గోదావరి ఖనిలోని మాజీ కౌన్సిలర్ మల్లికార్జున్‌పై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు.
గోదావరి ఖనిలోని మాజీ కౌన్సిలర్ మల్లికార్జున్‌పై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో ఆయనకు తీవ్ర గాయాల య్యాయి. ఇది గుర్తించిన స్థానికులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. సింగరేణిలో పని చేస్తున్న మాజీ కైన్సిలర్ మల్లికార్జున్ సోమవారం ఉదయం విధులు ముగించుకొని ఇంటికి వస్తుండగా.. గుర్తుతెలియని దుండగులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. ఈ అంశంపై పోలీసుల స్పందన మరో విధంగా ఉంది. రోడ్డు ప్రమాదానికి గురై దాన్ని దాడిగా చిత్రీకరిస్తున్నాడని పోలీసులు అంటున్నారు. మాజీ రౌడీషీటర్ తాళ్ల రాజయ్య నుంచి తనకు ప్రాణభయం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం ఈ ఘటన జరగడంతో.. అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చే స్తున్నారు.