు... అంతే... అంతకు మించి ఏమీ లేదు’’ అన్నాడు శంకర్రావు. రకరకాల వ్యక్తుల గురించి ఆరా తీసిన తరువాత, మాట్లాడిన తరువాత ముగ్గురి మీద ఇన్స్పెక్టర్కు అనుమానం వచ్చింది. ఆ ముగ్గురిలో శంకర్రావు కూడా ఉన్నాడు.హత్య జరిగిన ప్రదేశానికి దగ్గరిలో ఒక పాత టార్చిలైట్ దొరికింది. దాన్ని ‘ఫింగర్ ప్రింట్స్’ కోసం పంపారు.అయితే... హంతకుడు గ్లోవ్స్ ధరించడం వల్ల ‘ఫింగర్ ప్రింట్స్’ కనిపించలేదు. టార్చిలైట్‌ను చూస్తున్న ఇన్స్పెక్టర్ నరసింహకు ఠక్కున ఒక ఆలోచన వచ్చింది. మరోసారి టార్చిలైట్‌ను ‘ఫింగర్ ప్రింట్స్’ కోసం పంపాడు. ఈసారి మాత్రం... అవి దొరికాయి!ఆ ఫింగర్ ప్రింట్స్ శంకర్రావువే అని నిర్ధారణ జరిగింది. హంతకుడు గ్లోవ్స్ ధరించి టార్చిలైట్‌ను ఉపయోగించాడు కదా. మరి... ఫింగర్ ప్రింట్స్ ఎలా దొరికాయి? -
మాజీ కౌన్సిలర్‌పై దాడి
గోదావరి ఖనిలోని మాజీ కౌన్సిలర్ మల్లికార్జున్‌పై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో ఆయనకు తీవ్ర గాయాల య్యాయి. ఇది గుర్తించిన స్థానికులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. సింగరేణిలో పని చేస్తున్న మాజీ కైన్సిలర్ మల్లికార్జున్ సోమవారం ఉదయం విధులు ముగించుకొని ఇంటికి వస్తుండగా.. గుర్తుతెలియని దుండగులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. ఈ అంశంపై పోలీసుల స్పందన మరో విధంగా ఉంది. రోడ్డు ప్రమాదానికి గురై దాన్ని దాడిగా చిత్రీకరిస్తున్నాడని పోలీసులు అంటున్నారు. మాజీ రౌడీషీటర్ తాళ్ల రాజయ్య నుంచి తనకు ప్రాణభయం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం ఈ ఘటన జరగడంతో.. అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చే స్తున్నారు. -
కాంట్రాక్టు లెక్చరర్ ఆత్మహత్యాయత్నం
మోత్కూరు: నల్గొండ జిల్లా మోత్కూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంట్రాక్టు లెక్చరర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. కాంట్రాక్టర్ లెక్చరర్ మల్లికార్జున్ గురువారం కళాశాల ఆవరణలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకోబోయాడు. తోటి లెక్చరర్లు తక్షణమే స్పందించి అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. కాంట్రాక్టు ప్రతీ సంవత్సరం రెన్యువల్ అవుతుంది. ఈ సారి తన పేరు రెన్యువల్‌కు ప్రిన్సిపల్ సిఫార్సు చేయకపోవడంతో మనస్తాపం చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలుస్తోంది. మల్లికార్జున్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. -
కనిగిరిలో రోడ్డు ప్రమాదం..ఒకరికి గాయాలు
కనిగిరి మండలకేంద్రంలోని ఏవీఆర్ కళాశాల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కాలేజీ వైపు వెళ్తున్న ఓ కారు టైరు పంక్చరై ముందున్న మోటారు సైకిల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మోటారుసైకిల్‌పై ప్రయాణిస్తున్న మల్లికార్జున్ అనే వ్యక్తి కాలుకు తీవ్రగాయమైంది. దీంతో భయపడిన కారు డ్రైవర్ దగ్గర్లోని పోలీస్‌స్టేషన్‌కు వేగంగా పోనిచ్చాడు. స్థానికులు వెంటపడి అతనిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మల్లికార్జున్‌ను ప్రాధమిక చికిత్స అనంతరం ఒంగోలు రిమ్స్‌కు రిఫర్ చేశారు. -
మల్లికార్జున్‌కు మధర్ థెరిస్సా అవార్డు ప్రదానం
నల్లగొండ టూటౌన్ : మధర్ థెరిస్సా జయంతిని పురస్కరించుకొని హెల్త్‌కేర్ ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయంలో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సముద్రాల మల్లిఖార్జున్‌కు మథర్ థెరిస్సా ఉత్తమ సేవా పురస్కార అవార్డును ఎమ్మెల్సీ పాతూరు సుధాకర్‌రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాబుమోహన్‌లు అందజేశారు. జిల్లాలో వృద్ధులకు సేవ చేసినందుకు గాను ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో టీపీఎస్సీ సభ్యురాలు చంద్రావతి, సుదర్శన్‌రెడ్డి, యాదయ్య, తదితరులున్నారు. -
రూ.70వేల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
ఖమ్మం రూరల్ మండలం దాన వాయిగూడెంలో విజిలెన్స్ అధికారులు రూ.70వేల విలువ చేసే గుట్కా, అంబర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన మల్లికార్జున్ అనే వ్యక్తిని ఇంట్లో ఇవి నిల్వ ఉంచిన సమాచారం తెలుసుకుని బుధవారం ఆ ఇంట్లో సోదాలు జరిపారు. ఇందుకు సంబంధించి మల్లికార్జున్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
అవసరం తీరాక కులం తక్కువన్నాడు..
నాగోలు: పెళ్లి చేసుకుంటానని మోసం చేసి కులం పేరుతో దూషించిన వ్యక్తిపై కేసు నమోదైంది. ఈసంఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సంఘటన వివరాల ప్రకారం... ఎన్టీఆర్నగర్కు చెందిన ఓ యువతి (25) అద్దె ఇంట్లో ఉంటోంది. వైఎస్సార్ జిల్లా మైదుకూరు మండలం యాప్రాకపల్లె గ్రామానికి చెందిన మల్లికార్జున్ కూడా యువతి ఉండే ఇంట్లోనే పైఅంతస్తులో అద్దెకు ఉంటున్నాడు. దీంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. మూడేళ్లుగా పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి శారీరకంగా దగ్గరయ్యాడు. యువతి పెళ్లి చేసుకోవాలని మల్లికార్జున్ సొంత గ్రామానికి వెళ్లి నిలదీయగా తక్కువ కులం అంటూ పెళ్లి చేసుకోనని బెదిరించాడు. తనను శారీరకంగా వాడుకుని కులం పేరుతో దూషించిన మల్లికార్జున్‌పై యువతి ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
షంషేర్
ఈ యువకుడు చూడటానికి చాలా సైలంట్, కానీ ఏదైనా తప్పు జరిగితే మాత్రం వయొలెంట్‌గా రియాక్టవుతాడు. షేర్లా విరుచుకుపడతాడు. ఇటీవల ‘పటాస్’ వంటి విజయవంతమైన చిత్రంలో నటించిన నందమూరి కల్యాణ్‌రామ్ ఇప్పుడు ‘షేర్’గా అభిమానులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. విజయలక్ష్మి పిక్చర్స్ పతాకంపై మల్లికార్జున్ దర్వకత్వంలో కొమర వెంకటేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోనాల్ చౌహాన్ కథానాయిక. ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ చిత్రం పాటలను ఈ నెల 10న విడుదల చేయనున్నారు. ఈ నెల 30న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రంలో కల్యాణ్‌రామ్ పాత్ర చిత్రణ కొత్తగా ఉంటుంది’’ అని చెప్పారు. ‘‘అని వర్గాల వారినీ ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందించాం. కల్యాణ్‌రామ్ కెరీర్లో మరో పెద్ద హిట్‌గా నిలుస్తుంది’’ అని దర్శకుడు అన్నారు. ఈ చిత్రానికి కథ-మాటలు: డైమండ్ రత్నబాబు, సంగీతం: ఎస్.ఎస్.థమన్, ఛాయాగ్రహణం: సర్వేష్ మురారి, సమర్పణ: సాయి నిహారిక, శరత్‌చంద్. -
అసభ్యకరంగా ప్రవరిస్తున్నాడు..
అతని బారి నుంచి మహిళలకు రక్షణ కల్పించండి తోటపల్లిగూడూరు : ఓ వ్యక్తి సైకోలా ప్రవర్తిస్తున్నాడని, అతని బారి నుంచి తమకు రక్షణ కల్పించాలని మండలంలోని మల్లికార్జునపురం గ్రామస్తులు పోలీసులను ఆశ్రయించారు. ఒంగోలు ప్రాంతానికి చెందిన ప్రశాంత్ మల్లికార్జునపురానికి చెందిన దారా స్వామిదాసు కుమార్తె విజితతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. ప్రశాంత్ కొద్ది కాలంగా మల్లికార్జునపురంలోనే భార్యా పిల్లలతో కాపురం ఉంటున్నాడు. బేల్దారి పని చేసుకునే అతను సైకోలా వ్యవహరిస్తున్నాడు. మహిళలు ఆరుబయటకు బహిర్భూమికి వెళ్లినా, ఇంట్లో స్నానాలు చేస్తున్నా రహస్యంగా చూడటం, ఫొటోలు తీయడం వంటి వికృత చేష్టలకు పాల్పడుతున్నాడు. ఇటీవల గ్రామంలోని రోడ్డు పక్కన నివాసమున్న ఓ ఇంట్లో మగవాళ్లు ఎవరూ లేని సమయం చూసి మల్లికార్జున్ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో బాధితులు శుక్రవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రేమించలేదని ఆత్మాహుతియత్నం
ఓ యువకుని దుశ్చర్య హైదరాబాద్: ప్రేమించిన యువతి తన ప్రేమ ను నిరాకరించిందని ఓ యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ సంఘటన సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్జిల్లా పెద్దపల్లికి చెందిన మల్లికార్జున్ స్థానికంగా ఓ కాలేజీలో ఎంబీఏ చదువుతున్నాడు. అదే జిల్లాకు చెందిన యువతి ఐఎస్‌సదన్ డివిజన్ వినయ్నగర్కాలనీలోని ఓ హాస్టల్లో ఉంటూ బీటెక్ చదువుతోంది. వీరిద్దరికీ చిన్ననాటినుంచి పరిచయం ఉండటంతో మల్లికార్జున్ తరచూ యువతిని కలవడానికి హాస్టల్‌కు వెళ్లేవాడు. ఈ క్రమంలో శుక్రవారం ఆ యువతి వద్దకు వచ్చి ప్రేమించమని అడిగాడు. ఆమె తనను ఇబ్బందిపెట్టొద్దని చెప్పినా వినలేదు. వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటిం చుకున్నాడు. వెంటనే యువతి మంటల్ని ఆర్పే ప్రయత్నం చేయ గా ఆమె చేతులూ కాలాయి. హాస్టల్ సిబ్బంది అతడిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలిం చారు. 40% వరకు గాయపడ్డాడని వైద్యులు చెప్పారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
‘సీమ’లో రాజధాని ఏర్పాటు చేయాలి
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్: రాయలసీమలో రాజధానిని ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రజా సంఘాల జేఏసీ నాయకులు సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జేఏసీ నాయకులు అవ్వారు మల్లికార్జున,సంగటి మనోహర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ 1953లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన సమయంలో ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద మనుషుల ఒప్పందం మేరకు కర్నూలులో రాజధానిని, గుంటూరులో హైకోర్టును ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. 1956లో తెలంగాణ ప్రాంతాన్ని కూడా విలీనం చేసుకుని ఆంధ్రప్రదేశ్‌గా ఆవిర్భవించినప్పుడు రాయలసీమలో ఉన్న రాజధానిని హైదరాబాదుకు తరలించారన్నారు. ఆ విధంగా రాయలసీమ వాసులకు అన్యాయం జరిగిందని తెలిపారు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన పరిస్థితుల్లో గతంలో లాగానే రాయలసీమలో రాజధానిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కానీ, అలా కాకుండా కృష్ణా,గుంటూరు జిల్లాల మధ్య రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు సంకేతాలు ఇవ్వడం సరికాదన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో భాగమైన రాయలసీమ వాసులతో కనీసం చర్చించకుండానే కోస్తా నాయకులు రాజధాని విషయంలో ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కూడా రాయలసీమలో పర్యటించపోవడం దారుణమని విమర్శించారు. వెనుకబడిన ‘సీమ’లోనే రాజధాని ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు గంపా తిరుపతి, జేవీ రమణ, బండి ప్రసాద్, ఈ.బాలవీరప్ప, బి.దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. -
‘షేర్’ షురూ...
నందమూరి కల్యాణ్‌రామ్ ‘షేర్’గా సిద్ధమవుతున్నారు. మల్లికార్జున్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లతో ‘కత్తి’ సినిమా వచ్చింది. విజయలక్ష్మి పిక్చర్స్ పతాకంపై కొమర వెంకటేశ్ నిర్మిస్తున్న ‘షేర్’ పూజా కార్యక్రమాలు బుధవారం హైదరాబాద్‌లోని సాయిబాబా టెంపుల్లో జరిగాయి. సాయిబాబాపై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి కల్యాణ్‌రామ్ క్లాప్ ఇవ్వగా, చిత్ర సమర్పకురాలు బేబీ సాయి నీహారిక కెమెరా స్విచాన్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. కల్యాణ్‌రామ్ శారీరక భాషకు అనుగుణంగా ఇందులో ఆయన పాత్ర చిత్రణ ఉంటుంది’’ అని చెప్పారు. ఏకధాటి చిత్రీకరణతో సినిమా పూర్తి చేస్తామని నిర్మాత తెలిపారు. బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, ముఖేష్ రిషి, అలీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ-మాటలు: డైమండ్ రత్నబాబు, కెమెరా: సర్వేష్ మురారి, సంగీతం: చక్రి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: డి. బ్రహ్మానందరావ్.